భృగు మహర్షి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 19: పంక్తి 19:
మహా విశిష్టత కలిగిన మహర్షిగా ప్రఖ్యాతిపొందెను
మహా విశిష్టత కలిగిన మహర్షిగా ప్రఖ్యాతిపొందెను


భృగు వంశావలి :
== భృగు వంశావలి ==

బ్రహ్మ - మానస పుత్రుడు "భృగు మహర్షి"
బ్రహ్మ - మానస పుత్రుడు "భృగు మహర్షి"



10:28, 11 మే 2016 నాటి కూర్పు

భృగు మహర్షి

భృగు మహర్షి వైశాఖ మాస శుద్ధ ఏకాదశి రోజున "ఉత్తర" నక్షత్రంలో జన్మించెను

భార్గవ వంశ మూలపురుషుడు భృగువు

బ్రహ్మ మానస పుత్రులైనటువంటి ప్రజాపతులలో మరియు నవ బ్రహ్మలలో ప్రథముడు మరియు సప్త ఋషులలో ఒకరు "భృగు మహర్షి"

భృగువు బ్రహ్మ హృథయ స్థానం నుండి జన్మించెను భృగు మహర్షి ప్రజాపతులలో నవ బ్రహ్మలలో అగ్రజుడు కనుక ఆయన అత్యంత శక్తివంతుడే కాకుండ సకల దేవతలకు సకల ఋషులకు మానవులకు పూజ్యుడు వారుణ యాగమున అగ్ని తేజమున జన్మించెను కనుక "వారుణీ విద్య" కు అధిపతి

భృగు మహర్షి మహా తపశ్శక్తివంతుడు బ్రహ్మ సమానుడు తన తపఃశక్తిచే తన పాదమున ఒక నేత్రం మొలిచెను మహా విశిష్టత కలిగిన మహర్షిగా ప్రఖ్యాతిపొందెను

భృగు వంశావలి

బ్రహ్మ - మానస పుత్రుడు "భృగు మహర్షి"

భృగువు -ఖ్యాతిదేవి (దక్ష ప్రజాపతి పుత్రిక) వారలకు ముగ్గురు సంతానం కలిగిరి 1)దాత 2)విధాత 3)శ్రీ మహాలక్ష్మి

1) దాత - అయతి(మేరు పర్వతరాజు) వారల సంతానం - ప్రాణుండు ప్రాణుండు: బ్రహ్మ చర్య వ్రత దీక్ష తీస్కొనెను

3)శ్రీ మహాలక్ష్మీ - శ్రీ మహా విష్ణువు కి ఇచ్చి వివాహం చేసిరి

2)విధాత - నియతి(మేరు పర్వతరాజు) వారల సంతానం -

మృఖండ మహర్షి - మనస్విని (ముద్గల మహర్షి) వారల సంతానం

మార్కండేయుడు -దూమ్రావతి దేవి(అగ్ని) వారల సంతానం

శ్రీ మహా విష్ణువు అంశ భావణారాయణుడు(వేద శీర్షుడు) - భద్రావతి దేవి (సూర్య పుత్రిక) వారల సంతానం

101 మంది ఋషి శ్రేష్టులు (పద్మశాలీ అను బిరాదాంకితులు)

భృగు మహర్షి -పులోమ(కర్థమ ప్రజాపతి) వారల సంతానం

చ్యవణుడు -1)అర్శిని 2)సుకన్య వారల సంతానం

1)ఔర్వుడు -ప్రమద్వర వారల సంతానం

ఋచిక మహర్షి - సత్యవతి వారల సంతానం

జమదగ్ని మహర్షి - రేణుక దేవి వారల సంతానం

1)కమణ్వత 2)సుశేన 3)వసు 4)విశ్వావసు 5)పరశు రామ(విష్ణువు దశావతారములలో ఒకటి)

భృగు మహర్షి - ఉషనల (ఊర్జ మహా ఋషి) వారల సంతానం 1) జావంతి 2) సుజన్మద్ 3)శుచి 4)కామ 5)మూర్థ్న 6)తాజ్య 7)వసు 8)ప్రభవ 9)అత్యాయు 10)దక్ష్య 11)ఇతివర 12)శుక్రాచార్యుడు(దైత్య గురువు, నవ గ్రహములలో ఒకరు)

శుక్రాచార్యుడు -1)గోమతి 2)ఊర్జ సతి 3) జయంతి అను ముగ్గరు భార్యలు వారల సంతానం 1) చండ , అర్క 2)తార్ష్య, వరుచ 3) దేవయాని

వీరే కాకుండ శిష్య ప్రశిష్య గణములు మరెన్నో భృగు భార్గవ వంశముగా వెలుగొందుతున్నారు

భృగు రచనలు

భృగుమహర్షి ఒక గొప్ప హైందవ జ్యోతిష్య శాస్త్ర పితామహుడు మరియు ఇతని మొదటి జ్యోతిష్య శాస్త్ర గ్రంథం భృగుసంహిత దానికొక తర్కాణం. ఈ గ్రంథంలో సృష్టిలోని దాదాపు అన్ని రకాల జీవుల గురించి వ్రాయబడ్డాయి. అనగా దాదాపు 50 లక్షల ప్రాణుల జాతకాలు పొందుపర్చబడ్డాయి. ఒక పరిసశీలన ప్రకారం ఇప్పుడు కేవలం 01 శాతం జీవులు మత్రమే మిగిలి ఉన్నాయని అంటున్నారు. భృగుమహర్షి ఒక గొప్ప ధర్మశాస్త్రప్రవక్తగా కాత్యాయనుడు పేర్కొన్నాడు

భృగువు గొప్ప ధర్మశాస్త్ర ప్రవక్తయే కాకుండా "మొట్టమొదటి ధర్మశాస్త్ర పితామహుడు" కూడా మానవ జీవన ధర్మ సూత్రాలను తెలిపిన మొట్టమొదటి "మనుస్మృతి" భృగు ప్రోక్తమే ఇరవైరెండు స్మృతి ధర్మ సూత్రాలు ఉన్నప్పటికి అత్యంత విలువైనది ఆచరణీయమైనది ప్రథానమైనది నేటికీ ఆచరణీయమైనది "మనుస్మృతియే"

బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాది ధర్మములు వర్ణ ధర్మములి ఆశ్రమ ధర్మములు బ్రహ్మచర్య,, గృహస్థ ,, వానప్రస్థ ,,, సన్యాస ,, ధర్మములు వేద ధర్మ శాస్త్ర విదులను జీవన ధర్మ సూత్రాలను ఆచార వ్యవహారాలను నిత్య కర్మ అనుష్ఠాన విదానాలను తెలుపినటువంటి ధర్మశాస్త్రం "మనుస్మృతి" ఇది కృతాయుగానికి ప్రామాణికమైనప్పటికి అత్యంత విలువైన మనుస్మృతి నేటికి ఆచరణలో ఉన్నది

విదేశాల్లో సైతం రాజ్యాధికార ధర్మసూత్రంగా మనుస్మృతినే వినియేగించటం గర్వకారణం "THE LAW CODE OF MANU (CODE OF LAW)" అనేక వేల సంవత్సరాల చరిత్ర కలిగినది

త్రిమూర్తులను పరీక్షించుట

లోక కళ్యాణార్థమై సకల ఋషులు గంగానది తీరమున యజ్ఞము చేయదలచిరి అంతట అచటకి విచ్చేసిన నారదులవారు యజ్ఞ ఫలమున స్వీకరించుటకు ఎవరు అర్హులో త్రిమూర్తులలో ఎవరు గొప్పవారో వారికే యజ్ఞఫలము ఇవ్వవలసిందిగా సూచించెను

అంతట ఋషులలో అగ్రజుడు పూజ్యుడు అత్యంత శక్తివంతుడు అయిన భృగు మహర్షియే త్రిమూర్తులను పరీక్షించవలసినది కోరగా

భృగువు బ్రహ్మలోకం చేరెను అచట బ్రహ్మ సృష్టి కార్యంలో నిమగ్నమై భృగువుని చూడనందున ఆగ్రహించిన భృగువు "నీకు పూజలు గానీ దేవాలయములు గాని లేకుండు గాక" యని శపించెను

కైలాసమునకేగగా అచట ప్రమథగణములు శివనామస్మరణలో లీనమైయుండగా శివపార్వతులు ఆనంధతాండవం చేయుచుండిరి తనకు ఉచితాసనం కూడా చూపక అవమానించిరని కోపంతో "నీకు లింగాకారముగానే పూజించెదరు" అని శపించెను

వైకుంఠమునకు వెళ్ళగా అచట భృగు పుత్రిక అయిన లక్ష్మి స్వామివారి పాదసేవ చెడయుచుండగా స్వామివారు శయనించియుండెను కొంత సమయం వేచి చూసి నారాయణా అని పిలిచెను ఎంతకీ మేల్కొనని విష్ణువు పై ఆగ్రహావేశమున విష్ణువు వక్షస్థలంపై తన పాదంతో తన్ని లేపెను

అంతట నారాయణుడు ఉలిక్కిపడి లేచి ఋషిశ్రేష్ఠ మీ పాదం మా వక్షస్థలాన్ని తాకటం వలన మీ పాద స్పర్శతో ధన్యుడనైతిని అంటు వారికి ఆసనం ఏర్పరచి పాదసేవచేయుచు భృగువు అహంకారానికి కారమైన పాదమందలి నేత్రాన్ని చిదిమివేసెను

అంతట జ్ఞానోదయం అయిన భృగువు శాంతచిత్తుడు సాత్వికమూర్తి పరంధాముడు అయిన శ్రీమన్నారాయణుడే యజ్ఞఫలాన్ని పొందటానికి అర్హుడని నిర్ణయించెను

శ్రీమహాలక్ష్మి తన తండ్రి అయిన భృగువు తన స్థానమైన స్వామివారి వక్షస్థలంపై తన్నటం జీర్ణించుకోలేక భూలోకంనకు వెల్లిపోయెను భూలోకమున తిరిగి భృగువంశమున (పద్మశాలీ) వంశమున "పద్మావతీ" దేవిగా జన్మించేను స్వామివారు వేంకటేశ్వరుడాయెను లోక కళ్యాణమునకు కారకుడాయెను

భృగు ప్రస్తావన

శ్రీ మహా భారతం., శ్రీ మద్భాగవతం., శ్రీ విష్ణు., మత్స్య., పద్మ., బ్రహ్మా.,బ్రహ్మాండ పురాణాల్లో భృగు మహర్షి విశిష్టతలను కీర్తింపబడెను

భగవద్గీతలో శ్రీ కృష్ణ పరబ్రహ్మ భృగువు గురించి ఇలా పలికెను

శ్లో: మహర్షీణాం భృగురహం గిరామస్మ్యక మక్షరం! యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయం!!

మహర్షులలో భృగుమహర్షిని నేనే అక్షరములలో ఓంకారమును నేనే యజ్ఞములలో జపయజ్ఞము నేనే స్థావరములలో హిమాలయమును నేనే యని పరమాత్మ పలికెను అనగా శ్రీ మహా విష్ణువే "భృగు మహర్షి" యని అవగతమవుతున్నది

భృగు మహర్షి. ఇతఁడు భాగీరథీ దక్షిణతీరమున మహాపద్మము అనియెడు పురమునందు 

భార్గవ అగ్రహారం నిర్మించెను

మూలాలు