ఆరుద్ర నక్షత్రము
ఆరుద్ర నక్షత్రములలో ఆరవ నక్షత్రం. ఇది పరమశివుని జన్మ నక్షత్రం.
నక్షత్రం | అధిపతి | గణము | జాతి | జంతువు | వృక్షము | నాడి | పక్షి | అధిదేవత | రాశి |
---|---|---|---|---|---|---|---|---|---|
ఆరుద్ర | రాహువు | మానవ | స్త్రీ | శునకము | రేల | ఆదినాడి | పింగళ | రుద్రుడు | మిధునము |
అరుద్ర నక్షత్ర జాతకుల తారా ఫలాలు
[మార్చు]తార నామం | తారలు | ఫలం |
---|---|---|
జన్మ తార | ఆర్ద్ర, స్వాతి, శతభిష | శరీరశ్రమ |
సంపత్తార | పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర | ధన |
విపత్తార | పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర | కార్యహాని |
సంపత్తార | ఆశ్లేష, జ్యేష్ట, రేవతి | క్షేమం |
ప్రత్యక్ తార | అశ్విని, మఖ, మూల | ప్రయత్న భంగం |
సాధన తార | భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ | కార్య సిద్ధి, శుభం |
నైత్య తార | కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ | బంధనం |
మిత్ర తార | రోహిణి, హస్త, శ్రవణం | సుఖం |
అతిమిత్ర తార | మృగశిర, చిత్త, ధనిష్ఠ | సుఖం, లాభం |
ఆరుద్ర నక్షత్రము నవాంశ
[మార్చు]- 1 వ పాదము -మిధునరాశి.
- 2 వ పాదము - మిధునరాశి.
- 3 వ పాదము - మిధునరాశి.
- 4 వ పాదము - మిధునరాశి.
ఆరుద్ర నక్షత్రమునందు పుట్టిన వారి యొక్క నైజము,తీఱు-తెన్నులు
[మార్చు]ఈ నక్షత్రములో జన్మించిన వారు మాటలాడుటలో నేఱ్పరితనమును, మించిన జ్ఞాపక శక్తియు కలిఁగియుండెదరు, గొప్ప గమ్మత్తుఁగా మాట్లాడఁగలరు. వ్యాపార పరమైన నైపుణ్యము ఉంటుంది. పలు రంగాలలో పరిచయము ఉంటుంది. ఇతరుల అభివృద్ధికి ఇటుక రాళ్ళవలె సహాయపడతారు. ఎన్ని సార్లు జారిపడినా పట్టు వదలక ఉన్నత స్థితికి వస్తారు. కీర్తియోగము వీరిని ఎప్పుడూ వెన్నంటి ఉంటుంది. డబ్బులకు చెందునట్టి నిర్ణయాలను సరిగా చేయలేరు. తప్పుడు సలహాలు, శక్తిసామర్ధ్యాలు, పగ తీఱ్చుకోవాలనెడి కోరిక, మొండి పట్టుదల జీవితములో ఒడిదుదుకులకు దారి తీయ వచ్చును. తొందఱపాటుతో ముందు-వెనుక మంచి-చెడు అనేవి చూడకుండనే నిర్ణయాలను వెంతనే అమలు పరుస్తారు. అవమానాన్ని ఓర్చుకొన లేరు. లౌక్యము తెలివితేఁటలు కనబఱఁచుతారు. తల్లిఁదండ్రులు, తోడఁబుట్టువుల మీద గొప్ప ప్రేమను కలిఁగియుంటారు. రాత్రి పూఁట నిర్ణయాలు తీసుకుంటారు. మొదట తనలోతాను అందఱిలో తక్కువ అని పదేపదే అనుకొనవలసి వచ్చిన కూడను ఆ తరువాత అధిక్యతా భావములోకి మారి పోతారు. నిండు నూఱేండ్లు బ్రతికెదరు సంపూర్ణ ఆయుర్ధాయము కలిగి ఉంటారు. ఆడవారిపట్ల గౌరవ భావము కలిగి ఉంటారు. మూకలని నమ్మించ కలిగిన ఆకట్టుకొనఁగలిగిన శక్తిని వీరు కలిగి ఉంటారు. ఎంత మంది వీడి వెళ్ళినా ఎనలేని శక్తి సామర్ధ్యాలతో మఱల వీరు ఉన్నత స్థాయి సాధిస్తారు. వీరి వీరి బ్రతుకులలో ఏభై రెండు నుండి అరవై ఆరు సంవత్సరాల వరకు చిక్కులు తక్కువగానే ఉంటాయి.
బొమ్మల పేర్పు
[మార్చు]-
ఆరుద్ర నక్షత్రపు చెట్టు రేల
-
ఆరుద్ర నక్షత్రపు జంతువు కుక్క.
-
ఆరుద్ర నక్షత్రపు జాతి - ఆడ
-
ఆరుద్ర నక్షత్ర పక్షి కాకి.
-
ఆరుద్ర నక్షత్ర అధిపతి రాహువు.
-
ఆరుద్ర నక్షత్ర అధిదేవత రుద్రుడు
-
ఆరుద్ర నక్షత్ర గణము మానవగణము