కృత్తిక నక్షత్రము

వికీపీడియా నుండి
(కృత్తిక నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

నక్షత్రములలో ఇది మూడవది.

కృత్తిక నక్షత్రము
నక్షత్రం అధిపతి గణము జాతి వృక్షం జంతువు నాడి పక్షి అధిదేవత రాశి
కృత్తిక సూర్యుడు రాక్షస పురుష బెదంబర మేక అంత్య నెమలి సూర్యుడు 1 పాదం మేషం 2,3,4 పాదాలు వృషభం

కృత్తికా నక్షత్ర జాతకుల తారా ఫలాలు

[మార్చు]
తార నామం తారలు ఫలం
జన్మ తార కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ శరీరశ్రమ
సంపత్తార రోహిణి, హస్త, శ్రవణం ధన లాభం
విపత్తార మృగశిర, చిత్త, ధనిష్ఠ కార్యహాని
క్షేమ తార ఆర్ద్ర, స్వాతి, శతభిష క్షేమం
ప్రత్యక్ తార పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర ప్రయత్న భంగం
సాధన తార పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర కార్య సిద్ధి, శుభం
నైత్య తార ఆశ్లేష, జ్యేష్ట, రేవతి బంధనం
మిత్ర తార అశ్విని, మఖ, మూల సుఖం
అతిమిత్ర తార భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ సుఖం, లాభం

కృత్తికా నక్షత్రం కొన్ని విశేషములు

[మార్చు]
  1. అంబ, దుల, నితత్ని, అభ్రయంతి, మేఘయంతి, వర్షయంతి, చపుణీక అనుఏడు నక్షత్రముల సమూహం కృత్తికా నక్షత్రం.
  2. అధిదేవత అగ్ని, పాలకుడు ప్రజాపతి, ఉత్పాదకుడు ధాత.
  3. కృత్తికా నక్షత్రంలో సోముడు, ప్రజాపతి, సోముడు, అగ్ని దేవతల కాంతులు ఉన్నాయి.

ప్రాశస్త్యము

[మార్చు]

అశ్విన్యాది నక్షత్రములలో మూడవది. ఇది ఆఱునక్షత్రముల గుంపు. ఒకప్పుడు అగ్నిదేవుఁడు సప్తఋషుల భార్యలను చూచి మోహింపఁగా అతని భార్య అగు స్వాహాదేవి, తన భర్త ఆ ఋషి భార్యలచేత శపింపఁబడును అని భయపడి వసిష్ఠుని భార్య అయిన అరుంధతి తప్ప తక్కిన ఆఱుగురి రూపములను తాను ధరించి ఆయనతో కూడెను. అంతట ఆఋషులు తమ భార్యలే అగ్నితో కూడిరి అని ఎంచి వారిని విడనాడిరి. అప్పుడు వారు తాము అట్టి అకృత్యము చేయలేదు అనియు అగ్ని భార్యయే తమరూపములను వహించెను అనియు దోషములేని తమ్ము పరిగ్రహింపవలెను అనియు ప్రార్థింపఁగా వారు అది నిజము అని తెలిసియు వారితోడిది అగు అరుంధతియొక్క రూపమును స్వాహాదేవి వహింపలేక పోయెను. అట్టి పాతివ్రత్య మహిమ వీరియందు ఉండినయెడ వీరి రూపములను మాత్రము ఎట్లు తాల్చును అని వారి ప్రార్థనమును అంగీకరింపక పోయిరి. ఆముని భార్యలనే షట్కృత్తికలు అంటారు. కొందఱు అపుడు కుమారస్వామి వీరివల్ల అగ్నికి పుట్టినట్లు వక్కాణింతురు. కొందఱు ఱెల్లునందు పుట్టిన కుమారస్వామికి ఈకృత్తికాదేవులు స్తన్యము ఇచ్చి అతనిని తమ కుమారునిఁగా చేసికొనిరి అని చెప్పుదురు. కనుకనే కుమారస్వామికి కార్తికేయుఁడు అను పేరు కలిగెను.

కృత్తికానక్షత్రము

[మార్చు]
  • 1 వ పాదము - మేష రాశి.
  • 2 వ పాదము - వృషభ రాశి.
  • 3 వ పాదము -వృషభ రాశి.
  • 4 వ పాదము - వృషభ రాశి.

కృత్తికానక్షత్ర జాతకుల గునగణాలు

[మార్చు]

కృత్తికా నక్షత్రము అగ్ని నక్షత్రము, అధిపతి సూర్యుడు, గణము రాక్షసగణము కనుక ఈ నక్షత్రజాతకులు ఆవేశపరులై ఉంటారు. అంతటా ఆధిక్యత ప్రదర్శిస్తారు. బాల్యములో మమ్చి పోషణ, పెప్పుదల ఉంటుంది. ఎపాదములో జన్మించినా బాల్యంలో ధనిక జీవితాన్ని గడుపుతారు. అధికారము ఇచ్చే చదువు, అన్యభాషల అందు నెర్పరితనము, విశేషమైన పోటీ మనతత్వము కలిగి ఉంటారు. చిన్న విషయాలకే అబద్ధాలు ఆడగలరు.వీరికి స్త్రీలతో కలిగే విభేదాల వలన జీవితంలో చెప్పుకోదగిన మార్పులు సంభవము. ఇతరుల సలహాలను సహించరు. ఇతరుల అభిప్రాయాలను గౌరవించరు. అన్నింటా అధికారము సాగించాలని వీరు చెసే ప్రయత్నము మూడు భాగాలు ఫలించినా ఒక భాగము వికటిస్తుంది. వీరు అవమానాన్ని సహించ లేరు. మంచి జీర్ణశక్తి కలిగి ఉంటారు. మధుమెహవ్యాధి ప్రమాదము పొంచి ఉంటుంది. స్వశక్తితో అస్తులు అధికముగా సంపాదిస్తారు. స్నేహానికి ప్రాణము ఇస్తారు. దానగునము ఎక్కువ. అపాత్రా దానము చేస్తారు. మధ్యవర్తిత్వం బాగా చేస్తారు. పురాతన వస్తువుల మీద మక్కువ ఎక్కువ. స్త్రీల అధిక్యత వలన కొన్ని పనులు అనుకున్నట్లు చెయ లేరు. పద్దెనుమిది ఇరవై మూడు సంవత్సరాముల అనంతరము కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా ముప్పై ఆరు నుండి నలభై ఒక్క సంవత్సరము తరువాత సమసమస్యల నుండి భయత పడి సుఖజీవితము సాగిస్తారు. ఈ నక్షత్ర జాతకులందరికీ ఇవి సాధారన ఫలితాలు అయినా జాతక చక్రము, సమయము, గ్రహస్థితి, నవంశను అనుసరించి విశేష మార్పులు ఉంటాయి.

కృత్తిక నక్షత్రమునకు అదృష్ట సంఖ్యలు, మణి, వారములు, ఫలములు

[మార్చు]
  • 3, 4, 5, 9

చిత్రమాలిక

[మార్చు]