బుర్కినా ఫాసో

వికీపీడియా నుండి
(Burkina Faso నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Burkina Faso
Flag of Burkina Faso Burkina Faso యొక్క చిహ్నం
నినాదం
"Unité, Progrès, Justice"  (French)
"Unity, Progress, Justice"
Burkina Faso యొక్క స్థానం
Burkina Faso యొక్క స్థానం
రాజధాని
అతి పెద్ద నగరం
Ouagadougou
12°20′N 1°40′W / 12.333°N 1.667°W / 12.333; -1.667
అధికార భాషలు French
ప్రభుత్వం Semi-presidential republic
 -  President Blaise Compaoré
 -  Prime Minister Tertius Zongo
Independence from France 
 -  Date August 5 1960 
విస్తీర్ణం
 -  మొత్తం 274,000 కి.మీ² (74th)
105,792 చ.మై 
 -  జలాలు (%) 0.1%
జనాభా
 -  2005 అంచనా 13,228,000 (66th)
 -  1996 జన గణన 10,312,669 
 -  జన సాంద్రత 48 /కి.మీ² (145th)
124 /చ.మై
జీడీపీ (PPP) 2005 అంచనా
 -  మొత్తం $16.845 billion1 (117th)
 -  తలసరి $1,284 (163rd)
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) Increase 0.342 (low) (174th)
కరెన్సీ West African CFA franc (XOF)
కాలాంశం GMT
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .bf
కాలింగ్ కోడ్ +226
1 The data here is an estimation for the year 2005 produced by the International Monetary Fund in April 2005.

బుర్కినా ఫాసో [1] పశ్చిమ ఆఫ్రికాలో ఒక భూపరివేష్టిత దేశం. దేశ వైశాల్యం సుమారుగా 2,74,200 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. దీనికి 6 సరిహద్దు దేశాలు ఉన్నాయి. ఉత్తర దిశలో మాలి, తూర్పున నైజర్, ఆగ్నేయంలో బెనిన్, టోగో, దక్షిణ సరిహద్దులో ఘనా, నైరుతి సరిహద్దులో ఐవరీ కోస్ట్. 2017 లో దాని జనాభా 20 మిలియన్లకంటే అధికంగా ఉన్నట్లు అంచనా వేయబడింది.[2] బుర్కినా ఫాసో ఒక ఫ్రాంకోఫోన్ దేశం. ఇక్కడ ఫ్రెంచి భాష అధికారభాషగా, వ్యాపార భాషగా ఉంది. ఇది గతంలో రిపబ్లిక్ అఫ్ అప్పర్ వోల్టా (1958-1984) గా పిలువబడింది. 1984 ఆగస్టు 4 న అప్పటి ప్రెసిడెంట్ థామస్ సంకర "బుర్కినా ఫాసో"గా పేరు మార్పిడి చేసాడు. పౌరులు దీనిని బుర్కినాబే అని పిలుస్తుంటారు. దీని రాజధాని ఓవాగడౌగో.

క్రీ.పూ. 14000 నుండి క్రీ.పూ. 5000 వరకు ఇక్కడ ప్రస్తుత బుర్కినా ఫాసో వాయవ్య భాగంలో వేట ఆధారితం, వస్తుసేకరణతో జీవనం సాగించే ప్రజలు నివసించారు. సా.శ. 3 వ - 13 వ శతాబ్దాల వరకు ప్రస్తుత ఆగ్నేయ ప్రాంతంలో ఇనుపయుగానికి చెందిన బుర సంస్కృతికి చెందిన ప్రజలు నివసించారు. నైరుతి నైజెర్ భూభాగంలో ఉండేది. 8 వ, 15 వ శతాబ్దాల మధ్య ప్రస్తుత బుర్కినా ఫాసోలోని వివిధ జాతుల సమూహాలు తరువాతి తరంగాలైన మోస్సి ఫులా, డ్యూల వంటి ప్రజాసమూహాలు వచ్చి చేరారు. 11 వ శతాబ్దంలో ప్రవేశించిన మోస్సి ప్రజలు అనేక ప్రత్యేక రాజ్యాలను స్థాపించారు. 1890 లలో యూరోపియన్ స్క్రాబుల్ ఫర్ ఆఫ్రికాలో బుర్కినా ఫాసో భూభాగాన్ని ఫ్రాన్సు ఆక్రమించింది. 1896 - 1904 మధ్యకాలంలో జరిగిన యుద్ధం తరువాత వలసవాద రాజ్యాలు స్థాపిచింది. ఈ ప్రాంతం 1904 లో ఫ్రెంచి పశ్చిమ ఆఫ్రికాలో భాగంగా మారింది. 1919 మార్చి 1 న ఫ్రెంచి ఎగువ వోల్టా కాలనీ స్థాపించబడింది. ఈ భూభాగం వోల్టా నది ఎగువ ప్రవాహతీరంలో (బ్లాక్, రెడ్, వైట్ వోల్టా) ఉన్నకారణంగా ఈ కాలనీకి ఈ పేరు పెట్టారు.

1958 దిసెంబరు 11 న రిపబ్లిక్ అఫ్ అప్పర్ వోల్టా ఫ్రెంచ్ కమ్యూనిటీలో స్వయం ప్రతిపత్తి కలిగిన కాలనీగా స్థాపించబడింది. 1960 న మారిస్ యమేయోగో అధ్యక్షుడిగా పూర్తి స్వాతంత్ర్యం దేశంగా అవతరించింది. 1966 లో సంగౌలె లామిజానా విద్యార్థులు కార్మిక సంఘాల నిరసనల తరువాత యమేయోగో అధ్యక్షపీఠం నుండి తొలగించబడి సంగౌలె లామిజానా అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. అతని పాలనలో సంభవించిన సహెల్ కరువులతో కారణంగా 1980లో సాయే జెబ్రో నాయకత్వంలో శక్తివంతమైన ట్రేడ్ యూనియన్ల నుండి సమస్యలను ఎదురుకావడంతో తొలగించబడింది. మరోసారి ట్రేడ్ యూనియన్ల నుండి ప్రతిఘటనను ఎదుర్కోవడం బాప్టిస్ట్ ఓయిడ్రారోగో నాయకత్వంలో మొదలైన తిరుగుబాటు కారణంగా 1982 లో జర్బో ప్రభుత్వం తొలగించబడింది. తరువాత ఓయిడ్రాడోగో ప్రభుత్వం వామపక్ష సంఘం నాయకుడు థామస్ శంకర ప్రధానమంత్రి అయినప్పటికీ తరువాత ఖైదు చేయబడ్డాడు. అతన్ని విడిపించేందుకు చేసిన ప్రయత్నాలు తరువాత 1983లో ఓయిడ్రాడోగో ప్రభుత్వం పతనమై థామస్ సంకర అధ్యక్షుడయ్యారు.[3][4] సంకర దేశం పేరును బుర్కినా ఫాసోగా మార్చాడు. దేశవ్యాప్తంగా అక్షరాస్యత అభివృద్ధి కొరకు పోరాటం, భూమిని తిరిగి రైతులకు పంచి ఇవ్వడం, రైల్వే, రహదారి నిర్మాణాలకు భూమి పునఃపంపిణీ చేయడం, బలవంతపు వివాహాలు, బహుభార్యాత్వాన్ని బహిష్కరించడం వంటి సంస్కరణలు చేసి ఒక ప్రతిష్ఠాత్మకమైన సామాజిక అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించాడు.[4][5] 1987 లో బ్లేజ్ కంపోరే నాయకత్వంలో జరిగిన తిరుగుబాటు కారణంగా సంకర తొలగించి చంపబడ్డాడు. పూర్వ వలసరాజ్యం ఫ్రాన్సుతో దెబ్బతిన్న సంబంధాలు, ఐవరీ కోస్టుకు చెందిన రాజ్యాలతో మైత్రి తిరుగుబాటుకు కారణంగా చెప్పబడ్డాయి.

1987 లో బ్లేజ్ కాంపొరే అధ్యక్షుడైన తరువాత 1989 లో ఆయన ప్రభుత్వం పతనమై తరువాత 1991, 1998 లలో ఎన్నికచేయబడ్డాడు. ఈ ఎన్నికను ప్రతిపక్షాలు బహిష్కరించాయి. 2005 లో ఓటునమోదు గణనీయంగా తగ్గింది. ఆయన 2014 అక్టోబరు 31 న యువత తిరుగుబాటు ద్వారా అధికారం నుండి తొలగించబడ్డాడు.[6][7] తరువాత ఆయన ఐవరీ కోస్టుకు పారిపోయాడు. తరువాత మైఖేల్ కఫాండో దేశానికి అధ్యక్షుడు అయ్యాడు. 2015 సెప్టెంబరు 16 న కాఫాండో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక సైనిక తిరుగుబాటు జరిగింది. మాజీ ప్రెసిడెన్షియల్ గార్డు కాంపొరేను అధ్యక్షపీఠం నుండి తొలగించబడ్డాడు.[8] 2015 సెప్టెంబరున 24 న ఆఫ్రికన్ యూనియన్, ఎకోవాసు, సాయుధ దళాల ఒత్తిడి కారణంగా సైనిక జుంటా ప్రభుత్వం పదవీవిరమణకు ఒప్పుకుంది. మిచెల్ కాఫాండో తిరిగి అధ్యక్షుడిగా నియమించబడ్డాడు.[9] 2015 నవంబరు 29 న జరిగిన సాధారణ ఎన్నికలలో రోచ్ మార్క్ క్రిస్టియన్ కబోరే మొదటి రౌండ్లో 53.5% ఓట్లతో గెలుపొంది [10] 2015 డిసెంబరు 29 న అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసాడు.[11]

పేరు వెనుక చరిత్ర

[మార్చు]

పూర్వం రిపబ్లిక్ అఫ్ అప్పర్ వోల్టా అని పిలువబడింది. 1984 ఆగస్టు 4 న అప్పటి ప్రెసిడెంట్ థామస్ సంకర ఈ దేశం పేరును "బుర్కినా ఫాసో"గా మార్చాడు. "బుర్కినా", "ఫాసో" పదాలు దేశంలో మాట్లాడే వివిధ భాషల నుండి ఉత్పన్నమవుతాయి: మోస్సి నుండి "బుర్కినా" అనే పదం వచ్చింది. బుర్కినా అంటే "నిటారుగా" తలెత్తుకు తిరగడం అని అర్ధం. "ఫాసో" పదం డైయుల భాష నుండి వచ్చింది. ఫోసో అంటే "దేశానికి తండ్రి " (లిట్ "తండ్రి హౌస్") అని అర్ధం. "బుర్కినా" పదాన్ని "బుర్కినాబే"లో "బుర్కినాబే"లో ఫూలా భాషలోని "బుర్కినాబే" పదం బుర్కినా పదంగా మారింది. దీనికి "పురుషులు లేదా స్త్రీలు" అనే అర్థం.[12] వోల్టా నది ఎగువ ప్రవాహా (బ్లాక్, రెడ్, వైట్ వోల్టా) ప్రాంతంలో ఉన్నందున ఫ్రెంచికాలనీకి వోల్టా ఫ్రెంచి కాలనీ అని పేరు పెట్టబడింది.[13]

చరిత్ర

[మార్చు]

చరిత్రకు పూర్వం

[మార్చు]

ప్రస్తుత బుర్కినా ఫాసో వాయవ్య భాగంలో క్రీ.పూ. 14,000 - 5,000 BC మధ్య వేట, వస్తుసంగ్రాహణ ఆధారంగా జీవితం సాగించే ప్రజలు నివసించారు. పురావస్తు త్రవ్వకాల ఆధారంగా 1973 లో స్క్రాపర్లు, ఉడుములు, బాణపు ములుకుల వంటి ఈ ప్రజలు ఉపయోగించిన ఉపకరణాలు కనుగొనబడ్డాయి.[ఆధారం చూపాలి]వ్యవసాయ కేంద్రాలు క్రీ.పూ. 3600 - 2600 మధ్య కాలంలో స్థాపించబడ్డాయి.[ఆధారం చూపాలి] ఆధునిక నైజర్, సమకాలీన బుర్కినా ఫాసో యొక్క ఆగ్నేయ భాగంలో నైరుతి భాగంలో బురా సంస్కృతి, ఇనుపయుగ నాగరికత కేంద్రీకృతమై ఉంది.[14] క్రీ.పూ. 1200 నాటికి ఉప-సహారా ఆఫ్రికాలో ఇనుము కరిగించి, మూసలో పోసి ఉపకరణాలు, ఆయుధాల తయారు చేసే ఇనుప పరిశ్రమ అభివృద్ధి చేయబడింది. [15][16]

ఆరంభకాల చరిత్ర

[మార్చు]

ఈ ప్రాంతానికి పలు జాతి సమూహాలు వచ్చిన కచ్చితమైన తేదీల గురించి చరిత్రకారులు చర్చించలు సాగించారు. ప్రస్తుత బుర్కినా ఫాసో తూర్పు భాగానికి 8 వ, 11 వ శతాబ్దాల మధ్య కాలంలో ప్రోటో-మోస్సీ ప్రజలు వచ్చారు.[17] 15 వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి సమో ప్రజలు వచ్చారు.[18] బుగ్గినా ఫాసో ఉత్తర, వాయవ్య ప్రాంతాలలో 15 వ లేదా 16 వ శతాబ్దాలలో [ఆధారం చూపాలి]అనేక ఇతర జాతి సమూహాలు ఈ సమయంలో ఈ ప్రాంతానికి చేరుకుని దేశజనసంఖ్యను అధికరింపజేసాయి.

శత్రుభూభాగంలో చొచ్చుకుపోవడంలో నైపుణ్యం ప్రదర్శిస్తున్న మోసి సామ్రాజ్యానికి చెందిన అశ్వికదళం
ఫ్రెంచ్ అన్వేషకుడు లూయిస్-గుస్తావే బింగర్ను సియా (బోబో-డియులాసోసో) లోకి (1892 ఏప్రిల్) ప్రవేశించకుండా అడ్డుకుంటున్న సాయుధ సైనికులు

మధ్య యుగాలలో మోస్సి తెన్కోడోగో, యటెంగో, జండోమా, ఓవాగౌడౌగౌలతో వంటి పలు ప్రత్యేక రాజ్యాలను స్థాపించింది.[19] 1328, 1338 మధ్య మోస్సి యోధులు టింబక్టు మీద దాడి చేశారు. కానీ 1483 లో మాలిలో జరిగిన కోబి యుద్ధంలో మోస్సిని సోని అలీ (సాంహ్గై) ఓడించాడు.[20] 16 వ శతాబ్ది ప్రారంభంలో బుర్కినా ఫాసోలో సాంఘై అనేక బానిస దాడులను నిర్వహించింది.[18] 18 వ శతాబ్దంలో బోబో డియోలాసోసోలో గ్విరికో సామ్రాజ్యం స్థాపించబడిన తరువాత బ్లాక్ వోల్టాలో డయాన్, లోబీ, బిర్ఫోర్ వంటి జాతి సమూహాలు స్థిరపడ్డాయి. [21]

కాలనీ పాలన నుండి స్వతంత్రం వరకు (1890s–1958)

[మార్చు]

1890 ల ప్రారంభంలో బ్రిటిష్, ఫ్రెంచ్, జర్మన్ సైనిక అధికారుల బృందం ప్రస్తుత బుర్కినా ఫాసోలోని భూభాగాలను స్వాధీనం చేయడానికి ప్రయత్నాలు చేసింది. కొన్నిసార్లు వలసవాదులు, వారి సైన్యాలు స్థానిక ప్రజలతో పోరాడారు. మరి కొన్నిసార్లు సంధిచేసుకునే ప్రయత్నంలో వారు ప్రజలతో పొత్తు పెట్టుకుని ఒప్పందాలను తయారు చేశారు. వలసవాదుల అధికారులు, వారి సొంత ప్రభుత్వాలు తమలో తాము ఒప్పందాలు చేసుకున్నాయి. 1896 లో సంక్లిష్ట వరుస కార్యక్రమాల ద్వారా బర్కినా ఫాసో చివరికి ఒక ఫ్రెంచి సంరక్షక కేంద్రంగా మారింది.[22]

1897 లో ఫ్రెంచి ఆక్రమణ సమయంలో తూర్పు, పశ్చిమ ప్రాంతాల పాలకుడైన సామోరి టూర్ వ్యతిరేకంగా నిలవడం పరిస్థితిని క్లిష్టతరం చేశాయి. 1898 నాటికి బుర్కినా ఫాసో సంబంధిత భూభాగంలో అధిక భాగం నామమాత్రంగా ఫ్రెంచి సైన్యాలచేత ఆక్రమించబడినప్పటికీ అనేక ప్రాంతాలపై ఫ్రెంచి వారికి కచ్చితమైన నియంత్రణ లేదు.[ఆధారం చూపాలి]

1898 జూన్ 14 నాటి ఫ్రాంకో-బ్రిటీషు కన్వెన్షన్ దేశానికి ఆధునిక సరిహద్దులను సృష్టించింది. ఐదు సంవత్సరాల కాలం ఫ్రెంచి భూభాగంలో స్థానిక సమాజాలకు, రాజకీయ అధికారాలకు వ్యతిరేకంగా యుద్ధం కొనసాగింది. 1904 లో ఫ్రెంచ్ వెస్టర్న్ ఆఫ్రికన్ వలస సామ్రాజ్య పునర్వ్యవస్థీకరణలో భాగంగా వోల్టా ముఖద్వారంలోని అధిక శక్తివంతమైన ప్రాంతాలు ఎగువ సెనెగల్, ఫ్రెంచ్ వెస్ట్ ఆఫ్రికా నైగర్ కాలనీలో చేర్చబడ్డాయి. ఈ కాలనీకి రాజధాని బామాకోలో ఉంది.

కాలనీల పరిపాలనకు, విద్యాబోధనకు ఫ్రెంచి అధికారభాషగా మారింది. ప్రజా విద్యా వ్యవస్థ సరళమైన మూలాల నుండి ప్రారంభమైంది. డాకర్లో కాలనీల కాలంలో అనేక సంవత్సరాలకాలం ప్రత్యేకవిద్యను అందించారు.

ఈ ప్రాంతానికి చెందిన యుద్ధవీరులు మొదటి ప్రపంచ యుద్ధంలో ఐరోపా సరిహద్దులలో పోరాడిన సెనెగలీస్ రైఫిల్స్ బెటాలియన్లతో చేరి యుద్ధంలో పాల్గొన్నారు. 1915, 1916 మధ్యకాలంలో వలసరాజ్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన సాయుధపోరాటాలకు ప్రస్తుత బుర్కినా ఫాసో పశ్చిమ భాగానికి చెందిన జిల్లాలు, మాలి సరిహద్దు తూర్పు భూభాగం (వోల్టా-బాని వంటి యుద్ధాలకు) వేదికగా మారాయి.[23]

కొన్ని ఓటములను ఎదుర్కొన్న తరువాత ఫ్రెంచి ప్రభుత్వం చివరికి ఉద్యమాన్ని అణిచివేసింది. తిరుగుబాటును అణిచివేసేందుకు ఫ్రెంచి ప్రభుత్వానికి దేశం అంతటా సంచరించే అతిపెద్ద సైనిక శక్తిని కూడా నిర్వహించవలసిన అవసరం ఏర్పడింది.

రాజధాని ఓవాగాడుగౌ (1930)

1919 మార్చి 1 న అప్పర్ ఫ్రెంచి వోల్టా స్థాపించబడింది. సాయుధ తిరుగుబాటు పునరుద్ధరణ, ఆర్థిక పురోభివృద్ధి సాధించడం ఫ్రెంచి ప్రభుత్వానికి భీతిని కలుగజేసింది. వలసరాజ్య ప్రభుత్వం పరిపాలనను బలపర్చడానికి ఎగువ సెనెగల్, నైజర్ నుండి ప్రస్తుత బుర్కినా ఫాసో భూభాగాన్ని వేరు చేసింది.

నూతన కాలనీకి హోటు వోల్టా అనే పేరు పెట్టి నూతన కాలనీకి ఫ్రాంకోయిస్ చార్లెస్ అలెక్సిస్ ఎడోర్డ్ హెస్లింగు మొట్టమొదటి గవర్నరుగా నియమించబడ్డాడు. మౌలిక సౌకర్యాన్ని మెరుగుపరిచి పత్తి ఎగుమతిని అభివృద్ధిని ప్రోత్సహించేందుకు హెస్లింగ్ ఒక ప్రతిష్ఠాత్మక రహదారి నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించాడు. నిర్బంధిత పత్తి విధానం విఫలమవడంతో కాలనీ సృష్టించిన ఆదాయం స్తంభించిపోయింది. ఈ కాలనీ రద్దు చేయబడి 1932 సెప్టెంబరు 2 న ఈ కాలనీ ఐవరీ కోస్టు, ఫ్రెంచ్ సుడాన్, నైజర్ ఫ్రెంచ్ కాలనీలలో విలీనం చేయబడింది. ఐవరీ కోస్టు అతిపెద్ద వాటాను పొందింది. ఇందులో అతి పెద్ద జనసాంధ్రత కలిగిన ప్రాంతాలు, ఔగాడౌగౌ, బోబో-డియులస్సో నగరాలు ఉన్నాయి.

రెండవ ప్రపంచయుద్ధం ముగిసిన తరువాత తీవ్రమైన వ్యతిరేక ఆందోళన కారణంగా ఫ్రాన్సు ఈ మార్పును వెనుకకు తీసుకుంది. 1947 సెప్టెంబరు 4 న ఫ్రెంచి ఎగువ వోల్టాగా కాలనీని పునరుద్ధరించింది. తరువాత మునుపటి సరిహద్దులతో ఫ్రెంచి యూనియన్లో భాగంగా ఉంది. ఫ్రానుస్ తన కాలనీలను యూరోపియన్ ఖండంలో మెట్రోపాలిటన్ ఫ్రాంసు విభాగంగా రూపొందించింది.

1958 డిసెంబరు 11 న కాలనీ రిపబ్లిక్ అఫ్ అప్పర్ వోల్టాగా స్వీయప్రభుత్వాన్ని సాధించి ఫ్రాంకో-ఆఫ్రికన్ కమ్యూనిటీలో చేరింది. 1956 జూలై 23 నాటికి ఫ్రెంచి విదేశీ భూభాగాల సంస్థలో బేసిక్ లా (లోయి కేడ్రె) ప్రారంభించారు. 1957 లో ప్రత్యేక భూభాగాలకు స్వయం పాలనాధికారం ఇవ్వడానికి ఈ చర్య ఆధారం అయింది. 1958 డిసెంబరు 11 న అప్పరు వోల్టా భూభాగం ఫ్రెంచి కమ్యూనిటీలో స్వతంత్రంగా గణతంత్ర రాజ్యంగా మారింది. 1960 లో ఫ్రాన్సు నుండి పూర్తి స్వాతంత్ర్యం పొందింది.[24]

అప్పర్ వోల్టా (1958–1984)

[మార్చు]
Maurice Yaméogo, the first President of Upper Volta, examines documents of ratifying the country's independence in 1960

1958 డిసెంబరు 11 న ఫ్రెంచ్ కమ్యూనిటీలో రిపబ్లిక్ ఆఫ్ అప్పర్ వోల్టా పేరుతో స్వీయ-పాలిత కాలనీగా స్థాపించబడింది. వోల్టా నది ఎగువ భాగంలో ఉన్నందున దీనికి ఎగువ వోల్టా అనే పేరు వచ్చింది. నది మూడు ఉపనదులను బ్లాక్, వైట్, రెడ్ వోల్టా అని పిలుస్తారు. ఇవి మాజీ జాతీయ జెండా మూడు రంగులుగా వ్యక్తీకరించబడ్డాయి.

స్వయంప్రతిపత్తి సాధించడానికి ముందు ఇది ఫ్రెంచి ఎగువ వోల్టాగా ఉంటూ ఫ్రెంచి యూనియన్లో భాగంగా ఉంది. 1960 ఆగస్టున దీనికి ఫ్రాన్సు నుంచి పూర్తి స్వాతంత్ర్యం పొందింది. వోల్టాయిక్ డెమొక్రటిక్ యూనియన్ (యుడివి)కు నాయకుడుగా ఉన్న మారిసు యమేగో మొదటి అధ్యక్షుడుగా నియమించబడ్డాడు. 1960 రాజ్యాంగం సార్వత్రిక ఎన్నికలను నిర్వహించి ఓటు నమోదు ద్వారా ఐదు సంవత్సరాల కాలానికి అద్యక్షుని ఎన్నికచేసి జాతీయ అసెంబ్లీని రూపొందించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే యమేయోగో యుడివో మినహా ఇతర రాజకీయ పార్టీలను నిషేధించాడు. ప్రభుత్వం 1966 వరకు కొనసాగింది. విద్యార్థులు కార్మిక సంఘాలు, ప్రభుత్వోద్యోగులు సామూహిక నిదర్శన ప్రదర్శనలు, దాడులతో సహా చాలా అశాంతి తరువాత సైనికు జోక్యం చేసుకున్నారు.

లామిజానా పాలన, పలు తిరుగుబాట్లు

[మార్చు]

1966 సైనిక తిరుగుబాటు యమేగోను తొలగించి రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసి జాతీయ అసెంబ్లీని రద్దు చేసింది. సైన్యాధికారుల ప్రభుత్వానికి లెఫ్టినెంట్ కల్నల్ సాంగ్యులే లెమిజానను అధికారిగా నియమించింది. సైనికప్రభుత్వం నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉంది. 1976 జూన్ 14 న వోల్టన్స్ ఒక కొత్త రాజ్యాంగానికి ఆమోదిస్తూ నాలుగు సంవత్సరాల వ్యవధితో పూర్తి పౌర పాలనకు ఏర్పాటు చేసాడు. 1970 లలో మిలిటరీ లేదా మిశ్రమ పౌర-సైనిక ప్రభుత్వాల అధ్యక్షుడిగా లామిజానా అధికారంలో ఉన్నారు. లామేజానా పాలనలో సాహెల్ కరువు ప్రారంభం అయింది. ఇది ఎగువ వోల్టా ప్రాంతాలు, పొరుగు దేశాలపై వినాశకరమైన ప్రభావం చూపింది. 1976 రాజ్యాంగం మీద వివాదం తలెత్తిన తరువాత 1977 లో కొత్త రాజ్యాంగం రూపొందింది ఆమోదించబడింది. 1978 లో బహిరంగ ఎన్నికల్లో లామిజానా తిరిగి ఎన్నికయ్యారు.

లెమిజానా ప్రభుత్వం ట్రేడ్ యూనియన్లతో బలమైన సమస్యలను ఎదుర్కొంది. 1980 నవంబరు 25 న సజీ జెర్బో అధ్యక్షుడు లామాజనాను రక్తరహిత తిరుగుబాటులో పడగొట్టాడు. నేషనల్ ప్రోగ్రెస్ రికవరీ కొరకు కల్నల్ జెరోబో మిలిటరీ కమిటీ స్థాపించి తద్వారా 1977 రాజ్యాంగాన్ని నిర్మూలించారు.

కల్నల్ జెర్బో కూడా వర్తక సంఘాల నుండి నిరోధకతను ఎదుర్కొన్నాడు. రెండు సంవత్సరాల తరువాత 1982 లో ఉన్న అప్పర్ వోల్టాన్ తిరుగుబాటు కూటమిలో మేజర్ డాక్టర్ జీన్-బాప్టిస్ట్ ఓయిడ్రారాగో, పాపులర్ సాల్వేషన్ (సి.ఎస్.పి) కౌన్సిలు కలిసి కల్నల్ జెర్బో ప్రభుత్వాన్ని తొలగించారు. సి.ఎస్.పి. రాజకీయ పార్టీలను, సంస్థలను నిషేధించడం కొనసాగిస్తూ పౌర పాలన, కొత్త రాజ్యాంగ రూపకల్పనకు హామీ ఇచ్చింది.[25][ఆధారం చూపాలి]

1983 తిరుగుబాటు

[మార్చు]

సి.ఎస్.పి. కుడి, ఎడమ వర్గాల మధ్య అంతర్గత సంఘటనలు అభివృద్ధి చెందాయి. వామపక్ష నాయకుడు కెప్టెన్ థామస్ సంకర 1983 జనవరిలో ప్రధాన మంత్రిగా నియమితుడై తరువాత ఖైదు చేయబడ్డాడు. కెప్టెన్ బ్లైజ్ కాంపొరే మార్గదర్శకంలో ఆయనను విడుదల చేయటానికి చేసిన ప్రయత్నాల ఫలితంగా 1983 ఆగస్టు 4 న ఒక సైనిక ఒప్పందం కుదిరింది.

ఈ తిరుగుబాటు సంకరను అధికారంలోకి తీసుకువచ్చింది. ఆయన ప్రభుత్వం సామూహిక-టీకామందులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, మహిళల హక్కుల విస్తరణ, దేశీయ వ్యవసాయ వినియోగం, ఎడారీకరణ వ్యతిరేక ప్రాజెక్టుల ప్రోత్సాహంతో పలు వరుస విప్లవాత్మక కార్యక్రమాలను అమలు చేయడం ప్రారంభించింది.[4]

బుర్కినా ఫాసో (1984)

[మార్చు]

1984 ఆగస్టు 4 న [24] అధ్యక్షుడు సంకర అప్పర్ వోల్టా అనే దేశం పేరును బుర్కినా ఫాసోగా (నిజాయితీగల మనుష్యులు) మార్చబడింది. (సాహిత్యరూపంలో యథార్థ పురుషుల భూమి)[26][27][28]

విప్లవమార్గదర్శకులు, సి. 1985

సంకర ప్రభుత్వం నేషనల్ కౌన్సిల్ ఫర్ ది రివల్యూషన్ (సి.ఎన్.ఆర్.) ను స్థాపించి దాని అధ్యక్షుడిగా సంకర పనిచేసాడు. విప్లవం నుండి రక్షణ కోసం ప్రముఖ కమిటీలను స్థాపించాడు. విప్లవం యువత మార్గదర్శక కార్యక్రమం కూడా స్థాపించబడింది.

సంకర ఒక మార్పు కోసం ఆఫ్రికన్ ఖండంలోని అతిపెద్ద వాటిలో ఒకటిగా గుర్తించబడిన ఒక ఔత్సాహిక సాంఘిక-ఆర్ధిక కార్యక్రమాన్ని ప్రారంభించాడు.[4] సామ్రాజ్యవాద వ్యతిరేకతపై విదేశాంగ విధానాలను కేంద్రీకృతం చేసాడు. ఆయన ప్రభుత్వం విదేశీ సాహాయాలన్నింటినీ తిరస్కరించడం అరుదైన రుణ తగ్గింపుకు దారితీసింది. అన్ని భూములను, ఖనిజ సంపదలను జాతీయం చేసి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐ.ఎం.ఎఫ్.), ప్రపంచ బ్యాంకు అధికారాన్ని నియంత్రించాడు. దేశీయ విధానాలలో హాగంగా దేశవ్యాప్త అక్షరాస్యత ప్రచారం, రైతులకు భూమి పంఫిణీ, రైల్వే, రహదారి నిర్మాణాలకు భూమి మంజూరు చేయడం, స్త్రీల పట్ల వివక్షను తగ్గించడానికి ప్రయత్నించడం, బలవంతపు వివాహాలు, బహుభార్యాత్వాన్ని బహిష్కరించడం వంటి సంస్కరణలను చేపట్టాడు.[4][5]

సంకర స్వీయ-సమృద్ధి సాధించడానికి ప్రోత్సహించాడు. మెనింజైటిస్, యల్లో ఫీవర్, మసూచి వ్యాధులకు టీకాల విధానంలో పై ఉన్న 2,500,000 మంది పిల్లలు టీకాలు వేయడం ద్వారా ప్రజా ఆరోగ్యాన్ని అభివృద్ధి చేయడానికి కృషిచేసాడు.[5] అతని నేషనల్ అజెండాలో చేపట్టిన 10,000 చెట్ల పెంపకం సాహెల్ ప్రాంతంలో పెరుగుతున్న ఎడారీకరణను నిలిపివేసింది. సంకర ప్రతి గ్రామంలో ఒక మెడికల్ డిస్పెన్సరీని నిర్మించమని పిలుపునిచ్చాడు. 350 కన్నా ఎక్కువ కమ్యూనిటీలు తమ స్వంత శ్రమదానంతో పాఠశాలలను నిర్మించాయి.[4][29]

1987 తిరుగుబాటు

[మార్చు]

1987 అక్టోబరు 15 న సంకర మాజీ సహోద్యోగి బ్లేజ్ కాంపొరేచే నిర్వహించబడిన తిరుగుబాటు కార్యక్రమంలో సంకర, పన్నెండు మంది ఇతర అధికారులతో కలసి చంపబడ్డాడు. 2014 అక్టోబరు వరకు బ్లేజ్ కాంపొరే బుర్కినా ఫాసో అధ్యక్షుడుగా కొనసాగాడు.[30] తిరుగుబాటు తరువాత సంకర మరణించినట్లు తెలిసినప్పటికీ అనేక రోజులకాలం సైన్యానికి సాయుధ ప్రతిఘటన కొనసాగింది.[ఆధారం చూపాలి] బుర్కినాబే పౌరులు, ఫ్రాన్సు విదేశాంగ మంత్రిత్వ శాఖ, క్వాయ్ డి'ఓర్సే తిరుగుబాటును నిర్వహించింది.

తిరుగుబాటు కొరకు కాంపొరేచే ఇచ్చిన కారణాలలో పొరుగు దేశాలతో సంబంధాల క్షీణత ఒకటి.[31] సంకర మాజీ కాలనియల్ శక్తి ఫ్రాన్సు, పొరుగున ఉన్న ఐవరీ కోస్టు విదేశీ సంబంధాలున్నాయని కంపారే వాదించారు.[3] తిరుగుబాటు తరువాత సంకర అన్ని విధానాలను దాదాపుగా త్రోసిపుచ్చి వెంటనే కంపెనరే జాతీయీకరణలను తారుమారు చేసి అంతిమంగా సంకర వారసత్వాన్ని అధికంగా త్రోసిపుచ్చాడు. 1989 లో తిరుగుబాటు ప్రయత్నం తరువాత కంపారేచే 1990 లో పరిమిత ప్రజాస్వామ్య సంస్కరణలు ప్రవేశపెట్టబడ్డాయి. కొత్త రాజ్యాంగం ప్రకారం 1991 లో కాంపొరే ప్రతిపక్షం లేకుండా తిరిగి ఎన్నికయ్యాడు. 1998 లో కొంపేర్ ఎన్నికలలో మెజారిటీతో గెలిచాడు. 2004 లో అధ్యక్షుడు కాంపొరేకు వ్యతిరేకంగా 13 మంది తిరుగుబాటు ప్రణాళిక చేయడానికి ప్రయత్నించారు. తిరుగుబాటుదారుల సూత్రధారికి జీవిత ఖైదు విధించబడింది.[32] As of 2014 2014 నాటికి బుర్కినా ఫాసో ప్రపంచంలో అతి తక్కువ అభివృద్ధి చెందిన దేశాలలో ఒకటిగా ఉంది.[33]

2010-11 ఇవోరియన్ సంక్షోభం, ఇంటర్-టోగోలేస్ డైలాగ్, 2012 మాలియన్ సంక్షోభంతో సహా అనేక వెస్ట్-ఆఫ్రికన్ వివాదాలలో కాంపొరే ప్రభుత్వం సంధానకర్త పాత్రను పోషించింది.

2014 అక్టోబరు నిరసనలు

[మార్చు]

2014 అక్టోబరు 28 న నిరసనకారులు ఓగౌగాడౌగౌలో రాజ్యాంగాన్ని సవరించడానికీ, తన 27 ఏళ్ల పాలనను విస్తరించడానికి సిద్ధంగా ఉన్న అధ్యక్షుడు బ్లైజ్ కాంపొరేకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శాలు ప్రారంభించారు. అక్టోబరు 30 న కొందరు నిరసనకారులు పార్లమెంటుకు నిప్పంటించి [34] జాతీయ టి.వి. ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు.[35] ఓవాగడౌగౌ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మూసివేయబడింది. ఎంపీలు కాంపొరే రాజ్యాంగానీ మార్చడానికి ఓటును సస్పెండ్ చేసి 2015 లో తిరిగి ఎన్నిక కోసం నిలబడటానికి అనుమతించారు. తరువాత సైనిక ప్రభుత్వం అన్ని ప్రభుత్వ సంస్థలను రద్దు చేసి కర్ఫ్యూను ఏర్పాటు చేసింది.[36]

2014 అక్టోబరు 31 న, అధ్యక్షుడు కాంపొరే అధికరిస్తున్న ఒత్తిడి కారణంగా 27 సంవత్సరాల తర్వాత పదవికి రాజీనామా చేశారు.[37] లెఫ్టినెంట్ కల్నల్ ఐజాక్ జిడా 2015 అధ్యక్ష ఎన్నికల ముందు ఆపత్కాల నాయకుడుగా దేశాన్ని నడిపిస్తానని చెప్పినప్పటికీ మాజీ అధ్యక్షుడితో ఆయనకున్న సన్నిహిత సంబంధాల గురించి ఆందోళనలు ఉన్నాయి.[38] నవంబరులో ప్రతిపక్ష పార్టీలు, సివిల్ సొసైటీ గ్రూపులు, మతనాయకులు బర్కినా ఫాసోను ఎన్నికలకు మార్గనిర్దేశం చేసేందుకు ఆపత్కాల అధికారం కోసం చేసిన ప్రణాళికను స్వీకరించారు.[39] ప్రణాళిక ప్రకారం మిచెల్ కాఫాండ బుర్కినా ఫాసో ఆపత్కాల అధ్యక్షుడు, లెఫ్టినెంట్ కల్నల్ జిడా తాత్కాలిక ప్రధానమంత్రి, రక్షణ మంత్రి అయ్యాడు.

2015 తిరుగుబాటు

[మార్చు]

2015 సెప్టెంబరులో అధ్యక్షుడి భద్రతా విభాగం (ఆర్ఎస్పి) రెజిమెంట్ దేశ అధ్యక్షుడు, ప్రధానమంత్రిని నిర్బంధించి " నేషనల్ కౌన్సిల్ ఫర్ డెమోక్రసీ " పేరుతో కొత్త జాతీయ ప్రభుత్వాన్ని ప్రకటించింది.[40] 2015 సెప్టెంబరు 22 న తిరుగుబాటు నాయకుడు గిల్బర్ట్ దెండేరే, క్షమాపణలు చెప్పి, పౌర ప్రభుత్వాన్ని పునరుద్ధరణకు సహకరిస్తానని వాగ్దానం చేసాడు.[41] 2015 సెప్టెంబరు 23 న ప్రధాన మంత్రి, తాత్కాలిక అధ్యక్షుడు అధికారంలోకి వచ్చారు.[42]

2015 నవంబరు ఎన్నికలు

[మార్చు]

2015 నవంబరు 29 న బుర్కినా ఫాసోలో సాధారణ ఎన్నికలు జరిగాయి. రోచ్ మార్క్ క్రిస్టియన్ కపోరే తొలి రౌండ్లో 53.5% వోటుతో గెలిచాడు. వ్యాపారవేత్త జీఫిరిన్ దియాబ్రెను (29.7%) తీసుకున్నాడు.[10] 2015 డిసెంబరు 29 న కపోరే అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.[11]

భౌగోళికం, వాతావరణం

[మార్చు]
Satellite image of Burkina Faso.

భౌగోళికం

[మార్చు]
బుర్కినా ఫాసో

బుర్కినా ఫాసో 9 డిగ్రీల - 15 ° ఉత్తర (చిన్న ప్రాంతం 15 ° ఉత్తరం) అక్షాంశం 6 ° పశ్చిమ, 3 ° తూర్పు రేఖామ్శం మధ్య ఉంటుంది.

ఇది రెండు ప్రధాన గ్రామీణ ప్రాంతాలను కలిగి ఉంది. దేశం అత్యధిక భూభాగం పెనెప్లెయిన్ విస్తరించి ఉంది. ఇందులోని కొన్ని ప్రదేశాల్లో కొన్ని విడివిడి కొండలు, ప్రీగాంబ్రియాన్ మాసిఫ్ చివరి కాలిబాటలతో ప్రశాంత తరంగాల ప్రకృతి దృశ్యాన్ని ఏర్పరుస్తుంది. దేశంలోని నైరుతి దిశలో ఇసుక రాళ్ళ మసిఫ్ ఉంటుంది. ఇక్కడ శిఖరం టెనాకారౌ ఎత్తు 749 మీటర్లు (2,457 అడుగులు) ఉంది. మాసిఫ్ సరిహద్దులుగా 150 మీ (492 ఆ) ఎత్తు వరకు బండరాళ్ళవరుసలు ఉన్నాయి. బుర్కినా ఫాసో సగటు ఎత్తు 400 మీ (1,312 అ) ఉంది. అత్యధిక, అత్యల్ప భూభాగాల మధ్య వ్యత్యాసం 600 మీ (1,969 అ) ఉంటుంది. బుర్కినా ఫాసో సాధారణంగా చదునైన దేశంగా ఉంది.

దేశం పూర్వపు పేరు (ఎగువ ఓల్టా) కారణమైన ఓల్టా నదికి మూడు ఉప నదులు ఉన్నాయి: బ్లాక్ వోల్టా (లేదా మౌహౌన్), వైట్ వోల్టా (నకంబే), రెడ్ వోల్టా (నాజినాన్). దేశంలోని సంవత్సరం పొడవునా ప్రవహించే రెండు నదులలో బ్లాక్ వోల్టా ఒకటి. రెండవదైన కొమోవే నది నైరుతికి ప్రవహిస్తుంది. నైజర్ నది ముఖద్వారం దేశం ఉపరితల భూభాగంలో 27% నీటిపారుదల సౌకర్యం కలిగిస్తుంది.

నైగర్ ఉపనదులు - బెలీ, గోరౌల్, గౌడెబో, డార్గోల్ - వీటిలో సంవత్సరానికి నాలుగు నుంచి ఆరు నెలలు మాత్రమే సీజనల్ ప్రవాహాలు ఉంటాయి. వీటిలో ఇంకా వరదలు, పొంగిపొర్లడం ఉంటాయి. దేశంలో అనేక సరస్సులు ఉంటాయి. ప్రధానమైనవి టిన్గ్రేలా, బామ్, డెం. దేశంలో పెద్ద చెరువులు ఉన్నాయి. అలాగే ఓర్సి, బెలీ, యోమ్బోలీ, మార్కోయ్ వంటివి. తరచుగా దేశం ఉత్తరాన నీటి కొరత ముఖ్యంగా ఒక సమస్యగా ఉంది.

ఘొంబ్లోరా సమీపంలోని సవన్నా

నిర్వహణా విభాగాలు

[మార్చు]

The country is divided into 13 administrative regions. These regions encompass 45 provinces and 301 departments. Each region is administered by a governor.

వాతావరణం

[మార్చు]
Map of Köppen climate classification

రెండు వేర్వేరు రుతువులతో ఉష్ణమండల వాతావరణం ఉంటుంది. వర్షాకాలంలో వర్షపాతం 60 నుండి 90 సెం.మీ. (23.6, 35.4) మధ్య ఉంటుంది. పొడి సీజన్లో, హంతటాన్ - సహారా - దిబ్బల నుండి వేడిగా గాలి వీస్తుంది. వర్షాకాలం సుమారు నాలుగు నెలలు, మే / జూన్ సెప్టెంబరు వరకు ఉంటుంది, ఇది దేశంలోని ఉత్తరాన తక్కువగా ఉంటుంది. దేశభూభాగాన్ని మూడు వాతావరణ మండలాలు నిర్వచించవచ్చు: సహెల్, సుడాన్-సహెల్, సుడాన్-గినియా. ఉత్తరప్రాంతంలో ఉన్న సహెల్ సాధారణంగా సంవత్సరానికి 60సెంటీమీటర్లు (23.6 అం)[43] కంటే తక్కువ వర్షపాతం ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలు, 5-47 ° సెంటీగ్రేడ్ (41-117 ° ఫారెంహీటు) ఉంటుంది.

ఉష్ణమండల షెల్ సవన్నా బుర్కినా ఫాసో సరిహద్దులను దాటి విస్తరించింది. హార్న్ ఆఫ్ ఆఫ్రికా నుండి అట్లాంటిక్ మహాసముద్రం వరకు విస్తరించి ఉంది. సవన్న ఉత్తరసరిహద్దులో సహారా, దక్షిణ సరిహద్దులో సూడాన్ సుదూర ప్రాంతం ఉన్నాయి. 11 ° 3 '- 13 ° 5' ఉత్తర అక్షాంశం మధ్య ఉన్న సుడాన్-సహెల్ ప్రాంతం వర్షపాతం, ఉష్ణోగ్రత పరివర్తన జోన్‌గా భావించబడుతుంది. సుడాన్-గినియా దక్షిణప్రాంతంలో ప్రతి సంవత్సరం 90 సెంటీమీటర్లు (35.4 అం).[43] వర్షపాతం, చల్లని సగటు ఉష్ణోగ్రతలు ఉంటాయి.

సహజ వనరులు

[మార్చు]

Burkina Faso's natural resources include gold, manganese, limestone, marble, phosphates, pumice, and salt.

వన్యజీవితం, పర్యావరణం

[మార్చు]

బుర్కినా ఫాసోలో పశ్చిమ దేశాలలోని అనేక దేశాల కంటే అధికమైన ఏనుగులు ఉన్నాయి. సింహాలు, చిరుతపులులు, గేదెలు ఇక్కడ కనిపిస్తుంటాయి. వీటిలో మరగుజ్జు (ఎరుపు) గేదె, చిన్న కాళ్ళ ఆవు భీకరమైన రకానికి చెందిన ఒక చిన్న ఎర్రటి-గోధుమ జంతువు, ఇతర భారీ మాంసాహారులలో చిరుత, కార్కకల్ (ఆఫ్రికన్ లింక్స్), మచ్చల హైనా, ఆఫ్రికన్ అడవి కుక్క (ఖండంలో ఉన్న అత్యంత అంతరించిపోతున్న జాతులలో ఒకటి)[44]

బుర్కినా ఫాసో జంతుజాలం, వృక్షాలు నాలుగు జాతీయ పార్కులలో రక్షించబడ్డాయి:

  • బుర్కినా ఫాసో, బెనిన్, నైగర్లను తూర్పున ఉన్న నేషనల్ పార్కు.
  • అలీ వన్యప్రాణుల రిజర్వ్ (తూర్పులో అలీ నేషనల్ పార్క్)
  • పశ్చిమాన లెబరా-కామోయ్ క్లాసిఫైడ్ ఫారెస్ట్, వన్యప్రాణి యొక్క పాక్షిక రిజర్వ్
  • పశ్చిమప్రాంతంలో మ్యూర్ ఆక్స్ హిప్పోపోట్మేమ్స్.

ఇతర అభయారణ్యాలు: బుర్కినా ఫాసో, ఆఫ్రికన్, నేచురల్ రిజర్వులలో జాతీయ పార్కుల జాబితా చూడండి.

ఆర్ధిక రంగం, మౌలికసౌకర్యాలు

[మార్చు]
Burkina Faso's exports in 2009. Every year gold and cotton constitute more than 70% of the country's exports and the prices of these commodities have fluctuated significantly in the past 10 years. See the 2016 figure

2011 లో $ 2.77 బిలియన్లు ఉన్న బుర్కినా ఫాసో ఎగుమతుల విలువ 2012 నాటికి $ 754 మిలియన్లకు పడిపోయింది.[45] స్థూల జాతీయోత్పత్తిలో 32% నికి వ్యవసాయం ప్రాతినిధ్యం వహిస్తుంది. వ్యవసాయ రంగంలో 80% మంది ప్రజలు పనిచేస్తున్నారు. ప్రజలు అధికంగా పశువులను పెంపకాన్ని జీవనోపాధిగా ఎంచుకుంటున్నారు. దక్షిణ, నైరుతి ప్రాంతాలలో ప్రజలు జొన్న, పెర్ల్ మిల్లెట్, మొక్కజొన్నలు, వేరుశెనగలు, బియ్యం, పత్తి పంటలు పండిస్తూ మిగులును విక్రయిస్తుంటారు. దేశం ఆర్థిక కార్యకలాపాలకు అవసరమైన నిధులలో చాలా భాగం అంతర్జాతీయ సహాయం నిధి ద్వారా లభిస్తుంది.

2011 మార్చి యురొమనీ కంట్రీ రిస్క్ వర్గీకరణలో బుర్కినా ఫాసో 111 వ సురక్షితమైన పెట్టుబడి గమ్యస్థానంగా ఉంది.[46] 1990 ల వరకు బుర్కినా ఫాసో ముఖ్యమైన ఆదాయ వనరుగా చెల్లింపులు ఉన్నాయి. బుర్కినాబే వలసదారుల ప్రధాన గమ్యం ఐవరీ కోస్టులో అశాంతి కారణంగా విదేశాలకు వలస వెళ్ళిన పౌరులను బలవంతంగా దేశానికి తిరిగి రప్పించిన తరువాత చెల్లింపులు 1% కంటే తక్కువగా ఉంటాయి.

బుర్కినా ఫాసో వెస్ట్ ఆఫ్రికన్ మానిటరీ అండ్ ఎకనామిక్ యూనియన్‌లో భాగంగా ఉండి సి.ఎఫ్.ఎ. ఫ్రాంకును స్వీకరించింది. దీనిని సెనెగల్ లోని డకార్లో ఉన్న పశ్చిమ ఆఫ్రికన్ స్టేట్స్ సెంట్రల్ బ్యాంక్ జారీచేస్తుంది. ఈ బ్యాంకు సభ్య దేశాల ద్రవ్య, రిజర్వు పాలసీని నిర్వహిస్తూ ఆర్థిక రంగం, బ్యాంకింగ్ కార్యకలాపాల నియంత్రణ, పర్యవేక్షణకు బాధ్యత వహిస్తుంది. ఇందులో 1999 లో గణనీయంగా సంస్కరణలు జరిగాయి. లైసెన్సింగ్, బ్యాంకు కార్యకలాపాలు, సంస్థాగత, మూలధన అవసరాలు, శోధనలు, నిధుల మజూరు (యూనియన్ అన్ని దేశాలకు వర్తిస్తాయి) సంబంధించి చట్టపరమైన కార్యక్రమ ప్రణాళిక ఉంది. సూక్ష్మఋణ సంస్థలను నియంత్రించడానికి ప్రత్యేక చట్టం ఉంది. ఇంటర్-ఆఫ్రికన్ కాన్ఫరెన్స్ ద్వారా ఇన్సూరెన్స్ మార్కెట్లు, బీమా రంగం నియంత్రించబడుతుంది.[47]

Processing facilities at the Essakane Mine in Burkina Faso

గనులు

[మార్చు]

బర్కినా ఫాసోలో రాగి, ఇనుము, మాంగనీస్, బంగారం, కాసిటరైట్ (టిన్ ఖనిజం), ఫాస్ఫేట్లు ఖనిజాలు ఉన్నాయి.[48] ఈ కార్యకలాపాలు ప్రజలకు ఉపాధిని అందిస్తూ అంతర్జాతీయ సహాయాన్ని అందిస్తున్నాయి. 2011 లో బంగారు ఉత్పత్తి (ఆరు బంగారు గని సైట్లు) 32% అధికరించింది. దక్షిణాఫ్రికా, మాలి, ఘనా తరువాత బుర్కినా ఫాసో ఆఫ్రికాలో నాల్గవ అతిపెద్ద బంగారు నిర్మాతగా నిలిచింది.[49]

బుర్కినా ఫాసో " ఇంటర్నేషనల్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఫెయిర్ "కు (ఊగడౌగౌల) ఆతిథ్యం ఇస్తుంది.

బుర్కినా ఫాసో " ఆఫ్రికా ఆర్గనైజేషన్ ఫర్ ది హార్మోనైజేషన్ ఆఫ్ బిజినెస్ లా "లో సభ్యదేశంగా ఉంది.[50]

సేవలు

[మార్చు]

నీరు

[మార్చు]
కౌడౌగౌలోని " గ్రాండు మార్చె"

సేవలు అభివృద్ధి చెందనప్పటికీ వాణిజ్యపరమైన మార్గాలతో పాటు నడుస్తున్న ప్రభుత్వ-యాజమాన్యం కలిగిన యుటిలిటీ సంస్థ, మంచినీరు, పారిశుధ్య సంస్థ జాతీయ కార్యాలయం ఆఫ్రికాలో ఉత్తమ సమర్ధతో పనిచేస్తున్న యుటిలిటీ కంపెనీలలో ఒకటిగా ఉంది.[51] ఉన్నత స్థాయి స్వయంప్రతిపత్తి, నైపుణ్యం, అంకితభావంతో చేసే నిర్వహణ ఒ.ఎని.ఎ. సంస్థకు శుద్ధ జల ఉత్పత్తిని మెరుగుపరచి ప్రజలకు అందించే సామర్థ్యాన్ని కలుగజేసింది.[51]

2000 నుండి దేశంలోని నాలుగు ప్రధాన పట్టణ కేంద్రాలలో సుమారు 2 మిలియన్ మందికి పైగా ప్రజలుకు నీరు అందించబడుతుంది. సంస్థ అధిక నాణ్యత (నీటిలో 18% కంటే తక్కువగా ఉపసంహరించుకుంది - ఉప-సహారా ఆఫ్రికాలో అతి తక్కువగా ఉన్నది), మెరుగైన ఆర్థిక నివేదికతో దాని వార్షిక రాబడిని సగటున 12% అభివృద్ధిని సాధించింది.[51] కొన్ని సేవలకు రుసుము వసూలుచేయడంలో ఇబ్బందులు ఉన్నాయి. దాని మౌలికనిర్మణాలను విస్తరించేందుకు అంతర్జాతీయ సహాయంపై ఆధారపడవలసిన అవసరం ఉంది.[51] ప్రభుత్వానికి స్వంతమైన, వాణిజ్యపరంగా నిర్వహించబడుతున్న సేవాసంస్థ దేశంలో సహ్స్రాబ్ధ అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడానికి సహకరించింది. ఇది ఒక ఆచరణాత్మక సంస్థగా అభివృద్ధి చెందింది.[51]

అయితే తాగునీటి అందుబాటు గత 28 సంవత్సరాలలో మెరుగుపడింది. యూనిసెఫ్ ఆధారంగా 1990 - 2015 మధ్య గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి సదుపాయం 39% నుండి 76%కి అభివృద్ధి చెందింది. అదే సమయంలో పట్టణ ప్రాంతాల్లో 75% నుండి 97%కి త్రాగునీటిని అందిస్తుంది.[52]

విద్యుత్తు
[మార్చు]

జగ్తౌలి వద్ద ఉన్న 33 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంటు 2017 నవంబరు చివరలో ఆన్ లైన్ సేవలు ప్రారంభిచింది. అది నిర్మించిన సమయంలో పశ్చిమ ఆఫ్రికాలో ఇది అతిపెద్ద సౌర విద్యుత్ కేంద్రంగా గుర్తించబడింది.[53]

ఇతరాలు

[మార్చు]

అయితే ఇది మాలి, నైగర్ నుండి తీవ్రవాద గ్రూపుల నుండి దాడులు, అవినీతి సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ బుర్కినా ఫాసోలో వృద్ధి రేటు అధికంగా ఉంది.[54]

ప్రయాణసౌకర్యాలు

[మార్చు]
The railway station in Bobo Dioulasso was built during the colonial era and remains in operation.

బుర్కినా ఫాసోలో రవాణా అభివృద్ధిదశలో ఉంది.

2014 జూన్ నాటికి ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయం ఓవాగాడౌగౌ విమానాశ్రయం పశ్చిమ ఆఫ్రికాలోని అనేక ప్రాంతాలతో, పారిస్, బ్రస్సెల్స్, ఇస్తాంబుల్ లకు తరచూ విమానసేవలను అందిస్తుంది. అంతర్జాతీయ విమానాశ్రయాలలో " బోబో డియోలాస్సో ఎయిర్పోర్టు " ఓవాగాడుగౌ, అబిడ్జాకు విమానసేవలను అందిస్తుంది.[55]

బుర్కినా ఫాసోలో రైలు రవాణా అనేది ఒకే మార్గంలో నిర్వహించబడుతుంది. ఇది ఐవరీ కోస్టులో ఓగుగౌగౌ, కుడోగుగో, బోబో డియోలాస్సో, బాన్ఫోర మీదుగా కయా నుండి అబిజాన్ వరకు రైలురవాణా సేవలను అందిస్తుంది. ఈ రైలు మార్గంలో వీటితో పాటుగా " సిటారైలు " సంస్థ వారానికి మూడు సార్లు ప్రయాణీకులకు రైలుప్రయాణ సేవవను అందిస్తుంది.

బుర్కినా ఫాసోలో 15,000 కిలోమీటర్ల రహదారులు ఉన్నాయి. వీటిలో 2,500 కిలోమీటర్ల పొడవున కాలిబాట నిర్మించబడి ఉంది.[56]

సంస్కృతి

[మార్చు]
A masked Winiama dancer, ca. 1970

బుర్కినా ఫాసో మౌఖిక సాంప్రదాయంపై ఆధారపడిన సాహిత్యం ప్రాధాన్యత వహిస్తుంది. 1934 లో ఫ్రెంచి ఆక్రమణ సమయంలో డిమ్-డోలోబ్సోం ఓయిడోరాగో " మాక్సిమ్స్, పెన్సిస్ యట్, డెవినిటీస్ మోసి (మాస్సిమ్స్, థాట్స్ అండ్ రిడిల్స్ ఆఫ్ మోస్సి)"ను ప్రచురించాడు. ఇందులో మోస్సి ప్రజల మౌఖికకథనాల ఆధారిత చరిత్ర నమోదు చేయబడింది.[57]

1960 లలో స్వాతంత్ర్య బుర్కినా ఫాసోలో నాజీ బోనీ, రోజర్ నికీమా వంటి మౌఖిక సాంప్రదాయం బుర్కినాబే రచయితలపై ప్రభావాన్ని కలిగి ఉంది.[58] 1960 వ నాటకం రచయితల సంఖ్య పెరిగింది.[57] 1970 ల నుండి బుర్కినా ఫాసోలో అనేకమంది రచయితలను ప్రచురణలతో సాహిత్యం అభివృద్ధి చెందింది.[59]

బుర్కినా ఫాసో థియేటర్ సంప్రదాయ బుర్కినాబే పనితీరును కలోనియల్ ప్రభావాలతో అనుసంధానం చేసింది. పోస్టు కాలనీ పాలనలో గ్రామీణ ప్రజలను చైతన్యవంతం చేసి విలక్షణమైన జాతీయ థియేటర్ను ఉత్పత్తి చేయటానికి ప్రయత్నాలు జరిగాయి. బుర్కినా ఫాసోలోని అనేక జాతి సమూహాల సాంప్రదాయ వేడుకలు ముసుగునృత్యాలు భాగంగా ఉంటాయి. కాలనీల కాలంలో సాధారణంగా పాశ్చాత్య తరహా థియేటర్లను ఫ్రెంచిథియేటరు సంస్కృతి ప్రభావితం చేసింది. స్వాతంత్ర్యం తరువాత బుర్కినా ఫాసో గ్రామీణ ప్రజలను చైతన్యం చేయడానికి, వినోదం అందించే లక్ష్యంతో ఫోరమ్ థియేటర్ ప్రేరేపించిన కొత్త శైలి థియేటరు వచ్చాయి.

కళలు, హస్థకళలు

[మార్చు]
Artisan garland of decorative painted gourds in Ouagadougou.

In addition to several rich traditional artistic heritages among the peoples, there is a large artist community in Burkina Faso, especially in Ouagadougou. Much of the crafts produced are for the country's growing tourist industry.

ఆహార సంస్కృతి

[మార్చు]
A plate of fufu (right) accompanied with peanut soup.

పశ్చిమ ఆఫ్రికన్ ఆహారసంస్కృతి ఉన్న బుర్కినా ఫాసో వంటకాలలో జొన్న, మిల్లెట్, బియ్యం, మొక్కజొన్న, వేరుశెనగ, బంగాళాదుంపలు, బీన్స్, దుంపలు, ఓక్రా ఆహారపదార్ధాలు ఉపయోగించబడుతూ ఉంటాయి.[60] జంతు సంబంధిత ఆహారాలలో సాధారణంగా చికెన్, కోడి గుడ్లు, మంచినీటి చేపలు ప్రాధాన్యత వహిస్తుంటాయి. సాధారణ బుర్కినాబే పానీయాలలో బంజి, (పామ్ వైన్) ప్రాధాన్యత వహిస్తుంది. ఇది పాం సాపును పులియబెట్టి తయారు చేయబడుతుంది. జూమ్-కొం ("ధాన్యం నీరు") బుర్కినా ఫాసో జాతీయ పానీయంగా భావించబడుతుంది. జూమ్-కోమ్ మిల్కీ-ఫేమస్, తెల్లగా నీరు తృణధాన్యాల బేస్ కలిగి ఐస్ క్యూబులతో కల్సి సేవించబడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో, బుర్కినా శివార్లలో డోలో కనుపిస్తుంది. ఇది పులియబెట్టిన మిల్లెట్ నుండి తయారుచేసిన పానీయం. [61]

చలనచిత్రాలు

[మార్చు]

బుర్కినా ఫాసో సినిమా పశ్చిమ ఆఫ్రికా, ఆఫ్రికన్ చిత్ర పరిశ్రమలో ముఖ్యమైన భాగంగా ఉంది.[62] ఆఫ్రికన్ సినిమా రంగానికి బుర్కినా అందిస్తున్న కృషిలో భాగంగా 1969 లో చలన చిత్రోత్సవం " ఫెస్టివల్ పానాఫ్రిక్ డూ సినిమా ఎట్ డె లా టెలీవిజన్ డి ఓగాడౌగౌ" స్థాపనతో ప్రారంభమైంది. 1969 లో నిర్వహించబడిన చలన చిత్రం వారంలో ఇది ప్రారంభించబడింది. దేశంలోని అనేక మంది చిత్ర నిర్మాతలు అంతర్జాతీయంగా ఖ్యాతిగడించి అంతర్జాతీయ బహుమతులు గెలుచుకున్నారు .

ఫెడరేషన్ ఆఫ్ పనాఫికన్ ఫిల్మ్ మేకర్స్ (FEPACI) ప్రధాన కార్యాలయం అనేక సంవత్సరాలపాటు ఔగాడౌగౌలో ఉంది. 1983 లో అధ్యక్షుడు సంకరా అందించిన ఉత్సాహభరితమైన మద్దతు, నిధులు అందించడం ద్వారా ఇబ్బందుల నుండి రక్షించబడింది. (2006 లో ఎఫ్.ఇ.పి.ఎ.సి. సచివాలయం దక్షిణాఫ్రికాకు తరలివెళ్లాయి. అయితే సంస్థ ప్రధాన కార్యాలయం ఇప్పటికీ ఓవాగౌగౌలో ఉంది.) బుర్కినా ఫాసోకు చెందిన ఉత్తమ దర్శకుల్లో గస్టన్ కబోరే, ఇడ్రిసా ఓయ్యూరారాగో, డాని కౌయుయేట్ ఉన్నారు.[63] బుర్కినా ప్రసిద్ధ టెలివిజన్ ధారావాహిక లెస్ బోడోడియుఫ్ను ఉత్పత్తి చేస్తుంది. అంతర్జాతీయంగా ఖ్యాతిగడించిన ప్రముఖ చలన చిత్ర నిర్మాతలు ఓయెడోరాగో, కబోర్, యమాగో, కౌయుయేట్ ప్రముఖ టెలివిజన్ సిరీస్లను కూడా తయారు చేస్తుంటారు.

క్రీడలు

[మార్చు]
Burkina Faso national football team in white during a football match.

బుర్కినా ఫాసోలో విస్తృతమైన క్రీడారంగం ఉంది. క్రీడలలో ఫుట్బాల్ (సాకర్), బాస్కెట్బాల్, సైక్లింగ్, రగ్బీ యూనియన్, హ్యాండ్బాల్, టెన్నిస్, బాక్సింగు, మార్షల్ ఆర్ట్సు ప్రాధాన్యత వహిస్తూ ఉన్నాయి. బుర్కినా ఫాసోలో ఫుట్ బాల్ చాలా ప్రాచుర్యం పొందింది. వృత్తిపరంగా, అనధికారికంగా దేశవ్యాప్తంగా పట్టణాలు, గ్రామాలలో ఈ క్రీడ ప్రాచుర్యం పొందుతూ ఉంది. యువరాణి యెన్నెంగా గుర్రాన్ని సూచింస్తూ జాతీయ జట్టు "లెస్ ఎటాల్నన్స్" ("స్టాలియన్స్") అనే మారుపేరుతో పిలువబడుతూ ఉంది.

1998 లో బుర్కినా ఫాసో " ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ "కు ఆతిథ్యమివ్వడానికి బోబో-డియులాసోసోలో ఓమ్నిస్పోర్ట్ స్టేడియం నిర్మించింది. 2013 లో బుర్కినా ఫాసో దక్షిణాఫ్రికాలో జరిగిన ఆఫ్రికన్ కప్ ఆఫ్ ది ఫైనల్ కు అర్హత సాధించి ఫైనల్కు చేరుకుంది. కానీ 0 నుండి 1 స్కోర్తో నైజీయాకు వ్యతిరేకంగా ఓటమిని ఎదుర్కొన్నది. ప్రస్తుతం బుర్కినా ఫాసో ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. ప్రపంచ ర్యాంకింగ్లలో 53 వ స్థానంలో ఉంది.[64]

పురుషుల, మహిళల పాల్గొంటున్న చాలా ప్రజాదరణ పొందిన మరొక క్రీడ బాస్కెట్బాలు.[65] 2013 దేశ జాతీయ జట్టుకు అత్యంత విజయవంతమైన సంవత్సరంగా ఉంది. అది ఖండంలోని ప్రధాన బాస్కెట్బాల్ పోటీకి (ఆఫ్రోబాస్కెట్టు)కు అర్హత సాధించింది.

మాధ్యమం

[మార్చు]
A Burkinabé photographer at work in Ouagadougou.

దేశంలో ప్రభుత్వ-ప్రాయోజిత టెలివిజన్, రేడియో సేవలు (రేడియోడిఫ్యూషన్-టెలీవీషన్ బుర్కినా ) ప్రధాన ప్రసార మాధ్యమంగా ఉన్నాయి.[66] రెండు మీడియం-వేవ్ (ఎ.ఎం), పలు ప్రసారాలు ఉన్నాయి. ఆర్.టి.ఎం.తో పాటు ప్రైవేటు యాజమాన్యంలో పనిచేస్తున్న ఇతర ఎఫ్.ఎం. ప్రసారాలు క్రీడలు, సాంస్కృతిక, సంగీతం మతపరమైన ప్రసార కార్యక్రమాలు అందిస్తున్నాయి. ఆర్.టి.బి. రాజధాని ఔగాడౌగౌ నుండి ఫ్రెంచి భాషలో ప్రపంచవ్యాప్త షార్టు-వేవ్ న్యూస్ ప్రసారాన్ని (రేడియో నేషనేల్ బుర్కినా) నిర్వహిస్తుంది.[67]

బుర్కినా ఫాసోలో ఒక స్వతంత్ర ప్రెస్, మాధ్యమాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. 1998 లో ఇంవెస్టిగేగేటివ్ జర్నలిస్టు నార్బర్ట్ జోన్గో, అతని సోదరుడు ఎర్నెస్ట్, అతని డ్రైవర్, మరొక వ్యక్తిని గుర్తుతెలియని హంతకులు హత్య చేసి శరీరాలను బూడిద చేసారు. ఈ నేరం ఇప్పటికీ పరిష్కరించబడలేదు.[68] అయినప్పటికీ ఒక స్వతంత్ర కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ తరువాత నార్బెర్ట్ జోన్గో రాజకీయ కారణాల వలన చంపబడ్డాడని నిర్ధారించబడింది. ఎందుకంటే అధ్యక్షుడు బ్లైస్ కంపోరే సోదరుడు అయిన ఫ్రాంకోయిస్ కాపోరే కోసం పనిచేసిన డ్రైవర్ డేవిడ్ ఓయ్యూరారాగో హత్య గురించి ఆయన సేకరించిన పరిశోధనా పని కారణంగా హత్య జరిగిందని అనుమానించారు.[69][70]

1999 జనవరిలో ఫ్రాంకోయిస్ కాపోరే డేవిడ్ ఓయెట్రాగో హత్యకు గురయ్యాడు. అతను 1998 జనవరిలో చిత్రహింసల కారణంగా మరణించారు. అప్పీల్ తర్వాత ఈ ఆరోపణలు సైనిక న్యాయస్థానం ద్వారా తొలగించబడ్డాయి. 2000 ఆగస్టులో ఐదుగురు సభ్యులున్న అధ్యక్షుడి వ్యక్తిగత భద్రతా గార్డులు అందించిన వివరాలలో (రిజిమెంట్ డి లా సికూరిటే ప్రిసిడెండిల్లే లేదా ఆర్.ఎస్.పి.) ఓయుడరాగో హత్యకు గురైన విషయాలు ఉన్నాయి. ఆర్ఎస్పి సభ్యులు మార్సెల్ కఫాన్డో, ఎడ్మండ్ కొయామా, ఓస్సేనిని యారో, నార్బెర్ట్ జోంగో హత్యలో అనుమానితునిగా పరిశోధించబడి ఓయైడోరాగో కేసులో దోషిగా నిర్ణయించి దీర్ఘకాల జైలు శిక్ష విధించబడింది.[69][70]

నార్బెర్ట్ జోన్గో మరణం తరువాత జాంగో ఇంవెస్టిగేషన్, జర్నలిస్టుల కేసు విచారించిన విధానం సంబంధించిన పలు నిరసనలు ప్రభుత్వ పోలీసు, భద్రతా దళాలచే నిరోధించబడడం చెదరగొట్టబడడం సంభవించాయి. 2007ఏప్రిల్ మాసంలో ప్రముఖ రేడియో రెగె హోస్టు కరీమ్ సామ అందించిన కార్యక్రమాలలో ప్రభుత్వ అన్యాయం, అవినీతి ఆరోపణలపై విమర్శనాత్మక వ్యాఖ్యానంతో కూడిన రెగె పాటలకు అనేక చావు బెదిరింపులు వచ్చాయి.[71]

శామా వ్యక్తిగత కారు తరువాత తెలియని వాండల్స్ ద్వారా ప్రైవేట్ రేడియో స్టేషన్ ఓవాగా ఎఫ్.ఎం. వెలుపల కాల్చివేయబడింది.[72] ప్రతిస్పందనగా జర్నలిస్టులను రక్షించడానికి ఏర్పాటైన కమిటీ ప్రభుత్వాన్ని విమర్శించే బుర్కినా ఫాసో పాత్రికేయులకు, రేడియో వ్యాఖ్యాతలకు ఇ-మెయిల్ చేసిన చావు బెదిరింపులను పంపించి దర్యాప్తు చేయాలని కోరారు.[68] 2008 డిసెంబరులో ఔగాడౌగౌ జోగో హత్య కేసు పునరుద్ధరించబడి విచారణ కోసం నిరసనలో పాల్గొన్న నాయకులను పోలిసులు ప్రశ్నించారు. బుర్కినా ఫాసో జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షుడు జీన్-క్లాడే మేడా ఆ ప్రదర్శనలో పాల్గొన్నారు.[73]

సాంస్కృతిక ఉత్సవాలు, సంఘటనలు

[మార్చు]

ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడుతున్న " ఊయడగోగున్ పాన్ఫ్రికాన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఫెస్టివల్ ఆఫ్ ఊగడౌగౌ " ఖండంలోని అతిపెద్ద ఆఫ్రికన్ సినిమా ఫెస్టివల్ (ఫిబ్రవరి, బేసి సంవత్సరములు)గా భావించబడుతుంది.

1988 నుంచి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడుతున్న ఇంటర్నేషనల్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఫెయిర్ (ఓవాగాడుగౌ) కళ, హస్తకళలకు ప్రాధాన్యత ఇస్తున్న (అక్టోబరు చివరలో నవంబరు) ఆఫ్రికాకు అతి ముఖ్యమైన వాణిజ్య ప్రదర్శనలలో ఒకటిగా ఉంది.

ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి " సింపోసియం డి శిల్పగ్రి సుర్ గ్రానిట్ డె లా లాగో " ఔగాడౌగౌ నుండి 35 కిలోమీటర్ల (22 మైళ్ళు) దూరంలో ఉన్న ఒబురిగ్గంగా ప్రావింసులో జరుగుతుంది.

బుర్కినా ఫాసో నేషనల్ కల్చర్ వీక్ (ఫ్రెంచ్ పేరు లా సెమైన్ నేషనేల్ డి లా కల్చర్) బుర్కినా ఫాసోలో అత్యంత ముఖ్యమైన సాంస్కృతిక కార్యక్రమాలలో ఇది ఒకటిగా ఉంది. ఇది రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇది దేశంలో రెండవ అతిపెద్ద నగరం అయిన బోబో డియోలాస్సోలో జరుగుతుంది.

ఫెస్టివల్ ఇంటర్నేషనల్ డెస్ మాస్క్యూస్ ఎట్ డెస్ ఆర్ట్స్ (ఫెస్టిమా), సాంప్రదాయ ముసుగుల సంబరాలు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి డెడుగౌలో జరుగుతుంది.

సమాజం

[మార్చు]

గణాంకాలు

[మార్చు]
A Burkinabe Tuareg man in Ouagadougou
Population[74]
Year Million
1950 4.3
2000 11.6
2016 18.6

బుర్కినా ఫాసో జాతిపరంగా ఒక సమీకృత, లౌకిక రాజ్యం. బుర్కినా ప్రజలలో అధికభాగం దక్షిణప్రాంతంలో, దేశంలోని కేంద్రప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నారు. ఈ ప్రాంతాలలో జన సాంద్రత కొన్నిసార్లు చదరపు కిలోమీటరుకు 48 మంది (125 / చదరపు మైళ్ళు) మించిపోయింది. బుర్కినాబే నుండి లక్షలాదిమంది ప్రధానంగా కాలానుగుణ వ్యవసాయ పనులు చేయడానికి ఐవరీ కోస్టు, ఘనాకు తరచూ వలసపోతుంటారు. ఈ కార్మికుల ప్రవాహం కొన్నిమార్లు వెలుపలి సంఘటనల చేత ప్రభావితమౌతుంది. ఐవరీ కోస్టులో 2002 సెప్టెంబరు తిరుగుబాటు ప్రయత్నం, తరువాతి పోరాటం కారణంగా బుర్కినాబేకి చెందిన వేలాదిమంది బుర్కినా ఫాసోకు తిరిగి వచ్చారు. ఆసమయంలో ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ పని లభించక బాధకు గురైంది.[75]

బుర్కినా ఫాసో మహిళల మొత్తం సంతానోత్పత్తి శాతం 5.93 % (2014 అంచనాలు). ఇది ప్రపంచంలో 6 వ స్థానంలో ఉంది.[76]

2009 లో " యు.ఎస్. డిపార్టుమెంటు అఫ్ స్టేట్స్ ట్రాఫికింగ్ ఇన్ పెర్సన్స్ " నివేదికలో బుర్కినా ఫాసోలో బానిసత్వం ఉనికిలో ఉందని, బుర్కినాబే పిల్లలు తరచూ బాధితులని పేర్కొనబడింది.[77] సాహెల్లోని బానిసత్వం సాధారణంగా అరబ్ బానిస వాణిజ్యసంబంధిత సుదీర్ఘ చరిత్ర ఉంది.[78]

సంప్రదాయ సమూహాలు

[మార్చు]

Burkina Faso's 17.3 million people belong to two major West African ethnic cultural groups—the Voltaic and the Mande (whose common language is Dioula). The Voltaic Mossi make up about one-half of the population. The Mossi claim descent from warriors who migrated to present-day Burkina Faso from northern Ghana around 1100 AD. They established an empire that lasted more than 800 years. Predominantly farmers, the Mossi kingdom is led by the Mogho Naba, whose court is in Ouagadougou.[75]

భాషలు

[మార్చు]

బుర్కినా ఫాసోలో బహుళ భాషలు మాట్లాడబడుతున్నాయి. దేశంలో 69 భాషలు వాడుకలో ఉన్నాయి.[79] వీటిలో సుమారు 60 స్థానికభాషలు ఉన్నాయి. మోస్సి భాష (మూస: Lang-mos) సుమారు 40% మంది ప్రజలకు వాడుకభాషగా ఉంది. ప్రధానంగా కేంద్ర రాజధానిలోని ఓవాగాడౌగౌ, బుర్కినా అంతటా చెల్లాచెదురుగా గురున్సీ సంబంధిత భాషలు వాడుకగా ఉన్నాయి.

పశ్చిమప్రాంతంలో మాండే భాషలు విస్తృతంగా వాడుకలో ఉన్నాయి. అత్యంత ప్రాచుర్యం కలిగిన డ్యూల (జులా లేదా డియోలాగా కూడా పిలుస్తారు), ఇతరభాషలలో బోబో, సమో, మార్కా భాషలు వాడుకలో ఉన్నాయి. ఉత్తర ప్రాంతంలో ఫూలా భాష విస్తృతంగా వ్యాప్తిలో ఉంది. తూర్పుప్రాంతంలో గౌర్మాన్చీ భాష వాడుకలో ఉంది. దక్షిణప్రాంతంలో బిస్సా భాష వాడుకలో ఉంది.

కాలనీల కాలంలో అధికారిక భాషగా ఫ్రెంచి ప్రవేశపెట్టబడింది. ఫ్రెంచిభాష పరిపాలనా, రాజకీయ, న్యాయ సంస్థల ప్రధాన ప్రజా భాష, ప్రభుత్వ సేవలు, ప్రెస్. చట్టాలు, పరిపాలన, కోర్టులకు ఇది ఏకైక భాషగా ఉంది.

Religion in Burkina Faso (2006)[80]

  Islam (60.5%)
  Christianity (23.2%)
  Indigenous beliefs (15.3%)
  Irreligious and others (1.0%)
The Grand Mosque of Bobo-Dioulasso

బుర్కినా ఫాసోలో మతపరమైన కచ్చితమైన గణాంకములు లేవు. ఇస్లాం, క్రైస్తవ మతం తరచూ దేశీయ మత విశ్వాసాలతో కలిసి పనిచేయడమే ఇందుకు ప్రధాన కారణంగా ఉంది. 2006 బుర్కినా ఫాసో జనాభా లెక్కల ఆధారంగా జనాభాలో 60.5% మంది ఇస్లాం ధర్మాన్ని అనుసరిస్తున్నారని అంచనా. వీరిలో ఎక్కువ మంది సున్నీ శాఖకు చెందినవారు,[81][82] అల్పసంఖ్యాక ప్రజలు షియా ఇస్లాంకు కట్టుబడి ఉంటారు.[83] కొతమంది అహ్మదియ ముస్లింలు కూడా ఉన్నారు.[84]

సున్ని ముస్లింలలో టిజనియ సుఫీ అనుయాయులు గణనీయమైన సంఖ్యలో ఉన్నట్లు గుర్తించారు. క్రైస్తవులు (19% రోమన్ కాథలిక్కులు, 4.2% ప్రొటెస్టంట్ తెగల యొక్క సభ్యులు) 23.2% మంది ఉన్నారని ప్రభుత్వం అంచనా వేసింది; 15.3% మంది సంప్రదాయ దేశీయ విశ్వాసాలను అనుసరిస్తున్నారు, 0.6% మంది ఇతర మతాలకు చెందినవారు ఉన్నారు, 0.4% మంది ఏ మతాన్ని అనుసరించడం లేదు.[81][82]

ఆరోగ్యం

[మార్చు]

2012 గణాంకాల ఆధారంగా బుర్కినా ఫాసో సగటు ఆయుఃపరిమితి పురుషులకు 57 సంవత్సరాలు, మహిళలకు 59 సంవత్సరాలుగా అంచనా వేయబడింది. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న శిశు మరణాల శాతం వరుసగా 1000 మందికి 102, జననాల రేటు 1000 మందికి 66.[85] 2014 లో దాని నివాసితుల వివాహ వయసు 17, జనాభా వృద్ధి రేటు 3.05%.[76] 2011 లో ఆరోగ్య వ్యయం జి.డి.పిలో 6.5% ఉండగా; 1,00,000 మందిలో వివాహసంబంధిత మరణాలకు 300, 2010 లో వైద్యుల సంఖ్య 1000 జనాభాలో 0.05 ఉంది. 2012 లో వయోజన హెచ్.ఐ.వి. వ్యాప్తి రేటు (వయస్సు 15-49) 1.0%గా అంచనా వేయబడింది.[86] 2011 యు.ఎన్.ఎయిడ్స్ నివేదిక ఆధారంగా గర్భిణీ స్త్రీలలో హెచ్.ఐ.వి. కారణంగా ఆసుపత్రులకు హాజరు కావడం తగ్గిందని భావిస్తున్నారు.[87] 2005 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదిక ఆధారంగా బర్కినా ఫాసో బాలికలు, స్త్రీలలో 72.5% సాంప్రదాయ ఆచారాల కారణంగా స్త్రీ జననేంద్రియ వైకల్యం కలిగి ఉన్నారు.[88]

2001 నాటికి ప్రభుత్వం ఆరోగ్యరక్షణ వ్యయం 3%గా ఉంది.[89] 2009 నాటికి 1,00,000 మందికి 10 వైద్యులు ఉన్నారు.[90] అంతేకాకుండా 1,00,000 మందికి 41 మంది నర్సులు, 13 మంత్రసానులు ఉన్నారు.[90] 1993 నుండి బుర్కినా ఫాసోలో మూడు ఆరోగ్య సర్వేలు పూర్తి చేసింది. 2009 లో మరొక సర్వే పూర్తి చేసింది.[91] ఇటీవలి కాలంలో డెంగ్యూ జ్వరం కారణంగా 2016లో 20 మంది మృతి చెందారు. ఈ వ్యాధి కేసులు ఔగాడౌగౌ లోని 12 జిల్లాల నుండి నివేదించబడ్డాయి.[92]

విద్య

[మార్చు]
గాండో

బుర్కినా ఫాసోలో విద్యావిధానం ప్రాథమిక, ద్వితీయ, ఉన్నత స్థాయి విద్యగా విభజించబడింది.[93] ఉన్నత పాఠశాల వ్యయం సంవత్సరానికి సి.ఎఫ్.ఎ. 25,000 ($ 50 అమెరికన్ డాలర్లు) అవుతుంది. పాఠశాలలో బాలురకు ప్రాధాన్యత ఉంటుంది. అలాగే బాలికల విద్య, అక్షరాస్యత శాతం పురుషుల కంటే చాలా తక్కువగా ఉన్నాయి. బాలికలకు పాఠశాల ఖర్చు తక్కువగా ఉండటం వారికి మరింత స్కాలర్షిప్పులను ఇచ్చే ప్రభుత్వ విధానం కారణంగా బాలికల విద్య పెరుగుదలను గమనించారు.

ప్రాథమిక పాఠశాల నుండి మాధ్యమిక పాఠశాల వరకు, ఉన్నత పాఠశాల లేక ఉన్నత పాఠశాల నుండి కళాశాలకు వెళ్లడానికి జాతీయ పరీక్షలకు హాజరు కావాలి. ఉన్నత విద్యా సంస్థలలో ఓగాడౌగౌ విశ్వవిద్యాలయం, బోబో-డియులోసాస్ పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయ (ఒక ఉపాధ్యాయ శిక్షణా సంస్థ) కౌడౌగౌ విశ్వవిద్యాలయం ప్రాధాన్యత వహిస్తూ ఉన్నాయి. రాజధాని నగరమైన ఓగాడౌగౌలో కొన్ని చిన్న ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. ఇవి ప్రజలలో కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉంటాయి.

ఔగాగూగౌలో ఉన్న ఒక అమెరికన్ ఆధారిత ప్రైవేటు ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంది.

2008 లో ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమ నివేదిక ఆధారంగా బుర్కినా ఫాసో 1990 లో 12.8% ఉన్న అక్షరాస్యత నుండి 2008 లో 25.3%గా అభివృద్ధి చెందింది. అయినప్పటికీ ప్రపంచంలోని అత్యల్ప స్థాయి అక్షరాస్యత కలిగిన దేశంలో ఒకటిగా ఉంది.[94]

ఆహార బధ్రత

[మార్చు]
A group of farmers in Tarfila, Burkina Faso.

బుర్కినా ఫాసో అధిక స్థాయిలో ఆహార అభద్రతని ఎదుర్కొంటోంది.[95] 1996 ప్రపంచ ఆహార సమావేశంలో నిర్వచన ఆధారంగా "ఆహారపు భద్రత అనేది ప్రజలు అందరూ, అన్ని సమయాలలో, సురక్షితమైన పోషకాహారాన్ని సమకూర్చుకోవడానికి ఆర్ధిక శక్తి కలిగి ఉండటం వారి ఆహార అవసరాలు పూర్తిచేసుకుని చురుకైన ఆరోగ్యవంతమైన జీవనశైలికి సాగించడానికి సహకరిస్తుంది "[96] ఇటీవలి సంవత్సరాల్లో ఆహార భద్రత సమస్య పరిష్కరించడానికి చేసిన ప్రయత్నాలు విజయవంతం కాలేదు.[95] బుర్కినా ఫాసోలో వేగంగా పెరుగుతున్న జనాభా (సంవత్సరానికి 3.6%) దేశం వనరులు, మౌలిక సదుపాయాలపై ఒత్తిడిని అధికరింపచేసి ఆహారలభ్యతను పరిమితం చేస్తుంది.[97] దేశంలో సంభవించిన కరువు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించడం కారణంగా అనేక కుటుంబాలు తీవ్ర ఆకలి నుండి తమను తాము రక్షించుకోవడానికి పోరాడుతున్నాయి. [95] ఇటీవలి పంట విధానాలు కొంత మెరుగుపడినప్పటికీ జనాభాలో చాలామందికి ఇప్పటికీ గత దశాబ్దంలో సంభవించిన నిరంతర ఆహార, పోషకాహార సంక్షోభాలను అధిగమించడం కష్టంగా ఉంది.[98] మహిళలు, పిల్లలలో పోషకాహారలోపం సాధారణం అయింది. అధిక సంఖ్యలో జనాభా పెరుగుదల సూక్ష్మపోషకాహార లోపం, రక్తహీనత వంటి బాధపడుతున్నారు.[99] బుర్కినా ఫాసోలో ఆహార అబధ్రత నిర్మాణాత్మక సమస్యగా అభివృద్ధి చెందింది. అధికరించిన ఆహార ధరలు, అత్యధిక పేదరిక స్థాయిలతో కలిపి ఈ కారకాలు దీర్ఘకాల అధిక స్థాయి ఆహార అభద్రత, పోషకాహారలోప సమస్యలుగా బుర్కినా ఫాసోకు హాని కలిగించాయి.[95]

ఆహార అబధ్రతకు కారణాలు

[మార్చు]

సాంఘిక, ఆర్ధిక కారణాలు

[మార్చు]

ఆహార భద్రత పేదరికంతో గట్టిగా ముడిపడి ఉంది.[100] ప్రపంచంలో పేద దేశాలలో ఒకటైన బుర్కినా ఫాసో జనాభాలో 43.7% మంది దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్నారు.[101] 2015 లో యునైటెడ్ నేషంసు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్సులోని 188 దేశాల్లో బుర్కినా ఫాసో 185 వ స్థానంలో ఉంది. [95] హ్యూమన్ డెవలప్మెంటు ఇండెక్సు మానవాభివృద్ధి మూడు ప్రధాన విభాగాలను పరిగణనలోకి తీసుకుంటుంది: ఆయుఃప్రమాణం, విద్య, జీవన ప్రమాణాలు.[102] బుర్కినా ఫాసోలో ఉన్న ఈ అధిక స్థాయి పేదరికం ప్రపంచ ఆహార సంక్షోభం, ఆహార ధరల పెరుగుదలతో కలిపి బుర్కినా ఫాసో ఆహార అభద్రతా సమస్యకు దారితీసింది.[103] 2007-2008 ప్రపంచ ఆహార సంక్షోభం ఆహార ధరలలో విపరీతమైన పెరుగుదల, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలో ఆకలి, పోషకాహారలోపం, రాజకీయ, ఆర్థిక అస్థిరత్వం శాతం అధికరించడానికి దారితీసింది.[104] బుర్కినా ఫాసో ఈ పరిస్థితి బర్కినా జనాభాలో సుమారు 80% గ్రామీణ, జీవనోపాధి కోసం వ్యవసాయంపై ఆధారపడటం బలమైన కారణంగా భావిస్తున్నారు.[98] ఉదాహరణకు వరదలు, కరువులు, లేదా మిడుత దాడుల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. పంటలు వైఫల్యం కారణంగా బుర్కినా ఫాసోలోని రైతులు కూడా జీవనం సాగించడానికి ధాన్యం కొనుగోలుపై ఆధారపడతారు.[105] ప్రపంచ ఆహార సంక్షోభం కారణంగా స్థానిక ధాన్యం ధరలు నాటకీయంగా అధికరించాయి. రైతులకు పరిమితంగా మార్కెట్టు ఎక్స్చేంజిల ద్వారా ధాన్యం లభిస్తుంది.[105]

పర్యావరణం

[మార్చు]
Damage caused by the Dourtenga floodings in 2007.

బుర్కినా ఫాసో ఆహార అభద్రతా సమస్యకు భౌగోళిక పర్యావరణ సమస్యలు దోహదపడుతున్నాయి.[106] దేశం సహెల్ ప్రాంతంలో ఉన్నందున బుర్కినా ఫాసో తీవ్ర వరదలు, తీవ్రమైన కరువు వంటి ప్రపంచంలోని అత్యంత తీవ్రమైన వాతావరణ మార్పులను అనుభవిస్తుంది.[107] బుర్కినా ఫాసో పౌరులు తరచుగా అనుకోని వాతావరణ పరిస్థితుల కారణంగా వ్యవసాయ ఉత్పత్తుల ఆధారపడడం, సంపదను అధికరింపజేసుకోవడంలో బలమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు.[108] బుర్కినా ఫాసో వాతావరణం దాని పంటలను కీటక దాడులకు గురిచేస్తుంది. ఇందులో మిడుతలు, క్రికెట్ల కీటకాల దాడులు ఉన్నాయి. ఇవి పంటలను నాశనం చేసి ఆహార ఉత్పత్తిని మరింత దిగజారుస్తుంటాయి. [109] బుర్కినా ఫాసో జనాభా అధికంగా వ్యవసాయ ఆదాయం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తుంటారు. కానీ వారు కుటుంబ ఆహార అవసరాలను తీర్చుకోవడానికి వ్యవసాయ రంగంపై ఆధారపడతారు.[110] వ్యవసాయం క్షీణిస్తున్న కారణంగా అధిక కుటుంబాలు వ్యవసాయేతర ఆదాయం మీద ఆధారపడుతున్నారు.[111] తరచుగా పని వెతుక్కుంటూ వారి ప్రాంతాలను వదిలి వెలుపల ప్రాంతాలకు ప్రయాణించడం అవసరమవుతుంది.[110]

ప్రస్తుత గణాంకాలు

[మార్చు]

గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఆధారంగా ఒక దేశపు ఆకలి స్థాయిలను అంచనా వేయడానికి, ట్రాక్ చేయడానికి ఉపయోగించే సాధనం అంచనాలలో [112] 2013 లో బుర్కినా ఫాసో 78 దేశాలలో 65 వ స్థానంలో ఉంది.[113] బుర్కినా ఫాసోలో ఆహార అభద్రతా ప్రమాదానికి గురైన 1.5 మిలియన్ల మంది పిల్లలు ప్రస్తుతం ఉన్నట్లు అంచనా వేశారు. సుమారు 3,50,000 మంది పిల్లలు అత్యవసర వైద్య సహాయం అవసరమైన స్థితిలో ఉన్నారు.[113] ఈ పిల్లలలో మూడింట ఒక వంతు మాత్రమే తగినంత వైద్య సంరక్షణ పొందుతుంది.[114] రెండు సంవత్సరముల వయస్సులో ఉన్న పిల్లలలో 11.4 % మాత్రమే సిఫార్సు చేసిన రోజువారీ ఆహారాన్ని పొందుతున్నారు.[113] బుర్కినా ఫాసోలో ఆహార అభద్రతా ఫలితంగా నిరుద్యోగ పెరుగుదల తీవ్రమైన సమస్యగా ఉంది. 2008 - 2012 వరకు జనాభాలో కనీసం మూడవవంతు ప్రజలను ఆహార అబధ్రత ప్రభావితం చేస్తుంది.[115] అంతేకాకుండా సాధారణ పెరుగుదల కలిగిన విద్యార్థిదశలో ఉన్న పిల్లలతో పోలిస్తే వీరు తక్కువ స్థాయిలో విద్యను అభ్యసిస్తున్నారు.[116] బుర్కినా ఫాసోలో 5 ఏళ్ళలోపు వయస్సు ఉన్న 5,00,000 మంది పిల్లలు 2015 లో తీవ్రమైన పోషకాహారలోపాన్ని అనుభవిస్తారని యూరోపియన్ కమిషన్ అంచనా వేసింది. వాటిలో దాదాపు 1,49,000 మంది ప్రాణాంతక ఆకృతులతో బాధపడుతున్నారు.[98] సూక్ష్మపోషకాహార లోపం శాతం కూడా ఎక్కువగా ఉంటుంది.[117] ఆరోగ్య సర్వే ఆధారంగా (2010) 49 % మహిళలు, ఐదు సంవత్సరముల వయస్సు పిల్లలలో 88 % మంది పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నారు.[117] 45% శిశు మరణాలకు పోషకాహారలోపం కారణంగా ఉండవచ్చని భావిస్తున్నారు. శిశు మరణాల శాతంబుర్కినా ఫాసో మొత్తం శ్రామిక శక్తి 13.6% తగ్గిపోయింది. ఆహార భద్రత ఆరోగ్యానికి మించి జీవితంలో మరిన్ని అంశాలను ఎలా ప్రభావితం చేస్తుందో ఇది ప్రదర్శిస్తుంది.[113]

గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య సేవలు పరిమితంగానే అందుబాటులో ఉండటం వలన ఆహారపు అభద్రత ప్రభావాలు గ్రామీణ ప్రాంతాలలో, గ్రామీణ జనాభాలో అధికంగా ఉన్నాయి. వీరికి అవగాహన, విద్య పరిమితంగా ఉ పిల్లల పోషకాహార లోపం అధికరించింది.[118]

ఆహార బధ్రతను అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు

[మార్చు]

ప్రపంచ ఆహార ప్రణాళిక

[మార్చు]
A woman waiting for food aid at a World Food Programme food distribution site.

బుర్కినా ఫాసోలో పెరుగుతున్న ఆహార భద్రత నివారణ కొరకు ప్రపంచ ఆహార కార్యక్రమం అనేక ప్రాజెక్టులను రూపొందించి పనిచేస్తుంది. 2012 లో ఆహార, పోషకాహార సంక్షోభం నేపథ్యంలో బుర్కినా ఫాసోలో అధిక స్థాయిలో పోషకాహారలోపానికి ప్రతిస్పందిస్తూ రిలీఫ్ అండ్ రికవరీ ఆపరేషన్ ఏర్పాటు చేయబడింది.[95] ఈ పథకం ప్రయత్నాలు అధికంగా పోషకాహారలోపానికి చికిత్స, నివారణకు మీద దృష్టి సారించాయి. పోషకాహారలోపానికి చికిత్స పొందుతున్న పిల్లల సంరక్షణ కోసం గృహ రుణాలను తీసుకోవాలి.[95] అదనంగా ఈ ఆపరేషన్ కార్యకలాపాలు భవిష్యత్తు ఆహార సంక్షోభాలను ఎదుర్కొనేందుకు కుటుంబాలకు సహకారం అందిస్తాయి.[95]

ఈ ప్రణాళిక రెండు భాగాలను కలిగి ఉంది: హెచ్.ఐ.వితో బాధపడుతున్న ప్రజలకు ఆహారం అందించడం, సహెల్ ప్రాంతంలో ప్రాథమిక పాఠశాలల విద్యార్థులందరికి పాఠశాలలో ఆహారం అందించడం భాగంగా ఉన్నాయి.[119] ఎయిడ్స్ పోషకాహార కార్యక్రమం ఎయిడ్సుతో జీవిస్తున్నవారికి పోషకాహార రికవరీని మెరుగుపర్చడానికి, పోషకాహారలోపం ఆహార భద్రత ప్రమాదం నుండి పిల్లలను, అనాథలను రక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది.[119] జాతీయ నమోదు శాతం కంటే తక్కువ ఉన్న ప్రాంతాలలో విద్యార్థుల భోజనపధకం విభాగంలో భాగంగా సహెల్ ప్రాంతం పాఠశాలల్లో నమోదు, హాజరు పెంచడం లక్ష్యంగా పనిచేస్తుంది.[95] అంతేకాకుండా ఈ పాఠశాలల్లో లింగ వివక్షణ శాతం మెరుగుపర్చడానికి ఈ కార్యక్రమం ఉద్దేశించబడింది. గత రెండు సంవత్సరాల వ్యవధిలో ప్రాథమిక పాఠశాలలో మహిళల ఉన్నత పాఠశాల హాజరుతో అధికరించింది. గృహాలకు ప్రోత్సాహకంగా తృణధాన్యాలు అందించి, గృహ రుణాలు అందించి బాలికలను పాఠశాలకు పంపించమని వారిని ప్రోత్సహించారు.[95]

ప్రపంచ బ్యాంకు

[మార్చు]
The World Bank logo

1944 లో ప్రపంచ బ్యాంకు స్థాపించబడింది. 2030 నాటికి తీవ్ర పేదరికం అంతం చేయటానికి, దేశాలన్నింటికీ 40 % నలభై శాతం ఆదాయ వృద్ధిని సాధించడం ద్వారా భాగస్వామ్య సంపదను అభివృద్ధిచేయడం మొదలైన ఐదు భాగస్వామ్య లక్ష్యాలను కలిగి ఉంది.[120] బుర్కినా ఫాసోలో ఆహార అభద్రతను తగ్గించేందుకు ప్రపంచ బ్యాంకు చేస్తున్న కృషిలో వ్యవసాయ ఉత్పాదకత, ఆహార భద్రతా ప్రధాన ప్రణాళికలుగా ఉన్నాయి.[121] ప్రపంచ బ్యాంకు ఆధారంగా ఈ పథకం "ఆహార ఉత్పత్తిని పెంచడం, గ్రామీణ మార్కెట్లలో ఆహార ఉత్పత్తుల మెరుగైన లభ్యతని నిర్ధారించడం, పేద ఉత్పత్తిదారుల సామర్థ్యాన్ని మెరుగుపరచడం" లక్ష్యంగా పనిచేస్తుంది.[121] వ్యవసాయ ఉత్పాదకత, ఆహార భద్రత ప్రాజెక్ట్ మూడు ప్రధాన భాగాలు ఉన్నాయి. ఆహార ఉత్పత్తిని మెరుగుపర్చడం, నిధి మంజూరుతో సహా, తమ వాటాను చెల్లించలేని గృహాలకు " వౌచర్ ఫర్ వర్క్ " కార్యక్రమాలను అందించడం దీనిలో మొదటి భాగంగా ఉంది.[121] ఈ ప్రాజెక్టు తరువాతి భాగం గ్రామీణ ప్రాంతాలలో ఆహార ఉత్పత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.[121] ఆహార ఉత్పత్తుల మార్కెటింగుకు ఇది మద్దతు ఇస్తుంది. స్థానిక జాతీయ స్థాయిలో ఆహార ఉత్పత్తి సరఫరా వైవిధ్యాన్ని నియంత్రించడానికి వాటాదారుల సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు ఇది ఉద్దేశించబడింది.[121] చివరగా ఈ ప్రాజెక్టు మూడవ భాగం సంస్థాగత అభివృద్ధి మీద దృష్టి సారిస్తుంది. ప్రాజెక్టు అమలులో పాల్గొన్న సర్వీస్ ప్రొవైడర్లు, సంస్థల సామర్థ్యాన్ని బలోపేతం చేయడం దీని లక్ష్యం.[121] ఈ ప్రాజెక్టు సర్వీసు ప్రొవైడర్ల సామర్థ్యాన్ని పెంపొందించడం, ఆహార ఉత్పత్తిదారుల సామర్థ్యాన్ని బలోపేతం చేయటం, వ్యవసాయాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పనిచేస్తుంది.[121]

వెలుపలి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "burkina-faso noun – Definition, pictures, pronunciation and usage notes | Oxford Advanced Learner's Dictionary at OxfordLearnersDictionaries.com". www.oxfordlearnersdictionaries.com (in ఇంగ్లీష్). Retrieved 2017-11-20.
  2. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; The World Factbook అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  3. 3.0 3.1 Burkina Faso Salutes "Africa's Che" Thomas Sankara by Mathieu Bonkoungou, Reuters, Oct 17 2007
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 Thomas Sankara: The Upright Man by California Newsreel
  5. 5.0 5.1 5.2 Commemorating Thomas Sankara by Farid Omar, Group for Research and Initiative for the Liberation of Africa (GRILA), November 28, 2007
  6. Violent Protests Topple Government in Burkina Faso, BBC.
  7. Tens of thousands attend Burkina Faso protest, Protesters voice opposition to referendum that would allow Blaise Campaore to extend his presidential term, Reuters, Last updated: 1 June 2014 01:34.
  8. "Burkina Faso coup: military says it now controls country after arresting leaders". The Daily Telegraph (Online edition). United Kingdom. 17 September 2015. Archived from the original on 11 అక్టోబరు 2017. Retrieved 17 September 2015.
  9. "Burkina Faso coup: Michel Kafando reinstated as president". BBC World News. 23 September 2015. Retrieved 23 September 2015.
  10. 10.0 10.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Kabore wins అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  11. 11.0 11.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; swears in new president అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  12. "Why the name: Burkina Faso?". 12 September 2013.
  13. iAfrica – Ancient History UNTOLD (in ఇంగ్లీష్). Forbidden Fruit Books LLC. p. 21.
  14. UNESCO World Heritage Centre. "Site archéologique de Bura". unesco.org.
  15. Miller, D. E.; Van Der Merwe, N. J. (2009). "Early Metal Working in Sub-Saharan Africa: A Review of Recent Research". The Journal of African History. 35: 1–36. doi:10.1017/S0021853700025949. JSTOR 182719.
  16. Stuiver, Minze; van der Merwe, Nicolaas J. (1968). "Radiocarbon Chronology of the Iron Age in Sub-Saharan Africa". Current Anthropology. 9 (1): 54–58. doi:10.1086/200878. JSTOR 2740446.
  17. Rupley, p. 27
  18. 18.0 18.1 Rupley, p. 28
  19. "Encyclopedia of the Nations." History. Advameg, Inc., n.d. Web. 8 October 2014.
  20. Rupley, p. xxvioi
  21. Rupley, p. xxvix
  22. Rupley, pp. 30–33
  23. Mahir Saul and Patrick Royer, West African Challenge to Empire, 2001
  24. 24.0 24.1 "More (Language of the Moose people) Phrase Book". World Digital Library. Retrieved 16 February 2013.
  25. Anyangwe, Carlson (2012). Revolutionary Overthrow of Constitutional Orders in Africa (in ఇంగ్లీష్). African Books Collective. ISBN 9789956727780.
  26. Kingfisher Geography Encyclopedia. ISBN 1-85613-582-9. Page 170
  27. Manning, Patrick (1988). Francophone Sub-Saharan Africa: 1880-198. Cambridge: New York.
  28. The name is an amalgam of More burkina ("honest", "upright", or "incorruptible men") and Jula faso ("homeland"; literally "father's house"). The "-be" suffix in the name for the people – Burkinabe – comes from the Fula plural suffix for people, -ɓe.
  29. X, Mr (2015-10-28). "Resurrecting Thomas Sankara – My Blog". My Blog (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2017-04-25.
  30. "Reviving Thomas Sankara's spirit". www.aljazeera.com. Retrieved 2017-04-25.
  31. Kasuka, Bridgette (2011). African Leaders. 3rd Paragraph: Bankole Kamara Taylor. p. 13. ISBN 978-1468114362. Retrieved 30 October 2014.{{cite book}}: CS1 maint: location (link)
  32. "Burkina Faso Profile." Burkina Faso Profile. BBC NEWS AFRICA, 21 March 2014. Web. 24 September 2014.
  33. United Nation (2016). "List of Least Developed Countries" (PDF). un.org. Archived from the original (PDF) on 2011-03-01.
  34. "BBC News – Burkina Faso parliament set ablaze". BBC News. Retrieved 30 October 2014.
  35. "Burkina Faso protesters set parliament on fire, take over state TV and march on presidency". The Sydney Morning Herald. Retrieved 30 October 2014.
  36. Gongo, Simon; Bax, Pauline. "Burkina Faso General Takes Power After President Resigns". Businessweek.com. Archived from the original on 2015-01-02. Retrieved 2018-11-26.
  37. Herve, Taoko and Cowelloct, Alan (31 October 2014) Burkina Faso’s President Resigns, and General Takes Reins. New York Times.
  38. "BBC News – Army backs new Burkina Faso leader Isaac Zida". BBC News.
  39. "Burkina Faso talks agree on plan for return to civilian rule". Reuters. Archived from the original on 10 నవంబరు 2014. Retrieved 9 November 2014.
  40. Raziye Akkoc (17 September 2015). "Burkina Faso coup: military says it now controls country after arresting leaders: live". agencies. The Daily Telegraph.
  41. "Burkina Faso Leader Apologizes To Nation For Seizing Power In A Coup". Retrieved 2015-09-23.
  42. "A Week After Coup, Burkina Faso's Interim President Back In Power". Retrieved 2015-09-23.
  43. 43.0 43.1 "SIM Country Profile: Burkina Faso". Archived from the original on 9 March 2008. Retrieved 5 August 2006.
  44. Geography & Wildlife Archived 3 సెప్టెంబరు 2015 at the Wayback Machine. our-africa.org
  45. "OEC: Products exported by Bulgaria (2012)". The Observatory of Economic Complexity. Archived from the original on 4 సెప్టెంబరు 2014. Retrieved 30 అక్టోబరు 2014.
  46. "Euromoney Country Risk". Euromoney Country Risk. Euromoney Institutional Investor PLC. Retrieved 15 August 2011.
  47. "Burkina Faso Financial Sector Profile". Archived from the original on 10 December 2014. Retrieved 2015-06-11.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link), MFW4A
  48. Profile – Burkina Faso Archived 2012-04-26 at the Wayback Machine. Inadev.org. Retrieved on 5 April 2014.
  49. York, Jeoffrey (15 April 2012). "Iamgold's growing investment in Burkina Faso". The Globe and Mail. Toronto.
  50. "OHADA.com: The business law portal in Africa". Retrieved 22 March 2009.
  51. 51.0 51.1 51.2 51.3 51.4 Peter Newborne 2011. Pipes and People: Progress in Water Supply in Burkina Faso's Cities, London: Overseas Development Institute
  52. "Burkina Faso: Programme Overview: Water, Sanitation & Hygiene (WASH)" (PDF). UNICEF. Archived from the original (pdf) on 3 మే 2018. Retrieved 1 May 2018.
  53. "Burkina Faso launches Sahel region's largest solar power plant". EURACTIV. 2017-11-27. Retrieved 2018-03-06.
  54. "Burkina Faso". Archived from the original on 6 అక్టోబరు 2014. Retrieved 17 October 2014.
  55. European Rail Timetable, Summer 2014 Edition
  56. "Burkina Faso Road Network". Logistics Capacity Assessments (LCAs). Archived from the original on 5 ఆగస్టు 2018. Retrieved 4 August 2018.
  57. 57.0 57.1 Salhi, Kamal (1999). Francophone Voices. Intellect Books. p. 37. ISBN 1-902454-03-0. Retrieved 26 April 2014.
  58. Allan, Tuzyline Jita (1997). Women's Studies Quarterly: Teaching African Literatures in a Global Literary. Feminist Press. p. 86. ISBN 1-55861-169-X. Retrieved 26 April 2014.
  59. Marchais, Julien (2006). Burkina Faso (in French). Petit Futé. pp. 91–92. ISBN 2-7469-1601-0. Retrieved 26 April 2014.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  60. "Oxfam's Cool Planet – Food in Burkina Faso". Oxfam. Archived from the original on 17 May 2012. Retrieved 21 May 2008.
  61. [1] Archived 2015-12-31 at the Wayback Machine article in French on Burkinabe Zoom-kom
  62. Spaas, Lieve (2000) "Burkina Faso," in The Francophone Film: A Struggle for Identity, pp. 232–246. Manchester: Manchester University Press, ISBN 0719058619.
  63. Turégano, Teresa Hoefert (2005) African Cinema and Europe: Close-Up on Burkina Faso, Florence: European Press Academic, ISBN 888398031X.
  64. "The FIFA/Coca-Cola World Ranking". FIFA.com. Archived from the original on 5 సెప్టెంబరు 2012. Retrieved 4 February 2017.
  65. Keim, Marion (2014) [1st pub. 2014]. "COUNTRY PROFILE OF SPORT AND DEVELOPMENT – Sport and Popularity". Sport and Development Policy in Africa – Results of collaborative study of selected country cases. SUN PRESS. p. 206. ISBN 978-1-920689-20-9.
  66. "Radiodiffusion-Télévision Burkina". Rtb.bf. Retrieved 1 October 2009.
  67. Radio Station World, Burkina Faso: Governmental Broadcasting Agencies
  68. 68.0 68.1 Committee to Protect Journalists, Burkina Faso
  69. 69.0 69.1 Reporters Sans Frontieres, What’s Happening About The Inquiry Into Norbert Zongo’s Death? Archived 21 ఏప్రిల్ 2014 at the Wayback Machine
  70. 70.0 70.1 Reporters Sans Frontieres, Outrageous Denial Of Justice 21 July 2006
  71. IFEX, Radio Station Temporarily Pulls Programme After Host Receives Death Threats, 26 April 2007
  72. FreeMuse.org, Death threat against Reggae Radio Host Archived 26 ఏప్రిల్ 2014 at the Wayback Machine, 3 May 2007
  73. Keita, Mohamed, Burkina Faso Police Question Zongo Protesters, Committee to Protect Journalists, 15 December 2008
  74. "World Population Prospects: The 2017 Revision". ESA.UN.org (custom data acquired via website). United Nations Department of Economic and Social Affairs, Population Division. Retrieved 10 September 2017.
  75. 75.0 75.1 "Burkina Faso", U.S. Department of State, June 2008.
     This article incorporates text from this source, which is in the public domain.
  76. 76.0 76.1 Burkina Faso Archived 2019-09-06 at the Wayback Machine. CIA World Factbook
  77. June 2009 the U.S. Department of State Trafficking in Persons Report
  78. "West Africa slavery still widespread". BBC News. 27 October 2008.
  79. Lewis, M. Paul (ed.), 2009. Ethnologue: Languages of the World, 16th edition. Dallas, Tex.: SIL International. (Page on "Languages of Burkina Faso.")
  80. Comité national du recensement (జూలై 2008). "Recensement général de la population et de l'habitation de 2006" (PDF). Conseil national de la statistique. Archived from the original (PDF) on 21 ఏప్రిల్ 2011. Retrieved 28 నవంబరు 2018.
  81. 81.0 81.1 Comité national du recensement (జూలై 2008). "Recensement général de la population et de l'habitation de 2006" (PDF). Conseil national de la statistique. Archived from the original (PDF) on 21 ఏప్రిల్ 2011. Retrieved 28 నవంబరు 2018.
  82. 82.0 82.1 International Religious Freedom Report 2010: Burkina Faso. United States Bureau of Democracy, Human Rights and Labor (17 November 2010). This article incorporates text from this source, which is in the public domain.
  83. Mapping the Global Muslim Population. Estimate Range of Shia by Country Archived 15 డిసెంబరు 2016 at the Wayback Machine. Pew Forum, 2010
  84. Breach of Faith. Human Rights Watch. June 2005. p. 8. Retrieved 4 June 2014. Estimates of around 20 million would be appropriate
  85. "Statistics in Burkina Faso". World Health Organization.
  86. UN AIDS: HIV/AIDS – adult prevalence rate. Retrieved on 25 July 2014.
  87. UNAIDS World AIDS Day Report 2011 (PDF), UNAIDS, archived from the original (PDF) on 24 ఆగస్టు 2014, retrieved 29 March 2012
  88. Female genital mutilation and other harmful practices Archived 2011-04-23 at the Wayback Machine, WHI.int
  89. "Globalis – an interactive world map – Burkina Faso – Central government expenditures on health". Globalis.gvu.unu.edu. Archived from the original on 16 May 2011. Retrieved 1 October 2009.
  90. 90.0 90.1 "WHO Country Offices in the WHO African Region – WHO | Regional Office for Africa". Afro.who.int. Retrieved 20 June 2010.
  91. Burkina Faso DHS Surveys, measuredhs.com
  92. "Dengue fever kills 20 in Burkina Faso".
  93. "Education – Burkina Faso". Nationsencyclopedia.com. Retrieved 1 October 2009.
  94. "UNDP Human Development Report 2007/2008" (PDF). Archived from the original on 29 April 2011. Retrieved 2016-01-13.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link). Palgrave Macmillan. 2007. ISBN 978-0-230-54704-9
  95. 95.00 95.01 95.02 95.03 95.04 95.05 95.06 95.07 95.08 95.09 "Burkina Faso | WFP | United Nations World Food Programme – Fighting Hunger Worldwide". wfp.org. Archived from the original on 2015-09-10. Retrieved 2015-10-19.
  96. Pinstrup-Andersen, Per (21 January 2009). "Food security: definition and measurement" (PDF). Food Security. 1: 5–7. doi:10.1007/s12571-008-0002-y. Archived from the original (PDF) on 4 మార్చి 2016.
  97. "Burkina Faso ICE Case Study". 1.american.edu. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 29 నవంబరు 2018.
  98. 98.0 98.1 98.2 "ECHO Factsheet – Burkina Faso" (PDF). European Commission.
  99. "USAID Office of Food for Peace Burkina Faso Food Security Country Framework" (PDF). United States Agency International Development.
  100. Burns, Cate (ఏప్రిల్ 2004). "A review of the literature describing the link between poverty, food insecurity and obesity with specific reference to Australia" (PDF). VicHealth. Archived from the original (PDF) on 21 నవంబరు 2015.
  101. Hagberg, Sten (2001). "Poverty in Burkina Faso" (PDF).
  102. Youngblood Coleman, Denise (2015). "Burkina Faso 2015 Country Review". Burkina Faso Country Review.[permanent dead link]
  103. Sasson, Albert (2012). "Food security for Africa: an urgent global challenge" (PDF). Agriculture and Food Security. 1: 2. doi:10.1186/2048-7010-1-2.{{cite journal}}: CS1 maint: unflagged free DOI (link)
  104. Headey, Derek; Shenggen Fan. "Reflections on the global food crisis: How did it happen? How has it hurt? And how can we prevent the next one? Vol. 165. Intl Food Policy Res Inst, 2010" (PDF).
  105. 105.0 105.1 West, Colin Thor (2014). "Famines are a Thing of the Past: Food Security Trends in Northern Burkina Faso". Human Organization. 73 (4): 340–350. doi:10.17730/humo.73.4.t6952215w6281m36.
  106. Reardon, Thomas (1996). "Agroclimatic Shock, Income Inequality, and Poverty: Evidence from Burkina Faso" (PDF). World Development. 24 (5): 901–914. doi:10.1016/0305-750x(96)00009-5.
  107. Ostergaard Nielsen, Jonas (February 2010). "Cultural barriers to climate change adaptation: A case study from Northern Burkina Faso". Global Environmental Change. 20: 142–152. doi:10.1016/j.gloenvcha.2009.10.002.
  108. Barbier; et al. (2009). "Human Vulnerability to Climate Variability in the Sahel: Farmers' Adaptation Strategies in Northern Burkina Faso". Environmental Management. 43 (5): 790–803. Bibcode:2009EnMan..43..790B. doi:10.1007/s00267-008-9237-9. PMID 19037691. Retrieved November 24, 2016.
  109. Groten, S. M. E. (1993). "NDVI—crop monitoring and early yield assessment of Burkina Faso". International Journal of Remote Sensing. 14 (8): 1495–1515. Bibcode:1993IJRS...14.1495G. doi:10.1080/01431169308953983.
  110. 110.0 110.1 "Coping with household-level food insecurity in drought-affected areas of Burkina Faso" (PDF). ac.els-cdn.com. doi:10.1016/0305-750X(88)90109-X. Retrieved 2015-11-02.
  111. "The costs and risks of coping with drought: livelihood impacts and farmers' responses in Burkina Faso" (PDF). Climate Research. 19: 119–132. 2001. Bibcode:2001ClRes..19..119R. doi:10.3354/cr019119. Archived from the original (PDF) on 2015-12-08. {{cite journal}}: Cite uses deprecated parameter |authors= (help)
  112. "Global Hunger Index | IFPRI". ifpri.org. Retrieved 2015-11-20.
  113. 113.0 113.1 113.2 113.3 "UN World Food Program". wfp.org. Archived from the original on 2015-10-12. Retrieved 2015-10-19.
  114. "The Cost of Hunger in Africa: Burkina Faso 2015" (PDF). African Union Commission. Archived from the original (PDF) on 2015-11-21.
  115. "Statistics". UNICEF. Archived from the original on 2015-11-21. Retrieved 2015-10-19.
  116. "Education of Marginalized Populations in Burkina Faso". Archived from the original on 2015-11-21.
  117. 117.0 117.1 "The DHS Program – Burkina Faso: DHS, 2010 – Final Report (French)". dhsprogram.com. Archived from the original on 2015-10-05. Retrieved 2015-10-19.
  118. "Gains and losses as Burkina Faso fights child hunger". IRINnews. Retrieved 2015-10-19.
  119. 119.0 119.1 "Burkina Faso Brief" (PDF). World Food Programme.
  120. "What We Do". worldbank.org. Retrieved 2015-11-02.
  121. 121.0 121.1 121.2 121.3 121.4 121.5 121.6 "Projects : Agricultural Productivity and Food Security Project | The World Bank". worldbank.org. Retrieved 2015-11-02.