తిరుప్పూర్ కుమరన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిరుప్పూర్ కుమరన్
జననంఅక్టోబర్ 4, 1904[1]
చెన్నిమలై, ఈరోడ్, మద్రాస్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా
మరణం1932 జనవరి 11(1932-01-11) (వయసు 27)
తిరుప్పుర్, మద్రాస్ ప్రెసిడెన్సీ, భారతదేశం
మరణ కారణంనిరసన ప్రదర్శనలో పోలీస్ హింస
జాతీయతభారతీయుడు

తిరుప్పూర్ కుమరన్, భారతదేశ స్వాతంత్ర్య సమర యోధుడు.కుమరన్ 1904, అక్టోబర్ 4న బ్రిటిష్ ఇండియాలోని మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న చెన్నిమలైలో జన్మించాడు.

ఉద్యమంలో[మార్చు]

దేశబంధు యూత్ అసోసియేషన్ స్థాపించి, బ్రిటిష్ వారిపై నిరసనలు చేశాడు. తన మరణ సమయంలో బ్రిటీష్ ప్రభుత్వం నిషేధించిన భారత జాతీయవాదుల జెండాను పట్టుకొని ఉండడంవల్ల ఈయన్ను కోడి కథా కుమరన్ (జెండాను కాపాడిన కుమరన్) అని పిలుస్తారు.[2][3]

గుర్తింపు[మార్చు]

  1. 2004, అక్టోబరులో కుమరన్ 100వ జయంతి వార్షికోత్సవంలో భారతదేశ తపాలశాఖ కుమరన్ తపాలా బిళ్ళను విడుదలచేసింది.[4][5]
  2. తమిళనాడు రాష్ట్రం తిరుపూర్ గ్రామంలోని ఒక ప్రముఖ ప్రాంతంలో కుమరన్ విగ్రహాం ప్రతిష్ఠించబడింది.[6][7]

మరణం[మార్చు]

1932, జనవరి 11న తిరుప్పూర్ లోని నోయ్యాల్ నది ఒడ్డున బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్న తిరుప్పూర్ కుమరన్ పై పోలీసులు దాడి చేయంతో తీవ్రంగా గాయపడి మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. "Vanchi and Kumaran anniversaries to be govt functions". Business Standard. 14 September 2015.
  2. "Independence day celebrated". The Hindu. 17 August 2014.
  3. "How well do you know Kongu Nadu". The New Indian Express. 2 March 2015. Archived from the original on 7 ఆగస్టు 2016. Retrieved 20 ఆగస్టు 2018.
  4. "Stamp on 'Tiruppur' Kumaran to be released". Times of India. 3 October 2004.
  5. "India post - 2004 commemorative stamps". Indiapost. Archived from the original on 11 ఫిబ్రవరి 2012. Retrieved 20 August 2018.
  6. "Students hold rally in Tirupur". The Hindu. 16 August 2006. Archived from the original on 5 డిసెంబరు 2007. Retrieved 20 ఆగస్టు 2018.
  7. "Kumaran Memorial". Government of Tamil Nadu. Retrieved 20 August 2018.