జె. వి. రమణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 44: పంక్తి 44:
== నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం ==
== నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం ==
'''ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్ధ''' ప్రతి సంవత్సరం సినిమా, టెలివిజన్ రంగాలతోపాటు నాటకరంగానికి కూడా నంది పురస్కరాలను అందజేస్తుంది. నాటకరంగానికి విశేషమైన సేవలందించిన వారికి '''నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం ''' పేరిట ఒక లక్ష రూపాయల నగదు పారితోషికంతో ఘనంగా సత్కరిస్తున్నారు.
'''ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్ధ''' ప్రతి సంవత్సరం సినిమా, టెలివిజన్ రంగాలతోపాటు నాటకరంగానికి కూడా నంది పురస్కరాలను అందజేస్తుంది. నాటకరంగానికి విశేషమైన సేవలందించిన వారికి '''నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం ''' పేరిట ఒక లక్ష రూపాయల నగదు పారితోషికంతో ఘనంగా సత్కరిస్తున్నారు.
2015 సంవత్సరానికి గాను జె. వి. రమణమూర్తి (సాంఘిక నాటకం) గారికి అందజేశారు. 2016 జనవరి 27న [[ఆంధ్రప్రదేశ్]] మఖ్యమంత్రి [[నారా చంద్రబాబు నాయుడు]] గారి చేతుల మీదుగా పురస్కార ప్రదానం జరిగింది<ref>http://www.andhrajyothy.com/Pages/PhotoAlbum?GllryID=19522 [[తిరుపతి]]లో నంది నాటకోత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు</ref>.
2015 సంవత్సరానికి గాను జె. వి. రమణమూర్తి (సాంఘిక నాటకం) గారికి అందజేశారు. 2016 జనవరి 27న [[ఆంధ్రప్రదేశ్]] మఖ్యమంత్రి [[నారా చంద్రబాబు నాయుడు]] గారి చేతుల మీదుగా పురస్కార ప్రదానం జరిగింది<ref>http://www.andhrajyothy.com/Pages/PhotoAlbum?GllryID=19522{{Dead link|date=ఏప్రిల్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} [[తిరుపతి]]లో నంది నాటకోత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు</ref>.


==చిత్ర సమాహారం==
==చిత్ర సమాహారం==
పంక్తి 93: పంక్తి 93:


==మరణం==
==మరణం==
వీరు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ [[2016]], [[జూన్ 22]] వ తేదీన [[హైదరాబాదు]] లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మరణించారు.<ref>[http://epaper.sakshi.com/849688/Hyderabad-Main/23-06-2016#page/2/2 జె.వి.రమణమూర్తి కన్నుమూత]</ref>
వీరు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ [[2016]], [[జూన్ 22]] వ తేదీన [[హైదరాబాదు]] లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మరణించారు.<ref>{{Cite web |url=http://epaper.sakshi.com/849688/Hyderabad-Main/23-06-2016#page/2/2 |title=జె.వి.రమణమూర్తి కన్నుమూత |website= |access-date=2016-06-23 |archive-url=https://web.archive.org/web/20160626042619/http://epaper.sakshi.com/849688/Hyderabad-Main/23-06-2016#page/2/2 |archive-date=2016-06-26 |url-status=dead }}</ref>


== మూలాలు ==
== మూలాలు ==

12:47, 12 ఏప్రిల్ 2020 నాటి కూర్పు

జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి
200ox
జె. వి. రమణమూర్తి
జననం
జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి

మే 20, 1933
మరణంజూన్ 22, 2016
మరణ కారణంక్యాన్సర్
వృత్తితెలుగు సినిమా నటుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కన్యాశుల్కం లో పాత్ర

జె. వి. రమణమూర్తి (మే 20, 1933 - జూన్ 22, 2016) గా ప్రసిద్ధులైన జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు. వీరు జె.వి.సోమయాజులు తమ్ముడు. యితడు విజయనగరం జిల్లాలో మే 20, 1933లో జన్మించారు. తన పాఠశాల జీవితం నుంచే నటనా ప్రస్థానం ప్రారంభించారు. ఇంటర్ యూనివర్శిటీ పోటీలలో ఆత్రేయ యొక్క "విశ్వశాంతి" అవార్డును పొందారు. "ఎవరు దొంగ", "కప్పలు", "కీర్తిశేషులు", "కాళరాత్రి", "ఫాణి", "కాటమరాజు కథ" వంటి నాటకాలలో నటించారు. తనకు గుర్తింపు తెచ్చిన పాత్ర గురజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కంలో గిరీశం. చలన చిత్ర పరిశ్రమలో ఎం.ఎల్.ఏ. (1957) సినిమాతో నటనా ప్రస్థానం ప్రారంభించి 150 చిత్రాల వరకు నటించారు. నాటకరంగంలో దశాబ్దాల సేవలకు గానూ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జె.వి.రమణమూర్తికి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేసింది.

వ్యక్తిగత వివరాలు

రమణమూర్తి శ్రీకాకుళం జిల్లాలోని లుకులాం అగ్రహారంలో 1933లో జన్మించాడు. విద్యావంతుల కుటుంబంలో పుట్టి పెరిగిన రమణమూర్తి చిన్నప్పట్నుంచే నాటకాలపై మక్కువ పెంచుకొన్నాడు. సైన్స్‌ పట్టభద్రుడైన జె.వి.రమణమూర్తి సినిమాల్లోకి రాకముందు కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. స్నేహితులతో కలసి అసోసియేషన్‌ ఏర్పాటు చేసుకొని నాటకాల్ని ప్రదర్శించేవాడు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే రంగస్థల నటుడిగా, దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. గురజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కం నాటకం ద్వారా ప్రఖ్యాతి పొందాడు. నాలుగు దశాబ్దాల కాలంలో వెయ్యిసార్లకిపైగా కన్యాశుల్కంలోని గిరీశం పాత్రని పోషిస్తూ అపర గిరీశంగా పేరు పొందాడు. ఆయన భార్య, కుమార్తెలు శారద, నటన, కుమారులు అరుణ్‌కుమార్‌, హర్షవర్ధన్‌తో కలిసి జీవించేవాడు. రమణమూర్తి మరో ప్రముఖ నటుడైన జె.వి.సోమయాజులు సోదరుడు. [1]

నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్ధ ప్రతి సంవత్సరం సినిమా, టెలివిజన్ రంగాలతోపాటు నాటకరంగానికి కూడా నంది పురస్కరాలను అందజేస్తుంది. నాటకరంగానికి విశేషమైన సేవలందించిన వారికి నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం పేరిట ఒక లక్ష రూపాయల నగదు పారితోషికంతో ఘనంగా సత్కరిస్తున్నారు. 2015 సంవత్సరానికి గాను జె. వి. రమణమూర్తి (సాంఘిక నాటకం) గారికి అందజేశారు. 2016 జనవరి 27న ఆంధ్రప్రదేశ్ మఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పురస్కార ప్రదానం జరిగింది[2].

చిత్ర సమాహారం

1950వ దశాబ్దం

1960వ దశాబ్దం

1970వ దశాబ్దం

1980వ దశాబ్దం

1990వ దశాబ్దం

2000వ దశాబ్దం

మరణం

వీరు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ 2016, జూన్ 22 వ తేదీన హైదరాబాదు లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మరణించారు.[3]

మూలాలు

  1. ఈనాడు సినిమా పేజీ, జూన్ 23, 2016
  2. http://www.andhrajyothy.com/Pages/PhotoAlbum?GllryID=19522[permanent dead link] తిరుపతిలో నంది నాటకోత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు
  3. "జె.వి.రమణమూర్తి కన్నుమూత". Archived from the original on 2016-06-26. Retrieved 2016-06-23.

బయటి లింకులు