కొసనా ఈశ్వరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈశ్వర్
కొసనా ఈశ్వరరావు
జననం(1938-02-01)1938 ఫిబ్రవరి 1
India పాలకొల్లు ఆంధ్రప్రదేశ్
మరణం2021 సెప్టెంబరు 21
నివాస ప్రాంతంచెన్నై
వృత్తిసినీ పబ్లిసిటీ డిజైనర్
ప్రసిద్ధిసినీ పబ్లిసిటీ డిజైనర్
మతంహిందూ
భార్య / భర్తవరలక్ష్మి
పిల్లలుఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు

కొసనా ఈశ్వరరావు (1938 ఫిబ్రవరి 1 - 2021 సెప్టెంబరు 21 )తెలుగు సినీ పరిశ్రమలో "ఈశ్వర్" నామంతో నాలుగు దశాబ్దాలపాటు సినిమాపోస్టర్లని డిజైన్ చేసినవారు.పోస్టర్‌ డిజైనింగులో అందెవేసిన చేయి ఈశ్వర్‌ది.[1] ఈయన రాసిన సినిమా పోస్టరు పుస్తకానికి 2012లో ఉత్తమ చలనచిత్ర పుస్తకం విభాగంలో నంది అవార్డు వచ్చింది.

జీవిత విశేషాలు

[మార్చు]

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో లోహశిల్పుల కుటుంబంలో ఫిబ్రవరి 1, 1938లో పుట్టిన ఈశ్వర్ చిన్నతనంలోనే కుటుంబం ఆర్థికంగా చితికిపోవటంతో చాలా ఇబ్బందులు పడవలసి వచ్చింది. పాలిటెక్నిక్ చదువును అర్థంతరంగా ముగించుకొని, పొట్ట చేతపట్టుకుని, చేతిలో ఉన్న బొమ్మలుగీసే కళను నమ్ముకొని మద్రాసు చేరాడు. స్టూడియో కేతా అధిపతి కేతా సాంబమూర్తి, సరాగం స్టూడియో గంగాధర్ చేయూతనిచ్చి ఆదరించారు. అంచెలంచెలుగా పెరిగి, స్వంత స్టూడియో స్థాపించుకొని, నాలుగుభాషల్లో పెద్దపెద్ద నిర్మాణసంస్థలకూ, నటులకూ ప్రీతిపాత్రుడైన పబ్లిసిటీ ఆర్టిస్టుగా ఎదిగారు. 2000 సంవత్సరంలో దేవుళ్ళు చిత్రం తర్వాత విశ్రాంత జీవితం గడుపుతూ 21 సెప్టెంబర్ 2021 న చెన్నై లో అనారోగ్యంతో మరణించాడు.[2] [3] . ఆయన భార్య పేరు వరలక్ష్మి. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.


ఈశ్వర్ జీవితంలో చాలా నాటకీయత ఉంది. ఐశ్వర్యం, దారిద్ర్యం, విఫల ప్రేమ, బంధుమిత్రుల ద్రోహాలు, అవమానాలు, వీటన్నిటినీ అధిగమించి సఫలం కావడం, తనను అవమానించినవారిని సైతం ఆదరించటం యండమూరి, యద్దనపూడిల నవలలా ఉంటుంది ఆయన కథ. బాపు-రమణల సాక్షి తెలుగులో ఆయన మొదటి చిత్రం. ఆ డిజైన్లు చూసిన విజయాధినేతలు రామ్ ఔర్ శ్యామ్ చిత్రం ఆయనకు అప్పగించారు. దానితర్వాత వచ్చిన పాపకోసం చిత్రానికి ఆయన చేసిన డిజైన్లు ఆయనకు చాలా పేరు తెచ్చాయి. ఈశ్వర్ ప్రస్థానానికి ఇక అడ్డులేకుండా పోయింది. ఒక సంక్రాంతిరోజున తమిళంలో విడుదలైన ఆరుగురు పెద్ద హీరోల సినిమాలకూ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ అంటే ఆయన ఆ రంగంలో ఎంత ఎత్తుకు ఎదిగాడో అర్థం అవుతుంది.

ప్రతిభావంతుడు

[మార్చు]

ఈశ్వర్, స్వతస్సిద్ధమైన ప్రతిభ ఉన్న కళాకారుడు. చిన్నతనంలోనే ఆయన నాటకాలు వ్రాసి ప్రదర్శించేవారు; రంగాలంకరణ చేసేవారు.[4] పరిషత్ నాటకపోటీలలో పాల్గొని బహుమతులు గెల్చుకున్నారు. ముందు చదువుకోసం, ఆ తర్వాత బతుకుతెరువుకోసం చిత్రకళను నమ్ముకున్నాక నాటకాలని వదిలేశారుకానీ, ఆ రంగంలో ఆయనకు మంచి భవిష్యత్తు ఉండేది అనిపిస్తుంది. గురు ముఖతా కాక చిత్రకళను స్వయంగానే నేర్చుకున్నారు. చిన్నతనంలో సినిమాపోస్టర్లకి నకళ్ళు గీసేవారట.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. సినిమా పోస్టర్‌ పుస్తకావిష్కరణ[permanent dead link]
  2. "eswar: సీనియర్ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ కన్నుమూత". Samayam Telugu. Retrieved 2021-09-21.
  3. "అందంగా, ఆకర్షణీయంగా, ఆసక్తికరంగా – ఈశ్వర్ సినిమా పోస్టర్". Archived from the original on 2016-03-05. Retrieved 2015-12-30.
  4. సినిమా పోస్టర్(Cinema Poster) By eswar - తెలుగు పుస్తకాలు Telugu books - Kinige. Archived from the original on 2021-09-21. Retrieved 2021-09-21.

అధారాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]