పూర్వ ఫల్గుణి నక్షత్రము
This article needs more links to other articles to help integrate it into the encyclopedia. (అక్టోబరు 2016) |
పూర్వఫలుగుణి నక్షత్రము గుణగణాలు
[మార్చు]నక్షత్రములలో ఇది పదకొండవది. దీనికి పుబ్బ అని ఇంకొక పేరుంది. పూర్వఫల్గుణీ నక్షత్రము అధిపతి శుక్రుడు వీరికి బాల్యములో కొంత వరకు సుఖమయ జీవితము గడుస్తుంది. ఆటంకము లేకుండా విద్యాభ్యాసము కొనసాగుతుంది. రాశ్యాధిపతి సూర్యుడు, గణము మానవ గణము. లౌక్యము, అధికారము కలగలసి ప్రవర్తిస్తారు. సౌమ్యత కలిగి ఉన్నా ఇతరులకు మనసులో అయినా తల వంచరు. సమయానుకూలముగా ప్రవర్తించె కారణముగా అధికారులుగా రాణిస్తారు. ఉద్యొగ వ్యాపారాలలో ఇతరులకు తల వంచలేరు కనుక పై అధికారులతో సహకరించి మందుకు పోలేరు. సౌమ్యులే అయినా గమ్భిరత కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయాలను ఖాతరు చేయరు. ఎవరు ఎమనుకున్నా లక్ష్య పెట్టరు. సమాజానికి వ్యతిరేకులు కాదు కాని సమాజ స్పృహ ఉండదు. దానధర్మాలు, అన్నదాన సత్రములు, విద్యాదానము చేస్తారు. సివిలు కెసులను ఎదుర్కొంటారు. స్వయంకృతాపరాధము వలన తాను శ్రమిమ్చి సాధిమ్చిన దానిని వైరి వర్గానికి ధారపొస్తారు. స్నెహితుల ఉచ్చు నుండి కోమ్దరు జీవితకాలము వరకు బయట పడలేరు. బయట కనిపించె జీవితము కాక రహస్య జీవితము వెరుగా ఉంటుంది. సన్నిహితులు, కుటుంబ సభ్యులు కూడా వీరి లోపాలాను ఎదురుగా చెప్ప లేరు. ఆర్ధిక పురోగతి బాగుంటుంది. అన్య భాషలు సైతము అనర్గళంగా మాట్లాడగలరు. తమ జీవన శైలికి భిన్నముగా సమ్తానాన్ని వేరు రంగాలలో ప్రోత్సహిస్తారు. సమాజములో చురుకైన పాత్ర పోషిస్తారు. దేస విదేశాలలో పేరు తెచ్చుకుంటారు. విదేశాలలో మమ్చి పరిచయాలు ఉంటాయి. వీరి జీవితము స్నేహానికి అంకితము. వీరవిద్యలలో రాణిస్తారు.
పూర్వఫల్గుణీ నక్షత్ర వివరాలు
[మార్చు]నక్షత్రములలో ఇది పదకొండవది. దీనికి పుబ్బ అని ఇంకొక పేరుంది.
| నక్షత్రం | అధిపతి | గణము | జాతి | జంతువు | వృక్షము | నాడి | పక్షి | అధిదేవత | రాశి |
|---|---|---|---|---|---|---|---|---|---|
| పూర్వ ఫల్గుణి | శుక్రుడు | మానవ | పురుష | సింహం | మోదుగ | మధ్య | పెద్దపక్షి | భర్గుడు | సింహం |
పూర్వఫల్గుణి నక్షత్రజాతకుల తారా ఫలాలు
[మార్చు]| తార నామం | తారలు | ఫలం |
|---|---|---|
| జన్మ తార | భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ | శరీరశ్రమ |
| సంపత్తార | కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ | ధన లాభం |
| విపత్తార | రోహిణి, హస్త, శ్రవణం | కార్యహాని |
| క్షేమ తార | మృగశిర, చిత్త, ధనిష్ఠ | క్షేమం |
| ప్రత్యక్ తార | ఆర్ద్ర, స్వాతి, శతభిష | ప్రయత్న భంగం |
| సాధన తార | పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర | కార్య సిద్ధి, శుభం |
| నైత్య తార | పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర | బంధనం |
| మిత్ర తార | ఆశ్లేష, జ్యేష్ట, రేవతి | సుఖం |
| అతిమిత్ర తార | అశ్విని, మఖ, మూల | సుఖం, లాభం |
పూర్వ ఫల్గుణి నక్షత్రము నవాంశ
[మార్చు]- 1 వ పాదము - సింహరాశి.
- 2 వ పాదము - కన్యారాశి.
- 3 వ పాదము - తులారాశి.
- 4 వ పాదము - వృశ్చికరాశి.
సామెతలు
[మార్చు]పుబ్బ మాసం గురించి తెలుగు ప్రజలలో కొన్ని సామెతలు ప్రచారంలో నున్నవి.[1]
- 1. పుబ్బ ఉచ్చిచ్చి కురిసినా గుబ్బచ్చి చెట్తుక్రింది నానదు
- 2. పుబ్బ కేరళితే భూతం కేరళినట్లు
- 3. పుబ్బ రేగినా బూతు రేగినా నిలువదు
- 4. పుబ్బలో చల్లేదానికంటె దిబ్బలో చల్లేది మేలు
- 5. పుబ్బలో పుట్టెడు చల్లేకంటే దిబ్బలో మఖలో మానెడు చల్లితే మేలు
- 6. పుబ్బలో పుట్టెడు చల్లేకంటే ఆశ్లేషలో అడ్డెడు చల్లేది మేలు
- 7. పుబ్బలో పుట్టి మఖలో మాడిపోయింది
చిత్ర మాలిక
[మార్చు]-
పూర్వఫల్గుణీ నక్షత్ర వృక్షము
-
పూర్వఫల్గుణీ నక్షత్ర జంతువు
-
పూర్వఫల్గుణీ నక్షత్ర జాతి (పురుష)
-
పూర్వఫల్గుణీ నక్షత్ర పక్షి గరుడుడు.
-
పూర్వఫల్గుణీ నక్షత్ర అధిపతి శుక్రుడు.
-
పూర్వఫల్గుణీ నక్షత్ర అధిదేవత
-
పూర్వఫల్గుణీ నక్షత్ర గణము మానవగణము
మూలాలు
[మార్చు]- ↑ కృష్ణమూర్తి, పి. (1955). లోకోక్తి ముక్తావళి. తెనాలి: ది మోడరన్ పబ్లికేషన్స్. p. 125. Retrieved 13 June 2016.