వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 62

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాత చర్చ 61 | పాత చర్చ 62 | పాత చర్చ 63

alt text=2018 అక్టోబరు 3 - 2018నవంబరు 30 రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2018 అక్టోబరు 3 - 2018నవంబరు 30

మహిళా శ్రేయస్సు కోసం వికీ మహిళలు 2018

[మార్చు]

అందరికీ నమస్కారములు!
అక్టోబర్ నెలను సైన్స్ మాసంగా గుర్తించడం వలన , మహిళల ఆరోగ్య సమస్యలపై వ్యాసాలను తయారుచేయడానికి ఈ నెలపాటు పలు భాషల వికీ సముదాయాలు ఆన్లైన్ ఎడిట్-ఆ-థాన్లు నిర్వహిస్తున్నాయి. అలానే తెలుగు భాషలో కూడా వ్యాసాలను చేర్చాలని అనుకున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఉద్దెశం ఉన్నవారికి ఆహ్వానం. దీనిపై సభ్యులు స్పందించగలరు. మహిళల ఆరోగ్య సమస్యల పైన తెలుగు వికీపీడియా ద్వారా అవగాహన కలిపిస్తారని ఆసిస్తున్నాము. పోటీలో పాల్గొనాలని అనుకునే వారు ఇక్కడ "పాల్గొనేవారు" విభాగంలో మీ సంతకము చేకూర్చగలరు. --SuswethaK (చర్చ) 10:11, 3 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

సుశ్వేత గారూ, ఈ ప్రయత్నం మీరు చేపట్టినందుకు చాలా ధన్యవాదాలు. ఇది విజయవంతం కావడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా మీ బృందానికి అనువాద పాఠాల విషయంలో నా సాయం ఉంటుంది. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 17:11, 3 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

దీని అర్థం వివరించగలరు

[మార్చు]

నకాశీ చిత్ర కళ‬ పేజీని Q6960317 అనే వికీడేటా అంశానికి జోడించారు. అందులో విషయానికి సంబంధించిన డేటా ఉంది. ఇలా కొన్ని వ్యాసాలకు సంఖ్యను కేటాయిస్తున్నట్టు మెస్సేజ్ లు వస్తున్నాయి. దీని అర్థం సవివరంగా తెలిసిన వారు వివరించగలరు. ధన్యవాదములు. Bhaskaranaidu (చర్చ) 15:25, 14 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

వికీడేటా అన్నది ఎవరైనా కూర్చగలిగినా స్వేచ్ఛా విజ్ఞాన కోశం. దీనిలో మీరు రాసిన నకాశీ చిత్ర కళ అన్న వ్యాసాన్ని, ఆంగ్లంలోని సంబంధిత వ్యాసానికి కలిపారు మన వెంకటరమణ గారు, ఈ వికీడేటా సంఖ్య ద్వారా. --పవన్ సంతోష్ (చర్చ) 16:17, 14 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

సైట్ మూస పున: స్థాపనకు మద్దతు

[మార్చు]

2014లో నేను చేసిన అభ్యర్థనకు వైజాసత్య గారు స్పందించి టూల్ బార్‌లో సహాయం అన్న మెనూ పక్కన మూలాలు చేర్చడానికి Cite web, Cite news, Cite book, Cite journal అన్న నాలుగు టెంప్లేట్లతో ఉండేది. మరో రెండు, మూడేళ్ళకు అర్జున రావు గారు సైట్ వికీసోర్స్ అన్నది కూడా చేర్చారు. అయితే ఈ ఉపకరణం మాయమై కొన్ని నెలలు కావస్తున్నది. దీనిని పున: స్థాపించడానికి మనలో ప్రస్తుతానికి ఇంటర్‌ఫేస్ నిర్వాహకులు ఎవరూ లేరు. కాబట్టి స్టీవార్డుల సహకారంతో ఈ పని పూర్తిచేద్దామని భావిస్తున్నాను. దయచేసి సభ్యులు స్పందించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 21:01, 24 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

గత కొద్దిరోజులుగా తెలుగు వికీపీడియా సైటులో మార్పులు జరుగుతున్నాయి. అవి ఎవరన్నా చేస్తున్నారో, దానికదే జరుగుతున్నాయో తెలియడంలేదు. మూలాలు చేర్చండి తొలగింపు, colbegin & colend పనిచేయకపోవడం, ఇటీవలి మార్పులు పేజీలో 500ల కంటే ఎక్కువ మార్పులు చూపించకపోడం (గతంలో మునుపటి 1000 చూపించేవి) వంటి సమస్యలతోపాటు సైట్ ఇంటర్‌ఫేస్ ఇస్టానుసారంగా మారుతుంది. దీనిని సరిచేగలరు.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 07:37, 25 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రణయ్ గారూ ఇక నుంచీ ఈ సమస్య ఉండదు. నిర్వాహకుల నుంచి మీడియా వికీ మార్పుచేర్పులు చేయగల నిర్వాహక వర్గాన్ని విడదీశారు. కాబట్టి సాంకేతికంగా పూర్తి అవగాహన లేనివారు చివరకు నిర్వాహకులైనా సైట్ రూపురేఖలు పొరబాటున మార్చేందుకు వీలుండదు. ఇక మొదటి నుంచీ మనకున్న నియమాన్ని అనుసరించి ఏ మార్పు చేయాలన్నా ఇక్కడ చర్చించి, స్టీవార్డులకు చెప్తే అందుకు అనుగుణంగా వారు చేసేస్తారు. --పవన్ సంతోష్ (చర్చ) 08:01, 25 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
అలాగే పవన్ సంతోష్ గారు.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 09:15, 25 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
సైట్ ఇంటర్ ఫేస్ మార్పులు ఎవరితో చర్చించకుండా జరుగుతున్నాయా?. దీనిపై ముందు చర్చించాక జరుగుతాయా?, జరిగితే ఎక్కడ ఎలా జరుగుతాయి?. ఏ భాషకు ఆ భాషా సంభందిత వాడుకరులు చేశ్తారా లేక ఎవరైనా చేస్తారా?, దీనిపై నాకు తగిన అవగాహన లేదు. కొంచెం వివరించగలరా ?.B.K.Viswanadh (చర్చ)
సైట్ ఇంటర్‌ఫేస్ అన్నది చర్చించకుండా మార్చడానికి సిద్ధాంతపరంగా ఎప్పుడూ కుదరదు. అయితే ఇన్నాళ్ళూ నిర్వాహకులు ఎవరైనా మార్చడానికి వీలుండేది, అప్పుడు చర్చించిన మార్పులు మాత్రమే జాగ్రత్తగా చేయాల్సిన బాధ్యత వారిది. (చర్చ లేకుండా హఠాత్తుగా సైట్ వ్యాప్తంగా మార్పులు చేసిన సంఘటనలు మనకున్నాయి, ఇప్పుడు ప్రస్తావన వద్దులెండి) ఐతే నిర్వాహకులు అందరికీ సాంకేతిక అవగాహన ఉండదు కాబట్టి సమస్యాత్మకం అవుతుందనీ, ఒక్క చిన్న మార్పైనా పెద్ద సమస్య అవుతుందనీ గుర్తించినందున ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వికీమీడియాల్లో ఇంటర్‌ఫేస్ నిర్వాహకులు అన్న కొత్త వర్గాన్ని ఏర్పరిచారు. సముదాయం నిర్వాహకులను వారి అవగాహన ఆధారంగా, గతంలో పనితీరు ఆధారంగా ఎన్నుకున్నట్టే వీరిని వీరి సాంకేతిక సామర్థ్యం, చర్చించి మాత్రమే నిర్ణయాలు తీసుకునే లక్షణం ఆధారంగా ఎన్నుకోవాలి. ఆ ప్రకారమ్ముగా ఆ ఎన్నుకున్న ఇంటర్ఫేస్ నిర్వాహలకు, ఆపైన స్టీవార్డులకు మాత్రమే ఇంటర్‌ఫేస్ మార్చే వీలు ఉంటుంది ఇకపై, స్టీవార్డులైతే ఖచ్చితంగా చర్చేది అని అడుగుతారు. --పవన్ సంతోష్ (చర్చ) 05:31, 27 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు పవన్ సంతోష్ గారు B.K.Viswanadh (చర్చ)
పవన్ సంతోష్ గారు, Cite web, Cite news, Cite book, Cite journal అనే వీటి వల్ల ప్రయోజనం ఏమిటో దయచెసి వివరించగలరు. నిజానికి వీటిమీద అవగాహన అంతగా లేదు. JVRKPRASAD (చర్చ) 03:53, 28 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
గారూ, ఈ లింకు చూడండి. ఇంకోతి కొమ్మచ్చి పుస్తకాన్ని వాడి వ్యాసాన్ని అభివృద్ధి చేసినప్పుడు మనం మూలాలు ఇస్తాం కదూ. ఆ ఇచ్చే మూలాలు చక్కగా ఈ పద్ధతిలో అకడమిక్ శైలిలో రావాలంటే ఈ మూసలు వాడాలి. ఆ మూసలు అనువుగా టూల్ బార్‌లో సహాయం పక్కనే రావడానికి 2014లో నేను కోరితే వైజాసత్యగారు స్థాపించారు. ఇప్పుడు అది పోయింది. పున:స్థాపన కోసం మళ్ళీ ఈ ప్రయత్నం. --పవన్ సంతోష్ (చర్చ) 08:04, 28 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
సమ్మతి
  1. ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 09:25, 25 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
  2. B.K.Viswanadh (చర్చ)
  3. --స్వరలాసిక (చర్చ) 15:38, 25 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
  4. నిర్వాహణకు ఇలాంటి సమస్యలను గుర్తించి పరిష్కరించడం కీలకం. మీకు నా మద్దతు తెలియజేస్తున్నాను.--Rajasekhar1961 (చర్చ) 03:29, 28 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
  5. --యర్రా రామారావు (చర్చ) 03:34, 28 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
  6. --కె.వెంకటరమణచర్చ 04:28, 28 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
  7. JVRKPRASAD (చర్చ) 05:03, 28 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
  8. Palagiri (చర్చ) 05:26, 28 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యతిరేకత
వ్యాఖ్య
నిర్ణయం

ఈ అంశం చర్చకు పెట్టి 9 రోజులు కావస్తున్నది. రాసిన 8 మంది సభ్యులూ దీన్ని ఆమోదిస్తూనే రాశారు, గతంలోనూ దీని వాడకం సంవత్సరాలుగా జరిగింది. కాబట్టి దీన్ని సముదాయం ఏకాభిప్రాయంతో ఆమోదించినట్టు భావిస్తూ చర్చ ముగిస్తున్నాను. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 06:11, 2 నవంబర్ 2018 (UTC)

ఈ అంశాన్ని Indic-TechCom/Requests వద్ద నివేదించాను. అవసరార్థం Indic-TechCom/Management వద్ద తమిళ విక్షనరీలో చేస్తున్న విధంగా కొద్దిరోజుల పాటు భారతీయ సముదాయాలకు సాంకేతిక సహకారం అందిస్తున్న జయ్ ప్రకాష్ కి మన ఇంటర్ఫేస్ నిర్వాహకత్వం ఇచ్చి పైన ఈ పనితో పాటు మరికొన్ని సముదాయం పేర్కొన్న సాంకేతిక సహాయాలు స్వీకరిద్దాం. --పవన్ సంతోష్ (చర్చ) 15:30, 2 నవంబర్ 2018 (UTC)
వాడుకరి:Jayprakash12345కి పైన ఈ ప్రతిపాదనకు సమ్మతించిన వారిలోని అధికారియైన Rajasekhar1961 గారు వారం రోజుల పాటు ఇంటర్ఫేస్ నిర్వాహకత్వం ఇవ్వగలరు. సంబంధిత చర్చ ఇక్కడ చూడండి. --పవన్ సంతోష్ (చర్చ) 16:11, 2 నవంబర్ 2018 (UTC)
Please ping me once someone grant me Interface-admin rights :)--Jayprakash12345 (చర్చ) 10:33, 4 నవంబర్ 2018 (UTC)
దయచేసి అధికారి హోదా కలిగిన వాడుకరి:Rajasekhar1961, వాడుకరి:Chaduvari, వాడుకరి:Arjunaraocల్లో ఎవరో ఒకరు జయప్రకాష్ కు ఓ వారంరోజుల పాటు ఇంటర్ఫేస్ నిర్వాహకత్వ హక్కులు ఇచ్చి, ఇక్కడ అతన్ని పింగ్ చేస్తూ రాయండి. --పవన్ సంతోష్ (చర్చ) 05:18, 6 నవంబర్ 2018 (UTC)
Jayprakash gaarU, the Interface-Admin right is granted for a week. Thanks.__చదువరి (చర్చరచనలు) 05:31, 6 నవంబర్ 2018 (UTC)
Now the Gadget is working. Enable it by your preference. Can someone gives me translation of following? which will use in ప్రత్యేక:అభిరుచులు#mw-prefsection-gadgets
refToolbar: add a "cite" button to the editing toolbar for quick addition of commonly used citation templates

--Jayprakash12345 (చర్చ) 14:40, 6 నవంబర్ 2018 (UTC)

thanq Jayprakash12345, now its working. "colbegin & colend" is not working and please enable "(newest | oldest) View (newer 1000 | older 1000) (20 | 50 | 100 | 250 | 500|1000) tool" in Resent Changes page.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 15:01, 6 నవంబర్ 2018 (UTC)
Hello Pranayraj Vangari Ji, Template colbegin & colend is working fine. see వాడుకరి:Jayprakash12345/ప్రయోగశాల, I get you right? And enable "(newest | oldest)..." I can't get you. Can you elaborate more?--Jayprakash12345 (చర్చ) 15:33, 6 నవంబర్ 2018 (UTC)
Jayaprakash, Template colbegin & colend is not working for me. In Show Preview i saw 2 parts, when i Publish Changes its not working-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 16:04, 6 నవంబర్ 2018 (UTC)
Pranayraj Vangari Ji, We disscussed colbegin & colend persollnaly. This is your browser's zoom problem. And "enable (newest | oldest)..." will be never done because it comes from Server Side(PHP) and we can only handle Client Side(Javascript). Hope You got all your answer :)--Jayprakash12345 (చర్చ) 20:08, 6 నవంబర్ 2018 (UTC)
Dear Jayprakash12345 thanking you for your support. Anything need we will contact you.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 06:13, 7 నవంబర్ 2018 (UTC)

Editing News #2—2018

[మార్చు]

14:17, 2 నవంబర్ 2018 (UTC)

ఏషియన్ నెల మళ్ళీ వచ్చింది!

[మార్చు]

వికీపీడియన్లకు నవంబరు అంటే ఏషియన్ నెల. గత కొన్ని సంవత్సరాలుగా నవంబరు ఏషియన్ నెల పేరిట బహుభాషా ఎడిటథాన్ నిర్వహించుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా అలానే ఆసియాకు సంబంధించిన అంశాలపై వ్యాసాలు రాసి, మెరుగుపరిచే ఏషియన్ నెల నిర్వహించుకుంటున్నాం. పాల్గొనడానికి వివరాలు ఈ లింకులో చూడండి: వికీపీడియా:వికీపీడియా ఏషియన్ నెల/2018. శుభాభినందనలతో --పవన్ సంతోష్ (చర్చ) 04:23, 3 నవంబర్ 2018 (UTC)

కమ్యూనిటీ విష్ లిస్ట్ సర్వే 2019 - వివరాలు

[మార్చు]

కమ్యూనిటీ విష్ లిస్ట్ సర్వేలో ప్రతిపాదనలు సమర్పించడానికి నవంబరు 11 వరకూ అవకాశం ఉంది. వికీమీడియా ఫౌండేషన్ కమ్యూనిటీ టెక్ టీం పనిచేయడానికి పనికొచ్చే ప్రాజెక్టుల కోసం ప్రతిపాదనలు మీరు సమర్పించవచ్చు: మెటాలో కమ్యూనిటీ విష్ లిస్ట్ సర్వే 2019 పేజీ చూడండి.

కమ్యూనిటీ టెక్ వికీమీడియా సముదాయ సభ్యుల కోరిక మేరకు ఫీచర్లు రూపొందించి, మార్పులు చేస్తుంది. విష్ లిస్ట్ సర్వే అన్నది తర్వాతి రౌండులోని టీం అజెండా ఏర్పరుస్తుంది. నవంబరు 11 వరకూ ప్రపంచ వ్యాప్తంగా అన్ని సముదాయాల సభ్యులూ తమ తమ ప్రతిపాదనలు సమర్పించడం, ప్రతిపాదనలపై చర్చించడం చేయవచ్చు. ఆ తర్వాత మరో రెండు వారాల ఓటింగ్ కాలం ఉంటుంది, దీనిలో ప్రతీవారూ తమకు ముఖ్యమని అనిపించిన ప్రతిపాదనలకు ఓటు వేయొచ్చు.

మీరు 11 నవంబరు వరకూ సాంకేతిక అంశాలను ప్రతిపాదించవచ్చు. అలానే 16 నుంచి 30 నవంబరు వరకూ ప్రతిపాదనలకు ఓటు వేయవచ్చు.

కమ్యూనిటీ టెక్ టీం వీటిలోని టాప్ 10 ప్రతిపాదనల మీద పనిచేస్తారు. వీటిలో ఏదైనా ఆచరణయోగ్యం కానీ, ఆచరణశక్యం కానీ కాదని పరిశీలన తర్వాత నిర్ణయిస్తే ఎందుకున్న విషయాన్ని వారు సముదాయానికి వివరించాలి. సముదాయానికి నిజానికి ఏం కావాలన్నది తెలుసుకుని ఆ ప్రాజెక్టుల మీద స్వచ్ఛందంగా పనిచేసే డెవలపర్లు కానీ, మరేవైనా టీంలకు కానీ ఈ జాబితా ఉపయోగపడుతుంది. పలువిధాలుగా ప్రయోజనకరమైన ఈ సర్వేలో పాలుపంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 06:02, 6 నవంబర్ 2018 (UTC)

Change coming to how certain templates will appear on the mobile web

[మార్చు]

CKoerner (WMF) (talk) 19:35, 13 నవంబర్ 2018 (UTC)

ఇంటర్నెట్ సపోర్ట్ కోసం సి.ఐ.ఎస్. వారికి అభ్యర్థన

[మార్చు]

అందరికి నమస్కారం, వికీపీడియన్ గా తెలుగు వికీపీడియా మరియు వికీమీడియా ప్రాజెక్టులలో కృషిచేస్తూ, #1000WikidaysChallenge ను కొనసాగిస్తున్న విషయం సభ్యులకు తెలిసిందే. నా ఛాలెంజ్ కొనసాగించడంకోసం ఇంటర్నెట్ అవసరపడుతుంది. కనుక, ఇంటర్నెట్ సపోర్ట్ కొరకు సి.ఐ.ఎస్. వారికి నా అభ్యర్థనను ఇక్కడ రాయడం జరిగింది. సభ్యులు స్పందించగలరు.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 18:09, 14 నవంబర్ 2018 (UTC)

Community Wishlist Survey vote

[మార్చు]

18:13, 22 నవంబర్ 2018 (UTC)

[మార్చు]

Johanna Strodt (WMDE) (talk) 11:03, 26 నవంబర్ 2018 (UTC)

పై రెండు పేర్ల మీద వేరు వేరు వ్యాసాలు తెవికీలో ఉన్నాయి. జనన, మరణ తేదీలు ఇద్దరివీ ఒకటే. ఇద్దరూ నెల్లూరుకు చెందినవారే. ఎస్.జానకి ఇద్దరికీ కోడలే. కాబట్టి ఇద్దరూ ఒకరే కావడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. ఎవరైనా ఈ విషయాన్ని నిర్ధారించి ఒకరే అయితే రెండు వ్యాసాలనూ విలీనం చేయ్యాల్సి వుంది.--స్వరలాసిక (చర్చ) 15:32, 26 నవంబర్ 2018 (UTC)

కాళిదాసు పురుషోత్తం గారిని అడిగి చెప్తానండి, ఈలోగా ఎవరూ చెప్పలేకపోతే. --పవన్ సంతోష్ (చర్చ) 17:59, 28 నవంబర్ 2018 (UTC)

ఆర్కీవ్ డాట్ ఆర్గ్ లోని తెలుగు పుస్తకాల తెలుగు యూనికోడ్లో మార్చడం మొదటి దశ పూర్తి

[మార్చు]
ఆర్కీవ్ తెలుగు అత్యధిక వీక్షణల తెరపట్టు
పరిచయ దృశ్యశ్రవణమాధ్యమము

ఇంతకుముందు రచ్చబండ లో చర్చించిన పనిలో తొలిదశగా శీర్షిక, రచయిత వివరాలు మార్చడం పూర్తయిందని చెప్పటానికి సంతోషిస్తున్నాను. అలాగే పుస్తకం భాష ఇతర భాషలవి తెలుగుగా తప్పుగా గుర్తించినవి, ఆయా భాషలకి మార్చడం, అలాగే ఇతర భాషలుగా గుర్తించబడిన తెలుగు పుస్తకాలని, తెలుగుకి మార్చడం, కొంతవరకు ముద్రణా తేదీలు సరిచూడడం పూర్తయింది. ఈ పనులన్నీ జరిగిన తరువాత 22828 పుస్తకాలు లెక్కకురాగా, వాటిలో 3556 పుస్తకాలకు 5244 100 శాతం నకలులున్నాయని మూల స్కాన్ పుస్తక పరిమాణం ఆధారంగా గుర్తించి కార్ల్ సహాయంతో ధృవీకరించి, ఆ నకళ్లను ఆర్కీవ్ లో తొలగించడం జరిగింది(మరిన్ని వివరాలు). వాటి లింకులు వికీపీడియా లో వికీసోర్స్ లో వున్నట్లయితే వాటిని ఆయా మూల పుస్తకాలకు మార్చడం కూడా జరిగింది. ఇప్పుడు 17584 తెలుగు పుస్తకాలతో ఆర్కీవ్ వాడుకోవడానికి అనువుగా వుంది. మీరు ఈ లింకు ద్వారా అన్ని పుస్తకాలను చూడవచ్చు. శోధనయంత్రంలో నేరుగా తెలుగులో వెతకవచ్చు. గూగుల్ లో వెదికినా మీకు ఆర్కీవ్ లింకులు అవి వాడిన వెబ్ పేజీలనుబట్టి కనబడతాయి. ఇదొక 10నెలలపైన సాగిన పెద్ద పని. ఈ పనిలో సహకరించిన వారందరికి ధన్యవాదాలు. ప్రధానంగా పవన్ సంతోష్ గారికి, వారి తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు ఫలితాలను వాడుకున్నందులకు, చదువరి గారికి, వారు తొలిగా కొంతవరకు చేసిన మానవీయ ఊహాజనితంతో మూకుమ్మడి మార్పుల వలన నేను చేసిన సాఫ్టవేర్ పనిచేస్తున్నదని తెలియటానికి, కొన్ని దోషాలు సవరించడానికి తోడ్పడినందులకు, ఆఖరు కాని ప్రాముఖ్యం ఏమాత్రం తక్కువలేకుండా రవిచంద్ర గారికి, సాధ్యమైనంతవరకు పుస్తకం తెరచి వివరాలు గూగుల్ స్ప్రెడ్ షీట్ లో చేర్చటంలో కొన్ని నెలలుగా సహాయ పడినందులకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించిన ఆర్కీవ్.ఆర్గ్ లో డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియ పుస్తకాల నిర్వహణాధికారి కార్ల్ మలమూద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక ఈ కృషికి మూలమైన రచయితలు,సంస్థలకు డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా కార్యనిర్వాహకులకు, పుస్తకాలను అందుబాటులోకి తెస్తున్న ఆర్కీవ్.ఆర్గ్ సంస్థకు కూడా కృతజ్ఞతలు.

ఇంకా చేయవలసినది చాలావుంది. కొన్ని పుస్తకాల వివరాలలో ఇంకా కొంత తప్పులు వుండి వుండవచ్చు. విషయం వివరాలు తెలుగులోకి మార్చి చేర్చాలి. పుస్తకరకాలు(సాధారణ పుస్తకము, పత్రిక, పత్రికల సంచయము) చేర్చాలి. మీ దృష్టికి వచ్చిన దోషాలను సలహాలను తెలియచేస్తే తదుపరి సవరణలు చేయవచ్చు. ఈ పని వికీసోదరసోదరీమణులకు మరింత ఉపయోగంగా వుంటుందని ఆశిస్తాను మరియు తమ స్పందనలు, ఏమైనా సందేహాలుంటే అవీ తెలియచేయమని కోరుతున్నాను.--అర్జున (చర్చ) 07:50, 30 నవంబర్ 2018 (UTC)