సనత్ జయసూర్య
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | సనత్ తేరన్ జయసూర్య | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | మతారా, శ్రీలంక | 1969 జూన్ 30|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | Master Blaster, Little Dynamite, Matara Hurricane[1] Matara Mauler[2] Matara Marauder,Sanaa | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 5 అ. 7 అం. (1.70 మీ.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | Slow left arm orthodox | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 49) | 1991 ఫిబ్రవరి 22 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2007 డిసెంబరు 1 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 58) | 1989 డిసెంబరు 26 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2011 జూన్ 28 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 07 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 4) | 2006 జూన్ 15 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2011 జూన్ 25 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1994–2011 | Bloomfield | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2005 | సోమర్సెట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2007 | లాంకషైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2008 | వార్విక్‌షైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2008–2010 | ముంబై ఇండియన్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2010 | వోర్సెస్టర్‌షైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011 | Ruhuna Rhinos | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2012 | Khulna Royal Bengals | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2012 | కందురాటా Warriors | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2021 ఏప్రిల్ 15 |
1969 జూన్ 30 న జన్మించిన సనత్ జయసూర్య (Sanath Teran Jayasuriya) శ్రీలంకకు చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు.1989 నుంచి శ్రీలంక జట్టు తరఫున మంచి ఆల్‌రౌండర్ గా పేరుత్తెచ్చుకున్నాడు. వన్డే క్రికెట్ లో 12,000 పరుగులు, 300 వికెట్లు సాధించిన ఏకైక క్రికెటర్. 403 వన్డేలలో ప్రాతినిధ్యం వహించి మొత్తం 12207 పరుగులు చేసాడు. టెస్టులలో కూడా 107 మ్యాచ్‌లు ఆడి 6791 పరుగులు, 96 వికెట్లు సాధించాడు.
క్రీడా జీవితం, సాధించిన ఘనతలు
[మార్చు]1996 ప్రపంచ కప్ క్రికెట్లో శ్రీలంక విజయానికి అనేక ప్రణాళికలు వేసి కప్ ను గెలిపించిన రికార్డు జయసూర్యది. ఆ ప్రపంచ కప్ లో మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంటు అవార్డు జ్యసూర్యకే వరించింది. 1997లో విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపైకయ్యాడు. 1999 నుంచి 2003 వరకు శ్రీలంకకు 38 టెస్టు మ్యాచ్ లలో నాయకత్వం వహించాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ప్రతిభ ప్రదర్శించి మంచి ఆల్‌రౌండర్ గా పేరుతెచ్చుకున్నాడు.
340 పరుగుల ఇన్నింగ్స్ తో శ్రీలంక తరఫున టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాట్స్‌మెన్ గా జయసూర్య రికార్డు స్థాపించాడు. 1997లో భారత్ పై ఈ ఘనత సాధించాడు. ఇదే సమయంలో రెండో వికెట్ కు రోషన్ మహానామాతో కల్సి 576 పరుగుల పాట్నర్‌షిప్ రికార్డు సృష్టించాడు. ఇది టెస్ట్ క్రికెట్ లో రెండో వికెట్ కే కాదు ఏ వికెట్ కైనా అత్యధిక పరుగుల పాట్నర్‌షిప్ రికార్డుగా ఉండింది. కాని 2006లో ఈ రెండు రికార్డులు మహేలా జయవర్థనే 374 పరుగుల మహా ఇన్నింగ్స్ తో పటాపంచలై పోయాయి. దక్షిణాఫ్రికా పై మహేలా జయవర్థనే, కుమార సంగక్కరతో కల్సి సాధించిన 624 పరుగుల పాట్నర్‌షిప్ రికార్డు ప్రస్తుతం ప్రపంచ రికార్డుగా కొనసాగుతోంది.
వన్డేలో కూడా 189 పరుగులు చేసి శ్రీలంక తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రికార్డు స్థాపించాడు. అంతేకాదు ఇతను వెస్ట్‌ఇండీస్కు చెందిన వివియన్ రిచర్డ్స్తో కల్సి వన్డేలో అత్యధిక స్కోరు సాధించిన బ్యాట్స్‌మెన్ లలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. శ్రీలంక తరఫున అత్యధిక వన్డే స్కోర్లలో నలుగూ ఇతనివే కావడం గననార్హం.
వన్డే క్రికెట్ లో ప్రస్తుతం అతివేగంగా సెంచరీ సాధించిన వాడిగా (17 బంతుల్లో) రికార్డు ఇతని పేరనే ఉంది. 48 బంతుల్లో సెంచరీ సాధించి అతి వేగంగా సెంచరీ సాధించిన రికార్డు సృష్టించిననూ పాకిస్తాన్కు చెందిన షాహిద్ ఆఫ్రిది అధికమించాడు. వన్డేలలో మొత్తం 241 సిక్సర్లు సాధించి ఇందులోనే ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.వన్డేలలో 10,000 పరుగులు పూర్తిచేసిన వారిలో ప్రపంచంలో నాలుగవ బ్యాట్స్‌మెన్ కాగా శ్రీలంక తరఫున తొలి బ్యాట్స్‌మెన్. 2005లో 100 టెస్టులు పూర్తి చేసి ఈ ఘనత సాధించిన తొలి శ్రీలంక క్రికెటర్ గానూ రికార్డు నెలకొల్పాడు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఇతను ఈ ఘనత సాధించిన 33 వ క్రికెటర్. ఒకే వన్డే ఓవర్ లో 30 పరుగులు చేసి ఓవర్ లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు కూడా సృష్టించిననూ దక్షిణాఫ్రికాకు చెందిన హర్షెల్ గిబ్స్ ఒకే ఓవర్ లో 36 పరుగులు చేసి ఇతడిని అధికమించాడు.
నాట్‌వెస్ట్ ట్రోఫీలో శ్రీలంక హాలెండ్ పై 438 పరుగులు సాధించి ప్రపంచ రికార్డు స్థాపించగా అందులో 157 పరుగులను (104 బంతుల్లో ) జయసూర్య చేశాడు. వన్డేలో జయసూర్య 150 పరుగుల స్కోరును దాటడం నాల్గవ సారి. ఇందులోనూ ఇతనిదే రికార్డు. 2007 ప్రపంచ కప్ లో ఇతను 2 సెంచరీలు, 2 అర్థ సెంచరీలు సాధించాడు. 2007లో ఇంగ్లాండుతో జరిగిన కాండీ టెస్టుతో టెస్ట్ క్రికెట్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించాడు. అయిననూ వన్డే లలో కొనసాగుతున్నాడు. అతని చివరి టెస్టులో జేమ్స్ అందెర్సన్ బౌలింగ్ లో ఒకే ఓవర్ లో 6 బౌండరీలు సాధించాడు.
టెస్ట్ సెంచరీలు
[మార్చు]సనత్ జయసూర్య సాధించిన టెస్ట్ సెంచరీల వివరాలు
జయసూర్య టెస్ట్ సెంచరీలు | ||||||
---|---|---|---|---|---|---|
పరుగులు | మ్యాచ్ | ప్రత్యర్థి | నగరం/దేశం | స్టేడియం | సం. | |
[1] | 112 | 17 | ఆస్ట్రేలియా | అడిలైడ్, ఆస్ట్రేలియా | ఓవల్ | 1996 |
[2] | 113 | 23 | పాకిస్తాన్ | కొలంబో, శ్రీలంక | సింహళీస్ స్పోర్ట్స్ క్ల బ్ గ్రౌండ్ | 1997 |
[3] | 340 | 26 | భారత దేశం | కొలంబో | ప్రేమదాస స్టేడియం | 1997 |
[4] | 199 | 27 | భారత దేశం | కొలంబో | సింహళీస్ స్పోర్ట్స్ క్ల బ్ గ్రౌండ్ | 1997 |
[5] | 213 | 38 | ఇంగ్లాండు | లండన్, ఇంగ్లాండు | ఓవల్ | 1998 |
[6] | 188 | 50 | పాకిస్తాన్ | కాండీ, శ్రీలంక | అస్గిరియా స్టేడియం | 2000 |
[7] | 148 | 51 | దక్షిణాఫ్రికా | గాల్లే, శ్రీలంక | గాల్లే స్టేడియం | 2000 |
[8] | 111 | 60 | భారత దేశం | గాల్లే | గాల్లే స్టేడియం | 2001 |
[9] | 139 | 68 | జింబాబ్వే | కాండీ, శ్రీలంక | అస్గిరియా స్టేడియం | 2002 |
[10] | 145 | 74 | బంగ్లాదేశ్ | కొలంబో | ముత్తు స్టేడియం | 2002 |
[11] | 131 | 85 | ఆస్ట్రేలియా | కాండీ | అస్గిరియా స్టేడియం | 2004 |
[12] | 157 | 87 | జింబాబ్వే | హరారే, జింబాబ్వే | హరారే స్పోర్ట్స్ క్లబ్ | 2004 |
[13] | 253 | 93 | పాకిస్తాన్ | ఫైసలాబాదు, పాకిస్తాన్ | ఇక్బాల్ స్టేడియం | 2004 |
[14] | 107 | 94 | పాకిస్తాన్ | కరాచి, పాకిస్తాన్ | నేషనల్ స్టేడియం | 2004 |
వన్డే క్రికెట్ సెంచరీలు
[మార్చు]వన్డే క్రికెట్ లో సనత్ జయసూర్య చేసిన సెంచరీల వివరాలు
జయసూర్య వన్డే సెంచరీలు | ||||||
---|---|---|---|---|---|---|
పరుగులు | మ్యాచ్ | ప్రత్యర్థి | నగరం/దేశం | స్టేడియం | సం. | |
[1] | 140 | 71 | న్యూజీలాండ్ | బ్లోయెమ్‌ఫోన్టీన్, దక్షిణాఫ్రికా | స్ప్రింగ్‌బక్ పార్క్ | 1994 |
[2] | 134 | 107 | పాకిస్తాన్ | సింగపూర్ | పడాంగ్, సింగపూర్ | 1996 |
[3] | 120* | 111 | భారత దేశం | కొలంబో, శ్రీలంక | ప్రేమదాస స్టేడియం | 1996 |
[4] | 151* | 129 | భారత దేశం | ముంబాయి | వాంఖేడే స్టేడియం | 1997 |
[5] | 108 | 136 | బంగ్లాదేశ్ | కొలంబో | సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ | 1997 |
[6] | 134* | 143 | పాకిస్తాన్ | లాహోర్ | గడాఫీ స్టేడియం | 1997 |
[7] | 102 | 150 | జింబాబ్వే | కొలంబో | సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ | 1998 |
[8] | 105 | 200 | భారత దేశం | ఢాకా, బంగ్లాదేశ్ | బంగబంధు స్టేడియం | 2000 |
[9] | 189 | 217 | భారత దేశం | షార్జా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ | షార్జా స్టేడియం | 2000 |
[10] | 103 | 226 | న్యూజీలాండ్ | ఆక్లాండ్, న్యూజీలాండ్ | ఏడెన్ పార్క్ | 2001 |
[11] | 107 | 232 | న్యూజీలాండ్ | షార్జా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ | షార్జా స్టేడియం | 2001 |
[12] | 112 | 260 | ఇంగ్లాండు | లీడ్స్, ఇంగ్లాండు | హెడింగ్లీ స్టేడియం | 2002 |
[13] | 102* | 271 | పాకిస్తాన్ | కొలంబో | ప్రేమదాస స్టేడియం | 2002 |
[14] | 122 | 284 | ఆస్ట్రేలియా | సిడ్నీ, ఆస్ట్రేలియా | సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ | 2003 |
[15] | 106 | 285 | ఇంగ్లాండు | సిడ్నీ | సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ | 2003 |
[16] | 120 | 288 | న్యూజీలాండ్ | బ్లోయెమ్‌ఫోన్టీన్, దక్షిణాఫ్రికా | గుడ్‌ఇయర్ పార్క్ | 2003 |
[17] | 107* | 319 | బంగ్లాదేశ్ | కొలంబో | ప్రేమదాస స్టేడియం | 2004 |
[18] | 130 | 320 | భారత దేశం | కొలంబో | ప్రేమదాస స్టేడియం | 2004 |
[19] | 114 | 347 | ఆస్ట్రేలియా | సిడ్నీ | సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ | 2006 |
[20] | 122 | 359 | ఇంగ్లాండు | లండన్ | ఓవల్ క్రికెట్ గ్రౌండ్ | 2006 |
[21] | 152 | 362 | ఇంగ్లాండు | లీడ్స్, ఇంగ్లాండు | హెడింగ్లీ | 2006 |
[22] | 157 | 363 | నెదర్లాండ్స్ | ఆంస్టెల్వీన్, నెదర్లాండ్ | VRA గ్రౌండ్ | 2006 |
[23] | 111 | 371 | న్యూజీలాండ్ | నేపియర్, న్యూజీలాండ్ | మెక్ లీన్ పార్క్ | 2006 |
[24] | 109 | 381 | బంగ్లాదేశ్ | పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ట్రినిడాడ్ | క్వీన్స్ పార్క్ ఓవల్ | 2007 |
[25] | 115 | 384 | వెస్ట్‌ఇండీస్ | గుయానా | ప్రొవిడెన్స్ స్టేడియం | 2007 |
సాధించిన ప్రపంచ రికార్డులు
[మార్చు]- వన్డే క్రికెట్ లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన రికార్డు (17 బంతుల్లో)
- ఒకే వన్డేలో అత్యధిక సిక్సర్లు సాధించిన రికార్డు (11) పాకిస్తాక్ చెందిన ఆఫ్రిది (11) తో కల్సి సంయుక్తంగా ప్రథమ స్థానంలో
- వన్డే క్రికెట్ లో అత్యధిక సార్లు 150 పరుగులకు పైగా చేయడం (4 సార్లు)
- వన్డే క్రికెట్ లో వరుసగా రెండు సార్లు 150 పరుగులకు పైగా చేయడం
- వన్డే క్రికెట్ లో అతి వేగంగా 150 పరుగులు చేసిన రికార్డు
- వన్డే క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు
- ఒకే ఓవర్ లో రెండు సార్లు 30 పరుగులు చేసిన రికార్డు
- 400 వన్డేలు ఆడిన తొలి క్రికెటర్ గా రికార్డు.
వార్తలలో జయసూర్య
[మార్చు]ఇతని భార్య సండ్రా జయసూర్య విడాకుల కోసం 2013లో కోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని ఆమె తరపు న్యాయవాదుల వెల్లడించారు. 2013 అక్టోబరు 23 తేదిన జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని.. సాండ్రా తరపు అటార్ని అనోమా గునథిలకే తెలిపారు. త్వరలోనే జయసూర్యకు నోటిసులు జారీ చేస్తారని.. ఆతర్వాత వాదనలు ప్రారంభమవుతాయన్నారు. తన ముగ్గురు పిల్లలతోపాటు తన మెయింటెనెన్స్ కోసం 20 మిలియన్ల ఇప్పించాలని పిటిషన్ లో పేర్కొన్నట్టు అటార్ని తెలిపారు. శ్రీలంక అధ్యక్షుడు మహింద్ర రాజపక్స ప్రభుత్వంలో జయసూర్య పోస్టల్ శాఖలో డిప్యూటి మినిస్టర్ గా సేవలందిస్తున్నారు. ఏప్రిల్ 2010లో జరిగిన ఎన్నికల్లో జయస్యూర్య పార్లమెంట్ కు ఎన్నికయ్యారు.[3]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Amit, M.Shamil (13 December 2002). "Officials in comedy of errors at sporting spectacle". Sunday Times. Retrieved 28 August 2009.
- ↑ Abeysinghe, Roshan (25 April 2010). "'Matara Hurricane ' enters Parliament". Sunday Times. Retrieved 29 December 2011.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-10-28. Retrieved 2013-11-06.