గోస్తని నది
Appearance
(గోస్తనీనది నుండి దారిమార్పు చెందింది)
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో తూర్పు దిక్కుగా ప్రవహించే నదులలో ఒకటైన గోస్తని నది తూర్పు కనుమలలోని అనంతగిరి కొండలలో జన్మించి విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో ప్రవహిస్తుంది. చివరకు ఈ నది బంగాళాఖాతంలో చారిత్రాత్మక నగరమైన భీమునిపట్నం వద్ద కలుస్తుంది. బొర్రా గుహలు దీని జన్మస్థానంలో ప్రవాహం వలన సున్నపురాయి కోత మూలంగా భావిస్తున్నారు.
గోస్తని నదిపై నిర్మించిన ప్రాజెక్టులు
[మార్చు]తాటిపూడి రిజర్వాయర్ ప్రాజెక్టు గోస్తని నదిమీద 1963-68 మధ్యకాలంలో[1] నిర్మించారు. ఇది విజయనగరం జిల్లాలోని గంట్యాడ మండలంలో తాటిపూడి గ్రామంలో ఉంది. విజయనగరం జిల్లాలో 15, 378 ఎకరాల ఆయకట్టు భూములను నీరందించడం, విశాఖపట్నం నగరానికి త్రాగునీరు అందించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఈ రిజర్వాయర్ 3 శతకోటి ఘనపు అడుగుల (TMC) నీటిని నిలువచేస్తుంది.
మూలాలు
[మార్చు]- ↑ "Irrigation profile of Vizianagaram district.Thatipudi Reservoir Project". Archived from the original on 2007-09-28. Retrieved 2008-08-08.
వికీమీడియా కామన్స్‌లో Gosthani Riverకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.