రవి(జ్యోతిషం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జ్యోతిష శాస్త్రంలో సూర్యుని రవి అనే పిలుస్తారు. సూర్యుడు తండ్రికి కారకత్వం వహిస్తాడు. అదేకాక అనేక కారకత్వాలకు సూర్యుడు ఆధిపత్యం వహిస్తాడు. సూర్యునకు మిత్రులు చంద్రుడు, కుజుడు, గురువు, శత్రువులు శుక్రుడు, శని. బుధుడు సముడు. సూర్యుడు మేషరాశిలో ఉచ్ఛ స్థితిని, తులారాశిలో నీచ స్థిని, సింహరాశిలో రాజ్యాన్ని పొందుతాడు. సింహరాశికి సూర్యుడు అధిపతి. కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాషాఢ నక్షత్రాలకు సూర్యుడు ఆధిపత్యం వహిస్తాడు. చైత్ర మాసంలో సూర్యమానం ఆరంభమున మేషరాశిలో ప్రవేశిస్తాడు. వైశాఖ మాస ఆరంభమున వృషభరాశిలో ప్రవేశిస్తాడు. జ్యేష్ట మాస ఆరంభమున మిధున రాశిలో ప్రవేశిస్తాడు. ఆషాఢ మాస ఆరంభమున కటక రాశిలో ప్రవేశిస్తాడు. శ్రావణ మాస ఆరంభమున సింహరాశిలో ప్రవేశిస్తాడు. బాధ్రపద మాస ఆరంభమున కన్యారాశిలో ప్రవేశిస్తాడు. ఆశ్వీజమాస ఆరంభమున తులారాశిలో ప్రవేశిస్తాడు. కార్తీకమాస ఆరంభమున వృశ్చికరాశిలో ప్రవేశిస్తాడు. మార్గశిరమాస ఆరంభమున ధనసు రాశిలో ప్రవేశిస్తాడు. పుష్యమాస ఆరంభమున మకరాశిలో ప్రవేశిస్తాడు. మార్గశిరమాస ఆరంభమున కుంభరాశిలో ప్రవేశిస్తాడు. పాల్గుణమాస ఆరంభమున మీనరాశిలో ప్రవేశిస్తాడు. ఇలా జాతక చక్రంలో సూర్యుడు ఒక సంవత్సర కాలంలో పన్నెండు రాశులందు సంచరిస్తాడు. పితృ దేవతలకు సూర్యుడు, కుజుడు ఆధిపత్యం వహిస్తారు.

రవి కారకత్వాలు ఆకార వర్ణన[మార్చు]

రుచులలో కారము, వస్త్రాలలో ముదుగువస్త్రము, కాలములో ఆయనములకు సూర్యుడు కారకుడు. స్వల్పమైన వెండ్రుకలు, మంచి బుద్ధి, సుందరాకారం, సుస్వరం, మితమైన ఎత్తు, తేనె వర్ణం కలిగిన నేత్రములు కలిగిన వాడుగా జ్యోతిష శాస్త్ర వర్ణన. ప్రచంఢమైన వీర్యము, ధైర్యము, శౌర్యములకు కారకుడు సూర్యుడు. గాంభీర్యము, విశాలబాహువులు కలవాడు.నలుపు, ఎరుపు మిశ్రిత దేహం కలవాడు. పిత్త ప్రకృతి, దృఢమైన ఎముకలు కల వాడు సూర్యుడు అని శాస్త్ర వర్ణన. పట్టు వస్త్రం ధరించు వాడు సూర్యుడని శాస్త్ర వర్ణన. లోహములలో బంగారం, పర్వత భూభాగము, ఆయుధములు, పంచ భూతములలో అగ్ని, విషము, గుణములలో భేషజము, రాచరికము, ప్రభుత్వాధికారం, సముద్రపు దరి, మంత్రము మొదలైన వానికి సూర్యుడు అధిపతి.