Jump to content

వేంకటేశ్వరుడు

వికీపీడియా నుండి
(శ్రీ వేంకటేశ్వరుడు నుండి దారిమార్పు చెందింది)
శ్రీ వేంకటేశ్వరుడు
దేవనాగరిवेङ्कटेश्वर
సంస్కృత అనువాదంVēṅkaṭēśvara
తెలుగువేంకటేశ్వర
అనుబంధంవిష్ణువు అవతారం
నివాసంవైకుంఠం
మంత్రంఓం నమో వేంకటేశాయ, ఓం నమో నారాయణ
ఆయుధములుశంఖం , చక్రం
గుర్తులుశ్రీచరణం
భర్త / భార్యశ్రీదేవి / లక్ష్మీ / అలమేలు మంగ, భూదేవి
వాహనంగరుడ
మతంహైందవం

వేంకటేశ్వరుడు (సంస్కృతం: वेंकटेश्वर), లేదా వేంకటాచలపతి, శ్రీనివాసుడు. విష్ణువు యొక్క కలియుగ అవతారంగా భావించబడే హిందూ దేవుడు.వేం = పాపాలు, కట = తొలగించే, ఈశ్వరుడు = దేవుడు. భక్తుల కష్టాలు తొలగించే దేవునిగా వేంకటేశ్వర నామంతో ప్రసిద్ధి చెందాడు. ప్రజలందరూ ఆరాధించే ఆలయం తిరుమల. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి తిరుమలలో ఉంది. . కలియుగ ప్రత్యక్ష దేవుడు. ఆ నారాయణుడే వేంకటేశ్వరస్వామి గా వెలిసారు. ఎన్నో జన్మల పుణ్య ఫలంతోనే తిరుపతికి వెళ్ళగలము .

చరిత్ర

[మార్చు]

కలియుగ రక్షణార్థం క్రతువు

[మార్చు]

ఒక్కప్పుడు కశ్యపాది మహర్షులు గంగానది ఒడ్డున కలియుగ రక్షణార్థం క్రతువు చేయ నిర్ణయించారు. యజ్ఞం ఆరంభించే సమయానికి నారదుడు అక్కడకు వచ్చి, అక్కడ ఉన్న కశ్యప, ఆత్రేయ, మార్కండేయ, గౌతమాది మహర్షులను చూసి, ఆ మహర్షులను క్రతువు దేనికొరకు చేస్తున్నారు, యాగఫలాన్ని స్వీకరించి కలియుగాన్ని సంరక్షించే వారు ఎవరు అని ప్రశ్నిస్తే, నారదుని సలహామేరకు అందరూ భృగు మహర్షి వద్దకు వెలతారు. అప్పుడు ఆ మహర్షులందరు భృగు మహర్షిని ప్రార్థించి కలియుగంలో త్రిమూర్తులలో ఎవరు దర్శన, ప్రార్థన, అర్చనలతో ప్రీతి చెంది భక్తుల కష్టాలను నిర్మూలించి సర్వకోరికలు తీరుస్తారో పరీక్షచేసి చెప్పమని కోరుతారు.

సత్యలోకం

[మార్చు]

మహర్షుల కోరికమేరకు భృగువు యోగదండం, కమండలం చేత బట్టి, జపమాల వడిగా త్రిప్పుతూ సత్యలోకం ప్రవేశించగా, బ్రహ్మ సరస్వతీ సమేతుడై సరస్వతి సంగీతాన్ని ఆలకిస్తూ, చతుర్వేదఘోష జరుగుతూ ఉంటే దానిని కూడా ఆలకిస్తూ, సృష్టి జరుపుతూ ఉంటాడు. చతుర్ముఖ బ్రహ్మ భృగు మహర్షి రాకను గ్రహించడు. తన రాక గ్రహించని బ్రహ్మకు కలియుగంలో భూలోకంలో పూజలుండవు అని శపిస్తాడు.

కైలాసం

[మార్చు]

బ్రహ్మలోకం నుండి శివలోకం వెళతాడు భృగువు. శివలోకంలో శివపార్వతులు ఆనంద తాండవం చేస్తూ పరవశిస్తుంటారు. వారు భృగు మహర్షి రాకను గ్రహించకపోవడంతో ఆగ్రహించి, శివునకు కలియుగంలో భూలోకంలో లింగ రూపంలో మాత్రమే పూజలు జరుగుతాయని శపిస్తాడు.

వైకుంఠం

[మార్చు]
శ్రీ వేంకటేశ్వరుడు

శివలోకం నుంచి నారాయణలోకం వెళతాడు భృగువు. ఇక్కడ నారాయణుడు ఆదిశేషుని మీద శయనించి ఉంటాడు. ఎన్నిసార్లు పిలిచినా పలుకలేదని భృగువు, లక్ష్మీ నివాసమైన నారాయణుని వామ వక్షస్ధలాన్ని తన కాలితో తన్నుతాడు .అప్పుడు శ్రీమహావిష్ణువు తన తల్పం నుండి క్రిందకు దిగి " ఓ మహర్షీ!మీ రాకను గమనించలేదు, క్షమించండి.నా కఠిన వక్షస్థలాన్ని తన్ని మీ పాదాలు ఎంత కందిపోయుంటాయో" అని భృగుమహర్షిని ఆసనం పైన కూర్చుండబెట్టి అతని పాదాలను తన ఒడిలో పెట్టుకుని ఒత్తడం మొదలుపెట్టాడు. అలా ఒత్తుతూ మహర్షి అహంకారానికి మూలమైన పాదం క్రిందిభాగంలోని కన్నును చిదిమేశాడు. మహర్షి తన తప్పును తెలుసుకొని క్షమాపణ కోరుకొని వెళ్ళిపోయాడు. విష్ణువునే సత్వగుణ సంపూర్ణుడిగా గ్రహించాడు. కాని తన నివాసస్థలమైన వక్షస్థలమును తన్నిన కారణంగా లక్ష్మీదేవి అలకపూని భూలోకానికి వెళ్ళిపోయింది. శ్రీమహాలక్ష్మి లేని వైకుంఠంలో ఉండలేని మహావిష్ణువు కూడా లక్ష్మీదేవిని వెదుకుతూ భూలోకానికి పయనం అయ్యాడు.

భూలోకం

[మార్చు]
తిరుమలలోని వేంకటేశ్వరని ఆలయం ముందు భాగం

లక్ష్మీదేవి తన స్వర్గపు నివాసాన్ని విడిచిపెట్టి, భూమిపై కరవీరపూర్ (కొల్హాపూర్) లో నివసించింది. ఆమె బయలుదేరిన తర్వాత, విష్ణువు భూలోకంలో, వెంకట కొండపై పుష్కరిణి పక్కన, ఆహారం, నిద్ర లేకుండా, లక్ష్మి తిరిగి రావడానికి ధ్యానంతో. చింత చెట్టు క్రింద చీమలపుట్ట (కొండ) లో నివసించాడు.బ్రహ్మ, శివుడు అతడిపై జాలి కలిగి, విష్ణువుకి సేవ చేయాలని ఒక ఆవు, దూడ రూపాలుగా ఏర్పడ్డారు. లక్ష్మీ ఒక ఆవులకాపరిణి రూపంలో చోళ దేశం యొక్క రాజుకు ఆవు, దూడను అమ్మింది. చోళ రాజు తన పశువుల మందతో పాటు వెంకట కొండపై ఈ పశువులను కూడా కలిపి మేపటానికి పంపుతాడు. చీమలపుట్ట మీద విష్ణువుని కనిపెట్టి, ఆవు తన పాలును అందించి, తద్వారా అతనికి ఆహారం ఇచ్చింది. ఇంతలో, రాజభవంతి వద్ద, ఆవు నుండి కొద్దిగానైనా పాలు లభించడం లేదని, దీని వల్ల చోళ రాణి ఆవు కాపరుడికి శేరాబడు అనే యాదవుడు . పాలు లేకపోవడానికి కారణాన్ని తెలుసు కోవడానికి, ఆవు కాపరుడు శేరాబడు ఆవును రహస్యంగా అనుసరించి, చీమలపుట్టపై తన పొదుగు నుండి పాలను ఖాళీ చేస్తున్న ఆవును కనుగొన్నాడు. ఆవు యొక్క ప్రవర్తన వలన ఆగ్రహానికి గురైన ఆవు కాపరుడు శేరాబడు తన గొడ్డలిని ఆవు మీదకు విసిరి వేసాడు, కాని ఆవుకు హాని కలిగించ లేకపోయాడు. అయినప్పటికీ, ఆవు కాపరుడు శేరాబడు విసిరిన గొడ్డలి దెబ్బ నుండి ఆవును కాపాడేందుకు విష్ణువు చీమలపుట్ట నుండి పైకి వచ్చాడు. ఆవు కాపరుడు శేరాబడుతన గొడ్డలి దెబ్బతో విష్ణువుకు రక్తస్రావం అవటం చూసినపుడు, శేరాబడుకి మహావిష్ణువు పిశశిగా శేరాబడుని శపిస్తాడు తన తప్పు తెలుసుకొని క్షమించమని ప్రార్థిస్తాడు మహావిష్ణువు అప్పుడు నాకు పద్మావతితో  కళ్యాణం జరుగుతుంది అప్పుడు నీకు శాపం విమోక్షం కలుగుది మహావిష్ణువు శేరాబడుకి ఒక వరం ఇస్తారు భూమి మీద మొట్ట మొదట నువ్వు నన్ను చూశావు కాబట్టి నా ప్రథమ దర్శనం నీకె ఇస్తున్నాను ఆ శాపం అంతం అవుతుందని విష్ణువు దీవించాడు.

ఆ తరువాత, విష్ణువు, శ్రీనివాసుడు లాగా, వరాహ క్షేత్రంలో ఉండాలని నిర్ణయించుకున్నాడు. తన నివాసం కోసం ఒక స్థలాన్ని మంజూరు చేసేందుకు వరాహుడిని (విష్ణువు యొక్క అడవి పంది అవతారం) కోరాడు.

నారాయణపురం

[మార్చు]

తిరుపతికి 20 మైళ్ళ దూరంలో నారాయణపురం నగరాన్ని ఒకప్పుడు రాజధానిగా చేసుకుని సుధర్ముడు అనే రాజు పాలించేవాడు. విష్ణుమూర్తి ఆగ్రహానికి బలై రాక్షసుడిగా మారిన చోళరాజు తనువు ముగించే రోజు రానే వచ్చింది. మరుజన్మకు చోళరాజు సుధర్ముని భార్య గర్భంలో ప్రవేశించి, వారికి కొడుకుగా పుట్టాడు. సుధర్ముడు కొడుకుకు ఆకాశరాజు అని పేరు పెట్టి, అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. ఒకరోజు సుధర్ముడు వేటకు వెళ్ళి, బాగా అలసిపోయి, దగ్గర్లో ఉన్న కపిలతీర్థంలో దాహం తీర్చుకుని, విశ్రాంతిగా కూర్చున్నాడు. అదే సమయంలో ఒక నాగకన్య కపిలతీర్థంలో స్నానం చేసి అటుగా రావడం సుధర్ముడు కంట పడింది. ఆమె అందాలకు పరవశుడై, నాగకన్య దరిచేరి, వివరాలు అడిగి తెలుసుకుని, సుధర్ముడు తన గురించి కూడా తెలియ చెప్పి వెంటనే గాంధర్వ వివాహం చేసుకున్నాడు. తర్వాత, వారిద్దరికీ తొండమానుడు అనే పుత్రుడు కలిగాడు.

కొంతకాలానికి సుధర్మునికి వృధాప్యం వచ్చాక, అవసాన దశలో పెద్ద కొడుకు ఆకాశరాజుకు రాజ్యాన్ని అప్పగించాడు. అలాగే, తొండమానుడిని బాధ్యతలు స్వీకరించమని చెప్పి చనిపోయాడు. ఆకాశరాజు భార్య ధరణీదేవి, ఇతను ధర్మవంతుడై పరిపాలన చేసాడు.ఆకాశరాజు కుమార్తె పద్మావతిని చూసి ఆమెను వలిచి ఆ విషయాన్ని వకుళకు చెబుతాడు..వకుళ ఆకాశరాజను కలిసి వివాహానికి అతడిని అంగీకరింప చేస్తుంది. కుబేరుని ఆర్థిక సహాయంతో శ్రీనివాసుని వివాహం ఆకాశరాజు కుమార్తె పద్మావతితో జరుగుతుంది..ఈ విషయం తెలిసిన శ్రీమహాలక్ష్మి అచ్చటకు చేరుతుంది.. సపత్నుల కలహంతో శిలగా మారతాడు శ్రీనివాసుడు.అప్పటి నుండి ఇప్పటి వరకు భూలోకంలోనే శ్రీ మహా విష్ణువు రూపం శ్రీ వేంకటేశ్వరునిగా పూజలు అందుకుంటున్నాడు.ఓం నమో వేంకటేశాయ ఓం నమో నారాయణాయ నమః.[1]

వేంకటేశ్వర సహస్రనామ స్తోత్రం

[మార్చు]

శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం హిందూమత ప్రార్థనలలో ఒకటి.ఇది శ్రీవేంకటేశ్వరుని వేయి నామాలను సంకీర్తనం చేసే స్తోత్రం [2].ఈ స్తోత్రాన్ని తిరుమల క్షేత్రంలో జరిగే సేవా కార్యక్రమాలలో ఒకటిగా ప్రతిరోజు వేదపండితులు కీర్తిస్తారు. దిని రచన ప్రముఖ జ్యోతిష్కులు కొమర్రాజు భరద్వాజ్ శర్మ గారు . || top astrologer In Telugu Komarraju Bharathwaj sharma ||

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Hay, Bruno; Beaumont, Olivier; Fleurence, Nolwenn; Lambeng, Nora; Cataldi, Michel; Lorrette, Christophe; Knopp, Kevin; Hartmann, Jürgen; Beckstein, Fabia; Stobitzer, Dorothea; Milošević, Nenad; Stepanić, Nenad; Wu, Jiyu; Mildeova, Petra (2023-02-04). "Inter-laboratory Comparison on Thermal Diffusivity Measurements by the Laser Flash Method at Ultra-high Temperature". International Journal of Thermophysics. 44 (4). doi:10.1007/s10765-023-03159-5. ISSN 0195-928X.
  2. "శ్రీ వేంకటేశ్వర స్వామి సహస్ర నామావళి". Archived from the original on 2021-01-21. Retrieved 2021-03-02.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

వెలుపలి లంకెలు

[మార్చు]