తూర్పు చాళుక్యులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 43: పంక్తి 43:
==బయటి లింకులు==
==బయటి లింకులు==
<!-- inter wiki links-->
<!-- inter wiki links-->
[[ఆంధ్ర క్షత్రియులు]]


[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర]]

08:52, 8 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు


గుంటుపల్లి (కామవరపుకోట) వద్ద ఉన్న బౌద్ధ స్తూపాలు
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కాలరేఖ
చరిత్ర పూర్వ యుగము క్రీ.పూ.1500వరకు
పూర్వ యుగము క్రీ.పూ.1500-క్రీ.శ.650
మౌర్యులకు ముందు క్రీ.పూ.1500-క్రీ.పూ.322
మౌర్యులు క్రీ.పూ.322 - క్రీ.పూ. 184
శాతవాహనులు క్రీ.పూ.200 - క్రీ.త.200
కళింగులు క్రీ.పూ.180? - క్రీ.త.400?
ఇక్ష్వాకులు 210 – 300
బృహత్పలాయనులు 300 – 350
ఆనంద గోత్రీకులు 295 – 620
శాలంకాయనులు 320 – 420
విష్ణుకుండినులు 375 – 555
పల్లవులు 400 – 550
పూర్వమధ్య యుగము 650 – 1320
మహాపల్లవులు
రేనాటి చోడులు
చాళుక్యులు
రాష్ట్రకూటులు
తూర్పు చాళుక్యులు 624 – 1076
పూర్వగాంగులు 498 – 894
చాళుక్య చోళులు 980 – 1076
కాకతీయులు 750 – 1323
అర్వాచీన గాంగులు
ఉత్తరమధ్య యుగము 1320–1565
ముసునూరి నాయకులు 1333–1368
ఓఢ్ర గజపతులు 1513
రేచెర్ల పద్మనాయకులు 1368–1461
కొండవీటి రెడ్డి రాజులు 1324–1424
రాజమహేంద్రవరం రెడ్డి రాజులు 1395–1447
బహమనీ రాజ్యము
విజయనగర సామ్రాజ్యము 1336–1565
ఆధునిక యుగము 1540–1956
అరవీటి వంశము 1572–1680
పెమ్మసాని నాయకులు 1423–1740
కుతుబ్ షాహీ యుగము 1518–1687
నిజాము రాజ్యము 1742–1948
బ్రిటిషు రాజ్యము
స్వాతంత్ర్యోద్యమము 1800–1947
ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు 1912–1953
హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు 1948–1952
ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ 1953–1956
ఏకీకృత ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర 1956–2014
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర 2014-
తెలుగు సాహిత్యం
నన్నయకు ముందు
నన్నయ యుగముశివకవి యుగము
తిక్కన యుగముఎఱ్ఱన యుగము
శ్రీనాథ యుగమురాయల యుగము
దాక్షిణాత్య యుగముక్షీణ యుగము
ఆధునిక యుగము21వ శతాబ్ది
చారిత్రక నగరాలు
పిఠాపురంభట్టిప్రోలువేంగిధాన్యకటకము
కొలనుపాకఓరుగల్లువిజయపురిరాజమహేంద్రవరం
కళింగపట్నంహంపిసింహపురిహైదరాబాదు
చారిత్రక వ్యక్తులు
గణపతిదేవుడురుద్రమదేవికృష్ణదేవరాయలు
శాలివాహనుడు

తూర్పుచాళుక్యులు వేంగి రాజధానిగా 7వ శతాబ్దములో తీరాంధ్ర ప్రాంతాన్ని పాలించిన రాజవంశము.

తూర్పు చాళుక్యుల రాజ్య అవతరణ

దస్త్రం:APvillage Pedavegi 1.JPG
పెదవేగి గ్రామంలో పురావస్తు పరిశోధన త్రవ్వకాలలో బయల్పడిన శిధిలాలు

ప్రసిద్ధి గాంచిన బాదామి చాళుక్య రాజైన రెండవ పులకేసి (క్రీ.శ.608–644) తూర్పు దక్కన్ ప్రదేశాన్ని(ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా జిల్లాలను) క్రీ.శ. 616 సంవత్సరంలో, విష్ణుకుండినుని ఓడించి, తన అధీనంలోకి తీసుకొన్నాడు. రెండవ పులకేసి తన సోదరుడైన కుబ్జ విష్ణువర్ధనుడిని అక్కడ తన ప్రతినిధిగా నియమించాడు. రెండవ పులకేసి మరణించాక ఈ ప్రాంతం యొక్క ప్రాతినిధ్యం పెరిగి ఒక స్వతంత్ర వేంగి సామ్రాజ్యంగా పరిణితి చెందింది. క్రీ.శ.641-705 మధ్య తూర్పు చాళుక్య పరిపాలనలో మొదటి జయసింహ మరియు మంగి యువరాజు తప్పితే మిగతా రాజుల పరిపాలన కాలం చాల తక్కువగా ఉన్నది. తరువాతి కాలంలో కుటుంబ కలహాల వల్ల పరిపాలన మరింత క్షీణించింది. అప్పుడు రాష్ట్రకూటులు మరియు పశ్చిమ బాదామి చాళుక్యులు వేంగి సామ్రాజ్యాన్ని ఆక్రమించారు. మూడవ గుణగ విజయాదిత్యుని పాలనలో అప్పటి రాష్ట్రకూట రాజు అమోఘవర్షునితో కుదుర్చుకున్న ఒప్పందం వల్ల మూడవ విజయాదిత్యుడు రాష్ట్రకూటులకు సామంత రాజుగా ఉన్నాడు. అమోఘవర్షుడు మరణించిన తరువాత మూడవ విజయాదిత్యుడు తిరిగి స్వాతంత్ర్యం ప్రకటించుకొన్నాడు.

పరిపాలనా యంత్రాంగం

తూర్పు చాళుక్యుల పరిపాలన ప్రారంభంలో వారి రాజ్యసభ బాదామి గణతంత్ర రాజ్య సభగా ఉండేది. తరువాతి కాలంలో రాజ్యంలో సంపదలు, సైనిక సంపత్తి ఏర్పరచుకొని వేంగి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చెయ్యగలిగారు. వీరు ప్రక్క రాజులైన చోళులు, రాష్ట్రకూటులు, పల్లవులు మరియు కళ్యాణి చాళుక్యులతోను మిత్రత్వం ఉన్నా శత్రుత్వం ఉన్నా సఖ్యతగా మెలిగేవారు. తూర్పు చాళుక్య పరిపాలన యంత్రాంగం హిందూ ధర్మశాస్త్రాన్ని అనుసరించి సప్తాంగాలతో, పద్దెనిమిది శాఖలతో ఉండేది.

  1. మంత్రి
  2. పురోహితుడు
  3. సేనాపతి
  4. యువరాజు
  5. ద్వారపాలిక
  6. ప్రధాని
  7. అధ్యక్ష(విభాగానికి అధ్యక్షుడు) మొదలైనవి .

పరిపాలన ఏవిధంగా జరిగిందని వివరించడానికి ఆధారాలు లేవు. లభించిన ఆధారాల ప్రకారం విషయం, కొట్టం అనే రెండు ఉపవిభాగాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇవి కమ్మకొట్టం లేదా కమ్మనాడు మరియు బోయ కొట్టం. రాజ్యంలో దానంగా ఇవ్వబడిన కానుకలు మరియు గ్రామాల వివరాలు రాజ్యప్రకటన కాగితాలు వ్రాసేవారు తమ రికార్డులలో వ్రాసుకొనేవారు. వీటిని నియోగి కవల్లభలు అని పిలిచేవారు వాటికి కప్పం ఉండేది కాదు. ఈ మాన్యాలను శిలాశాసనాలలో పొందు పరచేవారు. మిగిలిన గ్రామాలలో కప్పాలు వసూలు చేయడం జరిగేది. వంశపారపర్యంగా వచ్చే ఆస్తి వల్ల, బయటి వారు ఆక్రమించుకోవడం వల్ల భూముల మీద తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. రాజ్యం చిన్న చిన్న విభాగాలుగా విభజించబడింది. వీటిలో ముఖ్యమైనవి ఎలమంచిలి, పిఠాపురం ముదిగొండ. ఈ విభాగాల వారిలో ముఖ్యమైన క్షత్రియ రాజులైన కోన హైహయలు, హైహేయలు, కాలచూరి, కోట,ఛాగి,పరిఛ్ఛేద, వంశజులతో తూర్పు చాళుక్యు రాజులకు వివాహ సంబంధాలు ఉండేవి. వెలనాడు, కొండ అదమటి, మొదలైన క్షత్రియులు కాని వంశాల వారితో కూడా వివాహ సంబంధాలు ఉండేవి.

సమాజం

వేంగి సామ్రాజ్యంలోని ప్రజలు అభ్యుదయ భావాలు కలిగినవారు. తూర్పు చాళుక్యుల రాజ్యం విస్తరించాక హుయాన్ త్సాంగ్ అనే చైనా యాత్రికుడు రాజ్యం అంతా తిరిగి అక్కడి ప్రజల గురించి ఉదాత్త స్వభావం కలవారని, నల్లటి ఛాయ కలిగిన వారని, కళలు అంటే అత్యంత ప్రీతి కలిగిన వారని వ్రాసుకొన్నాడు. సమాజంలోని ప్రజలు వంశ పారంపర్యంగా వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించేవారు. ముందు నిరాకరించినా బౌద్ధులు, జైనులు కూడా వర్ణాలు పాటించేవారు.చాళుక్యులు క్షత్రియ కులస్తులు.వీరు తమిళులైన చోళులను వివాహాలు చేసుకున్నారు.కాక బోయ, సరవర అనే తెగలు కూడా ఉండేవి.

చతుర్వర్ణాలు : బ్రాహ్మణులు సమాజంలో గౌరవాన్ని అనుభవించారు. వీరు శాస్త్రాలు, వేదాలలో ప్రావీణ్యత కలిగినవారు. వీరికి రాజులు భూములు, నిధులు విరాళంగా ఇచ్చేవారు. వీరు పరిపాలన యంత్రాంగంలో మంత్రుల వంటి పెద్ద పెద్ద ఉద్యోగాలు అనుభవించేవారు. కొంత మంది బ్రాహ్మణులు సైన్యంలో చేరి ఉన్నత పదవులు అనుభవించారు.

క్షత్రియులు పరిపాలనా వర్గానికి చెందిన వారు. వీరికి యుద్ధమంటే ఉన్న ప్రీతి వల్ల రెండు శతాబ్దాలపాటు యుద్ధాలు జరిగాయి.

వైశ్యులు: ఈ వర్ణానికి చెందినవారి హస్తాలలో వర్తకం అభివృద్ధి చెందింది. వీరి సంఘం చాలా శక్తి వంతమైన సంఘంగా పెనుగొండ వద్ద ఉండేది. దీనికి 17 శాఖలు ఉండేవి. సమాజ కార్యకలాపాలు చూడడానికి సమయ మంత్రి ఉండేవాడు.

శూద్రులు: ఈ వర్ణం వారు సమాజంలో అధిక సంఖ్యలో ఉండేవారు. వీరిలో మళ్ళీ వివిధ తెగలు ఉండేవి. సైన్యములో వీరికి ఉద్యోగాలు కల్పించబడేవి. ప్రతిభ చూపిన వారికి రాజ్యంలో సామంత రాజుల లేదా మాండలికుల హోదా కల్పించబడేది.

మతాలు - వాటి ఆదరణ

శాతవాహనుల కాలంలో ప్రబలంగా ఉన్న బౌద్ధ మతం చాళుక్యుల కాలానికి క్షీణించింది. బౌద్ధాశ్రమాలు నిర్మానుష్యంగా ఉండేవి. బౌద్ధ స్థూపాల వద్ద నివాసం ఏర్పాటు చేసుకొన్నవారు ఆ స్థూపాలను అంటిపెట్టుకొని ఉండేవారు. అప్పటి చైనా రాయబారి హుయాన్ త్సాంగ్ అందించిన ఆధారాల ప్రకారం 20 బౌద్ధాశ్రమాలు, ప్రతి ఆశ్రమంలోను 3000 బౌద్ధ సన్యాసులు నివసించేవారు. బౌద్ధ మతం క్షీణించినా జైనమతం ప్రజల ఆదరణ కలిగి ఉన్నది. ఈ విషయం ఆంధ్ర రాష్ట్రంలోని గ్రామాలలో శిధిలమైన విగ్రహాలు చూస్తే తెలుస్తుంది. తూర్పుచాళుక్య రాజులు జైన దేవాలయాలకు నిధులు, విరాళాలు ఇచ్చేవారని శిలాశాసనాల ఆధారంగా తెలుస్తున్నది. కుబ్జ విష్ణువర్థనుడు, మూడవ విష్ణువర్థనుడు, రెండవ అమ్మ జైన మతాన్ని ఆదరించారని తెలుస్తోంది. విమలాదిత్యుడు, మహావీరుని నియమాలను పాటించాడని తెలుస్తోంది. అప్పట్లో విజయవాడ, జెనుపాడు,పెనుగొండ, మునుగొండ ప్రసిద్ధ జైన క్షేత్రాలు. హిందూ మతం చాళుక్యుల పరిపాలన కాలంలో రాజ్య మతం. హిందూ మతంలోని రెండు విభాగాలలో వైష్ణవం కంటే శైవంకు ఆదరణ ఎక్కువగా ఉండేది. కొంతమంది రాజులు తమను తామే చక్రవర్తులుగా ప్రకటించుకొన్నారు. బౌద్ధ క్షేత్రాలు వీరి కాలంలో శైవ క్షేత్రాలుగా పరిణతి చెందాయి. తూర్పు చాళుక్య రాజులైన రెండవ విజయాదిత్యుడు, మెదటి యుద్ధమల్ల, మూడవ విజయాదిత్యుడు, మెదటి భీముడు శివాలయాలు నిర్మించడం మీద ఆసక్తి చూపారు. దేవాలయాలు దైవారాధనకే కాక నృత్యం, సంగీతం, మొదలైన కళలకు వేదికగా ఉండేవి.

సాహిత్యం

తూర్పు చాళుక్యులు తెలుగు సాహిత్యానికి తొలిపలుకులు పలికారు. తొమ్మిదో శతాబ్దం రెండవ అర్థభాగంలో రెండవ విజయాదిత్యుని పరిపాలనాకాలంలో తెలుగులో కవిత్వం ప్రారంభం అయిందని అద్దంకి, కందుకూరులలో నున్న పాండురంగ శిలాశాసనాలు చెబుతున్నాయి. ప్రఖ్యాతి గాంచి, ప్రాచుర్యంలోకి వచ్చిన సాహిత్య కార్యకలాపాలు 11వ శతాబ్దంలో కవిత్రయంలో మెదటి వాడైన నన్నయ్య మహాభారతాన్ని తెనిగించడం ప్రాంరంభించేవరకు జరగలేదు.

శిల్ప సంపద

శైవం బాగా ప్రబలి ఉన్న రోజులు కావడంచేత తూర్పు చాళుక్యులు ఎక్కువగా శివాలయాలు నిర్మించడం జరిగింది. రెండవ విజయాదిత్యుడు 108 శివాలయాలు నిర్మించాడని ప్రతీతి. యుద్ధమల్ల విజయవాడలో కార్తికేయుడి దేవాలయాన్ని నిర్మించాడు. ప్రసిద్ధి చెందిన ద్రాక్షారామంలోని దేవాలయాన్ని, సామర్లకోటలోని చాళుక్య భీమేశ్వర దేవాలయాన్ని కూడా నిర్మించాడని చెబుతారు. పశ్చిమ గోదావరి జిల్లా కలిదిండిలో రాజరాజ నరేంద్రుడు మూడు స్మారక క్షేత్రాలు ఏర్పాటు చేశాడు. తూర్పు చాళుక్యులు చోళ రాజుల, చాళుక్యుల శిల్పశైలిని అనుసరించినా, వారి శిల్పశైలి విభిన్నంగా ఉన్నది. వారి శిల్పశైలి చెప్పడానికి పంచారామాలలోనున్న దేవాలయాలు, ద్రాక్షారామంలోనున్న భీమేశ్వరాలయం, బిక్కవోలులోనున్న గోలింగేశ్వర దేవాలయం నిదర్శనాలు. బిక్కవోలు లోనున్న గోలింగేశ్వర దేవాలయంలో చెక్కబడిన అర్థనారీశ్వరుడు, శివుడు, విష్ణువు, అగ్ని, చాముండి, సూర్యుడు మొదలైన విగ్రహాలు అప్పటి శిల్పకళను చూపడానికి నిదర్శనాలు.

వనరులు

బయటి లింకులు

ఆంధ్ర క్షత్రియులు