Jump to content

త్రిగుణములు

వికీపీడియా నుండి
(రాజసిక(రాజసిక్) నుండి దారిమార్పు చెందింది)
రజో గుణ ప్రధాన మైన మహిషాసుర మర్థిని విగ్రహం

త్రిగుణములు అంటే భగవద్గీతలో వర్ణించిన భౌతిక ప్రకృతి యొక్క గుణాలు. ఇవి తామస లేదా తమోగుణం, రాజస లేదా రజో గుణం, సత్వ గుణం. ఈ మూడు హిందూ ధర్మశాస్త్రాలలో చెప్పబడిన ప్రధాన గుణములు. భగవద్గీతలో గుణత్రయ విభాగంలో వీటి గురించి వివరణ ఉంది.

రజో గుణం వల్ల కోరికలు, ప్రాపంచిక అభ్యున్నతి కోసం తృష్ణ జనిస్తాయి.[1] భగవద్గీత ప్రకారం సత్త్వగుణం వల్ల జ్ఞానం, రజోగుణం వల్ల మోహం, తమోగుణం వల్ల అజాగ్రత్త, అవివేకం, మరపు, పరాకు మొదలైనవి కలుగుతాయి. సత్వ గుణం కలిగిన వారు పై లోకాలకు వెళుతున్నారు. రజోగుణం కలిగిన వారు మానవ లోకంలో జన్మిస్తున్నారు. తమోగుణ ప్రవృత్తి గలవారు అథోలోకాలను వెళుతున్నారు.

రజోగుణ స్వభావం

[మార్చు]

భగవద్గీత ప్రకారం రజోగుణం అధికమైనప్పుడు మరణిస్తే కర్మయందు ఆసక్తి గలవారికి జన్మిస్తాడు. ఈ రజో గుణం వల్ల ప్రాపంచిక భోగాల మీద ఆసక్తి కలుగుతుంది. అది కోరికని, ఆసక్తిని కలుగజేసి కర్మఫలాలతో జీవుణ్ణి బంధిస్తుంది. రజోగుణం అభివృద్ధి చెందినపుడు లోభం, ప్రాపంచిన విషయాల మీద ఆసక్తి, అశాంతి కలుగుతాయి. కోరికలు తీర్చుకునే కర్మలు చేస్తారు. ఆశ ప్రధాన లక్షణంగా ఉంటుంది. [2]

తమోగుణం

[మార్చు]

అజ్ఞానంచే జనించే తమోగుణం జీవాత్మల యొక్క మోహభ్రాంతికి కారణము. ఈగుణం వల్ల సమస్త జీవరాశులు నిర్లక్ష్యము, సోమరితనంతో భ్రమకు గురవుతాయి. అజ్ఞానం, జడత్వము, నిర్లక్ష్యము, మోహము మొదలైనవి ఈ గుణంయొక్క ప్రధాన లక్షణాలు. తమోగుణ ప్రభావంతో మరణించిన వారు జంతువుల జీవరాశిలో పుడతారు.

సత్వగుణం

[మార్చు]

సత్వగుణం మిగతా రెండింటికంటే పవిత్రమైనది, క్షేమదాయకమైనది. ఈ గుణంతో చేసిన పనులు పవిత్రమైన ఫలితాలను ఇస్తాయి. సత్వగుణ ప్రధానంగా జీవించి మరణించిన వారు జ్ఞానులు ఉండే పవిత్ర లోకాలను చేరుకుంటారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Mukundananda, Swami. "Chapter 14 – Bhagavad Gita, The Song of God – Swami Mukundananda". www.holy-bhagavad-gita.org (in ఇంగ్లీష్). Retrieved 2020-01-02.
  2. Krishnamurty, Sri Malladi Venkata (2015-09-01). Bhagavadgeeta: Bhagavadgeeta by Malladi Venkta Krishna Murthy. NKG ONLINE.