వికీపీడియా:అధికార హోదా కొరకు విజ్ఞప్తి/ప్రణయ్‌రాజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రణయ్‌రాజ్[మార్చు]

మద్దతుకు కాల పరిమతి (2023, జూన్ 20 నుండి జూన్ 27 వరకు)

సభ్యులకు నమస్కారం, నేను గత పదేగేళ్లుగా తెవికీలో పనిచేస్తున్నాను. ఇందులో సగం సమయం వ్యాసాలకు పోతే మిగిలిన సమయమంతా నిర్వహణాపరమైన కార్యక్రమంలో పాల్గొనటానికే కేటాయించాను. వికీ నెలవారి సమావేశాలు, ఉత్సవాలు, అకాడమీలు, శిక్షణ శిబిరాలు, అవగాహన సదస్సులు నిర్వహించి అనేకమందికి తెలుగు వికీపీడియాను పరిచయం చేశాను. తెవికీలో గత ఆరున్నరేళ్ళుగా రోజుకొక వ్యాసం చొప్పున రాస్తూ, ప్రపంచ వికీపీడియాల్లో ఆ ఘనత సాధించిన మొదటి వికీపీడియన్ గా రికార్డును సృష్టించాను. అంతేకాకుండా వివిధ వికీ ప్రాజెక్టులు నిర్వహించాను, పలు ప్రాజెక్టులలో భాగస్వామిగా సహకారం అందించాను. 2016 నవంబరు 8న నిర్వాహకుడిగా బాధ్యతలు స్వీకరించాను. నా నిర్వాహకత్వ స్వీయ సమీక్షను ఇక్కడ చూడవచ్చు.

ప్రస్తుత అధికారులు క్రియాశీలకంగా లేరు. ఈ క్రమంలో నేను కూడా ఆ బాధ్యతలను స్వీకరించడానికి ముందుకొస్తున్నాను. కనుక నేనే స్వతంత్రించి అధికార హోదా కొరకు విజ్ఞప్తి చేస్తున్నాను. సభ్యులు తమ మద్దతును క్రింద తెలియచేయగలరు. ఇంకేదైనా ప్రశ్నలుంటే చర్చాపేజీలో రాయండి, నేను స్పందిస్తాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 11:37, 20 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]


మద్దతు (In favour)
  1. నిర్వాహక కార్యకలాపాలపై ప్రణయ్ రాజ్ గారికి ఆసక్తి ఉన్నదనీ, అందుకు తగ్గ కృషి కూడా ఆయన వైపు నుంచి ఉన్నదని ఆయన నిర్వాహకత్వ సమీక్షలు నిరూపిస్తున్నాయి. అందుకు తోడు ఇటీవల చదువరి గారు అధికార హోదా నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు సచేతనంగా ఉన్న అధికారులు ఎక్కువగా లేకపోవడం అనే సమస్య కూడా వికీపీడియాకు ఉన్నది. కాబట్టి, ప్రణయ్ రాజ్ గారికి అధికార హోదా లభించడానికి నేను మద్దతు ఇస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 12:41, 20 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  2. ప్రణయ్‌రాజ్ గారు అధికారిగా బాధ్యతలు చక్కగా నిర్వర్తించగల శక్తి, నేర్పు అతనిలో ఉన్నవని భావించి,అధికార హోదా పొందటానికి నేను మద్దతు ఇస్తున్నాను. --యర్రా రామారావు (చర్చ) 15:11, 20 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  3. ప్రతి రోజు తెలుగు వికిపీడియాలో వ్యాసాలు రాస్తూ,నిర్వాహకుడిగా క్రియాశీలంగా వ్యవహరిస్తున్న ప్రణయ్‌రాజ్ గారికి తెలుగు వికిపీడియా సమావేశాలు,సదస్సులు,ఉత్సవాల నిర్వాహణలో,మంచి అనుభవం ఉన్నది,అంతేకాక వేరే భాషల సముదాయాలతో & WMF వారితో మంచి గుర్తింపు ఉన్నది,సాంకేతిక అంశాలు,విధాన పరిజ్ఞానం మీద మరింత పట్టు సాధిస్తూ,అధికారిగా సహేతుకమైన దృక్పథాన్ని,ఉన్నత ప్రమాణాలు తీసుకువస్తారని ఆశిస్తూ, ప్రణయ్‌రాజ్ గారు అధికార హోదా పొందటానికి నా మద్దతు ప్రకటిస్తున్నాను.--Kasyap (చర్చ) 07:34, 21 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  4. ప్రణయ్‌రాజ్ గారు అధికార హోదా పొందటానికి నేను మద్దతు ఇస్తున్నాను. --Divya4232 (చర్చ) 08:40, 21 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  5. ప్రణయ్‌రాజ్ గారు అధికార హోదా పొందటానికి నా మద్దతు ప్రకటిస్తున్నాను. ----Tmamatha (చర్చ) 08:41, 21 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  6. ప్రణయ్ రాజు గారు తెలుగు వికిపీడియా వ్యాసరచనలో, నిర్వాహకులుగా చక్కటి కృషిచేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు,సమావేశాలు,సదస్సులు,ఉత్సవాల నిర్వాహణలో చురుకుగా ఉంటున్నారు. అతనికి అభినందనలతో అధికార హోదా పొందటానికి నా మద్దత్తు తెలుపుతున్నాను.--VJS (చర్చ) 08:57, 21 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  7. ప్రణయ్ రాజు గారు తెలుగు వికీపీడియా అభివుద్ధిలో తమ వంతు కృషి చేయడమే గాక, కొత్త వాడుకరులకు ప్రోత్సహం ఇచ్చే వ్యక్తి. వారు ప్రతిపాదించిన అధికార హోదా పొందటానికి నా సంపూర్ణ మద్దతును తెలుపుతున్నాను.--Prasharma681 (చర్చ) 14:09, 21 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  8. ప్రణయ్‌రాజ్ గారు అధికార హోదా పొందటానికి నా మద్దతు ప్రకటిస్తున్నాను.--Batthini Vinay Kumar Goud (చర్చ) 16:48, 21 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  9. ప్రణయ్‌రాజ్ గారు అధికార హోదా పొందటానికి నేను మద్దతు ఇస్తున్నాను.Ch Maheswara Raju☻ (చర్చ) 06:30, 22 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  10. నేను తెలుగు వికీపీడియన్‌ని కాకపోయినా ఆఫ్లైన్ లోకంలో ప్రణయ్‌రాజ్ అన్నతో దగ్గర దగ్గర ఏడేళ్ళ సుదీర్ఘమైనటువంటి పరిచయం. నాకు తెలిసినంత వరకు ఈ కాలవ్యవధిలో ఆయన చేపట్టిన ఏ కార్యక్రమంలోనూ సముదాయ సభ్యులను ఆయన నిరాశ పరచలేదు.
    ఆఫ్లైన్ సాధకాల గురించి ఆయన మీద ఎంత నిశ్చయంగా అయితే ప్రశంసల వర్షం కురిపించగలనో ఆయన ఆన్లైన్ సహకారం గురించి, తెలుగు వికీపీడియాలో నేను రాయనప్పటికీ చెప్పగలను ఎందుకంటే వికీడేస్ ఛాంపిన్‌గా ఇవాళ ఆయన ప్రత్యేక గుర్తింపు సంపాదించారన్నది అందరికి తెలిసిన విషయమే. కావున, ప్రణయ్ అన్నకి ఈ హోదా ఇచ్చుటకు నా మద్దతు తెలుపుకుంటున్నాను. -- Mouryan (చర్చ) 09:51, 22 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  11. ప్రణయ్ నిబద్దత కలిగిన వాడుకరి.కనుక ఆయన తన భాద్యతలను సక్రమంగా నిర్వహించగలరని బావిస్తాను..--B.K.Viswanadh (చర్చ) 10:28, 22 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  12. ప్రణయ్‌రాజ్ గారు అధికార హోదా పొందటానికి నేను మద్దతు ఇస్తున్నాను.ఆదిత్య పకిడే Adbh266 (చర్చ) 10:33, 22 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  13. నిర్వాహకుడిగా క్రియాశీలంగా వ్యవహరిస్తున్న ప్రపంచవ్యాప్తంగా తెలుగు వికిపీడియాకు మంచిస్థానంలోనికి తీసుకొనివెళ్ళడానికి నిర్విరామ కృషిచేస్తున్న ప్రణయ్‌రాజ్ గారికి తెలుగు వికిపీడియా సమావేశాలు, సదస్సులు, ఉత్సవాల నిర్వాహణలో, మంచి అనుభవం ఉన్నది, అంతేకాక వేరే భాషల సముదాయాలతో మంచి గుర్తింపు ఉన్నది, సాంకేతిక అంశాలు, విధాన పరిజ్ఞానం మీద మరింత పట్టు సాధిస్తూ, అధికారిగా సహేతుకమైన దృక్పథాన్ని, ఉన్నత ప్రమాణాలు తీసుకువస్తారని ఆశిస్తూ, ప్రణయ్‌రాజ్ గారు అధికార హోదా పొందటానికి నా మద్దతు ప్రకటిస్తున్నాను. వారికి నా శుభాకాంక్షలు.--Rajasekhar1961 (చర్చ) 12:02, 22 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  14. ప్రణయ్‌రాజ్ గారు అధికార హోదా పొందటానికి నేను మద్దతు ఇస్తున్నాను. --V Bhavya (చర్చ) 05:40, 22 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  15. ఆయన సమర్థత కలిగిన, మంచి అవగాహన కలిగిన వ్యక్తి.ప్రణయ్‌రాజ్ గారు అధికార హోదా పొందటానికి నేను మద్దతు ఇస్తున్నాను. --Ramesam54 (చర్చ) 12:47, 22 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  16. ప్రణయ్‌రాజ్ గారు అధికార హోదా పొందటానికి నేను మద్దతు ఇస్తున్నాను. Thirumalgoud (చర్చ) 09:15, 23 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  17. ప్రణయ్‌రాజ్ గారు అధికారిగా బాధ్యతలు చక్కగా నిర్వర్తించగల శక్తి, నేర్పు అతనిలో ఉన్నవని భావించి,అధికార హోదా పొందటానికి నేను మద్దతు ఇస్తున్నాను.➤ కె.వెంకటరమణచర్చ 14:43, 23 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  18. నేను కూడా ప్రణయ్‌రాజ్ గారికి ఓటు వేస్తున్నాను. -Muralikrishna m (చర్చ) 04:35, 24 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  19. నేను కూడా ప్రణయ్‌రాజ్ గారికి ఓటు వేస్తున్నాను. --శ్రీరామమూర్తి (చర్చ) 12:21, 24 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  20. నిర్వాహకుడిగా, వికీమీడియన్ గా చక్కటి కృషి చేస్తూ తెలుగు వికీపీడియాలో ఆదర్శప్రాయంగా దిద్దుబాట్లు చేస్తున్న ప్రణయ్ రాజ్ వంగరి గారు అధికారిగా తెలుగు వికీపీడియాకు సరైన దిశా నిర్దేశం అందించేవారిలో ఒకరిగా నిలుస్తారని, ఎప్పటిలాగే వికీపీడియా స్ఫూర్తి కొనసాగిస్తూ రానున్న రోజుల్లో తెలుగు వికీపీడియాని తెలుగు వారందరు దిద్దుబాటు చేసే దిశగా కృషి చేస్తారని ఆశిస్తూ, ఆయనకీ నా మద్దతు తెలుపుతున్నాను. NskJnv 15:48, 24 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  21. వికీకి అధికారులు కావాలిప్పుడు. ఎలాంటివారు కావాలంటే..
    1. చురుగ్గా ఉండే అధికారులు కావాలి. ప్రణయ్ రాజ్ గారు వికీలో చురుగ్గా ఉంటారు కాబట్టి, ఆ ముఖ్యమైన లక్షణం ఉన్నట్లే.
    2. చర్చల్లో చురుగ్గా పాల్గొనేవారు కావాలి. తెవికీ లాంటి చిన్న సముదాయంలో, చురుగ్గా ఉండే వాడుకరులు మరీ తక్కువగా ఉండే చోట, కనీసం నిర్వాహకులు అధికారులైనా చురుగ్గా ఉండాలి. ప్రణయ్ గారు చురుగ్గా ఉంటున్నారు కాబట్టి ఈ రెండో ముఖ్యమైన లక్షణం కూడా ఉన్నట్టే.
    3. మూడవది, విధానాలు మార్గదర్శకాలు, పని పద్ధతులు మొదలైనవాటి పట్ల చొరవగా ఉండి కొత్త వాటిని ప్రతిపాదించడం, పాతవాటిని సవరించడం వంటివి చేస్తుండాలి. వీటిపై ఆయన శ్రద్ధ పెట్టాలి.
    4. అనుభవజ్ఞులు, సీనియర్లు, నిర్వాహకులు, అధికారులు - వీళ్ళ దిద్దుబాట్లు చూస్తే ప్రధానబరిలో మెజారిటీ దిద్దుబాట్లు ఉన్నప్పటికీ మూస, వికీపీడియా, వర్గం వంటి వాటిలో కూడా గణనీయం గానే ఉంటూంటాయి. ప్రణయ్ రాజ్ గారికి ప్రధానబరిలో 94% ఉండి, మిగతావాటిలో బాగా తక్కువగా ఉన్నై. ఈ రంగంలో ఆయన మెరుగుపరచుకోవాలని నా అభిప్రాయం. రవిచంద్ర (ప్రధానబరిలో 71%), పవన్ సంతోష్ (73%),వెంకటరమణ (ప్రధానబరిలో 75%) గార్ల దిద్దుబాట్లు పరిశీలిస్తే ఈ తేడా తెలుస్తుంది.
ఈ వ్యాఖ్యలతో ప్రణయ్ రాజ్ గారి ప్రతిపాదనకు నా మద్దతు ఇస్తున్నాను. __చదువరి (చర్చరచనలు) 00:08, 25 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  1. నా వోటు ప్రణయ్ రాజ్ గారికి Svpnikhil (చర్చ) 16:43, 25 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  2. తెలుగు వికీ పట్ల నిబద్ధత కలిగిన వాడుకరిగా, నిర్వాహకుడిగా ప్రణయ్ రాజ్ ప్రతిపాదనను సమర్ధిస్తున్నాను. - రవిచంద్ర (చర్చ) 17:58, 25 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  3. తెవికీ పట్ల అత్యధిక సమర్థత కలిగిన, మంచి అవగాహన కలిగిన వ్యక్తి ప్రణయ్‌రాజ్ గారు కాబట్టి అధికారిక హోదా పొందటానికి నేను మద్దతు ఇస్తున్నాను. --అభిలాష్ మ్యాడం (చర్చ) 07:21, 26 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్ణయం ప్రకటన చేయుటను కోరుట గురించి

ప్రణయ్‌రాజ్ గారు అధికారిగా భాధ్యతలు నిర్వర్తించటానికి చేసుకున్న స్వీయప్రతిపాదనకు ఓటింగుకు నిన్నటితో (2023 జూన్ 27) తో గడువు ముగిసింది.దీని ఓటింగులో పాల్గొనని నిర్వాహకులలో ఎవరైనా ఈ రోజు సాయంత్రం (2023 జూన్ 28) లోగా నిర్ణయం ప్రకటించవలసినదిగా కోరుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 05:40, 28 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]

@రహ్మానుద్దీన్, @Veeven, @Arjunaraoc, @T.sujatha గార్లు ఈ చర్చలో అభిప్రాయాలు వ్యక్తం చేయని నిర్వాహకులు. కాబట్టి, వీరిలో ఎవరైనా నిర్ణయాన్ని వెలువరిస్తారని ఆశిస్తున్నాను. లేని పక్షంలో @యర్రా రామారావు గారే ఒకటి రెండు రోజులు చూసి నిర్ణయాన్ని వెలువరించవచ్చని అభిప్రాయపడుతున్నాను. పవన్ సంతోష్ (చర్చ) 04:46, 30 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
24 మంది అనుకూలంగా స్పందించారు. వ్యతిరేకత అసలే లేదు. నిర్ణయం ప్రకటించమని కోరి మూడ్రోజులైంది, ఎవరూ ముందుకు రాలేదు. కాబట్టి చర్చలో పాల్గొన్న వారు వెంటనే నిర్ణయం ప్రకటించవచ్చు అని నా అభిప్రాయం. __చదువరి (చర్చరచనలు) 15:33, 1 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యతిరేకత (Oppose)
తటస్థం (Neutral)
ఫలితం (Result)

ప్రణయ్‌రాజ్ గారు అధికారిగా భాధ్యతలు నిర్వర్తించటానికి చేసుకున్న స్వీయప్రతిపాదనకు, గడువులోపు సముదాయంలోని క్రియాశీలక సభ్యులు 24 మంది అనుకూలంగా స్పందించారు.ఎవరూ వ్యతిరేకత వ్యక్తం చేయలేదు.తటస్థంగా కూడా ఎవరి స్పందనలు లేవు. కావున ప్రణయ్‌రాజ్ గారు అధికారి హోదాలో బాధ్యతలు నిర్వర్తించటానికి చేసుకున్న స్వీయప్రతిపాదన విజయవంతమైనట్లు ప్రకటించటమైనది.--యర్రా రామారావు (చర్చ) 16:39, 1 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]

అధికారి హోదాలో ఉన్న రాజశేఖర్ గారు, ప్రణయ్‌రాజ్ గార్కి అధికార బాధ్యతలు సంక్రమించటానికి తగిన చర్యలు తీసుకొనవలసినదిగా కోరుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 16:40, 1 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]
నా మీద నమ్మకంతో నాకు మద్ధతు తెలిపిన వికీ సభ్యులకు ధన్యవాదాలు. మీ అందరి సహకారంతో ఈ కొత్త బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలనని అనుకుంటున్నాను.--