శ్రీనివాస మంగా పురం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీనివాస మంగాపురం లో శ్రీ వెంకటేస్వర స్వామి వారి ఆలయంలోని ద్వజ స్థంబం

శ్రీనివాస మంగాపురం... తిరుపతి నుండి మదనపల్లె వెళ్ళే దారిలో తిరుపతి కి 12 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం వుంది.

కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం[మార్చు]

ఇతిహాసాల, పురాణాల ప్రకారం స్వామి నారాయణవనం లో కళ్యాణం చేసుకొని, తిరుమల కొండ మీద వెలసే ముందు పద్మావతి అమ్మవారితో ఇక్కడ కొంత కాలం గడిపారు. శ్రీని వాస మంగాపురంలోని శ్రీ వెంకటేస్వరాలయం గతంలో పూజా పునస్కారాలు లేక పురావస్థు శాఖవారి ఆధీనం లో వుండేది. చాల కాల తర్వాత ఈ ఆలయంలో నిత్య పూజాదికాలు జరుగు తున్నాయి. పురావస్థు శాఖ వారి బోర్డు ఈ నాటికి ఆలయ ప్రాంగణం లో చూడ వచ్చు. అదే విధంగా పాకాల -- తిరుపతి రైలు మార్గంలో మంగా పురం వద్ద గతంలో రైల్వే స్టేషను వుండేది. ఆ దారిన వచ్చే భక్తులు అందరు మంగాపురంలొ దిగి అక్కడి స్వామి వారిని దర్శించుకొని ఇక్కడికి దగ్గరలోని తిరుమల కొండల పాధ భాగాన వున్న శ్రీవారి మెట్టు వద్దకు వెళ్లి అక్కడి నుండి ప్రారంబమౌ నూరు మెట్ల దారి గుండా తిరుమలకు వెళ్లె వారు. తిరుపతిలోని అలిపిరి వద్దనున్న మెట్ల దారికంటే ఈ మెట్ల దారి అతి దగ్గర. కాని ప్రస్తుతం మంగా పురంలో రైల్వే స్టేషను లేదు. ఈ మెట్ల దారిని ఉపయోగించే [భక్తులు చాల తక్కువ. సుధూర ప్రాంతాల వారికి ఇక్కడ తిరుమలకు ఒక మెట్ల దారి వున్నదన్న సంగతి కూడ తెలియదు.

గతంలో ఈ మెట్లదారి భక్తులతో పాటు చంద్రదిరి పరిసర ప్రాంతాలలో పెల్లెవాసులు నిత్యావసర వస్తువులైన పాలు, పెరుగు, మజ్జిగ, కూరగాయలు మొదలైన వాటిని ఈ మెట్ల దారి గుండా కొండపైకి తీలుకెళ్ళి అమ్మి తిరిగి వచ్చేవారు. కొండపైకి ఇది చాల దగ్గరి దారి. ఒక గంట లోపుల గమ్యస్థానం చేరుకోవచ్చు.

ప్రస్తుతం దేవస్థానం వారు తిరుపతి లోని అలిపిరి నుండి ఉచిత బస్సులను ఇక్కడున్న శ్రీవారి మెట్టు వరకు నడుపు తున్నది. ఆ విధంగా కొంత మంది భక్తులు ఈ నూరుమెట్ల దారి ద్వారా కూడ నడుస్తున్నారు. ఆవిధంగా నైనా మరుగున పడిపోయిన ఈ మెట్లదారి మరలా కళకళ లాడుతున్నది.

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]