వాడుకరి చర్చ:Kalasagary

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

Kalasagary గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Kalasagary గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

వికీపీడియాలో దిద్దుబాట్లు ఎలా చెయ్యాలో మీకు వివరించేందుకు, మీ సందేహాలను తీర్చేందుకూ వాడుకరి:Chaduvari గారిని ప్రత్యేకంగా మీకోసం గురువుగా కేటాయించారు. ఏ సంకోచమూ లేకుండా వారిని మీ సందేహాలు అడగవచ్చు. మీకు ప్రత్యేకంగా ఒక హోంపేజీ కూడా ఉంది చూడండి. అక్కడ మీకవసరమైన ఏ సహాయమైనా చేసేందుకు Chaduvari గారు సిద్ధంగా ఉన్నారు. వారిని పలకరించండి.
 • తెలుగు వికీపీడియా పరిచయానికి వికీపీడియాలో రచనలు చేయుట (2014 ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
 • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
 • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
 • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని (OOUI JS signature icon LTR.png) బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
 • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
 • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
 • వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

ఇకపోతే..


 • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
 • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
 • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 07:15, 4 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఆహ్వానం WPWP పునసమీక్షా సమావేశం[మార్చు]

వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 లో మీ చేర్పులకు ధన్యవాదములు, ఇందులో భాగంగా జూలై 15వ తేదీ సాయంత్రం 7.00 నుండి 8.00 IST వరకు జరుగుతున్న సభ్యుల పునసమీక్షా సమావేశంలో గూగుల్ మీట్ ద్వారా చేరగలరు (లింకు) Or Open Google Meet and enter this code: bqk-vdyf-gzc , ప్రాజెక్టు జరిగే కాలంలో ఇందులో పాల్గోనే అందరూ సబ్యులూ వీలయితే నేర్చుకొన్న విషయాలు పంచుకోవచ్చు,సూచనలు కూడా చేయవచ్చు, కొత్త వారికి ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది.

మీ వాడుకరి పేజీ తొలగింపు[మార్చు]

నమస్కారం @వాడుకరి:Kalasagary గారు, మీరు వికీలో రాసే వ్యాసాలు దిద్దుబాట్లు చేసే వ్యాసాలు పూర్తి ప్రచార దృక్పధంతో ఉన్నాయి. ఇటువంటినవి రాయదగినవి అనిపిస్తే వాటికి తగు మూలాలు చూపండి. మీరు 64 కళలు (తెలుగు అంతర్జాల పత్రిక) వ్యాసం మీ వాడుకరి పుటలో అల్లాగే వేరేవారి చేతనో ప్రధాన పేరుబరిలో సృష్టింపజేసినట్లుంది. ఇదే ఆంగ్ల వికీలో అయితే ఇప్పటికి మీరు ఈ విదంగా రాసిన వ్యాసాలూ అన్ని తొలగింపుకు గురయ్యేవి. కావున ఇకనైనా కాస్త గమనించి వికీ నియమాలకు అనుగుణంగా దిద్దుబాట్లు చేయండి. మీ వాడుకరి పేజీని తొలగింపుకు ప్రతిపాదించాను, దాంట్లోని ప్రచార అంశం తొలగించి ఈ తొలగింపుని సవాలు చేయవచ్చు. కాలవిరాగ్య (చర్చ) 06:51, 12 ఆగస్టు 2021 (UTC) {{subst:db-spamuser-notice|వాడుకరి:Kalasagary|nowelcome=|{{{key1}}}={{{value1}}}}} కాలవిరాగ్య (చర్చ) 06:41, 12 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Contested deletion[మార్చు]

సాయి కిరణ్ గారికి,

కళా సాగర్ గారు ఇటీవలె జరిగిన ఒక వికీ సమావేశంలో శిరీష్ గారిని కలిసి, తన వద్ద స్థానిక కళాకారుల గురించి అపారమైన సమాచారం, ఫోటోలు ఉన్నవి అని, తన వద్ద ఉన్న సమాచారం తో వికీకి తోడ్పడాలని ఉందని, దీనిని నిశానిర్దేశం చేయవలసిందని కోరారు. అంతకు మునుపు కొన్ని ఏళ్ళ క్రితం, రాజశేఖర్ గారి ప్రాజెక్టు కళాసమాహారం లో భాగంగా ప్రాజెక్టు:చిత్రలేఖనం మొదలు పెట్టిన నాకు, కళాసాగర్ గారిని శిరీష్ గారు పరిచయం కుదిర్చారు. దీనిపై శిరీష్, రాజశేఖర్, పవన్ వంటి వారితో ఈ ప్రాజెక్టును, కళాసాగర్ గారి వద్ద ఉన్న సమాచారంతో ఎలా ముందుకు తీసుకువెళ్ళాలో కూలంకుషంగా చర్చించాను. సహ వికీపీడియను, కళాకారుడు అయిన విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో వ్యాసరచన మొదలు పెట్టమని సలహా ఇచ్చాను.

 • కళాసాగర్ గారు వ్రాసిన వ్యాసం ఇంకా పూర్తి కానే లేదు. ఇదే విషయాన్ని తెలుపుతూ వ్యాసం మొదట్లోనే ఆయన ట్యాగు కూడా ఉంచారు.
 • వ్యాసం పూర్తి అయ్యి, తగు మూలాలు లేవని అనిపిస్తే, వ్యాసం చర్చా పేజీ లో దానిని సవాలు చేయటం సమంజసం అనుకొంటున్నాను. నిర్ధారిత సమయంలో మూలాలు చూపించలేకపోయిన చో, వ్యాసం తొలగించినా తప్పు లేదు.
 • తమ వద్ద ఉన్న సమాచారం, ఫోటో ల పై నకలు హక్కులను ఉపసంహరించుకొని, వికీ కి సేవలను అందించాలని ఉన్నత భావాలతో పని చేసే వారిని నిరుత్సాహ పరచటం, వికీ నియమాలను విరుద్ధం కావచ్చు.

పై విషయాలను దృష్టిలో ఉంచుకొని, వ్యాస/వాడుకరుల తొలగింపు విషయంలో వేచి చూచే ధోరణి మంచిదని నా అభిప్రాయం!

అర్జునరావు గారిని కూడా స్పందించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను! - శశి (చర్చ) 16:21, 12 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్కారం శశి గారు, అయితే కళా సాగర్ గారు తమ కృషిని నకలు హక్కులు ఉపసంహరించుకొని వికీలో చేర్చాలనుకున్నందుకు అభినందనలు, ధన్యవాదాలు. అయితే నిర్వాహక స్థాయిలో ఉన్న విశ్వనాథ్ గారు లేదంటే రాజశేఖర్ గారు ఈ వ్యాసాలను వికీలో చేర్చేటప్పుడు ఎలా చేర్చాలో , మూలలను చేర్చడం , విశ్వసనీయత గురించి తప్పక సూచించి ఉంటారని నమ్ముతున్నాను. అయితే ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి నిర్మిస్తున్న వ్యాసాలలో విశ్వసనీయత లేదు వీటికి సంబందించిన మూలాలు నేనే స్వయంగా చేరుద్దమని ప్రయత్నించగా ఈ వ్యాస అంశాలు గాని వ్యక్తుల గురించి గాని అంతర్జాలం లో ఎక్కడ దొరకలేదు. అలాగే ఈ వ్యాసాలలో వికీ శైలికి పూర్తి విరుద్దంగా గౌరవ , ప్రముఖ వంటి పదాలు ఉపయోగిస్తున్నారు. ఈ అంశాలనన్నిటిని దృష్టిలో ఉంచుకొని కనీస ప్రమాణాలతో వ్యాసాలు నిర్మించాలి. ఇక పోతే ఈ వ్యాసాలు నిర్మించడంలో కళాసాగర్ ఉదారభావం ఏమాత్త్రం కనపడకపోగా, కేవలం ప్రచార దృక్పధంతో ఈ వ్యాసాలను నిర్మిస్తున్నట్టుంది.కాలవిరాగ్య (చర్చ) 16:38, 12 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అందరికి నమస్కారం

నేను కళాసాగర్ గత నెలలోనే వికీలో ప్రవేశించాను. శిరీష్ గారు, శశిగారు, విశ్వనాథ్ గారు, రాజశేఖర్ గార్ల మార్గనిర్దేశకత్వం లో ఇప్ప్పుడిప్పుడే వ్యాసాలు రాస్తున్నాను. వ్యాసరచనలో గత అనుభవమున్నా వికీలో రాసే పద్దతికి నేను అలవాటు పడడానికి కొంత సమయం పడుతుంది. దీని అర్థం చేసుకొని నా సహ రచయితలందరూ ఈ విషయం లో నాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను. -- 2021-08-14T13:27:38‎ Kalasagary

కళాసాగర్ గారికి[మార్చు]

నమస్కారం @ కళాసాగర్ గారు, మీరు వికీలో రాయటం మొదలు పెట్టినందుకు అభినందనలు. మీరు వికీలో రాసే పద్దతి చాలా బాగుంది. అయితే మీరు రాసే అంశాలకు కనీసం 2-4 మూలాలు, లేని పక్షంలో 1 మూలం అయినా సరే అది వ్యాస విశ్వవాసనీయత చూపగలిగితే వికీ ప్రమాణాలకు దగ్గరగా వచ్చినట్లే. మీరు రాసిన విషయాలు పూర్తి ప్రచార దృక్పధంతో నాకనిపించటంతో కొన్ని దిద్దుబాట్లు చేయాల్సి వచ్చింది. అలాగే రచ్చబండలో విశ్వనాధ్ గారు మీతో నాకేదో వైరం ఉన్నట్టు రాసారు, మీకు నాకు వికీ పరిచయమే తప్ప వేరొక ఆలోచన లేదని గమనించగలరు. ఇప్పడే చూసాను 64 కళలు అని రాసుకున్న మీ వాడుకరి పేజీలోని శీర్షికను మార్చారు, సంతోషం వికీ గురించి కొంచెం అవగాహన కలిగిందని నమ్ముతున్నాను. మీరు రాసే వ్యాసాలలో ఎటువంటి సహాయం అయినా చేయడానికి నేను సిద్ధం, కానీ వ్యాస అంశాలు వికీ నియమాలకు లోబడి ఉండి ప్రచార దృక్పధం లేకుండా ఉండాలి. మీరు నిర్మిస్తున్న మన్నె శ్రీనివాసరావు, సురేంద్ర (కార్టూనిస్ట్), సుభాని (కార్టూనిస్ట్) వ్యక్తుల గురించి అంతర్జాలంలో దొరకడంలేదు, ఒకవేళ మన తెలుగు పత్రికల్లో ఇది వరకు ప్రచురించినవి(onlineలో లేకుండా) ఉంటె వాటిని మూలాలుగా చూపడానికి ప్రయత్నించండి. ఇంకా ఏదైనా సహాయం కావాలంటే నా చర్చా పేజీలో రాయండి. కాలవిరాగ్య (చర్చ) 08:22, 14 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు, అభినందనలు[మార్చు]

కళాసాగర్ గారూ, మనిద్దరం మాట్లాడుకున్నపుడు మీ గురించి నేను గ్రహించినది ఇది: తెలుగు వారిలో ఉన్న చిత్రకారుల గురించి, కార్టూనిస్టుల గురించీ మీవద్ద విలువైన సమాచారం ఉంది. దాన్ని వికీలో చేర్చాలనే తాపత్రయం ఉంది. దానికి తగ్గట్టుగా మీరు వెంటనే ఆ పని మొదలెట్టారు. అందులో మీకు సహాయం అవసరమైనపుడు నన్ను సంప్రదించారు. నేను చెయ్యగలిగినంత సాయం చేసాను. మీరు చాలా త్వరగా నేర్చుకున్నారు. త్వరగా అల్లుకుపోతారని కూడా భావించాను.

అయితే వికీ శైలికీ ఇతర ప్రచురణల్లోని శైలికీ తేడా ఉంటుంది. వికీది విజ్ఞాన సర్వస్వ శైలి - నిర్మోహంగా, వర్ణనలు లేకుండా, భావోద్వేగ రహితంగా రాయడం విజ్ఞాన సర్వస్వ శైలి. వేరే ప్రచురణల్లో పెద్దగా అనుభవం లేని వారికి ఈ శైలిని నేర్చుకోవడం బహుశా తేలిక కావచ్చు. వెబ్ పత్రికల వంటి వేరే ప్రచురణల్లో ఎంతో కాలంగా పనిచేస్తూ అనుభవం గడించిన మీవంటి వారికి ఈ కొత్త శైలి అలవడడం కొంత - కొంతే - ఎక్కువ సమయం పడుతుందని నేను గ్రహించాను. ప్రస్తుతం జరిగిన చర్చతో మీకు ఈ విషయమై అవగాహన వచ్చే ఉంటుంది.

వికీ పద్ధతులు, వికీశైలీ ముందే వచ్చి ఉండాలని ఎవరూ కోరుకోరు. అవి నేర్చుకోవడానికి కొంత సమయం పడుతుంది. మీరు వెనకాడకండి, రాసుకుంటూ పొండి. పద్ధతులు వాటంతట అవే అలవడతాయి. అవసరమైన చోట్ల ఇతరులు నేర్పిస్తారు. మనం చేర్చే సమాచారం సరైనదనీ, దాన్ని నిరూపించే మూలాలను చేర్చగలమనీ మాత్రం నిర్థారించుకోండి. వెనకాడకుండా ముందుకు సాగిపోండి. మీరు మొదలెట్టిన పనిని కొనసాగించండి. ధన్యవాదాలు. __ చదువరి (చర్చరచనలు) 05:35, 16 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు[మార్చు]

శిరీష్ కుమార్ గారికి ధన్యవాదాలు. కళాసాగర్

సురేంద్ర (కార్టూనిస్ట్) వ్యాసం తొలగింపు ప్రతిపాదన[మార్చు]

సురేంద్ర (కార్టూనిస్ట్) వ్యాసం వికీపీడియా విధానాలు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉందా లేక దాన్ని తొలగించాలా అనే విషయమై ఒక చర్చ జరుగుతోంది.

ఒక అభిప్రాయానికి వచ్చేంతవరకు ఈ విషయంపై వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/సురేంద్ర (కార్టూనిస్ట్) వద్ద చర్చ జరుగుతుంది. చర్చలో ఎవరైనా పాల్గొనవచ్చు. చర్చ విధానాలు మార్గదర్శకాలపై ఆధారపడి, వాటిని ఉదహరిస్తూ జరుగుతుంది.

చర్చ జరుగుతూండగా వాడుకరులు ఈ వ్యాసంలో మార్పుచేర్పులు చెయ్యవచ్చు. చర్చలో లేవనెత్తిన అభ్యంతరాలను సరిచేసే దిద్దుబాట్లు కూడా చెయ్యవచ్చు. అయితే, వ్యాసంలో పైభాగాన ఉన్న తొలగింపు నోటీసును మాత్రం తీసెయ్యరాదు. పవన్ సంతోష్ (చర్చ) 11:46, 19 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

నేను రాసిన సురేంద్ర (కార్టూనిస్ట్) వ్యాసం స్థానంలో కార్టూనిస్ట్ సుభాని వ్యాసం(ఫోటో తో సహా) కనిపిస్తుంది. సుభాని(కార్టూనిస్ట్) వ్యాసం యదావిధిగ కనిపిస్తుంది. ఎందుకనో? కళాసాగర్

ఆహ్వానం : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం - మొదటి Edit-a-thon ( 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకు)[మార్చు]

నమస్కారం ,

తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం ప్రాజెక్టు పేజీ చూడగలరు : Kasyap (చర్చ) 03:43, 1 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అభినందనలు[మార్చు]

వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 ప్రాజెక్టులో మీ కృషి ప్రశంసనీయం. అభినందనలు. త్వరలో మీకు WPWP సావినీర్లు, సర్టిఫికెట్ పంపబడతాయి. దయచేసి వెంటనే ఈ క్రింది లంకెలో ఉన్న ఫారంలో మీ వివరాలు తెలియజేయండి.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSd-TaLmENAW9Y3HbSDtLyBsneiZqiGFbStEjrr-lC9ASAZywA/viewform

--స్వరలాసిక (చర్చ) 09:58, 9 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు ఎక్కించిన సముచిత వినియోగ వివరాలు లేని ఫైళ్లు[మార్చు]

@Kalasagary గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడారు కాని, వాటికి సముచిత వినియోగం వివరాలు చేర్చలేదు. కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.

వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడుతున్నారో, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో {{Non-free use rationale 2}} లేక అటువంటి మూస వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 01:11, 11 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]