చిత్తూరు జిల్లా
చిత్తూరు జిల్లా | |
---|---|
Coordinates: 13°12′N 79°07′E / 13.2°N 79.12°E | |
దేశం | భారత దేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
ప్రాంతం | రాయలసీమ |
ప్రధాన కార్యాలయం | చిత్తూరు |
విస్తీర్ణం | |
• Total | 6,855 కి.మీ2 (2,647 చ. మై) |
జనాభా (2011)[1] | |
• Total | 18,73,000 |
• జనసాంద్రత | 270/కి.మీ2 (710/చ. మై.) |
భాషలు | |
• ఆధికార | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 0( ) |
చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలో ఒక జిల్లా. జిల్లాకేంద్రం చిత్తూరు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ భాగంగా 2022లో ఈ జిల్లాలోని భాగాలను కొత్తగా ఏర్పడిన తిరుపతి జిల్లా, అన్నమయ్య జిల్లాలలో కలిపారు.
కాణిపాకం దేవాలయానికి ప్రసిద్ధి ఈ జిల్లా ధాన్యములు, చెరకు, మామిడి, వేరుశనగలకు వ్యాపార కేంద్రము. ఇక్కడ నూనె గింజలు, బియ్యం మిల్లింగ్ పరిశ్రమలు ఉన్నాయి. Map
చరిత్ర
[మార్చు]ఈ పేజీలో గతంలో ఉన్న సమాచారం స్థానే కొత్త సమాచారాన్ని చేర్చినట్లుగా తోస్తోంది. అయితే, విజ్ఞానసర్వస్వ వ్యాసాల్లో చారిత్రిక సమాచారం ముఖ్యమైనది కాబట్టి, తీసేసిన పాత సమాచారాన్ని కూడా తిరిగి చేర్చి, ఈ వ్యాసం అభివృద్ధిలో తోడ్పడండి. ఏయే సమాచారాన్ని చేర్చాలనే విషయాన్ని చర్చా పేజీలో చర్చించండి. |
చిత్తూరు జిల్లా 1911 ఏప్రిల్ 1 సంవత్సరంలో ఏర్పాటైంది. అప్పటి ఉత్తర ఆర్కాట్లో తెలుగు మాట్లాడే కొన్ని తాలూకాలు, కడప జిల్లా నుంచి మరి కొన్ని తాలూకాలు, నెల్లూరు జిల్లా నుంచి మరికొన్ని తాలూకాలు కలిపి దీన్ని ఏర్పాటు చేశారు. 2011 ఏప్రిల్ 1 నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. 19వ శతాబ్దపు ప్రారంభం నుంచి ఉత్తర ఆర్కాట్ జిల్లాకు ప్రధాన కేంద్రంగా ఉండేది. ఒక వైపు కర్ణాటక కు, మరో వైపు తమిళనాడుకు దగ్గరగా ఉండటంతో తెలుగుతో బాటు, తమిళం, కన్నడ భాషలు కూడా విస్తృతంగా వాడుతుంటారు.
దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన చోళులు, పల్లవులు, పాండ్యులు మొదలైన వారు దీన్ని తమ ఆధీనంలో ఉంచుకున్నారు. విజయనగర సామ్రాజ్యం కాలంలో చంద్రగిరి కేవలం ప్రధాన కేంద్రంగానే కాక కొన్నాళ్ళు రాజధానిగా కూడా విలసిల్లింది. విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత ఇది పాలెగాళ్ళ ఆధీనంలోకి వచ్చింది. చిత్తూరు, చంద్రగిరి ప్రాంతాల్లోనే పదిమంది పాళెగాళ్ళు అధికారం చెలాయించే వాళ్ళు. ఆర్కాటు నవాబు ఈ ప్రాంతాన్ని చేజిక్కించుకోవడానికి చూసినపుడు మైసూరు నవాబులు హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ చిత్తూరును తమ వశం చేసుకోవడానికి ప్రయత్నించారు. హైదరాలీ గుర్రంకొండ నవాబు కుమార్తె అయిన ఫకృన్నిసాను వివాహం చేసుకున్నాడు. వీరిరువురికీ జన్మించిన వాడే టిప్పు సుల్తాన్. రెండవ మైసూరు యుద్ధం జరుగుతుండగా చిత్తూరు దగ్గర్లోని నరసింగరాయనిపేట దగ్గర హైదరాలీ 1782 డిసెంబరు 6 లో క్యాన్సర్ సోకి మరణించాడు. ఆర్కాటు నవాబుల పరిపాలనలో చిత్తూరు ఖిల్లా గానూ, దానికి మొహమ్మద్ అలీ సోదరుడు అబ్దుల్ వహాబ్ ఖిల్లాదారు గానూ ఉండేవాడు. అతని దగ్గర సైనికుడుగా చేరిన హైదరాలీ తర్వాత అతన్నే ఓడించి మైసూరుకు బందీగా తీసుకుని వెళ్ళాడు.
జిల్లాల పునర్వ్యవస్థీకరణ భాగంగా 2022లో ఈ జిల్లాలోని భాగాలను కొత్తగా ఏర్పడిన తిరుపతి జిల్లా, అన్నమయ్య జిల్లాలలో కలిపారు.[1]
భౌగోళిక స్వరూపం
[మార్చు]ఇది 12°-44’-42″, 13°-39’-21″ ఉత్తర అక్షాంశాల మధ్య, తూర్పు రేఖాంశాలు 78°-2’-2″, 79°-41’52″ మధ్య ఉంది. ఇది తూర్పున తిరుపతి జిల్లా, తమిళనాడు రాష్ట్రం, పశ్చిమాన అన్నమయ్య జిల్లా, కర్ణాటక రాష్ట్రం, ఉత్తరాన అన్నమయ్య జిల్లా, తిరుపతి జిల్లాలు, దక్షిణాన తమిళనాడు రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి.
జిల్లా ప్రధానంగా మైదాన ప్రాంత మండలాలతో కూడి ఉంది. చిత్తూరు పట్టణం చుట్టుపక్కల మామిడి తోటలు, చింత తోపులు విస్తారముగా ఉన్నాయి.
నదులు
[మార్చు]ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నదులు:
జనాభా లెక్కలు
[మార్చు]2011 జనగణన ప్రకారం, జిల్లా జనాభా: 18,73,000. జిల్లా జన సాంద్రత 270/చ.కి.మీ (710/చ. మై.) [1]
రవాణా వ్వవస్థ
[మార్చు]- రహదారి సౌకర్యం: జాతీయ రహదారి 69కి కర్ణాటకలో హొన్నవర - ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు గమ్యస్థానాలుగా ఉన్నాయి.
- రైలు సౌకర్యం: ఇక్కడ పాకాల - కాట్పాడి రైలు మార్గములో చిత్తూరు రైల్వే స్టేషను ఉంది.
- విమానయాన సౌకర్యం: దగ్గరిలోని విమానాశ్రయం తిరుపతి
పాలనా విభాగాలు
[మార్చు]భౌగోళికంగా చిత్తూరు జిల్లాను 4 రెవెన్యూ డివిజన్లుగా, 31 రెవెన్యూ మండలాలుగా విభజించారు.[1] పునర్వ్యవస్థీకరణ తరువాత వెదురుకుప్పం శ్రీరంగరాజపురం మండలాలను నగరి రెవెన్యూ డివిజన్ నుండి చిత్తూరు రెవెన్యూ డివిజన్ కు మార్చారు.[2]
మండలాలు
[మార్చు]
- కుప్పం డివిజను
- చిత్తూరు డివిజను
- నగరి డివిజను
- పలమనేరు డివిజను
నగరాలు, పట్టణాలు
[మార్చు]నియోజక వర్గాలు
[మార్చు]- లోక్‌సభ స్థానాలు
- చిత్తూరు (పాక్షికం), దీనిలో భాగమైన చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం తిరుపతి జిల్లాలో ఉంది.
- రాజంపేట (పాక్షికం), దీనిలోని పుంగనూరు శాసనసభ నియోజకవర్గం మాత్రమే చిత్తూరు జిల్లాలో ఉంది. మిగతా భాగం అన్నమయ్య జిల్లాలో ఉంది.
- శాసనసభ స్థానాలు (7)
విద్యాసంస్థలు
[మార్చు]విశ్వనిద్యాలయాలు: ద్రవిడ
ఆర్ధిక స్థితిగతులు
[మార్చు]వ్యవసాయం
[మార్చు]వేరుశనగ, మామిడి, చెఱకు పంటలు విశేషంగా పండుతాయి.
పరిశ్రమలు
[మార్చు]ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి గుజ్జు పరిశ్రమ, గ్రానైట్ పరిశ్రమ, పాల ఉత్పత్తుల పరిశ్రమలున్నాయి. చిత్తూరు జిల్లాలో 101 కంపనీలు, 21148 కుటీర పరిశ్రమలున్నాయి. అమరరాజా బ్యాటరీ కంపనీ, న్యూట్రిన్ చాక్ లెట్ కంపనీ, లాంకో ఇండస్ట్రీ, స్పాంజ్ ఐరన్, జైన్ ఇరిగేషన్, శ్రీనివాస డిస్టిల్లరీస్ ఈ జిల్లాలోగల ప్రధాన పరిశ్రమలలో కొన్ని. ఇవేకాక, నాలుగు సహకార చక్కెర మిల్లులు, రెండు యాజమాన్య చక్కెర మిల్లులు ఉన్నాయి. బంగారుపాళ్యం మండలం మొగిలిలో భారీ ఆహార పదార్ధాల పార్క్ (మెగా ఫుడ్ ఫార్క్) ఏర్పాటుచేశారు.[3]
సంస్కృతి
[మార్చు]సంక్రాంతి పండుగ సందర్భంగా జరుపుకునే పశువుల పండుగ జల్లి కట్టు అంటారు.
చారిత్రిక/పర్యాటక ప్రదేశాలు
[మార్చు]- కాణిపాకం
- పుంగనూరు కోట
- గుర్రంకొండ కోట :గుర్రంకొండలో రాగినీ మహల్ అనబడే సుల్తాన్ యొక్క ప్యాలెస్ ఉన్నాయి
- హనుమంతుని ఆలయం, అర్ధగిరి కొండ, అరగొండ
- కౌండిన్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రం: ఇక్కడికి వలస వచ్చే అనేక పక్షుల సందడితో ఈ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా వుంటుంది.
చిత్తూరు జిల్లా ప్రముఖులు
[మార్చు]ఎంతో మంది కవులు, పండితులు, కళాకారులు, అధికారులు, స్వాతంత్ర్య సమరయోధులు, రాజకీయ నాయకులు ఇక్కడ నుంచి ఉద్భవించారు.
- మాడభూషి అనంతశయనం అయ్యంగార్ స్వాతంత్ర్య సమరయోధుడు, పార్లమెంట్ సభ్యుడు, లోక్ సభ స్పీకర్.
- జిడ్డు క్రిష్ణమూర్తి, తత్వవేత్త.
- ముంతాజ్ అలి తత్వవేత్త.
- కట్టమంచి రామలింగారెడ్డి
- ప్రతాప్ సి. రెడ్డి:అపోలో హస్పిటల్స్ అదినేత ప్రతాప్ రెడ్డి, పారిశ్రామిక వేత్త
- సి.కె.జయచంద్ర రెడ్డి (సి.కె.బాబు) -MLA (1989 నుంచి 2014 వరకు) చిత్తూరు సేవలు అందించారు
- వెల్లాల ఉమామహేశ్వరరావు
- నారా చంద్రబాబు నాయుడు రాజకీయవేత్త.
- జి.ఎన్.రెడ్డి భాషాశాస్త్రవేత్త, ప్రముఖ విద్యావేత్త, నిఘంటు నిర్మాత.
- నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి
- మధు వారణాసి ప్రముఖ హోమియో పతి వైద్య నిపుణులు, సంఘ సేవకులు.
- సాహితీ కారులు
- తరిగొండ వెంగమాంబ.19 శతాబ్దపు కవయిత్రి. అనేక పాటలు యక్షగానాలు రచించిన రచయిత్రి..
- కట్టమంచి రామలింగారెడ్డి,విద్యావేత్త, సాహితీవేత్త, వక్త, పండితుడు, రచయిత, ఆదర్శవాది బహుముఖ ప్రఙాశాలి.
- వల్లంపాటి వెంకటసుబ్బయ్య, సాహితీ విమర్శకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.
- శంకరంబాడి సుందరాచార్య మా తెలుగు తల్లికి రచయిత.
- శ్రీనివాసపురం సోదరులు - సింహశ్రీ, శుభశ్రీ
- మధురాంతకం రాజారాం సాహిత్య అకాడమీ అవార్డ్ గ్రహీత.
- సినీ రంగ ప్రముఖులు
- చిత్తూరు నాగయ్య- గుంటూరు జిల్లాలో జన్మించాడు. చిత్తూరుకు చెందిన రామవిలాస సభ వారు నిర్వహించిన "సారంగధర" నాటకంలో "చిత్రాంగి" వేషం ద్వారా ప్రశంసలు అందుకొని "చిత్తూరు నాగయ్య"గా పేరొందాడు.
- రమాప్రభ హాస్యనటి - 1400 దక్షిణభారతదేశ చిత్రాలలో నటించిన 16 17 నటీమణి.
- దేవిక - అందాల తారగా వెలుగొందిన నటీమణి.
చిత్రమాలిక
[మార్చు]-
మదనపల్లె
-
కాణిపాకం చిత్తూరు, మందిర దృశ్యం
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 "AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?". Sakshi. 2022-04-03. Retrieved 2022-04-03.
- ↑ AP Government (2022-06-29), CHITTOOR DISTRICT - TRANSFER OF SRIRANGARAJAPURAM AND VEDURUKUPPAM MANDALS FROM NAGARI REVENUE DIVISION TO CHITTOOR REVENUE DIVISION - FINAL NOTIFICATION. [G.O.Ms.No.488, Revenue (Lands-IV), 29th June, 2022.]
- ↑ "Industry Guide". Srini food park. Retrieved 2022-06-24.
బయటి లింకులు
[మార్చు]