కారైకాల్ జిల్లా
కరైకల్ జిల్లా | |
---|---|
పుదుచ్చేరి జిల్లా | |
Coordinates: 11°01′00″N 79°52′00″E / 11.01667°N 79.86667°E | |
రాష్ట్రం | భారతదేశం |
రాష్ట్రం | పుదుచ్చేరి |
జిల్లా | కరైకల్ |
విస్తీర్ణం | |
• Total | 161 కి.మీ2 (62 చ. మై) |
జనాభా (2011)[1] | |
• Total | 2,00,222 |
• జనసాంద్రత | 1,200/కి.మీ2 (3,200/చ. మై.) |
భాషలు | |
• అధికార | తమిళ భాష , ఆంగ్లం భాష |
• అదనం | ఫ్రెంచి భాష |
Time zone | UTC+5:30 |
పిన్‌కోడ్ | 609 602 |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | 91 (0)4368 |
Vehicle registration | PY-02 |
భారతదేశ కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఉన్న 4 జిల్లాలలో కరైకల్ జిల్లా ఒకటి. కరైకల్ పట్టణం నాగపట్టణానికి 16 కి.మీ . ఉత్తరంగానూ తరంగంబాడికి 12కి.మీ. దక్షిణంగానూ ఉంది. తరంగంబాడి రీజనల్ ప్రధానకార్యాలయంగా ఉంది. కారైకల్ రీజనల్ విభాగంలో కారైక్కాల్, కొత్తుంజెర్రి, నెడుంగాడు, తిరునల్లూరు, నెర్వి, తిరుమలరాజంపట్టిణం భాగంగా ఉన్నాయి.
పేరువెనుక చరిత్ర
[మార్చు]కరైకల్ అనే పదానికి పలు వివరణలు లభిస్తున్నాయి. ఇంపీరియల్ గజిటీర్ దీనికి " ఫిష్‌పాస్" అనే అర్ధం ఇచ్చాడు. " జూలియన్ వింసన్ " వ్రాతల ఆధారంగా ఈ పట్టణం ఒకప్పుడు సంస్కృత భాషలో ఈ పట్టణం కరైగిరి అని పిలువబడింది అని పేర్కొన్నాడు. కారై క్కాల్ అనేది రెండు పదముల కలయిక అన్నదానిలో సందేహం లేదు. కరై, కల్ అనేదానికి విడివిడిగా పలు అర్ధాలు ఉన్నాయి. వాటిలో అంగీకరించతగిన వాటిలో ఒకటి " లైంమిక్స్ ", " కాలువ ". అంటే లైంమిక్స్ ఉపయోగించి కాలువ నిర్మించబడిందని అర్ధం.[2]
చరిత్ర
[మార్చు]ఆరంభకాల చరిత్ర
[మార్చు]కరైకల్ 8వ శతాబ్దంలో (సా.శ. 731-796) లో పల్లవ సామ్రాజ్యంలో భాగంగా మారింది. సేక్కిళార్ కవి (సా.శ731-796) ఈ ఊరిని " వంగ మాలిక్ కాదర్ కారైక్కాల్ " అని పేర్కొన్నాడు. పెరియ పురాణంలో కారైక్కల్ సముద్రతీరం వద్ద పలు పాత్రలు ఉన్నాయని వర్ణించబడింది.
పునితవతియార్ జీవితచరిత్రతో సంబంధిత కథలో పునితవతియార్ ప్రంపంచ సుఖాలను త్యజించి తనజీవితాన్ని శివారాధనలో గడిపిందని వర్ణించాడు. సెక్కిళార్ పునితవతిని " కారైక్కల్ అమ్మయార్ " అని పేర్కొన్నాడు. తరువాత ఈ పట్టణానికి కూడా గుర్తింపు వచ్చింది.
మధ్య యుగచరిత్ర
[మార్చు]1738లో భారతదేశంలో ఫ్రెంచ్ భూభాగ విస్తరణలో భాగంగా కారైక్కాల్ చేపట్టడానికి తంజావూరు సాహూజితో మంతనాలు జరిపాడు. 40,000 చక్రాలకు కరకాలచ్చేరి కోట, 5 గ్రామాలు విక్రయించేలా మంతనాలు కొనసాగాయి. 1739 ఫిబ్రవరి 14న 50,000 చక్రాలకు కరకాలచ్చేరి కోట, 8 గ్రామాలను ఫ్రెంచ్ ప్రభుత్వం వశపరచుకుంది. అలాగే ఆయన వడ్డి లేకుండా 3 సంవత్సరాల తరువాత చెల్లించడానికి 1,50,000 చక్రాలనూ, 5 గ్రామాలకు 4,000 పగోడాలు వార్షిక బాడుగను ఇవ్వాలని షరతు పెట్టాడు. 1,00,000 ఋణం, 2-3 వేల బాడుగ నిర్ణయించబడింది. కలైయూరు, మెలైయూరు, పుదుతురై, తిరుమలైరాయన్‌పట్టణం చేపట్టపడ్డాయి. చివరికి 2 గ్రామాలను ఫ్రెంచ్ వదులుకుంది. తరువాత పాలనకు వచ్చిన ప్రతాప సింగ్ ఒప్పందాన్ని కొనసాగిస్తూ 1,00,000 చక్రాలు మొదటి విడతగా 4,000 చక్రాలను అందుకున్నాడు. అలాగే ఆయన అదనంగా 8 గ్రామాలు స్వాధీనపరిచేలా ఒప్పందం చేసుకున్నాడు. కడలూర్ (కొండగై), వంజియూరు, అరిముల్లిమంగళం, నిరవి, ధర్మపురం, ఉళియపట్టు, మట్టకుడి (మతలాంగుడి), పొలగం గ్రామాలు ఫ్రెంచి ప్రభుత్వవశం అయ్యాయి. 1740 ఫిబ్రవరి 12న ఈ గ్రామాలు 60,000 చక్రాలకు విక్రయించబడ్డాయి. ముందటి సంవత్సరం ఆ గ్రామాలు 40,000 చక్రాలకు విక్రయించబడ్డాయి. అదే సంవత్సరం తిరునల్లారు మహాణం 55,350 చక్రాలకు అలాగే 33 గ్రామాలను 60,000 చక్రాలకు తాకట్టు పెట్టబడ్డాయి. 1750 జనవరి 12న జరిగిన ఒప్పందంలో ప్రతాపసింగ్ కారైక్కాల్ సమీపంలోని 81 గ్రామాలను ఫ్రెంచ్ పరం చేయడమేకాక 2,000 బాడుగను రద్దుచేయబడింది. తరువాత ఫ్రెంచ్ ప్రభుత్వం తంజావూరు ప్రాంతంలో అధికభాగాన్ని వశపరచుకుంది. తరువాత 1761లో ఫ్రెంచ్ ప్రభుత్వం దీనిని బ్రిటిష్ ప్రభుత్వానికి ఆధీనం చేసారు.రెండు మార్లు బ్రిటిష్ పరం చేయబడిన ఈ ప్రాంతం 1817 -1817లో " ట్రీటీ ఆఫ్ పారిస్ " ఒప్పందం (1814) తరువాత ఈ ప్రాంతం తిరిగి ఫ్రెంచ్ వశం అయింది.
ఆధునిక చరిత్ర
[మార్చు]1947 జాతీయ కాంగ్రెస్ రూపుదిద్దుకున్న తరువాత 1947 జనవరి 31న ఫ్రెంచ్ వారికి నుండి స్వాతంత్ర్యం కావాలని శక్తివంతమైన ప్రకటన చేయబడింది. 1954 అక్టోబరు 31 వరకు ఈ ప్రాంతం ఫ్రెంచ్ పాలనలో ఉంది. తరువాత ఫ్రెంచ్ ఝండా దించి భారతీయ త్రివర్ణ పతాకం సైనిక మర్యాదల నడుమ ఎగురవేయబడింది. 1954 నవంబరు 1 పాలనా అధికారాలు చేతులు మారాయి. 1962 ఆగస్టు 16 న న్యాయవ్యవస్థ కూడా భారతప్రభుత్వం ఆడీనమైంది.
భౌగోళికం
[మార్చు]కరైకల్ జిల్లా వైశాల్యం 160 చదరపు కిలోమీటర్లు.[3]
ప్రాంతం
[మార్చు]కారైక్కాల్ ఫ్రెంచ్ ఇండియాలో ఉన్న సముద్రతీర భూభాగం. మిగిలిన ఫ్రెంచ్ భూభాగాలైన పాండిచేరి, యానాం, మాహె లతో కారైక్కాల్ కూడా భారతీయ కేంద్రపాలిత ప్రాంతాలలో ఒకటి అయింది. కారైక్కాల్ ఉత్తర సరిహద్దులో నాగపట్టణం జిల్లా, పడమర సరిహద్దులో తంజావూరు జిల్లా, తూర్పు సరిహద్దులో బంగాళాఖాతం ఉన్నాయి.
2004 టీసునామీ
[మార్చు]2004 డిసెంబరు 26న సంభవించిన 2004 సునామీ కరైకల్ ను ఘోరంగా దెబ్బతీసింది. మరణాంతకమైన టీసునామీ అలలు సముద్రతీరాన్ని ఢీకొని 500 కంటే అధికంగా ప్రాణాలను బలితీసుకున్నాయి. వీరిలో అత్యధికం మత్యకారులు వారి కుటుంబ సభ్యులు కావడం విచారకరం.
నదులు
[మార్చు]కావేరీ నది ప్రధానశాఖ కొడమురుట్టి, అరసలార్, వీరచోళనార్, విక్రమనార్ మార్గంలో ప్రవహిస్తూ ఉంది. అరసలార్ నది దాని శాఖలు కారైక్కాల్ అంతా వ్యాపించి ఉన్నాయి. కొడమురుట్టి, వీరచోళనార్ ప్రాంతాలకు వ్యవసాయానికి అనువుగా జలాలు లభ్యం ఔతున్నాయి.
భౌగోళిక వర్ణన
[మార్చు]కావేరీ నదీ మైదానంలో భాగం అయినందున ఈ ప్రాంతం అంతటా కవేరీనదీ జలాలు అందుతున్నాయి. నదీ మైదానం కనుక భూమి సారవంతంగా ఉంటుంది. భూభాగం సముద్రంవైపు స్వల్పంగా దిగువగా ఏటవాలుగా ఉంటుంది. కడలూరు, నాగపట్టణం సముద్రతీరాలలో ఉన్న శిలలు కారైక్కాల్ సముద్రతీరంలో కూడా ఉంటాయి.
గణాంకాలు
[మార్చు]2001 లో గణాంకాలు
[మార్చు]జిల్లాలో తమిళం ప్రధాంభాషగా ఉంది. ప్రజలలో అత్యధికసంఖ్యలో తమిళులు ఉన్నారు. శ్రీలంక తమిళులు కూడా చెప్పదగినంత మంది ఉన్నారు. జిల్లాలో హిందువులు 75.41%, క్రైస్తవులు 10.70%, ముస్లిములు 6.46%, ఇతరులు 0.12% ఉన్నారు. .[4]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య .. | 200,314 |
640 భారతదేశ జిల్లాలలో | 589 |
1చ.కి.మీ జనసాంద్రత | 1252 |
2001-11 కుటుంబనియంత్రణ శాతం | 17.29% |
స్త్రీ పురుష నిష్పత్తి | 1048:1000 |
జాతియ సరాసరి (928) కంటే | స్త్రీల సంఖ్య అధికం |
అక్షరాస్యత శాతం | 87.83%. |
జాతియ సరాసరి (72%) కంటే | అధికం |
వాతావరణం
[మార్చు]కారైక్కాల్ నగరం భారతీయ తూర్పు సముద్రతీరంలో ఉంది. అలాగే కావేరీ నదీమైదానంలో ఉంది. కారైక్కాల్ జిల్లాలో ఉష్ణమండల సముద్రతీర వాతావరణం నెలకొని ఉంటుంది. సాధారణంగా రోజూ వర్షం పడుతూ ఉంటుంది. కారైక్కాల్ సరాసరి వర్షపాతం 126మి.మీ ఉంటుంది. అక్టోబరు, డిసెంబరు వరకు 68% వర్షపాతం ఉంటుంది. నైరుతీ ఋతుపవనాల కాలంలో వర్షపాతం స్వల్పంగా 20% మాత్రమే ఉంటుంది. నవనర్ మాసంలో అత్యధిక వర్షపాతం ఉంటుంది. ఈ మాసంలో దాదాపు వార్షిక వర్షపాతంలో మూడవవంతు వర్షం కురుస్తుంది.సావత్సరిక వర్షాపాతంలో అత్యధికంగా తేడాలు ఉంటాయి.డిసెంబరు, జనవరి మాసాలలో అధికంగా చలి ఉంటుంది. శీతాకాలంలో చలి 28 - 23 సెల్షియస్ ఉంటుంది. కొన్ని మార్లు 16 సెల్షియస్ ఉష్ణోగ్రత కూడా నమోదౌతుంది.
వృక్షజాలం
[మార్చు]కారైక్కాల్‌లో సముద్రతీరంలో సాధారణంగా ఉండే నీటిలో ఉప్పు, మట్టిని తట్టుకుని నిలవగలిగే 5 జాయుల వృక్షాలు ఉన్నాయి. అవి వరుసగా అగల్లోచ (టాం. టిలై), క్లెరోడెండ్రం ఇనర్ం గీర్త్ (టాం సంగన్‌కుప్పి), అకాంతస్ ఇలిసిఫోలియస్ (టాం కలుడై ముల్లి), సోలనం ట్రిలోబాటం (టాం. టుద్యులై), పాండనస్ ట్ర్కోరస్ (టాం. టలై). ఈ ప్రాంతంలో తాటి, బబుల్ ట్రీ, సముద్దిరప్పలై, పొంగం ఆయిల్ చెట్టు, అడవి ఖర్జూరం ఉన్నాయి.
పర్యాటకం
[మార్చు]కారైక్కాల్ ప్రశాంతమైన సముద్రతీరాలు నగరానికి ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. తమిళనాడులో ఉన్న ప్రఖ్యాత పర్యాటక ఆకర్షిత ప్రదాశేలు కారైక్కాలుకు సమీపంలో ఉన్నాయి.
- కారైక్కాల్‌కు 5కి.మీ దూరంలో తిరునల్లారులో శ్రీ శనీశ్వరభగవాన్ ఆలయం ఉంది.
- కారైక్కాల్ కోట.
- కారైక్కాల్ సముద్రతీరం.
- కారైక్కాల్ అమ్మయ్యర్ ఆలయం.
- 1891 నిర్మించబడిన " ది చర్చ్ ఆఫ్ అవర్ లేడీ ఏంజిల్స్ ".
- టి.ఆర్ పట్ట్ణంలో ఉన్న ఆయిరం కాళియమ్మన్ ఆలయం.
- అంబాగరత్తూరులో ఉన్న భద్రకాళియమ్మన్ ఆలయం.
కారైక్కాల్ సమీపంలో ఉన్న కొన్ని ప్రదేశాలు
[మార్చు]- తిరుకడైయూర్ వద్ద ఉన్న ప్రఖ్యాత అభిరామి అమ్మన్ ఆలయం. (కారైక్కాల్ నుండి 16కి.మీ)
- కారైక్కాల్‌కు 24 కి.మీ దూరంలో సిక్కల్ వద్ద ఉన్న సింగరవేలార్ ఆలయం.
- కారైక్కాల్‌కు 26కి.మీ దూరంలో వేలాంగణ్ణిలో ఉన్న క్రిస్తవ యాత్రాస్థలాలో ఒకటైన " బాసిల్లికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ " చర్చి ఉంది.
- కారైక్కాల్‌కు 10 కి.మీ దూరంలో నాగూరు వద్ద ఉన్న ముస్లిం యాత్రాస్థలమైన " నాగూరు ఆణ్డవర్ " ఆలయం ఉంది.
- కారైక్కాల్‌కు 12కి.మీ దూరంలో ఉన్న డానిష్ కోట.
- ప్రపంచంలో మొట్టమొదటి అచ్చుయంత్రం మొదలైన ట్రాంక్యుబార్ కారైక్కాల్‌కు 10 కి.మీ దూరంలో ఉంది.దీనిని 1710లో " బార్తోలోమ్యూ జిజెంబ్లాగ్ " స్థాపించాడు.
- కారైక్కాల్‌కు ఉత్తరంగా 10కి.మీ దూరంలో తరంగంబాడి వద్ద " డచ్ కాలనీ ఆఫ్ త్రాంక్యుబార్ " ఉంది.
ఉత్సవాలు
[మార్చు]శనిపెయర్చి ఉత్సవం
[మార్చు]శనీశ్వరుడికి ఉన్న ప్రముఖ ఆలయాలలో తిరునాల్లరు శనీశ్వరాలయం ఒకటి. ఈతి బాధలు అనుభవిస్తున్న ప్రజలు తమ బాధల నివణార్ధం శనీశ్వరుడుని ప్రార్థిస్తుంటారు. శని పెయర్చి ( శని రాశి మారాడం) ఉత్సవం ఇక్కడ ప్రసిద్ధం. ఈ ఉత్సవం చూడడానికి లక్షలాది భక్తులు వస్తుంటారు.
మాంగని ఉత్సవం
[మార్చు]కరైకల్ పురాలక సరిహద్దులో ఉన్న కరైకల్ అమ్మన్ ఆలయంలో నిర్విహించే మాంగని ఉత్సవాలకు వేలాది భక్తులు వస్తుంటారు.
మాసి మాగం
[మార్చు]తమిళ మాసి మాసం (ఫిబ్రవరి-మార్చి) మాసాలలో ఈ ఉత్సవం నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవంలో కారిక్కాల్, పరిసర ప్రాంతాలలో ఉన్న దేవతామూర్తులను ఊరేగింపుగా సముద్రతీరానికి తీసుకువస్తారు. ఈ ఉత్సవాలకు వేలాది భక్తులు వస్తారు. ఈ ఉత్సవంలోభక్తులు సముద్రంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. సముద్రస్నానాలు పాపాలను హరిస్తాయని భావిస్తున్నారు. తిరుకన్నపురం గ్రామంలోని సౌరిరాజపెరుమాళ్ ఈ ఉత్సవంలో ప్రధాన దేవతగా ఉంటాడు. సౌరిరాజపెరుమాళ్ జాలరి కన్యను వివాహమాడాడని తరువాత తిరుమరాయనిపట్టణం చేరుకుని అక్కడే వెసిడాని విశ్వసించబడుతుంది. ఈ ఉత్సవం ఆరంభంలో మత్స్యకారులు దేవతా విగ్రహాన్ని తీసుకువెళ్ళి ఉత్సవం జరిగిన తరువాత ఆలయానికి అప్పగిస్తారు.
నిప్పుల తిరినాళ
[మార్చు]కారైకాల్ ప్రాంతంలో ఉన్న ఆలయాలలో సంవత్సరానికి 3-4 మార్లు నిర్వహించే నిప్పిల తిరునాళలో భక్తులు వారి మొక్కుబడులు తీర్చుకోవడానికి వందలాది భక్తులు నిప్పుల మీద నడుస్తుంటారు.
కందూరి ఉత్సవం
[మార్చు]ఆధ్యాత్మిక గురువునూ వెతుక్కుంటూ భారతదేశంలో ప్రవేశించి కారైక్కాల్ చేరుకున్న " సయ్యద్ దావూదు " తన ఆధ్యాత్మిక గురువైన " హలరెత్ సయ్యద్ అహమ్మద్ ఖల్ఖేల్ దివాన్ ఒలియుల్లా "ను కలుసుకుని శేషజీవితాన్ని కారైకాల్‌లో గడిపాడు. సయ్యద్ దావూదు గౌరవార్ధం ప్రతిసనత్సరం కారైక్కాల్‌లో కందూరి ఉత్సవం నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవంలో సంగీతం, నృత్యం ప్రధానపాత్ర వహిస్తాయి.
ప్రయాణసౌకర్యాలు
[మార్చు]వాయు మార్గం
[మార్చు]కరైకల్ సమీపంలో తిరుచిరాపల్లి విమానాశ్రయం ఉంది. ఇక్కడి నుండి షార్జా, చెన్నై, కువైట్, కొలంబొ నగరాలకు విమానాసేవలు లభిస్తున్నాయి." శ్రీలంకన్ ఎయిర్లైంస్ " కొలంబొ, జాఫ్నామరియు తిరుచిరాపల్లి లను అనుసంధానిస్తూ విమానసేవలను అందించడానికి ప్రయత్నిస్తుంది. నిర్మాణదశలో ఉన్న కారైక్కాల్ విమానాశ్రయం 2014 నాటికి పూర్యికాగలదని భావిస్తున్నారు. భారతదేశంలో ప్రైవేట్ యాజమాన్యంలో నిర్మించబడుతున్న మొదటి విమానాశ్రయం ఇదే. [5]
రైలు మార్గం
[మార్చు]కరైకల్ రైల్వేస్టేషను,[6] కరైకల్ 15 కి.మీ దూరంలో ఉన్న నాగూరు రైల్వే స్టేషను కూడా రైల్వే సేవలను అందిస్తుంది.
రహదారి మార్గం
[మార్చు]కారైక్కాల్ నగరంలో పబ్లిక్ ట్రాంస్‌పోర్ట్ పలు బసులను నడుపుతూ ప్రజలకు రవాణా సదుపాయం కలిగిస్తుంది. ఈ బసులు తిరునల్లారు, నాగూరు, నాగపట్టణం, వేలాంగణ్ణి,మైలాడుదురై, తిరువారూరు వంటి పర్యాటక ప్రదేశాలకు కూడా బసుసౌకర్యాలను అందిస్తుంది. పలు బసులు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో నమోదుచేయబడినవి, తమిళనాడు ప్రభుత్వబసులు కూడా ప్రయాణ వసతులు కల్పిస్తున్నాయి. తమిళనాడు ప్రభుత్వం నడుపుతున్న నాగపట్టణం, చెన్నై బస్సులు పుదుచ్చేరి మార్గంలో పయనిస్తాయి. పాండిచ్చేరి టూరిజం డెవలప్మెంటు కూడా పాండిచ్చేరి, కరైకల్ మార్గంలో సుదూర గమ్యాలకు బసుసేవలు అందిస్తున్నాయి.
జల మార్గం
[మార్చు]చెన్నైకు చెందిన " ఎం.ఎ.ఆర్.జి " లిమిటెడ్ సంస్థ " కరైకల్ పోర్ట్ ప్రైఏట్ లిమిటెడ్ "ను స్థాపించింది. ఇది 2009 నుండి పనిచేయడం ఆరంభించుంది. ఈ నౌకాశ్రయం భారతదేశ తూర్పుసముద్రతీరంలో కరైకల్ జిల్లాలోని " కీళవంజోర్ " గ్రామం వద్ద నిర్మించబడింది. ఈ నౌకాశ్రయం చెన్నై నౌకాశ్రయానికి దక్షిణంగా 300 కి.మీ దూరంలో ఉంది. అలాగే టుటికార్న్ నౌకాశ్రయానికి ఉత్తరంగా 360 కి.మీ దూరంలో ఉంది. 10o 50’56’’, 10o 49’44’’ అక్షాంశ రేఖాంశాల మద్య ఉంది..[7] నదిలో నీటిమట్టం అధికంగా ఉన్నప్పుడు సరుకులు బోట్ల ద్వారా రవాణా చేయబడుతుంటాయి. సరుకు గోదాముల నుండి ఇలా సులువుగా తీసుకురాబడుతుంటాయి. అయినప్పటికీ అతి సమీపంలో నాగపట్టణం నౌకాశ్రయం ఉన్నందువలన కారైక్కాల్ నౌకాశ్రయానికి ప్రధాన్యత తక్కువని భావిస్తున్నారు.
లోపాలు
[మార్చు]సరిగా నిర్వహించని మురుగునీటి కాలువల కారణగా దోమల సమస్య అత్యధికంగా ఉంది. నగరమంతా రోడ్డు పక్కన చెత్తచెదారం పడవేస్తున్న కారణంగా పురపాలక వ్యవస్థ ఉనికి అనుమానాద్పదంగా ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Archived copy". Archived from the original on 2016-09-12. Retrieved 2016-09-03.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-05-27. Retrieved 2014-04-27.
- ↑ Srivastava, Dayawanti (2010). "States and Union Territories: Pondicherry: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1222. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-07-16. Retrieved 2014-04-27.
- ↑ "Coimbatore firm to build India's first private airport in Karaikal". Times of India. 13 March 2012. Archived from the original on 10 మే 2013. Retrieved 3 July 2012.
- ↑ "Nagore-Karaikal BG line inspection by September". The Hindu. Chennai, India. 8 July 2011.
- ↑ http://www.karaikalport.com/