సాహిత్య సురభి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సాహిత్య సురభి
కృతికర్త: విశ్వనాథ సత్యనారాయణ
సంపాదకులు: విశ్వనాథ పావని శాస్త్రి
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: సాహిత్య విమర్శ
ప్రచురణ: శ్రీ విశ్వనాథ పబ్లికేషన్స్
విడుదల: 1969

సాహిత్య సురభి పుస్తకాన్ని జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన విమర్శ గ్రంథం.

రచన నేపథ్యం[మార్చు]

సాహిత్య సురభిని గ్రంథకర్త విశ్వనాథ సత్యనారాయణ 1968-69లో వ్రాశారు. ఈ గ్రంథం 1969లో మొదటి ముద్రణ పొందింది. 2007లో గ్రంథకర్త కుమారుడు విశ్వనాథ పావనిశాస్త్రి సంపాదకత్వంలో పునర్ముద్రణ పొందింది.[1] తెలుగు వారి నిత్యవ్యవహారంలోంచి తెలుగు పద్యాలు తప్పుకుపోవడం వల్ల ఎంత చదువుకున్నవారైనా కూడా తెలుగు పద్యాలు విని, చదివి అర్థం చేసుకోలేకపోతున్నారనీ, అందుకే 300 పద్యాలు (కొన్ని శ్లోకాలు కూడా), వాటికి అర్థాలు, దాని వెనుక భావం, దానిలో విశేషార్థం వివరిస్తూ తానీ గ్రంథం రచించానని విశ్వనాథ సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ మూడువందల పద్యములు పనిపెట్టుకుని మాటిమాటికి చదువుకున్నచో, వ్రాసిన వ్యాఖ్యానములు తెలిసికొన్నచో, ప్రతివాడును సామాన్యమైన ఆంధ్రభాషావేత్త యగుని. వానిని పండితుడు అనవచ్చునని గ్రంథకర్త స్వయంగా పీఠికలో వ్రాసుకున్నారు. నేటి దేశమున మన యాంధ్రభాషా జ్ఞానమును ప్రజలలో సముద్ధరించుటకు చేసిన ప్రయత్నమిది అని పుస్తకాన్ని గురించి తెలిపారు.[2]

రచయిత గురించి[మార్చు]

ప్రధానాంశాలు[మార్చు]

ఎంపిక చేసుకున్న వివిధ పద్యాలకు, కొన్ని శ్లోకాలకు ప్రతిపదార్థ, భావ, విశేషార్థ సహిత వ్యాఖ్యానాలు అందజేశారు. మొత్తం 300 ఉన్న ఆ పద్యాలు, శ్లోకాల్లో అన్ని విధాలుగా వైవిధ్యం కలిగేలా జాగ్రత్త వహించారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. సాహిత్య సురభికి ఒక్కమాట శీర్షికన విశ్వనాథ పావనిశాస్త్రి నోట్
  2. సాహిత్య సురభికి విశ్వనాథ సత్యనారాయణ పీఠిక