గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: hi:गुंटूर लोक सभा निर्वाचन क्षेत्र
పంక్తి 47: పంక్తి 47:


[[en:Guntur (Lok Sabha constituency)]]
[[en:Guntur (Lok Sabha constituency)]]
[[hi:गुंटूर लोक सभा निर्वाचन क्षेत्र]]
[[mr:गुंटुर (लोकसभा मतदारसंघ)]]
[[mr:गुंटुर (लोकसभा मतदारसंघ)]]

18:05, 5 మార్చి 2013 నాటి కూర్పు


ఆంధ్ర ప్రదేశ్ లోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ నియోజకవర్గం చాలా మార్పులకు గురైంది. ఇంతకు క్రితం గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న చిలకలూరిపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు అసెంబ్లీ సెగ్మెంట్లు నరసారావుపేట లోక్‌సభ నియోజకవర్గానికి బదిలీ అయ్యాయి. గతంలో తెనాలి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న తెనాలి, మంగళగిరి సెగ్మెంట్లు ఈ నియోజకవర్గంలో వచ్చిచేరాయి.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు

నియోజకవర్గపు గణాంకాలు

  • 2001 లెక్కల ప్రకారం జనాభా: 18,36,008 [1]
  • ఓటర్ల సంఖ్య: 12,97,103.
  • ఎస్సీ, ఎస్టీల శాతం: 18.33% మరియు 3.07%.

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

లోక్‌సభపదవీకాలంసభ్యుని పేరుఎన్నికైన పార్టీ
మొదటి1952-57ఎస్.వి.ఎల్.నరసింహారావుస్వతంత్ర అభ్యర్ధి
రెండవ1957-62కొత్త రఘురామయ్యభారత జాతీయ కాంగ్రెసు
మూడవ1962-67కొత్త రఘురామయ్యభారత జాతీయ కాంగ్రెసు
నాలుగవ1967-71కొత్త రఘురామయ్యభారత జాతీయ కాంగ్రెసు
ఐదవ1971-77కొత్త రఘురామయ్యభారత జాతీయ కాంగ్రెసు
ఆరవ1977-80కొత్త రఘురామయ్యభారత జాతీయ కాంగ్రెసు
ఏడవ1980-84ఎన్.జి.రంగాభారత జాతీయ కాంగ్రెసు
ఎనిమిదవ1984-89ఎన్.జి.రంగాభారత జాతీయ కాంగ్రెసు
తొమ్మిదవ1989-91ఎన్.జి.రంగాభారత జాతీయ కాంగ్రెసు
పదవ1991-96ఎస్.ఎమ్.లాల్ జాన్ పాషాతెలుగుదేశం పార్టీ
పదకొండవ1996-98రాయపాటి సాంబశివరావుభారత జాతీయ కాంగ్రెసు
పన్నెండవ1998-99రాయపాటి సాంబశివరావుభారత జాతీయ కాంగ్రెసు
పదమూడవ1999-04ఎంపరాల వెంకటేశ్వరరావుతెలుగుదేశం పార్టీ
పద్నాలుగవ2004-2009రాయపాటి సాంబశివరావుభారత జాతీయ కాంగ్రెసు
పదిహేనవ2004- ప్రస్తుతంరాయపాటి సాంబశివరావుభారత జాతీయ కాంగ్రెసు

2009 ఎన్నికలు

2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున రాయపాటి సాంబశివరావు పోటీ చేస్తున్నాడు. [2] ప్రజారాజ్యం తరఫున తోట చంద్రశేఖర్ పోటీలో ఉన్నాడు. [3]

మూలాలు

  1. http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=92862&subcatid=17&categoryid=3
  2. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
  3. ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009