Jump to content

శతభిష నక్షత్రం

వికీపీడియా నుండి
(శతభిష;జ్యోతిష్యము నుండి దారిమార్పు చెందింది)

శతభిష నక్షత్రం గుణగణాలు

[మార్చు]

ఇది రాహుగ్రహ నక్షత్రం, అధిదేవత వరుణ దేవుడు, రాక్షసగణము, జంతువు గుర్రం, రాశ్యాధిపతి శని. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి అన్ని మార్గలలో స్నెహితులు ఉంటారు కాని వీళ్ళ వలన వారు ఉపయోగాలు ఆశించరు. సహోదరీ వర్గంతో, న్యాయపరమైన చిక్కులు ఎదురౌతాయి. ఇంట్లో అనాదరణ, వ్యతిరేక వాతావరణం ఎదురౌతుంది. విద్య కొంతకాలం మందకొడిగా సాగినా క్రమంగా ఎగుమతి వ్యాపారం కలసి వస్తుంది. రవాణా వ్యాపారం కొంత కాలం కలసి వస్తుంది. సకాలంలో వివాహం జరుగుతుంది. మధ్యవర్తిగా, కమిషన్ ఏజెంటుగా, వ్యాపార వేత్తలుగా రాణిస్తారు. పురాతన ఆస్థుల వలన లాభాలు, చిక్కులు ఎదురౌతాయి. వీలునామా వలన లాభపడతారు. స్థిరమైన ఉద్యోగం, సంపాదన లేక కొంత కాలం ఇబ్బందులు ఎదురౌతాయి. శని మహర్ధశలో స్థిరత్వం సాధిస్తారు. రాజకీయ వ్యూహం ఫలిస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమిస్తారు. ఎవరికో ఒకరికి ఎప్పుడూ ఆర్థిక సహాయం చెయవలసి ఉంటుంది. జూదం వలన జీవితంలో అపశృతులు ఉంటాయి. సంతానం మంచి స్థితి సాధిస్తారు. వారి కొరకు జీవితంలో అనేక సౌఖ్యాలను త్యాగం చేస్తారు. వివాహాది శుభకార్యాలు మొండికి పడినా పట్టుదలతో వాటిని సాధిస్తారు. కోరికలు, అవసరాలు అనంతంగా ఒకదాని వెంట ఒకటి పుట్టుకు వస్తూనే ఉంటాయి అన్నది మీ విషయంలో సత్యం. ఆత్మియులతో అరమరికలు లేకుండా మెలగడం వలన మేలు జరుగుతుంది. ఇతరుల మెప్పు కొరకు అయిన వారిని దూరం చెసుకోవద్దు. ఆధ్యాత్మిక చింతన, నైతిక ధర్మం సదా కాపాడుతుంది. బాల్యం కొంత జరిగిన తరువాత సౌఖ్యంగా జరుగుతుంది. జీవితం సాధారణంగా చిక్కులు లేకుండా సాగుతుంది. జాతక చక్రంలోని గ్రహస్థితుల వలన మార్పులు సంభవం. ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ సాధారణ ఫలితాలు మాత్రమే.

నక్షత్ర వివరాలు

[మార్చు]

నక్షత్రములలో ఇది 24వ నక్షత్రము. ఈ నక్షత్రమును శతభిషము, శతభిషం అని కూడా వ్యవహరింతురు.

నక్షత్రం అధిపతి గణము జాతి జంతువు వృక్షము నాడి పక్షి అధిదేవత రాశి
శతభిష రాహువు బోధించడం స్త్రీ గుర్రం అరటి ఆది వరుణుడు కుంభం

శతభిష నక్షత్ర జాతకుల తారా ఫలాలు

[మార్చు]
తార నామం తారలు ఫలం
జన్మ తార ఆర్ద్ర, స్వాతి, శతభిష శరీరశ్రమ
సంపత్తార పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర ధన లాభం
విపత్తార పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర కార్యహాని
సంపత్తార ఆశ్లేష, జ్యేష్ట, రేవతి క్షేమం
ప్రత్యక్ తార అశ్విని, మఖ, మూల ప్రయత్న భంగం
సాధన తార భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ కార్య సిద్ధి, శుభం
నైత్య తార కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ బంధనం
మిత్ర తార రోహిణి, హస్త, శ్రవణం సుఖం
అతిమిత్ర తార మృగశిర, చిత్త, ధనిష్ఠ సుఖం, లాభం

శతభిషానక్షత్రము నవాంశ

[మార్చు]
  • 1వపాదం - ధనసురాశి.
  • 2వ పాదం - మకరరాశి.
  • 3వ పాదం - కుంభరాశి.
  • 4వ పాదం - మీనరాసి.

చిత్రమాలిక

[మార్చు]

ఇతర వనరులు

[మార్చు]