భారత్ జోడో యాత్ర
వ్యవథి | ~145 days |
---|---|
తేదీ | సెప్టెంబరు 7, 2022 | - 2023 జనవరి 29
భారత్ జోడో యాత్ర భారత దేశ ప్రజలను ఏకం చేయడం, వారి సమస్యలను వినడం లక్ష్యంగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వంలో భారత్ జోడో యాత్ర చేపట్టాడు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేయాలనే లక్ష్యంతో 2022 సెప్టెంబరు 7న తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కె. స్టాలిన్ కన్యాకుమారిలో ఈ యాత్రను ప్రారంభించాడు.[1][2][3]
యాత్ర నేపథ్యం
[మార్చు]కాంగ్రెస్ పార్టీ 2022 ఆగస్టు 23న ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ''భారత్ జోడో యాత్ర'' లోగో, ట్యాగ్‌లైన్, వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఐదు నెలల్లో 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 3,570 కిలోమీటర్ల పొడవున ఉదయం 7 గంటల నుంచి 10.30 గంటల వరకు, మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు రెండు విడతలుగా ప్రతిరోజూ 22-23 కి.మీ పాదయాత్ర సాగుతోంది.[4] కాంగ్రెస్ 'భారత్ జోడో యాత్ర', 1983లో భారత మాజీ ప్రధాని చంద్రశేఖర్ దాదాపు 4,260 కి.మీల భారత్ యాత్ర మధ్య అనేక సమాంతరాలు ఉన్నాయి.[5][6][7]
యాత్ర షెడ్యూల్
[మార్చు]రాష్ట్రం/ కేంద్రపాలిత | ప్రారంభ తేదీ | రోజులు | కీలక ప్రాంతాలు |
---|---|---|---|
తమిళనాడు | 7 & 29 సెప్టెంబరు | 4 | కన్యాకుమారి |
కేరళ | 10 సెప్టెంబరు | 18 | తిరువనంతపురం, కొచ్చి, నిలంబూర్ |
కర్ణాటక | 30 సెప్టెంబరు | 21 | మైసూర్, బళ్లారి, రాయచూర్ |
ఆంధ్రప్రదేశ్ | 20 అక్టోబరు | 2 | ఆలూర్ |
తెలంగాణ | 23 అక్టోబరు | 12 | వికారాబాద్ |
మహారాష్ట్ర[8] | 7 నవంబరు | 14 | నాందేడ్, జల్గావ్, జామోద్ |
మధ్యప్రదేశ్ | 20 నవంబరు | 16 | ఇండోర్, ఉజ్జయిని |
రాజస్థాన్ | 6 డిసెంబరు | 18 | అల్వార్, కోట, దౌసా |
హర్యానా | 24 & 30 డిసెంబరు | 12 | అంబాలా |
ఉత్తర ప్రదేశ్ | 24 డిసెంబరు | 5 | బులంద్‌షహర్ |
ఢిల్లీ | 28 డిసెంబరు | 2 | రాజ్‌ఘాట్ |
పంజాబ్ | 10 జనవరి | 11 | పఠాన్‌కోట్ |
హిమాచల్ ప్రదేశ్ | 18 జనవరి | 1 | కాంగ్రా జిల్లా |
జమ్మూ & కాశ్మీర్ | 19 జనవరి | 11 | లఖన్‌పూర్, జమ్మూ, శ్రీనగర్ |
యాత్రలో పాల్గొనే ముఖ్య నాయకులు
[మార్చు]- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు
- పవన్ ఖేరా, ఏఐసీసీ మీడియా విభాగం చైర్మన్
- కన్హయ్య కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు
- ఊమెన్ చాందీ, కేరళ ముఖ్యమంత్రి (2004-2006, 2011-2016) [9]
- సచిన్ పైలట్, రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి [10]
- రేవంత్ రెడ్డి, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు [11]
- మణిశంకర్ అయ్యర్, మైలాడుతురై మాజీ ఎంపీ [12]
- ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజానాథ్, కేంద్రమాజీమంత్రి జేడీ శీలం
ఆంధ్రప్రదేశ్‌లో
[మార్చు]రాహుల్ గాంధీ 2022 అక్టోబరు 14న ఆంధ్రప్రదేశ్‌లోని, అనంతపురం జిల్లా, డి.హిరేహాల్ మండలం, కనుక్కుప్ప గ్రామంలో ఉదయం 10 గంటలకు అడుగు పెట్టాడు.[13] ఆయన మొదటిరోజు జాజురకల్లు, మడేనహళ్లి, లక్ష్మీపురం, డి హీరేహాల్ ప్రాంతాల్లో 14 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఓబుళాపురం మీదుగా కర్ణాటకలోకి వెళ్ళి, అక్టోబరు 18న తిరిగి ఆంధ్రప్రదేశ్‌లోకి చేరుకొని 18నుంచి 20 వరకు మూడురోజులపాటు పాదయాత్ర చేసి 21 తిరిగి కర్ణాటకలోకి వెళ్తాడు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం నాలుగు రోజులపాటు 95 కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర కొనసాగింది.[14]
తెలంగాణా
[మార్చు]కర్ణాటకలోని రాయచూర్ నుంచి రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా గూడబల్లూరు సమీపంలోని కృష్ణ చెక్‌పోస్టు వద్ద 2022 అక్టోబరు 23న ఉదయం 10 గంటలకు రాహుల్ గాంధీ తెలంగాణా రాష్ట్రంలో అడుగుపెట్టాడు.[15]
పాదయాత్ర రూట్ మ్యాప్
[మార్చు]- అక్టోబరు 23న కర్ణాటక-నారాయణపేట జిల్లా సరిహద్దునున్న కృష్ణా నది బ్రిడ్జి నుంచి మక్తల్ వరకు[16]
- 24, 25 దీపావళి నేపథ్యంలో యాత్రకు విరామం
- 26న మక్తల్, దేవరకద్ర
- 27న దేవరకద్ర, మహబూబ్‌నగర్ పట్టణం
- 28న మహబూబ్‌నగర్, జడ్చర్ల
- 29న జడ్చర్ల - షాద్‌నగర్
- 30న షాద్‌నగర్-శంషాబాద్ (29 కి.మీ.)
- 31న శంషాబాద్ నుంచి ఆరాంఘర్-చార్మినార్-గాంధీభవన్-నెక్లెస్ రోడ్లు-బోయినపల్లి
- నవంబరు 1న బాలానగర్- కూకట్పల్లి-పటాన్చెరు మీదుగా ముత్తంగి
- నవంబరు 2న పటాన్చెరు నుంచి శివంపేట (సంగారెడ్డి)
- నవంబరు 3 యాత్రకు విరామం
- నవంబరు 4న సంగారెడ్డి నుంచి జోగిపేట
- నవంబరు 5న జోగిపేట-శంకరంపేట
- నవంబరు 6న శంకరంపేట నుంచి మద్నూర్[17]
ఇవి చదవండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ ETV Bharat News (7 September 2022). "భారత్ జోడో యాత్ర షురూ.. రాహుల్ నేతృత్వంలో దేశమంతా." Archived from the original on 11 October 2022. Retrieved 11 October 2022.
- ↑ V6 Velugu (8 September 2022). "భారత్ జోడో యాత్ర షురూ". Archived from the original on 11 October 2022. Retrieved 11 October 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (29 January 2023). "5 నెలలు.. 4000 కి.మీ.. ముగిసిన రాహుల్ యాత్ర." Archived from the original on 29 January 2023. Retrieved 29 January 2023.
- ↑ "సెప్టెంబర్ 7న భారత్ జోడో యాత్ర షురూ." 24 August 2022. Archived from the original on 11 October 2022. Retrieved 11 October 2022.
- ↑ "The Parallels Between Congress's 'Bharat Jodo Yatra' and Ex-PM Chandra Shekhar's 'Padayatra'". The Wire. Retrieved 2022-10-15.
- ↑ "Rewind & Replay | That other 'Bharat Yatri': The long march, but short run, of Chandra Shekhar". The Indian Express (in ఇంగ్లీష్). 2022-09-09. Retrieved 2022-10-15.
- ↑ Nair, Sobhana K.; Phukan, Sandeep (2022-09-05). "Bharat Jodo Yatris to sleep, eat on the road for 5 months". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-10-15.
- ↑ Andhra Jyothy (8 November 2022). "గురుద్వారాలో రాహుల్ గాంధీ పూజలు... మహారాష్ట్రలో భారత్ జోడో యాత్ర ప్రారంభం..." Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
- ↑ "Bharat Yatris". www.bharatjodoyatra.in (in ఇంగ్లీష్). Archived from the original on 2023-01-29. Retrieved 2022-09-14.
- ↑ "Rahul Gandhi resumes Bharat Jodo Yatra from Madavana, Sachin Pilot joins him". Mathrubhumi English (in ఇంగ్లీష్). Retrieved 2022-09-22.
- ↑ "Revanth joins Rahul 'Bharat Jodo Yatra' in Kochi". The Hindu (in Indian English). Special Correspondent. 2022-09-20. ISSN 0971-751X. Retrieved 2022-09-23.
{{cite news}}
: CS1 maint: others (link) - ↑ "Bharat Jodo Yatra reaches Rahul Gandhi's constituency as Jairam Ramesh promises young and aggressive Congress". India Today (in ఇంగ్లీష్). Retrieved 2022-09-28.
- ↑ Prajasakti (14 October 2022). "ఎపిలోకి ప్రవేశించిన కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర" (in ఇంగ్లీష్). Archived from the original on 14 October 2022. Retrieved 14 October 2022.
- ↑ 10TV Telugu (14 October 2022). "ఏపీలోకి ఎంటరైన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర .. ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు..రైతులు". Archived from the original on 14 October 2022. Retrieved 14 October 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "భారత్ జోడో యాత్రకు తెలంగాణలో స్మాల్ బ్రేక్.. ఢిల్లీకి బయలుదేరిన రాహుల్ గాంధీ.. తిరిగి." 23 October 2022. Archived from the original on 23 October 2022. Retrieved 23 October 2022.
- ↑ "'భారత్ జోడో యాత్ర' 7 ఎంపీ, 16 అసెంబ్లీ స్థానాల మీదుగా." 14 October 2022. Archived from the original on 28 October 2022. Retrieved 28 October 2022.
- ↑ TV9 Telugu (13 October 2022). "తెలంగాణలో రాహుల్ పాదయాత్ర రూట్‌మ్యాప్ ఖరారు.. హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ.. పూర్తి వివరాలివే". Archived from the original on 28 October 2022. Retrieved 28 October 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)