లాతూర్ లోక్‌సభ నియోజకవర్గం
(లాతూర్ లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
లాతుర్ లోకసభ నియోజకవర్గం (Latur Lok Sabha constituency) మహారాష్ట్రలోని 48 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శివరాజ్ పాటిల్ ఈ నియోజకవర్గం నుంచి వరుసగా 7 సార్లు విజయం సాధించాడు.
నియోజకవర్గంలోని సెగ్మెంట్లు[మార్చు]
ఈ లోకసభ నియోజకవర్గంలో 6 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి
ఎన్నికైన సభ్యులు[మార్చు]
- 1962: తులసీరాం కాంబ్లే (భారత జాతీయ కాంగ్రెస్)
- 1967: తులసీరాం కాంబ్లే (భారత జాతీయ కాంగ్రెస్)
- 1971: తులసీరాం కాంబ్లే (భారత జాతీయ కాంగ్రెస్)
- 1977: ఉద్ధవ్ రావ్ పాటిల్ (పీసంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ)
- 1980: శివరాజ్ పాటిల్ (భారత జాతీయ కాంగ్రెస్)
- 1984: శివరాజ్ పాటిల్ (భారత జాతీయ కాంగ్రెస్)
- 1989: శివరాజ్ పాటిల్ (భారత జాతీయ కాంగ్రెస్)
- 1991: శివరాజ్ పాటిల్ (భారత జాతీయ కాంగ్రెస్)
- 1996: శివరాజ్ పాటిల్ (భారత జాతీయ కాంగ్రెస్)
- 1998: శివరాజ్ పాటిల్ (భారత జాతీయ కాంగ్రెస్)
- 1999: శివరాజ్ పాటిల్ (భారత జాతీయ కాంగ్రెస్)
- 2004: రూపాతాయ్ పాటిల్ (భారతీయ జనతా పార్టీ)
- 2009: జయవంత్ అవాలే (భారత జాతీయ కాంగ్రెస్)
2009 ఎన్నికలు[మార్చు]
2009 లోకసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జయవంత్ అవాలే తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన సునీల్ గైక్వాడ్ పై 7,975 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. జయవంత్‌కు 3,72,890 ఓట్లు రాగా, సునీల్ గైక్వాడ్‌కు 3,64,915 ఓట్లు లభించాయి. బీఎస్పీ అభ్యర్థి బాబాసాహెబ్ గైక్వాడ్‌కు 34,033 ఓట్లు వచ్చాయి.