Jump to content

పాచిపెంట శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

పాచిపెంట శాసనసభ నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాలోని పాత నియోజకవర్గం. 1962లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగలకు కేటాయించబడిన నియోజకవర్గంగా ఏర్పడిన పాచిపెంట శాసనసభ నియోజకవర్గం, 1967లో రద్దయ్యి సాలూరు శాసనసభ నియోజకవర్గంలో కలిసిపోయింది.[1]

ఇది గిరిజనులకు కేటాయించబడిన నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఇప్పటి పాచిపెంట, మెంటాడ, దత్తిరాజేరు మండలాలలోని కొన్ని గ్రామాలు ఉండేవి. ఈ నియోజకవర్గంలో 1962లో ఒక్కసారే అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి డిప్పల సూరిదొర, స్వతంత్ర పార్టీ నుంచి జన్ని ముత్యాలు (ప్రస్తుత కూటమి అభ్యర్థి సంధ్యారాణి తండ్రి) పోటీ పడ్డారు. ఈ స్థానంలో మొత్తం ఓట్లు 45,467 ఉండగా, ఆ ఎన్నికల్లో 19,211 ఓట్లు పోలయ్యా యి. వాటిలో 17,998 ఓట్లు చెల్లాయి. మరో 1,213 ఓట్లు చెల్లనివిగా ప్రకటించారు. ఈ ఎ న్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి డిప్పల సూరి దొరకు 8,243 ఓట్లు రాగా, స్వతంత్ర పార్టీ అభ్యర్థి జన్ని ముత్యాలుకు 5,453 ఓట్లు వచ్చాయి. 2,790 ఓట్ల మెజార్టీతో డిప్పల సూరిదొర గెలుపొందారు. 1967 ఎన్నికల నాటికి ఈ నియోజకవర్గం రద్దయింది.[2]

ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]
సంవత్సరం నియోజక వర్గం గెలిచిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
1962 పాచిపెంట డిప్పల సూరిదొర పు కాంగ్రేసు 8243 జన్ని ముత్యాలు పు స్వతంత్ర పార్టీ 5453

మూలాలు

[మార్చు]
  1. కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 6.
  2. ABN (2024-05-10). "పాచిపెంట.. అసెంబ్లీ నియోజకవర్గమే". Andhrajyothy Telugu News. Retrieved 2024-10-03.