పి.ఎన్.రామచంద్రరావు
పి.ఎన్.రామచంద్రరావు | |
---|---|
జననం | 18 ఆగష్టు 1955 చదలవాడ, తెనాలి తాలూకా, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
వృత్తి | సినిమా దర్శకుడు, నిర్మాత, సినిమా రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 1980 - ప్రస్తుతం |
పి.ఎన్.రామచంద్రరావు ఒక భారతీయ చలనచిత్ర దర్శకుడు, నిర్మాత, సినీరచయిత. ఇతడు తెలుగు, తమిళ, కన్నడ చలనచిత్ర రంగాలలో పనిచేశాడు. [1][2][3]
ఇతడు చదలవాడ గ్రామంలో జన్మించినప్పటికీ ఇతని బాల్యమంతా నెల్లూరు జిల్లా పార్లపల్లెలో గడిచింది. 1973లో మద్రాసులోని సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు నడుపుతన్న ఫిల్మ్ ఇన్స్‌టిట్యూట్‌లో నటనలో శిక్షణ కొరకు ఒక ప్రకటన వెలువడింది. 18 యేళ్ళ రామచంద్రరావు ఆ కోర్సులో చేరడానికి మద్రాసు వెళ్ళాడు. అయితే ఆ కోర్సులో చేరడానికి కనీస వయసు 21 సంవత్సరాలు కాబట్టి అతడికి ఆ కోర్సులో ప్రవేశం లభించలేదు. ఒంటరిగా ఏడుస్తున్న రామచంద్రరావును చూసి సీనియర్ నిర్మాత డూండీ ఇతడిని పలకరించి విషయం తెలుసుకుని నెల్లూరుకు చెందిన దర్శకుడు పి.చంద్రశేఖరరెడ్డిని కలవమని సలహా ఇచ్చాడు. డూండీ సలహా ప్రకారం ఇతడు పి.చంద్రశేఖరరెడ్డిని కలుసుకుని అతని వద్ద కొత్త కాపురం చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాడు.
వృత్తి
[మార్చు]పి.ఎన్.రామచంద్రరావు గిరిబాబు నిర్మించిన సంధ్యారాగం చిత్రానికి తొలిసారిగా దర్శకత్వం వహించాడు. 1983లో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మెరుపు దాడి సినిమా గొప్ప విజయాన్ని సాధించింది. 1987లో ఇతడు తన స్నేహితులను భాగస్వాములుగా చేసుకుని నిర్మాతగా మారి గాంధీనగర్ రెండవ వీధి సినిమాని స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. ఇదే కాకుండా చిత్రం భళారే విచిత్రం వంటి విజయవంతమైన 12 సినిమాలను ఇప్పటివరకూ నిర్మించాడు. [4]
సినిమాల జాబితా
[మార్చు]ఇతడు దర్శకత్వం వహించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:
విడుదల సంవత్సరం | సినిమా పేరు | నటీనటులు | విశేషాలు |
---|---|---|---|
1981 | సంధ్యారాగం | గిరిబాబు, శరత్ బాబు, ప్రభ | మొదటి సినిమా |
1984 | మెరుపు దాడి | భానుచందర్, సుమలత, గిరిబాబు | |
1985 | యముడు | భానుచందర్, అశ్వని | అశ్వని మొదటి సినిమా |
1985 | వస్తాద్ | భానుచందర్, తులసి | నిర్మాతగా శ్యామ్ ప్రసాద్ రెడ్డి మొదటి సినిమా |
1986 | కోటిగాడు | అర్జున్, శరత్ బాబు, రాధిక | |
1986 | ప్రైవేట్ మాస్టర్ | ||
1986 | భయం భయం | ||
1987 | గాంధీనగర్ రెండవ వీధి | రాజేంద్ర ప్రసాద్, చంద్ర మోహన్, గౌతమి | * గౌతమి మొదటి తెలుగు సినిమా. * సంగీత దర్శకుడిగా జి.ఆనంద్ మొదటి సినిమా. |
1988 | ఆగష్టు 15 రాత్రి | అర్జున్, గౌతమి, శరత్ బాబు | |
1988 | డాక్టర్ గారి అబ్బాయి | అర్జున్, ఆశారాణి, శివకృష్ణ | |
1989 | శక్తి | ||
1989 | సాక్షి | రఘువరన్, జయసుధ, నిర్మల | లిజి నటించిన తొలి తెలుగు సినిమా |
1990 | మాస్టారి కాపురం | రాజేంద్రప్రసాద్, గాయత్రి | ఈ సినిమాకి ఉత్తమ సహాయనటి, ఉత్తమ సంభాషణల రచయిత విభాగాలలో రెండు నంది పురస్కారాలు లభించాయి |
1991 | ఇంట్లో పిల్లి వీధిలో పులి | చంద్రమోహన్, సురేష్, యమున | |
1991 | చిత్రం భళారే విచిత్రం | నరేష్, శుభలేఖ సుధాకర్, రాజీవి | ఈ సినిమాద్వారా నటిగా రాజీవి పరిచయమయింది. ఉత్తమ మేకప్ విభాగంలో నంది పురస్కారం లభించింది. |
1992 | పెళ్ళినీకు శుభం నాకు | నరేష్, దివ్యవాణి | |
1993 | అత్తకు కొడుకు మామకు అల్లుడు | వినోద్ కుమార్, రోజా, దివ్యవాణి | |
1993 | అసలే పెళ్ళైనవాణ్ణి | నరేష్, సౌందర్య | |
1993 | మనవరాలి పెళ్ళి | హరీష్, సౌందర్య | |
1994 | తెగింపు | భానుచందర్ | బి.జె.పికి చెందిన రాజకీయనాయకుడు ఎ.నరేంద్ర ఈ సినిమాలో విలన్‌గా నటించాడు. మరో రాజకీయ నాయకుడు ద్రోణంరాజు సత్యనారాయణ ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తాడు. |
1995 | లీడర్ | కృష్ణంరాజు, సుమన్, ప్రియ రామన్ | |
1996 | సహనం | ఆనంద్, ఊహ, ప్రకాష్ రాజ్ | శ్రీలక్ష్మికి ఉత్తమ హాస్యనటిగా నందిపురస్కారం దక్కింది. |
1998 | శుభవార్త | అర్జున్, సౌందర్య | |
1999 | మహిళ | ద్విభాషాచిత్రం (తెలుగు,కన్నడ) | |
2003 | గోల్‌మాల్ | జె.డి.చక్రవర్తి, నేహా పెండ్సే బయాస్, మీరా వాసుదేవన్ | మీరా వాసుదేవన్ తొలి సినిమా |
- టెలివిజన్ సీరియళ్ళు
- "భక్త మార్కాండేయ" (2000) (ఈటీవిలో ప్రసారం)
మూలాలు
[మార్చు]- ↑ "Ramachandra Rao P.N."
- ↑ YouTube. YouTube.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-07-05. Retrieved 2022-11-16.
- ↑ "Rediff on the NeT, Movies: Gossip from the southern film industry".