వాడుకరి చర్చ:MYADAM ABHILASH
స్వాగతం
[మార్చు]MYADAM ABHILASH గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి వికీపీడియాలో రచనలు చేయుట, 2014 (ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
- "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
- వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
- చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
- వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
- వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
ఇకపోతే..
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లోని ప్రతీ ఊరికీ, ప్రతీ మండలానికీ, జిల్లాకీ, ప్రతీ పట్టణానికీ, నగరానికీ వికీలో పేజీ ఉంది. మీ ఊరి పేజీ చూడండి. అందులో సవరణలు ఏమైనా అవసరమనుకుంటే చేసెయ్యండి. వెనకాడకండి.
- ప్రతీ తెలుగు సినిమాకీ ఒక పేజీ పెట్టాలనేది సంకల్పం. అందులో మీరూ పాలుపంచుకోవచ్చు.
- మానవ పరిణామం, మాయాబజార్, ఇస్రో, సూపర్‌స్టార్ కృష్ణ, జవాహర్ లాల్ నెహ్రూ, చంద్రుడెలా పుట్టాడు, తిరుమల ప్రసాదం, హిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులు, కొండారెడ్డి బురుజు,.. రండి. విజ్ఞాన సర్వస్వ ప్రపంచంలో విహరించండి. ఇక్కడ రాయండి. తప్పులను సరిదిద్దండి. ఒప్పులకు మెరుగులు పెట్టండి.
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
- ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. శ్రీరామమూర్తి (చర్చ) 09:12, 22 జనవరి 2021 (UTC)
అభినందనలు
[మార్చు]మైదాం అభిలాష్ గారు, అభినందనలు, మీరు చాలా బాగా రాశారు కాకపోతే అక్కడ కాదు రాసేది. మీకు ఈ సందేశం అందితే పైన ఉన్న సమాచారం అంతా చదివి ఇక్కడ స్పందించండి. మీకు సహాయం చేయగలను. అన్నీ చదవండి. స్పందించండి. ధన్యవాదాలు. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 12:48, 2 ఫిబ్రవరి 2021 (UTC)
ఎక్కడ రాయాలో దయచేసి తెలుపగలరు MYADAM ABHILASH (చర్చ) 02:19, 3 ఫిబ్రవరి 2021 (UTC)
సహాయం
[మార్చు]కార్ల్ రోజర్స్ అనే పేజీ సృష్టిస్తున్నపుడు సోర్స్ ఎడిటర్ ఓపెన్ కావట్లేదు.నా మొబైల్ సమస్యా?లేకపోతే సైట్ సమస్యా అర్థం కావటం లేదు దయచేసి ఎవరైనా సహాయం అందించగలరు.MYADAM ABHILASH (చర్చ) 06:03, 29 మే 2021 (UTC)
అంతర్వికీ లింకులు
[మార్చు]అభిలాష్ గారూ, వికీపీడియాలో విస్తారంగా దిద్దుబాట్లు చేస్తున్నందుకు ధన్యవాదాలు. వికీపీడియా వ్యాసాల్లో ఒక ముఖ్యమైన అంశం అంతర్వికీ లింకు. ఈ వ్యాసం ఇతర భాష వికీపీడియాల్లో కూడా ఉంటే వాటికి ఇచ్చే లింకులను అంతర్వికీ లింకులు అంటాం. అన్ని భాషల వ్యాసాలకూ లింకు ఇవ్వనక్కర్లేదు.. ఒక్క భాషలో ఇస్తే చాలు, అన్ని భాషలకూ అదే ఇచ్చుకుంటుంది. ఇలా లింకులివ్వడం వలన ఇతర భాషల వ్యాసాల్లో (ముఖ్యంగా ఇంగ్లీషులో) ఎక్కువ సమాచారం ఏదైన ఉంటే చదివే వీలు పాఠకులకు ఉంటుంది. వ్యాసానికి చక్కని విలువ చేకూరుతుంది. మరీ ముఖ్యంగా విజ్ఞాన శాస్త్ర విషయాలను రాసినపుడు ఈ లింకులు మరింత ఉపయోగం. కానీ కొన్ని సందర్భాల్లో ఈ లింకులు ఎవరు బడితే వాళ్ళు ఇవ్వలేరు; ఉదాహరణకు యత్నదోష అభ్యసన సిద్ధాంతం అనే పేజీకి ఇంగ్లీషులో పేరు ఏమిటో వెతికితే నాకు తెలీలేదు - ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ అనే పేరుతో పేజీ లేదక్కడ, Law of effect అనే పేరుతో ఉంది. కానీ ఈ రెండూ ఒకటో కాదో నాకు తెలియలేదు. విషయం గురించి తెలిసినవాళ్ళకు ఇది సులువు -మీరైతే అది సరిగ్గా చెప్పగలరు. అంచేత మీరు రాసే వ్యాసాలకు అంతర్వికీ లింకులు ఇవ్వవలసినదిగా విజ్ఞప్తి.
ఆ లింకు ఎలా ఇవ్వాలో తెలుసుకునేందుకు వికీపీడియా:వాడుకరులకు సూచనలు పేజీలో "అంతర్వికీ లింకులు" విభాగం చూడండి. సందేహమేమైనా ఉంటే అడగండి. అడిగినపుడు [[వాడుకరి:Chaduvari]] అని నాకు లింకు ఇస్తే నన్ను మీరు ప్రస్తావించినట్లుగా నాకు నోటిఫికేషను వస్తుంది. లేకపోతే మీరు నన్ను అడిగిన సంగతి నాకు తెలియకుండా పోతుంది.
ఒకవేళ ఈ లింకులు మీరు ఈసరికే ఇస్తూ, పై వ్యాసంలో పొరపాటున మిస్సై ఉంటే, నా ఈ సలహాను పట్టించుకోనక్కర్లేదు. __ చదువరి (చర్చ • రచనలు) 06:46, 8 జూన్ 2021 (UTC)
ధన్యవాదాలు
[మార్చు]వాడుకరి:Chaduvari గారూ అంతర్వికీ లింకులు ఎలా చేర్చాలో మీరు ఇచ్చిన సందేశం ద్వారా తెలుసుకొని, నేను రాసిన వ్యాసాలన్నింటికీ అంతర్వికీ లింకులు చేర్చే ప్రయత్నం చేస్తాను. అలాగే యత్నదోష అభ్యసన సిద్ధాంతం నకు Trial and error అనే ఆంగ్ల వ్యాసం అంతర్వికీ లింకుగా ఇవ్వవచ్చు. ఈ పని కూడా చేస్తాను.
నేను, వ్యాసాలన్నీ మొబైల్ లో డెస్క్టాప్ వ్యూ లో రాస్తున్నాను అందుకని ఈ పని చేయడం కాస్త ఆలస్యం కావచ్చు అయినప్పటికీ త్వరగానే పూర్తిచేసే ప్రయత్నం చేస్తాను. ఇంకా నేను రాస్తున్న వ్యాసాలలో ఏమైనా సవరణలు చేసుకోవాల్సిన అంశాలు ఉంటే తెలపండి. ఈ అంతర్వికీ లింకుల గురించి తెలిపినందుకు హృదయ పూర్వక ధన్యవాదాలు.MYADAM ABHILASH (చర్చ) 09:02, 8 జూన్ 2021 (UTC)
- ధన్యవాదాలండి.__ చదువరి (చర్చ • రచనలు) 01:28, 10 జూన్ 2021 (UTC)
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
[మార్చు]Greetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.
ఆహ్వానం WPWP పునసమీక్షా సమావేశం
[మార్చు]వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 లో మీ చేర్పులకు ధన్యవాదములు, ఇందులో భాగంగా జూలై 15వ తేదీ సాయంత్రం 7.00 నుండి 8.00 IST వరకు జరుగుతున్న సభ్యుల పునసమీక్షా సమావేశంలో గూగుల్ మీట్ ద్వారా చేరగలరు (లింకు) Or Open Google Meet and enter this code: bqk-vdyf-gzc , ప్రాజెక్టు జరిగే కాలంలో ఇందులో పాల్గోనే అందరూ సబ్యులూ వీలయితే నేర్చుకొన్న విషయాలు పంచుకోవచ్చు,సూచనలు కూడా చేయవచ్చు, కొత్త వారికి ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది.
[Wikimedia Foundation elections 2021] Candidates meet with South Asia + ESEAP communities
[మార్చు]Hello,
As you may already know, the 2021 Wikimedia Foundation Board of Trustees elections are from 4 August 2021 to 17 August 2021. Members of the Wikimedia community have the opportunity to elect four candidates to a three-year term. After a three-week-long Call for Candidates, there are 20 candidates for the 2021 election.
An event for community members to know and interact with the candidates is being organized. During the event, the candidates will briefly introduce themselves and then answer questions from community members. The event details are as follows:
- Date: 31 July 2021 (Saturday)
- Timings: check in your local time
- Bangladesh: 4:30 pm to 7:00 pm
- India & Sri Lanka: 4:00 pm to 6:30 pm
- Nepal: 4:15 pm to 6:45 pm
- Pakistan & Maldives: 3:30 pm to 6:00 pm
- Live interpretation is being provided in Hindi.
- Please register using this form
For more details, please visit the event page at Wikimedia Foundation elections/2021/Meetings/South Asia + ESEAP.
Hope that you are able to join us, KCVelaga (WMF), 06:35, 23 జూలై 2021 (UTC)
సరస్సుల వ్యాసాలు
[మార్చు]అభిలాష్ గారూ, భారతదేశంలోని వివిధ సరస్సుల మీద చక్కటి వ్యాసాలు రాస్తున్నారు. అభినందనలు. మీరు రాసే ఈ కొత్త వ్యాసాల నుంచి ఆసక్తికరమైన వాక్యాలు ఏరి మొదటి పేజీలోని మీకు తెలుసా శీర్షికలో చేరుస్తున్నాను. గమనించారో లేదు. తెవికీలో మీ కృషి ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. - రవిచంద్ర (చర్చ) 09:20, 18 ఆగస్టు 2021 (UTC)
- ధన్యవాదాలు రవిచంద్ర గారూ మొదటి పేజీను నేను రోజు చూస్తుంటాను. మీ లాంటి వారి ప్రోత్సాహం వలనే మాలాంటి కొత్తవారు రాయడానికి ఆసక్తి చూపుతారు. ధన్యవాదాలు.--Abhilash (చర్చ) 09:45, 18 ఆగస్టు 2021 (UTC)
2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు ఎన్నికలలో ఓటు వేయండి
[మార్చు]నమస్తే MYADAM ABHILASH,
2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు అఫ్ ట్రస్టీస్ ఎన్నికలలు మొదలయ్యాయి. ఈ ఎన్నిక 18 ఆగష్టు 2021 న మొదలైంది, 31 ఆగష్టు 2021 న ముగుస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ తెలుగు వికీపీడియా వంటి ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీల గురించి ఈ లింకులో తెలుసుకోండి.
ఈ సంవత్సరం నాలుగు బోర్డు సీట్లకు ఎన్నిక జరుగుతుంది. వీటి కోసం 19 మంది అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థుల గురించి మరింత సమాచారం ఈ పేజీలో తెలుసుకోండి.
70,000 ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ ప్రక్రియ 31 ఆగష్టు 23:59 UTC వరకు నడుస్తుంది.
మీరు ఇప్పటికే ఓటు వేసినట్టు అయితే, దయచేసి ఈ ఇమెయిల్‌ను విస్మరించండి. ఓటర్లు ఒక్కసారి మాత్రమే ఓటు వేయవచ్చు.
ఈ ఎన్నికలు గురించి మరింత సమాచారం తెలుసుకోండి. MediaWiki message delivery (చర్చ) 05:01, 29 ఆగస్టు 2021 (UTC)
ఆహ్వానం : ఆజాదీ కా అమృత్ మహోత్సవం - మొదటి Edit-a-thon ( 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకు)
[మార్చు]నమస్కారం ,
తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ఆజాదీ కా అమృత్ మహోత్సవం ప్రాజెక్టు పేజీ చూడగలరు : Kasyap (చర్చ) 05:14, 1 సెప్టెంబరు 2021 (UTC)
- Kasyapగారూ తప్పకుండా పాల్గొంటాము.--అభిలాష్ మ్యాడం 09:44, 1 సెప్టెంబరు 2021 (UTC)
అభినందనలు
[మార్చు]వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 ప్రాజెక్టులో మీ కృషి ప్రశంసనీయం. అభినందనలు. త్వరలో మీకు WPWP సావినీర్లు, సర్టిఫికెట్ పంపబడతాయి. దయచేసి వెంటనే ఈ క్రింది లంకెలో ఉన్న ఫారంలో మీ వివరాలు తెలియజేయండి.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSd-TaLmENAW9Y3HbSDtLyBsneiZqiGFbStEjrr-lC9ASAZywA/viewform
--స్వరలాసిక (చర్చ) 09:47, 9 సెప్టెంబరు 2021 (UTC)
Ramesh pammi అడుగుతున్న ప్రశ్న (01:05, 12 సెప్టెంబరు 2021)
[మార్చు]hi sir --Ramesh pammi (చర్చ) 01:05, 12 సెప్టెంబరు 2021 (UTC)
- నమస్తే Ramesh pammi గారూ మీ సందేహం ఏమున్నా నిస్సంకోచంగా అడగండి. నేను మీకు సహాయ పడగలను--అభిలాష్ మ్యాడం 06:50, 12 సెప్టెంబరు 2021 (UTC)
Movement Charter Drafting Committee - Community Elections to take place October 11 - 24
[మార్చు]నమస్కారం మ్యాడం అభిలాష్ గారూ ,
వికీమీడియా ఉద్యమంలో వికిపీమీడియన్ల పాత్రలు బాధ్యతలను ఉద్యమ చార్టర్ నిర్వచిస్తుంది. అందరి భాగస్వామ్యంతో వ్యూహాత్మక దిశలో కలిసి పనిచేయడానికి ఈ ఫ్రేమ్‌వర్క్ ఉపయోగపడననుంది.
ఉద్యమ చార్టర్ డ్రాఫ్టింగ్ కమిటీ ఈ చార్టర్ ముసాయిదాను రూపొందిస్తుంది. కంటెంట్ ఈక్విటీ ఇన్ డెసిషన్ మేకింగ్ "అనే మూవ్మెంట్ స్ట్రాటజీ సిఫార్సును అనుసరిస్తుంది. కమిటీ పని ముసాయిదా రాయడం వరకు విస్తరించింది. ఇందులో కమ్యూనిటీలు, నిపుణులు, సంస్థలతో పరిశోధన ఇంకా సంప్రదింపులు ఉంటాయి. ఈ ముసాయిదా చార్టర్‌గా మారడానికి ముందు ఉద్యమం-అంతటా ఆమోదం ద్వారా ఏకాభిప్రాయం పొందాలి.
ఈ గ్రూపులో దాదాపు 15 మంది సభ్యులు ఉంటారు. ఇది ఉద్యమంలో వైవిధ్యాన్ని సూచిస్తుందని భావిస్తున్నారు. లింగం, భాష, భౌగోళికం అనుభవం లాంటి వివిధ వైవిద్యాలతో అభ్యర్థుల ఎంపిక జరగనుంది . ఈ సమూహ సభ్యులు ప్రాజెక్టులు, అనుబంధ సంస్థలు వికీమీడియా ఫౌండేషన్‌కి సంబందించిన కార్యకలాపాలలో పాల్గొనవలసి ఉంటుంది.
సభ్యుడిగా మారడానికి ఆంగ్ల భాష వచ్చి ఉండవలసిన అవసరం లేదు. అవసరమైతే అనువాదం, వివరణ మద్దతు అందించబడుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ప్రతి రెండు నెలలకు US $ 100 పారితోషికం అందిచంబడుతుంది.
ఈ పోటీలో భారత్ నుండి 9 మంది వ్యక్తులు ఉండగా మన తెలుగు వికీ నుండి నేను ఒక్కడిని పాల్గొంటున్నాను అక్టోబరు 11 అనగా రేపటి నుండి దీని ఎన్నికలు జరగనున్నాయి. ఇది నా సభ్యత్వ పేజీ , పరిశీలించగలరు.
ఈ పోటీలో నాకు మీ మద్దతు ఉంటుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. Nskjnv ☚╣✉╠☛ 06:25, 10 అక్టోబరు 2021 (UTC)
DRNokkuDayanandarao అడుగుతున్న ప్రశ్న (13:00, 8 నవంబరు 2021)
[మార్చు]madamu ku vyathireka padamu yemiti --DRNokkuDayanandarao (చర్చ) 13:00, 8 నవంబరు 2021 (UTC)
- DRNokkuDayanandarao గారూ, వికీలో ఎలా ఎడిట్ చేయాలి అన్న దానికి సంబంధించిన సాంకేతిక సమస్యలు ఏమైనా ఉంటే అడగండి సహాయం చేస్తాను.--అభిలాష్ మ్యాడం 16:31, 8 నవంబరు 2021 (UTC)
నమస్తే, నేను జిరెడ్డి. బాలచెన్నరెడ్డి గారు రాసిన పంచతంత్రం పుస్తకాన్ని వికీసోర్స్ లో అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన --Gaargy (చర్చ) 16:32, 9 డిసెంబరు 2021 (UTC)
- Gaargy గారూ వికీలో దిద్దుబాట్లు చేయడానికి ఆసక్తి చూపుతున్నందుకు ధన్యవాదాలు. వికీ సోర్సు కోసం [1] ను చూడండి.౼అభిలాష్ మ్యాడం 04:26, 12 డిసెంబరు 2021 (UTC)
నమస్తే, బులుసు సీతారామశాస్త్రి రాసిన సంపూర్ణ నీతి చంద్రిక లో part 1మాత్రమే వికీసోర్సు గా ఉంది.పార్ట్ 2 ని develop చేయడానికి సహాయం చేయండి --Gaargy (చర్చ) 16:38, 9 డిసెంబరు 2021 (UTC)
- Gaargy గారూ నమస్తే, వికీలో దిద్దుబాట్లు చేయడానికి ఆసక్తి చూపుతున్నందుకు ధన్యవాదాలు. వికీ సోర్సు కోసం [2] ను చూడండి.౼అభిలాష్ మ్యాడం 04:26, 12 డిసెంబరు 2021 (UTC)
అభినందనలు
[మార్చు]వికీపీడియా ఏషియన్ మాసం/2021 లో 100 వ్యాసాలు రాసి రికార్డు సృష్టించిన తెలుగు వికీపీడియా బ్రాండ్ అంబాసిడర్ మ్యాడం అభిలాష్ గారికి అభినందనలు. ఈ ప్రాజెక్టులో మీరందించిన సేవ ఎనలేనిది, తెలుగు భాషలో ప్రపాంచిక జ్ఞానం పెంచడంలో ఇదో ముందడుగు. ప్రపంచాన్ని గురించి నేర్చుకోవడానికి తెలుగు ప్రజలకు ఈ ప్రాజెక్టు పెన్నిధిగా నిలుస్తుందని భావిస్తున్నాను, ఇటువంటి మహత్కర కార్యంలో మీ కృషి అతుల్యమైనది. ధన్యవాదాలు Nskjnv ☚╣✉╠☛ 16:34, 15 డిసెంబరు 2021 (UTC)
- ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు చేపట్టి, వ్యక్తి గతంగా కూడా వెన్నంటే ఉండి ప్రోత్సాహాన్నందించిన సాయి కిరణ్ గారికి,ఈ విజయాన్ని సాధించడానికి ఎంతగానో ప్రోత్సాహాన్ని అందించిన యర్రా రామారావు గారికి, వ్యాసాలు రాయడంలో మెళకువలు నేర్పిన, నేర్పిస్తున్న వికీలో నా మొదటి గురువు కశ్యప్ గారికి, ప్రాజెక్టులో పాలు పంచుకుంటూ ప్రోత్సాహాన్నందించిన ఇతర సముదాయ సభ్యులకు హృదయ పూర్వక ధన్యవాదాలు. ఈ నా కృషిని ఇంతటితో ఆపకుండా మరెన్నో ప్రాజెక్టులు నిర్వహిస్తూ, పాలుపంచుకుంటూ... వికీ అభివృద్ధికి తోడ్పడతాను.--అభిలాష్ మ్యాడం 04:53, 16 డిసెంబరు 2021 (UTC)
- అభిలాష్ గారూ, మొత్తం వ్యాసాల్లో సగానికి పైబడి రాసి ఈ ఎడిటథాన్ విజయం సాధించడానికి కృషి చేసారు. అభినందనలు. ఈ ప్రాజెక్టు చేపట్టిన @Nskjnv గారికి కూడా అభినందనలు. ఇలాంటి ఎడిటథాన్‌లు ప్రాజెక్టులూ మనం తరచుగా నిర్వహించుకుంటూ ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. అభిలాష్ గారూ, మీరు ఒక ప్రాజెక్టు నిర్వహించండి. __ చదువరి (చర్చ • రచనలు) 05:31, 21 డిసెంబరు 2021 (UTC)
- చదువరి గారూ ధన్యవాదాలు. తప్పకుండా నేను మరో ప్రాజెక్టు నిర్వహిస్తాను. మీ సూచనలకు ధన్యవాదాలు--అభిలాష్ మ్యాడం 18:10, 21 డిసెంబరు 2021 (UTC)
మీ సంతకం రూపం
[మార్చు]@MYADAM ABHILASH గారు, మీ సంతకం పైన, క్రింద రంగుల డిజైను పై క్రింది వరుసల పాఠ్యంపై పడి చదవటానికి కొన్ని సందర్భాలలో అసౌకర్యంగా వుంది. మీ సంతకం డిజైన్ అదే వరుసలో ఖతి స్థాయిలో వుండేటట్లు మార్చుకుంటే బాగుంటుంది. అర్జున (చర్చ) 10:24, 3 జనవరి 2022 (UTC)
- అర్జున గారూ మీ సలహాకు ధన్యవాదాలు. మొబైల్ ద్వారా దిద్దుబాట్లు చేస్తున్నందుకు సంతకంలో కొంత లోపం వస్తుంది అని అనుకుంటున్నా. అభిరుచుల్లో మారుస్తాను. ధన్యవాదాలు--అభిలాష్ మ్యాడం 11:41, 3 జనవరి 2022 (UTC)
తెవికీలో మీ కృషికి
[మార్చు]అభిలాష్ మ్యాడం గారూ, తెవికీలో 100వికీడేస్ విజయవంతంగా పూర్తిచేసి, 220వికీడేస్ దాటి వికీవత్సరం (365వికీడేస్) వైపు దూసుకెళుతున్న సందర్భంగా మీరు చేస్తున్న కృషిని అభినందిస్తూ ప్రణయ్‌రాజ్ వంగరి చదివిస్తున్న తార. |
ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 03:40, 21 జనవరి 2022 (UTC)
- ప్రణయ్ రాజ్ గారూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని కొనసాగిస్తున్న ఈ నా దీక్షలో మీరు అందించే ఈ పతకాలు విజయానికి పథాలు--అభిలాష్ మ్యాడం (చర్చ) 09:02, 21 జనవరి 2022 (UTC)
కొత్త వాడుకరులకు స్వాగత సందేశం.
[మార్చు]@MYADAM ABHILASH గారు, మీరు చేర్చే స్వాగత సందేశాలకు ట్వింకిల్ కాని స్వాగత సందేశంలో తెలిపినట్లుగా కాక, మానవీయంగా స్వాగత వివరాలు చేర్చటం (ఉదాహరణ) గమనించాను. దయచేసి ట్వింకిల్ గాని, స్వాగతం సందేశంలో తెలిపినట్లుగానే స్వాగతించి కొత్తవారికి ఏకరూప స్వాగత సందేశం అందేలా చేయాలని కోరుచున్నాను. అర్జున (చర్చ) 05:16, 26 జనవరి 2022 (UTC)
- మీ సలహాకు ధన్యవాదాలు అర్జున గారూ.--అభిలాష్ మ్యాడం (చర్చ) 04:31, 27 జనవరి 2022 (UTC)
చర్చలలో చురుకైనవారు
[మార్చు]చర్చలలో చురుకైనవారు | ||
@MYADAM ABHILASH గారు, 2021 లో వ్యాస, వికీపీడియా పేరుబరుల చర్చాపేజీలలో చురుకుగా పాల్గొన్నందులకు అభివందనాలు. గుర్తింపుగా ఈ పతకాన్ని స్వీకరించండి. మరిన్ని వివరాలు చూడండి. వికీపీడియా అభివృద్ధికి సామరస్యపూర్వక చర్చలు కీలకం. మీరు మరింత క్రియాశీలంగా చర్చలలో పాల్గొంటారని ఆశిస్తున్నాను. అర్జున (చర్చ) 07:07, 23 మార్చి 2022 (UTC) |
- మీ ప్రోత్సాహకానికి హృదయపూర్వక ధన్యవాదాలు అర్జున గారు-అభిలాష్ మ్యాడం (చర్చ) 14:31, 23 మార్చి 2022 (UTC)
A sivakesavarao అడుగుతున్న ప్రశ్న (02:43, 20 మే 2022)
[మార్చు]నమస్తే గురువుగారు విద్యారణ్యులవారు వ్రాశిన శంకరవిజయము ఆంధ్రానువాదము లభ్యమగునా --A sivakesavarao (చర్చ) 02:43, 20 మే 2022 (UTC)
- A sivakesavarao గారూ నమస్తే, వికీపీడియాలో చేరినందుకు ధన్యవాదాలు. మిరడిగిన శంకరవిజయము అనే పుస్తకము వికీపీడియా సోదర ప్రాజెక్టు అయిన వికీ సోర్సులో మీకు లభించవచ్చు. మీరు అక్కడ వెతకగలరు..--అభిలాష్ మ్యాడం (చర్చ) 14:46, 22 మే 2022 (UTC)
అనాథ పేజీలు
[మార్చు]అభిలాష్ గారూ, మీరు సృష్టిస్తున్న పేజీల్లో కొన్ని అనాథ పేజీలుగా మిగిలిపోతున్నాయి. వికీలో వేరే ఏ వ్యాసం పేజీ నుండి లింకంటూ లేని పేజీలను అనాథలంటారు. అలా లింకులు లేనందున ఆ పేజీలు వాడుకరులకు కనబడే అవకాశం బాగా తక్కువగా ఉంటుంది. గూగుల్ వంటి సెర్చి ఇంజన్లకు కూడా అవి కనబడక పోయే అవకాశం ఉంది. మీరు సృష్టించిన వ్యాసాల్లో అలాంటివి 300 పైచిలుకు ఉన్నాయి. సముచితమైన పేజీల నుండి వీటికి లింకులు ఇచ్చే ప్రయత్నం చెయ్యండి. అలాగే ఇకపై సృష్టించే వ్యాసాలు అనాథలు కాకుండా చూడండి. అలాగే ఇతర భాషల వికీపీడియా వ్యాసాల లింకులు (అంతర్వికీ లింకులు) ఇచ్చే విషయంపై కూడా శ్రద్ధ పెట్టవలసినదిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. __ చదువరి (చర్చ • రచనలు) 02:11, 22 మే 2022 (UTC)
- అలాగే చదువరి గారూ, మీరు ఇంతకుముందే ఈ సూచన చేశారు... కానీ నేను ప్రస్తుతం కొంత బిజీగా ఉన్నందుకు ఎక్కువ సమయం వెచ్చించలేకపోతున్నాను.. కానీ సాధ్యమైనంత వరకు మీ సూచనను పాటించే ప్రయత్నం చేస్తాను.--అభిలాష్ మ్యాడం (చర్చ) 14:39, 22 మే 2022 (UTC)
ఆర్టికల్ అనువాదం
[మార్చు]Abhilash, కాస్త Raghuttama Tirtha, Satyanidhi Tirtha మరియు Satyanatha Tirtha ఆర్టికల్స్ కూడా తెలుగు లోకి అనువాదం చేస్తారా. ధన్యవాదములు - MRRaja001 (చర్చ) 19:40, 21 జూలై 2022 (UTC)
- MRRaja001 గారూ వ్యాసాలు వెతికిపెట్టినందుకు ధన్యవాదాలు. --అభిలాష్ మ్యాడం (చర్చ) 06:10, 22 జూలై 2022 (UTC)
Request
[మార్చు]MYADAM ABHILASHగారు, దయచేసి ఈ సవరణతో హసన్ ముంతసీర్ తీసివేసిన వాటిని పునరుద్ధరించండి.-2401:4900:376C:40CD:1AB4:5CA6:43E2:5641 00:24, 13 అక్టోబరు 2022 (UTC)
అయ్యా బగున్నారా" పేజీలో రాయటం అంతగా రావటం లెదు --Vnaidu (చర్చ) 13:26, 27 అక్టోబరు 2022 (UTC)
వికిలో భాషలు - కొత్త ప్రాజెక్టు
[మార్చు]నమస్కారం అభిలాష్ గారు,
ప్రపంచ వ్యాప్తంగా వికీపీడియా 323 పైగా భాషల్లో ఉంది! అలా కాకుండా భారత దేశంలోనే- వికీపీడియాలు ఉన్న భాషలు, లేనివి చాలానే ఉన్నాయి! ప్రపంచంలో దాదాపుగా 7000 భాషలు మాట్లాడే వారు ఉన్నారు మరి! ప్రతి రెండు వారాలకి ప్రపంచంలో ఒక భాష అంతరించి పోతుందని, కొన్ని నివేదికలు కూడా చెబుతున్నాయి!
ఇవన్ని ప్రపంచం మరవక ముందే తెలుగు వికీలో వాటి గురించి రాసేద్దమా !!
తెలుగు వికిలో భాషలు, భాష నిష్ణాతులు, భాషకి అనుసంధానంగా ఉన్న విషయాలపై వ్యాసాలను నిర్మించే విధంగా ఒక ప్రాజెక్టు చేపడదామా!
పరిశీలించండి.
NskJnv 11:35, 31 అక్టోబరు 2022 (UTC)
- నమస్కారం సాయి కిరణ్ గారు అద్భుతమైన ఆలోచన. అందరికీ ఉపయోగకరంగా కూడా ఉంటుంది. ఆ దిశగా ప్రయత్నం చేసి ప్రాజెక్టును విజయవంతం చేద్దాం. దీనికి నేనే నిర్వహకుడిగా ఉండి నడిపిస్తాను. ధన్యవాదాలు-అభిలాష్ మ్యాడం (చర్చ) 13:01, 31 అక్టోబరు 2022 (UTC)
WPWPTE ముగింపు వేడుక
[మార్చు]నమస్కారం !
వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022 ప్రాజెక్టులో మీ కృషికి ధన్యవాదాలు.
నవంబరు 12 (రెండవ శనివారం) నాడు హైద్రాబాద్ రవీంద్ర భారతిలో WPWPTE ముగింపు వేడుక నిర్వహిస్తున్నాము. ఆరోజు పోటీలో గెలుపొందిన వారిని సత్కరించుకుందాం, అలాగే ఇటీవల మన సముదాయం కోల్పోయిన వికీపీడియను ఎల్లంకి భాస్కర్ నాయుడు గారిని స్మరించుకుందాం. కావున మీరు తప్పక హాజరవ్వగలరని నా మనవి.
వేడుకకి హాజరయ్యే వారు వేడుక పేజీలో పాల్గొనేవారు అనే శీర్షిక కింద మీ సంతకం చేయగలరు.
పోటీలో పాల్గొన్న వారందరికీ సావనీర్లు అందించాలని తలుస్తున్నాము, వీటికోసం ఈ [3] ఫారంలో మీ వివరాలు చేర్చగలరు.
ధన్యవాదాలు.
NskJnv 05:43, 5 నవంబరు 2022 (UTC)
WikiConference India 2023: Program submissions and Scholarships form are now open
[మార్చు]Dear Wikimedian,
We are really glad to inform you that WikiConference India 2023 has been successfully funded and it will take place from 3 to 5 March 2023. The theme of the conference will be Strengthening the Bonds.
We also have exciting updates about the Program and Scholarships.
The applications for scholarships and program submissions are already open! You can find the form for scholarship here and for program you can go here.
For more information and regular updates please visit the Conference Meta page. If you have something in mind you can write on talk page.
‘‘‘Note’’’: Scholarship form and the Program submissions will be open from 11 November 2022, 00:00 IST and the last date to submit is 27 November 2022, 23:59 IST.
Regards
MediaWiki message delivery (చర్చ) 11:25, 16 నవంబరు 2022 (UTC)
(on behalf of the WCI Organizing Committee)
WikiConference India 2023: Open Community Call and Extension of program and scholarship submissions deadline
[మార్చు]Dear Wikimedian,
Thank you for supporting Wiki Conference India 2023. We are humbled by the number of applications we have received and hope to learn more about the work that you all have been doing to take the movement forward. In order to offer flexibility, we have recently extended our deadline for the Program and Scholarships submission- you can find all the details on our Meta Page.
COT is working hard to ensure we bring together a conference that is truly meaningful and impactful for our movement and one that brings us all together. With an intent to be inclusive and transparent in our process, we are committed to organizing community sessions at regular intervals for sharing updates and to offer an opportunity to the community for engagement and review. Following the same, we are hosting the first Open Community Call on the 3rd of December, 2022. We wish to use this space to discuss the progress and answer any questions, concerns or clarifications, about the conference and the Program/Scholarships.
Please add the following to your respective calendars and we look forward to seeing you on the call
- WCI 2023 Open Community Call
- Date: 3rd December 2022
- Time: 1800-1900 (IST)
- Google Link': https://meet.google.com/cwa-bgwi-ryx
Furthermore, we are pleased to share the email id of the conference contact@wikiconferenceindia.org which is where you could share any thoughts, inputs, suggestions, or questions and someone from the COT will reach out to you. Alternatively, leave us a message on the Conference talk page. Regards MediaWiki message delivery (చర్చ) 16:21, 2 డిసెంబరు 2022 (UTC)
On Behalf of, WCI 2023 Core organizing team.
ఇ పేపరు లింక్ ల విషయం
[మార్చు]మూలాలు తెలియజేయటానికి ఇ పేపరు లింక్ అడుగుతున్నారు. వెబ్ లో గత కాలపు వార్తలు లభ్యం కావటం లేదు. ఒక నెలలోపు మాత్రమే కనబడుచున్నవి. మరి ఎలా?
ఆనాటి పేపర్ కటింగ్స్ ఫోటోలు ఆమోదించవచ్చుగదా ? గ్రంధస్త ఆధారాలు మూలాలు అవుతాయి గదా? బెజ్జంకి జగన్నాథాచార్యులు (చర్చ) 03:36, 24 డిసెంబరు 2022 (UTC)
- నమస్తే జగన్నాథచార్య గారూ..!
- పేపర్ కటింగ్స్ ఫోటోలను వెబ్ ఆర్కైవ్ లో సేవ్ చేసి ఆ లింకును మీరు రిఫరెన్స్ గా వాడుకోవచ్చు. అభిలాష్ మ్యాడం (చర్చ) 03:50, 2 నవంబరు 2023 (UTC)
పత్రి అశ్వనీ కుమార్ అడుగుతున్న ప్రశ్న (13:25, 11 ఆగస్టు 2023)
[మార్చు]నమస్కారమండీ. నేను యువభారతి వికీపీడియా పేజి లో ప్రచురణల లిస్టు update చేయాలనుకుంటున్నాను. నాకు సహాయ పడగలరా ? --పత్రి అశ్వనీ కుమార్ (చర్చ) 13:25, 11 ఆగస్టు 2023 (UTC)
- తప్పకుండా అశ్వినీ కుమార్ గారూ...!
- wikivivekam@gmail.com మెయిల్ లో నన్ను సంప్రదించగలరు అభిలాష్ మ్యాడం (చర్చ) 03:54, 2 నవంబరు 2023 (UTC)
క్రొవ్విడి వెంకట రాజారావు అడుగుతున్న ప్రశ్న (21:51, 17 అక్టోబరు 2023)
[మార్చు]ఆర్యా! నమస్సులు. నేను పద్యకవిని. నేను పద్యాలను సృష్టించి పఁపుదామనుకుంటున్నాను. పంపవచ్చునా? దయతో తెలియజేయగలరు. --క్రొవ్విడి వెంకట రాజారావు (చర్చ) 21:51, 17 అక్టోబరు 2023 (UTC)
క్రొవ్విడి వెంకట రాజారావు అడుగుతున్న ప్రశ్న (22:32, 17 అక్టోబరు 2023)
[మార్చు]ఆర్యా! నమస్సులు. నేను పద్యకవిని వికీపీడియాద్వారా నేను పద్యాలను సృష్టించదలచినాను. పద్యాలు వ్రాయవచ్చునా? తెలియజేయగలరు. --క్రొవ్విడి వెంకట రాజారావు (చర్చ) 22:32, 17 అక్టోబరు 2023 (UTC)
- నమస్కారం క్రొవ్విడి వెంకట రాజారావు గారూ...!
- సృజనాత్మక అంశాలకు సంబంధించిన వాటికి ఇది వేదిక కాదు... కేవలం ఇందులో సమాచారాన్ని తెలిపే వ్యాసాలు మాత్రమే పబ్లిష్ చేయాలి. మిరడిగన పద్యాలను పబ్లిష్ చేయుటకు వికీపీడియా సోదర ప్రాజెక్టు అయిన వికీబుక్స్ మీకు తోడ్పడుతుంది. దాన్ని గురించి తెలుసుకోవాలంటే ముందుగా వికీపీడియాలో రాసే అలవాటు ఉండాలి. కాబట్టి నేనిచ్చే సలహా ఏమిటంటే ముందుగా మీకు తెలిసిన కొత్త సమాచారంతో వికీపీడియాలో వ్యాసాలు రాయడం మొదలెట్టండి.
- మీ ఆసక్తికి ధన్యవాదాలు. - అభిలాష్ మ్యాడం (చర్చ) 12:04, 2 నవంబరు 2023 (UTC)
వికీపీడియా ఏషియన్ నెల ప్రాజెక్టు - నిర్వహణ
[మార్చు]నమస్కారం అభిలాష్ గారు,
ప్రతి ఏటా నవంబరు నెలలో ఆసియా దేశాలలో వివిధ సముదాయాల మధ్య అవగాహన పెంచటానికి వికీపీడియా ఏషియన్ నెల ప్రాజెక్టుని నిర్వహించటం జరుగుతుంది, ఈ ప్రాజెక్టు తెలుగు వికీలో ఇది వరకు పలు మార్లు నిర్వహించడం జరిగింది. 2021 లో నేను ఈ ప్రాజెక్టుని నిర్వహించిన విషయం మీకు తెలిసిందే, అయితే ఈ సంవత్సరం కూడా ఈ ప్రాజెక్టు నిర్వహిద్దామని అనుకుంటున్నాను. మీకు దీంట్లో ఆసక్తి ఉంటె నాతో పాటు సహా నిర్వాహకులుగా ఉండాల్సిందిగా కోరుతున్నాను.
ఇక ఈ విషయంపై మీరు స్పందిస్తే రచ్చబండలో చర్చ మొదలుపెడతాను. ధన్యవాదాలు.
NskJnv 06:38, 30 అక్టోబరు 2023 (UTC)
- తప్పకుండా వాడుకరి:Nskjnv గారూ... ప్రతి సంవత్సరంలాగే ఈ సారి కూడా ఏషియన్ మంత్ ప్రాజెక్టు నిర్వహిద్దాం. ఈ విషయంలో నేనూ ముందుంటాను. అభిలాష్ మ్యాడం (చర్చ) 03:46, 2 నవంబరు 2023 (UTC)
తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం
[మార్చు]నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. 10 రోజులపాటు (అంటే డిసెంబరు 21, 2023 దాకా) ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:23, 11 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)
The article అట్టెం దత్తయ్య has been proposed for deletion because it appears to have no references. Under Wikipedia policy, this biography of a living person will be deleted after seven days unless it has at least one reference to a reliable source that directly supports material in the article.
If you created the article, please don't be offended. Instead, consider improving the article. For help on inserting references, see Referencing for beginners, or ask at the help desk. Once you have provided at least one reliable source, you may remove the {{prod blp/dated}} tag. Please do not remove the tag unless the article is sourced. If you cannot provide such a source within seven days, the article may be deleted, but you can request that it be undeleted when you are ready to add one. పవన్ సంతోష్ (చర్చ) 16:45, 24 డిసెంబరు 2023 (UTC)
అట్టెం దత్తయ్య వ్యాసం తొలగింపు ప్రతిపాదన
[మార్చు]అట్టెం దత్తయ్య వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను :
- వికీపీడియా:విషయ ప్రాముఖ్యత (రచయితలు) ప్రకారం నిర్ధారించదగ్గ తటస్థ మూలాలతో విషయ ప్రాముఖ్యత ఎస్టాబ్లిష్ చేసిలేదు.
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/అట్టెం దత్తయ్య పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. పవన్ సంతోష్ (చర్చ) 16:48, 24 డిసెంబరు 2023 (UTC) పవన్ సంతోష్ (చర్చ) 16:48, 24 డిసెంబరు 2023 (UTC)
నమస్కారం @ అభిలాష్ గారు,
స్త్రీవాదము - జానపదము అనేది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలలో వికీపీడియాలో జరిగే అంతర్జాతీయ రచనల పోటీ. వికీపీడియాలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జానపద సంస్కృతి, జానపద కథలతో సంబంధం ఉన్న స్త్రీలకు సంబంధించిన అనేక అంశాలను డాక్యుమెంట్ చేయడం దీని ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా జానపద వారసత్వాన్ని డాక్యుమెంట్ చేయడానికి వికీమీడియా కామన్స్‌లో నిర్వహించబడిన వికీ లవ్స్ ఫోక్‌లోర్ (WLF) ఫోటోగ్రఫీ ప్రచారానికి వికీపీడియా మరోరూపం. ఈ ప్రాజెక్టులో జానపద ఉత్సవాలు, జానపద నృత్యాలు, జానపద సంగీతం, జానపద మహిళలు, విచిత్రమైన జానపద కథలు, జానపద ఆటల క్రీడాకారులు, పురాణాలలో మహిళలు, జానపద కథలలో మహిళా యోధులకు గురించిన కొత్త వ్యాసాలను రాయడం లేదా వికీలో ఉన్న వ్యాసాలను మెరుగుపరచవచ్చు.
2024 గాను ఫిబ్రవరి మార్చి రెండు నెలల్లో స్త్రీవాదం- జానపదం ప్రాజెక్టును నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు కూడ అందిస్తున్నాము.
వెంటనే స్త్రీవాదము-జానపదము ప్రాజెక్టు పేజీ సందర్శించి మీ వంతు సహకారం అందించగలరు.
ధన్యవాదాలు.
ఇట్లు
Tmamatha (చర్చ) 17:33, 3 ఫిబ్రవరి 2024 (UTC)
- @Tmamatha గారూ... ఈ ప్రాజెక్టును తెవికీలో నడిపించడం సంతోషకరం. తప్పకుండా పాల్గొంటాను-అభిలాష్ మ్యాడం (చర్చ) 04:42, 4 ఫిబ్రవరి 2024 (UTC)
నిర్వాహకత్వ హక్కులు పొందటానికి కొత్త మార్గదర్శకాలు పేజీలో స్పందించండి
[మార్చు]అభిలాష్ గారూ, నిర్వాహకత్వ బాధ్యతలు స్వీకరించుటకు కావలిసిన కనీస మార్గదర్శకాలు సూచించటానికి తయారుచేసిన కొత్త మార్గదర్శకాల ప్రతిపాదనల పేజీలో మీరు 2024 మార్చి 31 లోపు స్పందించవలసినదిగా కోరుచున్నాను. ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 14:04, 25 మార్చి 2024 (UTC)
Ushavijay9866 అడుగుతున్న ప్రశ్న (06:25, 21 ఏప్రిల్ 2024)
[మార్చు]నమస్కారం గురువుగారు, వికీపీడియాలో దిద్దుబాట్లు చెయ్యడంలో ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానం చెప్పుటకు నిలబడినందుకు ధన్యవాదములు. --Ushavijay9866 (చర్చ) 06:25, 21 ఏప్రిల్ 2024 (UTC)
మీరు రాసిన వ్యాసం సమీక్షించబడ్డది.
[మార్చు]చివరి మార్పు తరువాత కొన్ని కొత్త వ్యాసాలు సమీక్షించబడ్డాయి:
- జిఝరి (నృత్యం) (evaluated by Nskjnv; స్థితి = approved)
ఇది క్యాంప్విజ్ బాటు ద్వారా అందజేయబడ్డ సందేశం. - CampWiz Bot (చర్చ) 08:06, 11 జూన్ 2024 (UTC)
దొనికెల మహేశ్వర్ గౌడ్ అడుగుతున్న ప్రశ్న (09:54, 16 ఆగస్టు 2024)
[మార్చు]గురువుగారికి నమస్కారం నా పేరు దొనికెల మహేశ్వర్ గౌడ్
నా సందేహం ఏమిటంటే తెలంగాణా ప్రాంతం లో కౌండిన్య గోత్రం లో దొనికెల ఇంటి పేరుతో ఎన్నో తరాలుగా జీవనం గడుపుతున్న కుటుంబాలు చాలా వున్నవి మరి అలాంటి నిబద్దత కలిగిన ఈ గృహ నామాన్ని ఎందుకు మన గృహనామాల్లో చేర్చలేదు? (Donikela) ఇట్టి విషయం పైన నా సందేహాన్ని తీరుస్తారని కోరుకుంటున్నాను 🙏 --దొనికెల మహేశ్వర్ గౌడ్ (చర్చ) 09:54, 16 ఆగస్టు 2024 (UTC)
ఇండిక్ మీడియావికి డెవలపర్స్ యూజర్ గ్రూప్ - టెక్నికల్ సంప్రదింపులు 2024
[మార్చు]నమస్తే,
ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ యూజర్ గ్రూప్ వికీమీడియా ప్రాజెక్ట్‌లకు సహకరిస్తున్నప్పుడు వివిధ సాంకేతిక సమస్యలపై సభ్యుల అవసరాలను అర్థం చేసుకోవడానికి కమ్యూనిటీ టెక్నికల్ కన్సల్టేషన్ ప్రక్రియను ప్రారంభించారు. వీటి లక్ష్యం కమ్యూనిటీలలోని సవాళ్లను బాగా అర్థం చేసుకోవడం, సాధారణ సమస్యలను అర్థం చేసుకోవడం మరియు భవిష్యత్ సాంకేతిక అభివృద్ధి కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం.
మొదటి దశ మీ సాధారణ సమస్యలు, ఆలోచనలు మొదలైనవాటిని ఎక్కడ నివేదించాలనే సర్వే. దయచేసి సర్వేను (మీకు నచ్చిన భాషలో) ఇక్కడ పూరించండి. https://docs.google.com/forms/d/e/1FAIpQLSfvVFtXWzSEL4YlUlxwIQm2s42Tcu1A9a_4uXWi2Q5jUpFZzw/viewform?usp=sf_link
చివరి తేదీ 20 సెప్టెంబర్ 2024.
మీరు బహుళ సమస్యలు లేదా ఆలోచనలను నివేదించాలనుకుంటే, మీరు సర్వేను ఒకటి కంటే ఎక్కువసార్లు పూరించవచ్చు.
కార్యాచరణ గురించి మరింత చదవడానికి, దయచేసి సందర్శించండి: https://w.wiki/AV78
సర్వే తెలుగులో పైన పేజీలో ఉన్నాయ్.
ధన్యవాదాలు! MediaWiki message delivery (చర్చ) 13:29, 9 సెప్టెంబరు 2024 (UTC), ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ తరపున
Translation request
[మార్చు]Hello, MYADAM ABHILASH.
Can you translate and upload the article about the prominent Turkish economist en:Dani Rodrik in Telugu Wikipedia?
Yours sincerely, Moroike (చర్చ) 21:23, 11 డిసెంబరు 2024 (UTC)
- @Moroike ok sure. అభిలాష్ మ్యాడం (చర్చ) 04:14, 12 డిసెంబరు 2024 (UTC)