వెల్దుర్తి మాణిక్యరావు

వికీపీడియా నుండి
(ఎల్దుర్తి మాణిక్యరావు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
వెల్దుర్తి మాణిక్యరావు

వ్యక్తిగత వివరాలు

జననం 1912
ఎల్దుర్తి
మరణం సెప్టెంబరు 28, 1994
సంతానం వెల్దుర్తి హర్షవర్ధన్‌

వెల్దుర్తి మాణిక్యరావు ( 1912 - సెప్టెంబరు 28, 1994) నిరంకుశ నిజాం వ్యతిరేక పోరాటయోధుడు, రాజకీయ నాయకుడు.[1]

జననం[మార్చు]

మెదక్ సమీపంలోని ఎల్దుర్తి గ్రామంలో 1912 జనవరిలో జన్మించాడు.[2] కళాశాల విద్య సమయంలో ఉద్యమాలపై ఆకర్షితుడైనాడు. ఇతను బహుభాషా పండితుడు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, కన్నడ, మరాఠి, పారశీక భాషలలో నిష్ణాతుడు. నిజాం ధోరణికి వ్యతిరేకిస్తూ ప్రజలను ఉత్తేజపర్చడానికి అనేక మార్గాలను అంవేషించి సఫలుడైనాడు. అణా గ్రంథమాలను నిర్వహించి సాహతోపేతమైన చర్యను నిర్వహించిన ప్రజ్ఞాశీలి మాణిక్యరావు. అనేక పుస్తకాల ద్వారా నిజాం పక్షపాత ధోరణిని ఎండగడ్డాడు. ఆనాటి రాజకీయ పరిస్థితులు, రైతుల సమస్యలను ప్రచురించాడు. ఈ చిన్న పుస్తకం నిజాం గుండెల్లో రైళ్ళు పరిగెత్తించింది.[3] సురవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వంలో వెలువడిన గోల్కొండ పత్రికలో సహాయ సంపాదకులుగా పనిచేశాడు. అందులో కూడా ప్రజాభిప్రాయాలను నిర్భయంగా ప్రకటించేవాడు. మర్రి చెన్నారెడ్డి సంపాదకత్వంలో వెలువడే హైదరాబాదు పత్రికలో కూడా ఇతను ఎన్నో వ్యాసాలు రచించాడు. అడవి బాపిరాజు సంపాదకత్వంలో వెలువడే మీజాన్ పత్రికలో గేయాలు రచించాడు. "హైదరాబాదు స్వాతంత్ర్యోద్యమ" చరిత్ర ఇతను రచించిన రచనలలో ప్రముఖమైనది.

మరణం[మార్చు]

విమోచనోద్యమం తర్వాత కూడా రచనా రంగంలో కృషిచేసి 82వ ఏట సెప్టెంబరు 28, 1994 నాడు మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. తెలుగు వన్ ఇండియా. "తెలంగాణ మట్టిలోని 'మాణిక్యం' వెల్దుర్తి". telugu.oneindia.com. కాసుల ప్రతాపరెడ్డి. Retrieved 26 February 2018.
  2. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగు యోధులు, పేజీ 234
  3. మెదకు జిల్లా స్వాతంత్ర్యోద్యమము, సమరయోధులు, రచన ముబార్కపురం వీరయ్య, ప్రచురణ 2007, పేజీ 66