అరకు లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(అరకు లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అరకు
పార్లమెంట్ నియోజకవర్గం
(భారత పార్లమెంటు కు చెందినది)
జిల్లావిశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి
ప్రాంతంఆంధ్ర ప్రదేశ్
ముఖ్యమైన పట్టణాలుపార్వతీపురం, బొబ్బిలి
నియోజకవర్గ విషయాలు
ఏర్పడిన సంవత్సరం2008
ప్రస్తుత పార్టీవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
సభ్యులు1
దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య7
ప్రస్తుత సభ్యులుకొత్తపల్లి గీత

అరకు లోక్‌సభ నియోజకవర్గం, ఆంధ్ర ప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. 2008లో నూతనంగా చేసిన నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం పార్వతీపురం లోక్‌సభ నియోజకవర్గాన్ని రద్దుచేసి, దాని స్థానంలో అరకు లోక్‌సభ నియోకవర్గాన్ని ఏర్పాటుచేశారు. ఇది ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది. ఈ నియోజకవర్గం 4 జిల్లాలలో విస్తరించి ఉంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలోని భాగాలతో పాటు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కొత్తగా ఏర్పడిన రంపచోడవరం అసెంబ్లీ సెగ్మెంట్ ఈ లోక్‌సభ నియోజకవర్గంలో కలిసింది. భౌగోళికంగా ఇది చాలా పెద్ద లోక్‌సభ నియోజకవర్గంగా పేరుగాంచింది.[1] పాలకొండ నుండి రంపచోడవరం వరకు విస్తరించి ఉన్న ఈ నియోజకవర్గం ఆ చివరి నుండి ఈ చివరికి 250 కిలోమీటర్ల పైగానే దూరం ఉంది.[2] అంతేకాకుండా ఈ నియోజకవర్గ పరిధిలోని 7 సెగ్మెంట్లకు గాను 6 సెగ్మెంట్లు ఎస్టీలకీ ఇంకా 1 సెగ్మెంట్ ఎస్సీలకీ రిజర్వ్ చేయబడ్డాయి.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు[మార్చు]

  1. పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
  2. కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
  3. పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
  4. సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
  5. అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
  6. పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
  7. చోడవరం అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)

నియోజకవర్గపు గణాంకాలు[మార్చు]

  • 2001 లెక్కల ప్రకారం జనాభా: 17,32,218 [3]
  • ఓటర్ల సంఖ్య: 11,50,713.
  • ఎస్సీ, ఎస్టీల శాతం: 7.03% మరియు 51.55%

నియోజకవర్గం నుండి గెలుపొందిన పార్లమెంటు సభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 18 అరకు (ST) కొత్తపల్లి గీత స్త్రీ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 413,191 గుమ్మిడి సంధ్యారాణి స్త్రీ తెలుగుదేశం పార్టీ 321,793
2009 18 అరకు (ST) వి.కిశోర్ చంద్రదేవ్ M INC 360458 మిడియం బాబూరావు M CPM 168014

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో అరకు లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున కురస బొజ్జయ్య, [4] ప్రజారాజ్యం పార్టీ నుండి ఎం.సింహాచలం, [5] కాంగ్రెస్ పార్టీ తరఫున వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్‌ పోటీచేశారు.[6] ఈ ఎన్నికలలో కాంగ్రేసు పార్టీ అభ్యర్థి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్‌ గెలిచి కొత్తగా ఏర్పడిన అరకు నియోకవర్గం యొక్క తొలి లోక్‌సభ సభ్యుడయ్యాడు.

2014 ఎన్నికలు[మార్చు]

ఎన్నికలలో పోటీ చేస్తున్న ప్రధాన రాజకీయపార్టీల అభ్యర్థులు[మార్చు]

ఎన్నికల గుర్తు రాజకీయ పార్టీ అభ్యర్థి పేరు
ఆమ్‌ఆద్మీ పార్టీ బి.ధనరాజు
Flag of the Indian National Congress.svg
కాంగ్రెస్ కిశోరచంద్రదేవ్
Cycle-2.jpg
తె.దే.పా గుమ్మిడి సంధ్యారాణి
CPI-M-flag.svg
సి.పి.యం మిడియం బాబూరావు
Ceiling fan.jpg
వై.కా.పా కొత్తపల్లి గీత

ఎన్నికల ఫలితాలు[మార్చు]






Circle frame.svg

2014,లోక్‌సభ ఎన్నికల ఫలితాలు

  గుమ్మిడి సంధ్యారాణి (35.38%)
  ఇతరులు (9.13%)
సార్వత్రిక ఎన్నికలు, 2014: అరకు [7]
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
వై.కా.పా కొత్తపల్లి గీత 413,191 45.42 N/A
తె.దే.పా గుమ్మిడి సంధ్యారాణి 321,793 35.38 N/A
కాంగ్రెస్ కిశోర్ చంద్రదేవ్ 52,884 5.81 -39.68
సిపిఐ(ఎం) మిడియం బాబూరావు 38,898 4.26 -16.94
స్వతంత్ర అభ్యర్ది కంగల బాలుదొర 23,251 2.55 N/A
స్వతంత్ర అభ్యర్ది చెట్టి శంకరరావు 8,951 0.98 N/A
AAP బూర్జబారికి ధనరాజు 8,569 0.94 N/A
స్వతంత్ర అభ్యర్ది సల్లంగి రత్నం 7,688 0.85 N/A
స్వతంత్ర అభ్యర్ది బిడ్డిక రామయ్య 7,587 0.83 N/A
స్వతంత్ర అభ్యర్ది ఇల్ల రామిరెడ్డి 5,692 0.63 N/A
స్వతంత్ర అభ్యర్ది వనుగు శంకరరావు 4,614 0.51 N/A
NOTA None of the above 16,532 1.82 N/A
మెజారిటీ 91,398 10.04 -14.25
మొత్తం పోలైన ఓట్లు 909,614 72.92 +5.91
కాంగ్రెస్ పై వై.కా.పా విజయం సాధించింది ఓట్ల తేడా +25.58

మూలాలు[మార్చు]

  1. సాక్షి దినపత్రిక, తేది 13-09-2008
  2. http://www.hindu.com/2009/04/02/stories/2009040256620400.htm
  3. http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=92628&subcatid=20&categoryid=3
  4. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
  5. ఈనాడు దినపత్రిక, తేది 28-03-2009
  6. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
  7. [1]