వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 4

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాత చర్చ 3 | పాత చర్చ 4 | పాత చర్చ 5

alt text= - రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2007 డిసెంబరు 10 - 2008 ఫిబ్రవరి 13

Wikimedia Indian chapter

[మార్చు]

As you might be aware, we are planning to start an India chapter of the Wikimedia Foundation. Please see Wikimedia India for details. We're currently working on the draft of bylaws. If you are interested, please join the discussion on meta, and subscribe to the wikimediaindia-l mailing list. Utcursch 18:03, 10 డిసెంబర్ 2007 (UTC)

గూగుల్ ఆర్కుట్ లో తెలుగు రాయటం (టైపింగు) చాలా తేలికగా ఉంది. ఆ విధానం మనం తీసుకోవచ్చేమో చూడండి.़़़

దేని కోసం ఆ "వ్యాసాలు"

[మార్చు]

తెలుగు వికీ భారతీయ భాషలలో ప్రథమ స్థానంలో ఉన్నందుకు మనందరికీ గర్వకారణమే.ఎందరో సభ్యులు, నిర్వాహకుల కృషి వల్ల ఈ స్థాయికి చేరుకున్ననూ కొన్ని విషయాలలో మనం వెనకబడి ఉన్నాం. తెవికి లో ఉన్న వ్యాసాలలో చాలా వరకు చిన్న వ్యాసాలే. కొన్ని అతిచిన్న వ్యాసాలుగా ఉన్నాయి. మరికొన్ని కేవలం ఒకే ఒక్క పదం కల్గి ఉన్నాయి. ఇంకొన్ని పూర్తిగా ఖాళీగా ఉండి సున్నా బైట్లతో మనల్ని వెక్కిరిస్తున్నాయి. (ఇందులోనూ మనమే ప్రథమ స్థానంలో ఉన్నామేమో!). అసలు వాటిని వ్యాసాలుగా పరిగణించవచ్చా, ఎవరో ఏ ఉద్దేశ్యంతోనే "వ్యాసం" ప్రారంభించి (ప్రారంభించదల్చి అనాలేమో!) వదిలివేయడం వాటిని అలాగే చూస్తూ ఊరుకోవడం సమంజసమేనా! వాటిని తొలిగించినా తెవికి కి నష్టమేమీ లేదు, ఒక్క వ్యాసాల సంఖ్య తగ్గడంలో తప్ప. కాబట్టి ఇకనైనా సున్నా బైట్లతో ఉన్న 7 వ్యాసాలతో పాటు ఒకే ఒక్క పదం ఉన్న మరో పదికి పైగా వ్యాసాలను తొలిగించవలసిందిగా ప్రతిపాదిస్తున్నాను. ఇతర సభ్యుల నుంచి ఏ ఆక్షేపణలు లేకుంటే ఎవరైనా నిర్వాహకులు వాటిని తొలిగించగలరు.C.Chandra Kanth Rao 19:42, 11 డిసెంబర్ 2007 (UTC)

పైన ఉదహరించిన లాంటివాటిలో చాలామటుకు కొత్త సభ్యులు ప్రయోగము చెయ్యటం. దాన్ని సభ్యులు తొలగించడంతో జరిగినవే. నిర్వాహణలో ఇలాంటి అతి చిన్న పేజీలను తొలగించటం కూడా భాగమే. చాలాసార్లు ఇలా చేశాం కూడా అయితే ఈ మధ్య కాస్త పేరుకుపోయాయి. ప్రస్తుతానికి నేను వాటిని తొలగించాను. గుర్తుచేసినందుకు నెనర్లు. ఇప్పుడు తెవికీలో దాదాపు 60% మొలకలున్నాయి. వికీపీడియా:మొలకల జాబితా లోని వాటిని మొలకల స్థాయినుండి దాటించగలిగితే మొలకల శాతాన్ని ఒక పది శాతం తగ్గించవచ్చు --వైజాసత్య 20:15, 11 డిసెంబర్ 2007 (UTC)
వైజాసత్య గారూ! ప్రతిస్పందన అతి తొందరగా వచ్చినందుకు (ఇచ్చినందుకు) సంతోషమే. ఇక నుంచి వ్యాసం నిడివి కనీసం 2kb లు ఉండేటట్లు సభ్యులందరూ కృషిచేస్తే బాగుంటుంది. అంతకంటే తక్కువ ఉండే వ్యాసంలో ఎంత సమాచారం పడుతుంది! అది ఎందరికి ఎంత ఉపయోగ పడుతుంది! ఒక్కో వ్యాసం కోసం మనం ఎలాగూ కష్టపడుతున్నాం, మరికొద్దిగా కష్టపడితే మన కృషి ఫలించవచ్చు అదే సమయంలో దాని ద్వారా ఎందరికో ప్రయోజనం చేకూర్చవచ్చు.C.Chandra Kanth Rao 20:43, 11 డిసెంబర్ 2007 (UTC)
చంద్రకాంత్ అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఒక మాట వ్యాసాలను నిస్సంకోచంగా తొలగించవచ్చు. (క్రొత్త సభ్యుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుంటూనే). చురుకైన సభ్యులు ఇకమందు రెండు పరిచ్ఛేదాలకు (పేరాలకు) తక్కువైన వ్యాసాలను మొలకెత్తించవద్దని కోరుతున్నాను. 2007 డిసెంబరు, 2008 జనవరి నెలలను మొలకల సవరణలకు (పెంచడం లేదా పీకేయడం కోసం) కేటాయించమని అందరినీ కోరుతున్నాను --కాసుబాబు 07:19, 12 డిసెంబర్ 2007 (UTC)
వ్యాసాలను అభివృద్ది పరచాలంటే ముందు మనం సభ్యుల సంఖ్యను పెంచగలగాలి. ప్రతీరోజు వచ్చి మార్పులు చేసే వారి సంఖ్య నా అనుభవం ప్రకారం 10కి మించట్లేదు. కొత్తసభ్యులను ప్రోత్సాహించడానికి ఇంకా మనం ఏం చేయగలమో సభ్యులు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరచగలరు. మీరు గణాంకాలను పరిశీలిస్తే వ్యాసంలో ఒకరిద్దరు సభ్యుల సహాయాన్ని మించి ఉన్న వ్యాసాలు అతి తక్కువ. ప్రతీరోజు 4-5 మంది కొత్త సభ్యులు రిజిస్టర్ చేసుకుంటున్నప్పటికి వారు మార్పులు చేయడానికి వెనుకాడుతున్నట్లుగా నాకనిపిస్తుంది. అంతర్వికీ లింకులను పెంచడం ద్వారా సభ్యులను ఆకర్షించవచ్చని నా అభిప్రాయం (నేను కూడా తెలుగువికీలోకి అలానే వచ్చాను). ఇప్పుడు తెలుగువికీకి సభ్యులకొరత చాలా ఉందన్నది నా అభిప్రాయం. కొత్త సభ్యుల ప్రోత్సాహాన్ని సభ్యులు ఇంకా పటిష్టం చేయాలని నా ఉద్దేశ్యము.దేవా/DeVచర్చ 09:29, 12 డిసెంబర్ 2007 (UTC)
సభ్యులందరూ తమకు తెలిసిన ఔత్సాహికులకు మెయిల్సు లో లింకులు పంపడం ద్వారా సభ్యత్వాలను పెంచవచ్చనుకుంటున్నాను.--హరి బాబు 19:24, 9 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
వైజాసత్య గారు ! మొలకల లిస్టులో కొన్ని సామెతలు, వాడుక పదాలు కూడా ఉన్నవి. ఇలాంటి మొలకలను అన్నింటిని కలిపి ఏదేని ఒక వ్యాసంగా మారిస్తే బాగుంటుందేమోననుకుంటున్నాను. santosh 11:44, 16 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


computer terminology

[మార్చు]

ఈ గణనయంత్ర కార్యక్రమాన్ని అమలు చేయండి

ఈ కంప్యూటర్ ప్రోగ్రామును ఎక్జిక్యూట్ చెయ్యండి

వికీపీడియా వ్యాసాలలో పై రెండింటిలో ఏది వాడడం మంచిది? ఇవే కాదు. ఇంకా ఇలాంటి సందేహాలు చాలా ఉన్నాయి.

రవిచంద్ర 04:22, 24 డిసెంబర్ 2007 (UTC)

వీలయినంత వరకూ నామవాచకాలకు ఇంగ్లీషునే వాడండి. క్రియలకు తెలుగు వాడవచ్చు. ఈ కంప్యూటర్ ప్రోగ్రామును ఎక్జిక్యూట్ చెయ్యండి అనే బదులు ఈ కంప్యూటర్ ప్రోగ్రామును నడపండి అనే వాక్యం నాకు ఇంకా సరయినదిగా అనిపిస్తుంది. __మాకినేని ప్రదీపు (+/-మా) 04:39, 24 డిసెంబర్ 2007 (UTC)
నేనూ ప్రదీపు చెప్పిన పద్ధతే సరైనదిగా భావిస్తున్నాను. వాడుకలో లేని గణనయంత్ర కార్యక్రమాలు వంటి పదాలు వీలైనంతగా ఉపయోగించకుండా చూసుకోవటమే మంచిది --వైజాసత్య 04:52, 24 డిసెంబర్ 2007 (UTC)
కంప్యూటర్ ప్రోగ్రామును నిర్వహించండి అని పెడితే బాగుంటుంది.C.Chandra Kanth Rao 12:51, 24 డిసెంబర్ 2007 (UTC)
అన్నింటికన్నా చంద్రకాంత రావు గారు చెప్పింది సరిగ్గా సరిపోతుంది. ధన్యవాదాలండీ! రవిచంద్ర 13:09, 24 డిసెంబర్ 2007 (UTC)
నాకు తెలిసి నిర్వహించడం=Administering మామూలుగా "start the program/run the program/execute the program" అని అంటూంటారు, దానికి సరిపడేటట్లు "ప్రోగ్రామును నడిపించు" లేదా "ప్రోగ్రామును నడుపు" లేదా "ప్రోగ్రామును మొదలుపెట్టు" అని నేను రాస్తూ ఉంటాను. ఇక్కడున్న అర్ధానికి కొంతమార్పుచేసి నేను ఈ విధంగా రాయటం మొదలుపెట్టాను. __మాకినేని ప్రదీపు (+/-మా) 16:48, 24 డిసెంబర్ 2007 (UTC)
ఈ కంప్యూటర్ ప్రోగ్రామును నడపండి అనేది అన్నిటికంటే బాగా సరిపోతుందనుకుంటాను. __చదువరి (చర్చరచనలు) 12:25, 31 డిసెంబర్ 2007 (UTC)

నా ఉద్దేశ్యం లో 'కంప్యూటర్ ప్రోగ్రాం నడపటమే' సరయినది. మనం తెలుగును పెంపొందించే క్రమం లో సరళీకరించడాన్నిమరిచి పోవద్దు. భాష సరళంగా ఉన్నప్పుడు మాత్రమే జనం లోకి వెళ్ళుతంది. మనం ప్రతి సారీ ఇదే తప్పు చేస్తున్నాం. తెలుగీకరణ పేరుతో సంస్కృత పదాలను ధారాళంగా ఉపయోగిస్తున్నాం. పైగా నిర్వహించడం, నడపడం ఒకటి కాదు.

- హరి బాబు, హైదరాబాద్

తెలుగు లేని తెవికి నిరర్దకము. ఆంగ్లం రాని పాఠకులు తెవికిని సందర్శించడం బహు కద్దు, అసలు ఆంగ్లం రానివారు కంప్యూటరు వాడటం చాలా తక్కువ, అటువంటప్పుడు తెలుగు ఆంగ్లం సంకరంతొ తెవికి చేయాల్సిన అవసరం యేమిటి?. ఆంగ్లంలొ పదాలు భూమి పుట్టినప్పుడు పుట్టలేదు, అవసరార్థం తయారు చేసుకున్నవే, భాష మీద పట్టు వుంటే మనమూ చేసుకొవచ్చు. వాడుకలొ లేవు కాబట్టి పదాలు వదిలేద్దాం అనడం సబబు కాదు, పరాయి భాషా పదాలు వాడుతున్నాం కనుక మన సొంత పదాలు వాడుకలొ లేవు అదే వాడటం మొదలు పెడితె అవే సరళంగా అనిపిస్తాయి. ఉదాహరణకు "విద్యుల్లేఖ" అంటె 'e-mail', ఈ పదం పది సంవత్సరాల క్రితం యెవరైనా విన్నారా! తెలుగురాని వారు అత్యుచ్ఛాహంతొ మార్పులు చేర్పులు చేయటానికి ప్రయత్నించి ప్రతిభావంతుల శ్రమ వృధా చేయరాదు. సరళాసరళాలు కాదు కావల్సింది, పరిపూర్ణంగా తెలుగులొ వ్రాయటానికి ప్రయత్నిస్తున్నామా అన్నదే.__సిడ్
తెలుగును బలోపేతం చేయాల్సిందనడంలో మరో అభిప్రాయం లేదు. అలాగని క్లిష్టమైన పదాలను, సంస్కృతం నుండి అరువు తెచ్చిన పదాలను వాడటం మొదలు పెడితే అసలుకే మోసం జరిగే ప్రమాదం వుంది. సృష్టించిన ప్రతి పదం ప్రజల్లోకి వెళ్ళగలగాలి. "విద్యుల్లేఖ" కన్నా "విలేఖ" బాగుంటుందేమో ఆలోచించండి.

--హరి బాబు 17:39, 6 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

హరి బాబుగారు అన్నది అక్షరాలా నిజం. మామూలుగా వాడే ఆంగ్ల పదాలకు కూడా చాలా మందికి తెలుగులో సమానమైన పదాలు తెలియవు. అంత మాత్రాన అవే ఆంగ్ల పదాలను తెలుగు వ్యాసాలలో కూడా వాడుతూ పోతే ఇక తెలుగు పదాలెలా నేర్చుకుంటాం? ప్రయత్నించకుండానే చేతులెత్తెయ్యడం సరికాదేమో?? అన్ని పదాలూ ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరు అవసరార్థం సృష్టించినవే. మాయాబజార్‌లో ఎస్వీ రంగారావుగారన్నట్టు ఎవరూ సృష్టించకుంటే మాటలెలా పుడతాయి? తెలుగుపై సంస్కృతం ప్రభావం ఎంతో ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే. పదాలు క్లిష్టమైనవని వాడటం మానేస్తే కొన్నాళ్ళకి భాషే అంతరించి పోతుంది.

-- నంబూరి

"ఎవరో ఒకరు పుట్టించకపోతే మాటలెలా పుడతాయి" అని మయాబజార్ సినిమాలో ఓ డైలాగుంది. కాకుంటే పుట్టించిన మాటలు గట్టిగా నిలబడతాయా అన్నదే అసలు ప్రశ్న.తెలుగులోకంటే మలయాళ భాషలో సంస్కృతం పాలు ఎక్కువ. ఐనా వారా పదాలను నిక్షేపంగా వాడుతున్నారు. తెలుగు వారికి సంస్కృత తత్సమాలుగానీ తద్భవాలు గానీ అర్థం చేసుకోవడం కానీ, పలకడం కానీ కష్టం కావు.

నా ఛిన్నప్పుడు హైడ్రో క్లోరిక్ ఆసిడ్ ను "ఉదజహరికామ్లం" అనీ సల్ఫూరిక్ ఆసిడ్ ను "గంధకికామ్లం" అనీ నైట్రిక్ అసిడ్ ను "నత్రికామ్లం" అనీ పుస్తకాల్లో రాసేవారు. ఆ పదాలు మాకు ఏమాత్రం కష్టంగా తోచేవి కావు (సంస్కృత పదాలైనా). ఆంగ్ల పదాలకంటే అవి సులభంగానూ అర్థవంతంగానూ అనిపించేవి. ఈ రోజుల్లో అన్ని పుస్తకాల్లోనూ ఆంగ్ల పదాల్నే రాసేస్తున్నారు. దానికీ వారిచ్చే సంజాయిషీ సంస్కృత పదాలు కష్టంగా ఉంటాయనే. ఆ మాటకొస్తే ఈనాటికీ ఆంగ్ల భాషలోని వైఙ్ఞానిక సంబంధ పదాలన్నీ లాటిన్ భాషనుండో గ్రీకు భాషనుండో అరువు తెచ్చుకొన్నవే కావా? అవి పలకడం కష్టంగా ఉందని వారు ఆ పదాలను శుద్ధ ఆంగ్లం లోనికి (అలాంటిదేమైనా ఉంటే) అనువదించడం లేదు కదా!

నా ఉద్దేశ్యం ఏమిటంటే ఎంత క్లిష్టమైన తెలుగు పదమైనా ఆంగ్ల భాషా పదానికన్నా మెరుగే. హిబ్రూలాంటి అతి పురాతన మృత భాషనే వారు పునర్జీవింపజేసి దానిలో అన్ని వైఙ్ఞానిక పారిభాషిక పదాలను తయారుచేసుకోగ లేనిది, తెలుగులో ఎందుకు తయారు చేసుకోలేం? కావలసింది సంకల్పమే.

Muni 15:19, 10 ఫిబ్రవరి 2008 (UTC)చంద్ర మోహన్[ప్రత్యుత్తరం]

చేసుకోవచ్చు! కానీ ఆ ప్రయత్నం జరగాలసింది ఇక్కడ కాదు దానికోసమే తెలుగుపదం అని గూగుల్ గుంపు ప్రయత్నిస్తుంది, అక్కడ స్టాండర్డ్ అయి జనాలు వాడుతుంటే అప్పుడు ఇక్కడ వాడుకోవచ్చు. Chavakiran 15:34, 10 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
సంస్కృత పదాలు వాడొద్దని నా ఉద్దేశం కాదు. తెలుగును సమృద్ధి చేయడానికి ఏ భాష నుంచైనా సరే, పదాలను స్వీకరించాల్సిందే. సరళమైన సంస్కృత పదాలు నిస్సందేహంగా వాడవచ్చు. ఈరోజు సంస్కృత భాష మృత భాషగా మారడానికి మూల కారణం క్లిష్టమైన పదాలు, వ్యాకరణం మాత్రమే. అందుకే సరళీకరించబడిన హిందీ దాని స్థానంలో మిగిలి వుంది. అలాగే కేవలం ఒక ఆంగ్ల పదానికి బదులు ఇంకో తెలుగు పదాన్ని పుట్టిస్తామనడం సరికాదు. ముఖ్యంగా సాంకేతిక నామాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే తెలుగు భాష మరింత బలోపేతమౌతుంది. ఈ విషయంలో సమిష్టి కృషి చాలా అవసరం. ముఖ్యంగా సాంకేతిక నిపుణుల వైపునుండి. నా ఉద్దేశంలో క్రొత్తగా పుట్టించే ప్రతి పదం సరళంగా, సాంకేతికంగా ఖచ్చితంగా ఉండాలి. అలాగే తెలుగు భాషలో క్రొత్త పదాల సృష్టిపై మరింత చర్చ జరిగితే కొన్ని మార్గదర్శక నియమాలు బయటికి వస్తాయి. అవి ఔత్సాహిక వికీకారులకు కూడా ఉపయోగ పడతాయనడంలో అనుమానం లేదు. --హరి బాబు 17:34, 10 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
చూశారా! ఒక ఈ-మెయిల్ అన్న చిన్నపదానికి విద్యుల్లేఖ అని, కాదు విలేఖ అయితే బాగుంటుందని అనుకుంటున్నాము. ఇంకొకాయన ఈ-పత్రము లేదా ఈ-టపా వాడాలి అంటాడు. విజ్ఞానసర్వస్వానికి కొంత ప్రామాణికత అవసరం. పదాలను సృష్టించడం దీని ఉద్దేశ్యము కాదు. కానీ, గంధకము, భాస్వరము వంటి ఇదివరకే ఉన్న పదాల్ని మాత్రం తప్పకుండా ఉపయోగించవచ్చు. పదాలు జనబాహుళ్యములో ప్రచారముపొంది, బ్లాగులు, పత్రికలు, పుస్తకాలకెక్కుతాయి. ఆ తర్వాతే విజ్ఞానసర్వస్వానికెక్కుతాయి. కొత్తతెలుగు పదాలు సృష్టించే కృషి మనవాళ్ళు చేస్తున్నారు. తెలుగుపదం గుంపు చూడండి. --వైజాసత్య 19:21, 10 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
తెలుగుపదం చూసాను. సభ్యుడిగా చేరాను. ఇలాంటి చర్చ ఒకటి ఉందని తెలియదు. తెలిపినందుకు ధన్యవాదాలు. --హరి బాబు 20:05, 10 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా జనాదరణ కోసం

[మార్చు]

గూగుల్ కి వికీపీడియాకి మంచి అనుబందం ఉంది కదా. ఇప్పుడు నేను ఏమైనా తెలుగులో వెతకాలంటే ముందుగా లేఖిని లాంటి పరికరాన్ని ఉపయోగించి పదాన్ని లేదా వాక్యాన్ని టైప్ చేసి గూగుల్ బార్ లో పేస్టు చేయాల్సి వస్తుంది. అలా కాకుండా గూగుల్ తెలుగుకి వెళ్ళినపుడు అక్కడే తెలుగులో టైప్ చేసుకొనే సౌకర్యం కల్పిస్తే మన తెవికీ కి ఎక్కువ సందర్శకులు వచ్చే అవకాశం ఉంది. వారు కోరిన సమాచారానికి మొదట ప్రాధాన్యతనిచ్చి మనం సమాచారాన్ని తెవికీలోకి చేరిస్తే వికీపీడియా మరింత ప్రజాదరణ పొందగలదని నా ఆలోచన. కానీ ఇది మన చేతుల్లో లేదని తెలుసు. గూగుల్ ఉన్న తెలుగు వారు దృష్టి పెట్టవలసిన అంశం ఇది. రవిచంద్ర 12:30, 1 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మన తెవికీలోని తెలుగు టైపింగ్ సౌకర్యాన్ని గూగుల్ లో కూడా ప్రవేశ పెట్టవచ్చు కదా! రవిచంద్ర 08:00, 5 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
అలాంటి సౌకర్యంతో గూగుల్ 2008లో రాబోతుందని (ఇప్పటికే హిందీలో అలాంటి అవకాశాన్ని కల్పించారు) అనధికారికంగా తెలిసినట్టు ప్రదీపు చెప్పారు. మీరు ఫైర్ఫాక్స్ వాడుతుంటే గనక ఇలా నేరుగా లేఖిని ఉపయోగించకుండా టైపు చెయ్యటానికి కొన్ని సులువైన మార్గాలున్నాయి --వైజాసత్య 08:33, 5 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
యాహూ పరిస్థితి ఏమైనా తెలుసా? దేవా/DeVచర్చ 08:38, 5 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
అంటే యాహూ సెర్చ్ ఇంజను గురించా? ఫైరుఫాక్సులో ఇండిక్ ఇన్పుట్ ఎక్సటెన్సన్ ఇన్స్టాల్ చేసుకుంటే ఏ సైట్లోనైనా నేరుగా తెలుగు టైపు చెయ్యొచ్చు --వైజాసత్య 08:44, 5 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
నేను ఫెడోరా లైనక్సుపై ఫైర్ ఫాక్సు ను వాడు తున్నాను.ఎలా టైప్ చెయ్యాలో చెప్పండి.

ఇంకొక సందేహం. ఇక్కడ లినక్స్, యునిక్స్ లాంటి పదాలలో చివరి భాగం సరిగా కనిపించడం లేదు. దీనిని ఎవరికి చెప్పాలి? రవిచంద్ర 08:41, 5 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నాకు లినక్సులో తెలుగు గురించి పెద్దగా తెలియదు. వీలైతే ఇక్కడో స్క్రీనుషాట్ అతికించండి. నాకు తెలిసిన లినక్సు మిత్రులను కదిలిస్తా --వైజాసత్య 08:47, 5 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
  • ఇక్కడ అతికిస్తున్నానండీ!

1024px|thumb|center|linux Desktop

లినక్స్, యూనిక్స్ పదములను నేను ఇప్పుదు ఉబుంటు లినక్స్ లో లేఖిని తో వ్రాసాను (మొడటి ప్రయత్నము) ప్రసాదు

నేను దీన్ని ఫెదోరా7 లినక్సుపై ఫైర్ ఫాక్సులో టైపు చేసాను. ఇది బాగానే ఉంది. కొన్ని పదాలకు మాత్రం పొల్లు సరిగా రావడంలేదు. ముఖ్యంగా వత్తుతో కూడిన పొల్లు పదాలు సరిగా రావడంలేదు. ఉదా: లినక్స్ . దీన్ని ఎవరైనా సరిచేయగలిగితే బాగుంటుంది. --హరి బాబు 04:30, 9 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
లోహిత్ ఫాంటులో (ఇది ఫెడోరాలో డీఫాల్టుగా వస్తుంది) అన్ని గ్లిఫ్లు ఉన్నట్టులేవు. అందుకే కొన్ని అక్షరాలు సరిగా కనబట్లేదు. పోతన ఫాంటు వాడి చూడండి. — వీవెన్ 01:35, 11 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
పోతన2000 కూడా ఇన్స్టాల్ చేసాను. ఫలితం లేదు. పోతన ని ఫైర్ ఫాక్సులో ఎలా అనువు (enable) చేయాలో తెలుపండి. --హరి బాబు 17:19, 11 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నియోజక వర్గాలు

[మార్చు]

లోకసభ నియోజక వర్గాలు తయారుచేసినందుకు ధన్యవాదాలు. మూలం రిఫరెన్సులో వసే చాలా బాగుంటుంది. అలాగే శాసన సభ నియోజక వర్గాలకు కూడా తయారు చేయండి. ఎలక్షన్ కమిషన్ వెబ్ సైట్ లో ముందు ఎన్నికల ఫలితాలు ఉన్నాయి. అవికూడా ఇందులోకి బాటు ద్వారా చేర్చడానికి వీలైతే మనపని సులువుగా అవుతుంది. సవరణలేమైనా ఉంటే తరువాత నెమ్మదిగా మార్చుకోవచ్చును.Rajasekhar1961 08:57, 7 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

వార్తాపత్రికలలో వచ్చిన సమాచారం ఆధారంగా లోకసభ నియోజకవర్గాల పేజీలు తయారు చేశాను. ఇంకనూ ఎన్నికల కమీషన్ వెబ్‌సైట్‌లో ఈ సమాచారం పెట్టలేదు. వీటిని పెట్టిన తరువాతే మూలం వ్రాద్దామని ప్రస్తుతానికి వదిలేశాను. ఇక శాసనసభ నియోజకవర్గాల విషయానికి వస్తే ఆ సమాచారం జిల్లా ఎడిషన్లలో వచ్చింది. ఒకటి, రెండు జిల్లాలకు సంబంధంచిన సమాచారం నా వద్ద ఉంది కాని అన్ని జిల్లాల సమాచారం దొరకలేదు. రాష్ట్ర ఎన్నికల కమీషన్ వెబ్‌సైట్‌లో పెట్టిన తరువాత తయారుచేద్దాం. ఇంకనూ, మనం కేవలం పేజీలు తయారు చేస్తే సరిపోదు. నియోజకవర్గాల గత చరిత్ర, ప్రముఖ రాజకీయ నాయకులు, ఇప్పటి వరకు గెల్చిన ప్రతినిధులు, ఆ యా పార్టీల పరిస్థితులు మున్నగునవి చేర్చాలంటే ఆయా జిల్లాకు చెందిన సభ్యులు కృషిచేయాల్సిఉంది. అప్పుడే ఇది సమగ్రరూపంలోకి వస్తుంది. దీనికి పటాలు కూడా తయారుచేయాలి. చేయాల్సిన కృషి చాలా ఉంది. అయినా ఈ మంచి ఐడియా ఇచ్చింది మీరే రాజశేఖర్ గారూ--C.Chandra Kanth Rao 13:26, 7 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
శాసనసభా నియోజకవర్గాలకు నమూగా శేషగిరిరావు గారు ప్రారంభించిన శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గం ఉంది. మీకు అందుబాటులో ఉంటే తెలుగుతీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ - కొమ్మినేని శ్రీనివాసరావు (2003) ప్రజాశక్తి బుక్ హౌస్ పేజీ పుస్తకం తెచ్చుకోండి. అందులో పూర్వపు శాసనసభా వివరాలన్నీ ఉన్నాయి. ఎలక్షన్ కమీషన్ వెబ్సైట్లో ఉన్న విషయాన్ని బాట్ల ద్వారా ఎక్కించడం కొద్దిగా శ్రమపడి ఇక స్క్రిప్టురాస్తే వీలౌతుంది. కానీ చిక్కల్లా ఇంగ్లీషులో ఉన్న పేర్లను బాటు తెలుగులోకి అనువదించలేదు. అది తిరిగి మనం చేత్తో చెయ్యాల్సిందే. దేవా గారూ, ఆ లోక్సభ నియోజకవర్గాలన్నింటికీ కలిపి ఒక మూస తయారుచెయ్యండి. --వైజాసత్య 16:09, 8 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ పేజీని అనువదించటం పూర్తయితేగనక బాటుతో ఇంగీషు వెబ్సైటులలో ఉన్న వివరాలను కూడా సేకరించి ఎక్కించవచ్చు. __మాకినేని ప్రదీపు (+/-మా) 17:45, 8 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
మూస తయారుచేశాను, బాటు ద్వారా అతికించండి. -- C.Chandra Kanth Rao 20:39, 8 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
లోక్సభ మూసను అన్ని పేజీల్లో అంటించా --వైజాసత్య 21:16, 8 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీతో ఆటలా ?

[మార్చు]

నాలుగేళ్ళుగా ఎందరో సభ్యులు, నిర్వాహకుల కృషికారణంగా తెలుగు వికీపీడియా భారతీయ భాషలలో ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రతి ఒక్కరూ చేయి చేయి కలిపి దీన్ని మరింతగా వృద్ధిపథంలో పయనింపజేయాల్సిన అవసరం ఎంతో ఉంది. చేసే వారిని ఉత్సాహపరుస్తూ, కొత్త వారిని ఆహ్వానిస్తూ తెవికీ వ్యాససంపదను సభ్యులు వృద్ధి పరుస్తుంటే కొందరు బయటి వాళ్ళు దీనితో ఆటలాడుకొనడం దారుణమైన విషయం. తెలుగుబ్లాగులను పరిశీలిస్తున్న సమయంలో తెవికీపై "ఆట" విషయం కనిపించింది. పేజీ ఎడమ భాగాన ఉన్న యాధృచ్ఛిక పేజీ నొక్కుతూ పోవాలట, ప్రతీ సారి చిన్న చిన్న గ్రామపేజీలు కాని, సినిమా పేజీలు కాని వస్తాయట, మంచి వ్యాసం వచ్చే వరకు అలాగే చేస్తూపోవాలట, ఎన్నో క్లిక్కుకు మంచివ్యాసం వస్తే ఆది స్కోరు గా భావించాలట, దాన్ని మొత్తం వ్యాసాల సంఖ్యచే భాగిస్తే వచ్చేది మంచి వ్యాసాల సంఖ్యనట. ఇదేమి దారుణం ! వారు కూడా తెలుగు వ్యక్తులుగా తెవికికీ తోడ్పడవచ్చుకదా, సహాయం చేయకున్నా సరే మరి ఈ ఆటలేమిటి, తెవికీలో మంచి వ్యాసాలు చాలా తక్కువ అని వారి ఉద్దేశ్యమా !. అవునూ, మనలో మాట, నేను కూడా చూద్దామని ప్రయత్నిస్తే అలాగే వస్తున్నాయి, మరి మంచి వ్యాసాలు ఎటు పోయినట్లు, గణాంకశాస్త్రపు సిద్ధాంతమైన సంభావ్యత (రాండమ్) ప్రకారం కంటే తక్కువ సంఖ్యలో మంచి వ్యాసాలు తగులుతున్నాయి. అసలు యాధృచ్ఛిక పేజీలకు చిన్నవ్యాసాలు రాకుండా మనమేమైనా చేయవచ్చా? కనీసం 2 కి.బి.ల సమాచారం ఉన్న వ్యాసాలే వచ్చేటట్లు చేయగలమా? దీనికి ఎవరైనా ప్రయత్నిస్తే బాగుంటుంది. అప్పుడు పెద్ద వ్యాసాలు మాత్రమే రాండమ్ పేజీకి తగులుతాయి. అదే సమయంలో బయటివాళ్ళ ఆటలు కూడా తగ్గుతాయి.--C.Chandra Kanth Rao 21:05, 14 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మీ ఆవేదన అర్ధమయ్యింది. ఆ సదరు బ్లాగరికి తెలుగు వికీ అంటే చాలా గౌరవమే. ఆయనకి ఇక్కడ సభ్యుడు కూడా. మైదాన హాకీ వంటి ఎన్నో వ్యాసాలు ఇక్కడ వ్రాశారు. ఈ విషయాన్ని మనమొక సద్విమర్శగా తీసుకొని కృషి చెయ్యాలి. ఇకపోతే యాధృఛ్ఛిక పేజీలో వచ్చే వ్యాసాలను మనం మార్చలేము (నాకు తెలిసినంతవరకు). ఈ గణాంకాలు పరిశీలిస్తే తెలుగు వికీలో రెండు కేబీలపైనున్న వ్యాసాలు కేవలం రెండు వేలేనని తెలుస్తుంది. 38 వేలలో రెండు వేలు అంటే సంభావ్యత ప్రకారం ప్రతి ఇరవై నొక్కులకు ఒకసారి మాత్రమే రెండు కేబీలపైబడిన వ్యాసం వస్తుంది. ఇది వరకు పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది (ఆయన ఆ బ్లాగు వ్రాసిన సమయంలో). ఇప్పుడు నేను పరిస్థితి మెరుగైనట్టు ఈ నొక్కుల పరీక్షలో కూడా ఈ మధ్య గమనించాను. --వైజాసత్య 06:55, 15 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ సమస్యను అధిగమించాలంటే మొలకలను పట్టుకొని కొంచెం సాగదీస్తే సరిపోతుంది. ఈ మద్య నేను చేసేదదే. సాధారణంగా సభ్యులు కొత్త పేజీలు సృష్టించేందుకు కుతూహలపడుతుంటారు. మిగిలిన వారు కూడా ఇటీవలి మార్పులు చూస్తూ వాటినే విస్తరిస్తూ ఉంటారు. అలాకాక మొలకల పేజీకెళ్ళి ఏదో ఒక దానిని పట్టుకొని విస్తరించే ప్రయత్నం చేస్తే పెద్ద వ్యాసాల సంఖ్య పెరుగుతుంది. తెవికీలో మొలకలు ఎక్కువనే మాటా పోతుంది. తెవికీ ఇతర భాషల కంటే ముందే ఉండాలనేముంది. రాసి కంటే వాసి ముఖ్యం అంటారు కద. విశ్వనాధ్. 06:14, 16 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
ఆ సభ్యుడు చెప్పింది అక్షరాలా నిజం. అందులో తప్పు పట్టడానికి ఏమీ లేదు. మన తెవికీలో విశేష వ్యాసాల సంఖ్య తక్కువగా ఉన్నదని మనకందరికీ తెలుసు. ఉన్న వ్యాసాల మీద మరింత దృష్టి పెట్ట వలసిన సమయమిదే. ఆయన మనకందరికీ గుర్తు చేశారని భావిద్దాం. అందరూ కలిసికట్టుగా కృషి చేసి తెవికీని అగ్రభాగాన నిలబెడదాం. అలాగే కొత్త వ్యాసాల కూర్పులో కొన్ని ప్రాధాన్యత గల అంశాలను ఒక జాబితా గా తయారు చేసివాటి పని పడదాం.

రవిచంద్ర 13:28, 18 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వాహకత్వం

[మార్చు]

ఒక సభ్యుని నిర్వాహకత్వం కోసం పరిశీలించేటపుడు వారు ఎన్ని దిద్దుబాట్లు చేశారని కాకుండా ఎన్ని విశేష వ్యాసాలను రాశారు/లేదా మంచి వ్యాసాలపై పని చేశారు అనే సంఖ్యను పరిగణన లోకి తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం. 1000 దిద్దుబాట్లు కాకుండా ఇదే సరైన ప్రమాణం అని నాకనిపిస్తుంది. రవిచంద్ర 13:39, 18 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వాహకత్వం మీద ఇప్పటివరకూ ఖచ్చితమైన ప్రమాణాలేవీ పాటించలేదు. ఆ వెయ్యి దిద్దుబాట్లకు కూడా చాలా సార్లు నిర్వాహకుల అవసరమేర్పడినప్పుడు సడలింపు ఇచ్చాము. అయితే ఇంకా పటిష్టమైన విధానమేది నిర్ణయించలేదు. మనందరమూ చర్చించి కొన్ని ప్రమాణాలేర్పరచుకోవాలి. ఇప్పటిదాకా నేనే అభ్యర్ధులను ప్రతిపాదిస్తూ వచ్చాను. కానీ ఆ సాంప్రదాయము ఆరోగ్యకరమూ, ఆచరణీయమూ కాదని నా భావన. అందుకే ఇక ముందు నేను కొనసాగించదలచలేదు. అంత మాత్రాన కొత్త నిర్వాహక అభ్యర్ధనలపై ఎటువంటి నిషేధమూ లేదు.
నిర్వాహకత్వము ఒక సభ్యుని రచనలకు గుర్తింపు కాదు. అది కేవలం నిర్వహణ వ్యవహారాలు చూసుకోవటానికి ఆసక్తి ఉన్న సభ్యులకు అందించే అదనపు సౌకర్యము. సాధారణంగా వీరికి వికీ విధివిధానాలు బాగా తెలిసి ఉంటాయి, కొంత అనుభవమూ ఉండి ఉంటుంది. అన్నింటికంటే మించిన అర్హత నిర్వహణా వ్యవహారాలలో ఆసక్తి. --వైజాసత్య 16:41, 18 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
అవును, నిర్వాహకత్వం ఇచ్చే సమయంలో సభ్యుడు ఎంత మంచి వ్యాసాలు రాసారనేది పరిశీలించవలసిన విషయమే. వీటితో బాటు
  • వికీ పద్ధతులను, విధానాలను (పాలసీలను) ఎంత బాగా అర్థం చేసుకున్నారు, ఆచరించారు అనే విషయాలను పరిగణించాలి. ఉదాహరణకు, దిద్దుబాటు సారాంశం రాయడం (వికీ దీన్ని చాలా మంచి అలవాటుగా పరిగణిస్తుంది.), చిన్న మార్పులను గుర్తించడం, వ్యాసాల్లో వ్యక్తుల పేర్లు ఎలా రాయాలి, ఏకవచన సంబోధన వంటి శైలికి సంబధించిన విషయాలు మొదలైనవి. అలాగే,
  • ఏయే నేమ్ స్పేసుల్లో ఏయే మార్పులు చేసారు,
  • మూస, వర్గం, పట్టిక వంటి వికీపీడియా అంశాలను ఎంత బాగా అర్థం చేసుకున్నారు,
  • తోటి సభ్యులతో వ్యవహారం ఎలా ఉంది.. ఇలాంటి అంశాలనూ పరిగణించాలి.
  • కాకపోతే, వీటన్నిటికీ కొలబద్ద లేదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అవి సాపేక్షికం, మదింపు వేసేవారి విచక్షణపై ఆధారితం! ఎన్ని దిద్దుబాట్లు చేసారనే దానికి మాత్రం ఖచ్చితమైన కొలత ఉంటుంది. కాబట్టి దాన్ని పరిగణించాల్సిందేనని నా ఉద్దేశ్యం!
  • వికీ విధానాలపై చర్చలో పాల్గొని చక్కటి అభిప్రాయాలను వెల్లడించేవారు నిర్వాహకత్వానికి మెరుగైన అభ్యర్ధులౌతారని నా ఉద్దేశ్యం.
  • స్వీయ ప్రతిపాదనలు ఆహ్వానించదగ్గవి.
మంచి చర్చను లేవనెత్తారు. ఇతర సభ్యుల అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది__చదువరి (చర్చరచనలు) 03:33, 19 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
నిర్వాహకులు మెటావికీపై మంచి పట్టు కలిగి ఉండాలని నాకూ తెలుసండీ! కానీ నేననేది ఒక అభ్యర్థి నిర్వాహకత్వం పూర్తిగా అతను రాసిన విశేష వ్యాసాల మీద ఆధారపడి ఉండాలని కాదు. దీనిని కూడా ఒక అర్హతగా స్వీకరించమని కోరుతున్నాను. సాధారణంగా పత్రికల కోసం, పుస్తకాల కోసం సంపాదకులు ఉంటారు కదా, వారు ఇతరులు రాసిన రచనలను చక్కగా అందంగా తీర్చి దిద్దుతారు. ఇలాంటి వారు వికీలో ఉండకపోతే వ్యాసాలు కళను కోల్పోతాయి. అందుకని అలా అన్నాను. ___ రవిచంద్ర 05:12, 19 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

రవిచంద్రగారి అభిప్రాయాలు పరిగణనకు తీసుకో వలసిన విషయాలే.వ్యాసాలు మెరుగు పరుస్తూ ఉంటేనే వ్యాసాల నాణ్యత మెరుగు పడి చదవాలనే ఆసక్తిని కలిగిస్తాయి. --t.sujatha 05:44, 19 జనవరి 2008 (UTC)

తెవికీ అభివృద్ది కొరకు మంచి సూచనలు, సలహాలు ఇచ్చేవారు (సూచనలు,సలహాలు ఇవ్వగలిగిన వారు తప్పక వికీ గురించి ఎక్కువగానే తెలిసి ఉండి ఉంటారు) , ఇతరసభ్యుల అభిప్రాయాలను గౌరవించేవారు, కొత్త ఆలోచనలతో మార్పులు చేయువారు అయిఉంటే సరిపోతుంది. అలాంటి వారి వ్యాసాలు, రచనలు, మార్పులను ఎక్కువగా పరిగణణలోకి తీసుకోవలసిన అవసరం లేదనుకుంటాను (ఇది నా స్వీయ అనుభవం. నాకు మొదట్లో వ్యాసాలు ఎలా మెరుగుపరచాలో, కొన్ని మార్పులు ఎలా చేయాలో తెలియదు తరువాత తరువాత నేర్చుకొన్నాను,కొంటున్నాను. అలాగే వారూ నేర్చుకొంటారని నా అభిప్రాయం).విశ్వనాధ్. 05:55, 19 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర గారూ, మీరు అన్నట్టు కొంతమంది సభ్యులు పెద్దపెద్ద దిద్దుబాట్లు వెయ్యికిలోపలే చేసి ఉన్నా వారిని నిర్వాహకత్వానికి పరిగణలోకి తీసుకున్నాం. ఉదాహరణకు ఈ అభ్యర్ధిత్వం చూడండి వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/Gsnaveen - నవీన్ అప్పటికి 600 దిద్దుబాట్లు చేశారు. కానీ వాటిల్లో చాలా మటుకు ఆయన పెద్దపెద్ద దిద్దుబాట్లు చేశారు. --వైజాసత్య 16:21, 22 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

similarity search in telugu wiki

[మార్చు]

When i search for a word or phrase in telugu wikipedia, only the exact words or phrases are matched. The website experience would be better for the users, if the results return links that contains a similar phrase or word. Are there any programs to do similarity search in telugu text? - రవిచంద్ర 03:21, 25 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

వెతుకు క్లిక్ చేసి విస్తృతశోధనా పేజీ (ఎక్సుటెండెడ్ సెర్చ్) కి వెళితే అక్కడ డ్రాప్ డౌన్ లిస్టులో గూగూల్ కూడా ఉంటుంది. దాన్ని ఉపయోగిస్తే కొంచెం మెరుగైన ఫలితాలనిస్తుంది. ప్రస్తుతం మీడియావికీ డీఫాల్టు శోధన కేవలం ఎస్క్యూఎల్ (sql) ఆధారిత శోధన అందుకే అంతమంచి ఫలితాలనివ్వట్లేదు :-( --వైజాసత్య 04:13, 25 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
నేననేది నా గురించి కాదు. సాధారణ తెవికీ సందర్శకులు (అంటే విస్తృత శోధన దాకా వెళ్ళని వారి గురించి) కోసం SQL సర్చ్ స్థానంలో సిమిలారిటీ సర్చ్ ను ప్రవేశ పెట్టవచ్చు కదా!

ఇది మన చేతుల్లో లేదా! రవిచంద్ర 12:45, 4 ఫిబ్రవరి 2008 (UTC) మామూలుగా వెతకతడం కూడా సరైన ఫలితాలివ్వడంలేదనుకుంటా...[ప్రత్యుత్తరం]

మనకీ వంశవృక్షం మూస తెవికీలో ఉన్నదా?

[మార్చు]

మనకీ వంశవృక్షం మూస తెవికీలో ఉన్నదా?

http://en.wikipedia.org/wiki/Template:Familytree

Chavakiran 16:24, 1 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఆ ఉంది. {{వంశవృక్షము}}. __మాకినేని ప్రదీపు (+/-మా) 19:14, 1 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు మిత్రులకు నమస్కారములు, ఈనాడు ఈ-పేపర్ ద్వారా తెవికీ గురిం‍‍చి తెలుసుకున్నాను. ఇటువంటి మంచి వికీపీడియాని సృష్టించి దానిని అందంగా తీర్చి దిద్దిన‍‍ మిత్రులందరికి నా శుభాభివందనాలు. నేను తెలుగు వ్రాయడ‍ం ఇ‍ంకా నేర్ఛుకుంటున్నాను.తప్పుల్ని క్షమించగలరు. శ్రీనివాస్

  • నమస్కారం, మా ఊరి పేరు వికీలో లేదు. దయచేసి వికీలో పొందుపరచండి.ఊరి పేరు సుబ్బారావు పేట,కృష్ణా జిల్లా,మందవల్లి మండలం.దయచేసి పొందుపరచండి.కృతజ్ఞతలు.గిరి. * గిరిగారూ, కృష్ణా జిల్లాలో మందవల్లి మండలంలో సుబ్బారావుపేట అనే గ్రామం లేకపోవటానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని, ఈ గ్రామం ఒక గ్రామ పంచాయితీ అయ్యుండకపోవచ్చు, అందుకనే ఇక్కడ కానీ సంబంధిత ఇతర ప్రభుత్వ వెబ్సైటులలో కానీ ఈ గ్రామం గురించి సమాచారాన్ని చేర్చలేకపోయాం. తెలుగు వికీపీడియాలో గ్రామాల సమాచార సేకరణకు వాడిన ఏ వెబ్సైటులోనూ ఈ గ్రామ వివరాలను తెలుపలేదు. మీరు ఈ గ్రామం నుంచే కాబట్టి మీరే ఒక వ్యాసం మొదలుపెట్టండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 03:02, 3 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
  • వెల్లూరు జిల్లా లోవి అన్ని గ్రామాల పేర్లు లేవు మేము కలుపవచ్చా.
  • తప్పకుండా కలుపవచ్చు. మీకు తెలిసిన గ్రామాల వివరాలు, విశేషాలు, సమాచారం చేర్చవచ్చు. ప్రస్తుతం ఉన్న లింకులను మాత్రం చెరపవద్దు. ఇంకా ఏమైనా సందేహాలుంటే తప్పక అడగండి.C.Chandra Kanth Rao 06:37, 3 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
  • జిల్లాలు మండలాలు అనే వర్గంలో మీరు ఇచ్చిన హెడ్డింగుల్లో అక్షర దోషాలను సరిదిద్దుదామంటే మారటంలేదు. ఏంచేయమంటారు.మాతృభాషలో తప్పులు రాయటం తప్పుకదా ?

Maa vuri gurinchi

[మార్చు]

మా వూరి పేరు దమ్మాయిగూడ, కీసర మండలం. రంగా రెడ్డి జిల్లాలో ఎలా చూపించాలి.సురేందర్ గౌడ్

[ఇక్కడ] చూడండి దొరుకుతుంది. మీకు తెలిసిన సమాచారం చేర్చండి.

మా ఊరు పేరు సిద్దిపేట.ఇది మెదక్ జిల్లాలో వుంది.

how to correct the village name

[మార్చు]
  • నా పేరు జితేష్ కుమార్. మా వూరి పేరు తెలుగు వికీలో తప్పు గా వుంది. దీనిని ఎలా మార్ఛాలి.

మా వూరు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో వుంది. సరి ఐన పేరు 'యల్లాయపాళెం' ప్రస్తుతం యెల్లాయపాలెం అని వుంది. దీనిని ఎలా మార్పు చేయాలి.

  • మావూరి ఫోటోలు పెడదామని అనుకుంటున్నాను, ఎలా పెట్టాలో చెప్తారా?
  • మీ ఊరి పేరు మార్పు చేస్తాం. మరింత వివరంగా వికీ గురించి తెలుసుకోవాలంటే మొదటి పేజీలోని సముదాయపందిరిని క్షుణ్ణంగా చదవండి.
  • మా వూరి పీరు నాగాయపల్లి గ్రామము... ఈవూరు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కడప జిల్లా, పెండ్లిమర్రి మండలానికి చెందిన గ్రామము.
  • నమస్తే, నా పేరు పవన్ కుమార్ రెడ్డి. నేను వికీపీడియా లో కొత్తగా చేరిన సభ్యుడిని . గత ఆదివారం ఈనాడు లో వఛ్చిన వ్యాసం చదివిన తరువాత చాలా ఆనందించాను. ముఖ్యంగా మా వూరి గురించి తెలపాలని / తెలియచెప్పాలని చాల కోరిక కలిగింది. ఆలాగే " నాకు నచ్చిన కథలు " అనే శీర్షికన మంచి మంచి కథలు మన తెలుగు పాఠకులకు పరిచయం చేయాలని వుంది. దీని గురించి నాకు సహాయం చేయగలరు . అభినందనలతొ, పవన్ సి రెడ్డి.
  • మా మండలం గూర్ఛి సమాచారం వ్రాయవలెను అనిన యేమి మార్గము. mma ooru peru jathaparachandi,ooru peru:KURELLA GUDEM,BHIMADOLE MANDALM,W.G.DIST.,,singapore
  • నమస్కారం, నా పేరు సర్వేష్ ,నెను సింగపూర్ నుంచి .మా ఊరు పేరు జత చెయ్యండి. ధన్యవాదాలు.

గ్రామంలో ఎవరు ప్రముఖ వ్యక్తులు?

[మార్చు]

మనకు గ్రామంలో సుప్రసిద్ధ వ్యక్తులు ఎవరు అనే విషయం పై ఓ పోలసీ ఉండవలసిన అవసరం కనిపిస్తుంది నాకు.

ఎవరు ప్రముఖ వ్యక్తులు?

[మార్చు]
  1. కళాకారులు:కనీసం రాష్ట్రంలో ఐనా ప్రముఖమయిన కళాకారుడు, ఏదయినా అవార్డు వచ్చి ఉంటే మరీ మంచిది, కనీసం కొన్ని పర్యాయములు అయినా టీవీ, పేపర్లలో వీరి గురించి చర్చించి ఉండాలి.
  2. సినిమా యాక్టర్లు
  3. యంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు

ఎవరు కాదు?

[మార్చు]
  1. మా బాబాయీ, పిన్నీ, అమ్ముమ్మ :)
  2. మాజీ ప్రెసిడెంటు, వార్డు మెంబరు
  3. టీచర్లు, ఇతర ఉద్యోగస్తులు
  4. ఉత్తమ ఉపాద్యాయులు అవార్డు గెలుచుకున్న వారు
  5. మరియు ఇతరులు

ప్రస్తుత ప్రెసిడెంటు, వార్డు మెంబర్లు?

[మార్చు]

వీరు ప్రముఖ వ్యక్తులలో కాకుండా వేరే సబ్ సెక్సనులో వ్రాయాలి.


ఇవి నా ఆలోచనలు, దయచేసి మీ అభిప్రాయాన్ని దిగువన వ్రాయగలరు.

నా పేరు కరుణ్ కుమార్ జల్లూరి. నేను పుదుఛేరి రాష్ట్రానికి ఛెన్దిన యానం అనే గ్రామ నివాసిని.

నా పేరు దినేష్. నాది ప్రొద్దుటూరు.

మీకు తెలుసా

[మార్చు]

మొదటి పేజీలో ప్రదర్శిస్తున్న మీకు తెలుసా శీర్షిక చాలా రోజుల నుంచి అచేతనంగా ఉంది. ఇప్పటి నుంచి నేను ఎప్పటికప్పుడు కొత్త వ్యాసాలను పరిశీలించి ముఖ్యమైన విషయాలను గ్రహించి ఆ శీర్షికను తాజాకరించాలని నిర్ణయించాను. అయితే తాజాకరించే ప్రతి సారి ఇక్కడ మార్పు చేస్తే సరిపోతుందా (పాత విషయాలను భండారానికి చేరుస్తూ) లేదా కొత్త పేజీ ప్రారంభిస్తూ ఉండాలా. కొత్త పేజీ ప్రారంభిస్తే మొదటి పేజీకి లింకులు మార్చవలసి వస్తుంది. అలా కాకుండా వారానికి /పక్షానికి / మాసానికి ఒకసారి ఆటోమేటిగ్గా చరిత్రలో ఈ రోజు మారినట్లు చేద్దామా. --C.Chandra Kanth Rao 19:32, 7 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

"మీకు తెలుసా?"లో వికీపీడియాలోని కొత్తకొత్త వ్యాసాల నుండి ఆశ్చర్యకరమైన వాక్యాలను చేరుస్తాము. ఆ శీర్షికను నిర్వహించడానికి ఒక సారి వికీపీడియా:మీకు తెలుసా? భండారము పేజీని చూడండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 19:58, 7 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రదీప్ గారు, భండారములో నేను 100 రోజుల క్రితమే కొన్ని వాక్యాలు చేర్చాను. కాని అవి మొదటి పేజీలోకి రావడం లేదనే నా బాధ. ఆశ్చర్యకరమైన విషయాలు కొత్త వ్యాసాలనుంచి నేను సేకరిస్తాను. వాటిని మొదటి పేజీలోకి తరలించడానికి ఏ మార్గం ఉపయోగించాలనేది నా సమస్య. ఇంతకు క్రితమే నేను చెప్పినట్లు వాటిని బహిర్గతం చేయుటకు ఏ పద్దతి ఉపయోగించాలో నిర్ణయించండి. --C.Chandra Kanth Rao 20:20, 7 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
ఇప్పటిదాకా పద్ధతంటూ ఏదీ నిర్ణయించలేదు. చొరవచేసి మీరే మార్చెయ్యండి. ప్రస్తుతానికి వారానికి ఒకసారి మార్చే పద్ధతిని పెట్టుకుంటే చాలు. ఎలా చేర్చాలి అంటే ఉన్నవాటిని చెరిపేసి వాటి స్థానంలో కొత్తవాటిని వ్రాస్తే చాలు. ఎందుకంటే భండారంలో ఎలాగూ ప్రతిదీ ఒక కాపీ ఉంటుంది కదా --వైజాసత్య 21:00, 7 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
సరే ఇక్కడ ఉన్నవాటిని మారుస్తూ కొత్త వాక్యాలు వారానికోసారి చేరుస్తాను. పాత వాక్యాలను భండారానికి తరలిస్తాను.C.Chandra Kanth Rao 21:43, 7 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నా పేరు ఆనంద్.మాది తిరుపతి.నాకు కూడా ఇందులో వ్యాసాలను కొన్ని మంచి రచనలను చేయాలని వుంది.అవి ఎక్కడ పొందుపరచాలో ఎవరైనా నాకు తెలుపగలరు.అలాగే మా ఊరి పేరును నేను ఇక్కడ ఎలా చేర్చగలను?

ఒక వ్యాసంలో ఎన్ని బొమ్మలు ఉంచవచ్చు?

[మార్చు]

ఈ విషయంపై ఆంగ్ల వికీలో ఈసరికే ఏమన్నా నియమావళి ఉన్నచో తెలియజేయగలరు? లేకున్నచో మనమే చర్చించి ఓ నిర్ణయానికి రావలెను. నా ఉద్దేశ్యం ప్రకారం మూడు లేదా నాలుగు సాధారణ బొమ్మలు సరిపోతాయి. ఏమంటారు? Chavakiran 08:10, 8 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నా అభిప్రాయం ప్రకారం వ్యాస పరిమాణాన్ని బట్టి అందులో ఎన్ని బొమ్మలైనా చేర్చవచ్చు. ఉదాహరణకు ఆంగ్ల వికీపీడియాలో ఉన్న en:Kerala వ్యాసాన్ని చూడండి. కాక పోతే వ్యాసం బొమ్మల కొలువులా తయారవ్వకుండా ప్రతీ బొమ్మకూ ఆ వ్యాసంలో విలువ ఉండేటట్లుగా ఆ వ్యాసంలోనే బొమ్మకు సంభందిన వివరాలు కూడా మూర్తిగా చేరిస్తే బాగుంటుంది. ప్రతీ 1-2 KB సమాచారానికి 1 బొమ్మ మంచి నిష్పత్తి అని అనుకుంటున్నాను. __మాకినేని ప్రదీపు (+/-మా) 08:40, 8 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
మన వాళ్ళు గ్రామం అనగానే ఊళ్ళో బొమ్మలన్నీ అప్లోడ్ చేసేట్టు ఉన్నారు :) ఈ విషయంళో మనకి గైడ్ లైన్స్ ఉండటం మంచిది అని నా ఉద్దేశ్యం, ఏమంటారు? మీరు చెప్పిన నిష్పత్తి బాగానే ఉన్నది, అదే కాకుండా బొమ్మకీ వ్యాసానికీ సంబంధం ఉండాలి, బొమ్మ చూడగానే వ్యాసం గురించిన ఏదో ఒక విషయం గుర్తు రావాలి (కనీసం వ్యాసం చదివిన తరువాత అయినా ఈ బొమ్మ ఉంచవచ్చు అని అన్పించాలి), లేనటువంటి బొమ్మలని తొలగింఛాలి అని నా మతము. Chavakiran 08:50, 8 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
బొమ్మలు ఎన్ని ఉండాలి అనే కాకుండా ఎలాంటి బొమ్మలుండాలి అని కూడా మనం నిర్ణయించాలి. ఉదాహరణకు యల్లాయపాళెం గ్రామ వ్యాసంలో చాలా బొమ్మలు అవసరం లేనివేనని నా అభిప్రాయం. ప్రతిభావంతులు, బుజ్జయ్య వ్యాపారం, పంచాయతి లోపల, గొర్రెలు, బర్రెలు, గ్రంథాలయం క్రింది గది, లైబ్రేరియన్ బొమ్మ, అక్షరదీపం కార్యకర్తలు, క్రికెట్ టీం లాంటి లాంటి బొమ్మల అవసరం ఏమిటి ? గ్రామ వ్యాసంలో ఎలాంటి బొమ్మలుండాలి, ప్రముఖుల వ్యాసంలో ఎలాంటి బొమ్మలుండాలి ...ఇలా మనం నిర్ణయించుకోవాలి. ఇక బొమ్మల సంఖ్య విషయానికొస్తే ప్రదీప్ గారు చెప్పినట్లు వ్యాసం నిడివిని బట్టి బొమ్మల సంఖ్య పెరగవచ్చు.C.Chandra Kanth Rao 09:39, 8 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
యల్లాయపాళెం విషయంలో నేను కూడా ఏకీభవిస్తాను, నేను ఈ చర్చ మొదలుపెట్టడానికి ఆ వ్యాసం కూడా ఓ కారణం. గ్రామంలో గ్రామ పేరు వచ్చేట్టున్న ఓ బొమ్మ, ల్యాండ్ మార్క్స్ లాంటివి రెండు మూడు వరకూ బాగుంటాయని నేను అనుకుంటున్నాను. అలా చూస్తే లైబ్రరీ బొమ్మను పై వ్యాసంలో ఉంచవచ్చు.

యల్లాయపాళెం వ్యాసంలో కొన్ని బొమ్మలు బావుండనప్పటికీ ఆ బొమ్మలను సభ్యుడు కొత్తగా చేరిన అత్యుత్సాహంతో చేర్చారు. అలా తొలగించి వేస్తే ఆయన ఉత్సాహాన్ని నీరుగార్చినట్టు అవుతుంది. బొమ్మలు ఎక్కువ ఉండుట వలన ప్రస్తుతానికి వచ్చిన ఇబ్బందేం లేదు కదా కొంతకాలం(అంటే ఆ వ్యాసం మొదటి పేజీలో ప్రదర్శనకు వచ్చినపుడు) కావలసిన మార్పులు చేయవచ్చు, లేదా ఆసభ్యునికి విషయము వివరించి ఆయన్ ద్యారానే కొన్ని బొమ్మలను వ్యాసము నుండి తొగింపచేయవచ్చు.విశ్వనాధ్. 05:23, 9 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంగ్ల వికీపీడియాలో దీని విషయమై కొన్ని సూచనలున్నాయి. ఉదాహరణకు వ్యాసంలో సమచారం తక్కువై బొమ్మలెక్కువైనప్పుడు వ్యాసం యొక్క ప్రవాహానికి ఇవి అడ్డుతగులుతుంటాయి. అలాంటప్పుడు వ్యాసంలో మరింత సమాచారం చేరేదాకా ఎక్కువైన బొమ్మల్ని చర్చా పేజీలో ఒక బొమ్మలకొలువులాగా ఉంచుకోవాలని ఉంది. అలాగే ప్రదీపున్నట్టు ఎన్ని బొమ్మలున్నవన్నది ముఖ్యం కాదు కానీ అవీ ఆ విషయంపై మన అవగాహన పెంచడానికి ఎలా తోడ్పడుతున్నాయని ఆలోచించాలి. విశ్వనాథ్ గారితో నేనేకీభవిస్తాను. మధ్యేమార్గంగా కొన్ని అదనపు బొమ్మలను బొమ్మలకొలువు విభాగంలో చేర్చితే వ్యాసపు ప్రవాహానికి అడ్డుపడకుంటా చదవటానికి సులువుగా ఉంటుంది --వైజాసత్య 05:39, 9 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
యళ్ళాయపాలెం వ్యాసంలో గొర్రెలు, బర్రెలు, వరిపొలాలు బొమ్మలు అనవసరం యళ్ళాయపాలెం బర్రెలకు ఆంధ్రప్రదేశ్లోని ఏ ఇతర ఊరి బర్రెలకంటే తేడా/ ప్రత్యేకత ఏముంది? అందుకని --వైజాసత్య 05:42, 9 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఇంటి పేర్లు

[మార్చు]

నేను ఇంటి పేర్లు శీర్షికతో, తెలుగువారి ఇంటిపేర్లు సేకరించి, ఆ వ్యాసంలో పెడుతున్నాను. వాటిని, వర్ణక్రమంలో , అకారాదిగా ఎలా ఏర్పాటు చేయాలో కొంచం గైడ్ చేస్తారా. Talapagala VB Raju 04:59, 10 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు రాసుకొంటూ వెళ్ళిపొండి తరువాత క్రమంలో ఉంచొచ్చు.విశ్వనాధ్. 05:23, 10 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలండి Talapagala VB Raju 11:36, 10 ఫిబ్రవరి 2008 (UTC) 59.93.116.194 11:26, 10 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఆఝ్ ం
--59.93.86.169 09:42, 13 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]