Jump to content

కైఫియ్యత్తులు

వికీపీడియా నుండి
(గ్రామ కైఫీయ్యత్తులు నుండి దారిమార్పు చెందింది)

బ్రిటీష్ వారి ఈస్టిండియా కంపెనీ మన దేశంలో వ్యాపార ఉధ్ధేశ్యంతో సుమారు 1600 సం.లో ప్రవేశించిన తర్వాత నూట యాభై ఏళ్లకు, అంటే 1750 తర్వాత, అనేక ప్రాంతాలలో పాలనాధికారం సంపాదించింది. ఆ కాలంలో పాలనాధికారం అంటే పన్నుల వసూలు చేసుకునే అధికారం ఎపరికి ఉంటే వారు ఆ ప్రాంతాన్ని వారు పరిపాలిస్తున్నట్లుగా ఉండేది.అప్పడు పరిపాలన కేవలం పన్నులు వసూలు చేసుకోవటమే. కొద్ది కాలానికే 1767లోనే సర్వే ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసారు.దానిని బట్టి వారు భారత దేశ వనరుల అధ్యయనానికి వాళ్లు చాలా ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆ ప్రాధాన్యతలో భాగంగా గ్రామ అధ్యయనాలు జరపడంలో 1784 నుంచి 1816 మధ్య కోలిన్ మెకంజీ (1754-1821) చేసిన సర్వే వలన ఇవాళ తెలుగు సీమలో అత్యధిక భాగం కనీసం పది జిల్లాల గ్రామాల చరిత్రకు మెకంజీ తయారు చేయించిన కైఫియత్తులే ఆధారం.

కోలిన్ మెకంజీ

[మార్చు]
గ్రామ కైఫియ్యత్తులు తయారుకావటానికి మూల కారకుడు కోలిన్ మెకంజీ చిత్రం

కోలిన్ మెకంజీ ఆనాటి బ్రిటిషు యువకులందరిలాగానే ఉద్యోగం వెతుక్కుంటూ,30 సం.ముల వయసులో 1783లో భారతదేశానికి వచ్చాడు. ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగిగా చేరి, కంపెనీ సైన్యం వెంట తిరుగుతూ 1784-90 మధ్య నెల్లూరు, రాయలసీమ ప్రాంతాలలో రహదారుల, మార్గాల పటాలు తయారుచేశాడు.

ఆ నేపథ్యంలో 1790 లో అతనికి గుంటూరు సర్కారును సర్వే చేసే బాధ్యత అప్పగించారు. మెకంజీ 1790 నుంచి 1793 వరకు గుంటూరు జిల్లా ప్రాంతం మాత్రమే కాక, కృష్ణా,పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల ప్రాంతాలను, నల్లమల, ఎర్రమల కొండలను కూడ సర్వే చేశాడు. ఆ తర్వాత 1794లో పెన్నా, కృష్ణ నదుల మధ్య ఉన్న నిజాం సరిహద్దు ప్రాంతాలన్నిటిని కూడ సర్వే చేశాడు. ఆ కృషివల్ల మెకంజీ ఆ తర్వాత 1810 లో మెకంజీ 2,070 స్థానిక చరిత్రల సేకరణ చేసాడు. ఆయా గ్రామాల గురించి పాలకులకు అవసరమైన సమాచారాన్ని రాబట్టడానికి మెకంజీ ఈ స్థానిక చరిత్రలు రాయించాడు. అప్పటికి కొన్ని గ్రామాలలో భూముల గురించి, పంటల గురించి, పన్నుల గురించిన సమాచారాన్ని భద్రపరచిన కవిలె, లేదా దండ కవిలె అనే కరణీకపు చిట్టాలే ఈ కైఫియత్తులు.ఇవి చాలా వరకు ఆధారంగా నిలిచినవి. మెకంజీ కూడా ఆనాటి సమాజంలో చదువు, గ్రామం గురించి అహగాహన ఉన్న కరణాలతోనే ఎక్కువగా వారి వారి గ్రామాల గురించి ఈ స్థానిక చరిత్రలు రాయించాడు. వాటన్నిటినీ గ్రామ కైఫియత్తులు అని, మెకంజీ కైఫియత్తులు అని అంటారు. ఇవన్నీ కనీసం రెండు వందల సంవత్సరాల కింద వాడకంలో ఉన్న భాషలో, పద ప్రయోగాలతో, అదికూడ శిష్టులు రాసినవిగా ఉన్నాయి. కనుక చదవడానికి కష్టపడవలసి వచ్చినా కొంత విలువైన సమాచారం మనకు తెలుస్తుంది.ఈస్టిండియా కంపెనీ అధికార నిచ్చెనల పైపైకి ఎక్కి నాటి ప్రాంతీయ సర్వేయర్ పదవి నుండి 1816లో భారత దేశపు మొదటి సర్వేయర్ జనరల్ గా పదవి చేపట్టాడు.

గుంటూరు జిల్లా గ్రామ కైఫియ్యత్తులు.

[మార్చు]

కోలిన్ మెకంజీ  సర్వే చేసేనాటికి ప్రస్తుత గుంటూరు జిల్లాలోని  గ్రామాలు మద్రాసు ప్రెసిడెన్సీ క్రింద కృష్ణా జిల్లా పరిధిలో, గుంటూరు తాలూకా క్రింద ఉండేవి. అందువలన గుంటూరు తాలూకా కైఫియ్యత్తుల అని కూడా అంటారు. కోలిన్ మెకంజీ గుంటూరు జిల్లాలోని గ్రామాలుకు సేకరించిన సమాచార పత్రాలను “గ్రామ కైపియ్యత్తులు,(గుంటూరు తాలూకా)”  అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కైవ్స్ వారు ఐదు భాగాలుగా ముద్రించారు. 

గమనిక:ఆ కాలంలో గ్రామాలను అప్పడు వాడుకలో పిలిచే భాషలో కైఫియ్యత్తులలో పేర్కొనబడినట్లు తెలుస్తుంది. ఆ విదంగానే దిగువ గ్రామాల పేర్లు పేర్కొనబడ్డాయి.

గుంటూరు జిల్లా గ్రామ కైఫియ్యత్తులు మొదటి భాగం.

[మార్చు]

ఈ గ్రంథాన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కైవ్స్ వారు 1984లో ప్రథమ ముద్రణ గావించారు.[1]

మొదటి భాగం. జాబితా -1

[మార్చు]
వ.నెం. గ్రామ కైఫియ్యత్తు వివరం పేజి నెం. ప్రస్తుత గ్రామం పేరు మండలం
1 పాలపర్రు 33 - 37 పాలపర్రు. వాడుకలో పాలపర్తి. పెదనందిపాడు
2 పెదపణిదం 38 - 39 పణిదం సత్తెనపల్లి
3 ,4 పోతూరు, పొత్తూరు 40 - 43 పొత్తూరు గుంటూరు (రూరల్)
5 మర్రిపాలెం 44 మర్రిపాలెం యడ్లపాడు
6 ముట్నూరు 45 - 56 ముట్లూరు వట్టిచెరుకూరు
7 యనమదల 57 - 65 యనమదల ప్రత్తిపాడు
8 రావిపాడు 66 - 68 రావిపాడు పెదనందిపాడు
9 లేమల్లెపాడు 69 - 70 లేమల్లెపాడు వట్టిచెరుకూరు
10 వంగ్గిపురం 71 - 80 వంగిపురం ప్రత్తిపాడు
11 వట్టె చెర్కూరు 81 - 82 వట్టిచెరుకూరు వట్టిచెరుకూరు
12 వరగాణి 83 - 86 వరగాణి పెదనందిపాడు
13 వుంన్నవ 87 - 88 ఉన్నవ యడ్లపాడు
14 వుప్పలపాడు 89 - 94 ఉప్పలపాడు. పెదనందిపాడు
15 వెజెళ్ల 95 - 97 వేజెండ్ల చేబ్రోలు
16 సంద్దెపూడి 98 -100 సందెపూడి యడ్లపాడు
17 సుద్దపల్లి 101-103 సుద్దపల్లి చేబ్రోలు

రెండవ భాగం జాబితా

[మార్చు]
  • ఈ గ్రంథాన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కైవ్స్ వారు 1982లో ప్రథమ ముద్రణ గావించారు.[2]
వ.నెం. గ్రామ కైఫియ్యత్తు వివరం. పేజి నెం. ప్రస్తుత గ్రామం పేరు. మండలం.
1 అంన్నపర్రు 1-5 అన్నపర్రు పెదనందిపాడు
2 కారెంపూడిపాడు 6-7 కారెంపూడిపాడు వట్టిచెరుకూరు
3 కొండ జాగర్లమూడి 8 కొండజాగర్లమూడి ప్రత్తిపాడు
4 కొప్పరు 9-10 కొప్పరు పెదనందిపాడు
5 కోవెలమూడి 11-12 కోవెలమూడి వట్టిచెరుకూరు
6 గారపాడు 13 గారపాడు పెదకూరపాడు
7 గారపాడు 14-16 గారపాడు వట్టిచెరుకూరు
8 గుంటూరు 17-71 గుంటూరు గుంటూరు నగరపాలక సంస్థ.
9 గుండ్దవరం 72-74 గుండవరం చేబ్రోలు
10 గొడవర్రు 75-82 గొడవర్రు చేబ్రోలు
11 గొరిజవోలు 83-85 గొరిజవోలు నాదెండ్ట
12 చమళ్లమూడి 86-88 చెమళ్లపూడి వట్టిచెరుకూరు
13 చవడవరం 89-90 చౌడవరం గుంటూరు
14 చింత్తపల్లిపాడు 91-92 చింతపల్లిపాడు వట్టిచెరుకూరు
15 జానంచుండూరు 93-94 చుండూరు చుండూరు
16 తుల్ పాడు 95-97 తుర్లపాడు యడ్లపాడు
17 నారాకోడూరు, 98-99 నారాకోడూరు చేబ్రోలు
18 ప్రత్తిపాడు 100-115 ప్రత్తిపాడు ప్రత్తిపాడు

మూడవ భాగం జాబితా

[మార్చు]
  • ఈ గ్రంథాన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కైవ్స్ వారు 1988లో ప్రథమ ముద్రణ గావించారు.[3]
వ.నెం. గ్రామ కైఫియ్యత్తు వివరం. పేజి నెం. ప్రస్తుత గ్రామం పేరు. మండలం.
1 అప్పాపురం. (రెండు కైఫియ్యత్తులు) 1-5 అప్పాపురం కాకుమాను
2 అప్పాపురం 6-7 వి.అప్పాపురం నూజెండ్ల
2 ఆరిమండ్డ 9-11 ఆరెమండ పొన్నూరు
3 కట్టెంపూడి 12-13 కట్టెంపూడి పొన్నూరు
4 కసువుకుర్రు 14-16 కసుకర్రు పొన్నూరు
5 కాట్రపాడు 17-18 కాట్రపాడు వట్టిచెరుకూరు
6 కొండపాటూరు 19-24 కొండపాటూరు కాకుమాను
7 కొమ్మూరు 25-30 కొమ్మూరు కాకుమాను
8 కొల్నిమల్న్ 31-35 కొల్లిమర్ల కాకుమాను
9 గరికెపాడు 36-38 గరికపాడు కాకుమాను
10 జూపూడి 39-40 జూపూడి పొన్నూరు
11 దండమూడి 41-43 దండమూడి చిలకలూరిపేట
12 దండమూడి (రెండు కైఫియ్యత్తులు) 44-48 దండమూడి పొన్నూరు
13 దొప్పలపూడి 49-51 దొప్పలపూడి పొన్నూరు
14 నిడుబ్రోలు 52-56 నిడుబ్రోలు (పొన్నూరు పురపాలకసంఘం) పొన్నూరు (పురపాలకసంఘం)
15 పొన్నూరు 57-66 పొన్నూరు పొన్నూరు
15 పచ్చల తాడిపర్రు 67-71 పచ్చలతాడిపర్రు పొన్నూరు
16 పూసులూరు 72-77 పుసులూరు పెదనందిపాడు
17 పెదనందిపాడు 78-80 పెదనందిపాడు పెదనందిపాడు
18 బ్రాంహ్మణకోడూరు 81-85 బ్రాహ్మణకోడూరు పొన్నూరు
19 మన్నవ 86-90 మన్నవ పొన్నూరు
19 మామిళ్లపళ్లి 91-92 మామిళ్లపల్లి పొన్నూరు
20 మునిపల్లె 93-96 మునిపల్లె పొన్నూరు
21 ముల్లుకుదురు 97-99 ములుకుదురు పొన్నూరు
22 రేటూరి 100-104 రేటూరు కాకుమాను
23 వల్లూరు. (రెండు కఫియ్యత్తులు) 105-112 వల్లూరు కాకుమాను
25 అప్పికట్ల 113-116 అప్పికట్ల బాపట్ల
26 అల్లూరు 117-121 అల్లూరు పిట్టలవానిపాలెం
27 గుడిపూడి 122-126 గుడిపాడు క్రోసూరు
28 చంద్దవోలు 127-135 చందోలు పిట్టలవానిపాలెం
29 చుండూరు 136-141 చుండూరు చుండూరు
30 నరసాయపాలెం 142-144 నర్సాయపాలెం బాపట్ల
31 పూండ్ల 145-146 పూండ్ల బాపట్ల
32 బాపట్ల 147-158 బాపట్ల బాపట్ల
33 బుద్దాం 159-160 బుద్ధాం కర్లపాలెం
34 అంగలూరు 161 అంగలూరు ఈపూరు
35 అగ్నిగుండాల 162-163 అగ్నిగుండాల ఈపూరు
36 కల్లూరు 164-166 కల్లూరు
37 కనుమర్లపూడి 167-168 కనమర్లపూడి శావల్యపురం
38 కొచ్చర్ల 169-170 కొచ్చర్ల ఈపూరు
39 గండి గనుమల 171 గండిగనుమల బోళ్లపల్లి
40 గుంటుపల్లె 172-180
41 గుంట్లపల్లి, గంగుపల్లి, జాలకల్లు 181
42 బొల్లాపల్లి 182 బొల్లాపల్లి బొల్లాపల్లి
43 జంగ్గాలపల్లె 183-184 జంగాలపల్లి నాదెండ్ల
44 జంగ్గాలపల్లె 185-186 జంగాలపల్లె నూజెండ్ల
45 యీపూరు 187-189 ఈపూరు ఈపూరు
46 రామలాపురం 190 రావులపురం బొల్లాపల్లి
47 వడ్డెంగుంట్ల, పేరూరిపాడు, కనుమలచెర్వు. 191-192 వడ్డెంగుంట, పేరూరుపాడు, కనుమల చెరువు, బొల్లాపల్లి
47A నాయినిపాళెం 191-192 నాయినిపాలెం వినుకొండ
48 విఠంరాజుపల్లె 193-194 విత్తంరాజుపల్లె వినుకొండ
49 శానంపూడి 195-196 శానంపూడి శానంపూడి
50 శావల్యపురం 197-198 శావల్యపురం శావల్యపురం
51 సరికెండపాలెం 199-200 సరికొండపాలెం బోళ్లపల్లి
52 యింజనంపాడు 201 వింజనంపాడు వట్టిచెరుకూరు
53 యినగత్తిన్ పాడు 202
54 వొణుకుపాడు 204-205 పొనుగుపాడు ఫిరంగిపురం
55 చిన నందిపాడు 206
56 పెద చెర్కూరు 207-214
57 వేరూరు 215-219 వేలూరు చిలకలూరిపేట
58 భట్ల అన్నవరం 220 అన్నవరం పెదనందిపాడు
59 బొప్పూడి 22-226 బొప్పూడి చిలకలూరిపేట

నాలుగవ భాగం జాబితా

[మార్చు]

గుంటూరు జిల్లా గ్రామ కైపియ్యత్తుల గ్రంధం ఐదవ భాగం.

[మార్చు]

కృష్ణా జిల్లా గ్రామ కైఫియ్యత్తులు.

[మార్చు]

పశ్చిమ గోదావరి జిల్లా గ్రామ కైఫియ్యత్తులు.

[మార్చు]

విశాఖపట్నం జిల్లా గ్రామ కైఫియ్యత్తులు.

[మార్చు]

శ్రీకాకుళం జిల్లా గ్రామ కైఫియ్యత్తులు.

[మార్చు]

విజయనగరం జిల్లా గ్రామ కైఫియ్యత్తులు.

[మార్చు]

ప్రకాశం జిల్లా గ్రామ కైఫియ్యత్తులు.

[మార్చు]
  • ఈ గ్రంథాన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కైవ్స్ వారు 1988లో ప్రథమ ముద్రణ గావించారు.
  • ఈ గ్రంధంలో ఏ గ్రామాల సమాచారం పొందుపర్చబడలేదు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గ్రామ కైఫియ్యత్తులు.

[మార్చు]

కర్నూలు జిల్లా గ్రామ కైఫియ్యత్తులు.

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf". Google Docs. Retrieved 2021-07-09.
  2. "GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-AUG 1982 (VOL -2).pdf". Google Docs. Retrieved 2021-07-09.
  3. "GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf". Google Docs. Retrieved 2021-07-09.

వెలుపలి లింకులు.

[మార్చు]