వాడుకరి చర్చ:T.sujatha/పాతచర్చలు 3

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

క్రొత్త చర్చలు ఈ దిగువన వ్రాయగలరు


Archive ఇది ఇంతకు ముందు జరిగిన చర్చలను భద్రపరిచిన పేజి. ఈ పేజిని మార్చ వద్దు. మీరు గనక కొత్త చర్చ మెదలు పెట్టాలనుకుంటే, లేదా పాత చర్చ కొనసాగించాలనుకుంటే, ప్రస్తుత చర్చా పేజిలో వ్రాయండి.

అభ్యర్ధన

నమస్కారం. మహిళా దినోత్సవ సందర్భంలో http://en.wikipedia.org/wiki/Wikipedia:Meetup/International_Women%27s_Day,_India#Event_details లో మీరు 'Suggested Articles' లో కొన్ని తెలుగు అంశాలను సూచిస్తే చాలా బావుంటుంది. విష్ణు (చర్చ)Vishnu 14:51, 27 ఫిబ్రవరి 2013 (UTC)

అభ్యర్ధన మన్నించినందులకు చాలా ధన్యవాదాలు సుజాత గారు. మీలాంటి వాళ్ళు ఇంకా కొందరు చొరవ చూపిస్తే తెవికికి తిరుగుండదండి. విష్ణు (చర్చ)15:29, 6 మార్చి 2013 (UTC)

వికిపీడియనులు

సుజాత గార్కి, నమస్కారములతో,సంచలనంసృష్టిస్తున్న వికీపిడియన్లు అంటూ నాపేరు చెర్చినందుకు ధన్యవాదాలు.కాని నేను చేసింది ,రాసింది చాలా తక్కువ.నాకన్న ఎంతో సమాచారాన్ని చేర్చినవాళ్ళు చాలామంది వున్నారు. వారందరినికాదని నాపేరుండటం నాకు వ్యక్తిగతంగా ఏదో ఫిలింగు.వీలుంటే తొలగించగలరా? అలాగని మిమ్మల్ని నొప్పించాలని నాభావంకాదు.అలాగే ఇంకరిపేరు భాస్కర రెడ్దికాదు,భాస్కర నాయుడు అని అనుకుంటున్నాను.పాలగిరి (చర్చ)

ఆహ్వానం సరిచేసాను. Malladi kameswara rao (చర్చ) 13:40, 5 మార్చి 2013 (UTC)

సమావేశం/అంతర్జాతీయ మహిళా దినోత్సవం, భారతదేశం

వికీపీడియా:సమావేశం/అంతర్జాతీయ మహిళా దినోత్సవం, భారతదేశం సృష్టించాను. ఈ నెల రోజులు అందరూ వీలైనన్ని మహిళలకు సంబంధించిన వ్యాసాలను విస్తరించడం లేదా మొదలుపెడితే బాగుంటుంది.Rajasekhar1961 (చర్చ) 08:00, 5 మార్చి 2013 (UTC)

తెవికీ వార్తలు

వికీపీడియా:తెవికీ వార్త/201 1-05-29/మే-2011-తెవికీవార్తలు వివరాలు వేరొకచోట వాడుకోదలిస్తే నకలుచేసి వాడుకొనమనికోరుతున్నాను.--అర్జున (చర్చ) 05:03, 6 మార్చి 2013 (UTC)

 • అలాగే వాడుకుంటాను. ఏదైనా పొరపాటు జరిగిందా? --t.sujatha (చర్చ) 05:11, 6 మార్చి 2013 (UTC)
 • పొరబాటున తెవికీవార్త హెడర్, పుటర్ తొలగించినట్లున్నారు. నేను రద్దుచేశాను. --అర్జున (చర్చ) 06:02, 6 మార్చి 2013 (UTC)
గమనించి సరిచేసినందుకు ధన్యవాదాలు అర్జునరావుగారూ ! ఏదో పొరపాటు జరిగినట్లుంది అనిపించినా ఏమైందో తెలుసుకోలేదు. --t.sujatha (చర్చ) 06:28, 6 మార్చి 2013 (UTC)

వివరాలు

సుజాత గారూ, మీరు అడిగిన వివరాలు ప్రస్తుతానికి అనివార్యకారణాలవలన అందించలేక పోతున్నాను. క్షంతవ్యడను.సుల్తాన్ ఖాదర్ (చర్చ) 17:21, 10 మార్చి 2013 (UTC)

సుల్తాన్ ఖాదర్ గారూ పరవా లేదు. మీపని మామూలుగా కొనసాగించండి.--t.sujatha (చర్చ) 03:08, 11 మార్చి 2013 (UTC)
సుజాత గారూ, వికీపీడియా:అంతర్జాతీయ_వికీపీడియా వ్యాసములో నా కృషిని గుర్తించి ప్రస్తావించినందుకు ధన్యవాదాలు.సుల్తాన్ ఖాదర్ (చర్చ) 05:22, 11 మార్చి 2013 (UTC)

హైదరాబాదులో తెవికీ సమావేశం

T.sujatha గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అత్యంత విలువైన అభిప్రాయం తెలియ జేయండి.--జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 06:40, 13 మార్చి 2013 (UTC)

Talkback

Nuvola apps edu languages.svg
నమస్కారం T.sujatha గారూ. మీకు Arjunaraoc గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
Message added 06:15, 14 మార్చి 2013 (UTC).  {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.

అర్జున (చర్చ) 06:15, 14 మార్చి 2013 (UTC)

స్త్రీల కొరకు అవుట్ రీచ్ ప్రోగ్రామ్: మీరు తప్పక ధరఖాస్తు చేయగలరు

సుజాత గారూ ! ఈ దిగువ ఇచ్చిన లంకెలు చూడండి. మంచి సదవకాశం. మీరు ధరఖాస్తు చేస్తే బాగుంటుంది. https://live.gnome.org/OutreachProgramForWomen/2013/JuneSeptember/SpreadTheWord https://www.mediawiki.org/wiki/Outreach_Program_for_Women విష్ణు (చర్చ)18:52, 16 మార్చి 2013 (UTC)

వ్యాసము

సహోదరి సుజాత గార్కి, మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు. సభ్యులు విషయ విస్తరణకు, తెవికీ నాణ్యత పెంచటానికి కృషి చేయాలని నా అభిప్రాయం. అనవసర చర్చలే అధికంగా జరుగు తున్నట్లు నేను భావిస్తాను. వ్యాసాల విషయ నాణ్యతపై చర్చలు తక్కువగా జరుగున్నవని భావిస్తాను. వ్యాస ప్రారంభకులుగా పోటీ పడే కన్నా వాటి విస్తరణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని నా అభిప్ర్రాయం.-- - -  కె.వెంకటరమణ చర్చ 14:24, 28 మార్చి 2013 (UTC)

విన్నపము

సుజాత గారూ! నమస్కారం! నేను విక్షనరీనందు విగత నిర్వాహకునిగా ఉన్నాను. కానీ ఇంకనూ నిర్వాహకునిగా పని చేయాలను కుంటున్నాను. ఈ సందర్భములో దానికి సంబంధించిన విధి విధానముల "పని" అయ్యేందుకు కావలసిన మీ సహయ సహకారముల కోసము విన్నవించు కుంటున్నాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 04:51, 5 ఏప్రిల్ 2013 (UTC)

ప్రసాదుగారూ ! దయచేసి విగత వంటి తీవ్రమైన పద ప్రయోగం చేయకండి. మీ నిర్వాహకత్వం కొనసాగడానికి కావలసిన సహాయం చేస్తాను. అలాగే మీరు నిర్వాహకత్వానికి అభ్యర్ధిస్తే నా మద్దతు తెలియజేస్తాను. --t.sujatha (చర్చ) 05:16, 5 ఏప్రిల్ 2013 (UTC)

తెలుగు వికీపీడియా మహోత్సవం 2013కు ఆహ్వానం

Telugu wikipedia mahotsavam.png

T.sujatha గారికి నమస్కారం,

విజయ తెలుగు ఉగాదిని పురస్కరించుకుని, తెలుగు వికీపీడియా మహోత్సవం 2013ను 10 మరియు 11 ఏప్రిల్ 2013న జరుపుకుంటున్నాం. ఇది హైదరాబాదులోని గోల్డెన్ థ్రెషోల్డ్‍లో జరుగనుంది.
దయచేసి ఉత్సవ నమోదు పత్రం వద్ద తమ పేరును నమోదు చేసుకోగలరు.
హైదరాబాదు బయట నుండీ వచ్చేవారికి దారి ఖర్చులు చెల్లింపబడతాయి.

వికీపీడియా సభ్యులుగా మీరు చేస్తున్న విశేష కృషికి అభినందనలు. ఈ సమావేశంలో హాజరయి, మీ అనుభవాలు మిగితా సభ్యులతో పంచుకుంటారని ఆశిస్తున్నాం. మీరు రాలేని పక్షంలో దయచేసి మీ సందేశాన్ని పాఠ్యం/ఆడియో(శ్రవ్యకం)/దృశ్యకం(వీడియో) రూపంలో ఇక్కడ పొందుపరచగలరు. మీ రచనలకూ, మీ విశేష కృషికీ ధన్యవాదాలు.

మీ రాకకై నిరీక్షిస్తూ ఉంటాము. రహ్మానుద్దీన్ (చర్చ) 06:54, 5 ఏప్రిల్ 2013 (UTC)

ఆహ్వానం పంపుట

సుజాత గారూ, notify all వంటి ఉపకరణం వాడి పైన మీకు పంపిన ఆహ్వానాన్ని అందరికీ పంపగలరు. మీరు పంపలేని పక్షంలో ప్రతి ఒక్క వాడుకరి పేజీకి వెళ్ళి పంపవలసి ఉంటుంది. ఇది కొంత శ్రమతో కూడుకున్న విషయం. రహ్మానుద్దీన్ (చర్చ) 06:57, 5 ఏప్రిల్ 2013 (UTC)

CIS-A2K వారి ధన్యవాదాలు

సుజాత గారు CIS-ఆక్సెస్ టు నాలెడ్జ్ ప్రోగ్రాం 2013-14 తెలుగు వికీపీడియా ప్రణాళికను తెలుగులోకి అనువదించడానికి మీరు అలుపెరుగని కృషి చేసారు. చాలా ధన్యవాదాలు. మీ ప్రోత్సాహం ఎల్లకాలం మా వెన్నంటే ఉండాలని అభిలశిస్తున్నాను. మన తెలుగు వికీపీడియా ఈ వర్షపు పురోగతి మొదలయిందని అనడానికి మీ ఈ అనువాద కృషే తార్కాణం.--విష్ణు (చర్చ)18:39, 7 ఏప్రిల్ 2013 (UTC)

విష్ణుగారూ ! మీ ప్రశంశకు ధన్యవాదాలు. CIS-ఆక్సెస్ టు నాలెడ్జ్ ప్రోగ్రాం తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడుతుందని విశ్వసిస్తున్నాను. మీ అందరితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. t.sujatha (చర్చ) 13:14, 8 ఏప్రిల్ 2013 (UTC)

సుజాత గారూ, అనువాదం చాలా బాగుంది. సరళమైన భాషలో అందరికీ సులువుగా అర్థమయ్యేటట్లు అనువదించారు.మీ కృషి అభినందనీయం.సుల్తాన్ ఖాదర్ (చర్చ) 13:18, 8 ఏప్రిల్ 2013 (UTC)

సుల్తాన్ ఖాదర్ గారూ ! ప్రశంశకు ధన్యవాదాలు. అలాగే తెలుగు వికీపీడియా అభివృద్ధికి సమిష్టి కృషిలో పాల్గొనండి.t.sujatha (చర్చ) 13:23, 8 ఏప్రిల్ 2013 (UTC)

ఖాళీ విభాగాలు

సుజాత గారూ, మీరు గ్రామ వ్యాసాలలో ఖాళీ విభాగాలు చేర్చుతున్నారు. అలా చేసే అవసరం ఉన్నదా? విభాగాలు చేర్చాలన్ననూ బాటుద్వారా సునాయాసంగా చేర్చవచ్చును. సమాచారం ఉన్నప్పుడే విభాగాలు సృష్టిస్తే బాగుంటుంది. అంతేకాకుండా ఎలాంటి సమాచారం లేనప్పుడు బయటి లింకులు ఇవ్వడం కూడా బాగుండదు. ఆలోచించండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 07:19, 19 ఏప్రిల్ 2013 (UTC)

చంద్ర కాంత రావుగారూ ! ఇలా చేస్తే కొత్తగా చేరిన సభ్యులు కూడా ఆయా వుభాగాలలో కొంత సమాచారం వ్రాస్తారని నాలుగు మండలాలకు మాత్రమే అలా చేసాను. ఇది ప్రయోగాత్మకంగా చేసినది మాత్రమే. పేజీలో ఇచ్చిన లింకు ఆయా గ్రామాలకు సబంధించినది. ఆ లింకులో ఉన్న సమాచారం చూసి పేజీలో తెలుగులో వ్రాస్తేనే వ్యాసం మొలక స్తాయి దాటగలదు. మీరు ఆ లింకును గమనించగలరు. బాటు ద్వారా చేయవచ్చు అని అంటున్నారు. అయినప్పటికీ బాటుద్వారా వివరాలను ఎంత వరకు చేర్చగలరో నాకు అవగాహన లేదు. కొన్ని సంవత్సరాలుగా సమాచారరహితంగా ఉన్న గ్రామాల పేజీలో మార్పులు తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నమిది. ఇది ఇప్పటికి ఈ నాలుగు మండలాలకే పరిమితం చేయాలని అనుకున్నాను. మిగిలిన మండలాలకు చేసే ఆలోచన లేదు. --t.sujatha (చర్చ) 08:48, 19 ఏప్రిల్ 2013 (UTC)

విక్షనరీలో తొలగించవలసిన వ్యాసాలు

విక్షనరీలో కొన్ని తొలగించవలసిన వ్యాసాలున్నాయి. ఒకసారి చూడండి.Rajasekhar1961 (చర్చ) 08:32, 24 ఏప్రిల్ 2013 (UTC)

సహాయము కొరకు అభ్యర్థన

నేను వికీపిడియాకు కొత్త వాడిని. కనుక నా వ్యానం సిన్‌సినాటస్‎ అనువాదము కొరకు సహకరించవలసినదిగా ప్రార్థన--Badbuu1000 (చర్చ) 14:04, 27 ఏప్రిల్ 2013 (UTC)

ఈ వారం ‌వ్యాసం కృషి

ఈవారం వ్యాసం శీర్షిక కు కృషి చేస్తున్నందులకు ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 05:43, 29 ఏప్రిల్ 2013 (UTC)

శ్రీనివాస మంగాపురం

శ్రీనివాస మంగా పురం మరియు శ్రీనివాస మంగా పురం లు ఒకే విషయం గల రెండు వ్యాసాలు. అందులో ఒకటి తొలగించగలరు.--Plume pen w.gif కె.వెంకటరమణ చర్చ 06:56, 1 మే 2013 (UTC)

రెండు వ్యాసాలు ఒకటే రెడు వ్యాసాలు ఇలా ఒకే పేరుతో ఉండే అవకాశం లేదు. మరొకసారి గమనించండి --t.sujatha (చర్చ) 07:19, 1 మే 2013 (UTC)

మూడు వ్యాసాలున్నవి. అవి కళ్యాణ వేకటేశ్వరాలయం,,, శ్రీనివాస మంగా పురం , శ్రీనివాస మంగా పురం మరియు శ్రీనివాస మంగాపుర‍ం. వీటిని విలీనం చేయవచ్చునేమో పరిశీలించండి.--Plume pen w.gif కె.వెంకటరమణ చర్చ 11:05, 1 మే 2013 (UTC)

రమణగారూ ! నిజమే ఈ మూడు వ్యాసాలు ఒక ఆలయానికి చెందినవే కనుక విలీనం చేయవచ్చు. --t.sujatha (చర్చ) 13:23, 1 మే 2013 (UTC)

తెలుగు వికీపీడియా లొని ప్రత్యేక పేజీల లోని వేల సంఖ్యలో గల వర్గీకరించని వ్యాసాలకు గత కొన్ని రోజుల నుండి వర్గాలను చేరుస్తూ శుద్ధి చేస్తూ నేటికి పూర్తిచేసితిని.Plume pen w.gif కె.వెంకటరమణ చర్చ 15:40, 2 మే 2013 (UTC)

వెంకట రమణగారూ ! మీ కృషికి ధన్యవాదాలు. --t.sujatha (చర్చ) 15:58, 2 మే 2013 (UTC)

For being the powerful Wiki-Woman

Trophy.png Best Telugu Wiki-Woman
You are not just special but a powerful Wiki-Woman we have. Thank you for all your effort on Telugu Wikipedia and other Telugu Wikimedia projects. Keep spreading your wiki-energy!! Vishnu 05:44, 4 May 2013 (UTC)
మీఅవిశ్రాంతకృషికి గుర్తింపుగా Best Telugu Wiki-Woman కప్ ను అందుకున్నందులకు నాహృదయయపూర్వక అభినందనలు.మీ కృషి అందరికీ ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిస్తూ.....--Plume pen w.gif కె.వెంకటరమణ చర్చ 05:22, 4 మే 2013 (UTC)
తగిన సత్కారం. సుజాత గారు ఈ కప్‌ను అందుకున్న సందర్భంగా శుభాభినందనలు --వైజాసత్య (చర్చ) 05:26, 4 మే 2013 (UTC)

అభినందనలు చెప్పిన రమణగారికి, వైజాసత్యగారికి ధన్యవాదాలు. మీ వంటి సహసభ్యుల తోడ్పాటే నన్నింత దూరం నడిపించింది. --t.sujatha (చర్చ) 05:31, 4 మే 2013 (UTC)

విశ్రాంతిలేకుండా తెలుగు వికీపీడియా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న సుజాతగారికి హర్థిక శుభాకాంక్షలు.Rajasekhar1961 (చర్చ) 06:26, 4 మే 2013 (UTC)

రాజశేఖరు గారూ ! మీ అభినందనలకు ధన్యవాదాలు. మీరంతా అందించిన సహకారమే ఇందుకు కారణం. --t.sujatha (చర్చ) 06:31, 4 మే 2013 (UTC)

గ్రామ వ్యాసాలలో విభాగాలు

సుజాత గారు, ఇదివరకు మీరు గ్రామవ్యాసాలలో ఖాళీ విభాగాలు పెడుతుంటే నేను అలా చేయవద్దని సూచన ఇచ్చాను. ఆ సూచనను ఉపసంహరించుకుంటున్నాను. మన పేద్ద అధికారి వైజాసత్య తెలిపినట్లుగా పెద్ద దిద్దుబాట్లే చేయనవసరం లేదట. బాటుద్వారా చేయాల్సిన దిద్దుబాట్లను కూడా ఎవరైనా చేయవచ్చట. కాబట్టి ఆ విలువైన సూచనను మనం పాటిద్దాం. ఇదివరకు నేనిచ్చిన సూచన మీకు ఇబ్బందిగా అనిపిచ్చిందేమోనని నేణు బాధపడుతున్నాను. ధన్యవాదములతో. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:04, 5 మే 2013 (UTC)

చంద్రకాంత్ రావుగారూ ! ఏమిటిది వైజా సత్యగారికి మీకు ఉన్న అనుబంధం ఇప్పటిదా ! అది జీవితాంతం కొనసాగవలసినది కదా ! ఇది అభిప్రాయ బేధమే కాని వేరే ఏమి లేదే ! ఎంతటి ఆత్మీయూకైనా అభిప్రాయబేధాలు సహజం కదా ! వైజా సత్యగారు అందరికీ ఆమోదయోగ్యమైనది వికీ అభివృద్ధికి సహకరించేది చెప్పారు. మీరు నాకిచ్చిన సలహా వెనకకు తీసుకొనవలసిన అవసరం లేదు. మీ సలహాలు అందించండి. మనసు కష్టపడ వద్దు. అధికంగా చెప్పానని అనుకుంటే క్షమించండి. --t.sujatha (చర్చ) 16:45, 5 మే 2013 (UTC)
సుజాతా గారు, మీరు చెప్పినదాంట్లో "వైజా సత్యగారు అందరికీ ఆమోదయోగ్యమైనది వికీ అభివృద్ధికి సహకరించేది చెప్పారు" మరియు "మీరు నాకిచ్చిన సలహా వెనకకు తీసుకొనవలసిన అవసరం లేదు" రెండు వాక్యాలూ పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఇదివరకు నేనిచ్చిన సూచనలు పాటించనవసరం లేదని కోరుచున్నాను. ఇకనుంచి ఎవరికైననూ ఏ సలహా ఇచ్చిననూ తప్పేనేమో! నేను ఏమి చెప్పిననూ తొందరపడి ఏదీ ఎవరికీ చెప్పను. బాగా పరిశీలించిన పిదపనే తెవికీ ప్రయోజనాల దృష్ట్యా ఏదేని సూచన చేస్తాను. నేను చెప్పిన సూచన కూడా ఆ సభ్యుడు నాకు ఐదేళ్ళ క్రితం చెప్పిన సూచనలనే నంటే మీరు నమ్మకపోవచ్చు. నా వద్ద ఆధారం కూడా ఉంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:09, 5 మే 2013 (UTC)

నా వరకు నేను మీ సలహా పాటిస్తాను. నాకు సలహాలు ఇవ్వడం ఆపడం చేయవలసిన అవసరం లేదు. మీ సలహా గౌరవిస్తాను అదే సమయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. నాకు సలహా ఇవ్వడం తప్పని మీరు బాధపడ కూడదు. బాటు ద్వారా పని జరిగే వరకూ సభ్యులు చేయవలసినది చేస్తారు కదా ! అదే కదా వైజాసత్య గారు చెప్పింది. ఇప్పుడు జరుగుతున్న పనులు వికీ అభివృద్ధి కొరకు సభ్యులు చేస్తున్న బృహత్ ప్రయత్నం. అది మాకు తెలిసిన మార్గంలో మేము చేస్తున్నాము. అందరం మంచి కోసం ప్రయత్నిస్తున్నాము. మీరు బాధపడకూడదనే ఇలా చెపాను.

 • ఐదు సంవత్సరాల క్రితం ఆయన చెప్పారనడానికి ఆధారం అవసరం ఏముంది. నిన్న చేసిన నిర్ణయం అయినా సాధ్యాసాధ్యాలు , తప్పొప్పులు బేరీజు వేసుకున్నప్పుడు మంచి ఫలితం ఇస్తుందన్నప్పుడు నేనే తీసుకున్న నిర్ణయమైనా నేను వెనక్కి తీసుకుంటాను. ఎవరికైనా ఇంతే అని పరిస్తితిని అనుసరించి నిర్ణయాలు మార్చుకోవచ్చని ఇలా చెప్పాను. మీవంటి సహృదయులు, అనుభస్తులైన వారి మద్య మనోబేధాలు ఆరంభంలో తీసివేయాలని ఇలా చెప్పాను. పొరపాటుగా చెప్పానని అనుకుంటే క్షమించండి. --t.sujatha (చర్చ) 17:34, 5 మే 2013 (UTC)
సుజాత గారూ, గ్రామాల వ్యాసాల ప్రాజెక్టు రెండవ విడతలో గ్రామాలకు గణాంకాలు, పట్టికలు తదితర వివరాలన్ని చేర్చే ప్రతిపాదన ఉన్నది. ఆ ప్రతిపాదన కేవలం 2011 జనగణన వివరాలు పూర్తిగా విడుదలటానికి వేచి ఉన్నది. ఈ మధ్య సమయంలో మీరు వేరే పనుల మీద దృష్టిపెడితే బాగుంటుందని నా ఆలోచన. అన్యథా భావించవద్దు. ఈ పనులను బాటు చేయగలదు. సుజాత గారు చేయగలిగిన చాలా పనులు బాటులు చేయలేవు. --వైజాసత్య (చర్చ) 07:47, 10 మే 2013 (UTC)
వైజాసత్యగారూ ! మీ సూచనకు ధన్యవాదాలు . తప్పక వేరే పనులు చేపడతాను. --t.sujatha (చర్చ) 08:20, 10 మే 2013 (UTC)

తెలుగు ప్రముఖులు

తెలుగు ప్రముఖుల ప్రాజెక్టులో మీరు తెలుగు మహిళలకు చెందిన వ్యాసాలను అభివృద్ధిని చేపట్టగలరని ప్రార్ధిస్తున్నాను. గ్రామాల వ్యాసాలను విస్తరిస్తున్న మీకు ఇది మరో బాధ్యత. మరోలా భావించవద్దు. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 16:26, 5 మే 2013 (UTC)

రాజశేఖర్ గారూ ! గ్రామాల వ్యాసాలపని చూస్తూ ఉన్నాను. ఎలాగైనా గ్రామాల వ్యాసాలను అభివృద్ధి చేసే ప్రయత్నంలో ఉన్నాను. మధ్యలో సమయం లభించినప్పుడు ప్రముఖుల వ్యాసాలలో నాకు ఆసక్తి కల వ్యాసాలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తాను. --t.sujatha (చర్చ) 16:51, 5 మే 2013 (UTC)

అధికార హోదాకు మద్దతు

మీరు నాయొక్క అధికారిక హోదాకు మద్దతునిచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు వికీపీడియా అభివృద్ధికి నావంతు కృషి చేస్తానని హామీ యిస్తున్నాను.Rajasekhar1961 (చర్చ) 10:02, 13 మే 2013 (UTC)

అభినందనలు

సుజాతగారూ నమస్తే, నిర్వాహక హోదాను అలంకరించారు, అభినందనలు. అహ్మద్ నిసార్ (చర్చ) 11:53, 20 మే 2013 (UTC)

ధన్యవాదాలు

సుజాత గారు, మీ ప్రోత్సాహానికి అభినందనలు. మనం అందరం కలిస్తే మరెన్నో మైలురాళ్ళను చేరగలము. ఈ వీడియోలను మీ ఫేస్ బుక్ మొదలైన పేజీలలో పెట్టి ఎక్కువమంది చూసేటట్లు చేయండి. మరిందరు సభ్యులు వికీలో చేరతారు. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 19:32, 3 జూన్ 2013 (UTC)

ధన్యవాదాలు

Nuvola apps edu languages.svg
నమస్కారం T.sujatha గారూ. మీకు Visdaviva గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
 {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.

Article request: Water cycle

T.sujatha, are you interested in starting an article (a short stub) on the en:Water cycle? దస్త్రం:Watercycleteluguhigh.jpg is a diagram of the cycle in Telugu so you can use it in the article Thanks WhisperToMe (చర్చ) 03:11, 22 జూన్ 2013 (UTC)

ప్రత్యుత్తరం

Nuvola apps edu languages.svg
నమస్కారం T.sujatha గారూ. మీకు వికీపీడియా:రచ్చబండ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
Message added 02:38, 8 జూలై 2013 (UTC).  {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.

మొలకల జాబితా గురించి వైజాసత్య (చర్చ) 02:38, 8 జూలై 2013 (UTC)

నిర్వాహక హోదాకు మద్దతు

మీరు నాయొక్క నిర్వాహ హోదాకు మద్దతునిచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు వికీపీడియా అభివృద్ధికి నావంతు కృషి చేస్తానని హామీ యిస్తున్నాను.Plume pen w.gif-- కె.వెంకటరమణ చర్చ 12:26, 18 జూలై 2013 (UTC)

నిర్వాహకత్వ హోదాకు మద్దతు తెలిపింనందుకు ధన్యవాదాలు

మీరు నాయొక్క నిర్వాహక హోదాకు మద్దతునిచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు వికీపీడియా అభివృద్ధికి నావంతు కృషి చేస్తానని హామీ యిస్తున్నాను.రహ్మానుద్దీన్ (చర్చ) 15:51, 22 జూలై 2013 (UTC)

ధన్యవాదాలు

పతకం ప్రదానం చేసినందుకు ధన్యవాదాలు. మీరందించిన ప్రోత్సాహం తో తెవికీ అభివృధ్ధికి మరింత కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను.Plume pen w.gif-- కె.వెంకటరమణ చర్చ 15:11, 10 ఆగష్టు 2013 (UTC)

పతకం

తెలుగు మెడల్

వికీపీడియా ఉగాది మహోత్సవాన్ని ఊహాస్థాయినుండి అభివృద్ధిచేసి ఘనంగా నిర్వహించుటలో తోడ్పడినందులకు కృతజ్ఞతాసూచకంగా అందుకోండి ఈ పతకం .--అర్జున (చర్చ) 10:52, 16 ఆగష్టు 2013 (UTC)

సులోచనా గాడ్గిల్ వ్యాసం

సుజాత గారు లీలావతి కూతుళ్ళు ప్రాజెక్టులో కృషి చేస్తున్నందులకు ధన్యవాదాలు!! ఈ సులోచన గాడ్గిల్ వ్యాసం ముందుగానే ఉన్నది చూడండి. బహుశా విలీనం చేస్తే బాగుంటుంది. గమనించగలరు. వీలయితే ఇక్కడ కూడా మీ పేరు నమోదు చేయగలరు. --విష్ణు (చర్చ)19:37, 1 సెప్టెంబర్ 2013 (UTC)

మనీలా వ్యాసం

ఆసియా సాంస్కృతిక ఎక్సేంజి[[1]] లో భాగంగా మనీలా నగరం గురించి వ్యాసాన్ని ప్రారంభించాను. దీనిని దయచేసి ఆంగ్ల వికీలోని వ్యాసము నుండి సమాచారాన్ని అనువదించి విస్తరిస్తారని కోరుతున్నాను. ధన్యవాదాలు.

మీ భార్యాభర్తలిద్దరికీ గ్రామాల వ్యాసాలను గత ఆరు నెలలుగా నిరంతరం శ్రమిస్తూ అభివృద్ధి చేస్తున్నాందుకు నా హార్థిక శుభాకాంక్షలు.Rajasekhar1961 (చర్చ) 12:06, 7 సెప్టెంబర్ 2013 (UTC)

రాజశేఖర్ గారికి ! నమస్కారం . మనీలా వ్యాసం అనువాదం పూర్తి చేస్తాను. అలాగే మీ అభినందనాకు ధన్యవాదాలు.--t.sujatha (చర్చ) 03:42, 8 సెప్టెంబర్ 2013 (UTC)

బొమ్మలు వ్యాసాలలో వాడడం

దస్త్రం:విశాలంధ్ర గ్రంధాలయం..jpg లాంటివి చాలా చేర్చినట్లున్నారు. లైసెన్స బాగానేవుంది. వాటిని సంబంధితవ్యాసంలో గ్యాలరీ రూపంలో చేర్చండి. ఉపయోగించకపోతే బొమ్మలు తొలగించవచ్చు.--అర్జున (చర్చ) 09:51, 19 అక్టోబర్ 2013 (UTC)

ప్రశంశకు ధన్యవాదాలు. మీ సలహాను పాటిస్తాను. --t.sujatha (చర్చ) 13:00, 19 అక్టోబర్ 2013 (UTC)

లీలావతి కూతుర్లు

కొత్తగా మీరు ప్రారంభించిన వ్యాసాలకు ఇచ్చిక లింకు అన్నింటిలోనూ ఒకే మహిళకు వెళ్తున్నది. దయచేసి సవరించండి.Rajasekhar1961 (చర్చ) 05:11, 28 నవంబర్ 2013 (UTC)

వి. కల్పకం తొలగించండి. పి కల్పగం నేను రాస్తున్నను మార్చి కప్లగం పొలస ఇన్‌ఫో బాక్స్‌లో పెట్టండి...విశ్వనాధ్ (చర్చ) 06:43, 29 నవంబర్ 2013 (UTC)

2013 వికీ పురస్కార ప్రతిపాదనలు

సుజాతమ్మ గారికి నమస్కారం, 2013 వికీ పురస్కార ప్రతిపాదనల సభ్యులందరిని నేను సమర్ధిస్తున్నాను, వారి వారి పేజీలలో సమర్ధించే విధానం ఎన్నికలా ఉన్నందున నేరుగా ఎవరిని సమర్ధించటం లేదు, విశేష కృషి చేసిన సభ్యులను సులభంగా గుర్తించగలిగిన మీరు ఎంపిక సంఘం సభ్యులుగా ఉండటం ఆనందకరం.

సందేహ నివృత్తి కొరకు - కట్టంగూర్ గ్రామ వ్యాసంలో నేను చేర్చిన పిన్ కోడ్ తిప్పి కొట్టిన కారణం ఆర్ధం కాలేదు, వివరించండి. YVSREDDY (చర్చ) 12:50, 7 డిసెంబర్ 2013 (UTC)

Proposed deletion of హెచ్ ఇలా నీ భట్నాగర్

Ambox warning yellow.svg

The article హెచ్ ఇలా నీ భట్నాగర్ has been proposed for deletion because of the following concern:

విషయం లేని వ్యాసం - మూస కోసం వ్యాసం ఉన్నట్లున్నది.

While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.

You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}} notice, but please explain why in your edit summary or on the article's talk page.

Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}} will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. --కె.వెంకటరమణ (చర్చ) 17:07, 27 డిసెంబర్ 2013 (UTC) --కె.వెంకటరమణ (చర్చ) 17:07, 27 డిసెంబర్ 2013 (UTC)

Proposed deletion of హెచ్ ఇలాహ్

Ambox warning yellow.svg

The article హెచ్ ఇలాహ్ has been proposed for deletion because of the following concern:

విషయం లేని వ్యాసం - మూస కోసం వ్యాసం సృష్టించే ప్రయత్నం

While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.

You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}} notice, but please explain why in your edit summary or on the article's talk page.

Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}} will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. --కె.వెంకటరమణ (చర్చ) 17:08, 27 డిసెంబర్ 2013 (UTC) --కె.వెంకటరమణ (చర్చ) 17:08, 27 డిసెంబర్ 2013 (UTC)

దశాబ్ధి ఉత్సవాలకు ఆహ్వానం

Telugu-Wiki-10-Wecome Note.png

తెవికీ మిత్రులందరకూ దశాబ్ది ఉత్సవ కమిటీ తరపున ఆహ్వానం

2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. వీరిలో విశేష కృషిచేసిన కొందరిని సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ నెల (ఫిబ్రవరి) 15, 16 తేదీలలో దశాబ్ది సంబరాలుగా జరుపుకోబోతున్నాం.

ఈ కార్యక్రమంలో ఎందరో కొత్త ఔత్సాహికులకు వికీతో అనుబంధాన్ని ఏర్పరచి భావి వికీపీడియా:వికీపీడియనులుగా తీర్చిదిద్దాలని కోరికతో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. వాటిలో మీరూ పాల్గొని కొత్త వారికి విజయవాడలోగల కే.బీ.యన్. కళాశాల వద్దనే ప్రత్యక్ష సహాయం చేస్తూ మార్గనిర్దేశం చేయాలని మా కోరిక, ప్రయాణం, వసతి [[2]] వంటివి ఏర్పాటు చేయబడినవి. కనుక ఇప్పటికీ నమోదు చేసుకొనకపోతే దయచేసి పైన గల సైటునోటీసు[[3]] ద్వారా మీ వివరాలు నమోదుచేసుకొంటే మాకు ఏర్పాట్లకు అంచనా ఏర్పడుతుంది.

ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని వికీ మిత్రులంతా సహకరించి కార్యక్రమం విజయవంతం చేసి భావితరాలకు వికీ మార్గదర్శినిగా ఉండేలా చేయాలని మా కోరిక

......దశాబ్ది కార్యనిర్వాహకవర్గం, సహాయమండలి

చిన్న మార్పులు చేసాను. మరొక్క సారి చెయ్యండి దయచేసి...విశ్వనాధ్ (చర్చ) 09:52, 29 జనవరి 2014 (UTC)

ఆహ్వానానికి ధన్యవాదములు

సుజాతగారూ,
దశాబ్ధి ఉత్సవాల ఆహ్వానానికి ధన్యవాదములు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 09:56, 30 జనవరి 2014 (UTC)

ప్రాజెక్టు ఆహ్వానం

మీరు వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ ‎ పరిధిలో గల వ్యాసంలో మార్పులు చేయడం గమనించాము. మీరు కూడా ప్రాజెక్టు సభ్యునిగా పాల్గొంటే తెవికీ మరింత అభివృద్ధి చేయవచ్చు. మీ పేరు వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్#సభ్యులు లో నమోదు చేసుకోమని ఆహ్వానిస్తున్నాము. --అర్జున (చర్చ) 11:26, 30 జనవరి 2014 (UTC)

 • అర్జున గారూ ! మీ ఆలోచన సమర్ధనీయమైనదే. అయినా దశాబ్ధిఉత్సవాల తరువాత మాత్రమే నేను చేయగలను. --t.sujatha 12:23, 30 జనవరి 2014 (UTC)
 • మీ స్పందనకు ధన్యవాదాలు. మీకు వీలయినప్పుడే కృషిచేయండి. --అర్జున (చర్చ) 12:37, 30 జనవరి 2014 (UTC)

దశాబ్ధిఉత్సవాల అహ్వానం

సుజాత గారు, దశాబ్ధిఉత్సవాల అహ్వానం అందరి చర్చాపేజీల్లో శ్రమతో అంటిస్తున్నట్టున్నారు. ఏవైనా ఒక జాబితా ప్రకారం అతికిస్తున్నారా? లేక అందరు సభ్యులకు ఈ ఆహ్వానం పంపుతున్నారా? మీరు అంగీకరిస్తే, మీకు సహాయకంగా నేనీ పని బాటు ద్వారా చేయగలను --వైజాసత్య (చర్చ) 08:28, 31 జనవరి 2014 (UTC)

ప్రత్యుత్తరం

Nuvola apps edu languages.svg
నమస్కారం T.sujatha గారూ. మీకు వైజాసత్య గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
Message added 09:01, 31 జనవరి 2014 (UTC).  {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.

వైజాసత్య (చర్చ) 09:01, 31 జనవరి 2014 (UTC)

ఉంగళుక్కాగె దాన్, ఇంద మూస

సుజాతమ్మా అవర్గళుంగ, వణక్కం. చెన్నైయిల్ ఇరుప్ప తెలుగు వికీపీడియన్ గళ్ ఎల్లారుక్కాగె ఇంద మూస సేస్తిని. ఉంగ ప్రొఫైల్ ల ఇంద మూస పయన్ పరుచుకోంగ అని మనవి సేస్తా ఉంటిని. ఎప్పోళ్హుం ఉంగల్ సేవై యిల్ - శశి (చర్చ) 18:02, 8 ఫిబ్రవరి 2014 (UTC)

Chennai (Madras)இந்த பயனர் சென்னை (மெட்ராசு)யில் வாழ்கிறார்.
(ఈ వాడుకరి చెన్నై(మద్రాసు) లో నివసిస్తారు.)
వికీపీడియా:విద్యార్ధులకు తెలుగు వికీ వ్యాసరచన పోటీ : న్యాయనిర్ణేతలు

సుజాత గారూ,
న్యాయనిర్ణేతలు బేసి సంఖ్యలో ఉన్నారు. కావున మీరు కూడా ఒక న్యాయనిర్ణేతగా కొనసాగి ఉత్తమ వ్యాసాలను ఎంపిక చేయమని మనవి.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 07:45, 13 ఫిబ్రవరి 2014 (UTC)

తెలుగు వికీపీడియా దశాబ్ది వేడుకల ఉపకార వేతనము

Tewiki10 banner.png

నమస్కారం T.sujatha గారు,

తెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవాలకు మీరు చేసుకున్న ఉపకార వేతన అభ్యర్థన మాకందినది.
మీరు ఉపకార వేతనము కు అర్హత సాధించారని తెలిపేందుకు సంతోషిస్తున్నాము.
శుభాకాంక్షలు!
మరిన్ని వివరాలు మీకు మెయిల్ ద్వారా పంపటం జరిగింది - గమనించగలరు.
తమరి రాకకై 15-16 తేదీల్లో విజయవాడలో వేచి ఉన్నాము.

ఇట్లు
Pranayraj1985 (చర్చ) 10:10, 10 ఫిబ్రవరి 2014 (UTC), కార్యదర్శి, తెవికీ దశాబ్ది కార్యవర్గం

భారతదేశ జిల్లాలు & తాలూకాల వ్యాసాలు

సుజాత గారూ నమస్తే, భారతదేశ జిల్లాల జాబితా , భారతదేశం తాలూకాలు వ్యాసాలు ఒక సారి చూడగలరు. వీటికి సరైన రూపం ఇద్దాం. విస్తరణలు మరియు సంపూర్ణం చేయడం భారమైన పనిగా అనిపిస్తున్నది. ప్రస్తుతం ఒక రూపాన్నిద్దాం. అహ్మద్ నిసార్ (చర్చ) 19:05, 19 ఫిబ్రవరి 2014 (UTC)

అహ్మద్ నిసార్ గరూ ! త్వరగా స్పందించినందుకు ధన్యవాదాలు. మీరన్నట్లు భారతదేశ జిల్లాల జాబితా , భారతదేశం తాలూకాలు ముందుగా రూపం ఇస్తాము. విస్తరణ, సంపూర్ణం చాలా భారమైన పని అందుకు చాలా సమయం అవసరం. విస్తరణ మరియు సంపూర్ణ రూపం కాకున్నాపర్యటనకు అవసరమైన సమాచారంతో కొంతైనా సమాచారం అందించడానికి నేను ప్రత్యేకంగా ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే ఉత్తరాంచల్ రాష్ట్రంతో పని మొదలైంది. ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఇప్పటికే పూర్తి అయింది. జిల్లాల స్థాయిలో మాత్రమే పనిచేయాలని అనుకుంటున్నాను. ఇందుకు ఈ సంవత్సరం అంతా దృష్టి కేంద్రీకరించాలని అనుకుంటున్నాను. ఇందులో మీకు వీలైనంత పని చేస్తే చాలు. --t.sujatha 04:53, 20 ఫిబ్రవరి 2014 (UTC)
రెండు జాబితాలూ పూర్తిగా వున్నాయి. ఒక్కొక్క రాష్ట్రానికి చెందిన జిల్లాల మరియు తాలూకాల జాబితాలు సుజాత గారు పూర్తిచేస్తున్నారు. సంతోషం. దీని కోసం ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ప్రాజెక్టు మాదిరిగా వికీపీడియా:వికీప్రాజెక్టు/భారతదేశ జిల్లాలు ప్రాజెక్టు ఒకదాన్ని రూపకల్పన చేసి ఒక ప్రణాలిక ప్రకారం వ్యాసాలను అభివృద్ధి చేస్తే బాగుంటుంది. అలాంటిది ఏదైనా వుంటే అక్కడ నుండే మొదలుపెడదాం.Rajasekhar1961 (చర్చ) 09:21, 22 ఫిబ్రవరి 2014 (UTC)
సుజాతగారూ నమస్తే, భారతదేశంలోని జిల్లాల జాబితాలు, ప్రాజెక్టు సజావుగానే సాగుతోందని భావిస్తున్నాను. అలాగే [మూస:మహారాష్ట్ర జిల్లాలు] - [మహారాష్ట్రలోని జిల్లాలు] రెండు మూసలున్నాయి. ఇవి రెండూ అవసరమైతే ఉంచండి లేదా ఒకదాన్ని తొలగించేది. మహారాష్ట్ర జిల్లాలు వ్యాసంలోని మూస:మహారాష్ట్రలోని జిల్లాలు లో |చూ.|చ.|ది. లో దిద్దుబాటు కొరకు |ది| పై క్లిక్ చేస్తే మూస:మహారాష్ట్ర ప్రారభించండి అనే కొత్త పేజీలోకి పోతున్నది. సత్యగారూ, అర్జున గార్లు దీన్ని సరిచేసేది. అలాగే దశాబ్ది ఉత్సవాల ఫోటోలు మీదగ్గర వుంటే నామెయిలుకు దయచేసి పంపేది. ధన్యవాదాలు. అహ్మద్ నిసార్ (చర్చ) 15:18, 2 మార్చి 2014 (UTC)

తెలుగు సంస్కృతి

సుజాత గారూ, తెలుగు సంస్కృతిలో విభాగాలు చేయటం గమనించాను. మీ ప్రయత్నానికి ధన్యవాదాలు. నా వైపు నుండి కొన్ని ప్రతిపాదిత విభాగాలు.

 • పండుగలు
 • నృత్యాలు
 • సంగీత వాయిద్యాలు
 • బొమ్మలు
 • కథలు
 • వేషభాషలు
 • పందాలు
 • ఫల పుష్పాదులు (గోరింట, గోంగూర)
 • పశు పక్ష్యాదులు
 • ఆట పాటలు

మొదలగునవి. ఇది కేవలం సలహాగానే పరిగణించగలరు. ఇంకనూ బాగా విభజించవచ్చుననుకొన్నచో మీ ఆలోచనల ప్రకారమే చెయ్యండి. మతం, తత్త్వంలో నేను ఎక్కువగా రాయలేకపోతున్నాను. మీ సహాయం ఈ విభాగాలకి ఎంతయినా అవసరం. మన సమిష్టి కృషితో ఈ వ్యాసం చక్కని వ్యాసంగా రూపొందించబడుతుందని ఆశిస్తూ... - శశి (చర్చ) 14:11, 11 మార్చి 2014 (UTC)

శశిగారూ ! మీ ఆలోచన సరైనదే. ఈ విభాలన్ని వ్యాసంలో ఉంటాయి. అలాగే మరికొన్ని ఉంటాయి. ఈ వ్యాసం చూసి మన సభ్యులందరూ తమకు తెలిసిన విషయాలు తప్పక చేరుస్తారు. వ్యాసం అంత ప్రత్యేకమైనది, ఆసక్తికరమైనది. --t.sujatha (చర్చ) 14:17, 11 మార్చి 2014 (UTC)

Proposed deletion of ఉత్తర కచార్ హిల్స్

Ambox warning yellow.svg

The article ఉత్తర కచార్ హిల్స్ has been proposed for deletion because of the following concern:

విషయం లేని వ్యాసం

While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.

You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}} notice, but please explain why in your edit summary or on the article's talk page.

Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}} will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. ---కె.వెంకటరమణ ♪ చర్చ ♪ 03:40, 25 మార్చి 2014 (UTC) ---కె.వెంకటరమణ ♪ చర్చ ♪ 03:40, 25 మార్చి 2014 (UTC)

Proposed deletion of శరన్

Ambox warning yellow.svg

The article శరన్ has been proposed for deletion because of the following concern:

విషయం లేని వ్యాసం. మూస కోసం వ్యాసం అవసరం లేదు.

While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.

You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}} notice, but please explain why in your edit summary or on the article's talk page.

Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}} will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. ---కె.వెంకటరమణ ♪ చర్చ ♪ 09:41, 31 మార్చి 2014 (UTC) ---కె.వెంకటరమణ ♪ చర్చ ♪ 09:41, 31 మార్చి 2014 (UTC)

Proposed deletion of ఫతేపూర్ (ఉత్తరప్రదేశ్)

Ambox warning yellow.svg

The article ఫతేపూర్ (ఉత్తరప్రదేశ్) has been proposed for deletion because of the following concern:

విషయం లేని వ్యాసం. ఒక్క మూస మాత్రమే కలదు

While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.

You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}} notice, but please explain why in your edit summary or on the article's talk page.

Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}} will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. ---కె.వెంకటరమణ ♪ చర్చ ♪ 10:01, 31 మార్చి 2014 (UTC) ---కె.వెంకటరమణ ♪ చర్చ ♪ 10:01, 31 మార్చి 2014 (UTC)

Proposed deletion of భాగల్‌పూర్

Ambox warning yellow.svg

The article భాగల్‌పూర్ has been proposed for deletion because of the following concern:

విషయం లేని వ్యాసం, మూస్ మాత్రమే ఉన్నది.

While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.

You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}} notice, but please explain why in your edit summary or on the article's talk page.

Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}} will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. ---కె.వెంకటరమణ ♪ చర్చ ♪ 10:11, 31 మార్చి 2014 (UTC) ---కె.వెంకటరమణ ♪ చర్చ ♪ 10:11, 31 మార్చి 2014 (UTC)

ఏప్రిల్ 27, 2014 సమావేశం

ఈనెల 27 తేదీన తెవికీ సమావేశం జరుగుతున్నది. మీరు దయచేసి ఇందులో ప్రత్యక్షంగా గాని స్కైప్ ద్వారా పాల్గొని సమావేశాన్ని సఫలీకృతం చేస్తారని కోరుతున్నాను.Rajasekhar1961 (చర్చ) 12:39, 23 ఏప్రిల్ 2014 (UTC)

Proposed deletion of లోహిత్(అరుణాచల ప్రదేశ్)

Ambox warning yellow.svg

The article లోహిత్(అరుణాచల ప్రదేశ్) has been proposed for deletion because of the following concern:

విషయం లేని వ్యాసం

While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.

You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}} notice, but please explain why in your edit summary or on the article's talk page.

Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}} will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. --Plume pen w.gif కె.వెంకటరమణ చర్చ 11:09, 30 మే 2014 (UTC) --Plume pen w.gif కె.వెంకటరమణ చర్చ 11:09, 30 మే 2014 (UTC)

english aricles

Hello mam! please dont copy the english content as it is. If english content is present in telugu wikipedia, its quality is reduced. :( Also, it is difficult to monitor or translate the articles afterwards. If mass deletion is done, the quality reduces. Please do spend some time to translate them to telugu. :) Or else, you can use translation tools to some extent and understand the text. You can also ask the administrators to help you if needed. They will help you to deal with this problem. Your help is much appreciated. Thanks. :) -తమిళ్ కురిచిల్ | தமிழ்க்குரிசில் (చర్చ) 06:58, 24 జూలై 2014 (UTC)

వికీప్రాజెక్టులో పనిచేసేందుకు విజ్ఞప్తి

నమస్కారం..
తెలుగు వికీపీడియాలో, బహుముఖీనంగానూ ప్రస్తుతానికి జిల్లాల ప్రాజెక్టుల్లోనూ, మీరు చేస్తున్న కృషికి అభినందనలు. తెలుగు వికీపీడియాలో ప్రస్తుతానికి వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు జరుగుతోంది. ఆ ప్రాజెక్టుకు బాధ్యునిగా మీరు ఇటువంటి ప్రాజెక్టుల్లో మరింత ఉత్సాహంగా పనిచేయగలరని భావిస్తున్నాను. ఇందులో భాగంగా డిజిటల్ లైబ్రరీ ఆ ఇండియాలోని తెలుగు పుస్తకాలను వికీపీడియన్లకు పనికివచ్చే విధంగా కాటలాగ్ చేస్తున్నాము. అలాగే కాటలాగులోని తెలుగు పుస్తకాలను డిజిటల్ లైబ్రరీ ద్వారా దించుకుని చదివి వికీలో చక్కని వ్యాసాలూ రాస్తున్నాము, ఉన్న వ్యాసాలూ అభివృద్ధి చేస్తున్నాం. వికీసోర్సులో రాజశేఖర్ గారి చొరవతో సమర్థ రామదాసు, ఆంధ్ర వీరులు మొదటి భాగం, రెండవ భాగం, భారతీయ నాగరికతా విస్తరణము, కలియుగ రాజవంశములు, కాశీ యాత్రా చరిత్ర, కోలాచలం శ్రీనివాసరావు, నా జీవిత యాత్ర (టంగుటూరి ఆత్మకథ) వంటి అపురూపమైన గ్రంథాలు ఈ ప్రాజెక్టు ద్వారా చేర్చి అభివృద్ధీ చేస్తున్నాం. వీటిలో మీకు ఏదైనా విభాగం ఆసక్తికరంగా తోస్తే దానిని ఎంచుకుని మొత్తం ప్రాజెక్టును అభివృద్ధి చేసే దిశకు వెళ్ళాలని ఆశిస్తున్నాము. ఈ ప్రాజెక్టులో ప్రత్యేకంగా మీ సహకారం, మార్గదర్శనం అత్యవసరమని భావించి మిమ్మల్ని సెల్‌ఫోన్ సంభాషణ ద్వారా సంప్రదించే ప్రయత్నాలు చేసి విఫలమయ్యాను. వచ్చే నెలలో ఈ ప్రాజెక్టు విషయమై ఒక ఎడిట్-ఎ-థాన్ ఉండే అవకాశం ఉంది. మీరు ప్రత్యక్షంగానో, స్కైప్ ద్వారానో మీ వీలువెంబడి ఆ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మీతో పాటుగా ఈ ప్రాజెక్టులో పనిచేయడానికి ఉత్సుకతతో --పవన్ సంతోష్ (చర్చ) 07:31, 26 జూలై 2014 (UTC)

విశేష వ్యాసాల కొరకు ప్రతిపాదనలు

సుజాత గారూ, నమస్కారం. వికీపీడియా:విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు/2014 పేజీని ఓసారి చూసి మీ అభిప్రాయాలు తెలుపండి. ఈ ప్రక్రియకు మెరుగు పరచండి. తగిన రీతిలో మార్పులు చేర్పులు జరిగిన తరువాత అమలు చేసేందుకు చర్చకు పెడదాం. అహ్మద్ నిసార్ (చర్చ) 20:58, 2 ఆగష్టు 2014 (UTC)

వికీపీడియా - విశేష వ్యాసాల ఎంపిక ప్రక్రియ

నమస్కారం, సభ్యులు వికీపీడియా:విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు/2014 పేజీని ఓసారి చూసి అందులోని ప్రతిపాదిత వ్యాసాల జాబితాను పరిశీలించండి. అందులో విశేష వ్యాసాలకు కావలసిన లక్షణాలుంటే, వాటిని మీ ఆమోదం తెలుపండి, వాటిని విశేష వ్యాసాలుగా గుర్తించేందుకు వీలుంటుంది. మీ అభిప్రాయాలు ప్రతిపాదిత వ్యాసాల క్రింద "సభ్యుల అభిప్రాయాలు" శీర్షికలో వ్రాయండి. అలాగే, వ్యాసాలపేర్ల క్రింద మీ అంగీకారం తెలుపుతూ సంతకం చేయండి. మీ అంగీకారం ఓటుగా పరిగణింపబడును. మెజారిటీ సభ్యుల అభిప్రాయాలతోనే వ్యాసం విశేష వ్యాసంగా ఎన్నుకోబడుతుంది. సభ్యులందరూ తప్పక పాల్గొనవలసినదిగా మనవి. అహ్మద్ నిసార్ (చర్చ) 19:36, 3 ఆగష్టు 2014 (UTC)

వర్గం:తెలుగుకథకులు

వర్గం:తెలుగుకథకులు, which you created, has been nominated for possible deletion, merging, or renaming. If you would like to participate in the discussion, you are invited to add your comments at the category's entry on the Categories for discussion page. Thank you. --Plume pen w.gif కె.వెంకటరమణ చర్చ 07:19, 8 ఆగష్టు 2014 (UTC)

Proposed deletion of పశ్చిమ గరోహిల్స్

Ambox warning yellow.svg

The article పశ్చిమ గరోహిల్స్ has been proposed for deletion because of the following concern:

విషయం లేని వ్యాసం - ఒక్క మూస కోసం వ్యాసం అవసరం లేదు.

While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.

You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}} notice, but please explain why in your edit summary or on the article's talk page.

Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}} will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. --Plume pen w.gif కె.వెంకటరమణ చర్చ 16:40, 21 ఆగష్టు 2014 (UTC) --Plume pen w.gif కె.వెంకటరమణ చర్చ 16:40, 21 ఆగష్టు 2014 (UTC)

మీ కృషికి జోహార్లు

సుజాత గారూ, అవిశ్రాంతంగా తెవికీలో జిల్లాల వ్యాసాలపై మీరు చేస్తున్న కృషికి నా జోహార్లు. కాకపోతే మిగిలిన సభ్యులు పాల్గొనటం లేదని అధైర్యపడవద్దు. తెవికీ చక్కగా పది కాలల పాటు వర్ధిల్లుతుందని నా ఘాట్టి నమ్మకం :-) నేను అప్పుడప్పుడు బిజీ అయి ఇక్కడ కనిపించకపోయినా, తిరిగి వస్తూనే ఉంటాను --వైజాసత్య (చర్చ) 03:08, 16 సెప్టెంబరు 2014 (UTC)

ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం

సుజాతగారూ నమస్కారం. IEG గ్రాంట్స్ క్రింద, వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం అనే ప్రాజెక్టును చేపట్ట దలచాను, అందులకు మీ అమూల్యమైన సంపూర్ణ సహకారము కోరుచున్నాను. అలాగే ఈ ప్రాజెక్టుకు ముఖ్యమైన వాలంటీర్లలో ప్రధాన వాలంటీరుగా వుండవలసినదిగా మనస్పూర్తిగా కోరుచున్నాను. మీరు మీ అమూల్యమైన సహాయసహకారాలను అందిస్తారని, నన్ను మన్నిస్తారని ఆకాంక్షిస్తున్నాను. అహ్మద్ నిసార్ (చర్చ) 15:08, 28 సెప్టెంబరు 2014 (UTC)

సోదరి సుజాత గారూ, ఈ పేజీలను చూడండి.
 • వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం
 • వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం
 • మెటా వికీలో ఈ ప్రాజెక్టు ప్రపోజల్ పేజీ [4] ఓసారి స్టడీ చేయండి. ఈ ప్రాజెక్టు గురించి మీకు ఒక అవగాహన కలుగుతుంది. ఆతరువాతే మీరు నిర్ణయం గీసుకోగలరు.
 • ఈ ప్రాజెక్టు కాలం ఒక సంవత్సరం. మొదట 6నెలల కాలానికి (బహుశా) గ్రాంటు రావచ్చు. ఆతరువాత ఇంకో ఆరు నెలలు వికీమీడియా నిర్ణయంపై ఆధారపడి వుంటుంది.
 • గ్రాంటు రావాలంటే వికీమీడియాకు మన సమూహం ఒప్పించగలగాలి. ఒప్పించాలంటే ఈ ప్రాజెక్టువల్ల తెవికీకి కలిగే లాభాలు వనరుల లభ్యం, వ్యాసాల పెంపుదల, సభ్యుల పెరుగుదల, ఫోటోల సంఖ్య పెరుగుదల, వీటి గురించి మెటా వికీలోని ప్రఫోజల్ పేజీలోని ఎండార్స్ మెంట్ (సుపోర్ట్) పేజీలోనూ, చర్చాపెజీలోనూ తెవికీ సమూహపు సభ్యుల వ్రాయవలసివుంటుంది. తెవికీతో పాటు, ఇతర భాషా సమూహపు సభ్యులుకూడా సపోర్టింగ్ గా వ్రాయవచ్చు.
 • దీని ఆధారంగానే, వికీమీడియా వారు వివిధ ప్రశ్నలు సంధిస్తారు, వాటికి మనం ఒపిగ్గాను, లాజికల్ గాను సమాధానమిస్తూ ఈప్రాజెక్టు యొక్క విశిష్టత గూర్చి, అవసరం గూర్చి, లాభం గూర్చి తెలుపవలసి వుంటుంది. అలాగే మన తెవికీ సమూహం ఎలాంటి తోడ్పాటునందిస్తారు అనే విషయం పై కూడా చర్చ జరిగే అవకాశం వుంది.
 • ఈ ప్రాజెక్టు బహుశా డిసెంబరు లేదా జనవరిలో (సాంక్షన్ అయితే) ప్రారంభం అయ్యే సూచనలున్నాయి. అహ్మద్ నిసార్ (చర్చ) 15:06, 29 సెప్టెంబరు 2014 (UTC)

ప్రస్తుతానికి ప్రాజెక్టు పేజీ

సుజాత గారూ, ప్రస్తుతానికి ప్రాజెక్టు పేజీలోని ఆంగ్ల విభాగాలకు తర్జుమా చేపట్టనక్కరలేదు. ఇంకో విషయం, తెలుగులో పైభాగాన వివరించాను, వాటినే ఆంగ్లంలో క్రింది భాగాన తర్జుమా చేసి వ్రాసాను. కాబట్టి ఆంగ్ల విభాగాలను అలాగే ఆంగ్లంలోనే ఉంచుదాం. అహ్మద్ నిసార్ (చర్చ) 18:57, 29 సెప్టెంబరు 2014 (UTC)

 • నిస్సార్ గారూ! అలాగే చేస్తాను. తర్జుమా చేయాలేమో అనుకున్నాను. --t.sujatha (చర్చ) 19:01, 29 సెప్టెంబరు 2014 (UTC)

వ్యాసాల అభివృద్ధికి వ్యాసాల్లోనే సోర్సులు

మిత్రులకు నమస్కారం,
తెవికీలో వ్యాసాలు అభివృద్ధి చేసేందుకు కాస్త సోర్సుల కొరత ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమస్యను పరిష్కరించే లక్ష్యంతో తెవికీలో వికీమీడియా సహకారంతో తెలుగు సమాచారం అందుబాటులోకి ప్రాజెక్టు ప్రారంభించిన విషయం తెలిసిందే. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలను జాబితా చేసేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టులో పుస్తకాలను జాబితా చేస్తూ పుస్తకం ఉన్న డీఎల్‌ఐ లింకులు, రచయిత పేరు, గ్రంథం విభాగం, వివరాలు వంటి వాటివి ఇస్తున్నాము. ఈ పుస్తకాలను వినియోగించుకుని వ్యాసాలు అభివృద్ధి చేయడం, కొత్తవి తయారు చేయడం దీని పరమలక్ష్యం. ఈ క్రమంలో మరో ముందడుగుగా నేను, రాజశేఖర్ గారూ చర్చించుకుని వికీపీడియన్లు తేలికగా వ్యాసాలు అభివృద్ధి చేసేందుకు కాపీరైట్ పరిధిలో లేని పుస్తకాలకు సంబంధించిన పేజీల్లో ఆయా పుస్తకాల ముందుమాటలు, విషయసూచికలు, కవర్‌పేజీ, లోపలి వివరాల పేజీలను కొత్తగా తయారుచేసే వ్యాసాల్లో చేర్చనున్నాము. శ్రీమాధవాచార్య విద్యారణ్యస్వామి (నాటకం), మాలతి (నాటకం), మాళవికాగ్నిమిత్రము (కందుకూరి వీరేశలింగం) వంటి పుస్తకాల గురించి తయారుచేసిన చిరువ్యాసాల్లో సంబంధిత పుస్తకాల వివరాలున్న పేజీలు చేర్చాము. సహ సభ్యులు వీలున్నంతవరకూ ఆయా వ్యాసాల్లో చేర్చిన పేజీలు చూసి వివరాలతో అభివృద్ధి చేయగలరని ఆశిస్తున్నాము.
ఇది చిన్న ప్రయత్నం/పైలెట్ ప్రాజెక్ట్ లాంటిది. మరికొందరు వికీపీడియన్లు ఈ ఆలోచన నచ్చి ముందుకు వస్తే ఈ పద్ధతిలో మరిన్ని వ్యాసాలు నాణ్యంగా రూపకల్పన చేసేందుకు ప్రణాళిక వేసి పనిచేద్దాము.
నా ప్రతిపాదన గమనించినందుకు ధన్యవాదాలు.--పవన్ సంతోష్ (చర్చ) 10:45, 5 అక్టోబరు 2014 (UTC)

దీపావళి శుభాకాంక్షలు

మీకూ, మీ కుటుంబసభ్యలకు దీపావళి శుభాకాంక్షలు. వెలుగుల పండుగ మీ జీవితంలో వెలుగులు నింపాలని కోరుతున్నాను.

అసతోమా సద్గమయా తమసోమా జ్యోతిర్గమయా
మృత్యోర్మా అమృతంగమయా ఓం శాంతి శాంతి శాంతి:

మీ సన్నిహితుడు
పవన్ సంతోష్ (చర్చ) 12:56, 23 అక్టోబరు 2014 (UTC)

పిట్స్‌బర్గ్ వ్యాసం అనువాదంలో సహాయం

నమస్కారం. ఇంగ్లీషు వికీపీడియానుండి పిట్స్‌బర్గ్ వ్యాసాన్ని తెలుగులోనికి అనువాదం చేయడంలో మీ సహాయాన్ని అర్థిస్తున్నాను. మీకు వీలైనప్పుడు కొంచెం కొంచెం అనువాదం చేస్తూ ఉండండి.--స్వరలాసిక (చర్చ) 23:50, 17 నవంబర్ 2014 (UTC)

చేతిపుస్తకము/ హాండ్ బుక్

నమస్కారం సుజాత గారు.... భాస్కరనాయుడు గారు తయారుచేసిన చేతిపుస్తకము/ హాండ్ బుక్ ను ఒకసారి గమనించి సలహాలు, సూచనలు ఇవ్వగలరు. చేతిపుస్తకము/ హాండ్ బుక్ కొరకు ఇక్కడ చూడండి. Pranayraj1985 (చర్చ) 06:15, 31 డిసెంబరు 2014 (UTC)


వికీపీడియా:తెవికీ 11వ వార్షికోత్సవాలు - Tewiki 11th Anniversary Celebrations

సహవికీపీడియనులకు మనవి: తిరుపతిలో జరుపబోవు తెవికి సభల గురించి మూడు రోజుల కార్యక్రమాల సమయానుకూల వివరాలు వ్రాయడమైనది. వికీపీడియా:తెవికీ 11వ వార్షికోత్సవాలు - Tewiki 11th Anniversary Celebrations లో 18 వ అంశముగా వ్రాయడమైనది. దీనిని పరిశీలించి తగు విధంగా సవరించి దీనికి ఒక సమగ్ర రూపమివ్వవలసినదిగా కోరడమైనది. ఎల్లంకి (చర్చ) 08:23, 1 జనవరి 2015 (UTC)

స్వాగతం

Tewiki 11 logo.png

తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి.