వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 9

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాత చర్చ 8 | పాత చర్చ 9 | పాత చర్చ 10

alt text=2009 జనవరి 7 - 2009 సెప్టెంబరు 21 రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2009 జనవరి 7 - 2009 సెప్టెంబరు 21

ఇది పాత చర్చలను భద్రపరచిన పేజీ. దయచేసి దీనిని మార్చవద్దు. మీరు ఏమైనా చర్చించాలంటే ఇక్కడ వ్రాయండి.

వ్యాసాల విలీనం-ధన్యవాదాలు

[మార్చు]

విశ్వనాథ్ గారూ, తెలుగు వికీపీడియాను శుభ్రం చేస్తున్నట్లున్నారు. ఒక చిన్న వ్యాసాన్ని పెద్ద వ్యాసంలో విలీనం చేసినప్పుడు నా అభిప్రాయం ప్రకారం చిన్న వ్యాసం పేరును పెద్ద వ్యాసం పేరుకు దారిమార్పు పేజీగా మారిస్తే బాగుంటుంది. ఉదాహరణకు సరస్వతీ గోరా పేజీని తొలగించకుండా గోరా గారికి దారిమారిస్తే రెండింటిలో దేని గురించి వెదికినా పెద్ద వ్యాసంలోకి వెళతాము. భార్యాభర్తలిద్దరికీ ఒకటే వ్యాసముండాలని నిబంధన ఏదైనా ఉన్నదా. అలాగైతే చాలా వ్యాసాలు కలపవచ్చును. అలాగే ఒక ఊరి ప్రముఖులందరినీ ఆ ఊరి పేజీలోనే ఉంచాలంటే కూడా చాలా వ్యాసాలను తగ్గించవచ్చును. జంతువులు, మొక్కలు, మసాలా దినుసులు, ఇలా ఒక ఉమ్మడి వ్యాసాలుగా చేస్తే కొన్నింటిని కలపవచ్చును. కానీ ఇది సమంజసంగా అనిపించడం లేదు. విస్తరణకు అవకాశం ఇస్తే బాగుంటుంది గానీ ఉన్న వ్యాసాల్ని కలుపుకుంటూ పోతే ఏమిటి లాభం. మొలకల సంఖ్యను తగ్గించవచ్చును. అంతే.Rajasekhar1961 13:22, 7 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

అవును. విలీనం చేసినపుడు ఫాత వ్యాసాన్ని తొలగించకుండా దారిమార్పు పేజీగా మార్చండి. అంతే గాకుండా విస్తరణకు ఒక మాదిరి అవకాశం ఉన్న పేజీలను మొలకలుగానే ఉంచేయండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:03, 7 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

కుటుంబం మరియు బంధువులు వ్యాసాలలో 'బంధుత్వాలు' (రిలేషన్స్) మరియు వరుసలు మాత్రమే తెలుపగలము. ఈ వ్యాసాలలో అత్యంత ప్రధానమైనవి తల్లి మరియు తండ్రి, వీటి విస్తరణలకు అవకాశాలు మెండు. మిగతా వరుసలకు వ్యాసాలు ప్రారంభించిన యెడల, మొలకలు మొదలవుతాయి, వీటి విస్తరణా అవకాశాలు తక్కువ.

  • సూచన : కుటుంబం మరియు బంధువులు ; వీటి కొరకు రెండు వ్యాసాలుంచి, ఆయా బంధువర్గ వరుసలను ఆయా వ్యాసాలలో వ్రాయడం సమంజసమేమో, సభ్యులు గమనించవలెను. నిసార్ అహ్మద్ 12:43, 8 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]
  • కుటుంబం లోని వ్యాసాలన్నింటినీ విలీనం చేయడం అస్సలు సమంజసం కాదు. ఈ వ్యాసాలను మొదలు పెట్టినది నేనే. ఆధునికులకు వీటి గురించి ఎక్కువగా తెలియదు. కానీ ప్రాచీనకాలం నుండి మన సంస్కృతి కుటుంబ సంబంధాల మీద గాఢమైన ప్రభావం చూపింది. వీటి గురించి ఎన్నో రచనలు, సినిమాలు, నాటకాలు వచ్చాయి. హిందూ పురాణాలలో స్పష్టమైన నిర్వచనాలు కూడా ఉన్నాయి. కుటుంబ క్షీణిస్తున్న తరుణంలో మనం అందరం కలిసి వీటిని అభివృద్ధి చేయాలని నా యొక్క అభ్యర్ధన. ఒక్కొక్క సభ్యునికి తెలిసిన లేదా అందుబాటులో ఉన్న సమాచారాన్ని చేరిస్తే కొంతకాలానికి తెలుగు వికీపీడియాలో మనం గర్వించే వ్యాసాలు తయారయ్యే అవకాశం ఉన్నది.Rajasekhar1961 04:59, 9 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

పారిభాషిక పదకోశాలు

[మార్చు]

తెలుగు అకాడమి వారు ప్రధానమైన తెలుగు శాఖలన్నింటిలోను పారిభాషిక పదకోశం తయారుచేసి ముద్రించారు. చాలా తక్కువ ధరకు హైదరాబాదు హిమాయత్ నగర్ లో దొరుకుతున్నాయి. తెలుగు-తెలుగు నిఘంటువు కూడా ముద్రించారు. ఇవి తెలుగు వికీపీడియా అభివృద్ధిలో ఉపయోగపడతాయి. నేను అన్నింటినీ కొన్నాను. మీకెవరికి సహాయం కోసం నేను అందించగలను.

తెలుగు భాషకు సంబంధించిన వాడుక పదాల వ్యుత్పత్తి (Etymology) మరియు ఇతర నానార్ధాలు మొదలైన వాటికి ఇవి చాలా ఉపయోగపడతాయి. ఇంగ్లీషు వికీలో ఇదొక సాంప్రదాయంగా కొనసాగుతుంది. మనం కూడా ఈ మంచి అలవాటును మొదలుపెడితే బాగుంటుంది. ఈ వ్యుత్పత్తికి సంబంధించిన విషయాలను ఒక విభాగంలో చేర్చవచ్చును.Rajasekhar1961 08:51, 15 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంధ్రజ్యోతి ఆదివారం కవర్ స్టోరీలో తెవికి గురించి

[మార్చు]

ఆంధ్రజ్యోతి ఆదివారం కవర్ స్టోరీలో తెవికి గురించి చాలా వ్రాసారు అరుణ పప్పు గారు. అందుకే కాబోలు కొత్త సభ్యులు చాలా మంది చేరుతున్నారు. http://www.andhrajyothy.com/sunday/sundayshow.asp?qry=2009/18-1/coverstory - --Svrangarao 16:06, 18 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

మొదటి పేజీలో "ఈ వారపు బొమ్మ" సైజు

[మార్చు]

మొదటి పేజీలో "ఈ వారపు బొమ్మ" సైజూ చాలా పెద్దదిగా కానవస్తున్నది. ఈ బొమ్మ మొత్తం పేజీ ఆక్రమించినట్లు అగుపిస్తున్నది. నిర్వాహకులు సరిచేయగలరు. అహ్మద్ నిసార్ 18:50, 19 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

సరి చేశాను రవిచంద్ర(చర్చ) 04:43, 20 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

IP అడ్రస్సుల నిరోధం గురించి

[మార్చు]

డిసెంబరు 18 నుండి డిసెంబరు 28 తారీకుల, మధ్యలో 40 వరకూ IP అడ్రస్సులను తెలుగు వికీపీడియాలో మార్పులు చేయనివ్వకుండా, ఖాతాలను సృష్టించకుండా నిరోధించడం జరిగింది. అప్పటి పరిస్థితుల బట్టి అది సరయిన చర్య అయ్యుండవచ్చు. కానీ దానివలన తెవికీలో నిజమైన మార్పుల చేయాలనుకునే సభ్యులకు కూడా అడ్డుపడ్డటవుతుంది. దీని వలన ఆ IP అడ్రస్సులపై ఉన్న నిరోధాన్ని తొలగించాలని అనుకుంటున్నాను, ఇందుకు ఎవరయినా వ్యతిరేకిస్తే 3 రోజులలోగా ఇక్కడ కారణాలను తెలుపగలరు. __మాకినేని ప్రదీపు (+/-మా) 18:36, 9 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఒక రోజు, వారం రోజులు, నెలరోజుల నిరోధం ఇప్పటికే తొలిగిపోయింది. "ఎప్పటికీ" నిరోధం ఉన్న ఐపి అడ్రస్‌ల నిరోధాన్ని ఇప్పుడు తొలిగించవచ్చు. -- C.Chandra Kanth Rao-చర్చ 20:04, 9 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]
అభ్యంతరమేమీ లేదు --వైజాసత్య 23:43, 9 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]
నిరోధం తొలగించండి. రవిచంద్ర(చర్చ) 04:07, 10 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

మేళకర్త రాగాలు

[మార్చు]

రాగాల అభివృద్ధికి ఆడియో లింకులు మంచి వెబ్ సైటు నుండి ఉంచితే ప్రసిద్ధిచెందిన రాగాల గురించి ఇంకా బాగా అర్ధం అవుతుంది. ఎవరైనా సహాయం చేయగలరా..Rajasekhar1961 04:33, 12 ఫిబ్రవరి 2009 (UTC) తప్పకుండా. ----Nagaraju raveender 17:57, 3 ఏప్రిల్ 2009 (UTC). రాజశేఖర్ గారూ, మీ "మేళకర్త రాగాలు" వ్యాసం చాలా బాగుంది. మీరడిగినట్టు , నేను నాకు తెలిసిన కొన్ని మ్యూజిక్ వెబ్ సైట్ల లింకులు ఇచ్చాను, చూడండి. -----Nagaraju raveender 04:30, 4 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

  • ధన్యవాదాలు. మ్యూజిక్ ఇండియా విబ్ సైటు బాగుంది. కానీ ఈ సైట్లలోని ఆడియో లింకులు కొంతకాలం తర్వాత మారిపోవడం గానీ తొలగించడం గానీ జరుగుతుందేమో.Rajasekhar1961 09:58, 4 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

సంజ్ఞలు

[మార్చు]

en:Non-verbal communication మీద వ్యాసం ప్రారంభించాలని ఉన్నది. సరైన తెలుగు పదం తెలియజేయండి. బాడీ లాంగ్వేజ్ అనే పుస్తకం లో వివరాలున్నాయి. తెలుగు భాషా పదం నచ్చలేదు.Rajasekhar1961 07:15, 16 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

"భాషారహిత భావవ్యక్తీకరణ" - ఎలా ఉంది? --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:39, 21 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]
1)సంజ్ఞా మాధ్యమం, 2)అశాబ్దిక వ్యక్తీకరణ, -- C.Chandra Kanth Rao-చర్చ 20:18, 21 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]
సంజ్ఞ / సంజ్ఞలు క్లుప్తంగా బాగున్నట్లనిపిస్తుంది. సైగ, గుర్తు, పేరు, చైతన్యం, స్మృతి, పరిభాష మొదలైన ఇతర పేర్లు నిఘంటువులో పర్యాయపదాలుగా ఇచ్చారు. ప్రారంభించుదామా!Rajasekhar1961 03:48, 22 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]
"en:Non-verbal communication" గురించి అయితే అందుకు "అశాబ్దిక వ్యక్తీకరణ" అనేది సరైన పదం గనుక ఆ పేరే వాడవచ్చును. అలా కాకుండా "en:Gesture" అయితే "సంజ్ఞ" అనే పేరుమీద వ్యాసం మొదలుపెట్టండి. "క్లుప్తంగా" కంటే "ఖచ్చితంగా" ఉండే పేరు మంచిదని నా అభిప్రాయం. ఏమయినా మొదలెట్టేయండి. ఆలస్యంబేల? --కాసుబాబు - (నా చర్చా పేజీ) 06:00, 22 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసానికి సంబంధం లేని చర్చలు

[మార్చు]

కొందరు సభ్యులు వ్యాసానికి సంబంధం లేని చర్చలు, వార్తలు వ్యాసపు చర్చా పేజిలలో చేరుస్తున్నారు. అలా చేయడం సమజసం కాదు. అవి ఎలాంటి సందేశం లేకుండానే తొలిగించబడతాయి. సభ్యులు గమనించగలరు. అలా ఒకరికి నచ్చని వార్తలు వ్రాస్తూపోవడం వికీ నైజం కాదు.-- C.Chandra Kanth Rao-చర్చ 14:49, 25 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసానికి సంబంధం లేని, పత్రికలలో తమకు నచ్చని సమాచారం పట్టుకొచ్చి వికీలో చేర్చాలనుకోవడం పద్దతి కాదు. ఇది వరకే ఈ విషయమై చాలా చర్చ జరిగింది. సదరు సభ్యుడు ఈ విధంగా చేయడం ఇది వరసగా మూడో రోజు. ఇలా చేయడం నిర్వాహకుల విలువైన సమయాన్ని వృధా చేస్తున్నట్లుగా పరిగణించబడుతుంది. -- C.Chandra Kanth Rao-చర్చ 14:58, 27 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]
సారీ.ఇది వరకే ఈ విషయమై జరిగిన చర్చఏమిటో తెలియదు.ఆత్మార్పణచేసిన ఈనాటి శివభక్తులైన జంగ్టె దేవిదాస్‌, ఆడె సితారామ్‌లకు వికీలో ఎక్కడో ఒకచోట స్థానం దొరకాలనే నా ఉద్దేశం.వారు ఏవ్యాసానికైనా సరిపోతే దాన్లోనే చేర్చండి--Nrahamthulla 02:12, 28 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]
తుల్జాబాయి, మానవత్వం వ్యాసపు చర్చా పేజీలతో సహా ప్రారంభం నుండి నిన్న మొన్నటి వరకు ఒక అజ్ఞాత సభ్యుడు సృష్టించిన చాలా వ్యాసాలలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ విషయం పైనా, దీని సంబంధిత విషయాలపైనా చర్చలు జరిగాయి. అది అందరికీ తెలిసిన విషయమే. ఇక అసలు విషయానికి వస్తే పత్రికలలో వచ్చే వార్తలు, వార్తల్లోని అంశాలు, వార్తల్లోని వ్యక్తులు అన్నింటినీ, దాన్ని విమర్శనాత్మకంగా గానీ, ప్రశంశానాత్మకంగా గానీ వికీలో చేర్చాలనుకోవడం బాగుండదు. పత్రికలలో ఆత్మహత్యల గురించి, ఆకలి చావుల గురించి, తగాదాల గురించి, రోడ్డు ప్రమాదాల గురించి ఎందరో సామాన్యుల పేర్లు వస్తుంటాయి, ఇవన్నీ వికీలో చేర్చదగినవేనా? పత్రికలలో ఒక రోజు వెలిగే పేర్లు శాశ్వతంగా ఉండవలసిన వికీలో ఉండతగినవి కావు. రోజు వాడి పారేసే పత్రికలలో ఉన్న సమాచారం వికీలో స్థానం పొందాలని ఆరాటపడటం తగదు. వార్తాపత్రికలలోని సమాచారం చేర్చకూడదని ఎవరూ అనరు, పత్రికలలో వచ్చే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ విశేషాలు, ప్రముఖ వ్యక్తులు, రాజకీయాలు, క్రీడలు, ఆర్థికం, శాస్త్రసాంకేతిక అంశాలు ఎన్నయినా చేర్చవచ్చు దీనిపై ఎవరికీ అభ్యంతరం ఉండదు. మనం సృష్టించే వ్యాసాలు, మనం చేసే కృషి మన కొరకు కాదు, పది మందికి అది ప్రయోజనకరమైనప్పుడే మన కృషి సార్థకమౌతుంది. ఇక చివరగా చెప్పేదేమంటే శివభక్తులు చేసిన పనికి మనం విమర్శించడం తగదు, ప్రశంసించడం తగదు. వారికి వికీలో ఏ వ్యాసంలోనూ చోటు ఇవ్వాల్సిన పని లేదు. -- C.Chandra Kanth Rao-చర్చ 16:10, 28 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

నియోజకవర్గాల సమాచారం

[మార్చు]

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో రాజకీయ వాతావరణం వేడెక్కినది. ఎక్కడ చూసిననూ రాజకీయాల గురించే చర్చలు జరుగుతున్నాయి. పత్రికలలో కూడా రాజకీయాల గురించి, నియోజకవర్గాల ప్రొఫైల్స్ గురించి ప్రత్యేక కథనాలు వెలువడుతున్నాయి. ఇవి ముఖ్యంగా జిల్లా ఎడిషన్లలో వస్తున్నాయి కాబట్టి జిల్లాలకు చెందిన పత్రికల సమాచారం సేకరిస్తే తెవికీలో నియోజకవర్గాల వ్యాసాలు ఒక సమగ్రదశకు వస్తాయి. నాకు రెండు, మూడు జిల్లాలకు చెందిన జిల్లా ఎడిషన్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఇతర జిల్లాలలో ఉన్న మిత్రుల సహాయంతో మరి కొన్ని జిల్లా ఎడిషన్లు సంపాదించడానికి కృషిచేస్తాను. ఈ విషయంలో ఇతర సభ్యులు కూడా కృషి చేస్తే బాగుంటుంది. పత్రికలలోని సమాచారం ఎలా చేర్చాలి అనే సందేహం ఉంటే ఆయా నియోజకవర్గాల చర్చా పేజీలలో యథావిధిగా చేర్చి పత్రిక పేరు, తేది, పేజీ సంఖ్య తెలియజేస్తే వ్యాసానికి అనుగుణంగా అందులోని సమాచారం ముఖ్యమైన పాయింట్లను రెఫరెన్స్‌తో సహా చేర్చడానికి నేను ప్రయత్నిస్తాను. -- C.Chandra Kanth Rao-చర్చ 18:51, 4 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

మంచి ఆలోచన. అహ్మద్ నిసార్ 19:01, 4 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

విక్షనరీ

[మార్చు]

మన విక్షనరీలో తెలుగులో టైపు చేసే సౌకర్యం ఈ మధ్య కనిపించడం లేదు. సంబంధిత సభ్యులెవరైనా వికీమీడీయా సభ్యులకు నివేదించి సరిదిద్దగలరు. -- రవిచంద్ర(చర్చ) 04:15, 1 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఎలక్షన్ బొమ్మలు

[మార్చు]

నియోజక వర్గాల వ్యాసాలు చక్కని ప్రగతిని సాధిస్తున్నాయి. వీటి గురించి ప్రత్యేకమైన కృషి చేస్తున్న చంద్రకాంతరావు, నిసార్ అహమ్మద్, దేవాలకు అభినందనలు.

ఈ ఎలక్షన్లను అవకాశంగా తీసుకొని వీలైనన్ని సంబంధిత ఫొటోలు సేకరించగలిగితే నియోజక వర్గాల వ్యాసాలలో వాటిని అప్‌లోడ్ చేయవచ్చును. ఉదాహరణకు ప్రతి నియోజక వర్గంలోనూ రెండు మూడు పార్టీల పోస్టరులు లేదా గోడలమీద వ్రాతలు లేదా కటౌట్లు లేదా ఊరేగింపులు, సభలు, పాదయాత్రలు, రోడ్‌షోలు - ఎన్నైనా ఉన్నాయి. ఎలక్షను రోజుల్లో మీకు వీలయితే వోటింగ్ బూత్ దగ్గర సంరంభాన్ని చిత్రీకరించండి. రెండు మూడు పార్టీల పోస్టరులను మిక్స్ చేసి ఒక బొమ్మగా కూర్చి ఆ నియోజకవర్గం వ్యాసంలో అప్‌లోడ్ చేస్తే చాలా బాగుంటుంది. అప్‌లోడ్ పని తరువాత చేయవచ్చును గాక. కాని వీలు చిక్కినపుడు సభ్యులు తమ కెమెరా లేదా సెల్‌ఫొనులతో ఫొటోలు తీసి భద్రపరచే అవకాశాన్ని వదులుకోవద్దని సభ్యులను కోరుతున్నాను. ముఖ్యంగా పోస్టరులవంటివైతే అందులో నియోజక వర్గం పేరు వచ్చేలా చూడండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:48, 3 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ ప్రతిపాదన బాగుంది కాని ఆచరణలో కొద్దిగా కష్టంగా ఉంది. ఈ సారి ఎన్నికల ప్రచారంలో గోడల మీద రాతలు, పోస్టర్లపై ఎన్నికల కమీషన్ నిషేధం విధించింది. కరపత్రాలు కూడా తగ్గిపోయాయి. పోనీ ఊరేగింపుల బొమ్మలు తీద్దామా అంటే పత్రికా రిపోర్టర్లపైనే దాడులు జరుగుతున్నాయి, కెమెరాలు లాక్కుంటున్నారు. మనం ఫోటోలు తీస్తే మనల్ని కూడా రిపోర్టర్లని భావించే ప్రమాదం ఉంది. పత్రికలలో, టివిలలో మాత్రం ప్రచారం బాగానే ఉంది. వీలైతే పత్రికల క్లిప్పింపులు, టివి స్క్రీన్ షాట్లు తెవికీలో ఎక్కించవచ్చు. కాని టివి స్క్రీన్ షాట్లు వికీలో ఏ లైసెన్స్‌తో చేర్చాలనేది మనం ఆలోచించుకోవాలి. -- C.Chandra Kanth Rao-చర్చ 18:20, 3 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]


Wikimania 2009: Scholarships

[మార్చు]

English: Wikimania 2009, this year's global event devoted to Wikimedia projects around the globe, is now accepting applications for scholarships to the conference. This year's conference will be handled from August 26-28 in Buenos Aires, Argentina. The scholarship can be used to help offset the costs of travel and registration. For more information, check the official information page. Please remember that the Call for Participation is still open, please submit your papers! Without submissions, Wikimania would not be nearly as fun!

తెలుగు: Please translate this message into your language. - Rjd0060 01:18, 9 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ గణాంకాలు

[మార్చు]

తెవికీ వాసిని పెంచడానికి ఈ క్రింది గణాంకాలు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. కాబట్టి ఎవరైనా వీటిని సేకరించాల్సిందిగా ప్రార్థన.

  1. తెవికీలో మొత్తం సినిమా వ్యాసాలు ఎన్ని ఉన్నాయి? మొత్తం వ్యాసాలలో వాటి శాతం ఎంత?
  2. మొత్తం ఎన్ని గ్రామాల వ్యాసాలున్నాయి? వాటి శాతం ఎంత?
  3. గ్రామాల వ్యాసాలు, సినిమా వ్యాసాలు తప్ప మొలక స్థాయిలో ఉన్న ఇతర వ్యాసాల సంఖ్య మరియు శాతం ఎంత?

ఈ ఫలితాలను బట్టి తెవికీ నాణ్యతను పెంచడానికి మనం ఎటువంటి వ్యాసాల మీద దృష్టి కేంద్రీకరించాలో తెలుస్తుందని నా భావన. — రవిచంద్ర(చర్చ) 09:28, 6 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

రవిచంద్రగారూ, మీ ఐడియా బాగుంది. తెవికీలో మొత్తం సినిమాల వ్యాసాలు ఎన్ని ఉన్నాయో లెక్కేద్దామని [వర్గం:తెలుగు సినిమాలు] లో, 1931 నుండి 2008 వరకు గల సినిమాలు లెక్క గడితే మొత్తం 4565 వున్నాయి. కానీ ఇందులో కొన్ని నీలి లింకులు (వ్యాసాలు గలవి) కొన్ని ఎర్ర లింకులు (వ్యాసాలు లేనివీ) వున్నాయి. కేవలం నీలి లింకులు మాత్రమే ఎంచడం కాలేదు. వీటికి ఏదైనా చిట్కా చెప్పండి.
మూడవ ప్రశ్నకు సమాధానం: గ్రామాల వ్యాసాలు, సినిమా వ్యాసాలు తప్ప మొలక స్థాయిలో ఉన్న ఇతర వ్యాసాల జాబితా వికీపీడియా:మొలకల జాబితా లో ఉంది. ప్రస్తుతానికి అవి 4458 దాకా ఉన్నాయి. ఈ జాబితా కాస్త పాతదైనా తాజా పరిస్థితి ఇంతకంటే పెద్దగా భిన్నంగా ఉండదు. ఏది మొలక అనే దానికి వివిధ స్థాయిల్లో వివిధ నిర్వచనాలున్నాయి. అధికారికంగా అయితే కనీసం 200 పదాలైనా లేనివాటిని మొలకలుగా పరిగణిస్తారనుకుంటా. ఈ జాబితా విషయంలో మాత్రం రెండు కేబీలకంటే చిన్న వ్యాసాలు మొలకలుగా పరిగణించబడినవి. ఈ రెండు కేబీలుకూడా ఆ పేజీ సైజు కాదు అందులోని సమాచారం నిడివి అని గమనించాలి. వ్యాసం చరిత్రలో కనిపించే అంకెలు కేవలం పేజీ పరిమాణాన్ని సూచిస్తాయి. --వైజాసత్య 19:28, 13 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]
వికీపీడియా:మొలకల జాబితా లో నేను చాలా వ్యాసాలు అభివృద్ధి చేశాను. కాబట్టి ఆ జాబితా మరీ పాతదైపోయింది. నేను చూసిన మొలక వ్యాసాన్నే మళ్ళీ వెళ్ళి చూస్తున్నాను (దేన్ని విస్తరించానో మరిచిపోవడం వలన). దాన్ని రిఫ్రెష్ చెయ్యమని దాని చర్చా పేజీలో కూడా రాశాను. కాబట్టి కొత్త జాబితా తయారు చేస్తే బాగుంటుందని నా సలహా. — రవిచంద్ర(చర్చ) 10:31, 14 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర గారూ, మీరు చర్చాపేజీలో వ్రాసిన తర్వాత కూడా పలుమార్లు నేను ఆ జాబితాను తాజాకరించాను. మొలకలను తగ్గించడానికి కృషిచేస్తున్నందుకు కృతజ్ఞతలు. చివరి సారి 25 ఏప్రిల్ 2009 న తాజాకరించడం జరిగింది. ఈవాళ సాయంత్రం మళ్ళీ తాజాకరిస్తా --వైజాసత్య 14:50, 14 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ విషయమై నేను వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు) లో చేసిన ప్రతిపాదన చూడగలరు. విస్తరణకు పెద్దగా అవకాశం లేని కొన్ని పేజీలను తొలగించడమె నా ప్రతిపాదన సారాంశం. అయితే ప్రస్తుతం వీలయినన్ని సినిమా పేజీల విస్తరణ పనిలో ఉన్నాను. తరువాత కొన్ని చిన్న పేజీలను (పది కంటే తక్కువ పదాల సమాచారం ఉన్నవి) తొలగించాలనుకొంటున్నాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:03, 13 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగే నటీనటుల జాబితానూ సభ్యులు ఓసారి పరికించి, అవసరమైన వాటిని ఉంచి, మిగతావి తొలగించవలెనని మనవి.అహ్మద్ నిసార్ 04:25, 14 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]
అధికారిక లెక్కల ప్రకారం 43 వేల వ్యాసాలున్నా అనధికార లెక్క అని ఇంకో పద్ధతుంది. దీని ప్రకారం కనీసం 200 అక్షరాలు (పదాలు కాదని గమనించాలి) ఉంటేనే దాన్ని వ్యాసంగా పరిగణిస్తారు. అలాంటి లెక్క ప్రకారం తెవికీలో 14 వేల వ్యాసాలున్నాయి. అంటే ఆ తక్కినవన్నీ వ్యాసాల స్థాయి కూడా చేరనట్టే. చాలామటుకు గ్రామాల వ్యాసాలు మహా అయితే ఒక యాభై అక్షరాలక్కూడా మించట్లేదు. 0.5 (అర కేబీ) కేబీ పైగా ఉన్నవి మొత్తమ్మీద 18% ఉన్నాయి. రెండు కేబీలకు మించినవి 6%. అంటే దాదాపు 7700 అర కేబీని దాటాయి. 4000 వ్యాసాలు మాత్రం రెండు కేబీలను దాటాయి. గ్రామాల వ్యాసాలకు సమయం ఇవ్వాలి. అంతకంటే మనం హఠాత్తుగా చేసేదేమీ లేదు. కాబట్టి సినిమాల వ్యాసాల అభివృద్ధితో పాటు మొలకల జాబితాలోని వ్యాసాలను తగ్గించేందుకు కృషి చేయాలి. వైజాసత్య 22:39, 14 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]
బాటుతో వేసిన తాజా లెక్కల ప్రకారం 26876 గ్రామాల పేజీలున్నాయి. 3736 సినిమా పేజీలున్నాయి. అవి కాక మొలకల సంఖ్య 5641 --వైజాసత్య 03:29, 15 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]
  • కొన్ని విభాగాల వ్యాసాలు చాలా కీలకమైనవి అవి విస్తరించడం ప్రస్తుతం అసంభవం; ఉదాహరణకు
  1. గ్రామాలు
  2. సినిమాలు
  3. నియోజకవర్గాలు
  4. పార్లమెంటు సభ్యులు
  5. సంఖ్యానుగుణ వ్యాసాలు

అభ్యర్థన

[మార్చు]

సమాచారం సేకరించినందుకు ధన్యవాదాలు. ఇదంతా ఎందుకు చెయ్యాల్సి వచ్చిందంటే. పేరుకు తెవికీలో 43 వేల వ్యాసాలున్నా ఆంగ్ల వికీలో 20వేల కన్నా ఎక్కువ వ్యాసాలు గల వికీల జాబితాలో తెవికీ లేకపోవడం బాధ కలిగించింది. ఎందుకని ఆరా తీయాలనుకున్నాను అంతే!. ఇకపోతే ఆంగ్ల వికీ మొదటి పేజీలో చివరలో wikipedia languages అనే విభాగం క్రింద హిందీ, మరాఠీ ఉన్నాయి కానీ తెలుగు లేదు. అలా ఉంటే తెవికీ సందర్శకులు ఎక్కువౌతారు. ప్రాచుర్యమూ వస్తుంది. కాబట్టి మనం వైజాసత్య గారు వ్యాసానికి ఇచ్చిన నిర్వచనం ఆధారంగా 20 వేల వ్యాసాలు తయారు చెయ్యగలిగితే బాగుంటుందని నా ఆలోచన. అందుకనే తెవికీ సభ్యులందరినీ కొత్త వ్యాసాలను సృష్టిస్తే కనీసం 200 అక్షరాలపైన రాయండి, లేదా పాత మొలకల్ని 200 అక్షరాలపైన దాటించండని అభ్యర్థిస్తున్నాను. — రవిచంద్ర(చర్చ) 09:47, 15 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

మంచి సూచన. దీనిపై స్పందించాల్సిన అవసరం వున్నది. అహ్మద్ నిసార్ 10:22, 15 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]
అక్కడ తెవికీ లేకపోవటానికి ప్రత్యేక కారణమేమీ లేదు. ఇదివరకు ఉండేది. ఎవరైనా పొరపాటున తొలగించారేమో!! అనధికారిక లెక్కల ప్రకారం అనుకుంటే హిందీ, మరాఠీలతో సహా మరే ఇతర భారతీయ భాషల్లోనూ 20 వేల వ్యాసాలు లేవు హిందీ (15 వేలు) మరాఠీ (7.5 వేలు) బెంగాళీ (13 వేలు) తమిళం (17 వేలు). --వైజాసత్య 13:17, 15 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

రవీ! ఈ చర్చ లేవనెత్తినందుకు కృతజ్ఞతలు. తెలుగు వికీ నాణ్యత పెంచడం చాలా కష్టమైన పని. అయినా సభ్యులంతా వీలయినంత కృషి చేస్తూనే ఉన్నారు. అందరికీ అభినందనలు. రవి చేసిన సూచనలనే మళ్ళీ కొంచెం మార్పులతో, ఇంకొన్ని ప్రతిపాదనలతో తిరగరాస్తున్నాను.

  • సభ్యులంతా క్రొత్త వ్యాసాలు సృష్టించేటపుడు అందులో కనీసం 300 పదాలు ఉండేలా ప్రయత్నించండి. క్రొత్తగా చేర్చే సినిమాలకు కూడా ఇదే సూత్రం వర్తించాలి.
  • పాత మొలకలను 300 పదాలకు పెంచేందుకు సహకరించండి.
  • 10 పదాలలోపు వ్యాసాలను వీలయినంతవరకు ఇతర వ్యాసాలలో విలీనం చేయడం సబబు అయితే చేసేయండి.
  • వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు మరియు తెలుగు వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు పై ప్రత్యేక శ్రద్ధవహించండి.
  • 2009 డిసెంబరు నాటికి సినిమా వ్యాసాలలో 10 పదాలలోపు వ్యాసాలను ఇతర వ్యాసాలలో విలీనం చేసేద్దాము.
  • ఇక పోతే గ్రామాల వ్యాసాలు - 2010లో గ్రామాల వ్యాసాలు పునస్సమీక్షించుదాము. గ్రామాల వ్యాసాలు అభివృద్ధి చేయడానికి ఏదైనా మార్గం ఉందేమో అన్వేషించుదాము. రాష్ట్రంలో మండలం ఆఫీసులలో పని చేసే ఉద్యోగులు, పల్లెటూర్లలో పని చేసే ఉపాధ్యాయులు ఈ విషయంలో సహకరించగలరని ఆశిస్తాను. నేను క్రితం సెలవులలో ఈ విషయంపై కొన్ని ఎంక్వైరీలు మొదలు పెట్టాను. కాని సమయాభావం వలన పని కొనసాగించలేకపోయాను. ఎవరైనా సభ్యులు ఈ విషయం గురించి ప్రయత్నిస్తే ఉపయోగంగా ఉంటుంది.

--కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:17, 15 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

పైన నేను వ్యాఖ్య చేసిన తర్వాత అక్కడికి వెళ్లి చూశాను. వ్యాసాల లోతు 5 ఉంటేనే కానీ చేర్చడం లేదని చూశాను. రవిచంద్ర గారూ మీరన్నది నిజమే. మనం ఈ విషయమై కృషి చేయాలి --వైజాసత్య 15:12, 15 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]
లోతు (depth) అంటే చదివా గానీ ఏమిటో నాకు సరిగా అర్థం కాలేదు. పోనీ వాళ్ళ (ఆంగ్ల వికీ) గణాంకాల ప్రకారం, ఒక పేజీ వ్యాసంగా పరిగణించడానికి కొలబద్ద ఏమిటని తెలుసుకుంటే మనం దాన్ని బట్టి ఇక్కడ ప్రమాణాలు నిర్వచించుకోవచ్చు. — రవిచంద్ర(చర్చ) 16:59, 15 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]
కాసుబాబు గారు కొన్ని ప్రతిపాదనలు మరియు సూచనలు ఇచ్చారు, అభినందనలు. వైజాగారూ, ఇవికీలో గల Depth యొక్క measurement తెలుసుకునే టెక్నోక్రసీ ప్రస్తుతం మీకే ఎక్కువ, ఈ విషయం మీరే సర్చ్ చేసి మాకు గైడ్‌లైన్స్ ఇవ్వాలి. రవిగారూ మంచి విషయ చర్చ లేవనెత్తారు. ఈ చర్చ తెవికీ కి ఒక టర్నింగ్ పాయింట్ కావచ్చు. అహ్మద్ నిసార్ 18:37, 15 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]
Depth గురించి చెప్పాలంటే = (మొత్తం దిద్దుబాట్ల సంఖ్య/వ్యాసం పేజీలు) X (వ్యాసం కాని పేజీలు/వ్యాసం పేజీలు) X (మొలకల నిష్పత్తి), దీని ప్రకారం డెప్త్ పెంచాలంటే ముందుగా మొలకల శాతం తగ్గించడమే మేలైన మార్గం. దిద్దుబాట్ల సంఖ్యను, వ్యాసం కాని పేజీలను పెంచడం ఇప్పటికిప్పుడు అయ్యే పని కాదు. చిన్న వ్యాసాల గురించి నేను చాలా సార్లు చర్చ తీశాను ఈసారి అయినా చిన్న వ్యాసాలను తొలగించే పని చేయుట బాగుంటుంది. వ్యాసాల సంఖ్య కంటే వ్యాసాల నాణ్యతపై దృష్టిపెట్టినప్పుడు విజ్ఞానసర్వస్వానికి జనామోదం లభిస్తుంది. వ్యాసం పరిమాణం కనీసం 2 కె.బి.లైనా ఉండాలని ఇదివరకు చాలా పర్యాయాలు నేను నా అభిప్రాయం చెప్పాను. కనీసం అంత సమాచారం లేని పేజీలను వ్యాసంగా పరిగణించలేము కదా! -- C.Chandra Kanth Rao-చర్చ 19:03, 15 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ మొత్తం బ్రహ్మాండపురాణంలో సరిగ్గా అర్ధం కానీ సంఖ్య "మొలకల నిష్పత్తి" అనే సంఖ్య. దాని ప్రకారం తెవికీలో ప్రస్తుతం 49% మొలకలున్నాయి. అనధికార లెక్కల ప్రకారం 14 వేలే వ్యాసాలన్నప్పుడు (14 వేలు /43 వేలు * 100) = 30% శాతం వ్యాసాలైతే కనీసం 70% అయినా మొలకలయ్యుండాలి. అసలు ఈ మొలకల నిష్పత్తి పెద్ద జిమ్మిక్కని నాకనిపిస్తుంది. దీన్ని (విషయపు పేజీలు/మొత్తం పేజీలు)*100 తో సాధించవచ్చు. ఉదాహరణకు ప్రస్తుత తెవికీ చూడండి (42,820/87,291)*100 = 49% లెక్క సరిపోయిందిగా!!! అంటే మేరునగర సౌధపు "లోతులు" తాకాలంటే విషయంలేని ఉత్తిత్తి పేజీలు (చర్చా పేజీలు, మూసల పేజీలు, పాలసీల పేజీల్లాంటివి ) పెంచాలన్నమాట. బెంగాళీ వాళ్ళు చాలా దారిమార్పులు చేసి లోతును సాధించారు. కానీ మనం అలా జిమ్మిక్కులు చేసి సాధించాల్సిన అవసరం లేదు. అందుకే లోతు అనే సంఖ్యను పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. మనం అనధికార లెక్కలో వ్యాసాల సంఖ్యను పెంచడం, 0.5 కేబీలు, 2 కేబీల వ్యాసాల శాతం పెంచడంలో దృష్టి కేంద్రీకరిద్దాం. దీనికి కాసుబాబు గారు చేసిన సూచనలు పాటిస్తే సరి --వైజాసత్య 21:29, 15 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]
లోతు గురించి మరికొంత లోతుగా - మొలకలనిష్పత్తి = వ్యాసం పేజీలు / మొత్తం పేజీలు = వ్యాసం పేజీలు / (వ్యాసం పేజీలు + వ్యాసం కాని పేజీలు) కాబట్టి మొత్తం లోతు సమీకరణాన్ని సూక్ష్మంగా లోతు = (మొత్తం దిద్దుబాట్ల సంఖ్య x వ్యాసంకాని పేజీలు) / (వ్యాసం పేజీలు x మొత్తం పేజీలు) . ఈ సమీకరణంలో లోతు సంఖ్యను పెంచాలంటే భిన్నంలోని క్రిందివాటిని తగ్గించాలి లేదా పైవాటిని పెంచాలి. వ్యాసం పేజీలు, మొత్తం పేజీలు పెద్దగా తగ్గించడానికి ఎలాగూ వీలుపడదు. ఇక పైవి పెంచడమంటే దిద్దుబాట్ల సంఖ్య పెంచడం, వ్యాసంకాని పేజీలు పెంచడమే లోతును పెంచడానికి మార్గాలు. (మరో తిరకాసు: అయోమయ నివృత్తి పేజీలను కూడా సాఫ్టువేరు వ్యాసం పేజీల్లాగే పరిగణిస్తుంది. కాబట్టి అవి దీర్ఘకాలికంగా మంచివే అయినా, వాటిని సృష్టించడానికి చిన్నవికీలకు తాయిళమేమి (ఇన్సెంటివ్) ఏమీ లేదు)--వైజాసత్య 14:11, 31 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]
మొలక పేజీలు కూడా వ్యాసం పేజీలే కదా! అలాంటప్పుడు లోతు పెంచడానికి వాటి తొలిగింపులే తోడ్పడతాయనుకుంటా. ఒకే దెబ్బకు రెండూ పిట్టలన్నట్లు మొత్తం పేజీల సంఖ్య మరియు వ్యాసం పేజీలు రెండూ తగ్గుతాయి. హారం (భిన్నంలో క్రిందివి) తగ్గడం వల్ల ఫలితం పెరుగుతుంది.-- C.Chandra Kanth Rao-చర్చ 17:22, 31 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]


చంద్రకాంతరావుగారి అభిప్రాయమే నాది కూడాను. హారం తగ్గడం వలన ఫలితం చాలా గణనీయంగా ఉంటుంది. మరియు నాణ్యత లేని వ్యాసాలు తగ్గుతాయి. ఈ విషయంపై నేను అనేకమార్లు చర్చ లేవదీశాను. వివాదం లేని చోట చిన్న వ్యాసాలు తొలగించడానికి నేను వీలయినంత ప్రయత్నిస్తున్నాను. మరియు దాదాపు సంవత్సరంనుండి నేను దాదాపు క్రొత్త వ్యాసాలు ఏవీ మొదలుపెట్టలేదు. పేజీల సంఖ్య హారం తగ్గించే ప్రయత్నంలో భాగంగా (1) సామెతల పేజీలు చాలా తొలగించాను (2) చాలా మొలకలు పెంచాను (3) ప్రస్తుతం సినిమా వ్యాసాలు విస్తరణ అవకాశాలు పరిశీలిస్తున్నాను. తరువాత ప్రాముఖ్యత లేని సినిమా వ్యాసాలు తొలగిస్తాను. - సభ్యులు అందరినీ సహకరించమని కోరుతున్నాను --కాసుబాబు 18:23, 31 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఏకవాక్యవ్యాసాలు

[మార్చు]

ఒకే ఒక్క వాక్యముగల వ్యాసాలు తెలుగు వికీలో వందలుగా ఉన్నాయి. ఇది సమంజసమేనా?Kumarrao 07:25, 29 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

కుమారరావుగారూ! మీరు "వందలు" అన్నారు. కాని నిజానికి "వేలలో" ఉన్నాయి. వీటిని ఎలా అభివృద్ధి చేయాలి అనే విషయమే పైనున్న చర్చ, మరియు అనేక చర్చలు జరిగాయి. ఇప్పటికే సభ్యులు చేసిన శ్రమ వ్యర్ధం కాకుండా వ్యాసాల నాణ్యతను పెంచడానికి సభ్యులందరి సహాయమూ అర్ధిస్తున్నాను. ఇక "ఒకే వాక్యం ఉన్న వ్యాసాల గురించి" మన పాలిసీని త్వరలోనే ప్రతిపాదించి చర్చకు పెడతాను. --కాసుబాబు 07:45, 29 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]
అన్నింటికీ ఒకే సూత్రం వర్తించదు. చాలా వ్యాసాలు ఒక్కొక్కటి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. అలాంటి నిర్ణయంలో విషయప్రాధాన్యత, విస్తరణకు గల అవకాశం మొదలగువాటిని దృష్టిలో పెట్టుకోవాలి. ఉదాహరణకు సోనియా గాంధీ అన్న వ్యాసం ఒక్కలైనుతో ఉందనుకుంటే దానికి విషయప్రాధాన్యతనూ, విస్తరణకు అవకాశమూ, ఉంది కాబట్టి అలాగే ఉంచెయ్యాలి. అందుకు భిన్నంగా 1980లలో రెండు సినిమాలలో నటించిన ఒక అప్పలమ్మ గురించి ఒక వాక్యం ఉందునుకొండి, బేషుగ్గా తొలగించాలి. --వైజాసత్య 12:07, 29 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]
బాగా చెప్పారుKumarrao 16:03, 29 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

జిల్లా ప్రముఖుల వర్గాలు

[మార్చు]

జిల్లా ప్రముఖుల వర్గాలను తగిలించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి తగిలించాలి. చలం, శ్రీశ్రీ లాంటి వాళ్ళకు ఫలానా జిల్లా ప్రముఖులు అని తగిలించడం వాళ్ళ స్థాయిని తగ్గించినట్టే వాళ్ళు ఆంధ్రదేశమంతటా ప్రసిద్ధి చెందినవాళ్ళే కదా. చలం అనగానే ఫలానా జిల్లా అని గుర్తుకు రాదు. స్త్రీవాద రచయిత, తెలుగు రచయిత అని మాత్రమే గుర్తుకువస్తుంది. కాబట్టి చలం వ్యాసంలో స్త్రీవాద రచయితలు, తెలుగు రచయితలు అన్న వర్గాలు సబబు. చలం చాలా ఏళ్ళు తమిళదేశంలో నివసించాడు అలా అని ఆయన తమిళనాడు ప్రముఖుడు ఔతాడా? --వైజాసత్య 15:47, 1 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

వైజాసత్యగారు చెప్పినది నిజమే, అలాగే వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులులో సుప్రసిద్ధులు కానివారెందరో ఉన్నారు. వారివల్ల అసలైన సుప్రసిద్ధుల స్థాయి తగ్గించివేయడమే అవుతుంది. ఒక పుస్తకం వ్రాసినంతమాత్రాన, ఒక ఎన్నికలో గెచినంతమాత్రాన, ఒక పాట పాడినంతమాత్రాన, ఒక సినిమాలో నటించినంతమాత్రాన వారిని సుప్రసిద్ధులని అనలేము కదా! అలాంటప్పుడు ఈ వర్గంలోంచి తొలిగించి మహా అయితే జిల్లా ప్రముఖులు వర్గంలో చేరిస్తే సరిపోతుంది. -- C.Chandra Kanth Rao-చర్చ 18:10, 1 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

సినిమాల పంట

[మార్చు]

గత పక్షం రోజులనుండీ తెవికీలో సినిమాల పంట పండింది. మొలకలస్థాయినుండి సినిమా వ్యాసాల అభివృద్ధికి కృషిచేస్తున్న సభ్యులందరికీ అభినందనలు. కాసుబాబు గారు మరియు వీరా గార్లకు ప్రత్యేకంగా అభినందనలు. :-) అహ్మద్ నిసార్ 11:44, 4 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

నిజంగా నండీ! మారథాన్ కృషి చేస్తున్న సభ్యులందరికీ పేరు పేరునా అభినందనలు. -- రవిచంద్ర(చర్చ) 11:53, 4 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

కాలెండర్ బొమ్మలు

[మార్చు]

సామాన్యంగా అమ్మకానికి దొరికే కాలెండర్ లో ముద్రించబడిన బొమ్మలు స్కాన్ చేసి మన వికీలో చేర్చవచ్చునా. నా దగ్గర ప్రముఖ చిత్రకారుని పెయింటింగ్ లు కాలెండర్ ఉన్నది. అందులో భారతదేశంలోని ప్రముఖ ప్రదేశాలు, చార్మినార్, దిల్వారా దేవాలయం, ఖజురహో దేవాలయం మొదలైనవి ఉన్నాయి. ఇలాగే మాకు మెడికల్ కంపెనీలు ముద్రించి ఇచ్చిన కాంప్లిమెంట్ కాలెండర్ ల మీద అంతర్జాతీయ ప్రాముఖ్యమున్న చిత్రకారుల పెయింటింగ్స్ ఉంటాయి. కాపీ హక్కుల ఉల్లంఘన కాకపోతే వీటిని మనం చాలా బాగా సంబంధిత వ్యాసాలలో ఉపయోగించుకోవచ్చును. ఈ విషయాల్ని కొంచెం వివరించండి.Rajasekhar1961 08:51, 6 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఒక్క ముక్కలో చెప్పాలంటే చేర్చకూడదు. మరోమారు పరిశీలిస్తాను --కాసుబాబు 12:05, 6 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
అంతే కాకుండా అనేక ప్రముఖ ప్రదేశాలు (దిల్వారా, ఖజురహోలతో సహా) ఆంగ్ల వికీలో లేదా కామన్స్‌లో ఉచిత లైసెన్సు బొమ్మలున్నాయి. అలాగే చిత్రకారుల చిత్రాలు కూడా. వాటిని వాడడమే సబబు. --కాసుబాబు 18:35, 6 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]


సినిమా వ్యాసాల విస్తరణకు సహకరించండి.

[మార్చు]

సభ్యులందరికీ ఒక విన్నపం. కొన్ని సినిమా వ్యాసాలనైనా పెంచగలిగితే క్రొత్తగా చేరేవారికి అవి మార్గదర్శకంగా ఉంటాయని భావిస్తున్నాను. ఆసక్తి ఉన్న సభ్యులు సినిమా వ్యాసాలను విస్తరించడంలో సహకరించమని కోరుతున్నాను. ఇందుకు ఉపయోగపడే కొంత సమాచారం క్రింది లింకులలో లభిస్తుంది చూడండి.

దయచేసి జూన్ నెలను సినిమా వ్యాసాల విస్తరణ మాసంగా పరిగణించండి. ఎందుకంటే వేలలో ఉన్న సినిమా పేజీలలో కనీసం ఒక వందయినా గాని "వ్యాసాలు"గా పరిగణించబడే స్థాయికి తీసికొని రావాలి. జూలై నెలలో ఈ వ్యాసాలను పరిశీలించిన తరువాత "విస్తరణకు తక్కువ అవకాశం ఉన్న, మరియు తక్కువ ప్రాముఖ్యత ఉన్న" కొన్ని సినిమా పేజీలను తొలగించాలని ఇంతకు ముందు ప్రతిపాదించాను. సభ్యుల అభిప్రాయాలు కూడా ఆ చర్యను సమర్ధించాయని భావిస్తున్నాను --కాసుబాబు 12:31, 6 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

మొత్తం సినిమా పేజీల్లో 146 రెండు కేబీలకంటే పెద్దవి ఉన్నాయి. పూర్తి గణాంకాల కోసం వికీపీడియా:తెలుగు సినిమా గణాంకాలు చూడండి --వైజాసత్య 06:04, 8 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
నాకు ఇంకొక పక్షం రోజుల వ్యవధి ఇస్తే, నేను కనీసం 20 సినిమా వ్యాసాలను పూర్తిగా రాయగలను. నేను రాద్దామను అనుకుంటున్నవి: స్వాతి, స్వాతి కిరణం, శారద, స్వరాభిషేకం, లక్ష్మి (కొత్తది), రెండు జళ్ళ సీత, నాలుగు స్తంభాలాట, వివాహ భోజనంబు, దక్ష యజ్ణం. మిగతావి చూడాలి. బాపు, కె.విస్వనాధ్, జంధ్యాల, వీరివి ఎక్కువ తెలుసు. కిరణ్మయీ 20:15, 1 జూలై 2009 (UT

మీకు వీలైతే స్రవంతి సినిమా గురింఛి రాయగలరు. {[వాడుకరి: కాశీవిశ్వేశ్వరి}]

)

ప్రభుత్వ పధకాలు

[మార్చు]

కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పధకాలు, వాటి వివరాలు ప్రజలందరికీ తెలియజేస్తే బాగుంటుందని జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ప్రారంభించాను. ప్రభుత్వ వెబ్ సైటులో వివరాలున్నాయి. సర్వ శిక్షా అభియాన్ లో మంచి సమాచారం ఉన్నది. ఇలా ప్రభుత్వ పధాకాల గురించి తెలియజేసే వీటిని దయచేసి అభివృద్ధి చేయడానికి సహకరించమని మనవిచేస్తున్నాను.Rajasekhar1961 16:23, 12 జూన్ 2009 (UTC) మీకు వీలైతె స్రవంతి సినిమా గురింఛి రాయగలరు. కాశీవిశ్వేశ్వరి.[ప్రత్యుత్తరం]

గ్రామాల వ్యాసాలు

[మార్చు]

జిల్లా, మండలము తెలుప కుండా అనేక గ్రామాల వ్యాసాలు వున్నాయి. వాటిని గుర్తించాలంటే చాలా కష్టంగా వున్నది. వీటన్నిటినీ ఒక చోట చేర్చాలంటే వీటి కొరకు ఒక మూస అవసరం అని భావిస్తున్నాను. అహ్మద్ నిసార్ 11:13, 19 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త సభ్యులు కొందరు ఇలాంటి వ్యాసాలను ప్రారంభించారు. నా గ్రామం/మా గ్రామం సుందరమైనది, మనోహరమైనది అంటూ వారికి తోచినదేదో చేర్చారు. "వారి" గ్రామాలు ఇదివరకు తెవికీలో ఉండవచ్చు కూడా. వీటికై మనం శ్రమ తీసుకునే అవసరం లేదనుకుంటా. ఈ వ్యాసాలలో అంత ప్రాధాన్యత కలిగిన వాక్యాలు కూడా లేవు. కాబట్టి తొలిగించడమే మంచిది. -- C.Chandra Kanth Rao-చర్చ 19:33, 23 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

మొలకల జాబితా

[మార్చు]

ఒకటి లేదా రెండు వాక్యాలున్న వ్యాసాలను ఒక పట్టు పడదామని వెతుకుతుంటే అందులో నాలుగు కే.బీ లకు పైబడిన వ్యాసాలు, 250 అక్షరాలపై బడిన వ్యాసాలు కూడా ఉన్నాయి. (ఉదాహరణకు మహానటి సావిత్రి,) అందుకనే ఇంత చర్చ జరిగినా మొలక ప్రమాణాలేవో నాకు అర్థం కావడం లేదు. ఇది మొలకల జాబితాను తయారు చేసిన బాటులో సమస్యా లేక 4 కె.బి పై ఉన్న వ్యాసాలు కూడా మొలకలయ్యే అవకాశం ఉందా అన్నది అంతుబట్టడం లేదు. నేను ఇది వరకు మరీ చిన్నవి గా ఉన్న కొన్ని వ్యాసాల్ని తీసుకుని మొలక స్థాయిని దాటేటట్లుగా కొంచెం అభివృద్ధి పరచాను. కానీ జాబితాను తాజాకరించాక అదే వ్యాసాలు ఇంకా మొలకలుగానే కనిపిస్తున్నాయి. దీనివల్ల మరీచిన్న వ్యాసాలు మరుగున పడిపోతున్నాయని నా అభిప్రాయం. ఈ విషయంలో ఇతర సభ్యుల అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నాను. -- రవిచంద్ర(చర్చ) 06:57, 23 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

పైన ఒక చర్చలో నేను చెప్పినట్టు మొలకల జాబితా విషయంలో రెండు కేబీలకంటే చిన్న వ్యాసాలు మొలకలుగా పరిగణించబడినవి. ఈ రెండు కేబీలుకూడా ఆ పేజీ సైజు కాదు అందులోని సమాచారం నిడివి అని గమనించాలి. వ్యాసం చరిత్రలో కనిపించే అంకెలు కేవలం పేజీ పరిమాణాన్ని సూచిస్తాయి. పైన మీరు ఉదహరించిన సావిత్రి వ్యాసంలో 1.7 కేబీల సమాచారం మాత్రమే ఉంది --వైజాసత్య 17:15, 23 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
పేజీ మొత్తం సైజు చూడాలంటే చరితం చూస్తున్నాం. అందులో సమాచారం సైజు మాత్రం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఏదైనా సులభ పద్దతి ఉందా? -- రవిచంద్ర(చర్చ) 17:25, 23 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
మొలకలని చెప్పడానికి అవి మన విచక్షణ పైనే ఆధారపడి ఉంటాయి. మొలక అంటే చిన్న వ్యాసం అని మాత్రం చెప్పవచ్చు కాని ఖచ్చితమైన నిర్వచనం దీనికి లేదు. 2 కె.బి.లని మనం చెప్పుకుంటున్నాం కాని దీనికి ఇంత నిడివి ఉండాలని చెప్పే అవకాశం మాత్రం లేదు. వ్యాసం యొక్క స్థాయి, విస్తరణకు కల అవకాశం, వ్యాసం ప్రాధాన్యత తదితర పరిస్థితులపై ఇది ఆధారపడి ఉంటుంది. వృక్షశాస్త్రం ప్రకారం అన్ని మొలకలు వృక్షాలు కానట్లే ఇక్కడ కూడా అన్ని తెవికి మొలకలు విశేషవ్యాసాలుగా మారవు. కాబట్టి అంతగా ప్రాధాన్యత లేని, విస్తరించడానికి అవకాశం లేని వాటికి మొలక మూస పెట్టే అవసరం లేదు. ఇదే విషయమై ఆంగ్లవికీలో సభ్యుడు గ్రుట్‌నెస్ తన సభ్యపేజీ ఉపపేజీలో క్రాగ్‌టన్-లండన్ నియమం చక్కగా వివరించాడు. ఇక 4 కె.బి.ల వ్యాసం 1.3 కె.బి.లే ఎందుకొస్తుందనే విషయానికి వస్తే వ్యాసంసైజును నిర్ణయించేటప్పుడు HTML ట్యాగులు, బయటి లింకులు, రెపరెన్సులు, బొమ్మలు, ఇన్పోబాక్సులు తదితర అక్షరాలు లెక్కలోకి తీసుకోదు. అంటే చదవగలిగే అక్షరాలే సమాచారం సైజు లోకి చేరతాయి. ఇవన్నీ కొద్దిగే కదా, మరి అంత వ్యత్యాసం దేనికని ప్రశ్నిస్తే దానికి సమాధానం "యూనికోడ్". ఇక చివరగా సమాచారం సైజు మాత్రమే తెలుసుకోవడానికి సులభమైన మార్గమేదీ లేదనుకుంటా, బాటు ద్వారా మాత్రం తెలుసుకోవచ్చు. -- C.Chandra Kanth Rao-చర్చ 19:27, 23 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
చంద్రకాంతరావు గారన్నది నిజమే. ఆంగ్ల వికీలో సైజుతో నిమిత్తం లేకుండా కొన్ని నియమాలను అనుసరించి మొలక ముద్రను వేస్తుంటారు. ప్రస్తుతానికి ఇంకా మనమంత స్థాయికి చేరుకోలేదు కాబట్టి మొదటి మెట్టుగా అన్నింటినీ కనీసం రెండు కేబీలు దాటించాలనుకున్నాం. ఇక దాని సమాచారం సైజు ఎలా తెలుసుకోవాలంటే. బాటు ద్వారా తెలుసుకోవచ్చు. కానీ నేను సులువుగా ఉపయోగించే పద్ధతి వికీపీడియా:ముంజేతి కంకణం. దీన్ని స్థాపించుకోవటానికి మీ వ్యక్తిగత monobook.js పేజీ ఒకటి ప్రారంభించి అందులో importScript('User:Lupin/popups.js'); వ్రాసి భద్రపరచాలి. ఒకమారు రిఫ్రెష్ చెయ్యాలి. ఇక ఈ ముంజేతి కంకణం పనిచెయ్యటం ప్రారంభించగానే ఏదైనా వ్యాసం లింకుపై మౌస్ ను నిలపగానే ఒక పాపప్ వచ్చి ఆ వ్యాసంలో సమాచారం సైజుతో సహా దాని గురించి వివరాలు అందిస్తుంది --వైజాసత్య 03:51, 24 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
ముంజేతి కంకణం గురించి మరింత సవివరంగా ఆంగ్ల వికీ వ్యాసంలో చూడండి --వైజాసత్య 04:00, 24 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
ముంజేతి కంకణాన్ని నేను ఇదివరకే ఇన్‌స్టాల్ చేసుకుని ఉన్నాను. నాకిప్పుడు అసలు సమాచారం సైజు కనబడుతోంది. నా సందేహం తీర్చినందుకు ధన్యవాదాలు. రవిచంద్ర(చర్చ) 04:44, 24 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ మొలకల జాబితాలో 1.5 కేబీలు దాటిన వాటిని గుర్తించి ఒక జాబితా తయారుచేస్తాను. అరకేబీ అంటే రెండు, మూడు వాక్యాలు వ్రాస్తే అవి రెండు కేబీలు దాటతాయి :-) --వైజాసత్య 01:32, 25 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ ఆలోచన బహు చక్కగా ఉంది. ఇలాంటి వ్యాసాలను తొందరగా సరిహద్దు దాటించవచ్చు. — రవిచంద్ర(చర్చ) 04:24, 25 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
జాబితా వికీపీడియా:మొలకల జాబితా/1.5 లో తయారైంది. ఒకటిన్నర, రెండు కేబీల మధ్యన 793 ఉన్నవి వైజాసత్య 05:51, 25 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఇంకొక ఆలోచన

[మార్చు]

తెవికీ నాణ్యతను పెంచడానికి ప్రతి ఒక్క సభ్యులూ నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఓ వారానికోసారో లేదా నెల కోసారో మొలకల శాతం, తెవికీ లోతు(depth) మొదలైన నాణ్యతను సూచించే కొన్ని సూచికలను అప్‌డేట్ చేస్తుంటే మరింత ప్రోత్సాహంగా ఉంటుందని నాభావన. — రవిచంద్ర(చర్చ) 04:24, 25 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

వారానికో, నెలకో ఎందుకూ, వాడుకరి:Mpradeep/tewikistats లో గణాంకాలు ఎప్పటికప్పుడు అటోమేటిగ్గా అప్డేట్ అవుతుంటాయి --వైజాసత్య 05:47, 25 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
తెవికీ వ్యాసాల లోతు 5 దాటినట్లుంది. ఆంగ్ల వికీ వాళ్ళకీ విషయం తెలియబరచి 40 వేల వ్యాసాలు దాటిన వికీల జాబితాలో తెవికీని మొదటి పేజీలో వచ్చేలా చూద్దామా? -- రవిచంద్ర(చర్చ) 06:49, 25 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
నేను ఆ జాబితా చర్చాపేజీలో ఒక సందేశాన్నుంచాను. మిగతా వాళ్ళు కూడా [ http://meta.wikimedia.org/wiki/Talk:List_of_Wikipedias#Site_link అక్కడికి] వెళ్ళి దీన్ని సమర్దించండి. -- రవిచంద్ర(చర్చ) 07:01, 25 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
నేనూ ఈ మధ్యనే ఒక ప్రయత్నం చేశాను. వాళ్లు లోతుతో పాటు మరికొన్ని అంశాలు కూడా పరిశీలిస్తున్నారు. ఇది చూడండి --వైజాసత్య 07:21, 25 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
హిందీ భాష, మణిపురి భాష లు కూడా 20k + ల విభాగంలో ఉన్నాయి. వీటి రెండింటిలో కూడా కూడా నేను యాదృచ్చిక పేజీ మీద నొక్కి చూశాను. మన వికీపీడియా కంటే చాలా చిన్నవిగా ఉన్నాయ్ వ్యాసాలు. అక్కడేమైనా రాజకీయాలు జరుగుతున్నాయేమని నా అనుమానం. :-)
ఆ జాబితాలో తగవు అనుకున్నవి డేవిడ్ కు ఎత్తిచూపితే పరిశీలించి తొలగించగలడు. నేను మరాఠీని తొలగింపజేసినట్లుగా --వైజాసత్య 21:32, 25 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
ఆ జాబితా నుంచి ఇప్పుడు హిందీ ని కూడా తొలగించారు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యిందేమిటంటే భారతీయ భాషల్లో మనదే కొంచెం బెటర్. — రవిచంద్ర(చర్చ) 10:36, 30 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఆరు నెలల ప్రాజెక్టు

[మార్చు]

పైన సభ్యులు తెలిపిన విషయాలన్నీ ఉపయోగకరమే. మీ ప్రయత్నాలను కొనసాగించండి. ఎలా చూసినా గాని, ఆంగ్లవికీ మొదటి పేజీలో ఉన్నా లేకున్నా గాని, మొత్తానికి వ్యాసాల నాణ్యత పెంచడం నిస్సందేహంగా అవుసరం. ఇది నిరంతరంగా జరగాల్సిన ప్రక్రియ కూడాను. అంతే కాకుండా వ్యాసాలు తొలగించడం అంత సులభం కాదు. కష్టపడి వ్యాసం ఎవరో ఒకరు సృష్టించి, మరొకరు చెరిపేస్తూ పోతుంటే ఎక్కడికి వెళతాము? మనముందున్న పెద్ద లక్ష్యం దృష్ట్యా సభ్యులను నేను కోరేదేమంటే

  • జూలై-డెసెంబరు ఆరు నెలల కాలాన్ని నాణ్యత మెరుగు ఉద్యమ సమయం (Quality Improvement drive period)గా పరిగణించండి.
  • ఈ సమయంలో గ్రామాల పేజీలు, సినిమాల పేజీలు విస్తరణ ప్రధాన కార్యక్రమంగా భావించండి.
  • సినిమాలు: సినిమాలకు పనికొచ్చే కొన్ని లింకులు పైన వ్రాశాను. అయినా తెలుగువారికి సినిమాల గురించి సమాచారం సేకరించడం కష్టం కాదనుకొంటాను.
  • టౌనులు: en:Category:Cities and towns in Andhra Pradesh అనే ఆంగ్ల వికీ వర్గంలో చాలా పట్టణాలకు ఒకమాదిరి సమాచారం (ఒక పేరాకు సరిపడా) ఉంది. దానిని అనువదించడం మొదలెడితే కొంత ప్రగతి సాధించగలం. ఆంగ్లంలోను, తెలుగులోను అంతర్వికీ లింకులు ఇవ్వడం మరచిపోవద్దు.
  • గ్రామాలు: ఈ ప్రాజెక్టు ముందుకు తీసికొని వెళ్ళడానికి "ప్రాక్టికల్"గా వీలయ్యే సూచనలు ఇవ్వండి. లేదా స్వయంగా అమలు చేయండి. పరిష్కారం లభింపకపోదు. ఇది మనవల్ల కాదు అని వదిలేయడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే గ్రామాల పేజీలు తుడిచివేయడమే అంతిమ నిర్ణయం అవుతుంది. ఇప్పుడు కాకుంటే మరికొంతకాలం తరువాత.

--కాసుబాబు 09:46, 25 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామాల వ్యాసాలను అన్నింటినీ అభివృద్ధి చేయడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చునని నా అభిప్రాయం. ఇది మన తెవికీ బాగా ప్రాచుర్యం పొందడం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇక్కడ నేను గమనించిన రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను.
  1. గ్రామాల వ్యాసాలు తొలగించకుండా ఉండటం: ఇతర వ్యాసాల సంఖ్య పెరుగుతున్న వీటి శాతం తగ్గిపోతుంది.అదే సమయంలో వాటిని కూడా అప్‌డేట్ చేస్తూండవచ్చు. అయితే కొంచెం ఎక్కువ కాలం పడుతుంది.
    ఒకవేళ గ్రామాల వ్యాసాలు తొలగించదలుచుకుంటే నాదొక సలహా. ప్రస్తుతం మొలకల స్థాయి దాటిన గ్రామ పేజీలన్నీ అలాగే ఉంటాయి. ఇక మొలక స్థాయిలో ఉన్న గ్రామాలకు ప్రత్యేకంగా వ్యాసం అంటూ ఉండదు. ఉన్న ఒకటీ రెండూ లైన్లు సదరు మండలానికి సంభంధించిన వ్యాసంలో ఉంటాయి. ఏదైనా ఒక మండలం వ్యాసంలో ఒక గ్రామం గురించిన సమాచారం మొలక స్థాయిని దాటినప్పుడు దాన్ని మండలం వ్యాసం నుంచి విడదీసి ప్రత్యేక వ్యాసం సృష్టించవచ్చు.
రవిచంద్ర(చర్చ) 06:48, 26 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]


రవి చెప్పేది నిజమే. గ్రామాల పేజీలను తొలగించకూడదనే నా అభిప్రాయం. మరియు కొన్ని సంవత్సరాలు కూడా అవుసరమే. కాని వీటి ప్రగతికి కొన్ని ఉత్ప్రేరకాలు చాలా అవుసరం. లేకుంటే అభివృద్ది కష్టం. మరియు లోతు గురించి పైన జరిగిన చర్చలలాగానే మనం పునఃపునః పాలిసీ సమస్యలు ఎదుర్కొంటాము. --కాసుబాబు 07:13, 26 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
గ్రామాల పేజీలు తొలగించనవసరం లేదు. ప్రస్తుతం గ్రామాల సమాచారం వెతుక్కొనే వారికి ముందుగా దొరుకుతున్న లింకు తెవికీదే. అంటే మరెక్కడా ఈ మాత్రం సమాచారం కూడా లేదనే కదా. ముందులో కంటే కూడా అప్పుడప్పుడూ కొందరు సభ్యులు వారి గ్రామాల గురించి కొద్దికొద్దిగా రాస్తున్నారు. మెల్లగా అవి పెద్ద వ్యాసాలుగా మారుతాయి. విశ్వనాధ్.బి.కె. 10:46, 26 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]


వర్గీకరణ

[మార్చు]

LocalSettings.php మరియు మొదటి పేజీ లకు ఏఏ వర్గాలలో వుంచాలో తెలియడం లేదు. అహ్మద్ నిసార్ 14:27, 26 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

IP address తోనే రాసే వారిని గమనించడం

[మార్చు]

ఆంగ్ల వికీ లో లాగా, ఇక్కడ కూడ, IP address వాడి వికీని దుష్ప్రచారానికి, తమ స్వియ భావాలకు, రచనలకు, బ్లాగులకు ప్రాముఖ్యత సంపాదించుకోవడానికి కొందరు ప్రత్నిస్తున్నట్టునిపిస్తోంది. ఇలా IP address వాడే వారి మీద నిఘా పెట్టవచ్చా? కిరణ్మయీ 14:12, 2 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

అవును మీరన్నది సరైనదే. ఇప్పటికే తెవికీ నిర్వాహకబృందం వారిపై నిఘా ఉంచింది. మీరూ అందులో భాగం కావచ్చు. ఐ.పి.అడ్రస్‌తో చేసే ప్రతి దిద్దుబాటును పరిశీలించడం, వారు చేసే అనవసర మార్పులను వెనక్కిచేయడం, అక్షరదోషాలను సవరించడం, వారుచేసే మార్పులలో అభ్యంతరం ఉంటే చర్చాపేజీలో వ్రాసి ఇతర సభ్యుల దృష్టికి తేవడం, సందేహాస్పద వాక్యాలకు {{fact}} మూస ఉంచడం ఇవన్నీ చాలా అవసరం. అయితే ఐ.పి.అడ్రస్‌తో వ్రాసే వారందరూ తెవికీకి విరుద్ధంగా ప్రవర్తించరు. అయిననూ నిఘా మాత్రం అవసరం. ఐ.పి.అడ్రస్‌తోనే కాకుండా కొత్త సభ్యుల రచనలు కూడా పరిశీలించడం అవసరం. ఇలాంటివారిపై మీరు నిఘాపెట్టాలనుకోవడం మంచి పద్దతి, మీ పని కొనసాగించండి. ఒకే వ్యాసంలో ఎవరైనా అనవసర మార్పులు అధిక దిద్దుబాట్లతో చేస్తే మాత్రం నిర్వాహకుల దృష్టికి తేవడం మంచిది. నిర్వాహకులు ఒకేఒక్క మౌజ్ క్లిక్కుతో వారి దిద్దుబాట్లన్నీ రద్దుచేయగలరు. -- C.Chandra Kanth Rao-చర్చ 19:17, 2 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]
నేను చేయగలిగినది చేస్తాను కిరణ్మయీ 20:48, 6 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

లాగ్ ఇన్ కాకుండా రాస్తే?

[మార్చు]

ఈ క్రింది మార్పులు లాగ్ ఇన్ కాకుండా చేశాను. అవి నాపేరిట రావాలంటే ఎంచెయాలి?

  1. జాతీయములు - న‎; 03:07 . . (+103) . . 117.197.209.75 (చర్చ) (→నోరుపడిపోను)
  2. (తేడాలు) (చరితం) . . జనాభా‎; 03:05 . . (+1,582) . . 117.197.209.75 (చర్చ) (→జనాభా నియంత్రణ)
  3. (తేడాలు) (చరితం) . . కొ చర్చ:దురాచారం‎; 02:58 . . (+1,542) . . 117.197.209.75 (చర్చ) (కొత్త పేజీ: *గ్రామానికి అరిష్టమని.. అమానుషం మరణించిన గర్భిణి చెట్టుకు వేలా...)
  4. (తేడాలు) (చరితం) . . మూఢనమ్మకాలు-దురాచారాలు--Nrahamthulla 03:13, 12 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]
అలా చేసిన మార్పులు మీ పేరిట వచ్చేలా చేసే అవకాశం లేదు. కానీ కొందరు తమ సభ్యుని పేజీలో అప్పుడప్పుడు ఈ ఐ.పి.చిరునామాతో కూడా మార్పులు చేశామని ఒక వాక్యం వ్రాసుకోవటం చూశాన్నేను ఆంగ్ల వికీలో --వైజాసత్య 04:53, 12 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

మూస:Infobox actor vs మూస:Infobox Actor

[మార్చు]

మూస:Infobox actor కి మూస:Infobox Actor కి తేడా ఉన్నది. ఏది ఉంచాలి? అలానే [1] కూడా ఉన్నది. నేను ఇక్కడ మార్పులు చేశాను ఇప్పటి దాకా. కిరణ్మయీ 20:52, 6 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఏదైనా పరవాలేదు. మొదటి మూస ముందుగా తయారు చేశారు. అయితే ఆంగ్ల వ్యాసాల నుంచి యధాతథంగా పెట్టెలను కాపీ చేసేవారి సౌలభ్యం కోసం రెండవ మూసను తయారు చేసినట్లున్నారు. — రవిచంద్ర(చర్చ) 05:14, 7 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]
అయితే, రెండిటినీ కలిపి వేయవచ్చా? తరువాత ఒక బాట్ సహయముతో వ్యాసాలలో కూడా మార్చవచ్చు. నేను ఆంగ్లము నుంచి మూసలని యధాతధముగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాను. కిరణ్మయీ 13:19, 7 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]
మూస:Infobox Actor ని పూర్తిగా అనువదించాను. ఆలానే, మన పురస్కారాలను కూడా కలిపాను. ఒకసారి దానిని పరీక్షించండి. కిరణ్మయీ 14:37, 7 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]
అలాగే పరిశీలిస్తాను. —రవిచంద్ర 04:48, 8 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]
నేను చేసిన మార్పులు బాగానే ఉన్నాయి అంటే, నేను దానిసి తెలుగు పేరు ఇస్తాను. ఒక బొట్ ద్వార అవసరమైన మార్పులు చెయొచ్ఛు. కిరణ్మయీ 21:18, 15 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]
Domestic Partner అనే పదం ఇంకా అనువదించినట్లు లేదు. మిగతావన్నీ బాగున్నాయి. proceed with your changes. —రవిచంద్ర (చర్చ) 04:23, 16 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]
అది తెలుగులో ఎలా రాయాలో తెలియలేదు. మన దేశంలో ఆ పద్దతి అంతగా వున్నట్టు లేదు. కిరణ్మయీ 13:06, 16 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

జీవిత భాగస్వామి అంటే బాగుంటుంది. లేదా భార్య లేదా భర్త అనైనా.Rajasekhar1961 10:56, 22 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

spouse అంటే అదే కదా? కిరణ్మయీ 13:22, 22 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]
domestic partner మన తెలుగు వికీకి అంత ముఖ్యం కాదు. తొలగిస్తేనే మంచిది.Rajasekhar1961 02:34, 23 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]
మంచి సూచన. తప్పకుండా చేస్తాను. నాకు బాట్ చేయడము వచ్చు. కానీ, దానిని ఇక్కడ నడపడానికి సహాయము కావాలి. కిరణ్మయీ 13:46, 23 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

పుస్తక సమీక్షలు

[మార్చు]

నేను తెలుగు అంతర్జాలంలో విహరిస్తుండగా పుస్తకాల మీద సమీక్ష జరిపే వెబ్‌సైటు ఒకటి తారసపడింది. ఇది జరిపే నవలల సమీక్షల్లో సంక్షిప్త కథను పొందుపరచడం జరుగుతోంది. మనం వీలుంటే వారి అనుమతిని అడిగి వాటిని తెవికీలోకి తీసుకోవచ్చని నా ఆలోచన. --రవిచంద్ర 10:28, 9 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]


వాడుకరి:Pepakayala IP: 121.246.149.26, వాడుకరి:Rajupepakayala అందరూ ఒక్కరే అనిపిస్తోంది. I feel that this is against the policies of Wiki--కిరణ్మయీ 19:48, 28 జూలై 2009 (UTC) 220.227.250.173 కూడా --కిరణ్మయీ 19:48, 28 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

సదరు వాడుకరి ఏమైనా అభ్యంతర కరమైన మార్పులు చేస్తున్నాడా? లేకపోతే కొత్త సభ్యుడు కావడం వలన ఒక్కోసారి లాగిన్ అవకుండా మార్పులు చేస్తుండవచ్చు. అయినా వేర్వేరు పేర్లతో, ఐపీ అడ్రసులతో మార్పులు చేసేవారి పట్ల అనుసరించే నిర్ధిష్ట,మైన నియమావళి ఆంగ్ల వికీ లో లాగా ఇక్కడ లేదు. చాలా మందికి తెలియదు కూడా. --రవిచంద్ర (చర్చ) 04:57, 29 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]
అభ్యంతకరమైన మార్పులు ఏమీ లేవు. తన దాడుకరి పేజీల మీద మార్పులు లేస్తున్నాడు. ఇక్కడ కూడా అలాంటి విధానం వుందేమో అని ఇక్కడ రాశాను.

మద్రాసులోని ప్రముఖ కళాశాల

[మార్చు]

ఈ Pachaiyappa's College సరైన తెలుగు పేరు తెలిసినవారు చెప్పండి. పచియప్పా, పచ్చయప్పా ఇలా వేరువేరు రకాలుగా సమాచారం ఉన్నది.Rajasekhar1961 13:39, 11 ఆగష్టు 2009 (UTC)

  • నేను చెన్నై లో విన్న ప్రకారము పచ్చయప్పా అని ఎక్కువ మంది అంటారు. కిరణ్మయి 14:11, 11 ఆగష్టు 2009 (UTC)
పచ్చయప్పా అనేదే సరైన పదమని అనుకుంటున్నాను. —రవిచంద్ర (చర్చ) 15:01, 11 ఆగష్టు 2009 (UTC)

మొదటి పేజీ లో ఈ వారపు వ్యాసం?

[మార్చు]

మొదటి పేజీ లో ఈ వారపు వ్యాసం మూస ఖాళీగా ఉండి బోసిగా ఉంది. మూస తయారయ్యే వరకు గత వారపు వ్యాసమే ఉంచితే బాగుండేది. --Gurubrahma 07:23, 21 సెప్టెంబర్ 2009 (UTC)

తాత్కాలికంగా గత వారపు వ్యాసమే ఉంచాను.-- C.Chandra Kanth Rao-చర్చ 09:02, 21 సెప్టెంబర్ 2009 (UTC)
పనుల హడావిడిలో నేను గమనించలేదు. క్షమించండి. --కాసుబాబు 10:35, 21 సెప్టెంబర్ 2009 (UTC)