Jump to content

పీరియడ్ 7 మూలకం

వికీపీడియా నుండి
(పీరియడ్ 7 నుండి దారిమార్పు చెందింది)
ఆవర్తన పట్టికలో పీరియడ్ 7
Hydrogen Helium
Lithium Beryllium Boron Carbon Nitrogen Oxygen Fluorine Neon
Sodium Magnesium Aluminium Silicon Phosphorus Sulfur Chlorine Argon
Potassium Calcium Scandium Titanium Vanadium Chromium Manganese Iron Cobalt Nickel Copper Zinc Gallium Germanium Arsenic Selenium Bromine Krypton
Rubidium Strontium Yttrium Zirconium Niobium Molybdenum Technetium Ruthenium Rhodium Palladium Silver Cadmium Indium Tin Antimony Tellurium Iodine Xenon
Caesium Barium Lanthanum Cerium Praseodymium Neodymium Promethium Samarium Europium Gadolinium Terbium Dysprosium Holmium Erbium Thulium Ytterbium Lutetium Hafnium Tantalum Tungsten Rhenium Osmium Iridium Platinum Gold Mercury (element) Thallium Lead Bismuth Polonium Astatine Radon
Francium Radium Actinium Thorium Protactinium Uranium Neptunium Plutonium Americium Curium Berkelium Californium Einsteinium Fermium Mendelevium Nobelium Lawrencium Rutherfordium Dubnium Seaborgium Bohrium Hassium Meitnerium Darmstadtium Roentgenium Copernicium Ununtrium Flerovium Ununpentium Livermorium Ununseptium Ununoctium

పీరియడ్ 7 మూలకం అనేది రసాయన మూలకాల ఆవర్తన పట్టికలోని ఏడవ వరుస (లేదా పీరియడ్) లోని రసాయన మూలకాలలో ఒకటి. మూలకాల పరమాణు సంఖ్య పెరిగేకొద్దీ వాటి రసాయన ప్రవర్తనలో పునరావృతమయ్యే (ఆవర్తన) ధోరణులను వివరించడానికి ఆవర్తన పట్టికను అడ్డు వరుసలలో రూపొందించారు. రసాయన ప్రవర్తన పునరావృతం కావడం ప్రారంభించినప్పుడు కొత్త వరుస ప్రారంభమవుతుంది. అంటే ఒకే విధమైన ప్రవర్తన కలిగిన మూలకాలు ఒకే నిలువు వరుసలో వస్తాయి.

ఏడవ పీరియడ్‌లో 32 మూలకాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ 6 వ పీరియడ్‌తో ముడిపడి ఉన్నాయి. ఇది ఫ్రాన్సియంతో మొదలై, ఒగానెసన్‌తో ముగుస్తుంది. ఒగానెసన్‌, ప్రస్తుతం కనుగొన్న మూలకాల్లో అత్యంత భారీ మూలకం. పీరియడ్ 7 మూలకాలు ముందుగా వాటి 7s షెల్‌లను నింపుతాయి, తర్వాత వాటి 5f, 6d, 7p షెల్‌లను అదే క్రమంలో నింపుతాయి. అయితే దీనికి యురేనియం వంటి మినహాయింపులు ఉన్నాయి.

లక్షణాలు

[మార్చు]

పీరియడ్ 7 లోని మూలకాలన్నీ రేడియోధార్మికత కలిగి ఉంటాయి. ఈ పీరియడ్‌లోఆక్టినైడ్‌లు ఉంటాయి. ఆక్టినైడ్‌లలో ఉండే ప్లూటోనియం సహజంగా లభించే మూలకాల్లో అత్యంత భారీ కేంద్రకం కలిగినది. తదుపరి మూలకాలను కృత్రిమంగా సృష్టించాలి. ఈ సింథటిక్ మూలకాలలో మొదటి ఐదు (అమెరిషియం నుండి ఐన్‌స్టీనియం దాకా) ఇప్పుడు స్థూల పరిమాణాలలో అందుబాటులో ఉన్నప్పటికీ, ఎక్కువ మూలకాలను చాలా అరుదుగా మాత్రమే, మైక్రోగ్రామ్ మొత్తాలలో లేదా అంతకంటే తక్కువ మొత్తంలో, తయారు చేసారు. తరువాతి ట్రాన్సాక్టినైడ్ మూలకాలను ఒక్కో విడతలో కొన్ని అణువులను మాత్రమే ప్రయోగశాలలలో గుర్తించారు.

ఈ మూలకాలలో చాలా అరుదుగా ప్రయోగాత్మక ఫలితాలు చాలా విస్తృతంగా లేనప్పటికీ, వాటి ఆవర్తన, సమూహ పోకడలు ఇతర పీరియడ్ల కంటే తక్కువగా నిర్వచించబడ్డాయి. ఫ్రాన్షియం, రేడియంలు వాటి సంబంధిత సమూహాల విలక్షణమైన లక్షణాలను చూపించినప్పటికీ, లాంథనైడ్‌ల కంటే యాక్టినైడ్‌లు చాలా ఎక్కువ రకాల ప్రవర్తన, ఆక్సీకరణ స్థితులను ప్రదర్శిస్తాయి. ఈ విశిష్టతలు అనేక రకాల కారణాలున్నాయి. వాటి భారీ పరమాణు కేంద్రకాల నుండి చాలా ఎక్కువ పాజిటివ్ విద్యుత్ ఛార్జ్ కారణంగా ఏర్పడే పెద్ద స్థాయి స్పిన్-ఆర్బిట్ కప్లింగు, సాపేక్ష ప్రభావాలు వీటిలో ఉన్నాయి. ఆవర్తనత ఎక్కువగా 6d సిరీస్‌లో ఉంటుంది. మాస్కోవియం, లివర్‌మోరియం లలో కూడా అలా ఉంటుందని అంచనా వేసారు. అయితే ఇతర నాలుగు 7p మూలకాలు, నిహోనియం, ఫ్లెరోవియం, టెన్నెస్సిన్, ఒగానెస్సన్ లకు వాటి సమూహాలకు ఉండే వాటి కంటే చాలా భిన్నమైన లక్షణాలు ఉంటాయని అంచనా వేసారు.

మూలకాలు

[మార్చు]
రసాయనిక మూలకం బ్లాక్ ఎలెక్ట్రాన్ కాన్ఫిగరేషను లభ్యత
 
87 Fr Francium s-బ్లాక్ [Rn] 7s1 క్షయం ద్వారా
88 Ra Radium s-బ్లాక్ [Rn] 7s2 క్షయం ద్వారా
89 Ac Actinium f-బ్లాక్ [Rn] 6d1 7s2 (*) క్షయం ద్వారా
90 Th Thorium f-బ్లాక్ [Rn] 6d2 7s2 (*) ఆదిమ కాలం
91 Pa Protactinium f-బ్లాక్ [Rn] 5f2 6d1 7s2 (*) క్షయం ద్వారా
92 U Uranium f-బ్లాక్ [Rn] 5f3 6d1 7s2 (*) ఆదిమ కాలం
93 Np Neptunium f-బ్లాక్ [Rn] 5f4 6d1 7s2 (*) క్షయం ద్వారా
94 Pu Plutonium f-బ్లాక్ [Rn] 5f6 7s2 క్షయం ద్వారా
95 Am Americium f-బ్లాక్ [Rn] 5f7 7s2 మానవ తయారీ
96 Cm Curium f-బ్లాక్ [Rn] 5f7 6d1 7s2 (*) మానవ తయారీ
97 Bk Berkelium f-బ్లాక్ [Rn] 5f9 7s2 మానవ తయారీ
98 Cf Californium f-బ్లాక్ [Rn] 5f10 7s2 మానవ తయారీ
99 Es Einsteinium f-బ్లాక్ [Rn] 5f11 7s2 మానవ తయారీ
100 Fm Fermium f-బ్లాక్ [Rn] 5f12 7s2 మానవ తయారీ
101 Md Mendelevium f-బ్లాక్ [Rn] 5f13 7s2 మానవ తయారీ
102 No Nobelium f-బ్లాక్ [Rn] 5f14 7s2 మానవ తయారీ
103 Lr Lawrencium d-బ్లాక్ [Rn] 5f14 7s2 7p1 (*) మానవ తయారీ
104 Rf Rutherfordium d-బ్లాక్ [Rn] 5f14 6d2 7s2 మానవ తయారీ
105 Db Dubnium d-బ్లాక్ [Rn] 5f14 6d3 7s2 మానవ తయారీ
106 Sg Seaborgium d-బ్లాక్ [Rn] 5f14 6d4 7s2 మానవ తయారీ
107 Bh Bohrium d-బ్లాక్ [Rn] 5f14 6d5 7s2 మానవ తయారీ
108 Hs Hassium d-బ్లాక్ [Rn] 5f14 6d6 7s2 మానవ తయారీ
109 Mt Meitnerium d-బ్లాక్ [Rn] 5f14 6d7 7s2 (?) మానవ తయారీ
110 Ds Darmstadtium d-బ్లాక్ [Rn] 5f14 6d8 7s2 (?) మానవ తయారీ
111 Rg Roentgenium d-బ్లాక్ [Rn] 5f14 6d9 7s2 (?) మానవ తయారీ
112 Cn Copernicium d-బ్లాక్ [Rn] 5f14 6d10 7s2 (?) మానవ తయారీ
113 Nh Nihonium p-బ్లాక్ [Rn] 5f14 6d10 7s2 7p1 (?) మానవ తయారీ
114 Fl Flerovium p-బ్లాక్ [Rn] 5f14 6d10 7s2 7p2 (?) మానవ తయారీ
115 Mc Moscovium p-బ్లాక్ [Rn] 5f14 6d10 7s2 7p3 (?) మానవ తయారీ
116 Lv Livermorium p-బ్లాక్ [Rn] 5f14 6d10 7s2 7p4 (?) మానవ తయారీ
117 Ts Tennessine p-బ్లాక్ [Rn] 5f14 6d10 7s2 7p5 (?) మానవ తయారీ
118 Og Oganesson p-బ్లాక్ [Rn] 5f14 6d10 7s2 7p6 (?) మానవ తయారీ

(? ) ఊహ

(*) మడెలుంగ్ నియమానికి మినహాయింపు .

f-బ్లాక్ యాక్టినియం వద్ద ప్రారంభమవుతుందని వివిధ వర్గాలు సాధారణంగా అంగీకరిస్తాయి. [1] అయితే, అనేక పాఠ్యపుస్తకాలు ఇప్పటికీ Ac, Rf-Cn లను d-బ్లాక్ మూలకాలుగాను, f-బ్లాక్ Th-Lr లు గాను ఇస్తూ d-బ్లాక్‌ని రెండుగా విభజించి చూపుతున్నాయి. ఈ విషయమై 2021 IUPAC తాత్కాలిక నివేదికలో ఇక్కడ చూపిన ఫార్మాట్ మెరుగ్గా ఉందని సూచించారు. అయితే ఇది ఇంకా అధికారిక IUPAC పట్టికగా మారలేదు. [2]

ఫ్రాన్సియం, రేడియంలు 7వ పీరియడ్లో ఉండే s-బ్లాక్ మూలకాలు.

ఆక్టినైడ్ లేదా ఆక్టినాయిడ్ ల శ్రేణిలో ఆక్టినియం నుండి లారెన్షియం వరకు 89 - 103 పరమాణు సంఖ్యల మధ్య ఉండే 15 లోహ రసాయన మూలకాలు ఉంటాయి. [3] [4] [5] [6]

ఆక్టినైడ్ సిరీస్‌కు దాని మొదటి మూలకం ఆక్టినియం పేరు పెట్టారు. ఆక్టినైడ్‌లలో ఒకటి మినహా అన్నీ f-బ్లాక్ మూలకాలే. 5f ఎలక్ట్రాన్ షెల్ పూరకానికి అనుగుణంగా ఇవి ఉంటాయి; డి-బ్లాక్ మూలకమైన లారెన్షియంను సాధారణంగా ఆక్టినైడ్‌గానే పరిగణిస్తారు. లాంతనైడ్‌లతో పోల్చితే ఆక్టినైడ్‌లు చాలా ఎక్కువ వేరియబుల్ వేలెన్స్‌ని చూపుతాయి.

ఆక్టినైడ్‌లలో, థోరియం, యురేనియం లు సహజంగా గణనీయమైన, ఆదిమ, పరిమాణాలలో లభిస్తాయి. యురేనియం రేడియోధార్మిక క్షయం కారణంగా యాక్టినియం, ప్రొటాక్టినియం, ప్లూటోనియంలను తాత్కాలికంగా ఉత్పత్తి అవుతాయి. యురేనియం ఖనిజాలలోని పరివర్తన ప్రతిచర్యల నుండి అప్పుడప్పుడు నెప్ట్యూనియం పరమాణువులు ఉత్పత్తి అవుతాయి. ఇతర యాక్టినైడ్‌లు పూర్తిగా సింథటిక్ మూలకాలు. అయితే ప్లూటోనియం తర్వాత వచ్చే మొదటి ఆరు ఆక్టినైడ్‌లు ఓక్లోలో ఉత్పత్తి చేయబడి ఉండేవి (చాలా కాలం క్రితమే ఇవి క్షీణించిపోయాయి). క్యూరియం అంతకుముందు ప్రకృతిలో అంతరించిపోయిన రేడియోన్యూక్లైడ్‌గా ఉనికిలో ఉండేది. [7] అణు పరీక్షలు పర్యావరణంలోకి ప్లూటోనియం కంటే బరువైన ఆరు ఆక్టినైడ్‌లను విడుదల చేశాయి; 1952 హైడ్రోజన్ బాంబు పేలుడులో ఏర్పడిన శిధిలాలను విశ్లేషించినపుడు వాటిలో అమెరీషియం, క్యూరియం, బెర్కెలియం, కాలిఫోర్నియం, ఐన్‌స్టీనియం, ఫెర్మియం ల ఉనికి కనిపించింది.

యాక్టినైడ్లన్నీ రేడియోధార్మిక మూలకాలే. ఇవి, రేడియోధార్మిక క్షయం జరిగి శక్తిని విడుదల చేస్తాయి; సహజంగా లభించే యురేనియం, థోరియం, కృత్రిమంగా ఉత్పత్తి చేసిన ప్లూటోనియం భూమిపై అత్యంత సమృద్ధిగా లభించే యాక్టినైడ్‌లు. వీటిని అణు రియాక్టర్లు, అణు ఆయుధాలలో ఉపయోగిస్తారు. యురేనియం, థోరియం ల వలన ప్రస్తుతం లోను, గతం లోనూ విభిన్నమైన ఉపయోగాలు ఉన్నాయి. ఆధునిక స్మోక్ డిటెక్టర్లలోని అయనీకరణ గదులలో అమెరీషియంను ఉపయోగిస్తారు.

ఆవర్తన పట్టికలలో, లాంథనైడ్‌లు, యాక్టినైడ్‌లను సాధారణంగా పట్టిక ప్రధాన భాగం క్రింద రెండు అదనపు వరుసలుగా చూపిస్తారు. ప్లేస్‌హోల్డర్‌లతో లేదా ప్రతి శ్రేణిలోని ఎంపిక చేయబడిన ఒకే మూలకాన్ని (లాంతనమ్ లేదా లుటెటియం, ఆక్టినియం లేదా లారెన్షియం) చూపిస్తారు. ఈ ఏర్పాటు పూర్తిగా చక్కదనానికి, ఫార్మాటింగ్ ప్రాక్టికాలిటీలకు సంబంధించినదే; అరుదుగా ఉపయోగించే విస్తృత ఆవర్తన పట్టికలో (32 నిలువు వరుసలు) లాంథనైడ్, యాక్టినైడ్ సిరీస్‌లను వాటి సరైన నిలువు వరుసలలో - పట్టికలో ఆరవ, ఏడవ వరుసలుగా (పీరియడ్‌లు) - చూపిస్తారు.

నోట్స్

[మార్చు]


మూలాలు

[మార్చు]
  1. (2015). "The positions of lanthanum (actinium) and lutetium (lawrencium) in the periodic table: an update".
  2. (18 January 2021). "Provisional Report on Discussions on Group 3 of the Periodic Table".
  3. Gray, Theodore (2009). The Elements: A Visual Exploration of Every Known Atom in the Universe. New York: Black Dog & Leventhal Publishers. p. 240. ISBN 978-1-57912-814-2.
  4. Actinide element, Encyclopædia Britannica on-line
  5. Although "actinoid" (rather than "actinide") means "actinium-like" and therefore should exclude actinium, that element is usually included in the series.
  6. Connelly, Neil G. (2005). Nomenclature of Inorganic Chemistry. London: Royal Society of Chemistry. p. 52. ISBN 978-0-85404-438-2.
  7. Greenwood, p. 1250