వియత్నాం: కూర్పుల మధ్య తేడాలు
Milenioscuro (చర్చ | రచనలు) Better version (GlobalReplace v0.6.5) |
|||
పంక్తి 152: | పంక్తి 152: | ||
*[https://web.archive.org/web/20051027154948/http://www.gso.gov.vn/default_en.aspx?tabid=491 General Statistics Office] |
*[https://web.archive.org/web/20051027154948/http://www.gso.gov.vn/default_en.aspx?tabid=491 General Statistics Office] |
||
*[http://www.mofa.gov.vn/en/ Ministry of Foreign Affairs] |
*[http://www.mofa.gov.vn/en/ Ministry of Foreign Affairs] |
||
*[https://privatecartransferhoian.com/ The best transport service of Vietnam] |
|||
*[https://web.archive.org/web/20081210074101/https://www.cia.gov/library/publications/world-leaders-1/world-leaders-v/vietnam.html Chief of State and Cabinet Members] |
*[https://web.archive.org/web/20081210074101/https://www.cia.gov/library/publications/world-leaders-1/world-leaders-v/vietnam.html Chief of State and Cabinet Members] |
||
07:04, 20 మే 2019 నాటి కూర్పు
Cộng hòa Xã hội Chủ nghĩa Việt Nam సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ వియత్‌నామ్ |
||||||
---|---|---|---|---|---|---|
నినాదం [Độc lập - Tự do - Hạnh phúc] Error: {{Lang}}: text has italic markup (help) "స్వతంత్రం - స్వేచ్ఛ - సంతోషం" |
||||||
జాతీయగీతం Tiến Quân Ca "పురోగమించే సైన్యం గీతం" |
||||||
రాజధాని | హానోయ్ 21°2′N 105°51′E / 21.033°N 105.850°E | |||||
అతి పెద్ద నగరం | హొ చి మిన్ సిటీ | |||||
అధికార భాషలు | వియత్నమీస్ | |||||
ప్రభుత్వం | సోషలిస్ట్ రిపబ్లిక్ 1 | |||||
- | ప్రెసిడెంట్ | Nguyễn Minh Triết | ||||
- | ప్రధానమంత్రి | Nguyễn Tấn Dũng | ||||
- | జనరల్ సెక్రటరీ | Nông Đức Mạnh | ||||
స్వతంత్ర దేశం | ఫ్రాన్స్ నుండి | |||||
- | తేదీ | సెప్టెంబరు2 1945 | ||||
- | గుర్తించబడింది | 1954 | ||||
విస్తీర్ణం | ||||||
- | మొత్తం | 331,689 కి.మీ² (65వది) 128,065 చ.మై |
||||
- | జలాలు (%) | 1.3 | ||||
జనాభా | ||||||
- | జూలై 2005 అంచనా | 85,238,000 (13వది) | ||||
- | 1999 జన గణన | 76,323,173 | ||||
- | జన సాంద్రత | 253 /కి.మీ² (46వది) 655 /చ.మై |
||||
జీడీపీ (PPP) | 2005 అంచనా | |||||
- | మొత్తం | $251.8 billion (36వది) | ||||
- | తలసరి | $3,025 (123rd) | ||||
జినీ? (2002) | 37 (medium) (59వది) | |||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) | 0.709 (medium) (109వది) | |||||
కరెన్సీ | đồng (₫) (VND ) |
|||||
కాలాంశం | (UTC+7) | |||||
- | వేసవి (DST) | (UTC+7) | ||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .vn | |||||
కాలింగ్ కోడ్ | +84 | |||||
1 | 1992 రాజ్యాంగం మరియు అధికారిక నామం ప్రకారం. |
వియత్నాం దక్షిణ ఆసియాలోని ఒక దేశం. 2016 జనాభా లెక్కల ప్రకారం ఈ దేశ జనాభా సుమారు 9 కోట్ల 46 లక్షలు. జనసంఖ్యలో ప్రపంచంలో 15 వ స్థానంలో, ఆసియాలో 9వ స్థానంలో ఉంది. దీనికి ఉత్తరాన చైనా, వాయువ్యాన లావోస్, నైరుతిన కాంబోడియా, తూర్పు దిక్కున మలేషియా, ఫిలిప్ఫీన్స్, ఇండోనేషియా సరిహద్దులుగా ఉన్నాయి. 1976 లో ఉత్తర, దక్షిణ వియత్నాంలు కలిసిపోయినప్పటి నుంచి హనోయ్ నగరం రాజధానిగా ఉంది. హోచిమిన్ నగరం అత్యధిక జనాభా గల నగరం.
క్రీ.శ.5వ శతాబ్దిలో ఇండోచైనాలో చంపా, కాంబోజ అనే ప్రాంతాల్లో హిందూ రాజ్యాలు నెలకొన్నాయి. 5వ శతాబ్ది నాటి వ్యు శాసనం నుంచి అంతకు రెండు మూడువందల యేళ్ళకు పూర్వమే హిందూ మతం వ్యాపించిందన్న విషయం తెలుస్తోంది. సంస్కృత, ప్రాకృత భాషల్లోని అనేకమైన పదాలు కూడా ఇక్కడి భాషల్లోకి వచ్చి చేరాయి.[1].
చరిత్ర
పురాతన చరిత్ర
పురాతత్వ పరిశోధకులు నిర్వహించిన త్రవ్వకాలలో లభించిన పాలియోలిథిక్ కాలం నాటి మానవ అవశేషాలు ప్రస్తుత వియత్నాం ప్రాంతంలో పాలియోలిథిక్ కాలం నుండి మానవులు నివసించారని భావిస్తున్నారు. ఉత్తర వియత్నాంలో ఉన్న " లాంగ్ సొన్ ప్రొవింస్ " మరియు " న్ఘే ఏన్ ప్రొవింస్ " గుహలలో లభించిన " హోమో ఎరెడస్ " శిలాజాలు క్రీ.పూ 5,00,000 సంవత్సరాల నాటివని భావిస్తున్నారు.[2] వియత్నాంలోని " మిడిల్ ప్లెయిస్టోసిన్ ప్రొవింస్ "లో లభించిన హోమోసాపైన్ శిలాజాలు మరియు తాం ఓం మరియు హాంగ్ హం ప్రాంతాలలో లభించిన దంతాల భాగాలు ఈశాన్య ఆసియాలో లభించిన అతిపురాతన శిలాజాలుగా భావిస్తున్నారు.[3] లాటే ప్లెస్యిస్టోసెనె కాలం నాటి హోమోసాపైంస్ దంతాలు డాంగ్ కేన్, కౌంగ్ (1986), వద్ద లభించాయి.[4] ఆరంభకాల హొలోసెనె శిలాజాలు మై డా డియూ, లాంగ్ గావో, కొలానీ (1927) మరియు లాంగ్ కుయోం వద్ద లభించాయి.[4][5]
క్రీ.పూ. 1000లో మా నది మరియు రెడ్ నది ప్రాంతాలలో వరిపంట అభివృద్ధి మరియు ఇత్తడి పోత పోయడం ఆరంభం అయింది. నదీమైదానాలు డాంగ్ సన్ సంస్కృతి విలసిల్లడానికి సహకారం అందించింది. ఈ సమయంలో రూపొందిచిన డాంగ్ సంగ్ డ్రంస్ గుర్తింపు పొందాయి. ఈ సమయంలో ఆరంభకాల వియత్నాం రాజ్యాలైన " వ్యాన్ లాంగ్ " మరియు ఔ లాక్ రాజ్యాలు స్థాపించబడ్డాయి. ఈ సంస్కృతి ప్రభావం " మారీటైం సౌత్ ఈస్ట్ ఆసియా " మొదలైన ఈశాన్య ఆసియాలోని ఇతర ప్రాంతాలలో క్రీ.పూ మొదటి సహస్రాబ్ధం అంతా విస్తరించింది.[6][7][8]
అనువంశిక వియత్నాం
" హాంగ్ బాంగ్ " రాజవంశానికి చెందిన హంగ్ రాజులు మొదటి వియత్నాం రాజులని భావిస్తున్నారు. వీరు వియత్నామీయులు వాన్ లాగ్ అని అనేవారు. క్రీ.పూ 257లో చివరి హంగ్ రాజును థుక్ ఫాన్ ఓడించాడు. థుక్ ఫాన్ లాక్ వియట్ మరియు ఔ వియట్ గిరిజన జాతులను సమైక్యం చేసి ఔ లాక్ రూపొందించి తనకుతానుగా " యాన్ డురాంగ్ వురాంగ్ "గా ప్రకటించుకున్నాడు. క్రీ.పూ. 207 లో చైనీస్ జనరల్ " ఝావో టూవో " యాన్ డూరాంగ్ వురాంగ్ ఓడించి ఔ లాక్ ఇంటో నాన్యూలతో సమైక్యం చేసాడు.అయినప్పటికీ నాన్యూ దక్షిణంగా విస్తరించి " హాన్ - నాన్యూ యుద్ధం " తరువాత క్రీ.పూ 111 నాటికి చైనా హాన్ సామ్రాజ్యంతో విలీనం చేయబడింది.
తరువాత వెయ్యి సంవత్సరాలు ప్రస్తుత ఉత్తర వియత్నాం చైనీయుల ఆధిక్యతలో కొనసాగింది.[9] స్వతంత్రసమరం ఆరంభకాలంలో ట్రంగ్ సిస్టర్లు మరియు లేడీ ట్రియూ స్వల్పకాల విజయం సాధించారు. అయినప్పటికీ క్రీ.శ 544 మరియు 602 మద్య కాలంలో యాంటిరియర్ లీ రాజవంశానికి చెందిన వ్యాన్ క్సుయాన్ కాలంలో ఈ ప్రాంతానికి దీర్ఘకాల స్వాతంత్ర్యం లభించింది.[10] 10శతాబ్దం నాటికి వియత్నాం ఖుక్ కుటుంబం ఆధ్వర్యంలో స్వయంప్రపత్తి సాధించింది. క్రీ.పూ. 738 లో వియత్నామీయుల ప్రభువు " నాగో క్యుయెన్ " బాక్ డాంగ్ (938) యుద్ధంలో చైనీయుల సదరన్ హాన్ రాజ్య సైన్యాలను ఓడించి వెయ్యి సంవత్సరాల చైనీయుల ఆధిపత్యం నుండి వియత్నాంకు పూర్తి స్వాతంత్ర్యం సాధించాడు.[11] తరువాత ఈ ప్రాంతానికి " డై వియట్ " (గ్రేట్ వియట్) తిరిగి నామకరణం చేసాడు. తరువాత వియత్నాంలో లీ మరియు ట్రాన్ రాజవంశం ఆధ్వర్యంలో స్వర్ణయుగం ఆరంభం అయింది. ట్రాన్ రాజవంశం పాలనలో డై వియట్ మూడు మంగోలియన్ దాడులను తిప్పికొట్టింది.[12] ఈ సమయంలో వియత్నాంలో బౌద్ధమతం ప్రవేశించి విలసిల్లి మెల్లగా దేశీయమతంగా మారింది.1406-1407 మద్య కాలంలో మింగ్- హో యుద్ధంలో మింగ్ రాజవంశం హో రాజవంశాన్ని తొలగించి నాలుగవమారు వియత్నాం మీద తిరిగి ఆధిక్యత సాధించింది. తరువాత లీ లోయి (లీ రాజవంశ స్థాపకుడు) వియత్నాం స్వాత్రంత్రం తిరిగి సాధించాడు. వియత్నాం రాజవంశాలు 15వ శతాబ్దంలో (ప్రత్యేకంగా లీ తాన్ తాంగ్ 1460-1497) అత్యున్నత స్థాయికి చేరుకుంది. 11-18 శతాబ్ధాల మద్య వియత్నాం దక్షిణదిశగా విస్తరించింది.[13] చివరకు కేమర్ సాంరాజ్యపాలనలో చంపా రాజ్యం మీద విజయం సాధించారు. [14][15]
అంతఃకలహాలు
16 వ శతాబ్దంలో అంతర్యుద్ధాలు మరియు రాజకీయ సంఘర్షణలు వియత్నాం క్షీణతకు దారితీసాయి. మొదటిగా లీ రాజవంశపాలనను చైనీయుల మద్దతుతో " మాక్ రాజవంశం సవాలు చేసింది. మాక్ రాజవంశం ఓటమి తరువాత లీ రాజవంశపాలన నామమాత్రంగా పునఃస్థాపించబడింది. అయినప్పటికీ అసలైన అధికారం మాత్రం ఉత్తర ప్రాంతంలోని ట్రిన్ లార్డులు మరియు దక్షిణప్రాంతం లోని మద్య విభజించబడింది. తరువాత 1670లో సంధిజరిగే వరకు ఆయన నాలుగు దశాబ్ధాల కాలం అనర్యుద్ధానికి ప్రోత్సాహం ఇచ్చాడు. తరువాత ఈసమయంలోనే న్గూయెన్ దక్షిణ వియత్నాంలో మెకాంగ్ నదీమైదానం వరకు విస్తరించి సెంట్రల్ హైలాండ్ మరియు ఖెమర్ భూములతో విలీనం చేసాడు. టే సొన్ సోదరులు రాజ్యస్థాపన చేసేవరకు ఈ విభాగం ఒక శతాబ్ధకాలం అలాగే కొనసాగింది. అయినప్పటికీ వారి పాలన స్వల్పకాలంలోనే ముగిసింది. ట్రై సొన్ సోదరులను గియా లాంగ్ నాయకత్వంలో ఫ్రెంచ్ సహాయంతో న్గూయెన్ ప్రభువులు ఓడించారు.[16] న్గూయెన్ అన్న్ వియత్నాంను సమైక్యపరిచి న్గూయెన్ రాజవంశాన్ని స్థాపించి గియా లాంగ్ పేరిట పరిపాలన కొనసాగించాడు.
1862–1945: ఫ్రెంచ్ ఇండోచైనా
వియత్నాం స్వతంత్రాన్ని క్రమంగా ఫ్రెంచ్ వారు తుడిచిపెట్టారు. ఫ్రెంచ్ వారు కాథలిక్ సైనికులతో 1859 మరియు 1862 మద్య వియత్నాం మీద వరుస దాడులు చేసారు. దక్షిణ భూభాగం ఫ్రెంచి కాలనీగా (ఫ్రెంచి కూచిన్ చీనా) మారింది. 1884 నాటికి మొత్తం భూభాగం ఫ్రెంచి పాలనలోకి మారింది. మద్య మరియు ఉత్తర భూభాగాలు అన్నం మరియు ట్రోకిన్ రక్షణలోకి మారింది. మూడు వియత్నామీ భూభాగాలు 1887లో ఫ్రెంచి ఇండోచైనా పేరుతో సమైక్యపరచబడ్డాయి. ఫ్రెంచి నిర్వాహకులు వియత్నాంలో గణనీయంగా రాజకీయ మరియు సాంస్కృతిక మార్పులను ప్రవేశపెట్టారు. పాశ్చాత్య శైలిలో ఆధునికతరహా విద్య అభివృద్ధి చేయబడుతుంది. అలాగే రోమన్ కాథలిజం దేశం అంతటా వ్యాపించింది. ఇండోచైనాలో స్థిరపడిన ఫ్రెంచి ప్రజలు కూచించీనా ప్రాంతంలో (ప్రత్యేకంగా సైగాన్ ప్రాంతంలో) కేంద్రీకృతం అయ్యారు.[17] రాచరిక వ్యవస్థకు అనుకూలంగా ఫ్రెంచ్ పాలనకు వ్యతిరేకంగా " కేన్ వురాంగ్ ఉద్యమం " మొదలైంది. దశాబ్ధాల కాలం కొనసాగిన ఉద్యమం 1890లో ఓటమికి గురైంది. కేన్ వురాంగ్ ఉద్యమానికి చెందిన గొరిల్లాలు ఈ సమయంలో వియత్నాం క్రైస్తవులలో మూడవవంతు మందిని హత్యచేసారు.[18]
వ్యవసాయ సంబంధిత ఆర్థికవిధానంలో భాగంగా పొగాకు, ఇండిగో, తేయాకు మరియు కాఫీ పంటలు ప్రోత్సహించబడ్డాయి. వియత్నామీయుల స్వీయప్రభుత్వం మరియు పౌరహక్కుల పిలుపును ఫ్రెంచి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. తరువాత ఫాన్ బొయి చౌ, ఫాన్ చౌ ట్రింహ్, ఫాన్ దిన్ ఫంగ్, హాం న్ఘి మరియు హో చీ మిన్ మొదలైన ప్రభువుల నాయత్వంలో జాతీయ రాజకీయ ఉద్యమం మొదలైంది. అయినప్పటికీ 1930లో వియట్ నాం కుయాట్ డాన్ డాంగ్‌కు చెందిన యెన్ బాయి ఉద్యమం సులభంగా అణిచివేయబడింది.[19] రెండవ ప్రపంచ యుద్ధం వరకు ఫ్రెంచిప్రభుత్వం పూర్తి నియంత్రణను నిలబెట్టుకుంది. పసిఫిక్ యుద్ధం ఇండోచైనా మీద జపానీయుల దాడికి (1940) దారితీసింది. తరువాత జపాన్ సంరాజ్యం తమ సైనిక బృందాలను వియాత్నాంలో మకాం చేయడానికి అనుమతించింది. " వించీ ఫ్రాన్స్ " ఫ్రెంచి కాలనీ అడ్మినిస్ట్రేషన్‌కు వియత్నాం అనుమతి కొనసాగింది. జపాన్ తమ సైనిక బృందాలకు అవసరమైన సహజసంపదను విపరీతంగా వాడుకున్నది. ఇది ఫ్రెంచి ఇండోచైనా మీద నియంత్రణ కొరకు ఉద్యమించడానికి (1945) దారితీసింది. 1945లో వియత్నాంలో సంభవించిన కరువు ఒక మిలియన్ ప్రజల మరణానికి కారణం అయింది.[20]
1946–54: మొదటి ఇండోచైనా యుద్ధం
1941లో మార్కిస్ట్- లెనినిస్ట్ రివల్యూషనరీ నాయకత్వంలో వియట్ మిన్ (కమ్యూనిస్ట్ మరియు నేషనలిస్ట్ లిబరేషన్ మూవ్మెంట్ ) ప్రారంభం అయింది. వియత్నాంలో జపాన్ ఆక్రమణ తొలగించడానికి మరియు ఫ్రెంచి ఆధిక్యత నుండి వియత్నాంకు విముక్తి కలిగించడానికి ఈ ఉద్యమం మొదలైంది. 1945లో జపాన్ సైన్యం ఓటమి మరియు వితత్నాంలో జపాన్ పప్పెట్ సామ్రాజ్యం పతనం తరువాత వియట్ మిన్ హనోయీని ఆక్రమించుకుని ప్రొవిషనల్ ప్రభుత్వాన్ని ప్రకటించింది. ఇది సెప్టెంబరు 2 న జాతీయ స్వాతంత్ర్యాన్ని నొక్కిచెప్పింది. అదే సంవత్సరం ఫ్రెంచి రిపబ్లిక్ ప్రొవిషనల్ ప్రభుత్వం వియత్నాంలో ఫ్రెంచి కాలనీ పాలన పునఃస్థాపన చేయడానికి ఫ్రెంచి ఫార్ ఈస్ట్ ఎక్స్పెడిషనరీ కార్ప్స్‌ను పంపింది. 1946 వియట్ మిన్ ఫ్రెంచి సైన్యం మీద గొరిల్లా దాడి చేసింది.[21] ఫలితంగా మొదలైన ఇండోచైనా యుద్ధం 1954 వరకు కొనసాగింది.[22] 1954లో సంభవించిన " డీయిన్ బీయిన్ ఫూ యుద్ధం "లో ఫ్రెంచి మరియు వియత్నామీస్ నేషనల్ ఆర్మీ ఓటమి పొందిన తరువాత హోచిన్ మిన్ రాజీపడి యుద్ధవిరమణకు అంగీకారం తెలిపాడు.జెనీవా సమావేశం తరువాత ఫ్రెంచి కాలనీ ప్రభుత్వపాలన ముగింపుకు వచ్చింది. తరువాత 1954లో ఇండోచైనా ప్రభుత్వం రద్దుచేయబడింది. తరువాత లాయలిస్ట్ సైన్యాలు కమ్యూనిస్టులతో విడిపోయారు.
[a] విభజన తరువాత రెండు దేశాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఉత్తర వియత్నాంలో " హోచీ మిన్ డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాం " మరియు దక్షిణ వియత్నాంలో చక్రవర్తి బావో డై ఆధ్వర్యంలో " స్టేట్ ఆఫ్ వియత్నాం " ఏర్పాటు చేయబడ్డాయి. ఆపరేషన్ పాసేజ్ టు ఫ్రీడం (300 డే పీరియడ్ ఆఫ్ ఫ్రీ మూవ్మెంటు ) సమయంలో ఒక మిలియన్ మంది ప్రజలు (ప్రధానంగా కాథలిక్కులు ) కమ్యూనిస్టుల ఊచకోతకు భయపడి ఉత్తర వియత్నాం నుండి దక్షిణ వియత్నాంకు పారిపోయారు.
[26] జెనీవా సమావేశంలో వియత్నాం విభజన శాశ్వతంగా ఉండాలని నిర్ధేశించబడలేదు. 1956 ఎన్నికల తరువాత అది తిరిగి సమైక్యం కావాలని సూచించింది.[27] అయినప్పటికీ 1955లో స్టేట్ ఆఫ్ వియత్నాం ప్రధానమంత్రి " న్గో డిన్ డీయం " తన సోదరుడి చేత మోసపూరిత ప్రజాభిప్రాయ సేకరణ చేసి తనకుతాను " రిపబ్లిక్ ఆఫ్ వియత్నాం " అధ్యక్షునిగా ప్రకటించుకున్నాడు.[28]
1954–1975: వియత్నాం యుద్ధం
1950లో ప్రో - హనోయి వియట్ కాంగ్ డీయం ప్రభుత్వాన్ని పడగొట్టడానికి గొరిల్లా యుద్ధం ఆరంభించింది.[29] 1953 మరియు 1956 మద్య కాలంలో వియత్నాం ప్రభుత్వం అద్దెమినహాయింపు మరియు వియత్నాం భూసంస్కరణలు అగ్రేరియన్ సంస్కరణలు ప్రారంభించాడు. ఇవి రాజకీయ వత్తిడిని అధికం చేసింది. భూసంస్కరణల సమయంలో ఉత్తర వియత్నాంలో 160 మందిలో ఒకరు మరణశిక్షకు గురైయ్యారు. దేశం మొత్తంలో 1,00,000 మరణశిక్షలు అమలయ్యాయి. ప్రధానంగా రెడ్ నదీమైదానంలో మరణశిక్షలు అధికంగా విధించబడ్డాయి. ఈ ప్రాంతంలో దాదాపు 50,000 మరణశిక్షలు విధించబడ్డాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. [30][31][32][33] అయినప్పటికీ వియాత్నాం మరియు హంగేరియన్ ఆర్చివ్స్‌లో ఉన్న వర్గీకరించని దస్తావేజులు (డాక్యుమెంట్లు) మాత్రం నివేదికలో వెల్లడించిన దానికంటే తాక్కువ సంఖ్యలో మరణశిక్షలు విధించబడ్డాయని అవి 13,500 కంటే అధికంగా ఉన్నాయని వివరిస్తున్నాయి.[34] 1960 మరియు 1962 మద్య సోవియట్ యూనియన్ మరియు వియత్నాంలు అదనపు సోవియట్ సహకారం కొరకు ఒప్పందం మీద సంతకాలు చేసాయి. దక్షిణ వియత్నాంలో ఉత్తర వియత్నాం దక్షిణవియత్నాంను కూలద్రోయడానికి (1956లో 450 మంది దక్షిణ వియత్నాం అధికారులను కాల్చివేయడం వంటి చర్యలు చోటుచేసుకున్నాయి) ప్రయత్నాలు మొదలు పెట్టింది. అందుకు ప్రతిచర్యగా దక్షిణ కొరియా కమ్యూనిష్టులుగా అనుమానించబడిన లక్షలాది మందిని అదుపులోకి తీసుకుని " పొలిటికల్ రీ ఎడ్యుకేషన్ సెంటర్లు " లోచేర్చింది. ఈ చర్యలలో కమ్యూనిస్టులు కానివారిని కూడా ఖైదు చేయబడినప్పటికీ దేశంలో కమ్యూనిస్టు చర్యలు మాత్రం హరించబడ్డాయి. ఉత్తర వియత్నాం ప్రభుత్వం ఈ చర్యలలో 2,418 మంది చంపబడ్డారని (1957 నవంబరు నాటికి) విమర్శించింది.[35] 1960 మరియు 1962లో సోవియట్ యూనియన్ మరియు నార్త్ వియత్నాం అదనపు సోవియట్ సైనిక మద్దతు కొరకు ఒప్పందం మీద సంతకం చేసాయి.1963లో డీయింస్ పాలనతో అసంతృప్తి చెందిన బౌద్ధులు సాగించిన అల్లర్లు ప్రభుత్వం హింసాత్మకచర్యలకు పూనుకొనడానికి దారితీసింది. [36] ఈ చర్యల కారణంగా దక్షిణ వియత్నాం నాయకుడు డీయిం యునైటెడ్ స్టేట్స్ మద్య సంబంధాలు చెరిగిపోయాయి. చివరికి 1963 దక్షిణ వియత్నాం తిరుగుబాటులో డీయిం మరియు న్హూ హత్య చేయబడ్డారు.[37] డీయిం ప్రభుత్వం తరువాత ఒక డజన్ కంటే అధికమైన సైనిక ప్రభుత్వాల పాలన కొనసాగింది. తరువాత ఎయిర్ మార్షల్ " గూయెన్ కాయోకీ మరియు జనరల్ న్గూయెన్ వ్యాన్ థియూ కూటమి 1965లో దక్షిణ వియత్నాం అధికారం చేజిక్కించుకుంది. థియూ క్రమంగాకీ మీద ఆధిపత్యం సాధించాడు. తరువాత తన అధికారం బలపరచుకోవడానికి 1967 మరియు 1971లో మోసపూరితమైన ఎన్నికలు నిర్వహించాడు.[38] రాజకీయ అస్థిరత కమ్యూనిస్టులకు అనుకూలంగా మారింది. దక్షిణ వియత్నాం కమ్యూనిస్టుల తిరుగుబాటును ఎదుర్కోడానికి మద్దతుగా యునైటెడ్ స్టేట్స్ సైనికసహాయం అధికం చేసింది. 1965లో యునైటెడ్ స్టేట్స్ గ్రౌండ్ దాడులలో పాల్గొన్నది. చివరిగా వారి సంఖ్య 5,00,000 లకు చేరుకున్నది.[39][40] యు.ఎస్. వాయుమార్గ బాంబింగ్ చర్యలో భాగస్వామ్యం వహించింది. మరొక వైపు చైనా మరియు సోవియట్ యూనియన్ ఉత్తర కొరియాకు గణనీయమైన యుద్ధసామాగ్రి మరియు 15,000 మంది యుద్ధవీరులను అందించింది.[41][42] కమ్యూనిస్టు సైనికులు వియట్ కాంగ్‌కు అవసరమైన సామాగ్రి అందజేసింది.[43] 1968లో కమ్యూనిస్టులు దక్షిణ వియత్నం లక్ష్యాలను గురిచేస్తూ దాడి సాగించారు. అయినప్పటికీ పోరాటం విఫలం అయింది. అమెరికన్ చర్యలను వ్యతిరేకిస్తూ అమెరికన్ ప్రజలు అభిప్రాయం వెలిబుచ్చడం అమెరికా ప్రభుత్వాన్ని షాక్‌కు గురిచేసింది. [44][45] ఈ సమయంలో కమ్యూనిస్ట్ బృందాలు హ్యూ ప్రాంతంలో 3,000 మందిని మూకుమ్మడిగా హతమార్చాయి.[46] యుద్ధానికి వ్యతిరేకంగా దేశంలో బలపడుతున్న అభిప్రాయాలు మరియు అంతర్జాతీయ విమర్శలు యు.ఎస్. " నిక్సన్ డాక్టరిన్ " విడుదలచేస్తూ భూమార్గ దాడుల నుండి వైదొలగింది. ఈ కార్యక్రమాలు దక్షిణ వియత్నాంలో రాజకీయ అస్థిరతను తొలగించడంలో విఫలం అయ్యాయి.[47]1973 జనవరి 27 న " పారిస్ పీస్ ఒప్పందం " తరువాత 1973 మార్చి 29నాటికి అమెరికన్ సైనిక బృందాలు పూర్తిగా దక్షిణ వియత్నాం నుండి వైదొలిగాయి. 1974 డిసెంబరులో ఉత్తర వియత్నాం ఫురోక్ లాంగ్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నది.[48] తరువాత స్వల్పకాలం దక్షిణ వియత్నాం " ప్రొవిషనల్ రివల్యూషనరీ గవర్నమెంటు " పాలనలో (ఉత్తర వియత్నాం సైన్యం దక్షిణ వియత్నాంను ఆక్రమించింది) ఉంది. 1976 జూలై 2న ఉత్తర వియత్నాం మరియు దక్షిణ వియత్నాంలు సమైక్యపరచబడి " సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాం "గా అవతరించింది. [49] యుద్ధం వియత్నాంను విధ్వంశం చేసి వదిలింది. మొత్తం మరణాలు 8,00,000 నుండి 31,00,000 ఉండవచ్చని భావించారు.[20][50][51]
1976–ప్రస్తుత సమైఖ్యత మరియు సంస్కరణలు
యుద్ధం తరువాత లీ డుయాన్ పాలనలో దక్షిణ వియత్నాంలో పాశ్చాత్యదేశాల నుండి వ్యతిరేకత ఎదుర్కోవాలన్న భయం కారణంగా యు.ఎస్.తో అనుబంధం ఉన్న వారి మూకుమ్మడి హత్యలు లేవు.[52] అయినప్పటికీ 3,00,000 మంది దక్షిణ వియత్నామీయులు రీయెజ్యుకేషన్ కేంపులకు తరలించబడ్డారు. అక్కడ వారు పలు హింసలు, పస్తులు, వ్యాధులు మరియు బలవంతపు చాకిరి మొదలైన అవస్థలు భరించారు. [53] ప్రభుత్వం సమైకృత వ్యవసాయం మరియు పరిశ్రమలు ప్రారంభించింది.[54] ఇది ఆర్థిక పతనానికి కారణమై మూడంకెల ద్రవ్యోల్భణం సంభవించింది. క్రమంగా దేశపునర్నిర్మాణ కార్యక్రమాలు అభివృద్ధి చేయబడ్డాయి. 1978 వియత్నాం మిలటరీ వియత్నాం సరిహద్దు గ్రామాలపై దాడి చేస్తున్న ఖేమర్ రూజ్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కంబోడియా మీద దాడి చేసింది.[55] కంబోడియాలో నూతన ప్రభుత్వాన్ని స్థాపించడంలో (నూతన ప్రభుత్వం 1989 వరకు కంబోడియాలో పాలనచేసింది) వియత్నాం విజయం సాధించింది.[56] ఈ చర్య వియత్నాం, చైనాల సంబంధాలను బలహీనపరిచాయి. ఫలితంగా 1979లో " సినో- వియత్నాం" యుద్ధం సంభవించింది.[57] ఈ యుద్ధం కారణంగా వియత్నాం ఆర్థిక, సైనిక సహాయం కొరకు సోవియట్ యూనియన్ మీద మరింతగా ఆధారపడవలసిన అవసరం ఏర్పడింది. 1986లో వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీ " సిక్స్ట్ నేషనల్ కాంగ్రెస్ " సమావేశంలో రాజకీయ సంస్క్రణవాదులు సరికొత్త నాయకత్వంలో " ఓల్డ్ గార్డ్ " ప్రభుత్వం ఏర్పాటుచేసారు.[58][59] సంస్కరణవాదులకు పార్టీ జనరల్ సెక్రెటరీ 71 సంవత్సరాల " న్గుయెన్ వ్యాన్ లిన్ " నాయకత్వం వహించాడు.[58][59] సంస్కరణవాదులు వరుసగా " ఫ్రీ మార్కెట్ " (స్వేచ్ఛావిఫణి) సంస్కరణలు చేపట్టారు. అది క్రమంగా ప్రణాళికా బద్ధమైన " సోషలిస్ట్ - ఓరియంటెడ్ మార్కెట్ ఎకనమీగా " మారింది. [60][61]
అయినా దేశాధిఖ్యత తిరుగులేకుండా " డోయీ మోయీ " ఆధ్వర్యంలో మిగిలిపోయింది. ప్రభుత్వం వ్యవసాయ భూములు మరియు పరిశ్రమలలో ప్రైవేట్ యాజమాన్యం! ఆర్థిక స్వాతంత్ర్యం మరియు విదేశీపెట్టుబడులకు అనుమతించింది. మరొకవైపు పరిశ్రమల మీద వ్యూహాత్మకమైన నియంత్రణను ప్రభుత్వం ఆధీనంలో ఉంచుకొన్నది. [61] వియత్నాం ఆర్థికరగం వ్యవసాయం, పారిశ్రామిక ఉత్పత్తి, నిర్మాణరంగం, ఎగుమతులు మరియు విదేశీపెట్టుబడులలో శక్తివంతమైన అభివృద్ధిని సాధించింది. అయినప్పటికీ ఈ సంస్కరణలు ఆర్థిక అసమానతలు మరియు లింగవివక్షకు దారితీసాయి.[62][63][64]
మూలాలు
- ↑ రామారావు, మారేమండ (1947). భారతీయ నాగరికతా విస్తరణము (1 ed.). సికిందరాబాద్, వరంగల్: వెంకట్రామా అండ్ కో. Retrieved 9 December 2014.
- ↑ "The Human Migration: Homo erectus and the Ice Age". Yahoo!. 27 May 2009. Retrieved 24 January 2013.
- ↑ Kha and Bao, 1967; Kha, 1975; Kha, 1976; Long et al., 1977; Cuong, 1985; Ciochon and Olsen, 1986; Olsen and Ciochon, 1990.
- ↑ 4.0 4.1 Cuong, 1986.
- ↑ Demeter, 2000.
- ↑ "Dong Son culture". LittleVietnamTours.com.vn. Retrieved 28 January 2013.
- ↑ Nola Cooke, Tana Li, James Anderson (2011). The Tongking Gulf Through History. p.46: "Nishimura actually suggested the Đông Sơn phase belonged in the late metal age, and some other Japanese scholars argued that, contrary to the conventional belief that the Han invasion ended Đông Sơn culture, Đông Sơn artifacts, ..."
- ↑ Vietnam Fine Arts Museum (2000). "... the bronze cylindrical jars, drums, Weapons and tools which were sophistically carved and belonged to the World famous Đông Sơn culture dating from thousands of years; the Sculptures in the round, the ornamental architectural Sculptures ..."
- ↑ "Chinese Colonization (200BC – 938AD)". Asia.msu.edu. Archived from the original on 25 August 2007. Retrieved 28 April 2010.
- ↑ "Country's Official Name". Easy Riders Vietnam. Retrieved 18 July 2013.
- ↑ "Spears offer insight into early military strategy". Viet Nam News. 22 January 2006. Archived from the original on 4 March 2009.
- ↑ "The Trần Dynasty and the Defeat of the Mongols". Countrystudies.us. Retrieved 28 April 2010.
- ↑ "The Lê Dynasty and Southward Expansion". Countrystudies.us. Retrieved 28 April 2010.
- ↑ "The Kingdom of Champa". Ancientworlds.net. Retrieved 28 April 2010.
- ↑ "The Chams: Survivors of a Lost Civilisation". Cpamedia.com. Archived from the original on 10 January 2010. Retrieved 28 April 2010.
- ↑ Colonialism by Melvin Eugene Page and Penny M. Sonnenburg via Google Books. p.723. Retrieved 24 October 2012.
- ↑ "French Counterrevolutionary Struggles: Indochina and Algeria" (PDF). United States Military Academy. 1968. Retrieved 6 July 2013.
- ↑ Fourniau, Annam–Tonkin, pp. 39–77
- ↑ "1930: 13 Viet Nam Quoc Dan Dang cadres, for the Yen Bai mutiny". ExecutedToday.com. 17 June 2013. Retrieved 6 July 2013.
- ↑ 20.0 20.1 Hirschman, Charles; Preston, Samuel; Vu Manh Loi (1995). "Vietnamese Casualties During the American War: A New Estimate" (PDF). Population and Development Review. 21 (4): 783–812. doi:10.2307/2137774. JSTOR 2137774. Archived from the original (PDF) on 20 June 2010.
- ↑ "Vietnam Notebook: First Indochina War, Early Years (1946–1950)". Parallel Narratives. Retrieved 25 July 2013.
- ↑ Declaration of Independence, Democratic Republic of Vietnam (2 September 1945). Vietnam Documents. Retrieved 15 October 2012.
- ↑ The Pentagon Papers (1971). Beacon Press. Vol. 3. p. 134.
- ↑ The Pentagon Papers (1971). Beacon Press. Vol. 3. p. 119.
- ↑ 25.0 25.1 The Pentagon Papers (1971). Beacon Press. Vol. 3. p. 140.
- ↑ "Vietnam's 300 Days of Open Borders: Operation Passage to Freedom". Library of Economics and Liberty. 3 July 2012. Retrieved 12 July 2013.
- ↑ Moïse, Edwin (4 November 1998). "The Geneva Accords". Clemson University. Retrieved 12 July 2013.
- ↑ Moïse, Edwin (4 November 1998). "The Aftermath of Geneva, 1954–1961". Clemson University. Retrieved 12 July 2013.
- ↑ The United States in Vietnam – An Analysis in Depth of America's Involvement in Vietnam. George McTurnin Kahin and John W. Lewis (1967). Delta Books.
- ↑ Turner, Robert F. (1975). Vietnamese Communism: Its Origins and Development. Hoover Institution Publications. p. 143. ISBN 978-0817964313.
- ↑ cf. Gittinger, J. Price, "Communist Land Policy in Viet Nam", Far Eastern Survey, Vol. 29, No. 8, 1957, p. 118.
- ↑ Courtois, Stephane; et al. (1997). The Black Book of Communism. Harvard University Press. p. 569. ISBN 978-0-674-07608-2.
{{cite book}}
: Explicit use of et al. in:|first=
(help) - ↑ Dommen, Arthur J. (2001), The Indochinese Experience of the French and the Americans, Indiana University Press, p. 340, gives a lower estimate of 32,000 executions.
- ↑ "Newly released documents on the land reform". Vietnam Studies Group. Retrieved 2016-07-15.
Vu Tuong: There is no reason to expect, and no evidence that I have seen to demonstrate, that the actual executions were less than planned; in fact the executions perhaps exceeded the plan if we consider two following factors. First, this decree was issued in 1953 for the rent and interest reduction campaign that preceded the far more radical land redistribution and party rectification campaigns (or waves) that followed during 1954-1956. Second, the decree was meant to apply to free areas (under the control of the Viet Minh government), not to the areas under French control that would be liberated in 1954-1955 and that would experience a far more violent struggle. Thus the number of 13,500 executed people seems to be a low-end estimate of the real number. This is corroborated by Edwin Moise in his recent paper "Land Reform in North Vietnam, 1953-1956" presented at the 18th Annual Conference on SE Asian Studies, Center for SE Asian Studies, University of California, Berkeley (February 2001). In this paper Moise (7-9) modified his earlier estimate in his 1983 book (which was 5,000) and accepted an estimate close to 15,000 executions. Moise made the case based on Hungarian reports provided by Balazs, but the document I cited above offers more direct evidence for his revised estimate. This document also suggests that the total number should be adjusted up some more, taking into consideration the later radical phase of the campaign, the unauthorized killings at the local level, and the suicides following arrest and torture (the central government bore less direct responsibility for these cases, however).
cf. Szalontai, Balazs (November 2005). "Political and Economic Crisis in North Vietnam, 1955–56". Cold War History. 5 (4): 395–426. cf. Vu, Tuong (2010). Paths to Development in Asia: South Korea, Vietnam, China, and Indonesia. Cambridge University Press. p. 103. ISBN 9781139489010. - ↑ Turner, Robert F. (1975). Vietnamese Communism: Its Origins and Development. Hoover Institution Publications. pp. 174–178. ISBN 978-0817964313.
- ↑ Spencer C. Tucker, ed. (2011). The Encyclopedia of the Vietnam War: A Political, Social, and Military History. ABC-CLIO via Google Books. ISBN 9781851099610. Retrieved 14 July 2013.
- ↑ "JFK and the Diem Coup". National Security Archive. 5 November 2003. Retrieved 12 July 2013.
- ↑ "This Day in History (Sep 3, 1967): Thieu-Ky ticket wins national election". History.com. Retrieved 26 November 2012.
- ↑ "Vietnam War". Seasite.niu.edu. Retrieved 28 April 2010.
- ↑ "The War's Costs". DigitalHistory.uh.edu. 2006. Retrieved 25 February 2014.
- ↑ "Soviet Aid to North Vietnam". GlobalSecurity.org. Retrieved 12 March 2013.
- ↑ "Chinese Support for North Vietnam during the Vietnam War: The Decisive Edge". Military History Online. 2008. Retrieved 17 April 2013.
- ↑ "Riding Vietnam's Ho Chi Minh Trail". The Guardian. 28 July 2011. Retrieved 12 July 2013.
- ↑ "Tet Offensive". Vets With A Mission. Retrieved 10 October 2012. "...NLF/NVA troops and commandos attacked virtually every major town and city in South Vietnam as well as most of the important American bases and airfields...In Saigon, nineteen VC commandos blew their way through the outer walls of the US Embassy..."
- ↑ "The Massacre at Hue". TIME. 31 October 1969. Retrieved 12 July 2013.
- ↑ Turner, Robert F. (1975). Vietnamese Communism: Its Origins and Development. Hoover Institution Publications. p. 251. ISBN 978-0817964313.
- ↑ "Vietnamization". The Free Dictionary. Retrieved 12 July 2013.
- ↑ "Saigon's Finale". New York Times. 13 October 1999. Retrieved 14 July 2013.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;Robbers 1021
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Shenon, Philip (23 April 1995). "20 Years After Victory, Vietnamese Communists Ponder How to Celebrate". The New York Times. Retrieved 24 February 2011.
- ↑ Associated Press (3 April 1995). "Vietnam Says 1.1 Million Died Fighting For North."
- ↑ Elliot, Duong Van Mai (2010). "The End of the War". RAND in Southeast Asia: A History of the Vietnam War Era. RAND Corporation. pp. 499, 512–513. ISBN 9780833047540.
- ↑ Sagan, Ginetta; Denney, Stephen (October–November 1982). "Re-education in Unliberated Vietnam: Loneliness, Suffering and Death". The Indochina Newsletter. Retrieved 2016-09-01.
{{cite web}}
: CS1 maint: date format (link) - ↑ "Vietnam Outlines Collectivization Goal". The Spokesman-Review. Google News Archive. 28 June 1977. Retrieved 20 July 2013.
- ↑ Cambodia – The Fall of Democratic Kampuchea. U.S. Library of Congress. Retrieved 9 July 2013.
- ↑ "Photographer Showcases Legendary Khmer Temple Preah Vihear". National Geographic. 23 June 2009. Archived from the original on 4 August 2009. Retrieved 12 July 2010.
- ↑ Chinese Invasion of Vietnam – February 1979. GlobalSecurity.org. Updated 2011. Retrieved 6 October 2012.
- ↑ 58.0 58.1 Stowe, Judy (28 April 1998). "Obituary: Nguyen Van Linh". The Independent (London). p. 20.
- ↑ 59.0 59.1 Ackland, Len (20 March 1988). "Long after U.S. war, Vietnam is still a mess". St. Petersburg Times (Florida). Page 2-D.
- ↑ Murray, Geoffrey (1997). Vietnam: Dawn of a New Market. New York: St. Martin's Press. p. 24–25. ISBN 0-312-17392-X.
- ↑ 61.0 61.1 Hoang Thi Bich Loan (18 April 2007). "Consistently pursuing the socialist orientation in developing the market economy in Vietnam". Communist Review. TạpchíCộngsản.org.vn. Archived from the original on 10 May 2011.
- ↑ Palace of Supreme Harmony in Hue (Vietnam) Wagstaff, A.; Van Doorslaer, E.; Watanabe, N. (2003). "On decomposing the causes of health sector inequalities with an application to malnutrition inequalities in Vietnam". Journal of Econometrics. 112: 207. doi:10.1016/S0304-4076(02)00161-6.
- ↑ Goodkind, D. (1995). "Rising Gender Inequality in Vietnam Since Reunification". Pacific Affairs. 68 (3): 342–359. doi:10.2307/2761129. JSTOR 2761129.
- ↑ Gallup, John Luke (2002). "The wage labor market and inequality in Viet Nam in the 1990s". Ideas.repec.org. Retrieved 7 November 2010.
ఇతర లింకులు
- Vietnam profile from BBC News
- Vietnam entry at The World Factbook (CIA)
- Vietnam from UCB Libraries GovPubs
- ఓపెన్ డైరెక్టరీ ప్రాజెక్టులో వియత్నాం
- Vietnam at Encyclopædia Britannica
- Wikimedia Atlas of Vietnam
- Key Development Forecasts for Vietnam from International Futures
- Government
- Portal of the Government of Vietnam
- Communist Party of Vietnam – official website (in Vietnamese)
- National Assembly – the Vietnamese legislative body
- General Statistics Office
- Ministry of Foreign Affairs
- The best transport service of Vietnam
- Chief of State and Cabinet Members
- Media and censorship
- Robert N. Wilkey. "Vietnam's Antitrust Legislation and Subscription to E-ASEAN: An End to the Bamboo Firewall Over Internet Regulation?" The John Marshall Journal of Computer and Information Law. Vol. XX, No. 4. Summer 2002. Retrieved 16 February 2013.
ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref>
ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/>
ట్యాగు కనబడలేదు