శాకుంతలం అభిజ్ఞానత
విశ్వనాథ సత్యనారాయణ రచన చేసిన సాహిత్య విమర్శ రచన శాకుంతలం అభిజ్ఞానత. కవికులగురువుగా పేరొందిన సంస్కృత నాటకకర్త కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలమనే నాటకానికి సంబంధించిన విమర్శ/వ్యాఖ్య.
రచన నేపథ్యం
[మార్చు]విశ్వనాథ సత్యనారాయణ రచించిన ఈ విమర్శన రచనాకాలము 1958-59. ఈ గ్రంథం ప్రథమ ముద్రణ 1961లో పొందింది.[1] శాకుంతలము యొక్క అభిజ్ఞానత రెండవ ముద్రణ 1970లో, మూడవ ముద్రణ 2007లోనూ పొందింది. ఆయన విమర్శ రచనలేవీ కూర్చొని వ్రాసినవి కాదు, సాహిత్య వేదికలపై ప్రసంగిస్తూండగా ఎవరో ప్రసంగపాఠాన్ని వ్రాసుకుంటే దానిని పుస్తకానికి అనువుగా విశ్వనాథ వారు కొంత సంస్కరించి ప్రచురించినవి. ఈ గ్రంథమూ ఆ కోవలోనిదే.
రచన అంశం
[మార్చు]సంస్కృత భాషలో అత్యంత సుప్రసిద్ధమైన రచనల్లో అభిజ్ఞాన శాకుంతలము ముఖ్యమైనది. మహాకవి, కవికులగురువు కాళిదాసు ఈ నాటకాన్ని రచించారు. కాళిదాసు రచించిన సుప్రసిద్ధ నాటకత్రయంలో ఇది తలమానికమైనదే కాక ఆయన మొత్తం రచనల్లోకెల్లా ప్రాచుర్యం, ప్రాధాన్యత పొందిన రచన ఇది. ఈ నేపథ్యంలో ఎందఱో వేత్తలైన రసద్రష్టలు, అలంకారికులు ఆ నాటకంలోని నిగూఢమైన విశేషాలు వివరిస్తూ వ్యాఖ్యలు చేశారు. శాకుంతలము యొక్క అభిజ్ఞానత అనే ఈ రచన కూడా ఆ సంప్రదాయంలోనిదే. శాకుంతలములో విదూషకుని పాత్రకల్పన, నిర్వహణలోని ఆంతర్యము వివరించి ఆ దృష్టితో నాటకం చదివితే మొత్తమ వినూత్నమైన విధంగా కనిపిస్తుందని కొన్ని నూత్న ప్రతిపాదనలు చేశారు.
ప్రాచుర్యం
[మార్చు]శాకుంతలము యొక్క అభిజ్ఞానత మూడు ముద్రణలు పొందింది. దీనిని ఆధారం చేసుకుని పలువురు సాహిత్యవేత్తలు అభిజ్ఞాన శాకుంతలం గురించి మరిన్ని లోతైన వ్యాఖ్యలు, విమర్శలు చేశారు.[2][3][4]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ విశ్వనాథ, పావని శాస్త్రి (2007). శాకుంతలము యొక్క అభిజ్ఞానత (ఒక్కమాట) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: శ్రీ విశ్వనాథ పబ్లికేషన్స్. p. i.
- ↑ అబ్బరాజు, మైథిలి. "సహృదయ ప్రమాణం, సంస్మరణీయ శోభ- శాకుంతలం [1]". vaakili.com/patrika. Archived from the original on 16 మార్చి 2016. Retrieved 26 October 2014.
- ↑ అబ్బరాజు, మైథిలి. "సహృదయ ప్రమాణం, సంస్మరణీయశోభ-రెండవ భాగం". వాకిలి. Retrieved 26 October 2014.
- ↑ అబ్బరాజు, మైథిలి. "సహృదయ ప్రమాణం, సంస్మరణీయశోభ-మూడవ భాగం". వాకిలి. Retrieved 26 October 2014.