Jump to content

బ్రహ్మాజీ

వికీపీడియా నుండి
బ్రహ్మాజీ
జననం
సత్య వెంకట సుబ్రహ్మణ్య బ్రహ్మాజీరావు

(1965-08-09) 1965 ఆగస్టు 9 (వయసు 59)
వృత్తినటుడు
జీవిత భాగస్వామిశాశ్వతి

బ్రహ్మాజీ ఒక పేరొందిన తెలుగు నటుడు. విభిన్న పాత్రలను పోషిస్తూ తనదైన ప్రత్యోక నటశైలిని ఏర్పరుచుకున్నాడు. సింధూరంతో హీరోగా పరిచయమైన బ్రహ్మాజీ ఆ చిత్రానికి ముందు నిన్నే పెళ్ళాడుతా చిత్రంలో, ఆ తర్వాత ఖడ్గం, అతడు, ఏక్‌నిరంజన్‌, మిరపకాయ్, మర్యాద రామన్న వంటి పలు చిత్రాలలో విభిన్నమైన పాత్రలు పోషించి విలక్షణ నటుడుగా పేరు పొందాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

బ్రహ్మాజీ స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట. తండ్రి రెవెన్యూ శాఖలో తాసీల్దారుగా పనిచేసేవాడు. తల్లి ది అమలాపురం సమీపంలోని అద్దంకివారి లంక. తండ్రి ఉద్యోగరీత్యా హైదరాబాదులో ఉన్నప్పుడు బ్రహ్మాజీ హైదరాబాదులో జన్మించాడు. కానీ విద్యాభ్యాసమంతా పశ్చిమ గోదావరి జిల్లాలో సాగింది. ఈయనకు నలుగురు అక్కలు, ఒక అన్న. ఈయన తాత బ్రహ్మం గారి పేరు మీదుగా శివాజీ, బాలాజీ తరహాలో ఈయనకు బ్రహ్మాజీ అని పేరు పెట్టారు. చదువుకునే రోజుల్లో ఘట్టమనేని కృష్ణ అభిమానిగా ఆయన సినిమాలన్నీ నాలుగైదు సార్లు చూసేవాడు. శంకరాభరణం సినిమాలో నటించిన సోమయాజులుకు రెవెన్యూ శాఖ ఉద్యోగులు చేసిన సన్మానం చూసి తనూ సినీనటుడు కావాలనే స్ఫూర్తిని పొందాడు.

బ్రహ్మాజీ ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆయన భార్య పేరు శాశ్వతి. వీరి పెళ్ళి ఆర్య సమాజ్ లో జరిగింది. శాశ్వతికి అంతకు ముందే వివాహం జరిగి విడాకులు తీసుకుని ఉండటంతో పెద్దల నుంచి వ్యతిరేకత ఉంటుందని తొలుత ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు. చంద్రలేఖ సినిమా చిత్రీకరణ సమయంలో దర్శకుడు కృష్ణవంశీ, నటి రమ్యకృష్ణలే దగ్గరుండి వివాహం జరిపించారు.[1]

సినీరంగ ప్రవేశం

[మార్చు]

మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో రెండేళ్ళ కోర్సు అయిపోయిన తర్వాత మద్రాసులో అడయారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరటానికి ఎం.ఎ చదివే వంకతో మద్రాసు చేరుకున్నాడు.[2] ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొంది వేషాల కోసం తిరుగుతున్న సమయంలో కృష్ణవంశీతో పరిచయమైంది. ఇద్దరూ రూమ్మేట్లుగా ఉన్నారు. ఆ తరువాత కృష్ణవంశీ దర్శకుడైనప్పుడు బ్రహ్మాజీకి తన సినిమాల్లో వేషాలిచ్చి ప్రోత్సహించాడు.[3] కృష్ణవంశీ నిన్నే పెళ్ళాడుతా విజయవంతమై మంచి దర్శకునిగా నిలదొక్కుకున్న తరుణంలో బ్రహ్మాజీని కథానాయకునిగా పెట్టి సింధూరం సినిమా తీశాడు.[4] ఈ సినిమాలో బ్రహ్మాజీ నటనతో విమర్శకుల ప్రశంసలందుకున్నాడు.

నటించిన చిత్రాలు

[మార్చు]

తెలుగు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Actor Brahmaji: కృష్ణవంశీ, రమ్యకృష్ణలే మా పెళ్లి చేశారు: బ్రహ్మాజీ". EENADU. Retrieved 2023-05-04.
  2. Interview With Brahmaji (Part 1) - Cinigoer.com
  3. Brahmaji - Nenu Na Prayanam - Tv9
  4. "ఆ దర్శకుడు నాలుగేళ్లు తిప్పించుకున్నాడు!". eenadu.net. హైదరాబాదు: ఈనాడు. Archived from the original on 25 జనవరి 2018. Retrieved 25 జనవరి 2018.
  5. సాక్షి, సినిమా (28 February 2020). "'హిట్‌' మూవీ రివ్యూ". Sakshi. సంతోష్‌ యాంసాని. Archived from the original on 28 February 2020. Retrieved 29 October 2020.
  6. "Babu Bangaram Review". 123telugu. 12 August 2016.
  7. "143 review". idlebrain. Retrieved 16 May 2019.
  8. తెలుగు ఫిల్మీబీట్. "143 (సినిమా)". telugu.filmibeat.com. Retrieved 16 May 2019.
  9. Bharat Movies, Movie Pages. "Aadadhi. Aadadhi Movie Cast & Crew". www.bharatmovies.com. Retrieved 11 August 2020.[permanent dead link]