విశాఖ నక్షత్రము
విశాఖనక్షత్రము గుణగణాలు
[మార్చు]విశాఖ గురుగ్రహ నక్షత్రము, రాక్షస గణము, అధిదేవతలు, ఇంద్రుడు, అగ్ని, జంతువు పులి, రాశ్యథిపతి కుజుడు. గురుదశతో జీవితము ప్రారంభం ఔతుంది కనుక బాల్యము సుఖముగా జరుగుతుంది. తల్లి తండ్రులు కుటుంబ సభ్యుల మధ్య గారాబంగా జీవితము మొదలైతుంది. వీరికి మొండితనము ఎక్కువ. అనుకున్నది అమలు చేస్తారు. విరికి సలహాలు చెప్పి మార్చాలని అనుకోవడము వ్యర్ధము. వీరికి సహాయము చేసిన వారికి కూడా వీరు సహకరించడానికి మనస్కరించదు. వారు చేసిన సహాయాన్ని భూతద్దములో చూపిస్తారు. అనర్హులైన వారికి సంపూర్ణ సహకారాలు అందిస్తారు అయినా వారి వలన ముప్పు కూడా పొంచి ఉంటుంది. భార్య లెక స్త్రీ సహాయము లేనిదే వీరు రాణించ లేరు. వైద్య, వ్యాపార, సాంకేతిక రంగాలలో, ఆర్థికపరమైన వ్యాపారాలలో పట్టు సాధిస్తారు. రాజకీయ ప్రవేశము చెస్తే ఉన్నత పదవులు వస్తాయి. మంచి సలహాదారుల వలన ప్రయోజనాలు ఉంటాయి. వంశాపారంపర్య ఆస్తులు సంక్రమిస్థాయి. స్వంతగా అంతకంటే అధికమైన ఆస్తులు సంపాదిస్తారు. సంతానము వలన ఖ్యాతి లభిస్తుంది. ఆధ్యాత్మిక రంగము వారి వలన మోసానికి గురిఔతారు. అన్యభాషలు నేర్చుకుంటారు. సాంకేతిక రంగం ఆధారముగా ఇతర రంగాలలో ప్రవేశించి ఆ రంగములో విజయము సాధించి ప్రముఖ్యత సాధిస్తారు. చదివిన చదువుకు చెసె ఉద్యోగానికి సమ్బంధము ఉండదు. ఉద్యోగములో బదిలీలు పొంచి ఉంటాయి. అవినీతి ఆరోపణలకు ఆస్కారము ఉంది. రాజకీయ నాయకులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.వారి వలన నష్టము ప్రయోజనము సమముగా ఉంటాయి. కథినమైన మనస్తత్వము ఉంటుంది. విదేశీపౌరసత్వము లభిస్తుంది. జీవితములో కనీస అవసరాలను తీర్చుకుంటారు. కుటుంబసభ్యుల మీద తప్ప ఇతరుల మీద ప్రేమాభిమానాలు తక్కువ. భయము, పొదుపు, జాగ్రత్త, విజ్ఞానము జీవితములో సమపాళ్ళలో ఉంటాయి. ఏభై సంవత్సరాల అనంతరము జీవితము సుఖవంతముగా జరుగుతుంది కనుక వృద్ధాప్యము సుఖవంతముగా జరుగుతుంది.
నక్షత్రములలో ఇది 16వ నక్షత్రం.
నక్షత్రం | అధిపతి | గణము | జాతి | జంతువు | వృక్షము | నాడి | పక్షి | అధిదేవత | రాశి |
---|---|---|---|---|---|---|---|---|---|
విశాఖ | గురువు | రాక్షస | స్త్రీ | పులి | నాగకేసరి | అంత్య | గరుడుడు | ఇంద్రుడు, అగ్ని | 1,2,4 తుల 4 వృశ్చికము |
విశాఖ నక్షత్ర జాతకుల తారా ఫలాలు
[మార్చు]తార నామం | తారలు | ఫలం |
---|---|---|
జన్మ తార | పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర | శరీరశ్రమ |
సంపత్తార | పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర | ధన లాభం |
విపత్తార | ఆశ్లేష, జ్యేష్ట, రేవతి | కార్యహాని |
సంపత్తార | అశ్విని, మఖ, మూల | క్షేమం |
ప్రత్యక్ తార | భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ | ప్రయత్న భంగం |
సాధన తార | కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ | కార్య సిద్ధి, శుభం |
నైత్య తార | రోహిణి, హస్త, శ్రవణం | బంధనం |
మిత్ర తార | మృగశిర, చిత్త, ధనిష్ఠ | సుఖం |
అతిమిత్ర తార | ఆరుద్ర, స్వాతి, శతభిష | సుఖం, లాభం |
విశాఖనక్షత్రము నవాంశ
[మార్చు]- 1 వ పాదము - మేషరాశి.
- 2 వ పాదము - వృషభకరాశి.
- 3 వ పాదము - మిధునరాశి
- 4 వ పాదము - కర్కాటకరాశి.
చిత్రమాలిక
[మార్చు]-
విశాఖా నక్షత్ర వృక్షము
-
విశాఖా నక్షత్ర జంతువు
-
విశాఖా నక్షత్ర జాతి స్త్రీ
-
విశాఖా నక్షత్ర పక్షి గరుడుడు.
-
విశాఖ నక్షత్ర అధిపతి
-
విశాఖా నక్షత్ర అధిదేవత
-
విశాఖా నక్షత్ర గణము రాక్షస గణము రాక్షసరాజు రావణుడు.
విశాఖ నక్షత్రము ప్రాశస్త్యము
[మార్చు]- గర్బాధానము, నూతన వస్త్రధారణ, నృత్యము, గీతము, చిత్రలేఖనము, వాహనారోహణ, వాణిజ్యం లకు ప్రశస్తము.
- క్షురకర్మలకు మధ్యమము.