కొత్తూరు (రంగారెడ్డి జిల్లా )
కొత్తూరు, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, కొత్తూరు మండలానికి చెందిన జనగణన పట్టణం.[1]
కొత్తూరు (CT) | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | రంగారెడ్డి జిల్లా |
మండలం | కొత్తూరు |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 10,519 |
- పురుషుల సంఖ్య | 33,957 |
- స్త్రీల సంఖ్య | 31,242 |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
ఇది హైదరాబాదుకు సమీపంలో ఉంది. పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందినది. షాద్‌నగర్, హైదరాబాదు మధ్యలో ఈ గ్రామం ఉంది. ఇక్కడికి రైలు సౌకర్యం కూడా ఉంది. సికింద్రాబాదు రైల్వే స్టేషను నుంచి 50 కిలోమీటర్ల దూరాన ఉంది.
మహబూబ్ నగర్ జిల్లా నుండి రంగారెడ్డి జిల్లాకు మార్పు.[మార్చు]
లోగడ కొత్తూరు పట్టణం / మండలం మహబూబ్ నగర్ జిల్లా, మహబూబ్ నగర్,రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా కొత్తూరు మండలాన్ని (1+10) పదకొండు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన రంగారెడ్డి జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[2]
గణాంకాలు[మార్చు]
2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా మొత్తం 12,740. ఇందులో పురుషుల సంఖ్య 6396, స్త్రీల సంఖ్య 6354. అక్షరాస్యుల 74.26 %.గా ఉంది..[3]
నీటిపారుదల, భూమి వినియోగం[మార్చు]
మండలంలో 6 చిన్ననీటిపారుదల వనరుల ద్వారా 378 హెక్టార్ల ఆయకట్టు వ్యవసాయ భూములున్నాయి.[4]
మూలాలు[మార్చు]
- ↑ https://www.census2011.co.in/data/town/574216-kothapet-andhra-pradesh.html
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 250 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.126
- ↑ Handbook of Statistics, Mahabubnagar, 2008, Page No 80