"తిరుపతి వేంకట కవులు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
 
వేంకట శాస్త్రి [[వారాణసి]] వెళ్ళి తిరిగి వచ్చినాక [[కాకినాడ]]లో జంటగా [[అవధానము (సాహిత్యం)|శతావధానం]] ప్రదర్శించారు. ఆ తరువాత జీవితాంతం ఆ సాహితీ మూర్తులు ఒకరికొకరు తోడున్నారు. తిరుపతి శాస్త్రి సదా వేంకటశాస్త్రిని తన [[గురువు]]<nowiki/>గా భావించాడు. తిరుపతి శాస్త్రి మరణానంతరం కూడా వేంకట శాస్త్రి తన రచనలను జంట రచనలుగానే ప్రచురించాడు.
 
తిరుపతి వెంకటేశ్వరుల దిగ్విజయములకు నాంది పలికినది కాకినాడలో. అది వారి మొదటి శతావధానమేకాక సంపూర్ణ శతావధానమ కూడను. అప్పటికి వెంకటశాస్త్రికి 20సం. తిరుపతి శాస్త్రిగారికి 19వ ఏడు. బాలసరస్వతులవలె నున్నవారిని సభ్యులు అభిమానించుచునే అడుగడుగున గడ్డు పరీక్షలు చేసిరి. కవులన్నింటిలో నెగ్గిరి.
 
వారిద్దరు ఓసారి ఏకాంతముగా ఒక కొబ్బరితోటలో నూరు కొబ్బరిచెట్లను పృచ్చకులుగా భావించుకొని చెట్లకు శతావాధానము చేసిరి. దానితో వారు శతావధానమేకాక వారి శక్తి సహస్రమౌనకై నను చెప్పగలము అని నిశ్చయించుకొని సంపూర్ణ శతావధానము చేసి అందులో నెగ్గిరి.కాకినాడ పౌరులు నాలుగు నూటపదార్లు జోడు శాలువలు రెండు చాపులు సమర్పించి, అత్తరు తాంబూలములు ఇచ్చి మొక్కిరి.తాము పుట్తి బుద్ది ఎరిగిన తరువాత ఇట్టి కవీశ్వరులను ఎరుగమని వారిని సమ్నానించి అశ్వకటకముపై ఎక్కించి మేళతాళములతో ఊరేగించిరి.అది 1891 సం.
 
కాకినాడ శతావధానమయిన తరువాత కోనసీమ అగ్రహారములలో ఎన్నో అవధానములు చేసిరి.అమలాపురములో అష్టావధాన శతావధానములు కాకినాడ అంత వైభవముగా జరిగినవి.ఆపిమ్మట మహాభాష్యాధ్యయన మారంభమైనది. ద్రవ్యార్జనకై ఏలూరు వెళ్ళి అవధానము చేసి బందరు వెళ్ళిరి. బందరులో వారికి అమితధనలాభముతో పాటు గౌరవాదులు చేకూరినవి.విందులు, సభలు, గానములు, నాటకములు సాటిలేకుండా సాగినవి. అక్కడ సిడ్ని.వి ఎడ్జి అను ఆగ్లేయుడు అదిచూసి వారిని డిసెంబరులో థియొసాఫికల్ (Theosophical society) సభకు రమ్మని ఆహ్వానించెను. అది 1893 సం.
 
ఇద్దరూ కలిసి అసంఖ్యాకంగా [[అవధానాలు]] నిర్వహించారు. సన్మానాలు అందుకొన్నారు. 'ధాతు రత్నాకరం' రచించారు. అడయారు వెళ్ళినపుడు [[అనీబిసెంట్]] ప్రశంసలు అందుకొన్నారు. [[వెంకటగిరి]], [[గద్వాల]], [[ఆత్మకూరు (మహబూబ్ నగర్ జిల్లా)|ఆత్మకూరు]], [[విజయనగరం]], [[పిఠాపురం]] సంస్థానాలు సందర్శించి తమ ప్రతిభను ప్రదర్శించి సత్కారాలు గ్రహించారు.
 
గుంటూరులో 1911సం.ఆగష్టు నెలలో శ్రీ [[కొప్పరపు సోదర కవులు]] అభిమానులు లేవదీసిన కుర్చీతగాదాతో అప్పటికే కుములుచున్న అగ్గివలెనున్న వైదికనియోగి స్పర్ధలు మంటలుగా ప్రజ్వరిల్లినవి.ఏది ఏమైనా ఎవరి ప్రశంసలు వారి అందుకొనుటమానలేదు. పల్లెలలో కూడా వెంకటకవులకు సభలు అవధానములు జరిగినవి.
 
[[పోలవరం]] [[జమీందారు]] వారి ప్రతిభ గురించి తెలిసికొని [[ఎడ్విన్ ఆర్నాల్డ్]] రచించిన [[లైట్ ఆఫ్ ఆసియా]] గ్రంథాన్ని తెలుగులోకి అనువదించమని వారిని కోరాడు. తన సంస్థానంలో కవులుగా చేరమని అర్ధించాడు. ఆ విధమైన కట్టుబాట్లకు వేంకట శాస్త్రి వెనుకాడినా తిరుపతి శాస్త్రి ఆయనను ఒప్పించాడు. ఫలితంగా వారు 1901లో [[కాకినాడ]]కు నివాసం మార్చారు. 1889లో పిఠాపురం రాజు ప్రారంభించిన 'సరస్వతి' అనే సాహితీ పత్రిక నిర్వహణా బాధ్యతలు వారికి అప్పగింపబడ్డాయి. ఈ పత్రిక కోసం 'బాల రామాయణం', 'ముద్రారాక్షసం', 'మృచ్ఛఘటికం' గ్రంథాలను వీరు సంస్కృతంనుండి తెలుగులోకి అనువదించారు.
 
1918లో [[పోలవరం]] జమీందార్ మరణం వారిని ఇబ్బందులలో పడవేసింది. అయితే [[గోలంక వీరవరం]] జమీందార్ [[రావు రామాయమ్మ]] వీరికి [[భరణం]] ఏర్పాటు చేసింది.
 
శ్రీ తిరుపతి శాస్త్రి నిర్యాణాంతరము శ్రీవెంకటశాస్త్రి చల్లపల్లి రాజాగారగు అంకినీడు ప్రసాదరాయలయు,శ్రీ శివరామ ప్రసాదప్రభువులయు పట్టాభిషేకములకు వెళ్ళి ఘనముగా సన్మానములొందెను.అట్లే [[బొబ్బిలి]] రాజాగారి పట్టాభిషేకమునకు శ్రీ వెంకటశాస్త్రి వెళ్ళి, తర్వాత పట్టాభిషేక కావ్యమును రచించెను. ఆ కావ్యము నవిపించుటకు శాస్త్రిగారు శిష్యసమేతముగా బొబ్బిలి వెళ్ళెను.ప్రభువు శ్రీ శాస్త్రిని వేయినూటపదార్లు, శాలువుల జోడు, కింకణములు ఇచ్చి సన్మానించి, నూరార్లు వార్షికము ప్రకటించుటేకాక వెంటవచ్చిన శిష్యులకును నూటపదార్లు ఇచ్చి గౌరవించెను.
 
ఈవిధముగా శ్రీతిరుపతి వేంకటేశ్వరుల నిద్దరినిగాని తిరుపతి నిర్యాణంతరము వేంకటేశ్వరునిగాని సన్మానించిన ప్రభువులను ప్రభుసమ్మితులు అనేకులు. వారిలో కొందరు, విరవ, కోటరామచంద్రాపురము, వీరవరము, ఉర్లాము, మరదాసా, తోట్లవల్లూరు, తేలప్రోలు, ఖాశింకోట, మైలవరము, నూజివీడు, బొబ్బిలి, జయపురం, రామచంద్రాపురం ఇత్యాది సంస్థానముల అధిపతులు, యానాము శ్రీ మన్యం మహాలక్షమ్మ జమీందారిణీగారు, శ్రీ విక్రమదేవవర్మగారు, చెన్నపట్నములో శ్రీ అల్లాడి కృష్ణస్వామయ్యాగారు శ్రీ [[కాశీనాధుని నాగేశ్వరరావు]] గారు.
 
==అవధానాలు==
742

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2430356" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ