ప్రభాస్: కూర్పుల మధ్య తేడాలు
ఈ వ్యాసం కి సంబంధ లేని పదం తొలిగించాను ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |

పంక్తి 137: | పంక్తి 137: | ||
,mahendra bahubali |
,mahendra bahubali |

| తెలుగు,
తమిళ్,
హిందీ |
| తెలుగు,
తమిళ్,
హిందీ
మళయాళం |

| 2017 |
| 2017 |
17:53, 30 ఏప్రిల్ 2019 నాటి కూర్పు
ఉప్పలపాటి ప్రభాస్ రాజు | |

జననం | ఉప్పలపాటి ప్రభాస్ రాజు 1979 అక్టోబరు 23 / 1979 , అక్టోబరు 23 |
ఇతర పేర్లు | డార్లింగ్ |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2002–ఇప్పటివరకు |
ఎత్తు | 6′ 2½”[1][2] |
తల్లిదండ్రులు | సూర్యనారాయణా రాజు శివ కుమారి |
ఉప్పలపాటి ప్రభాస్ రాజు ఒక తెలుగు నటుడు. ఇతడు "ప్రభాస్"గా సుపరిచితుడు. ఇతను ప్రముఖ నటుడు కృష్ణంరాజు సోదరుని కుమారుడు. ఈశ్వర్ సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రభాస్ ఆ తర్వాత వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, బాహుబలివంటి సినిమాల్లో నటించి తనకంటు తెలుగు సినీ పరిశ్రమలో ఒక స్థానం ఏర్పరుచుకున్నాడు.[3]
వ్యక్తిగత జీవితం
ప్రభాస్ ఉప్పలపాటి సూర్యనారాయణరాజు మరియు శివ కుమారి దంపతులకు 1979 అక్టోబర్ 23 తేదీన జన్మించాడు. పశ్చిమ గోదావరి జిల్లా లోని మొగల్తూరు తన కుటుంబ స్వగ్రామం. తన తల్లితండ్రులకు ఉన్న సంతానంలో రెండోవాడు. అక్టోబర్ 23, 1979 న జన్మించారు. అతనికి ఒక సోదరుడు ప్రబోధ్, మరియు ఒక చెల్లెలు ప్రగతి ఉన్నారు. ఇతను ప్రముఖ నటుడు కృష్ణంరాజు సోదరుని కుమారుడు. ప్రముఖ నటులు గొపిచంద్, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, మంచు మనోజ్ కుమార్ ప్రభాస్ కు మంచి స్నేహితులు.
సినీ జీవితం
2002లో ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ తెరంగేట్రం చేసాడు. ఈ సినిమా ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కుమార్తె శ్రీదేవికి కూడా తెలుగులో ఇది తొలి సినిమా. ఈ సినిమా విజయం సాధించినా ఆ తర్వాత 2003లో విడుదలైన రాఘవేంద్ర సినిమా పరాజయం పాలైంది. 2004లో త్రిష సరసన నటించిన వర్షం సినిమా ప్రభాస్ కు మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించింది. ఆ తర్వాత ప్రభాస్ అడవి రాముడు, చక్రం సినిమాల్లో నటించాడు. ఈ సినిమాల ద్వారా ప్రభాస్ కు నటుడిగా మంచి గుర్తింపు లభించినా పరాజయం పాలయ్యాయి. 2005లో ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ శ్రియా సరసన ఛత్రపతి సినిమాలో నటించాడు. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి ప్రభాస్ ను తెలుగులో ఒక ప్రముఖ నటుడిగా నిలబట్టింది. కానీ ఆ తర్వాత విడుదలైన పౌర్ణమి, యోగి సినిమాలు పరాజయం చెందాయి. ఆ తర్వాత ప్రభాస్ ఇలియానా సరసన పైడిపల్లి వంశీ దర్శకత్వంలో మున్నా సినిమాలో నటించాడు. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. 2008లో పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో త్రిష సరసన తన కెరియర్ లో రెండో సారి బుజ్జిగాడు సినిమాలో నటించాడు. ఈ సినిమా కూడా విజయం సాధించింది.
2009లో మెహెర్ రమేష్ దర్శకత్వంలో అనుష్క, నమితల సరసన బిల్లా సినిమాలో నటించాడు. ఒక క్రూరమైన డాన్ మరియూ అతనిలాగే ఉండే ఒక చిల్లరదొంగ పాత్రల్లో ప్రభాస్ నటించాడు. ఈ సినిమా తనకు గుర్తింపునిచ్చినా సినిమా ఓ మోస్తరుగా ఆడింది. ఆ తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విడుదలైన ఏక్ నిరంజన్ కూడా పరాజయం పాలైంది. 2010లో ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ సరసన డార్లింగ్ సినిమాలో నటించాడు. తొలిసారిగా ఒక క్లాస్ రోల్లో నటించిన ప్రభాస్ ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. 2011లో మళ్ళీ కాజల్ అగర్వాల్ తో కలిసి దశరథ్ దర్శకత్వంలో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో నటించాడు ప్రభాస్. కుటుంబ విలువల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో తాప్సీ మరో కథానాయిక. ఈ సినిమా డార్లింగ్ కంటే పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది.
2012లో రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తమన్నా, దీక్షా సేథ్ దర్శకత్వంలో రెబెల్ సినిమాలో నటించాడు ప్రభాస్. ఈ సినిమా కథ బాగున్నప్పటికి పరాజయం పాలైంది. 2013లో ప్రముఖ రచయిత కొరటాల శివ దర్శకత్వంలో మిర్చి సినిమాలో నటించాడు. ఈ సినిమాలో అనుష్క, రిచా గంగోపాధ్యాయ్ కథానాయికలు. ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకొవటంతో పాటు ప్రభాస్ ను ఒక కొత్తగా చూపించడం జరిగింది. ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో అనుష్క, రానా దగ్గుబాటి లతో కలసి బాహుబలి సినిమాలో నటించాడు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కింది. అందులో మొదటి భాగం "బాహుబలి - ది బిగినింగ్ " తెలుగు, తమిళ, మలయాళ మరియు హిందీ భాషలలో జూలై 10 న భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా విడుదలై, భారత చలనచిత్ర రంగంలో ఇంతవరకు నమోదు చేయని కలెక్షన్లను వసూలు చేసి అఖండ విజయం సాధించింది. రెండవ భాగం పనులు పూర్తి చేసుకొని 2017 ఏప్రిల్ 28న విడుదలై ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది. బాహుబలి 2 సినిమా భారతీయ సినిమా చరిత్రలో మొదటి వెయ్యి కోట్లు దాటిన చిత్రం. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సుమారు 2000 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా తో ప్రభాస్ అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. ప్రస్తుతం ప్రభాస్ 'రన్ రాజా రన్' ఫేమ్ సుజిత్ దర్శకత్వం లో సాహో అను చిత్రం లో నటిస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో కథానాయికగా శ్రద్ధా కపూర్ నటిస్తున్నారు. ఈ చిత్రం 2019 లో విడుదల కి సిద్ధంగా ఉంది.
నటించిన చిత్రాలు
సంవత్సరం | చిత్రం | పాత్ర (లు) | భాష | ఇతర విశేషాలు |

2002 | ఈశ్వర్ | ఈశ్వర్ | తెలుగు | |
2003 | రాఘవేంద్ర | రాఘవేంద్ర | తెలుగు | |
2004 | వర్షం | వెంకట్ | తెలుగు | |
2004 | అడవి రాముడు | రాము | తెలుగు | |
2005 | చక్రం | చక్రం | తెలుగు | |
2005 | ఛత్రపతి | శివాజి
ఛత్రపతి |
తెలుగు | |
2006 | పౌర్ణమి | శివకేశవ | తెలుగు | |
2007 | యోగి | ఈశ్వర్ ప్రసాద్
యోగి |
తెలుగు | |
2007 | మున్నా | మున్నా | తెలుగు | |
2008 | బుజ్జిగాడు | బుజ్జి
లింగరాజు |
తెలుగు | |
2009 | బిల్లా | బిల్లా, రంగా |
తెలుగు | |
2009 | ఏక్ నిరంజన్ | నిరంజన్
,ఛోటు |
తెలుగు | |
2010 | డార్లింగ్ | ప్రభాస్ | తెలుగు | |
2011 | మిస్టర్ పర్ఫెక్ట్ | విక్కీ | తెలుగు | |
2012 | రెబెల్ | ఋషి | తెలుగు | |
2013 | మిర్చి | జయ్ | తెలుగు | |
2015 | బాహుబలి:ద బిగినింగ్ | అమరేంద్ర బాహుబలి, శివుడు
,mahendra bahubali |
తెలుగు, తమిళ్, హిందీ మళయాళం | |
2017 | బాహుబలి 2: ది కన్ క్లూజన్ | అమరేంద్ర బాహుబలి, శివుడు,
.mahendra bahubali |
తెలుగు, తమిళ్, హిందీ |

2019 | సాహో | police | తెలుగు, హిందీ, తమిళం, మలయాళం |
అవార్డులు మరియూ పురస్కారాలు
సంవత్సరం | అవార్డ్ | క్యాటెగరీ | చిత్రం | ఫలితం |

2004 | సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ | ఉత్తమ యువ నటుడు | వర్షం | విజేత |
2004 | దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్స్ | ఉత్తమ నటుడు | వర్షం | పేర్కొనబడ్డాడు |
2005 | దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్స్ | ఉత్తమ నటుడు | ఛత్రపతి | పేర్కొనబడ్డాడు |
2009 | దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్స్ | ఉత్తమ నటుడు | ఏక్ నిరంజన్ | పేర్కొనబడ్డాడు |
2010 | సినీ"మా" అవార్డ్స్ | ఉత్తమ నటుడు - జ్యూరీ | డార్లింగ్ | విజేత |
2011 | దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్స్ | ఉత్తమ నటుడు | మిస్టర్ పర్ఫెక్ట్ | పేర్కొనబడ్డాడు |
2012 | దక్షిణ భారత అంతర్జాతీయ సినిమా అవార్డ్స్ | ఉత్తమ నటుడు | మిస్టర్ పర్ఫెక్ట్' | పేర్కొనబడ్డాడు |