వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు
ప్రాజెక్టు ఆలోచన
[మార్చు]మాటల బాబూ! ఈ మార్గదర్శక వ్యాసం చాలా బాగుంది. కాని ఈ వ్యాసాన్ని చదువరులకు, వ్రాసేవారికి పరిచయం చేయాలి. నావి కొన్ని సూచనలు - నీ వీలును బట్టి అమలు చేయమని కోరుతున్నాను (1) ఈ వ్యాసంలోనే జిల్లాల జాబితాను కూర్చు. ఇక్కడినుండే ఏ జిల్లా వ్యాసానికైనా లింకు దొరుకుతుంది. (2) ఈ వ్యాసం లింకు రచ్చబండలో ఒకసారి ప్రకటించు. (3) నువ్వు కొత్త సభ్యులకు స్వాగతం చెప్పేటప్పుడు "మీ జిల్లా గురించి వ్రాయండి. వివరాలకు [[వికీపీడియా:WikiProject/ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు|ఇక్కడ చూడండి]]" (4) ఒక్కో జిల్లా వ్యాసం మొదట్లో "ఈ వ్యాసం విస్తరణకు సహకరించండి. మార్గదర్శకాలకు [[వికీపీడియా:WikiProject/ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు|ఇక్కడ చూడండి]] అని ఒక వాక్యం చేర్చు. --కాసుబాబు 07:59, 19 సెప్టెంబర్ 2007 (UTC)
- ఈ ప్రాజెక్టులో భాగంగానే మనం ఇది వరకు ఎక్కడో చర్చించుకున్న విధంగా రాష్ట్రములో ఆయా జిల్లాల యొక్క స్థానాన్ని సూచిస్తున్న పటాలు తయారు చేస్తే బాగుంటుంది. --వైజాసత్య 10:23, 19 సెప్టెంబర్ 2007 (UTC)
జిల్లా పేజీలలో మూస
[మార్చు]ప్రతి జిల్లా పేజీలోని ప్రారంభంలోని మూస మార్చాల్సి ఉన్నది. జిల్లా పేజీ కోసం ఒకటి పట్టణం పేజీ కోసం ఒకటిగా చేస్తే బాగుంటుంది.Rajasekhar1961 09:05, 9 జనవరి 2012 (UTC)
- నేను దీనిగురించి కొంత పరిశోధన చేశాను. అయితే దీనికి సరిపోలిన ఇంగ్లీషులో ప్రస్తుతము వాడుతున్నదానినే తొలగించబోతున్నారు. ప్రస్తుతానికి ఇదే మూసని వాడండి. సాంకేతిక సభ్యులు ఎక్కువైన తరువాత దీని సంగతి చూద్దాం.--అర్జున 12:33, 9 జనవరి 2012 (UTC)
- ప్రస్తుతం ఉన్న పేజీలకే మండల, గ్రామ వ్యాసాల నుంచి లింకులున్నాయి కాబట్టి ప్రస్తుతం ఉన్న పేజీలను జిల్లా పేజీలుగా కొనసాగిస్తూ జిల్లా పదంతో ఉన్న పేజీలను దీనికి దారి మార్పు ఇచ్చేస్తే సరిపోతుంది. పట్టణం పేరుతో కొత్తగా పేజీలను సృష్టిద్దాం. నేను మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి ఇలాగే చేశాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:41, 9 జనవరి 2012 (UTC)
- దారిమార్పు కంటే కొత్త పేరుకుమార్చటమే మంచిదేమో?ఎందుకంటే గుంటూరు అని టైపు చేసినప్పుడు గుంటూరు నగరానికి సంబంధించిన సమాచారం వస్తుందని ఊహిస్తారు కాని జిల్లాసమాచారం కాదుకదా. --అర్జున 04:41, 10 జనవరి 2012 (UTC)
వాతావరణం మూస
[మార్చు]ఆంగ్ల వికీ నుండి తెచ్చిన వాతావరణం మూస విజయనగరం జిల్లా వాతావరణం విభాగంలో ఉంచాను. ఇది బాగున్నది. కొన్ని సవరణలు చేసి ప్రతి జిల్లా లోనూ చేర్చితే బాగుంటుంది.Rajasekhar1961 06:41, 11 జనవరి 2012 (UTC)
ఆహ్వానాలు
[మార్చు]శ్రీకాకుళం గురించి విస్తృత సమాచారాన్ని అందించిన "శేషగిరిరావు" గారిని అలాగే విశాఖపట్నం గురించి మంచి వ్యాసాన్ని రచించిన "తలపాగల" గారిని ఆయా జిల్లాలలోని సమాచారాన్ని విస్తరించమని ఆహ్వానిస్తే బాగుంటుందని అనిపిస్తుంది. వారు సిద్ధంగా లేకపోతే నేను విస్తరించడానికి తయ్యారుగా ఉన్నాను. వారు సహాయకులుగా తప్పులు లేకుండా చూసినా సరే.Rajasekhar1961 05:29, 10 జనవరి 2012 (UTC)
సమీక్ష
[మార్చు]ఈ ప్రాజెక్టు మరల మొదలై మూడు నెలలయ్యింది. దీనికి సహకరించిన ప్రాజెక్టు సభ్యులకు ధన్యవాదాలు. నేను కొంతవరకు సమీక్ష చేసి నా అభిప్రాయాలు ప్రాజెక్టులో రాశాను. మీరు మీ ఆలోచనలు పంచుకోండి.--అర్జున (చర్చ) 13:42, 7 ఏప్రిల్ 2012 (UTC)
ఆంధ్రప్రదేశ్ జిల్లాల ప్రాజెక్ట్
[మార్చు]అర్జునరావుగారూ ! విద్యాసంస్థలు అన్న మూసను తయారు చేసి అనంతపురం జిల్లాలో పెట్టాను. మీరు ఒక సారి పరిశీలించి చూసి చెప్పారంటే అన్ని వ్యాసాలకు దానిని జత చేసి. ప్రస్తుతం ఉన్న జాబితాను తొలగిస్తాను.t.sujatha 04:58, 9 ఏప్రిల్ 2012 (UTC)
- సుజాత మీ సలహా బాగానే వుంది. అయితే వర్గాలను కుదించితే బాగుంటుంది అనుకుంటాను, ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత(ఇంజనీరింగ్, మెడికల్, మానవీయశాస్త్రాలు), ఇతర వృత్తివిద్య (ఐటిఐ, డిప్లొమా), వివరణలో ఏదైనా ప్రత్యేకతలుంటే పేర్కొనవచ్చు. అలాచేసిన తర్వాత విద్యాసంస్థల వివరాలు తొలగించవచ్చు. మిగతా సభ్యులూ రెండూ మూడు రోజలలో స్పందించండి.--అర్జున (చర్చ) 05:23, 9 ఏప్రిల్ 2012 (UTC)
- మీ సూచనకు నేను అంగీకరిస్తాను. కుంచవలసినంత కుదించిన తరువాత మూసను చేరుస్తాము. t.sujatha 06:28, 9 ఏప్రిల్ 2012 (UTC)
- ప్రాథమిక పాఠశాలలు, మాధ్యమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, సాంకేతిక కళాశాలలు అని ఉంటే సరిపోతుందనుకుంటాను. సాంకేతిక కళాశాలల పేర్లు ఇవ్వాలంటే అది పెద్ద పట్టిక అవుతుంది. ఉదా: న్యాయ కళాశాలలు, బీఎడ్ కళాశాలలు, డైట్ కళాశాలలు, ఓరియంటల్ కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు, వ్యవసాయ కళాశాలలు, వెటర్నరీ కళాశాలలు, ఎంబిఏ, ఎంసీఏ కళాశాలలు, ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలు... ఇలా ఇచ్చే బదులు ఒకటి రెండు చొప్పున ఉండే వీటన్నింటినీ సాంకేతిక లేదా ఇతర కళాశాలలో చేరిస్తే సరిపోతుంది. అలాగే జిల్లా వ్యాసాలలో పాఠశాలల వివరములు అవసరం లేదనుకుంటున్నాను (పాఠశాలల సంఖ్య చేరిస్తే చాలు). ఉదా:కు మహబూబ్‌నగర్ జిల్లా వ్యాసంలో పాఠశాలల వివరాలు చేర్చాలంటే 5000 పాఠశాలల పేర్లు ఉన్నాయి. వీటన్నింటినీ జిల్లా వ్యాసంలో చేర్చలేము కదా! సి. చంద్ర కాంత రావు- చర్చ 17:27, 9 ఏప్రిల్ 2012 (UTC)
- విద్యాసంస్థల మూస బాగుంది. కానీ అన్ని జిల్లాల సమాచారం ఉంటే ప్రతి జిల్లా పేజీలోను అలాంటిది ఉంచవచ్చును. కొన్ని ఆంగ్ల పదాలకు సరైన తెలుగు పదంతో మారిస్తే సరిపోతుంది. సంస్థల సంఖ్య మాత్రమే ఈ మూసలో ఉంటుంది. జాబితాలను వేరుగా ఉంచాల్సి ఉంటుంది. అంతే కదా.Rajasekhar1961 (చర్చ) 03:49, 10 ఏప్రిల్ 2012 (UTC)
- జాబితాలు విజ్ఞానసర్వస్వానిక ఎంతవరకు వుపయోగం, ఎంతవరకు తాజా పరచుతూ వుండగలం. అందుకని జాబితాలు బదులుగా అధికారిక వెబ్సైట్ల లింకులిస్తే సరిపోతుంది.--అర్జున (చర్చ) 06:49, 10 ఏప్రిల్ 2012 (UTC)
- మూసను జిల్లాల పేజీఅలో ఉంచి వాటిలో వివరాలు వ్రాయాలి. ఈ మూస ఏఊరి గురించి వ్రాయడానికి అయినా వ్రాయడానికి వాడవచ్చు. దీనిని ఉపయోగించడం ద్వారా వ్రాసే సమయం తక్కువ ఔతుంది. మూసను అవసరమైనంత కుదించ వచ్చు. ఎవరైనా దానిని కుదించండి. తరువాత ఉపయోగిద్దాము. విద్యారంగం గురించి ప్రస్తావిస్తే వ్యాసానికి కొంత సమగ్రత వస్తుంది. ఈ మూసను వాడే సమయంలో కూడా కొంత చేర్చనూ వచ్చు. కొంత తాగ్గించనూ వచ్చు. వ్యాసంలో ఉండే సమాచారాన్ని అనుసరించి మార్పులు చేసుకో వచ్చు. సభ్యులందరూ ఎకాభిప్రాయానికి వస్తే ఏ నిర్ణయమైనా నాకు అంగీకారమే.
- మీ సూచనకు నేను అంగీకరిస్తాను. కుంచవలసినంత కుదించిన తరువాత మూసను చేరుస్తాము. t.sujatha 06:28, 9 ఏప్రిల్ 2012 (UTC)
{{subst:విద్యాసంస్థలు}} ఇలా ఉపయోగించవచ్చు. {{విద్యాసంస్థలు}} ఇది పశీలించండి.
- నేను ప్రకాశం జిల్లా విద్య వివరాలు సేకరించే ప్రయత్నాంలో సంస్థల సంఖ్య లెక్కించటం అంత సులభంకాదని తెలిసింది. కాకపోతే ప్రధాన వర్గాలన్నీ పేర్కొన్నాను. వాటిని పేరాలలో రాస్తే బాగుంటుందనిపిస్తుంది. --అర్జున (చర్చ) 07:21, 12 ఏప్రిల్ 2012 (UTC)
- పట్టికలోకి మార్చాను. ఈ పట్టికను ఇతర జిల్లాలోకూడా వాడాను.--అర్జున (చర్చ) 12:46, 14 మే 2012 (UTC)
- నేను ప్రకాశం జిల్లా విద్య వివరాలు సేకరించే ప్రయత్నాంలో సంస్థల సంఖ్య లెక్కించటం అంత సులభంకాదని తెలిసింది. కాకపోతే ప్రధాన వర్గాలన్నీ పేర్కొన్నాను. వాటిని పేరాలలో రాస్తే బాగుంటుందనిపిస్తుంది. --అర్జున (చర్చ) 07:21, 12 ఏప్రిల్ 2012 (UTC)
ప్రస్తుత స్థితి, పురోగతి
[మార్చు]ఈ ప్రాజెక్టు పని మందకొడిగా సాగుతున్నది. నేను ప్రతిపాదించిన విషయాలపై స్పందించండి. ఇంకొక నెలలో అభివృద్ధిపూర్తిచేసి ఈ ప్రాజెక్టు ప్రస్తుతదశ ముగించితే బాగుంటుంది.--అర్జున (చర్చ) 12:50, 30 ఏప్రిల్ 2012 (UTC)
- నాణ్యత పెంచడానికి పని వివరాల మూసని మెరుగు చేశాను. దాని ప్రకారం బాధ్యులు స్వంతసమీక్ష చేసి స్థితి ని తాజా చేయాలి, అప్పుడు ఇతర సభ్యులు సమీక్షించి మార్పులు సూచించాలి. ఆ మార్పులపై ప్రతిక్రియ పూర్తి అయినప్పుడు ఆ జిల్లా వ్యాసం మెరుగు పూర్తయిందని భావించాలి. దీనిపై స్పందించండి, తరువాత పనులు చేపట్టండి.--అర్జున (చర్చ) 00:03, 10 మే 2012 (UTC)
జిల్లా విషయసూచికలో ఏకరూపత
[మార్చు]నేను కొన్ని జిల్లాల ప్రస్తుత విషయసూచికలు పరిశీలించినతరువాత ప్రాజెక్టు పేజీలో సూచించిన ఏకరూపత కనబడలేదు. ఈ ప్రాజెక్టు సభ్యులు దీని పై అభిప్రాయాలు తెలపవలసినది. --అర్జున (చర్చ) 12:51, 14 మే 2012 (UTC)
- సుజాత గారు అన్ని జిల్లాలలో విషయసూచిక ఏకరూపత కోసం మార్పులు చేపట్టారు. బాధ్యత తీసుకొన్న సభ్యులు సహకరించండి. --అర్జున (చర్చ) 06:44, 17 మే 2012 (UTC)
- జిల్లా ప్రాజెక్ట్ పేజీలలో క్రీడలు విభాగానికి తగినంత సమాచారం లభించడం లేదు కనుక ఈ విభాగం తొలగించ వచ్చు.--t.sujatha (చర్చ) 04:59, 25 మే 2012 (UTC)
- అలాగే సంస్కృతి కూడా. వాటిని తొలగించకుండా అచేతనం ( <!-- --> చేయండి.
సమీక్షకు సహకారం
[మార్చు]నేను గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, వైఎస్ఆర్ జిల్లా వ్యాసాలను నాకు వీలైనంతవరకు మార్పు చేశాను. వాటిని ఇతర సభ్యులు ఒక సారి చదివి చిన్న మార్పులు ఏవైనా వుంటే చేసి, పెద్ద మార్పులు ఆయా వ్యాసాల చర్చాపేజీలో రాయమని కోరుతున్నాను. ఈ ప్రాజెక్టు రెండవదశ ఈ నెలలోగా ముగిద్దాం. అలాగే మిగతా సభ్యులు ఎవరైనా వారి వ్యాసం సమీక్షకు తయారైతే తెలియచేయండి. నేను అలాగే సమీక్ష చేస్తాను.--అర్జున (చర్చ) 10:43, 25 మే 2012 (UTC)
- అలాగే వ్యాసం నాణ్యతను విలువకట్టండి.--అర్జున (చర్చ) 11:10, 25 మే 2012 (UTC)
- నాణ్యత కొలబద్ద వివరాలు వికీపీడియా:WikiProject/ఆంధ్ర ప్రదేశ్/బేరీజు లో చూడండి
మార్పుల గణాంకాల వుదాహరణ SQL query
[మార్చు]- For more info
https://wiki.toolserver.org/view/Database_access
https://wikitech.wikimedia.org/wiki/Help:Tool_Labs#Quick_start
- login and connect to telugu wiki database, servername typically
nightshade
$ssh <username>@<servername>.toolserver.org
$ssh <username>@tools-login.wmflabs.org
<type your passphrase to connect>
$ sql tewiki_p
mysql>
- sample query
SELECT page_title, COUNT(*) As Edits FROM page LEFT JOIN revision ON rev_page = page_id WHERE rev_timestamp >= '20120101000000' AND rev_timestamp <='20120531000000' AND page_namespace = 0 AND page_title IN ('కృష్ణా_జిల్లా', 'ప్రకాశం_జిల్లా', 'కరీంనగర్_జిల్లా', 'విజయనగరం_జిల్లా', 'రంగారెడ్డి_జిల్లా', 'గుంటూరు_జిల్లా', 'శ్రీ_పొట్టి_శ్రీరాములు_నెల్లూరు_జిల్లా', 'ఆదిలాబాదు_జిల్లా', 'వైఎస్ఆర్_జిల్లా', 'తూర్పు_గోదావరి_జిల్లా', 'విశాఖపట్నం_జిల్లా', 'మహబూబ్_నగర్_జిల్లా', 'ఖమ్మం_జిల్లా', 'చిత్తూరు_జిల్లా', 'శ్రీకాకుళం_జిల్లా', 'అనంతపురం_జిల్లా', 'వరంగల్_జిల్లా', 'మెదక్_జిల్లా', 'పశ్చిమ_గోదావరి_జిల్లా', 'హైదరాబాదు_జిల్లా', 'కర్నూలు_జిల్లా', 'నిజామాబాదు_జిల్లా', 'నల్గొండ_జిల్లా', 'ఆంధ్ర_ప్రదేశ్_జిల్లాలు') GROUP BY page_title HAVING COUNT(*) > 0;
ముఖ్యపట్టణాలను జిల్లా వ్యాసాల నుండి వేరుచేయటం
[మార్చు]తెలుగు జిల్లాల ముఖ్యపట్టణాలను జిల్లా వ్యాసాల నుండి వేరుచేసి, ప్రత్యేక వ్యాసాలుగా అభివృద్ధి చేయాలని సముదాయం కోరుకుంటున్నది. అందుకు అనుగుణంగా గ్రామల, మండలాల పేజీలో లింకులకు తగుమార్పులు చేయవలసి ఉంటుంది. ఈ పట్టికలో ఆయా మార్పుల యొక్క ప్రగతి నమోదుచేయబడుతుంది.
- చేయవలసిన పని విషయం ఏమిటో, ఏమి చేయగలనో నాకు అర్థం కాలేదు. JVRKPRASAD (చర్చ) 03:17, 10 మార్చి 2015 (UTC)