వాడుకరి చర్చ:Bhaskaranaidu/పాత చర్చ 1

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

haMpi ....vijayanagaraM guriMci.[మార్చు]

హంపి విజయనగరం గురించి ఒక వ్యాసం వ్రాస్తున్నను. 30.4.2011 నేను వ్రాసిన వ్యాసం లోని కొన్ని భాగాలు కనబడడం లేదు. 4 గంటల తర్వాత వ్రాసినవి భద్రపరిచినా కూడా కనబడ లేదు. బహుస అవి స్వీకారము లు కా దేమో, అలాంటప్పుడు మిగతావి కూడ అస్వీకారాలె గదా? నా సందేహం నివృత్తి గాకుంటే వ్యాసాన్ని కొనసాగించాలంటే వృధా శ్రమ అనిపిస్తుంది.. ఎవరైనా నా సందందేహాన్ని నివృత్తి చేయ గలరా?

నేను వ్రాస్తున్న హంపి విజయనగరం వ్యాసం లోని కొన్ని భాగాలు తర్వాత కొనసాగీపు కొరకు తెరిస్తే కనబడ లేదు. కారణమేమిటో. ఆ బాగాలు అ స్వీకారాలా? నా సండేహం నివృత్తి అయితె కొనసాగించ గలను. దయచేసి తెలిసిన వారు నా సందీ హాన్ని తీర్చ గలరా?

హంపి....విజయనగరం గురించి నేను వ్రాస్తున్నన్ను. 30.4.2011 న నేను వ్రాసిన వ్యాసంలోని కొన్ని బాగాలు తిరిగి తెరిచి నప్పుడు మాయమైనవి. (భద్ర పరిచినా కూడ) తెలిసిన వారు కారణం తెలుపగలరా== నేను వ్రాస్తున్న వ్యాసం ఇక్కడ ఉండ దగిన దేనా? నేను ఎల్లంకి భాస్కరనాయుడు హైదరాబాదు.

కొన్ని సలహాలు[మార్చు]

భాస్కర్ నాయుడు గారూ, హంపి నిర్మాణ విశేషాల గురించి రాస్తున్న వ్యాసం బాగుంది. అయితే వికీపీడియాలో వ్యాసం రాస్తున్నపుడు అవి అనుభవాల రూపంలో రాయకూడదు. అంటే నేను చూశాను. అనూభూతి కలిగింది లాంటివి. ఇక్కడ ఏమి రాసినా స్వగతం లా రాయకూడదు. మధ్యమ పురుష (థర్డ్ పర్సన్)లో రాయాలి. దయచేసి గమనించగలరు. ఇంతకు ముందు మీ వ్యాసంలో కొన్ని మార్పులు చేసింది నేనే. ఇలాంటి వాక్యాల శైలి మార్చడం జరిగింది. --రవిచంద్ర (చర్చ) 10:12, 1 మే 2011 (UTC)[ప్రత్యుత్తరం]

haMpi vijayanagaraM[మార్చు]

నా పేరు భాస్కర నాయుడు. వ్యాసాన్ని (హంపి...విజయ నగరం) కొనసాగించమని సలహా ఇచ్చినందుకు నెనరులు. నా వ్యాసానికి బొమ్మలు కూడ చేర్చినందుకు కూడ మరి మారి నెనరులు. నా వద్ద నీను తీసిన బొమ్మలు చాలానె వున్నాయి, వాటిని ఇందులోనె చేర్చాలనే ఆలోచనలో వున్నాను. సకాలంలో సలహాకు మరొక్క సారి నెనరులు. ఇటువంటి సలహాలు సందర్బానుసారంగా అనుబగ్నులు ఇస్తూ వుంటే వుత్సాహంగా వుంటుంది.

haMpi vijayanagaram[మార్చు]

ఆర్యా................. హంపి విజయ నగరం గురించి నా వ్యాసం పూర్తి అయినది. విస్తరణ భీతితో చాలవరకు తగ్గించాను, అయినా అది కొంత పెద్దగానె వున్నదనిపిస్తున్నది. విషయం లో గాని, భాష లో గాని ఈ వ్యాసం పై తమ అభిప్రాయాలు తెలిపితె బాగుండును. §Bhaskaranaidu 14:15, 9 మే 2011 (UTC)[ప్రత్యుత్తరం]

  • చిన్న సలహా : ఈ నిర్మాణాల్ని ఒక పద్ధతిలో వీలుంటే మాప్ సహాయంతో పేర్కొంటే చదివేవారికి ఇంకా బాగా అర్ధం అవుతుంది. ఆంగ్ల వికీపీడియా నుండి బొమ్మల్ని నేను చేరుస్తున్నాను. ఆ నిర్మాణానికి సంబంధించిన చరిత్రాత్మక సంఘటనలు కూడా వివరిస్తే ఇంకా విజ్ఞానవంతమౌతుంది.Rajasekhar1961 06:44, 11 మే 2011 (UTC)[ప్రత్యుత్తరం]

రాజశేఖర్ గారికి..... మీరిచ్చిన సలహాలకు నెనరులు. నా వద్ద వ్యాసానికి సంబందించిన మార్గ నిర్దేశ పటము, ఆ యా ప్రాంతల్లో తీసిన చిత్ర పటములు చాల వున్నాయి. కాని వాటిని పైకి పంపడానికి తగు పద్దతులు తెలియక, నా యంత్రంలో అందుకు తగు సౌకర్యాలు లేక మిన్నకున్నాను. త్వరలో ఆ పని కూడ చేయగలను. ........నెనరులు.

విరాట్[మార్చు]

విరాట్ వ్యాసాన్ని తయారు చెసి మీరు చేర్చిన వివరాల్ని అక్కడకు చేర్చాను.Rajasekhar1961 15:04, 11 మే 2011 (UTC)[ప్రత్యుత్తరం]

విరాట్ పుస్తకం అట్టమీద బొమ్మను వ్యాసంలో చేర్చి నందున ఏవో అబ్యంతరా లున్నట్లున్నాయి. ఆ బొమ్మ అంత అవసరం లేదేమో? దాన్ని తీసేస్తే బాగుంటుందేమో ఆలోసించండి..

కొన్ని సలహాలు[మార్చు]

భాస్కరనాయుడు గారు, మీరు రాస్తున్న వ్యాసాలు కొద్దిగా గమనించాను.

  1. మీరు వ్యాసాలలో సంతకం చేస్తున్నారు. సంతకం అనేది కేవలం చర్చాపేజీలకే పరిమితం చేయాలి. వ్యాసాలలో చేయరాదు. వ్యాసం చరితంలో మీ సభ్యనామం ఎలాగూ నమోదౌతుంది.
  2. వ్యాసం పేరును తప్పనిసరిగా తెలుగులోనే ఉండాలి. ఆంగ్లపేరుతో వ్యాస ఉండటం బాగుండదు. దాన్ని దారిమార్పు ద్వారా కొత్త తెలుగు వ్యాసం పేరుతో మళ్ళించాల్సి ఉంటుంది.
  3. పత్రికల నుంచి యధాతధంగా వ్యాసాలను కాపీ చేయరాదు. కొన్ని వాక్యాలను మాత్రము తీసుకోవచ్చు. దానికి రెపరెన్సు ఇస్తే సరిపోతుంది.
  4. వ్యాసంలో సమాచారం యాత్రాకథనం లాగా ఉండరాదు. అంతేకాకుండా మనభావనగా ఉండరాదు. ప్రముఖులు చెప్పిన భావనలు మాత్రం వ్యాసంలో ఉంటంకించవచ్చు.
  5. పదానికి పదానికీ మధ్య ఒక్క ఖాళీ మాత్రమే ఉంచాలి.
  6. వ్యాసం చివరన పుస్తకాలలో ఉన్నట్లు ఉపసంహారం, ముగింపు లాంటివి వ్రాయరాదు. ఎందుకంటే తెవికీలో వ్యాసం ఏప్పుడూ, ఏ ఒక్కరిచే ముగింపు కాదు. అది నిరంతరం మార్పులు చేర్పులకు గురౌతుంది, అలా జరుగుతుండాలి కూడా. అంతేకాకుండా ఉపసంహారం వ్రాస్తే మన అభిప్రాయాలు జోడించినట్లవుతుంది.
  7. సమయం ఉన్నప్పుడు మీ వ్యాసాలు పూర్తిగా పరిశీలించి మరిన్ని సలహాలు ఇవ్వగలను. వీటిని పాటించగలరని భావిస్తున్నాను. ఇంకనూ ఏమైనా సందేహాలుంటే చర్చాపేజీలో వ్రాయండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:35, 12 మే 2011 (UTC)[ప్రత్యుత్తరం]


virata parvam lO reMDava aasvaasaM ledu.[మార్చు]

ఆర్యా...... మహ భారతము వర్గంలో ఆ మహా కావ్యాన్ని చదువుతున్నాను. అందులో విరాట పర్వం లో రెండవ అస్వాసము లేదు. ప్రదాన మైన ఘట్టం అయిన కీచక వద వున్న ఈ ఘట్టం లేనందువల్ల పెద్ద లోటు గా వున్నది. రచయిత దాన్ని చేర్చ గలరా?????????

వాలు పాఠ్యం ఆర్యా.......... వికిపీడియాలో మీరు సూచిస్తున్న చూచనలు, నిబందనలు మొదలగునవి కొంత గందరగోళాన్ని కలిగిస్తున్నాయి. ఏదైన కొత్త వ్యాసం రాయాలంటె ఆ పుటను ఎలా ఓపన్ చెయ్యాలి అర్థం కావడం లేదు. నేనిదివరకు కొన్ని వ్యాసాలు వ్రాశాను. అవి ఎలా ప్రారంబించానో తెలియదు. ఇప్పుడు ఏదైన కొత్త వ్యాసాన్ని ప్రారంబించాలంటే కొత్త పేజి తెరుచు కోవడం లేదు. ఏ మీటను నిక్కిన "దీన్ని బద్ర పరచ మంటారా" అని సందేశం కనబడుతున్నది. ఇదంతా నా యంత్రంలోని తప్పిదం అనుకుంటా.

నాకు పురాతన కట్టడాలన్నా, పురాతన ఆలయాలన్న మక్కువ ఎక్కువ. వాటికి సంబందించిన సంగతులు చాల వరకు వివిద పత్రికల్లో వచ్చిన వాటిని సేకరించి వుంచాను. కొన్ని ప్రదేశాలను స్వయంగా చూసి మళ్ళీ మళ్ళి చూసి నా స్వంతంగా కొన్ని వ్యాసాలను వ్రాసి వుంచుకున్నాను. నేనిదివరకు వ్రాసిన వ్యాసం "హంపి లోని నిర్మాణాలు" అటు వంటిదే. ఇదంతా ఎప్పటి సంగతో? అటు వంటి వ్యాసాలను ఈ వికిపీడియాలో చేర్చాలని వుంది. ఇందులో వెతగగా అక్కడక్కడా కొన్ని కనిపిస్తున్నాయి. అయినా వాటిని చేర్చాలనుకుంటున్నాను. అవసరం లేని వాటిని మీరు తొలిగిస్తారను కుంటా? ఇలా వ్రాయ వచ్చు కదా. అబ్యంతరం లేదు కదా////// నా సందేహాలను తొలగించ గలరు> తగు సూచనలు ఇవ్వగలరు. 04:26, 7 సెప్టెంబర్ 2011 (UTC)04:26, 7 సెప్టెంబర్ 2011 (UTC)~~ ఇట్లు  :::::::ఎల్లంకి భాస్కర నాయుడు.

పురాతన కట్టడాలు[మార్చు]

మీరు వ్రాసిన హంపిలో నిర్మాణాలు వ్యాసం చదివాను బాగుంది. అలాగే మీరు సేకరించిన వివరాలతో ఇదివరకు ఉన్న వ్యాసాలతో చేర్చి అభివృద్ధి చేయండి. అప్పుడైతే దానిని తొలగించరు. ఉన్న వ్యాసాలను అభివృద్ధి చేసినప్పుడు ఆ వ్యాసాలు మరింత ఆకర్షణీయంగా ఉండి చదవాలన్న ఆసక్తి కలిగిస్తాయి. మరొక్క విషయము మీరు సందేహాలను రచ్చబండలో అడగండి. అప్పుడే మీకు సరైన స్పందన లభిస్తుంది. అలాగే విరాట పర్వము ద్వితీయాశ్వాసము చేర్చబడి ఉంది చదవండి.--t.sujatha 04:39, 7 సెప్టెంబర్ 2011 (UTC)

మన దేవాలయాలు[మార్చు]

మన దేవాలయాలు వ్యాసంలో దేవాలయాలు గూర్చి చేరుస్తున్నారు. వీటిని దేవాలయంలోని దేవుడు ఆధారంగా రాయండి.Rajasekhar1961 05:09, 12 సెప్టెంబర్ 2011 (UTC) ఉదాహరణకు కొన్ని దేవాలయాలను చెబుతున్నాను :

ఒక్కొక్క దేవుని ఆలయానికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. వాటిని పేర్కొని ఇలాంటి దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి విశేషాలు వివరించండి.

ఇలా కాకపోతే భారతదేశంలోని ప్రముఖ దేవాలయాలైన ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు లో ఒక్కొక్క దానిని ఆంగ్లం నుండి అనువదించండి.

బృహదీశ్వరాలయం గురించి[మార్చు]

భాస్కర నాయుడు గారూ|

  • మీరు బృహదీశ్వరాలయం గురించిన విషయం చాలా బాగుంది. కానిని దానిని చర్చాపేజీలో వ్రాయవలసిన అవుసరం లేదు. నేరుగా వ్యాసంలోనే వ్రాయవచ్చును. ప్రస్తుతానికి మీరు చర్చా పేజీలో వ్రాసిన విషయాన్ని నేను వ్యాసంలోనికి కాపీ చేస్తున్నాను.
  • మహాభారతం విరాట పర్వము ద్వితీయాశ్వాసము మీకు కనిపించినదనుకొంటాను.
  • టెక్నికల్‌గా చిన్న చిన్న ఇబ్బందులతో మీరు నిరుత్సాహపడవద్దు. మీవంటివారి సహకారం వికీపీడియాకు చాలా అవుసరం. దయచేసి మీ కృషిని కొనసాగించండి. --కాసుబాబు 16:48, 1 అక్టోబర్ 2011 (UTC)

వెబ్ ఛాట్ఆహ్వానం[మార్చు]

మీరు వెబ్ చాట్ లో చేరగలరా? శనివారం సాయంత్రం 8 నుండి 9, మీకు వీలు చిక్కుతుందా. మనము వ్యక్తి గత పనితో బాటు సమిష్ఠిగా కృషిచేయటం తెవికీ అభివృద్ధికి చాలా అవసరం. --అర్జున 11:04, 27 డిసెంబర్ 2011 (UTC)

మీరు నా చర్చాపేజీలో స్పందనకు ధన్యవాదాలండి. ఈవారం సమావేశంలో కలవండి. అన్నట్లు మీకు వెబ్ ఛాట్ లో తెలుగు టైపుకి ఏమన్నా సమస్యలున్నాయేమో ముందుగానే పరిశీలించుకోండి. వివరాల కోసం వెబ్ ఛాట్వ్యాసం చూడండి.--అర్జున 14:00, 3 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
నేను వెబ్ ఛాట్ లో వున్నాను. అలాగే గూగుల్ నుండి ఛాట్ ఆహ్వానాన్ని కూడా పంపాను. కలవండి. --అర్జున 14:22, 3 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

చిన్న వ్యాసాలు[మార్చు]

చిన్న వ్యాసాలు వికీపీడియాలో చాలా ఉన్నాయి. చివరికి నిర్వాహకులకు అవొక సమస్యగా మారాయి. కొన్నింటిని తొలగించారు. కొన్నింటిని ఏమి చేయాలో తెలియలేదు. అందువలన మంచి వ్యాసాల్ని తీసుకొని అభివృద్ధి చేయమని మనవి.Rajasekhar1961 09:37, 4 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

సామెతలు[మార్చు]

మీరు రాసిన సామెతలను అక్షర క్రమంలో వాటి పేజీలలోని మార్చాను. తొలగించలేదని గ్రహించండి. ఇకమీద మీరు సామెతలు గురించి రాయాలనిపిస్తే సామెతలు - అ, సామెతలు - త ఇలా ప్రతి తెలుగు అక్షరం మీద ఉన్న సామెతల పేజీలలోనే నేరుగా రాయండి. చాలా సామెతలు వివరణలు లేకుండా బోడిగా ఉన్నాయి. ఒకసారి పరికించండి.Rajasekhar1961 15:09, 4 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

అధికారి ఎన్నిక గడువు పొడిగింపు[మార్చు]

అర్జున అధికారిగా ఎన్నికకు స్టివార్డ్ ల నియమాల ప్రకారం (ప్రస్తుత తెలుగు అధికారులు క్రియాశీలంగా లేరు కాబట్టి) 15 వోట్లు కావాలి. అందుకని ఎన్నిక గడువు పొడిగించాను. మీరు త్వరలో వోటు వేయమని కోరుచున్నాను. ----అర్జున 10:07, 8 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

Bhaskaranaidu గారూ ప్రస్థుతం తెవీకీకి అధికారి కొరత ఉంది. మీరు త్వరగా స్పందించి అత్యంత చురుకుగా పనిచేస్తున్న అర్జునరావుగారికి మద్దతు తెలిపి తెవికీ అభివృద్ధికి సహకరించండి. ఈ లింకును ఒకసారి పరిశీలించండి వికీపీడియా:అధికార హోదా కొరకు విజ్ఞప్తి/అర్జున t.sujatha 17:43, 12 జనవరి 2012 (UTC)

కోరుకొండ పాఠశాల వ్యాసం[మార్చు]

కోరుకొండ పాఠశాలవ్యాసం వేరే ఇతర మూలాలనుండి నకలు చేసి అతికించినట్లుగా అనుమానించడమైనది. మీరు మీ స్వంత వ్యక్తీకరణతో ఇతర మూలాలతో దానిని అభివృద్ధి చేయవచ్చు. పాత రూపాన్ని చూడడానికి చరిత్ర చూడండి--అర్జున 07:49, 10 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

మీ సందేహము[మార్చు]

ఆర్యా....... నేను పల్లె వాసులు.. పనిముట్లు అనే వ్యాసం వ్రాస్తున్నాను. ఇది చూచి వ్రాత కాదు గనుక ఉత్సాహంగా వేగంగా విషయాలు వస్తుంటాయి. అలా ఒక పేరానో ఒక విషయమో పుర్తైన తర్వాత భద్ర పరచ డానికి ప్రయత్నిస్తె ............. సారి మీడేటా పోయి నందున స్వీకరించ లేక పోతున్నాము అనే సందేశం వస్తున్నది. దాంతో నాకు చాల అసంతృప్తికి లోనౌతున్నాను. చూచి వ్రాత అయితె తిరిగి అదే విధంగా వ్రాయ వచ్చు. ఇది సూటిగా వ్రాసె వ్యాసం. తిరిగి వ్రాయాలంటే అప్పుడొచ్చిన ఊపు రాదు. వ్యాసం సరిగా కుదరదు. దీనికి కారణం ఏమి? పరిష్కారం ఎమి? కారణం ఏమి? తెలిసిన వారు తెలుప గలరా....... భాస్కర నాయుడు....ellanki 14:58, 10 జనవరి 2012 (UTC).

ఒక్క చిట్కా మీకు సహాయం కావలసి వచ్చినప్పుడు , మీ చర్చా పేజీలో పైన రాసినట్లుగా రాసి {{ సహాయం_కావాలి}} చేర్చండి. అప్పుడు ఎవరో ఒకరు స్పందిస్తారు. సరే నేను మీ పేజీచూడటం వీలైంది కాబట్టి నా సలహా ఏంటంటే, మీరు మీ కంప్యూటర్ లో ఉపకరణాలతో (Word, Notepad, wordpad, gedit) రాసుకొని దానిని నకలు చేసి వికీపీడియాలో ఒకేసారి అతికించి దాచవచ్చు. దీనికి మీరు గూగుల్ లిప్యంతరీకరణ లేక ఇతర కీ బోర్డు వుపకరణాలు వాడండి. మరిన్ని సందేహాలకు వెబ్ ఛాట్ లో కలవండి. --అర్జున 15:17, 10 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

ఓటింగ్[మార్చు]

Bhaskaranaidu గారూ ప్రస్థుతం తెవీకీకి అధికారి కొరత ఉంది. మీరు త్వరగా స్పందించి అత్యంత చురుకుగా పనిచేస్తున్న అర్జునరావుగారికి మద్దతు తెలిపి తెవికీ అభివృద్ధికి సహకరించండి. ఈ లింకును ఒకసారి పరిశీలించండి వికీపీడియా:అధికార హోదా కొరకు విజ్ఞప్తి/అర్జున --Sridhar1000 13:18, 22 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

వర్గం లో మార్పులు[మార్చు]

వర్గం పేజీలో పేజీలు దానంతటవే చేరుతాయి. వాటిని మరల ఆదే పేజీలో తిరగరాయాల్సిన పనిలేదు. ఉదా వర్గం:హైదరాబాదు రైల్వేస్టేషన్లుగమనించగలరు.అటువంటి మార్పులను మీరే తొలగించితే బాగుంటుంది. తెవికీ గురించి మరింత తెలుసకోటానికి చర్చాపేజీలు వాడటం మంచిది --అర్జున 12:59, 8 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

నేను కూడా చాలా సార్లు వివిధ వర్గాల చర్చాపేజీలలో ఈ విషయం తెలియజేశాను. అయిననూ మళ్ళీ వర్గాలలో సమాచారం చేరుస్తున్నారు. మీరు ఒక వర్గంలో ఏ వ్యాసం పేరు రావాలో ఆ వ్యాసంలోనే చివరన వర్గంపేరు చేర్చండి. ఒకవేళ ఆ వ్యాసం లేకుంటే కొత్తగా సృష్టించండి. కొన్ని వర్గాలలో ఆ వర్గానికి సంబంధం లేని విషయాలు కూడా చాలా చేరుస్తున్నారు. ఉదాహరణకు వర్గం:చిత్తూరు జిల్లా దర్శనీయ స్థలాలులో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలకు సంబంధించిన సమాచారం చేరిస్తే నేను తొలిగించాను (చూడండి) ఇతర వర్గాలలో కూడా మీరు చేర్చిన సమాచారం తొలిగింపునకు గురౌతుంది. మీ శ్రమ వృధా కావచ్చు కాబట్టి అవసరమైన సమాచారం మాత్రమే చేర్చండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:45, 8 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు: నేను ఎక్కడో వ్రాయబోయి ఎక్కడో వ్రాశాను. తప్పు గ్రహించాక తొలగించాలంటే కుదరలేదు. మరొక్క విన్నపం. కొన్ని వ్యాసాలకు సంబందించి చాల బొమ్మలు నేను తీసినవి వున్నాయి. వాటిని ఆ యా వ్యాసాలలో అతికించ డానికి ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు. ఉపాయం తెలుపగలరు.ellanki 05:31, 9 ఫిబ్రవరి 2012 (UTC)
చూడండి--అర్జున 08:59, 9 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త వ్యాసం చేర్చబోయే ముందు అన్వేషణ[మార్చు]

మీరు ఇటీవల చేర్చిన జాతీయ చిహ్నలు వ్యాసం జాబితా లాగా వుపయోగపడదు. ఎందుకంటే భారత_దేశము వ్యాసంలో జాతీయ చిహ్నలున్నాయి. కనుక మీరు కొత్త పేజీ చేర్చబోయేముంది సంబంధిత వ్యాసాలలో అన్వేషించి చేర్చమనికోరుతున్నాను. మరిన్ని వివరాలకు వికీపీడియా:అన్వేషణ చూడండి. --అర్జున 07:06, 10 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

పతకం[మార్చు]

Bhaskaranaidu గారికి, తెవికీ లో వివిధ అంశాలపై ప్రత్యేకించి జాతీయాల పై మీ కృషికి అభివందనలు, గుర్తింపుగా ఈ పతకాన్ని ఇస్తున్నాను. --అర్జున (చర్చ) 06:36, 1 మార్చి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మలు[మార్చు]

మీరు బొమ్మల్ని వికీ కామన్స్ లోకి తిన్నగా అప్లోడ్ చేయడం మంచిది. నాకు ఫోన్ చేసినా (9246376622) లేదా నా అడ్రస్ కు వచ్చినా నేను నేర్పించగలను.Rajasekhar1961 (చర్చ) 08:52, 28 మార్చి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

భాస్కరనాయుడు గారూ ! మీరు వీలైతే హైదరబాదు రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో జరిగే వికీపీడియా సమావేశాలలో పాల్గొనండి. అక్కడ మీకు ఉపయుకతమైన విషయాలను అనుభవం ఉన్న సభ్యుల నుండి నేరుగా తెలుసుకో వచ్చు. మీరు చేస్తున్న పనికి వ్రాస్తున్న వ్యాసాలకు అది ఇంకా సహకరిస్తుందని నేను అనుకుంటున్నాను. t.sujatha 16:23, 28 మార్చి 2012 (UTC)

సుజాత గారూ: మీ సలహాకు నెనరులు: రాజ శేఖర్ గారితో మాట్లాడాను: అవకాశాన్ని బట్టి వారి ప్రత్యక్షంగా కలుసుకుంటాను. మరొక విన్నపం: ఈరోజు నేను కొన్ని జాతీయాలను చ అక్షరంపై వ్రాసాను. అలా కొన్ని వ్రాశాక ఒక హెచ్చరిక వచ్చింది. దాని సారాంశం నాకర్థమైనదేమంటే నాది అనవసరమైన శ్రమ అని. అలాంటప్పుడు నిరుత్సాహం కలగడం సహజమేకదా: అందుకే ఆపేశాను. మీరు గాని, రాజ శేఖర్ గారు గాని మరెవరైనా దీనిని గమనించ గలరని మనవి. అవసరమైతేనె తగు సలయాలివ్వండి. ఇట్లు: ఎల్లంకి భాస్కరన నాయుడు.bhaskaranaidu 17:09, 30 మార్చి 2012 (UTC)

మీ బొమ్మలు ( ఉదా: ) నేరుగా వికీమీడియా కామన్స్ లో పెడితే అన్ని ప్రాజెక్టులలో వాడుకోటానికి వీలవుతుంది. అయితే తెలుగు వాక్యాలు రాసిన ఫోటోలు కాకుండా, లేక వాటిని కంప్యూటర్ ద్వారా తొలగించి ఎక్కించితే బాగుంటుంది. --అర్జున (చర్చ) 12:11, 7 ఏప్రిల్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున రావు గారూ........

నేను ఎక్కించిన ఫోటోలలో వాటికి సంబందించిన పేరు తెలుగులో వున్నది. కొన్ని సంవత్సరాల క్రితం అయా ప్రాంతాలలో నేను తీసిన ఫోటోలు సాధారణ కెమారావి. ఆ ఫోటోల పై అప్పట్లోనె నేను వాటి పేర్లను రాసి వాటిని స్కాన్ చేసి సి.డి. లోకి ఎక్కించి దాచు కున్నాను. ఇదంతా నాకొరకు నేను చేసుకున్నది. ఆ బొమ్మలనే ఇప్పుడు వికిలో అవసర నిమిత్తం పెట్టడం జరిగింది. ఆ పేర్లను తొలిగించ వీలు కాదు. ఇది గమనించ గలరు. తెలుగులో పేరున్న ఫోటోలను పెట్టడం తప్పయితే మానేస్తాను. అటు వంటి ఫోటోలు నా వద్ద చాల వున్నా మన వికీకి ఉపయోగ పడేవి ఇంకా చాల కొద్దిగానె వున్నాయి.ఆ తర్వాతి నేను తీసిన డిజిటల్ కెమెరా పోటోలలో ఇటు వంటి ఇబ్బంది లేదు. ఇట్లు: భాస్కర నాయుడు.

డిజిటల్ ఎఫెక్ట్స్ తో ప్రత్యేక సాఫ్ట్ వేర్ వుపయోగించి పేర్లను కనబడకుండ చేయడం పెద్దపనికాదు. కాకపోతే ఎక్కించేటప్పుడు చేస్తే తరువాత చేసే పనితప్పుతుంది. అది కామన్స్ లో పెట్టినట్లయితే అన్ని ప్రాజెక్టులకు వుపయోగంగా వుంటాయి. డిజిటల్ ఫొటోలను కామన్స్ లో పెట్టండి. నెలవారి సమావేశంలో పేర్లను తొలగించడం గురించి ఇతరులనుండి తెలుసుకోవచ్చు. --అర్జున (చర్చ) 09:19, 10 ఏప్రిల్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

విజ్ఞప్తి[మార్చు]

Bhaskaranaidu గారు నేను వికీపీడియా నిర్వాహక హోదాకు అప్లై చేశాను. దయచేసి మీ అభిప్రాయాన్ని తెలుపగలరు. దీనికి లింకు వికీపీడియా:నిర్వాహక_హోదా_కొరకు_విజ్ఞప్తి/sridhar1000 --Sridhar1000 (చర్చ) 14:36, 12 ఏప్రిల్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మలు[మార్చు]

నాయుడు గారూ మీరు అప్లోడ్ చేసే బొమ్మలు బావున్నాయి కాని వ్యాసానికి కావలసిన దానిని అప్లోడ్ చేస్తూ, దాని ఆ వ్యాసంలో పెడ్తూ వెళ్తే బావుమ్టుంది అని నా మనవి. కొన్ని ఇలాంటి దస్త్రం:A bird on the branch.JPG లాటి పోటోలు కూడా మిగిలిపోవడం వలన ఈ సైట్ యొక్క స్పేస్ వేస్టవుతుంది. పేర్లు మార్పుకు మీ సిస్టంలోకి సి డి నుమ్డి కాపీ చేసుకొని రైట్ క్లిక్ తో పేరు మార్పు చేసి తరువాత అప్లోడ్ చేయవచ్చు. అవసరమైనంత వరకూ బొమ్మను ఎడిట్ చేయగలిగి అప్లోడ్ చేస్తే మరీ బావుంటుంది మీకు సాద్యం అయితే అలా చేయగలరని మనవి.కృతజ్ఞతలు. విశ్వనాధ్ (చర్చ) 15:59, 25 ఏప్రిల్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]
నాయుడు గారూ మీరు అప్లోడ్ చేసే బొమ్మలు బావున్నాయి కాని వ్యాసానికి కావలసిన వాటిని అప్లోడ్ చేస్తూ ఆయా వ్యాసాలలో పెడ్తూ వెళ్తే బావుంటుంది అని నా అభిప్రాయము. కావలసిన వాటిని మాత్రమే తీసుకోవడం వలన వికీలో స్పేస్ కలిసివస్తుంది. కొన్ని అసలు అవసరం లేని బొమ్మలు కూడా ఉన్నాయి. మరికొన్ని పేరు మార్పు చేయవలసినవి ఉన్నాయి. ఈ సారి రాజశేఖర్ గారి వద్దకు వెళ్ళినపుడు వీటిని గురించి చర్చించి ఎలా చేయాలో అడగండి.విశ్వనాధ్ (చర్చ) 12:39, 29 అక్టోబర్ 2012 (UTC)

టైపింగు సహాయం[మార్చు]

కంట్రోల్ ఎం. నొక్కి తెలుగు నుండి ఇంగ్లీషుకు మారండి. నాకు పనిచేస్తుంది.Rajasekhar1961 (చర్చ) 08:05, 4 మే 2012 (UTC) sir, Just one hour before it worked to convert to Telugu when press buttons "control M" though the alphabetical are not in order. But now conversion to Telugu is not at all coming. I dont think it the mistake of my p.c. However I will try later on. ........................ yours: Bhaskaranaidu...[ప్రత్యుత్తరం]

జాతీయాలు[మార్చు]

మీరు చేర్చిన జాతీయాల పేజీ సరిచేశాను. అందులోని అ అక్షరానికి చెందిన వాటిని అం అక్షరానికి చెందిన వాటిని వేరుచేయండి.Rajasekhar1961 (చర్చ) 17:30, 6 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

నాయుడు గారూ మీకు తెలుగు బాష మీద, వివిద ప్రాంతాల మాండలికాల మీద మంచి పట్టు ఉన్నట్టుంది. మీ రచనల ద్వారా చాలా మందికి తెలియని ఎన్నో ఉపకరణాలను, పనిముట్లను పరిచయం చేస్తున్నారు. ఇలాగే వికీకి సేవలు అందించగలరని ఆశిస్తూ శుభాకాంక్షలతో విశ్వనాధ్ (చర్చ) 14:59, 7 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ ఆదివారం సమావేశం[మార్చు]

ఈ ఆదివారం 20 మే తేదీన వికీ సమావేశం జరుగుతుంది. దయచేసి హాజరుకమ్మని విన్నపం చేస్తున్నాను. ఇక్కడ నమోదు చేసుకోండి.Rajasekhar1961 (చర్చ) 07:14, 18 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

సమావేశం[మార్చు]

ఈ ఆదివారం సమావేశంలో చురుకుగా పాల్గొన్నందుకు ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 11:48, 20 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

విజయనగర చరిత్ర[మార్చు]

విజయనగర చరిత్ర పుస్తకం బాగుంది. కానీ ఇంకా మిగిలిన సమాచారం అంతా అనువదించి చేర్చితే బాగుంటుంది.Rajasekhar1961 (చర్చ) 13:23, 24 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వ్యాసానికి సరియైన పేరు హంపి వైభవం. ఇలా మారిస్తే బావుంటుంది అని మనవి.విశ్వనాధ్ (చర్చ) 07:35, 1 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

పైన కనబరచిన ప్రశ్నకు నా సమాధనం....[మార్చు]

అదేమమంత సులభసాద్యం కాదు. అయినా ప్రయత్నిస్తున్నాను. సమగ్రంగా కాకపొయినా వీలైనంత ఎక్కువ పని పూర్తి చేసి సమర్పిస్తాను. పైగా సాంకేతిక పరమైన అవంత రాలున్నాయి. అవి ఏమనగా....... ఆ రచన బ.ర.హా డైరెక్ట్ లో వున్నది. దానిలీ కొత్త సంగతులు చేర్చడానికి అధిక శ్రమ. పోని వికిసోర్సు లో మార్పులు చేద్దామంటే అది కూడ శ్రమ తో కూడు కున్నదే.... అయినా వేలు పెట్టాను గనుక కొంత వరకైనా సాధించాలని పట్టుదలతొ వున్నాను. ఈ విషయంలో మీ సలహాకు జోహార్లు.Bhaskaranaidu (చర్చ) 17:25, 5 ఆగష్టు 2012 (UTC)

చిన్న వ్యాసాలు[మార్చు]

దయచేసి చిన్న చిన్న ఒక వాక్యం లేదా పదంతో వ్యాసాలు తయారుచేయవద్దు. అవి తొలగించబడతాయి. వ్యాసానికి సరిపడినంత సమాచారం ఉంటేనే కొత్త వ్యాసం ప్రారంభించండి. ఈ పదాలను విక్షనరీతో సృష్టించండి. మరోలా భావించవద్దు.Rajasekhar1961 (చర్చ) 08:21, 2 జూన్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

చిన్న పదాల వ్యాసాలను తొలగించాను. విక్షనరీలో వాటిని చేర్చండి. కొన్ని విస్తరణకు అవకాశం ఉండే వాటిని అలానే ఉంచాను. వాటిలో ఇంకా సమాచారాన్ని చేర్చండి. బొమ్మలు కూడా.Rajasekhar1961 (చర్చ) 11:00, 6 జూన్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

హైదర్ ఆలీ వ్యాసం[మార్చు]

అయ్యా వికీపిడీయాలో నేను వ్రాసిన హైదర్ ఆలీ వ్యాసాన్ని చూసి ఎలా ఉందో చెప్పగలరు.----Sridhar10001 (చర్చ) 10:42, 12 జూన్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

హైదర్ అలి వ్వాసం[మార్చు]

చాల బాగున్నది. Bhaskaranaidu (చర్చ) 05:18, 14 జూన్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

వర్గాలలో సమాచారం[మార్చు]

మీరు వర్గాలలో సమాచారం చేరుస్తున్నట్లుగా గమనించాను. వర్గాలలో ఆ వర్గానికి సంబంధించి సంక్షిప్త సమాచారం మాత్రమే సరిపోతుంది. వర్గాలలో ఉప వర్గాలు, వ్యాసాలకు చెందిన లింకులు, అంతర్వికీ లింకులు, చివరన ప్రధాన వర్గాలు మాత్రమే ఉండాలి. వర్గాలలో సమాచారం చేర్చరాదనే విషయాన్ని మీకు ఇదివరకే తెలియజేశాము, అయిననూ మీరు మళ్ళి సమాచారం చేరుస్తున్నారు. ఈ సమాచారం ఆయా వ్యాసాలలోకి తరలించడంకాని, కొత్త వ్యాసాలను సృష్టించడం కాని చేస్తే బాగుంటుంది. లేనిచో మీ శ్రమ వృధా కావచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:10, 21 జూన్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

నాపై పైన కనబరిచిన అభియోగానికి నా సమాదానం[మార్చు]

ఆర్యా... పై విషయాన్ని గురించి నా సమాదనం ఏమంటే..... నేను కావలని ఏ వర్గాలలోను సమాచారము చేర్చడము లేదు.వాటిని ఎలా చేర్చాలో కూడ నాకు తెలియదు. వర్గాలలో సమాచారము చేర్చడానికి వికిలో కొన్ని గుర్తులున్నట్టున్నాయి., వాటిని నొక్కినందున అలా జరిగి వుండ వచ్చు. నాకు చేత కాని విషయాలలో నేను జాగ్రత్తగా వుంటాను. కొత్తవర్గాలను సృష్టించడము గాని, వున్న వాటిని తొలిగించడము గాని, ఏమి చేయడానికి నాచేత కాదు. నాకు తెలిసినది ఒక్కటే.... నేను రాయగలిగినది నేను రాస్తుంటాను. అది ఆమోద యోగ్యంగా వుంటే వుంచండి లేకుంటే తీసేయండి. నాకేమి అబ్యంతరము లేదు. కాక పోతే ఈమద్యనే విక్షనిరీలో కొత్తపదాలను సృష్టించ వచ్చు అనే గడిని చూసి దానిపై నొక్కి నాకు తెలిసిన మా ప్రాంతంలో వాడుకలొ వున్న వ్వవసాయ సంబందిత పదాలను చేరుస్తున్నాను. అది కూడ అనవసరమైతే తెలపండి మానేస్తాను. నేను నాపూర్తి సమయాన్ని తెవికి కొరకు వినియోగిస్తున్నాను. నాకు మానసికంగా ఉత్తేజాన్నిస్తున్నందున ఆపని చేస్తున్నాను. తెలుగు భాషపై అభిమానముతో ఆ పని చేస్తున్నాను. అంతే గాని ఇందులో నా స్వార్థము లేదు. ఈ విషయమై ఒకరినుండి నిందలు పడవలసిన అవసరము నాకు ఏమాత్రము లేదు. కాక పోతె నాకు నా వ్వాసాలలో తారస పడిన కొత్త పదాలను కొన్ని గుర్తులతో ప్రధానంగా కనబడేటట్లు చేస్తుంటాను. ఆయాగుర్తులకు వేరొక కారణ మున్నట్టుంది. ఆ విషయం నాకు అవగాహన లేదు. అందు చేత నేననుకున్నదేమంటే తెవికిలో సాంకేతిక పరమైన విషయాలను ముందుగా తెలుసుకొని ఆతర్వాతనే వ్రాయడము మంచిదని గ్రహించాను. ముందుగా ఏ మీట నొక్కితే ఏ కొంపలు మునుగు తాయో తెలుసుకోవాలి. అది తెలుసుకోక నాయిష్టానుసారం వ్రాసి ఇలా నిందలు పడాల్చి వచ్చింది. తెవికీకి సంబందించిన వ్వక్తులతో సంప్రదించి తర్వాత నేనేమి చేయవలెనో నిర్థారిస్తాను.Bhaskaranaidu (చర్చ) 16:05, 5 ఆగష్టు 2012 (UTC)

అదియును గాక...... చంద్ర కాంత రావుగారు నన్నేమి పని గట్టుకొని నిందించలేదు. నాశ్రమ వృదా అవుతుందన్నారంతే...... కాని నాకదే పెద్ద హెచ్చిరిక. వృధా అయినంత మాత్రాన నాకొరిగే నష్టం ఏమి లేదు. నాశ్రమ వృధా అయినా, నా సమయం వృధా అయినా నాకొచ్చె నష్టమేమి లేదు. నాకు తెవికి లో వ్రాయడమే సంతృప్తి. దాన్ని వుంచు తారా తీసేస్తారా? నాకనవసరము. ......... ఇది సార్వజనీకమైన అతి ప్రాముఖ్యమైన ఒక వ్వాసంగం. ఇందులో పాలు పంచు కోవడమే ఒక గొప్ప. కాని సాంకేతిక పరమైన విషయాలపై అవ గాహన లేక జరిగిన తప్పిదాలకు నేనేమి క్షమాపణలను కోరను. తప్పు తెలిసి జరిగిందా లేదా అంత వరకే.. ..కావల్సి పని గట్టుకొని చేసారా.... అవగాహన లోపంతో జరిగిందా ...... నాకనావసరం. తప్పు జరిగింది. రెండోసారి అని కూడ అంటున్నారు. కనుక దీనికి నేను క్షంతవ్యుడను కాను. క్షమించమని నేను ఏట్టి పరిస్తితుల్లోను అడగను. అది నా పద్దతి. సాంకేతిక పరిగ్నానమున్న వారిని సంప్రదించ దలిస్తే ప్రస్తుతం వారు అందు బాటులో లేరు. వారిని సంప్రదించి తదుపరి కార్యాచరణ కొనసాగిస్తాను. అంతవరకు నేనిప్పుడు కొనసాగిస్తున్న రచనలను మాత్రం కొనసాగిస్తాను...... [[వాడుకరి ) 16:52, 5 ఆగష్టు 2012 (UTC)Bhaskaranaidu (చర్చ) 17:14, 5 ఆగష్టు 2012 (UTC)

భాస్కరనాయుడు గారు, నేను మీపై మోపినది నింద, అభియోగము కాదండీ. అది తెవికీ నిర్వహణలో భాగంగా నేను తెలియజేసిన సూచన మాత్రమే. వ్యాసంలో మాదిరిగా మీరు వర్గాలలో చాలా సమాచారం చేరుస్తుంటే అలాచేయరాదని సూచించాను. ఉదా:కు వర్గం:నల్గొండ జిల్లా పుణ్యక్షేత్రాలు చూడండి. ఈ విధంగా వర్గంలో విపరీతమైన సమాచారం అవసరం లేదు. ఆ వర్గం గురించిన సంక్షిప్త సమాచారం ఉండి ఇదివరకు నేను తెలియజేసిన విధంగా ఉపవర్గాలు, వర్గాల లింకులు, అంతర్వికీ, ప్రధాన వర్గాలు ఉంటే సరిపోతుంది. నేను చెప్పిన విషయం అర్థమైందనే అనుకున్నాను. కాని ఈ సూచన నేను తెలియజేసిన 44 రోజుల తర్వాత మళ్ళీ చర్చలేవదేశారు. ఈ మధ్యలో మీరు 500పైగా దిద్దుబాట్లు కూడా చేశారు. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:31, 5 ఆగష్టు 2012 (UTC)
భాస్కరనాయుడు గారు, చంద్రకాంతరావు చేసినది సూచన మాత్రమే నింద, అభియోగం ఏ మాత్రం కాదు. వికీ నిర్వహణలో ఇదొక భాగం. దీనిని మీరు నిందగా భావించడం బాధాకరం. మీ రచనలు తెలుగు వికీపీడియాకు చాలా అవసరం. దానికి తప్పకుండా జరిపించండి. మీరు చేస్తున్న చిన్న చిన్న దోషాల్ని నేను సవరిస్తాను.Rajasekhar1961 (చర్చ) 06:26, 6 ఆగష్టు 2012 (UTC)
నేను తప్పకుండా నా వ్వాసంగాని కొనసాగిస్తాను.... కాని అది వ్వాసాలలోనా లేదా రచ్చ బండా, చర్చ లోనా అనేది తర్వాతి విషయం. రాజసేఖర గారికి మనవి ఏమంటే...... నేను పని గట్టుకొని ఏవిషయాన్ని కొత్తగా సృష్టించడం లేదు. అది యాదృచ్చికమే. చంద్రకాంత రావు గారు అన్నట్టు "44 రోజుల తర్వాత చర్చను లేవదీశారు" అనే మాట గురించి..... నావివరణ ఏమంటే..... నాకు సాంకేతిక పరిగ్నానము అంతగాలేదు. ఏదేని విషయాన్ని సృష్టించాలో, తీసి వేయాలో .... ఇలాంటి విషయాలు నాకు తెలియవు. తెలుసు కోవాలని కూడ ఇంత వరకు లేదు. నేను వ్రాసిన వ్వాసంగాలను ఉంచు తున్నారా.... అవి అనవసరమని తీసేస్తున్నారా.... అనే విషయాన్ని కూడ పట్టించు కోను. దాన్ని ఎలా చూడాలనే విషయంకూడ నాకు తెలియదు. ఇక తెలుసుకుంటాను. అలా యాదృచ్చికంగా, ఆలస్యంగా నా కంట బడింది అందుకే నేను స్పందించాను. అంతేగాని 44 రోజుల తర్వాత వేచి చూసి నిదానంగా నేను చర్చను లేవదీశాననడం తప్పు. నాకు సాంకేతిక విషయమై అంత అవగాహన లేక పోవడమే ఈ అపోహలకు ప్రధాన కారణం. ఇకపై సాంకేతిక విషయాపై కొంత అవగాహన పెంచుకొని అప్పుడు స్పందిస్తాను. ఈ చర్చను ఇంకా కొనసాగించాలా వద్దా.... అనే విషయాన్ని మన తెవికి ప్రధాన సభ్యులందరి దృష్టికి తెస్తున్నాను. నిర్ణయం మేదె. Bhaskaranaidu (చర్చ) 16:15, 6 ఆగష్టు 2012 (UTC)

విక్షనరీ నందు నా నిర్వాహక తాత్కాలిక హోదా రద్దు అయినది[మార్చు]

భాస్కరనాయుడు గారు విక్షనరీ నందు నా నిర్వాహక తాత్కాలిక హోదా రద్దు అయినది. అందువలన నా హోదా కాలము పొడిగింపునకు [1]విజ్ఞప్తి చేసి ఉన్నాను. దయచేసి మీ అభిప్రాయాన్ని అక్కడ తెలుపగలరు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 12:36, 9 ఆగష్టు 2012 (UTC)

సామెతలు మరియు జాతీయాల గురించి[మార్చు]

మొదటి నుండి సాంతలు, జాతీయాల గురించి చాల వరకు కృషి చేస్తున్నాను. ఆ విషయంలో ఇంచు మించు సంపూర్ణత సాదించాలని నావేధన. వికీలో నామొదటి ప్రాధాన్యత దానికే. తర్వాతనె దేనికైనా.... నిర్వాహకులు గమనించగలరు.Bhaskaranaidu (చర్చ) 17:12, 15 ఆగష్టు 2012 (UTC)

విక్షరీ గురించి[మార్చు]

గతంలో ఎప్పటినుండోవిక్షరీలో కొన్ని పదాలను వాటి అర్థాలను వ్రాస్తున్నాను. ప్రముఖుల చూచన మేరకు విక్షరీలో ఈ రోజునుండే ఎక్కువ సమయం కేటాయించాలని నిర్ణయించు కున్నాను. చేతిలో ఇప్పటికే కొన్ని అసంపూర్ణ మైన పనులున్నా....... పైవారి కోరిక మేరకు విక్షరీలో కూడ ప్రముఖ పాత్ర తీసుకోక తప్పడంలేదు. ఇది భాషాపరమైన , సాహిత్య పరమైన కార్యక్రమము. మన స్వంత మాటలకు ఇక్కడ తావు లేదు. ఇది ఇతర వ్వాసాలలాగ మన ఇష్టం వచ్చినట్టు వ్రాయగలిగినది కాదు అని నాఅభిప్రాయము. అందుకని ఈ పని నిదానంగా జరుగుతుంది. ఈ విషయంలో ఇంకొందరు సహకరిస్తే పని తొందరగా పూర్తి కాగలదని నా మనవి. సహకారం అంటే ఒకరికొకరు సహకారం అని అర్థం కాదు. ఎవరి పని వారు చేసు కుంటే చాలు. ఒకరికి సహకరించ నవసరము లేదు. ఇది ఎవరి స్యంత పని కాదు గదా/ అందరిదీను..... మనతెలుగు భాషకు సంబందించినది. కనుక నిర్వహకులు ఈ విషయంలో కొంత చొరవ తీసుకొని మరికొంత మందిని విక్షరీ కి పరి పూర్ణత తీసుకు రావడానికి కృషి చేయగలరని మనవి. Bhaskaranaidu (చర్చ) 17:27, 15 ఆగష్టు 2012 (UTC)

ఈ ఆదివారం సమావేశం[మార్చు]

ఈ ఆదివారం ఆగష్టు 19 తేదీన వికీ సమావేశం జరుగుతుంది. దయచేసి హాజరుకమ్మని విన్నపం చేస్తున్నాను. ఇక్కడ నమోదు చేసుకోండి.Rajasekhar1961 (చర్చ) 11:00, 18 ఆగష్టు 2012 (UTC)

నిన్న సమావేశంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఈరోజు మధ్యాహ్మం స్కైప్ లో వీడియో సమావేశం ప్రయత్నిద్దాము.Rajasekhar1961 (చర్చ) 06:00, 20 ఆగష్టు 2012 (UTC)

వీడియో సమావేశ ప్రయోగం గురించి[మార్చు]

నా సిస్టంలో స్కైప్ లేదు. దాన్ని దిగుమతి చేసుకొన్నాక ప్రయత్నిస్తాను. Bhaskaranaidu (చర్చ) 15:07, 20 ఆగష్టు 2012 (UTC)

అగ్నానము, అభిగ్నానము,,, మొదలగు వాటిని సరిగా ఎలా వ్రాయాలి[మార్చు]

J +~ = వ్రాయమన్నారు కాని రాలేదు... చూడండి. జ్~అ, జ్~, Bhaskaranaidu (చర్చ) 03:13, 5 సెప్టెంబర్ 2012 (UTC)

తెలుగు లిప్యంతరీకరణం లో vij~nAnamu రాస్తే విజ్ఞానము వస్తుంది చూడండి. మరిన్ని వివరాలకు WP:TH చూడండి.--అర్జున (చర్చ) 04:26, 5 సెప్టెంబర్ 2012 (UTC)

బొమ్మలకు పేర్లివ్వండి[మార్చు]

నాయుడుగారు, మీరు బొమ్మలను అప్లోడ్ చేసేముందు బొమ్మలకు పేర్లు ఇవ్వండి. మీరు ఇటీవల అప్లోడ్ చేసిన బొమ్మలను గమనిస్తే DSC... అని ఉంది. కెమెరా నుంచి సరాసరిగా కాకుండా మీ సిస్టంలో బొమ్మ పేరును మార్చి అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసే ముందు అలాంటి బొమ్మలు ఉన్నాయా లేవా అని కూడా చూడండి. అంతేకాకుండా అప్ళోడ్ చేసే బొమ్మలను వ్యాసాలలో చేర్చండి. ఎలాంటి వ్యాసాలలో పొందుపర్చబడని బొమ్మలు తర్వాత తొలిగించబడతాయి. మీ శ్రమ వృధాకావచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:43, 2 డిసెంబర్ 2012 (UTC)

నాయుడు గారికి నమస్కారములు. మీకు సాంకేతిక పరమైన అంశాలపై ఎక్కువ అవగాహన లేకపోవుట వలన చేసినపని మళ్ళీ చేయుట జరుగుతున్నది. మొదటి నుండి కష్టపడి చేసిన ఒక వ్యాసం ఒక్కసారిగా తొలగిస్తే ఎవరికైనా బాధకలుగుతుంది. ముందుగా కొన్ని అవసరమైన కూని విషయాలు ప్రయోగశాల ద్వారా చేసి దానిని ఎలా వస్తున్నదీ చూసుకొంటూ మీకు కావలసిన వాటిని నేర్చుకోండి.తరువాత చెరిపేయండి. మీకు అనుమానాలుంటే ఎవరినైనా మీకు సహకరిస్తున్న వారిని అడగండి. ఇంకా బాగా తెలియాలంటే మీకు వీలుంటే హైదరాబాదు రాజశేఖర్ గారి వద్దకు వెళితే ఆయన మీకు అన్నీ వివరిస్తారు.విశ్వనాధ్ (చర్చ) 05:38, 4 డిసెంబర్ 2012 (UTC)

మన విశిష్ట దేవాలయాలు[మార్చు]

నాయుడుగారు, మీరు రచిస్తున్న మన విశిష్ట దేవాలయాలు వ్యాసంలో అనేక దేవాలయాల వివరాలు చేరుస్తున్నారు. ఆలా కాకుండా ఒక్కో దేవాలయానికి సంబంధించి ప్రత్యేక పేజీలోనే చేర్చి మూసల ద్వారా, వర్గాల ద్వారా వాటన్నింటినీ కలిపితే సరిపోతుంది. మన విశిష్ట దేవాలయాలలో వందలు వేల దేవాలయాల వివరాలు చేర్చిననూ తక్కువే, వ్యాస పరిమాణం మాత్రం చాలా పెరుగుతుంది. ఇప్పటికే దేవాలయాలపై పట్టిక వ్యాసం ఉంది. ఈ విషయం గమనించండి. ఇంకోవిషయం ఈ సమాచారం మీరు ఎక్కడి నుంచి గ్రహిస్తున్నారో మూలాల ద్వారా తెలియజేయండి. కాపీహక్కులు ఉల్లంఘించినట్లు గమనిస్తే వ్యాస సమాచారం పూర్తిగా తొలిగించబడుతుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:33, 23 డిసెంబర్ 2012 (UTC)


మన విశిష్ట దేవాలయాలు.... విషయమై వచ్చిన చర్చకు సమాదానము[మార్చు]

ఆర్యా..... గతంలో మన హిందు దేవాలయాలు వ్వాసంలో అధిక ప్రాముఖ్యత , అధిక ప్రజాదరణ కలిగిన దేశ వ్వాప్తంగా వున్న దేవాలయాల గురించి మాత్రమే వ్రాయడం జరిగింది. ఆ వ్వాసంలో ఆస్థాయిలో లేని దేవాలయాల వివరాలు కూడ కొన్ని వున్నాయి. వాటిని తొలిగించడము జరుగుతున్నది. ప్రస్తుతం మన విశిష్ట దేవాలయాలు అనే వ్వాసములో....... మన రాష్ట్రం లోని ప్రత్యేక లక్షణాలు, కొన్ని విశిష్టలు కలిగిన దేవాలయాల వివరాలను మాత్రమె చేర్చడము జరుగుతున్నది. అలాంటి వాటిని మాత్రమే గుదిగుచ్చి చూపడము ఈ వ్వాసం యొక్క ముఖ్యోద్దేశము. అలాంటివన్నీ కలిపితే సుమారు 40 -- 50 వరకు వుండొచ్చు. అంతేగాని మీరన్నట్టు వందలు వేలు కావు. అవసరమైన చోట మూలాలూ తెలియజేయడము జరుగుతున్నది. 05:33, 24 డిసెంబర్ 2012 (UTC)

నేను వ్యాసం చివరన మాత్రమే చూసి మూలాలు లేవని రాశాను. ఇప్పుడు చూస్తే మీరు ప్రతి దేవాలయ సమాచారానికి కిందుగా "మూలం" రాసినట్లు గమనించాను, కాని ఇలాంటి మూలం కాపీహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది. ఒకే మూలం నుంచి చాలా అధిక సమాచారం చేరుస్తున్నట్లుగా మూలం ద్వారా తెలుస్తోంది. ఏదేని వ్యాసం లేదా గ్రంథం నుంచి కొన్ని వాక్యాలు మాత్రమే తీసుకొని ఆ వాక్యాలకు మాత్రమే మూలాలు చేర్చాలి. మీ మూలాలన్నింటినీ మరోసారి పరిశీలిస్తాను. కాపీహక్కుల కిందకు వస్తే సమాచారం మొత్తం తొలిగించబడుతుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:49, 24 డిసెంబర్ 2012 (UTC)
జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు లాగా విశిష్ట దేవాలయాలకు ఎలాంటి నిర్దిష్ట సంఖ్య ఉండదు కాబట్టి ఇలాంటివి ఒకే వ్యాసంలో ఉండనవసరం లేదు. సమయం చూసుకొని వీటన్నింటినీ నేను విడగొట్టుతాను. అంతేకాకుండా పత్రికల నుంచి చాలా అధిక సమాచారం కాపీ చేయడంపై చాలా సార్లు చెప్పాను. అయిననూ మీరు వినడం లేదు. గతంలో మీరు చేర్చిన తెలంగాణా గడీలు సమాచారం కూడా ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం పుస్తకం నుంచి కాపీ చేయడం జరిగిందని గమనించాను. ఇలాంటి వ్యాసాలు తొలిగించబడతాయి. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:45, 27 డిసెంబర్ 2012 (UTC)

2012 లోమీ కృషికి అభివందనలు[మార్చు]

,--అర్జున (చర్చ) 06:57, 15 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

చిత్రాలు[మార్చు]

భాస్కరనాయుడు గారూ, ఇప్పటికిప్పుడు వ్యాసాలలో ఉపయోగించని బొమ్మలను కామన్స్ లోనికి ఎక్కిస్తే బాగుంటుంది. రెండు కారణాలు: (1) వికీపీడియా చిత్రాల భాండాగారం కాదు. అందుకు వికీమీడియా కామన్స్ సరైన చోటు. (2) కామన్స్‌లో అయితే, అన్ని వికీమీడియా ప్రాజెక్టులూ మీ చిత్రాలను ఉపయోగించుకునే వీలుంటుంది.

అక్కడ ఎక్కించడంలో ఇబ్బందులు ఉంటే తెలియజేయండి.

వీవెన్ (చర్చ) 00:34, 1 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

హైదరాబాదులో తెవికీ సమావేశం[మార్చు]

భాస్కరనాయుడు గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అభిప్రాయం తెలియ జేయండి. సమావేశానికి హాజరయ్యేవారి జాబితాలో మీ పేరు చేర్చండి.--t.sujatha (చర్చ) 17:28, 13 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఇందులో భాగంగా ముందు హైదరాబాదులోని తెలుగు వికీపీడియన్లు మార్చి 17 ఆదివారం, గోల్డెన్ త్రెషోల్డ్, కోఠి లో ఉదయం 10 గంటలకు కలుస్తున్నాము. దీనికి హాజరుకమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.Rajasekhar1961 (చర్చ) 09:06, 16 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]


తెలుగు వికీపీడియా మహోత్సవం 2013కు ఆహ్వానం[మార్చు]


Bhaskaranaidu గారికి నమస్కారం,

విజయ తెలుగు ఉగాదిని పురస్కరించుకుని, తెలుగు వికీపీడియా మహోత్సవం 2013ను 10 మరియు 11 ఏప్రిల్ 2013న జరుపుకుంటున్నాం. ఇది హైదరాబాదులోని గోల్డెన్ థ్రెషోల్డ్‍లో జరుగనుంది.
దయచేసి ఉత్సవ నమోదు పత్రం వద్ద తమ పేరును నమోదు చేసుకోగలరు.
హైదరాబాదు బయట నుండీ వచ్చేవారికి దారి ఖర్చులు చెల్లింపబడతాయి.

వికీపీడియా సభ్యులుగా మీరు చేస్తున్న విశేష కృషికి అభినందనలు. ఈ సమావేశంలో హాజరయి, మీ అనుభవాలు మిగితా సభ్యులతో పంచుకుంటారని ఆశిస్తున్నాం. మీరు రాలేని పక్షంలో దయచేసి మీ సందేశాన్ని పాఠ్యం/ఆడియో(శ్రవ్యకం)/దృశ్యకం(వీడియో) రూపంలో ఇక్కడ పొందుపరచగలరు. మీ రచనలకూ, మీ విశేష కృషికీ ధన్యవాదాలు.

మీ రాకకై నిరీక్షిస్తూ ఉంటాము. రహ్మానుద్దీన్ (చర్చ) 07:41, 2 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

గండపెండేరం[మార్చు]

మీ సభ్యపేజీలో ఒక గండపెండేరాన్ని బహుకరించాను. చూడండి.Rajasekhar1961 (చర్చ) 16:28, 7 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

విశేష గణాంకాల పేజీలు[మార్చు]

నమస్కారం మీరడిగిన విధంగా విశేష గణాంక పేజీలు ఇక్కడ ఇస్తున్నాను : వికీసోర్స్, విక్షనరీ ఇంకా వికీపీడియా

బెజవాడ గోపాలరెడ్డి వ్యాసము[మార్చు]

మీరు వ్రాయాలనుకున్న వ్యాస విషయాలను "బెజవాడ గోపాలరెడ్డి" వ్యాసము [2]లో ఉండాలి. నా చర్చా పేజీలోనిది నా "ప్రయోగము" కోసము మాత్రమే. నా పుటలోనిది ఆశాశ్వతమైనది, అది ఉండదు కూడా. మీ వ్యాస భాగాలను నా చర్చా పేజీలోనుండి తొలగించ వలయును. కావున గమనించి మార్పులు చేయండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 01:45, 13 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంధ్రప్రదేశ్.... జిల్లాల వారీగా విస్తీర్ణం... జనాబా వివరాలు[మార్చు]

పై విషయానికి సంబందిచిన వివరాలు చేర్చాలంటే కుదరడం లేదు.... నా ప్రయత్నం చూడండి. తెలిసిన వారు సులబ మార్గం చెప్ప గలరు. 08:08, 15 ఏప్రిల్ 2013 (UTC)08:08, 15 ఏప్రిల్ 2013 (UTC)భాస్కరనాయుడు/.

భాస్కరనాయుడు గారూ ! మీరు ఆరంభంలో పల్లెవాసుల జీవనవిధానం వ్యాసంలో ఎక్కించిన దస్త్రాలలో ఉన్న లైసెంస్ మార్చి {{సొంత కృతి|GFDL-no-disclaimers|cc-by-sa-2.5,2.0,1.0}} ఈ లైసెంస్ చేర్చారంటే ఈ చిత్రాలను విక్షనరీ వంటి ఇతర అనుబంధ వికీలలో వాడుకునే వీలు కలుగుతుంది. శ్రమ అనుకోకుండా ఆ దస్త్రాలలో లైసెంస్ మార్చారంటే వాటిని విక్షనరీలో కూడా ఉపయోగించవచ్చు. --t.sujatha (చర్చ) 14:11, 29 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

Hello Bhaskaranaidu, sorry to speak English but I do not know your language. I would like to know if దేవరకొండ refers to same thing that the English article Devarakonda? From the maps, I am thinking it is but since I do not speak Telugu, I am not sure. I am telling you that because I would like to merge the interwiki links on wikidata. Thanks in advance. Pamputt (చర్చ) 18:59, 11 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

yes, both are same.
Thank you. Pamputt (చర్చ) 08:36, 24 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

అధికార హోదాకు మద్దతు[మార్చు]

మీరు నాయొక్క అధికారిక హోదాకు మద్దతునిచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు వికీపీడియా అభివృద్ధికి నావంతు కృషి చేస్తానని హామీ యిస్తున్నాను.Rajasekhar1961 (చర్చ) 10:03, 13 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరి పేజీలో సంప్రదింపు సమాచారం[మార్చు]

భాస్కరనాయుడు గారూ, మీ వాడుకరి పేజీలో సంప్రదింపులకు సమాచార?ం, మీ ఈమెయిల్ ఐడీ చేర్చగలరు. రహ్మానుద్దీన్ (చర్చ) 07:21, 26 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నామైల్ ఐడి. ellankibhaskaranaidu@gmail.com. (నేను మెయిల్ చూడడము/పంపడము.. తక్కువ... ఈBhaskaranaidu (చర్చ) 07
42, 26 మే 2013 (UTC)

అమర్‌నాథ్ యాత్ర[మార్చు]

అమర్‌నాథ్ వ్యాసం ఇప్పటికే ఉన్నది. ఒకసారి చూడండి. యాత్ర విశేషాలను అందులో లేనివి చేర్చండి.Rajasekhar1961 (చర్చ) 02:44, 11 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

పేజీల్లో సంజ్ఞలు[మార్చు]

భాస్కరనాయుడు గారూ, మీరు పేజీల్లో ప(పు/3/160) ఇలాంటి సంజ్ఞలు చేర్చటం చూశాను. ఏమిటివీ? ఉత్సుకతతో అడుగుతున్న ప్రశ్నే ఇది --వైజాసత్య (చర్చ) 08:40, 2 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

పుటలలో నేను వ్రాసిన కొన్ని సంజ్ఞల గురించి[మార్చు]

వైజాసత్య గారూ................ ముందుగా..... మీ నిశిత దృష్టికి ధన్య వాదాలు. ఈ మధ్యన.... ముఖ్యంగా పది రోజుల నుండి...... నేను ప్రారంబించిన వ్వాసాలలో వెంటనే ఎవరో అందులో అక్షర దోష నివారణ కొరకో మరెందులకో....... వెంట నే ప్రవేసించి అందులో దానిని కెలికి నందున ఘర్షణ ఏర్పడి అప్పటివరకు నేను వ్రాసిన వ్వాస భాగమంతా..... పోయినది. భద్ర పరచ బడలేదు. ఈ విషమై రచ్చ బండ లో వ్రాయడము..... దానికి అర్జున రావు గారు ఒక ఉపాయం చెప్పడమూ కూడ మీరు గమనించే వుంటారు. ఆందు చేత నేను మున్ముందు విస్తరించ బోయే వ్వాసాలను నాలుగైదు వ్వాసాలాలను ఒక పేరుతో ప్రారంబించి ...... ఒక గుర్తు పెట్టుకుని వదిలేస్తున్నాను..(తిరిగి వాటిని కొన సాగించ వలసి వస్తే...... ఆ వ్వాసాలు నా పుస్తకాలలొ ఎక్కడున్నాయో తెలుసుకోవడానికి ఒక గుర్తు పెట్టుకున్నాను) ఇంత లోపల గతంలో లాగ ఎవరైనా అందులో ప్రవేశించి .... ఏమైనా మార్పులు చేసినా.... తొలిగించినా..... ఇంకా ఏమైనా చేసినా గతంలో లాగ నాశ్రమ వృథా కాకుండా వుండుటకు........ అప్పటికీ నావ్వాస భాగాలు మిగిలి వుంటే .... వాటిని కొనసాగించుటకు.... వీలుగా... ఆ యా వ్వాసాలున్న ఆధారిత గ్రంధాల పుటలను సాంకేతింగా గుర్తు కొరకు నాకొరకు నేను వుంచుకున్నవి మాత్రమే. ఆ సంజ్ఞను అనుసరించి నావద్ద వున్న మూల గ్రంధాల పుటలోకి సులబంగా వెళ్ళడాని నాకొరకు నేను పెట్టుకున్న గుర్తులు మాత్రమే. ఆయా వ్వాసాలు కొనసాగించే టప్పుడు ఆ గుర్తులను తొలిగించి వ్వాసాన్ని కొనసాగిస్తాను. దీనికి ఎవరికీ ఎటువంటి అబ్యంతరమూ వుండదని నేననుకుంటున్నాను. ఒక వ్వాసాన్ని ప్రారంబించే ముందు అది ఇదివరకే వున్నదా.... లేదా అన్న విషయాన్ని సరిచూసుకునే ప్రారంబిస్తున్నాను. అయినా పేరులో చిన్న మార్పు వుంటే ఆ వ్వాసము లేదు .... అనీ సృస్జించ మని సందేశం వస్తున్నది. నిజానికి ఆ వ్వాసం పేరులో చిన్న మార్పుతో ఇదివరకే వుండి వుండవచ్చు. ఉండే అవకాశము మెండుగా వున్నది. కనుక ప్రాథమికంగా వ్వాసాన్ని నేను వ్రాసిన ఈ విధంగా వ్రాసి వదిలేస్తే సహచర వాడుకరులు గమనించి ఈ వ్వాసము వున్నది.... అందులో దీనిని విలీనము చేయ వచ్చును అనే సందేశం సందేశం రాకుండా వుండేందుకే నా ఈ చిన్న చిట్కా.

చివరగా....... నావ్వాసాలను గమనిస్తున్నందుకు నెనరులు. వాడుకరి భాస్కరనాయుడు. Bhaskaranaidu (చర్చ) 10:59, 2 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

దస్త్రం పేర్లు[మార్చు]

భాస్కరనాయుడు గార్కి నమస్కారములు,
మీరు మంచి దస్త్రాలను ఎక్కిస్తున్నందుకు ధన్యవాదాలు. కానీ వాటిని వాటి పేర్లతో ఎక్కిస్తే ఇంకా ఏదైనా వ్యాసాలలో వికిపీడియనులు వినియోగించుకొనే వీలుంటుంది. మీరు DSC05938.JPG అని ఎక్కిస్తే అది ఏ చిత్రమో గమనించడం కష్టం అని నా అభిప్రాయం. దయచేసి ఈ విషయం పరిశీలించగలరు.---- కె.వెంకటరమణ చర్చ 17:03, 25 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మహాభారత వీధి నాటకోత్సవం[మార్చు]

మీరు తయారుచేస్తున్న వ్యాసం చిత్తూరు జిల్లాలోని మహాభారత వీధి నాటక ఉత్సవాలు జరిగే తీరు చాలా బాగుంది. పేరు చాల పెద్దదిగా ఉన్నది. దానికి మహాభారత వీధి నాటకోత్సవం గా మార్చాను. గమనించండి. అన్యధా భావించవద్దు.Rajasekhar1961 (చర్చ) 16:00, 5 ఆగష్టు 2013 (UTC)

పతకం[మార్చు]

తెలుగు మెడల్

వికీపీడియా ఉగాది మహోత్సవాన్ని ఊహాస్థాయినుండి అభివృద్ధిచేసి ఘనంగా నిర్వహించుటలో తోడ్పడినందులకు కృతజ్ఞతాసూచకంగా అందుకోండి ఈ పతకం .--అర్జున (చర్చ) 10:55, 16 ఆగష్టు 2013 (UTC)

మట్టి పాత్రలు[మార్చు]

మీరు కొత్తగా చేర్చిన చిన్న వ్యాసాలన్నింటిని మట్టిపాత్రలు అనే వ్యాసంగా కలిపితే బాగుంటుంది. ఆలోచించండి.Rajasekhar1961 (చర్చ) 06:32, 23 ఆగష్టు 2013 (UTC)

అలాగే చేయండి. పల్లె వాసుల జీవన విధానము అనే ప్రధాన వ్వాసంలో..... కొన్ని వస్తువుల పేర్లున్నాయి, గృహోపకరణాలు, వ్వవసాయ పనిముట్లు, మొదలగునవి. వాటి గురించి కొంతైనా వివరణ ఇస్తే బాగుంటుందని ..... వాటి వివరాలు వ్రాసాను. అటు వంటి వస్తువులకు .....ఒక్కొక్క దానికి ఒక వ్వాసము తయారు కాదు. కొన్ని వాఖ్యాలు మాత్రమే చేర్చగలము. కనుక మీరన్నట్టుగా చేస్తేనే బాగుంటుంది. Bhaskaranaidu (చర్చ) 14:39, 23 ఆగష్టు 2013 (UTC)
బంకమన్ను తదితర పదార్థాలతో తయారుచేసిన వస్తువులను "మృణ్మయ పాత్రలు" అంటారు. ఈ పేరు పెట్టినా బాగుంటుందని నా అభిప్రాయం.---- కె.వెంకటరమణ చర్చ 16:23, 23 ఆగష్టు 2013 (UTC)

దస్త్రాలు[మార్చు]

మీరు "ఈగ" మరియు "పోపులపెట్టె" చిత్రాలను ఒకే ఫైల్ పేరుతో అప్ లోడ్ చేశారు. "ఈగ" యొక్క ఫైల్ నేమ్‌ మార్చి అప్ లోడ్ చేయండి.---- కె.వెంకటరమణ చర్చ 11:28, 25 ఆగష్టు 2013 (UTC)

మీరు చేరుస్తున్న చిత్రాల పేర్లు సంఖ్యలుగా ఉన్నాయి. ఉదా: DSC06481.JPG యిలా! ఈ చిత్రం దేనికి సంబందించినదీ వాడుకరులకు తెలియదు. అందువల్ల మీరు ఇంత శ్రమపడి చేరుస్తున్న చిత్రాలు యితరులు వ్యాసాలు వాడుకొనుటకు యిబ్బంది పడే అవకాశం ఉంది. మీరు చేరుస్తున్న విశేషమైన చిత్రాలను వాటి పేరు తో అప్‌లోడ్ చేస్తే వాడుకరులు వాటి వ్యాసాలలో చేర్చేందుకు అవకాశం ఉంటుంది. దయచేసి గమనించగలరు. ఈ రోజు మీరు అప్‌లోడ్ చేసిన చిత్రం "పోపులపెట్టే" దీనిని మీరు DSC06481.JPG గా అప్‌లోడ్ చేశారు. ఈ ఫైల్ నేమ్‌ చూస్తే అది పోపుల పెట్టె అని ఎలా అర్థమవుతుంది? మీరు దస్త్రాన్ని ఎక్కించే ముందు ఆ ఫైల్ నేమ్‌ను "populapette" గా రీ నేమ్‌ చేసి తర్వాత ఎక్కిస్తే బాగుంటుందని నా అభిప్రాయం---- కె.వెంకటరమణ చర్చ 11:43, 25 ఆగష్టు 2013 (UTC).


పైన కనబరచిన చిత్రాలు పొరబాటున పేరు లేకుండా ఎక్కి పోయాయి. ఇప్పుడు వాటిని తొలిగించాలంటే కుదరడం లేదు. వాటిని ఎవరైనా తొలిగిస్తే తిరిగి పేరుతో ఎక్కిస్తాను. Bhaskaranaidu (చర్చ) 07:36, 27 ఆగష్టు 2013 (UTC)

DSC06481.JPG చిత్రాన్ని తొలగించాను. దాని పేరుతో ఎక్కించగలరు.---- కె.వెంకటరమణ చర్చ 07:43, 27 ఆగష్టు 2013 (UTC)

క్రొత్త వ్యాసాల గూర్చి[మార్చు]

మీరు క్రొత్త వ్యాసాలు చేర్చుతున్నందుకు ధన్యవాదాలు. మీరు వ్యాసాలను యధాతథంగా చేర్చుతున్నారు. వాటిని వికీకరణలు చేయాలి. వర్గాలను చేర్చాలి. శేషగిరిరావుగారు వారి వ్యాసాలలో చేర్చిన మూలాలను చేర్చాలి. మీరు సృష్టిస్తున్న వ్యాసాలు యిదివరకు తెవికీ లోఉన్నాయో లేదో పరీక్షించుకొని క్రొత్త వ్యాసాలు ప్రారంభించండి. వికీకరణలకు సమయం లేనపుడు వ్యాసం పైభాగంలో {{వికీకరణ}} మూసను, వర్గీకరణలకు సమయం లేనపుడు {{వర్గీకరణ}} వ్యాసాల శుద్ధి కొరకు {{శుద్ధి}} వంటి మూసలను ఉంచండి. ఎవరైనా సభ్యులు వాటిని వికీకరిస్తారు. ధన్యవాదములు.---- కె.వెంకటరమణ చర్చ 05:38, 1 సెప్టెంబర్ 2013 (UTC)

కొన్ని వ్యాసాలకు వికీకరణలను చేసి సమాచార పెట్టెలను, చిత్రాలను చేర్చాను. అవి గమనించండి. వాటికి వికీకరణ మూసలు అవసరం లేదు.---- కె.వెంకటరమణ చర్చ 10:21, 1 సెప్టెంబర్ 2013 (UTC)
తెవికీ లో వ్యాసాలు చేర్చునపుడు అవి యిదివరకు అక్షరభేదాలలో ఉన్నవో లేదో ఒకసారి పరీక్షించగలరు. యిదివరకు లెనట్లైతె క్రొత్తవ్యాసం ప్రారంభించండి. మీరు ఆర్యభట్టు అని యిదివరకు ఉన్న వ్యాసమే మరలా సృష్టిస్తున్నారు. ఒకసారి పరిశీలించి క్రొత్త వ్యాసాలు చేర్చగలరు. కొత్త వ్యాసాలు చేరుస్తున్నందుకు ధన్యవాదాలు.---- కె.వెంకటరమణ చర్చ 08:00, 3 సెప్టెంబర్ 2013 (UTC)

మూలాలు[మార్చు]

సూచికలు బదులుగా మూలాలు అని రాయటం వికీలో సంప్రదాయం. అదేపేజీకి లింకులను మూలాలుగా చేర్చవద్దు. పొరపాటుకు ఉదాహరణ--అర్జున (చర్చ) 13:47, 8 సెప్టెంబర్ 2013 (UTC)

భాస్కరనాయుడు గారూ, ఒక వికీ వ్యాసానికి మరో వికీ వ్యాసం మూలంగా అంగీకరించరు. ఎందుకంటే వికీ వ్యాసాలు ఎవరైనా సృష్టించవచ్చు. కాబట్టి ప్రామాణికత లేదు. అందుకే పిల్లికి ఎలక సాక్ష్యంగా ఒక వికీ వ్యాసానికి మరో వికీ వ్యాసం వత్తాసు పలకలేదు --వైజాసత్య (చర్చ) 04:53, 12 సెప్టెంబర్ 2013 (UTC)

చిత్రాల గూర్చి[మార్చు]

మీరు అనేక మైన చిత్రాలను చేరుస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ మధ్య అనేక చిత్రాలను చేర్చారు. వాటిని సంబంధిత వ్యాసాలలో చేర్చితే బాగుంటుంది. వాటిని సంబంధిత వ్యాసాలలో చేర్చాను. ప్రస్తుతం ఒక చిత్రాన్ని [[దస్త్రం:DSC00168.JPG]] గా ఎక్కించారు. దీని శీర్షిక ప్రకారం మశూచి వ్యాధి గ్రస్తుడు అని ఎలా గుర్తించాలి? మీరు చిత్రాల శీర్షికలను అలా పెట్టకుండా జాగ్రత్త వహించండి. మీరు సరైన శీర్షికతో ఉంచితే ఎవరికైనా ఉపయోగపడతాయి.---- కె.వెంకటరమణ చర్చ 12:29, 1 అక్టోబర్ 2013 (UTC)

కెమెరా నుంచి బొమ్మలను సిస్టంలోకి డైన్‌లోడ్ చేసిన పిదప బొమ్మలపై రైట్‌క్లిక్ చేసి రీనేమ్‌ ఇస్తే సమస్య పరిష్కారమౌతుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 12:40, 1 అక్టోబర్ 2013 (UTC)

చిత్రాల గురించి[మార్చు]

ఆర్యా.... నా వ్రాతలను గమనిస్తున్నందుకు ధన్య వాదములు. మరియు చర్చించి నందుకుకూడ నెనరులు. అలా గమనిస్తుంటే వ్రాసేవారు జాగ్రత్త వహించి వ్రాస్తారు. ఇక చిత్రాల గురించి.

మీరు పైన చెప్పిన చిత్రాలు నిజానికి నేను స్వతంగా తీసినవి కావు. బొమ్మలు పెట్టడానికి వున్న విధి విధానలలో.... ఒకటి. ఎక్కడో దొరికిన బొమ్మలు పెట్టకూడనే నిబంధన క్రిందికి ఇది వస్తుంది. వికీ సోర్సు లో అంటు వ్వాధులు అనే పుస్తకాన్ని తిరుగు సేత చేస్తున్నాను. అందులో కొన్ని బొమ్మలు వున్నాయి. ఆ బొమ్మలనే ఫోటో తీసి ఆ పుస్తకములోనే (తిరుగు సేతలో) పెట్టాలని నాయీ ప్రయోగ ప్రయత్నము. ఎవరో తీసిన బొమ్మలను వారు వ్రాసిన పుస్తకములో పెట్టితే తప్పుకాదని తలచి చేసిన ప్రయోగ ప్రయత్నము అది. అంతే కాని ఆ బొమ్మలను నేను తీసినట్లు సర్వ జనీకము చేయాలని ఉద్దేశము నాకు లేదు. నా ప్రయోగము పూర్తిగా ఫలించ లేదు. బొమ్మలు ఆ పుస్తకములో చాల వరకు ఎక్కలేదు. పైగా స్పస్టత సరిగా లేదు. పరిమాణము కూడ చిన్నదిగా వున్నవి. మీరొక్క సారి వికీసోర్సు లో అంటు వ్వాదులు అనే దానిలో చూడండి. కొన్నిబొమ్మలకు పేరు( చిత్రము సంఖ్య) మాత్రమే వున్నది. బొమ్మ కానరాదు. అవి సరిగా లేనందున నా ప్రయత్నము మాని వేశాను. అవకాశముంటే ఆ యా బొమ్మలను నేనే గీసి ఆపుస్తకములొ ఆ యా పుటలలో చేరుస్తాను. ఈ విషయంలో ... అనగా ఆయా బొమ్మలను నేనే గీసి (అవకాశమున్నంత వరకు.... ) చేర్చ వచ్చునా? కూడదా? అనే విషయం మీద మీ అబిప్రాయాన్ని, సలహాలను తెలియ జేయండి.

మరొక్క మాట: గతంలో నా స్వంత బొమ్మలను చేర్చు నపుడు పొరబాటున కొన్ని బొమ్మలకు పేర్లు పెట్టకుండా పొరబాటున ఎక్కించడం జరిగింది. కాని ప్రస్తుత బొమ్మలు ఒక ప్రత్యేక పుస్తకానికి మాత్రమే ఆ పుస్ర్తకంలో వున్న వాటినే ఫోటో తీసి పెట్ట ప్రయత్నించాను. అలా చేర్చిన బొమ్మలు ఆ పుస్తకానికి మాత్రమే పరిమితం అవకుండా సార్వ జనీకం అవుతున్నట్టు కూడ గనమించాను కొంత ఆలస్యంగా.. బొమ్మలకు పేర్లు పెట్టకుండా కొన్ని వున్నాయి. కొన్ని పేర్లతో వున్నాయి. (మీరు ఆ బొమ్మలకు పేరు పెట్టమని అన్నారే... కాని మరే విధమైన అబ్యంతరము చెప్పలేదు. కానీ నాకు అబ్యంతరమున్నది. కాని నాకు అబ్యంతరమున్నది. అవి నా స్వంత బొమ్మలు కాదు గనుక) మీరు ఈ విషయంలో స్పందించక పోయిననూ..... నాకు వ్వక్తి గతంగా అబ్యంతరమున్నది. వాటిని ఆపుస్తకానికే పరిమితం చేసి మిగతా వాడుకరులకుపయోగ పడకుండా చేయాలని వాటిని తొలిగించే ప్రయత్నం చేసినా నా ప్రయత్నము ఫలించ లేదు. కనుక మీరు ఆ బొమ్మలన్నీ త్వరగా పూర్తిగా తొలిగిస్తే నాకు సహకారులగుదురని భావిస్తున్నాను. ఎందుకంటే అవి నా స్వంత చిత్రాలు కాదు గనుక.Bhaskaranaidu (చర్చ) 14:37, 1 అక్టోబర్ 2013 (UTC)

అప్పలాయగుంట వేంకటేశ్వరాలయం[మార్చు]

మీరు జూన్ 24 2013అప్పలాయగుంట వేంకటేశ్వరాలయం అనే వ్యాసాన్ని సృష్టించారు. మరల అదే వ్యాసం ప్రస్తుతం "అప్పలాయ గుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం " అనే పేరుతో సృష్టించారు. ఈ రెండు వ్యాసాలు విలీనం చేస్తే బాగుంటుంది. రెండవ వ్యాసాన్ని మొదటి వ్యాసానికి దారిమార్పు చేస్తే బాగుంటుంది. మీ అభిప్రాయం తెలుపగలరు.---- కె.వెంకటరమణ చర్చ 06:33, 7 అక్టోబర్ 2013 (UTC)


అప్పలాయగుంట వేంకటేశ్వరాలయము, . 2. నాగలాపురం.... కొత్త వ్వాసాల సృష్టి గురించి[మార్చు]

ఈ రెండు వ్వాసాలను ఏనాడో వ్రాశాను. ఈరోజు న...... వికీపీడియాలో వివరిస్తుంటే...... ఒక చోట భారత దేశములో హిందు దేవాలయాలు.... అందులో రాష్ట్రాల వారుగా ఒక వ్వాసము కనబడ్డది. దానిలో ఆంధ్ర ప్రదేశ లోని దేవాలయాలు అని కొన్ని దేవాలయాల వివరాలున్నాయి. అందులో ఈ రెండు ఆలయ వివరాలు లేవు. అవి కూడ వుంటే బావుంటుందని ఇదివరకు నేను చేర్చిన సమాచారము ను ఇందులో చేర్చాను. అంతే గాని క్రొత్తగా మరొక సృష్టించ లేదు. ఒకే విషయము రెండు సార్లు వుండడము సమంజసం కాదని నా అభిప్రాయము. విలీనంకన్న పూర్తిగా తొలిగిస్తేనే మంచిదేమో ఆలోశించండి. మరొక విన్నపం. ఇటువంటి చిన్న చిన్న విషయాలకు వారి వారి అభిప్రాయాలను అడగడము.... వారి స్పందన కొరకు ఎదురు చూడడము..... అన్నది మీ సమయం వృధా కదా. ఇది సబ్యులకు మీరిచ్చే గౌరవ మేమో. కనీసం నా విషయంలో నైనా నా అభిప్రాయాలను అడకుండా తెవికి అభివృద్ధి దృష్యా మీరు చేయ వలసినది చేసేయండి...... చివరగా ఇలా చేశామని అవసరమనుకుంటే చెప్పండి. అది చాలు. Bhaskaranaidu (చర్చ) 14:27, 7 అక్టోబర్ 2013 (UTC)

వేదనారాయణ స్వామి ఆలయం. నాగలాపురమ్[మార్చు]

మీరు మే 26 , 2013వేదనారాయణస్వామి ఆలయం అనే వ్యాసాన్ని సృష్తించి విస్తరించారు. మరల ప్రస్తుతం అదే పేరుతో వేదనారాయణ స్వామి ఆలయం. నాగలాపురమ్ గా మరో వ్యాసాన్ని అదే విషయంతో సృష్టించారు. వాటిని విలీనం చేస్తే బాగుంటుంది. మీ అభిప్రాయం తెలుపగలరు.---- కె.వెంకటరమణ చర్చ 06:43, 7 అక్టోబర్ 2013 (UTC)

File copyright problem with దస్త్రం:3.JPG[మార్చు]

Thank you for uploading దస్త్రం:3.JPG. However, it currently is missing information on its copyright and licensing status. Wikipedia takes copyright very seriously. It may be deleted soon, unless we can verify that it has an acceptable license status and a verifiable source. Please add this information by editing the image description page. You may refer to the image use policy to learn what files you can or cannot upload on Wikipedia. The page on copyright tags may help you to find the correct tag to use for your file. If the file is already gone, you can still make a request for undeletion and ask for a chance to fix the problem.

Please also check any other files you may have uploaded to make sure they are correctly tagged. Here is a list of your uploads.

If you have any questions, please feel free to ask them at the media copyright questions page. Thanks again for your cooperation. అర్జున (చర్చ) 09:45, 19 అక్టోబర్ 2013 (UTC)

File copyright problem with దస్త్రం:Po (2).JPG[మార్చు]

Thank you for uploading దస్త్రం:Po (2).JPG. However, it currently is missing information on its copyright and licensing status. Wikipedia takes copyright very seriously. It may be deleted soon, unless we can verify that it has an acceptable license status and a verifiable source. Please add this information by editing the image description page. You may refer to the image use policy to learn what files you can or cannot upload on Wikipedia. The page on copyright tags may help you to find the correct tag to use for your file. If the file is already gone, you can still make a request for undeletion and ask for a chance to fix the problem.

Please also check any other files you may have uploaded to make sure they are correctly tagged. Here is a list of your uploads.

If you have any questions, please feel free to ask them at the media copyright questions page. Thanks again for your cooperation. అర్జున (చర్చ) 09:58, 19 అక్టోబర్ 2013 (UTC)

File copyright problem with దస్త్రం:Ameba.JPG[మార్చు]

Thank you for uploading దస్త్రం:Ameba.JPG. However, it currently is missing information on its copyright and licensing status. Wikipedia takes copyright very seriously. It may be deleted soon, unless we can verify that it has an acceptable license status and a verifiable source. Please add this information by editing the image description page. You may refer to the image use policy to learn what files you can or cannot upload on Wikipedia. The page on copyright tags may help you to find the correct tag to use for your file. If the file is already gone, you can still make a request for undeletion and ask for a chance to fix the problem.

Please also check any other files you may have uploaded to make sure they are correctly tagged. Here is a list of your uploads.

If you have any questions, please feel free to ask them at the media copyright questions page. Thanks again for your cooperation. Rajasekhar1961 (చర్చ) 10:07, 19 అక్టోబర్ 2013 (UTC)

కాపిరైట్ హక్కులు.... బొమ్మలు..[మార్చు]

ఆర్యా

ఈ విషయములో నా వివరణ ఏమంటే. అంటు వ్యాధులు అనే గ్రంధంమును లిప్యంతీకరణ చేస్తూ ఆ మూల గ్రంధంలోని బొమ్మలను అదే గ్రంధంలో చేర్చాను (వికీసోర్సు) లొ. కనుక వాటిని నావిగా చెప్పుకోలేను. కనుక వాటిని తొలిగిస్తే మంచి దేమో తెలుపగలరు. మరి కొన్ని నేను తీసిన ఫోటులు కూడ కొన్ని వుండ వచ్చును. వాటిని తమరి సూచనమేరకు సవరిస్తాను. Bhaskaranaidu (చర్చ) 15:14, 20 అక్టోబర్ 2013 (UTC) {{subst:idw|1=Ganesf q.JPG}}

అప్లోడు చేసినవారికి: మీరు ఇప్పుడే అప్లోడుచేసిన దస్త్రం:1.... Ega.JPG అనే పేరుగల ఫైలు, వికీపీడియా తొలగింపు విధానం అనుసరించి తొలగించబోతున్నారు, దానికి కారణం ఈ బొమ్మను/ఫైలును ఉపయోగించుకోగలిగే అధికారం వికీపీడియాకు మాత్రమే ఇచ్చారు. వికీపీడియా అంతటా ఉచితంగా/స్వేచ్చగా వాడుకోవడానికి ఈ పద్దతి బాగానే ఉన్నా, ఇతరులు వాడుకోవడానికి అవకాశం లేకపోవటం వలన, ఇది వికీపీడియా నిబంధనలకు అనుగుణంగా లేదు అని చెప్పవచ్చు. [3] [4] దయచేసి ఇటువంటి ఆంక్షలతో మరిన్ని బొమ్మలను/ఫైల్లను ఎక్కించకండి. వికీపీడియాలోని సమాచారం మొత్తం GFDL లైసెన్సుతో ఎవరయినా స్వేచ్చగా పంచుకోవడానికి మార్చుకోవడానికి సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడానికి ఉపయోగిస్తారు. మరింత సమాచారం కోసం ఉచితం/స్వేచ్చాయుతం కాని సమాచార మార్గదర్శకాలు చూడండి.

ఈ మీడియా ఫైలును మీరే తయారు చేస్తే, దానిని వికీపీడియా ఉంచాలని నిర్ణయించుకుంటే గనక, ప్రస్తుత మున్న ఈ సందేశాన్ని తొలగించేసి GFDL లైసెన్సుతో ఇవ్వాలనుకుంటే {{GFDL-సొంతకృతి}} అని, లేదా క్రియేటివ్ కామన్స్ లైసెన్సుతో వికీపీడియా లాంటి వాటికి మాత్రమే ఇవ్వాలనుకుంటే {{cc-by-sa-2.5}} అని, లేదా ఎవరయినా ఎటువంటి పనికైనా వాడుకునే విధంగా అయితే {{PD-సొంతకృతి}} అని చేర్చండి.

ఈ మీడియా ఫైలును మీరు తయారు చేయకపోయినా, వికీపీడియాలో ఉంచుదామని అనుకుంటే గనక ఈ క్రింది విధానాలలో ఒకటి ఎన్నుకోండి. మొదటిది, మీరు ప్రస్తుతమున్న ఈ సందేశాన్ని ఏదో ఒక FAIR USE మూసతో మార్చవచ్చు. రెండోది, ఈ బొమ్మకు సంబంధించిన కాపీహక్కులు కలిగిన వారిని సంప్రదించి వారిని ఈ ఫైలుని ఏదో ఒక ఉచిత లైసెన్సుతో విడుదల చేయమని అభ్యర్ధించండి.

మీకు ఇంకేమయినా సందేహాలు ఉంటే గనక వాటిని మీడియా కాపీహక్కుల ప్రశ్నల పేజీలో ఆడగండి. ధన్యవాదాలు

పాలగిరి (చర్చ) 16:43, 22 అక్టోబర్ 2013 (UTC)
అప్లోడు చేసినవారికి: మీరు ఇప్పుడే అప్లోడుచేసిన దస్త్రం:Iga.JPG అనే పేరుగల ఫైలు, వికీపీడియా తొలగింపు విధానం అనుసరించి తొలగించబోతున్నారు, దానికి కారణం ఈ బొమ్మను/ఫైలును ఉపయోగించుకోగలిగే అధికారం వికీపీడియాకు మాత్రమే ఇచ్చారు. వికీపీడియా అంతటా ఉచితంగా/స్వేచ్చగా వాడుకోవడానికి ఈ పద్దతి బాగానే ఉన్నా, ఇతరులు వాడుకోవడానికి అవకాశం లేకపోవటం వలన, ఇది వికీపీడియా నిబంధనలకు అనుగుణంగా లేదు అని చెప్పవచ్చు. [5] [6] దయచేసి ఇటువంటి ఆంక్షలతో మరిన్ని బొమ్మలను/ఫైల్లను ఎక్కించకండి. వికీపీడియాలోని సమాచారం మొత్తం GFDL లైసెన్సుతో ఎవరయినా స్వేచ్చగా పంచుకోవడానికి మార్చుకోవడానికి సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడానికి ఉపయోగిస్తారు. మరింత సమాచారం కోసం ఉచితం/స్వేచ్చాయుతం కాని సమాచార మార్గదర్శకాలు చూడండి.

ఈ మీడియా ఫైలును మీరే తయారు చేస్తే, దానిని వికీపీడియా ఉంచాలని నిర్ణయించుకుంటే గనక, ప్రస్తుత మున్న ఈ సందేశాన్ని తొలగించేసి GFDL లైసెన్సుతో ఇవ్వాలనుకుంటే {{GFDL-సొంతకృతి}} అని, లేదా క్రియేటివ్ కామన్స్ లైసెన్సుతో వికీపీడియా లాంటి వాటికి మాత్రమే ఇవ్వాలనుకుంటే {{cc-by-sa-2.5}} అని, లేదా ఎవరయినా ఎటువంటి పనికైనా వాడుకునే విధంగా అయితే {{PD-సొంతకృతి}} అని చేర్చండి.

ఈ మీడియా ఫైలును మీరు తయారు చేయకపోయినా, వికీపీడియాలో ఉంచుదామని అనుకుంటే గనక ఈ క్రింది విధానాలలో ఒకటి ఎన్నుకోండి. మొదటిది, మీరు ప్రస్తుతమున్న ఈ సందేశాన్ని ఏదో ఒక FAIR USE మూసతో మార్చవచ్చు. రెండోది, ఈ బొమ్మకు సంబంధించిన కాపీహక్కులు కలిగిన వారిని సంప్రదించి వారిని ఈ ఫైలుని ఏదో ఒక ఉచిత లైసెన్సుతో విడుదల చేయమని అభ్యర్ధించండి.

మీకు ఇంకేమయినా సందేహాలు ఉంటే గనక వాటిని మీడియా కాపీహక్కుల ప్రశ్నల పేజీలో ఆడగండి. ధన్యవాదాలు

పాలగిరి (చర్చ) 16:48, 22 అక్టోబర్ 2013 (UTC)

ఈగ బొమ్మ, కాపి హక్కులు....[మార్చు]

ఆర్యా.... అంటు వ్యాథులు అనే గ్రంథం లిప్యంతీకరణ లో భాగంలో కొన్ని నిముషముల క్రితమే చేర్చిన ఈగ బొమ్మ గురించి పలగిరి గారు స్పందించి కొన్ని సూచనలిచ్చారు. ముందుగా వారికి ధన్యవాదాలు. గతంలో ఇదే గ్రందంలోని కొన్ని బొమ్మలను తీసి నేను వ్రాసిన లిప్యంతీకరణ గ్రందంలో చెర్చాను. అవి నేను తీసిన బొమ్మలు కాదు గనుక వాటికి ఎటువంటి కాపి హక్కులు చేర్చక వదిలేశాను. నా ఉద్దేశమేమంటే ఆ బొమ్మలన్ని ఆ పుస్తకములోనివే గనుక అందులో ఇబ్బంది వుండదని భావించినందున., ఆవిధంగా ఖాళీగా వుంచకూడదని కొన్ని సందేశాలు వచ్చాయి. ఇప్పుడు ఈగ బొమ్మ చేర్చాను. ఈ బొమ్మ నేను స్వంతంగా తీసిన పోటో.. కనుక పరవా లేదనుకొని కనబడిన ఏదో ఒక ఆప్షన్ ను నొక్కి ఆ ఈగ బొమ్మను చేర్చాను. తీర బొమ్మ ఎక్కించాక చూస్తే అది వికీపీడియాకొరకు మాత్రమే వాడుకోవచ్చునని సూచించి నట్లుగా వున్నది. ఇది ఇంకా మంచిదే అని అను కున్నాను. ఇది కూడ తప్పుగా వున్నట్లు ఇప్పుడు తెలియు చున్నది. ఈ కాపీ హక్కుల భాగోతం ఒక పెద్ద గందర గోళంలా వున్నది. ఈ విషయమై అవగాహన కొరకే తెవికి బడిలో చేరాను. వికీ కామన్సులో నా బొమ్మలు చేరుస్తున్నప్పుడు అవి నా స్వంతమే ననే ఆప్షన్ మీద నొక్కితే అన్ని చేరి పోతున్నాయి.

ఈగ బొమ్మను మరో ఆప్షన్ తో తిరిగి ఎక్కిస్తాను.... ఇది సరైనదేనా అనే విషయం పలగిరిగారు గాని, మరెవరైనా గమనించి సందేశమిస్తే ఆ విధంగానే ఇకపై మసలుకుంటాను... Bhaskaranaidu (చర్చ) 17:26, 22 అక్టోబర్ 2013 (UTC)

దస్త్రం ఎక్కింపు లైసెన్సు[మార్చు]

Bhaskaranaidu గారు,మీరు రెండో సారి ఎక్కించిన బొమ్మలకు లైసెన్సు సరిపోయినది.మీరు బొమ్మ ఎక్కించిన తరువాత దస్త్రం ఎక్కింపు పుటలోని అప్‌లోడు అయిన ఫైళ్ళ జాబితాకు కు వెళ్ళి చిత్రం వివరాలు చూడండి.అందులో ,తొలగించాలో,లైసెన్సుకు అనుగుణ్యంగా వుందో తెలుస్తుంది.ఇది నాస్వంతకృతి,అందరికి ఎటువంటి అవసరానికైన వినియోగించుకోవచ్చు....... క్రింద ఎక్కింఛండిపాలగిరి (చర్చ) 18:30, 22 అక్టోబర్ 2013 (UTC)

తంబకాయ[మార్చు]

మీ పుణ్యాన చాలా ఏళ్ల తర్వాత మరలా తంబకాయ దర్శనం కలిగింది. ధన్యవాదాలు --వైజాసత్య (చర్చ) 03:40, 25 అక్టోబర్ 2013 (UTC)

ఉస్తికాయలు[మార్చు]

మీరు "ఉస్తికాయలు" అనే వ్యాసం వ్రాసారు. ఉస్తికాయలు వ్యాసం ఆంగ్లంలో en:Solanum torvum అవునో కాదో నిర్ధారించండి.----K.Venkataramana (talk) 04:27, 28 అక్టోబర్ 2013 (UTC)

ఉస్తికాయలు[మార్చు]

నిజ్జంగా అవే కాయలు. ఇంగ్లీషు పేరును బట్టి కాదు గాని.... కాయలు, చెట్టు బొమ్మను చూశాక తెలిసింది. అవే ..... ఉస్తి కాయలు. దయచేసి ఆ బొమ్మలను మన వ్వాసంలో చేర్చండి. ఈ కాయలు మాప్రాంతంలోనే తింటారనుకున్నా..... విదేశాలలోనూ వున్నాయన్నమాట... బాగుంది. Bhaskaranaidu (చర్చ) 10:47, 28 అక్టోబర్ 2013 (UTC) (ఉస్తి కాయలను మాప్రాంతంలో తోటలుగా పెంచరు. సంతలలోకూడ అమ్మరు. ఇవి పడు చెట్లు మాత్రమే అనగా వాటంతట అవే పడి మొలచి పెరిగే చెట్లు. అరుదుగా కొందరు తమ ఇంటి పెరడులో ఒక్క చెట్టును పెంచుకుంటారు. కాని ఇది విదేశాలలో కూడ వున్నటు విన్నాను. అయితే ఇది కూడ కూర గాయలలో ఒక దినుసే. దీని శాస్త్రీయ నామము, అందులోని పోషక విలువలు మొదలగు వివరాలు కూడ తెలియ జేస్తే బాగుండు నేమో.,..... )

ప్రతిపాదనలో మీ సంతకమును తగిన విభాగానికి తరలించండి[మార్చు]

మార్పు తగినచోటకు మార్చండి.--అర్జున (చర్చ) 11:09, 28 అక్టోబర్ 2013 (UTC)

WP:FUW వాడండి[మార్చు]

--అర్జున (చర్చ) 14:59, 7 నవంబర్ 2013 (UTC) అర్జున (చర్చ) 14:59, 7 నవంబర్ 2013 (UTC)

Dear uploader:

The media file you uploaded as File:Burrakata kalaakaarulu 2.JPG appears to be missing information as to its authorship (and or source), or if you did provide such information, it is confusing for others trying to make use of the image.

It would be appreciated if you would consider updating the file description page, to make the authorship of the media clearer.

Although some images may not need author information in obvious cases, (such where an applicable source is provided), authorship information aids users of the image, and helps ensure that appropriate credit is given (a requirement of some licenses).

  • If you created this media yourself, please consider explicitly including your user name, for which: {{subst:usernameexpand|Bhaskaranaidu/పాత చర్చ 1}} will produce an appropriate expansion,
    or use the {{own}} template.
  • If this is an old image, for which the authorship is unknown or impossible to determine, please indicate this on the file description page.
If you have any questions please see Help:File page. Thank you. అర్జున (చర్చ) 01:10, 9 నవంబర్ 2013 (UTC)
Sir,
The above picture is taken with my own camera in front of my house. Further I want to inform that all the photos whatever uploaded so far are all my own photos. In the present case I am unable to add the required author ship information. I am not able to follow the instructions. please help in this regard. Bhaskaranaidu (చర్చ) 15:39, 9 నవంబర్ 2013 (UTC)
ఆ పేజీకి వెళ్లి సవరించు ఎంచుకొని దానిలో కనబడే Information అనే మూసలో తగిని సమాచారం చేర్చండి. అలా చేర్చేటప్పుడు పైన హెచ్చరికలో గల మూసలు వాడుకోవచ్చు. ఉదా | author = తరువాత {{own}} చేర్చి భద్రపరిస్తే చాలు. ఉదాహరణ చూడండి. అంతే. అన్నట్లు చర్చలో స్పందించేటప్పుడు కొత్త శీర్షిక పెట్టవద్దు. తగినన్ని కోలన్లు పెట్టి ( జవాబిస్తున్న స్పందనముందున్న కోలన్ల కంటే ఒకటి ఎక్కువ--అర్జున (చర్చ) 05:01, 10 నవంబర్ 2013 (UTC)

పురష్కారానికి పేరు ప్రతి పాదన[మార్చు]

Bhaskaranaidu నాయుడు గార్కి,పురష్కారానికి నా పేరు ప్రతిపాదించినందులకి మీకు ధన్యావాదాలు.కాని నాకంటె తెవీకికి ఎక్కువ సమయాన్ని కేటాయించి,ఎక్కువ రచనలు చేసిన మీలాంటి వారు(తెవికీ,విక్షనరి,వికీ సోర్సు),ఇంకా నాకు తెలియని, పరిచయం లేని వారు ,చాలా కాలంగా మౌనంగా తమరచనలు చేస్తున్నవారు చాలా మంది వున్నారు.నా మటుకు నా వ్యక్తిగత ఆబిప్రాయం నాకు అంత సీన్ లేదు .మీరు ఇంకెవ్వరి పేరయిన లేదా మీరు స్వయంగా స్వయం ప్రతిపాదన చేసుకున్న మద్ధతు ఇవ్వటానికి నేసు సిద్ధం ,ఏమైన మీ అభిమానానికి ధన్యవాదాలు.Palagiri (చర్చ) 09:12, 2 డిసెంబర్ 2013 (UTC)

కొలరావిపుప్ర201 3[మార్చు]

Bhaskaranaidu గార్కి, మీ పేరును పురష్కారం కై చూచించాను.దయచేసి మీ మద్ధతును తెలియచెయ్యండి,Palagiri (చర్చ) 09:55, 2 డిసెంబర్ 2013 (UTC)

తొలగించిన చిత్తు ప్రతిపాదన స్థానంలో, కొత్త ప్రతిపాదనను ప్రవేశ పెట్టారు నేను మీపేరు ప్రతిపాదించాను. మీ సమ్మతి తెలియ చెయ్యగలరు.Palagiri (చర్చ)
వాడుకరి:Bhaskaranaidu గారికి, మొదటగా పురస్కార ప్రతిపాదనకి అంగీకారం తెలిపినందులకు ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 09:04, 3 డిసెంబర్ 2013 (UTC)

కొలరావిపుప్ర కు ప్రతిపాదన[మార్చు]

రవిచంద్ర గారూ.......

కొలరావిపుప్ర కు మీపేరును ప్రతిపాదించాను. దయచేసి మీ సమ్మతిని తెలుపగలరు.

భాస్కర్ నాయుడు గారూ నా పేరు ప్రతిపాదించినందుకు ధన్యవాదాలు. నా సమ్మతిని ప్రతిపాదన పేజీలో తెలియజేశాను. --రవిచంద్ర (చర్చ) 12:32, 4 డిసెంబర్ 2013 (UTC)

తెలుగుభాగవతం - సాంబశివరావు - ధన్యవాదాలు.[మార్చు]

నమస్కారం భాస్కరనాయుడు గారు. కొమర్రాజు పురస్కారానికి నా పేరు ప్రతిపాదించిన మీ సహృదయానికి ధన్యవాదాలు. - శుభాశ్శీస్సులతో -Telugubhagavatam (చర్చ) 12:43, 10 డిసెంబర్ 2013 (UTC)

File source and copyright licensing problem with దస్త్రం:White flowers.JPG[మార్చు]

File Copyright problem
File Copyright problem

Thanks for uploading దస్త్రం:White flowers.JPG. However, it currently is missing information on its copyright status and its source. Wikipedia takes copyright very seriously.

If you did not create this work entirely yourself, you will need to specify the owner of the copyright. If you obtained it from a website, please add a link to the page from which it was taken, together with a brief restatement of the website's terms of use of its content. If the original copyright holder is a party unaffiliated with the website, that author should also be credited. You will also need to state under what licensing terms it was released. Please refer to the image use policy to learn what files you can or cannot upload on Wikipedia. The page on copyright tags may help you to find the correct tag to use for your file.

Please add this information by editing the image description page. If the necessary information is not added within the next days, the image will be deleted. If the file is already gone, you can still make a request for undeletion and ask for a chance to fix the problem.

Please also check any other files you may have uploaded to make sure they are correctly tagged. Here is a list of your uploads. If you have any questions please ask them at the Media copyright questions page. Thank you. అర్జున (చర్చ) 05:16, 12 డిసెంబర్ 2013 (UTC)

కొమర్రాజు లక్ష్మణరావు పురస్కార ఎంపిక మండలి సందేశం[మార్చు]

మీ గురించి కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారానికి ప్రతిపాదన వచ్చినందులకు సంతోషం. 16-12-2013 23:59(UTC) తో ప్రతిపాదనల గడువు ముగుస్తుందుకాబట్టి, ఇప్పటికే అంగీకారము తెలుపకపోయినట్లైతే త్వరలో అంగీకారం తెలపవలసినది మరియు ప్రతిపాదన పత్రం ఎంపికలో కీలకమైనది కాబట్టి పురస్కార కొలబద్ద కనుగుణంగా మీ ప్రతిపాదనని విస్తరించమని కోరడమైనది.-- ఎంపికమండలి తరపున,ఎంపికమండలికార్యదర్శి అర్జున,(చర్చ),20240426122753

కొమర్రాజు లక్ష్మణరావు పురస్కార ఎంపిక మండలి సందేశం[మార్చు]

మీరు సహసభ్యులను కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారానికి ప్రతిపాదించినందులకు సంతోషం. 16-12-2013 23:59(UTC) తో ప్రతిపాదనల గడువు ముగుస్తుందుకాబట్టి, ప్రతిపాదన పత్రం ఎంపికలో కీలకమైనది కాబట్టి పురస్కార కొలబద్ద కనుగుణంగా మీ ప్రతిపాదితి సభ్యుని ప్రతిపాదనను విస్తరించమని కోరడమైనది.-- ఎంపికమండలి తరపున,ఎంపికమండలికార్యదర్శి అర్జున,(చర్చ)(--Arjunaraocbot (చర్చ) 08:42, 14 డిసెంబర్ 2013 (UTC))

శుభాకాంక్షలు[మార్చు]

తెవికీకి మీరు చేసిన కృషికి గానూ కొమర్రాజు లక్ష్మణరావు విశిష్ట వికీపీడియనుగా ఎన్నికయినందుకు శుభాకాంక్షలు.--రహ్మానుద్దీన్ (చర్చ) 11:19, 28 డిసెంబర్ 2013 (UTC)

భాస్కర నాయుడు గారూ,
2013 కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారమునకు ఎంపికైన సందర్భముగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. తెవికీలో వివిధ అంశాలపై మీ అవిరామకృషిని ఇలాగే కొనసాగించి మరిన్ని రచనలు మీ నుండి వస్తాయని ఆశిస్తున్నాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 15:09, 28 డిసెంబర్ 2013 (UTC)

వాడుకరి:Bhaskaranaidu గారికి, కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారానికి ఎంపిక కాబడి నందులకు నా హృదయ పూర్వక అభినందన శుభాకాంక్షలు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 15:45, 28 డిసెంబర్ 2013 (UTC)
2013 కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారమునకు ఎంపికైన సందర్భముగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు.----కె.వెంకటరమణ (చర్చ) 23:58, 28 డిసెంబర్ 2013 (UTC)
భాస్కరనాయుడు గారు 2013 కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారము పొందినదులకు హార్దిక శుభాకాంక్షలు. --విష్ణు (చర్చ)08:22, 3 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
2013 కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారమునకు ఎంపికైన సందర్భముగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు..విశ్వనాధ్ (చర్చ) 08:31, 3 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

యోగివేమన విశ్వవిద్యాలయము[మార్చు]

భాస్కర నాయుడు గారూ, యోగి వేమన విశ్వవిద్యాలయం వ్యాసము 2011 లోనే సృష్టించబడినది. ఈ వ్యాసాన్ని అందులో విలీనము చేయగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 14:55, 1 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

  • విలీనం చేయ బడినది.

వంటల పేజీలు[మార్చు]

భాస్కరనాయుడు గారూ, వంటలు తయారు చేసే విధానం వ్రాయటానికే అయితే అలాంటి పేజీలు వికీపీడియాలో కాకుండా వికీబుక్స్ లో ఉంచాలి. వంటల వ్యాసాలు ఎలా ఉండాలో ఉదాహరణకు ఆంగ్ల వికీలో పకోడీ పేజీ (en:Pakora) చూడండి. అలాగే తెలుగు వికీలో ఇడ్లీ ఒక మోస్తరు మంచి వ్యాసామే. --వైజాసత్య (చర్చ) 16:53, 4 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

Copyright problem: స్వయం సహాయక బృందం[మార్చు]

Hello, and welcome to Wikipedia! We welcome and appreciate your contributions, such as స్వయం సహాయక బృందం, but we regretfully cannot accept copyrighted text or images borrowed from either web sites or printed material. This article appears to contain material copied from http://te.pragatipedia.in/social-welfare/financial-inclusion/microfinance, and therefore to constitute a violation of Wikipedia's copyright policies. The copyrighted text has been or will soon be deleted. While we appreciate contributions, we must require all contributors to understand and comply with our copyright policy. Wikipedia takes copyright violations very seriously, and persistent violators are liable to be blocked from editing.

If you believe that the article is not a copyright violation, or if you have permission from the copyright holder to release the content freely under license allowed by Wikipedia, then you should do one of the following:

It may also be necessary for the text be modified to have an encyclopedic tone and to follow Wikipedia article layout. For more information on Wikipedia's policies, see Wikipedia's policies and guidelines.

If you would like to begin working on a new version of the article you may do so at this temporary page. Leave a note at Talk:స్వయం సహాయక బృందం saying you have done so and an administrator will move the new article into place once the issue is resolved. Thank you, and please feel welcome to continue contributing to Wikipedia. Happy editing! అర్జున (చర్చ) 05:02, 6 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

  • ఆర్యా....

కాపీ హక్కుల ఉల్లంగన విషయమై మీహెచ్చరికకు దన్య వాదములు. నేను ఏ వ్యాసమైనా అనేక రకాల గ్రంధాలు, పత్రికలు, మొదలగు పలువిధానాల్లోనుండి సేకరించి వ్రాస్తున్నాను. నాకు నచ్చిన అలాంటి విషయాలు వ్యాసాల రూపాల్లో ఏనాడో నేను నాకొరకు వ్రాసుకున్నవి. అప్పుడప్పుడు అలాంటివి కూడ వ్రాస్తున్నాను. పైన కనబరచిన వ్యాసము కేంద్ర ప్రభుత్వం వారి వెబ్. అది ప్రజల కొరకు వ్రాసినది అయినందున దానికి కాపి రైట్ అన్వర్తించదని భావించి అందులో వున్నదున్నట్టు కాక చాల మార్పులు చేసి, కుదించి వ్రాసాను. ఇలాంటి వ్యాసాలలో వాటిలో ఏదైనా కాపి రైట్ హక్కులకు భంగకరంగా అనిపిస్తే వాటిని పూర్తిగానో పాక్షికంగానో నిరబ్యంతరంగా తొలిగించ గలరు. వివాదాలు కొని తెచ్చుకోవడంకంటే ఇది నయం కదా. ఈ విషయాన్ని అనేక సందర్బాలలో మనవి చేశాను. మళ్ళీ విన్నవించు కుంటున్నాను. గతంలో నేనె కొన్నింటిలోని విషయాన్ని నేనే తొలిగించాను. వ్యాస శీర్షిక మాత్రం తొలిగించడానికి వీలుపడలేదు. కొంత కాలం వరకు అది అలాగే వుండేది. నావ్యాసాలను తొలిగించారని నేనేమైనా అనుకుంటాని పెద్దలు సందేహ పడవద్దు. Bhaskaranaidu (చర్చ) 16:25, 10 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

భాస్కరనాయుడు గారికి

2003 డిసెంబర్ 10న ప్రారంభమైన తెలుగు వికీపీడియా ప్రస్థానం నిరంతరాయంగా సాగుతూ ఇప్పటికి పది సంవత్సరాలను పూర్తిచేసుకున్నది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాను అనేక రూపాలలో అభివృద్ధి పరుస్తున్న మీలాంటి ఎందరో మహానుభావులు. అలాంటి మహానుభావులను ఒక చోట చేర్చి, సత్కరించాలనీ, ఆనంద పరచాలనీ, మేమానందించాలనీ సదుద్దేశంతో విశిష్ట వికీపీడియన్ పేరుతో 10 మంది సభ్యులను ఎన్నుకొనడం జరిగింది. వారిలో ఒకరిగా మిమ్ము ఈ సత్కారాన్ని అందుకొనేటందుకు తప్పక విచ్చేసి మీ యొక్క అనుభవాలను, సూచనలను, సలహాలను మాతో పంచుకోవాలని తద్వారా కొత్త తరానికి మీ యొక్క స్పూర్తిని అందించాలని మా ఆకాంక్ష.. శ్రమ అయినా పని ఉన్నా మా కొరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి రాగలరని మా ఆశ...

అభినందనలతో... కార్యవర్గం మరిన్ని వివరాలు ఈ పేజీలలో

The article శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం has been proposed for deletion because of the following concern:

విషయం సంగ్రహం

While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.

You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}} notice, but please explain why in your edit summary or on the article's talk page.

Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}} will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. --కె.వెంకటరమణ (చర్చ) 08:48, 15 జనవరి 2014 (UTC) --కె.వెంకటరమణ (చర్చ) 08:48, 15 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

శ్రీశైలం జలవిద్యత్తు కేంద్రం గురించి[మార్చు]

ఈవ్యాసాన్ని ఆంగ్ల నుండి తీసుకొని తర్జుమా చేసి. మరలా చేర్చ బడినది. కనుక నేను వ్రాసిన మొదటి వ్యాసాన్ని/పై నోటీసును తొలగించ వచ్చును.Bhaskaranaidu (చర్చ) 07:25, 21 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

వికీట్రెండ్స్ ఆధారిత నాణ్యతాభివృద్ధి ప్రాజెక్టు:సభ్య పేజీ మూస ఎన్నిక[మార్చు]

భాస్కర్ గారూ, చక్కని ప్రాజెక్టు పై ఆసక్తి కనబరచినందుకు శుభాభినందనలు. ఈ ప్రాజెక్టు సభ్యులు తమతమ వాడుకరి పేజీలని సభ్య మూసలతో అలంకరించుకొనేందుకు మూడు మూసలని చేశాను. వీటిని మీ ఎన్నికకై విడుదల చేస్తున్నాను. మీ అభిప్రాయాలు తెలిపిన తర్వాత మూసని ఖరారు చేయటం జరుగుతుంది. దయచేసి మీ అభిప్రాయాలని వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/వికీట్రెండ్స్ ఆధారిత నాణ్యతాభివృద్ధి లో 21-జనవరి-2014, భారత కాలమానం ప్రకారం గం|| 17:00 లోపు తెలుపగలరు. - శశి (చర్చ) 11:44, 15 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

కిల్లి కృపారాణి వ్యాసము పునః సృష్టిస్తున్నారు[మార్చు]

కిల్లి కృపారాణి వ్యాసము 2013 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సృష్టించబడింది. మీరు మరలా అదే వ్యాసాన్ని కిళ్ళి కృపారాణి పేరుతో సృష్టిస్తున్నారు. గమనించగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 07:08, 21 జనవరి 2014 (UTC)/[ప్రత్యుత్తరం]

వ్యాసాన్ని విలీనము చేయడమో... తొలిగించడమో చేయండి. Bhaskaranaidu (చర్చ) 07:26, 21 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదములు. మీరు ప్రత్యుత్తరం ఇసున్నపుడు నా చర్చాపేజీలో talkback మూసగానీ లేదా నా వాడుకరి పేరు సుల్తాన్ ఖాదర్ గానీ వాడినపుడు నాకు వెంటనే ఆటోమేటిక్ సందేశము వస్తుంది. అప్పుడు మీ వ్యాఖ్యను చూడడానికి వీలుంటుంది. లేదంటే మీరు ప్రత్యుత్తరము ఇచ్చినట్లు నాకు తెలియజేయబడదు. గమనించగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 08:53, 21 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

అనువాదాలు[మార్చు]

బోళ్ళ బుల్లిరామయ్య మరియు చింతకాయల అయ్యన్న పాత్రుడు వ్యాసాన్ని కూడా అనువదించండి.Rajasekhar1961 (చర్చ) 14:49, 28 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

  • అనువాదము విషయాల వారీగా సంక్షిప్తంగా వున్నదనిపిస్తుంది. అలా కాకుండా నేను ఇదివరకు చేసిన అనువాదం మాదిరి.... అనగా విషయాన్ని బట్టి పేరాలుగా వుంటే రాబోవు కాలంలో ఎవరైనా దాన్ని అభివృద్ది చేయడానికి అవకాశం ఎక్కువగా వున్నట్టు నాకు అనిపిస్తున్నది. సంక్షిప్త వివరాలు కుడివైపున పెట్టెలో పెడితే సరిపోతుందని అనిపిస్తున్నది. అందుకనే మిగతావి అనువదించలేదు. ఆలోచించండి. ఇదే బాగుంటుందనిపెస్తే అలాగే కొనసాగిస్తాను. Bhaskaranaidu (చర్చ) 15:01, 28 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • చింతా మోహన్ కూడా చేర్చాను. ఇదివరకు మీరు చేసిన మాదిరిగా విషయాన్ని బట్టి పేరాలుగానే బాగుంది. అలాగే అనువదించండి. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 15:05, 28 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

దశాబ్ధి ఉత్సవాలకు స్వాగతం[మార్చు]

తెవికీ మిత్రులందరకూ దశాబ్ది ఉత్సవ కమిటీ తరపున ఆహ్వానం

2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. వీరిలో విశేష కృషిచేసిన కొందరిని సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ నెల (ఫిబ్రవరి) 15, 16 తేదీలలో దశాబ్ది సంబరాలుగా జరుపుకోబోతున్నాం.

ఈ కార్యక్రమంలో ఎందరో కొత్త ఔత్సాహికులకు వికీతో అనుబంధాన్ని ఏర్పరచి భావి వికీపీడియన్లుగా తీర్చిదిద్దాలని కోరికతో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. వాటిలో మీరూ పాల్గొని కొత్త వారికి విజయవాడలోగల కే.బీ.ఎన్ కళాశాల వద్దనే ప్రత్యక్ష సహాయం చేస్తూ మార్గనిర్దేశం చేయాలని మా కోరిక, ప్రయాణం, వసతి వంటివి ఏర్పాటు చేయబడినవి. కనుక ఇప్పటికీ నమోదు చేసుకొనకపోతే దయచేసి పైన గల సైటు నోటీసు ద్వారా మీ వివరాలు నమోదుచేసుకొంటే మాకు ఏర్పాట్లకు అంచనా ఏర్పడుతుంది.

ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని వికీ మిత్రులంతా సహకరించి కార్యక్రమం విజయవంతం చేసి భావితరాలకు వికీ మార్గదర్శినిగా ఉండేలా చేయాలని మా కోరిక

......దశాబ్ది ఉత్సవ కార్యవర్గం, సహాయమండలి

తెలుగు వికీపీడియా దశాబ్ది వేడుకల ఉపకార వేతనము[మార్చు]


నమస్కారం Bhaskaranaidu గారు,

తెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవాలకు మీరు చేసుకున్న ఉపకార వేతన అభ్యర్థన మాకందినది.
మీరు ఉపకార వేతనము కు అర్హత సాధించారని తెలిపేందుకు సంతోషిస్తున్నాము.
శుభాకాంక్షలు!
మరిన్ని వివరాలు మీకు మెయిల్ ద్వారా పంపటం జరిగింది - గమనించగలరు.
తమరి రాకకై 15-16 తేదీల్లో విజయవాడలో వేచి ఉన్నాము.

ఇట్లు
Pranayraj1985 (చర్చ) 09:52, 10 ఫిబ్రవరి 2014 (UTC), కార్యదర్శి, తెవికీ దశాబ్ది కార్యవర్గం[ప్రత్యుత్తరం]

కొలరావిపు ప్రశంసాపత్రం[మార్చు]

కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం - ప్రశంసా పతకం (2013)
భాస్కరనాయుడు గారూ, తెలుగు వికీసోర్స్, వికీపీడియా మరియు విక్షనరీలో మీరు చేసిన కృషి అద్భుతమైనది. తెలుగు నాట జాన పద కళారూపాలు, యోగాసనాలు, అంటు వ్యాధుల పుస్తకాలను యూనికోడికరించటానికి విశేషంగా కృషి చేశారు. తెలుగు సంస్కృతికి సంబంధించిన స్వేచ్ఛానకలు హక్కులతో 1000 పైగా బొమ్మలు ఎక్కించి వికీమీడియా ప్రాజెక్టులకు మీరు చేసిన కృషిని గుర్తిస్తూ , పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం.