Jump to content

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి

వికీపీడియా నుండి
(జగన్మోహన్ రెడ్డి నుండి దారిమార్పు చెందింది)
వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి .

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 మే 30-2024 జూన్ 4

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019 మే 30
గవర్నరు ఎస్. అబ్దుల్ నజీర్
ముందు చంద్రబాబు నాయుడు
నియోజకవర్గం పులివెందుల

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతిపక్షనాయకుడు
పదవీ కాలం
26 మే 2014 – 2019 మే 29
ముందు చంద్రబాబు నాయుడు
తరువాత చంద్రబాబు నాయుడు

శాసనసభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
26 మే 2014
ముందు వై. ఎస్. విజయమ్మ
నియోజకవర్గం పులివెందుల

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
26 మే 2009 – 26 మే 2014
ముందు వై.ఎస్.వివేకానందరెడ్డి
తరువాత వై.యస్.అవినాష్‌రెడ్డి
నియోజకవర్గం కడప లోక్‌సభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1972-12-21) 1972 డిసెంబరు 21 (వయసు 51)
జమ్మలమడుగు గ్రామం, వైఎస్ఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్
రాజకీయ పార్టీ YSR కాంగ్రెస్
జీవిత భాగస్వామి భారతీ రెడ్డి
సంతానం ఇద్దరు కుమార్తెలు (హర్ష, వర్ష)
నివాసం విశాఖపట్నం, హైదరాబాదు, బెంగలూరు,

యేదుగురి సందింటి జగన్మోహనరెడ్డి (జ. 1972 డిసెంబరు 21), (వై.యస్.జగన్మోహనరెడ్డి లేదా జగన్ గా సుపరిచితుడు) వ్యాపారవేత్త, రాజకీయనాయకుడు, ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి. అతను భారతీయ రాజకీయ పార్టీ అయిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు. అతను ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖరరెడ్డి తనయుడు. జగన్మోహనరెడ్ది తన రాజకీయ ప్రస్థానాన్ని భారత జాతీయ కాంగ్రెస్లో ప్రారంభించి, 2009 మే నెలలో తొలిసారిగా కడప లోక్‌సభ నియోజకవర్గం నుండి భారతదేశ లోక్ సభ సభ్యునిగా గెలుపొందాడు.[1] తన తండ్రి 2009 లో జరిగిన హెలీకాప్టర్ ప్రమాదంలో మరణించిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఓదార్పు యాత్ర చేపట్టాడు.[2] తరువాత భారత జాతీయ కాంగ్రెసుతో విభేదాల కారణంగా పార్టీకి రాజీనామా చేసి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు[3]. 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో తన పార్టీ 67 స్థానాలను సాధించి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్నాడు[4]. తరువాత అతను రాష్ట్ర వ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువై 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో 175 స్థానాలలో 151 స్థానాలను కైవసం చేసుకుని ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాడు[5].

ప్రారంభ జీవితం

జగన్మోహనరెడ్డి ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా, జమ్మలమడుగులో వై.ఎస్.రాజశేఖరరెడ్డి, వై.ఎస్.విజయమ్మ దంపతులకు జన్మించాడు.[6][7] అతని సోదరి వై.ఎస్.షర్మిల కూడా రాజకీయ నాయకురాలు.[8] అతను బేగంపేట లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 12వ గ్రేడు వరకు విద్యనభ్యసించాడు.[7][7] టాలీవుడ్ నటుడు యార్లగడ్డ సుమంత్ కుమార్ అతనికి పాఠశాలలో ఆప్తమిత్రుడు.[9] అతను బ్యాచిలర్స్ ఆఫ్ కామర్స్ (బి.కాం) డిగ్రీని[6] హైదరాబాదులోని కోఠీ[10] వద్ద గల మహావిద్యాలయ డిగ్రీ అండ్ పి.జి. కళాశాల నుండి చేసాడు. అతను 1996 ఆగస్టు 28న భారతిని వివాహం చేసుకున్నాడు.[6][7] వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు లండన్ లో గ్రాడ్యుయేషన్ చేసారు[6][7].

వ్యాపార సంస్థలు

జగన్మోహనరెడ్డి మొదట సండూర్ పవర్ కంపెనీ లిమిటెడ్ (SPCL)ని 2001లో దాని ఒరిజినల్ ప్రమోటర్ ఎం.బి. ఘోర్‌పడే నుండి ఒక పనికిరాని పవర్ ప్రాజెక్ట్‌ని కొనుగోలు చేసాడు[11]. SPCL తర్వాత ఇతర కంపెనీలలో కోట్లాది రూపాయలను పెట్టుబడి పెట్టి, మరిన్ని వ్యాపారాలను పొందగలిగింది. దీనికి ఆయన సతీమణి వై.ఎస్. భారతి నేతృత్వం వహిస్తున్నది[12]. అతను SPCLలో తన వాటాలను విక్రయించి, రాజకీయాల్లో ఎక్కువగా పాల్గొనడంతో తన క్రియాశీల ప్రత్యక్ష వ్యాపారాలకు దూరంగా ఉన్నాడు. [ఆధారం చూపాలి]

రాజకీయ జీవితం

జగన్మోహనరెడ్డి తండ్రి "వై.యస్.ఆర్"గా సుపరిచితుడైన వై.ఎస్.రాజశేఖరరెడ్ది 2004 నుండి 2009 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జగన్మోహనరెడ్డి కడప జిల్లాలోని 2004 ఎన్నికల సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయడం ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు.[13] 2009 లో కడప లోక్ సభ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు.[13][14] 2009 సెప్టెంబరులో తన తండ్రి మరణించిన తరువాత, అతను తన తండ్రి వదిలిపెట్టిన రాజకీయ వారసత్వాన్ని చేపట్టడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. మెజారిటీ శాసనసభ్యులు ఆయనను ముఖ్యమంత్రిగా నియమించాలని మొగ్గు చూపారు. అయితే ఈ ఎంపికను పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఆమోదించలేదు.

తన తండ్రి మరణించిన ఆరు నెలల తర్వాత, అతను ముందుగా వాగ్దానం చేసినట్లుగా, తన తండ్రి మరణ వార్త విని ఆత్మహత్య చేసుకున్న లేదా అనారోగ్యంతో బాధపడుతున్న వారి కుటుంబాలను కలుసుకోవడానికి వెళ్లి ఓదార్పు యాత్ర ( సంతాప యాత్ర) ప్రారంభించాడు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం తన ఓదార్పు యాత్రను విరమించుకోవాలని ఆదేశించింది. ఆ ఉత్తర్వును ధిక్కరించిన అతను హైకమాండ్ తో విభేదించాడు. ఇది తన వ్యక్తిగత విషయమని పేర్కొంటూ ఆయన యాత్రను కొనసాగించాడు.[15]

2010–2014: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపన

తాను తలపెట్టిన ఓదార్పుయాత్రకు అనుమతి ఇవ్వని కారణంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తో విభాదాల కారణంగా 2010 నవంబరు 29న కడప లోక్ సభ నియోజకవర్గం నుండి లోక్ సభ సభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసాడు. ఆయన తల్లి విజయమ్మ కూడా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి రాజీనామా చేసి పార్టీకి కూడా రాజీనామా చేసింది.[16] 45 రోజుల్లోపు కొత్త పార్టీని ప్రారంభిస్తానని 2010 డిసెంబరు 7 న పులివెందుల నుంచి అతను ప్రకటించాడు[17]. 2011, మార్చి 11న అతను తూర్పు గోదావరి జిల్లా లోని జగ్గంపేటలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ) ని స్థాపించాడు.[18] ఆ తర్వాత అతని పార్టీ కడప జిల్లాలో ఉప ఎన్నికలకు వెళ్లి దాదాపు అన్ని స్థానాలను భారీ మెజారిటీతో గెలుచుకుంది.[19] వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికను ఎదుర్కొని 5,45,043 ఓట్ల ఆధిక్యతతో రెడ్డి గెలుపొందాడు[20]. ఆయన తల్లి కూడా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో అతని చిన్నాన్న వై.యస్. వివేకానంద రెడ్డి పై 85,193 ఓట్ల తేడాతో గెలుపొందింది.[21] అతని తల్లి వై.యస్.విజయమ్మ పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా వ్యవహరించింది.

అక్రమార్జన ఆరోపణలు

2012 మే 27, అక్రమాస్తుల ఆరోపణలపై జగన్మోహనరెడ్దిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అరెస్టు చేసింది. వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన తండ్రి కార్యాలయాన్ని ఉపయోగించుకుని అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై సిబిఐ రెడ్డికి సమన్లు జారీ చేసింది. మైనింగ్ లీజులు, ప్రాజెక్టుల కేటాయింపుల రూపంలో తమకు అనుమతులు లభించాయన్న ఆరోపణలపై రెడ్డి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన 58 కంపెనీలకు సీబీఐ, ఈడీ సమన్లు కూడా పంపాయి[22]. విచారణ కొనసాగుతుండగా అతని జ్యుడీషియల్ కస్టడీని పదే పదే పొడిగించారు.[23][24][25] భారత సుప్రీంకోర్టు 2012 జూలై 4,[26][27] 2012 2012 ఆగస్టు 9 నవంబరు 7[28], 2013 మే 9[29], 2013 మే13[30][31] న అతని బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.

జగన్మోహనరెడ్ది విచారణ వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ, రెడ్డి కుటుంబం ఆరోపిస్తోంది[32][33]. జైలులో ఉండగా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆమోదించాలన్న యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రెడ్డి నిరాహార దీక్ష ప్రారంభించాడు. 125 గంటల నిరవధిక నిరాహార దీక్ష తర్వాత, అతని చక్కెర స్థాయిలు, రక్తపోటు తగ్గాయి. చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.[34][35][36] తెలంగాణ ఏర్పాటును నిరసిస్తూ అతని తల్లి విజయమ్మ కూడా నిరాహారదీక్ష చేసింది.[37] అతను జైలు నుండి విడుదలైన తర్వాత 72 గంటల బంద్ నిరసనకు పిలుపునిచ్చాడు.[38] తెలంగాణ ఏర్పాటుకు అనుకూలమైన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రెడ్డి, ఆయన తల్లి ఇద్దరూ తమ శాసనసభలకు రాజీనామా చేశారు.[39]

16 నెలల పాటు జగన్ చంచల్ గూడ జైలులో ఉన్నాడు. 2013 సెప్టెంబరు 23 న నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

2014–2019: ప్రతిపక్ష నాయకుడు - పాదయాత్ర

2014లో, ఎన్నికల ప్రీ పోల్స్ సర్వేలలో విశ్లేషకులు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడానికి అనుకూలంగా ఉందని విశ్లేషించారు[40]. కానీ 2014 సార్వత్రిక ఎన్నికలలో తన రాజకీయ ప్రత్యర్థి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ చేతిలో అతిస్వల్ప ఓట్ల శాతంతో పరాజయం పొంది ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు. అతని పార్టీ రాష్ట్ర అసెంబ్లీలోని 175 సీట్లలో 45% ఓట్లతో[41] 67 స్థానాలను మాత్రమే గెలుచుకుంది.[40] తెలుగుదేశం పార్టీ ఓట్ల శాతం 47%కి చేరుకోగా, 2% గ్యాప్ వైఎస్సార్‌సీపీ ఓటమికి దారితీసింది.

అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అతను తన 3,000 కిలోమీటర్ల పాదయాత్రను ప్రజా సంకల్ప యాత్ర అనే పేరుతో ప్రారంభించాడు. దీనిని 2017 నవంబరు 6న కడప జిల్లాలోని ఇడుపులపాయలో ప్రారంభించాడు[42][43]. వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ 430 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 125 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 2019 జనవరి 9 న ముగిసిన పాదయాత్రకు "రావాలి జగన్, కావాలి జగన్" అనే నినాదాన్ని రూపొందించారు.

రాష్ట్ర విభజనకు సంబంధించిన విభజన హామీలను నెరవేర్చకపోవడం, ప్రత్యేకహోదాను ఇవ్వకపోవడం వంటి విషయాలలో తీవ్రంగా విభేదించి, 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంతో పోరాడి, ప్రజలలో ప్రత్యేకహోదాపై అవగాహన కల్పించాడు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ వారి బాధలను అతి దగ్గరగా తెలుసుకునేందుకు ప్రజాసంకల్పయాత్ర పేరుతో ఇడుపులపాయలో 2017 నవంబరు 16 న ప్రారంభించి 2019 జనవరి 19న శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో ముగించాడు. 14 నెలల పాటు రాష్ట్రంలోని 13 జిల్లాలోని 125 నియోజకవర్గాల్లో 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజలకు దగ్గర అయ్యాడు.

2018 అక్టోబరు 25న విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లోని వీఐపీ లాంజ్‌లో హైదరాబాద్‌కు విమానం ఎక్కుతున్నప్పుడు అతనిపై కోడి కత్తితో దాడి చేశారు. ఆయన భుజానికి గాయం కావడంతో శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది.[44]

ప్రత్యేకహోదా సాధించాలనే తపనతో, ప్రత్యేకహోదా సాధన పోరాటంలో భాగంగా మార్చి 18వ తారీఖున పార్లమెంటులో తన ఎంపీలతో ఎన్డీయే ప్రభుత్వంపై మొట్టమొదటి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టడమే కాకుండా, అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకపోవడంతో తన ఎంపీల చేత ఏప్రిల్ 6వ తేదీన రాజీనామా చేయించి వారిచేత ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద నిరాహార దీక్షను చేపట్టించి ప్రజల మనోగతం ప్రపంచానికి తెలిసేలా చేశాడు. తాను చేసే ప్రత్యేకహోదా పోరాటాన్ని మెచ్చి రాష్ట్రంలోని అన్ని విపక్ష పార్టీలు, ప్రత్యేకహోదా సాధన సమితి లాంటి అనేక ప్రజా సంఘాలు వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికాయి.

2019–ప్రస్తుతం: ముఖ్యమంత్రి

2019 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో 175 శాసన సభ స్థానాలకుగాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలు రికార్డు స్థాయిలో గెలిచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు.[45] 2019 సాధారణ ఎన్నికల్లో ఆయనే ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక మెజారిటీ (90000) సాధించిన శాసన సభ్యుడు. ఆ పార్టీ 25 లోక్‌సభ స్థానాలకు గాను 22 స్థానాలను గెలుచుకుంది.

అతను 2019 మే 30న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు[46]. జగనన్న అమ్మ ఒడి, నవరత్నాలు వంటి అనేక సంక్షేమ పథకాలతో అతను ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందాడు. జగనన్న అమ్మ ఒడి దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న తల్లులు లేదా సంరక్షకులకు, వారి పిల్లలను చదివించడానికి ఆర్థిక సహాయం అందిస్తుంది[47][48]. నవరత్నాలు అనేది రైతులు, మహిళలు, వైద్యం, ఆరోగ్యం, విద్య, ప్రత్యేక హోదా వంటి తొమ్మిది సంక్షేమ పథకాల సమాహారం[49]. మాజీ తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపాదించిన అమరావతిలో కొత్త రాజధాని ప్రణాళికలను ఆయన రద్దు చేశాడు. కర్నూలు, అమరావతి, విశాఖపట్నంలలో న్యాయ, పరిపాలన, శాసన శాఖల కోసం మూడు వేర్వేరు రాజధానులను ప్రతిపాదించాడు[50]. ఈ ప్రతిపాదనపై అమరావతి రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి[51]. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2022 మార్చి తీర్పులో అమరావతి అభివృద్ధిని కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. "రాజధానిని మార్చడం, విభజించడం లేదా మూడు రాజధానులు చేయడం కోసం ఎటువంటి చట్టాన్ని రూపొందించే సామర్థ్యం ప్రభుత్వానికి లేదని" తీర్పునిచ్చింది.[52]

2023 ఏప్రిల్ నాటికి, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక ప్రకారం, అతను భారతదేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి, మొత్తం ఆస్తులు 510 కోట్లు.[53][54][55]

2022 జూలైలో 8, 9 తేదీల్లో గుంటూరులో జరిగిన వైఎస్‌ఆర్‌సిపి ప్లీనరీ సమావేశాల్లో ఆ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఎన్నికయ్యాడు. ఈ మేరకు తీర్మానం చేసి ఆమోదించారు.[56]

పాలనా సంస్కరణలు

ప్రజలకు పాలనను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు, గ్రామ సచివాలయం వ్యవస్థను ప్రారంభించాడు. ఇది అన్ని ప్రభుత్వ శాఖల సేవలు, సంక్షేమ సేవలను ఒకే చోట అందుబాటులో ఉంచడం ద్వారా పరిపాలనను వికేంద్రీకరించడానికి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడిన స్థానిక ప్రభుత్వం కల్పించిన సౌకర్యం.[57] భారతదేశంలో ఇటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.[58] సేవలను అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వాలంటీర్లను నియమించింది.[59] గ్రామాలు స్వయం సమృద్ధి, స్వయంప్రతిపత్తి గల సంస్థలుగా మారడాన్ని ప్రోత్సహించే మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్య భావన నుండి ఈ పథకం ప్రేరణ పొందింది కనుక ఇది గాంధీ జయంతి [60] నాడు ప్రారంభించబడింది.[61]

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ రాష్ట్రంలో కోవిడ్-19ని ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషించింది. “ఏపీలో ఏ టైర్-1 నగరం లేనందున రాష్ట్ర విభజన తర్వాత మాకు తృతీయ సంరక్షణ సౌకర్యాలు లేవు. లోపం ఉన్నప్పటికీ, కోవిడ్ -19 మహమ్మారిని అరికట్టడంలో రాష్ట్రం సహేతుకమైన పని చేసింది, ” అని జగన్మోహనరెడ్డి నరేంద్రమోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్సులో అన్నారు.[62]

వాలంటీరు వ్యవస్థ

'గ్రామ వాలంటీరు వ్యవస్థ' అనే ప్రభుత్వ ప్రధాన కార్యక్రమం స్వచ్ఛంద సేవకుల ద్వారా ప్రజల ఇంటి వద్దకు ప్రభుత్వ సేవలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజల ఇంటి వద్దకే పాలనా సేవలను అందించడం దీని లక్ష్యం. 72 గంటల్లో ప్రజలకు పాలన అందించేందుకు ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసారు. ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల మధ్య వాలంటీర్లను వారధిగా చేయడం ద్వారా ఈ గ్రామ సచివాలయాలు కూడా 2019 అక్టోబరు 2 నుండి ప్రారంభించారు. ఈ పథకంలో 1 వలంటీర్ ప్రతి గ్రామంలో 50 కుటుంబాలను సంక్షేమ పథకాలను ఇళ్ళకు చేరవేసే బాధ్యతను తీసుకుంటారు. ప్రతి వాలంటీర్‌కు గుర్తింపు కార్డులు ఇవ్వబడతాయి. వారికి నెలకు రూ.5000 భత్యం లభిస్తుంది.[63]

పథకాలు

నవరత్నాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి 2014 ఎన్నికల సమయంలో ప్రజలకు నవరత్నాలుగా పిలువబడే తొమ్మిది పధకాలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తామని హామీ ఇచ్చారు.[64]

  • ఆరోగ్యశ్రీ:ఈ పథకం వార్షిక ఆదాయం రూ. 5,00,000 దాటని అన్ని వర్గాల వారికి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది.వైద్యం ఖర్చు రూ1,000 దాటితే వైద్య ఖర్చు ప్రభుత్వమే ఉచిత వైద్యం చేయిస్తుంది.
  • ఫీజు రీయంబర్స్‌మెంట్:ఈ పథకం పేదవారి విద్యార్థుల చదువుకు అయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వం ఇస్తుంది. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ తో పాటు వసతి, భోజనం కోసం అదనంగా ఏటా రూ. 20 వేలు ప్రతి విద్యార్థికి ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఇస్తుంది.
  • పేదలందరికీ ఇళ్లు:ఈ పథకం ద్వారా ఇళ్ళ స్థలాలు లేని నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు ఐదేళ్లలో 25 లక్షల ఇళ్ళు కట్టిస్తారు.
  • వైయస్‌ఆర్ ఆసరా, వైయస్సార్ చేయూత:ఈ పథకం ద్వారా సున్నా వడ్డీకే రుణాలు ప్రభుత్వం ఇస్తుంది.ఆ వడ్డీ డబ్బును ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుంది.అలాగే వైయస్సార్ చేయూత పథకం ద్వారా 45 సంవత్సరాలు నిండిన ప్రతి బి‌సి, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వైఎస్సార్ చేయూత ద్వారా మొదట ఏడాది తరువాత దశలవారీగా రూ. 75 వేలు ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా ప్రభుత్వం ఇస్తుంది.
  • పించన్ల పెంపు:ఈ పథకం ద్వారా ప్రస్తుతం ఉన్న పింఛన్ల అర్హత వయస్సు 65 నుంచి 60కి తగ్గిస్తారు.అవ్వా తాతల పింఛన్ రూ. 3,000 వరకు పెంచుకుంటూ పింఛన్లు ఇస్తుంది.
  • అమ్మఒడి:ఈ పథకం ద్వారా పిల్లలని బడికి పంపితే ప్రతి తల్లికి సంవత్సరానికి రూ.14,000 ఇస్తుంది.
  • వైయస్‌ఆర్ రైతు బరోసా:ఈ పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం రూ.50 వేలు ఇస్తారు. పంటవేసే సమయానికి మే నెలలో రూ.12,500 చొప్పున ఇస్తారు.పంట బీమా కూడా ప్రభుత్వమే చేలిస్తుంది.
  • వైఎస్సార్ జలయజ్ఞం:ఈ పథకం ద్వారా వై ఎస్ ఆర్ ప్రారంభించిన పోలవరం, పూలసుబ్బయ్య, వెలిగొండ ప్రాజెక్టులను పూర్తి చేస్తారు.
  • మధ్యనిషేధం:ఈ పథకం ద్వారా మూడు దశల్లో మద్యాన్ని నిషేధించి, మద్యాన్ని 5 స్టార్ హోటల్స్‌కి మాత్రమే పరిమితం చేస్తుంది.[65][66]

మన బడి నాడు నేడు

మన బడి నాడు నేడు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం. ఇది పాఠశాల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతోపాటు వివిధ చర్యలను చేపట్టడం ద్వారా అన్ని పాఠశాలల్లో అభ్యసన ఫలితాలను మెరుగుపరచడానికి, డ్రాపౌట్ రేటును తగ్గించడానికి ప్రవేశపెట్టబడింది.[67]

ప్రశంసలు

  • స్థిరమైన అభివృద్ధికి మంచి విద్య, శిక్షణ చాలా ముఖ్యమని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది. గత కొన్నేళ్లుగా ప్రపంచం అపూర్వమైన ఇంటర్‌కనెక్ట్ సంక్షోభాల మధ్య ఉన్నందున, వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ విద్యా వ్యవస్థలను అందించడంలో, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు విజయానికి దోహదం చేయడంలో ఆశాదీపంగా ఉంది.[68]
  • తాను దాదాపు 78 దేశాలు తిరిగానని, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లాంటి వ్యక్తిని తాను ఎక్కడా చూడలేదని నిక్‌ వుజిసిక్‌ అన్నారు. ఉన్నత లక్ష్యం కోసం ముఖ్యమంత్రి ప్రతిష్ఠాత్మకంగా పనిచేస్తున్నారని తెలిపాడు. ఆంధ్రప్రదేశ్‌లోని 45 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సమాన అవకాశాలు కల్పించాలనే గొప్ప లక్ష్యంతో పనిచేస్తున్నాయని, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే గణనీయమైన ప్రగతి సాధించాయని, ఈ విషయం అందరికీ తెలియాలని ఆయన అన్నారు.[69]
  • శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రభుత్వం నిర్మిస్తున్న కిడ్నీ రీసెర్చ్ కేంద్రాన్ని మాజీ సి.బి.ఐ.డైరక్టర్ జె.డి.లక్ష్మీనారాయణ పరిశీలించారు. కిడ్నీ రోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తోందని అభినందించారు.కిడ్నీ వ్యాధి శాశ్వత పరిష్కారానికి గత ప్రభుత్వాలు పని చేయలేదని వ్యాఖ్యానించారు. జగన్ సీఎం అయిన వెంటనే ఈ ఆస్పత్రి నిర్మించటం గొప్ప విషయంగా పేర్కొన్నారు. ఉద్దానంలో ఇంటింటికీ మంచి నీరు అందించేందుకు రూ 700 కోట్లతో ప్రాజెక్టు నిర్మించటం గొప్ప పనిగా మాజీ జేడీ పేర్కొన్నారు. ఇది రాష్ట్రంలోనే పెద్ద ప్రాజెక్టుగా లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు.[70]
  • "‘విద్యా, వైద్య రంగంలో ఏపీ ప్రభుత్వం మార్పులను అభినందిస్తున్నా. విద్యా, వైద్య రంగంలో నాడు-నేడు ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. విద్యార్థుల్లో మంచి విద్యా ప్రమాణాలు పెంచాలని ప్రభుత్వం చూస్తోంది. సీఎం జగన్‌ సంకల్పాన్ని అభినందిస్తున్నా. ఫ్యామిలీ డాక్టర్‌ వ్యవస్థ లేకుంటే పట్టణాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఆరోగ్యశ్రీకి ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్న రాష్ట్రం ఏపీ. ఆరోగ్యశ్రీ ద్వారా వైఎస్సార్‌ దేశానికే ఒక మార్గం చూపారు. ఏపీలో ఫ్రీ డయాగ్నోస్టిక్‌ను బాగా అమలు చేయడం ప్రశంసనీయం’ అని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగభైరవ జయప్రకాశ్ నారాయణ్ అన్నారు.[71]

ఇవికూడా చూడండి

మూలాలు

  1. Sarma, V. Ramu (28 November 2021). "Y S Jaganmohan Reddy's political journey". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 8 December 2022.
  2. "Defiant Jagan begins Odarpu yatra". The Indian Express (in ఇంగ్లీష్). 9 July 2010. Retrieved 8 December 2022.
  3. "Jaganmohan Reddy acquires YSR Congress Party from worker".
  4. Pioneer, The. "Mere 1.68% difference of votes did Jagan's party in". The Pioneer (in ఇంగ్లీష్). Retrieved 8 December 2022.
  5. India TV, Madhu Rao (25 May 2019). "Jagan records highest victory margin in Andhra polls". www.indiatvnews.com (in ఇంగ్లీష్). Retrieved 8 December 2022.
  6. 6.0 6.1 6.2 6.3 "Detailed Profile: Shri Y. S. Jagan Mohan Reddy". india.gov.in. Archived from the original on 2 జూన్ 2017. Retrieved 12 October 2019.
  7. 7.0 7.1 7.2 7.3 7.4 Bandari, Pavan Kumar (21 December 2020). "YS Jagan Mohan Reddy Birthday: Take a look at dynamic leader's journey to garner Chief Minister chair". The Hans India (in ఇంగ్లీష్). Retrieved 10 June 2021.
  8. "Congress made a deal with TRS in return for Telangana: Jagan Reddy's sister". India Today. 2 August 2013. Retrieved 11 July 2023.
  9. Sharma, Swati (24 May 2019). "Jagan Mohan Reddy makes Hyderabad Public School proud". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 17 December 2022.
  10. "Jagan studied in this degree college: Friend & Principal Before TV9 On A1-JMR". ap7am.com (in ఇంగ్లీష్). TV9 & AP7AM. Archived from the original on 17 డిసెంబరు 2022. Retrieved 17 December 2022.
  11. "How Jagan Reddy became the richest Lok Sabha MP in India, and what is his real worth?". India Today (in ఇంగ్లీష్).
  12. "Ghost investors, Luxembourg slush cash built Jagan Mohan Reddy's 'billions', says CBI". India Today (in ఇంగ్లీష్). Living Media India Limited. India Today and CBI. Retrieved 17 December 2022.
  13. 13.0 13.1 Shanker, M. S. (24 May 2019). "YS Jaganmohan Reddy – Andhra's Giant Killer". Outlook. India. Retrieved 28 June 2019.
  14. "తండ్రిని మించిన విజేతగా." ఈనాడు. 2019-06-24. Archived from the original on 2019-05-24. Retrieved 13 June 2019.
  15. PTI (22 August 2010). "Defiant Jagan to go ahead with 'Odarpu' yatra". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 27 March 2021.
  16. "Jagan quits Congress, Kadapa Lok Sabha seat". The Hindu. 29 November 2010. Retrieved 26 March 2021.
  17. "Jaganmohan Reddy to launch new party within 45 days". The Times of India. 7 December 2010. Retrieved 26 March 2021.
  18. "Jagan to Launch YSR Congress Party on March 12". Outlook. 11 March 2011. Retrieved 26 March 2021.
  19. PTI (15 June 2012). "YSR Congress sweeps AP by-polls; wins 15 assembly seats, 1 LS seat". DNA. Retrieved 27 March 2021.
  20. Menon, Amarnath K (13 May 2011). "Kadapa bypoll: Jagan wins by 5,43,053 votes". India Today (in ఇంగ్లీష్). Retrieved 27 March 2021.
  21. "Kadapa bypoll: Jagan Mohan Reddy wins by 5,43,053 votes". The Times of India. 13 May 2011. Retrieved 26 March 2021.
  22. "CBI arrests Jagan Mohan Reddy in disproportionate assets probe". The Economic Times. 27 May 2012. Retrieved 26 March 2021.
  23. "CBI names Y.S. Jaganmohan Reddy as prime accused in assets case". India Today. 7 May 2012. Retrieved 21 May 2013.
  24. Sudhir, Uma (28 May 2012). "Jagan to stay in jail till June 11, a day before key elections". NDTV. Retrieved 27 March 2021.
  25. "DA case: Jagan's custody extended, Sabitha appears in court". The Telegraph. Calcutta, India. 7 June 2013. Archived from the original on 12 June 2013. Retrieved 3 November 2013.
  26. Justice Aftab Alam and Mrs. Justice Ranjana Prakash Desai (4 July 2012). "Y.S.Jagan Mohan Reddy vs C.B.I. Anti-Corruption Branch". Supreme Court of India. Archived from the original on 5 అక్టోబరు 2013. Retrieved 6 ఆగస్టు 2023.
  27. "Jagan Reddy in SC: Can't I get bail if I am wealthy? - Rediff.com News". www.rediff.com. Retrieved 17 December 2022.
  28. Times News Network, Web Archive (5 October 2013). "CBI court dismisses Jagan's bail plea - Times Of India". Archived from the original on 5 October 2013. Retrieved 17 December 2022.
  29. Hon'ble Justice P.Sathasivam, Bench: Hon'ble Justice M.Y. Eqbal & P Sathasivam. "Bail denied to A1 - Y.S.Jagan Mohan Reddy vs C.B.I". IndianKanoon.org. Retrieved 17 December 2022.
  30. Venkatesan, J. (9 August 2012). "SC dismisses Jagan's plea against arrest in DA case". The Hindu. Chennai, India.
  31. "CBI summons BCCI chief in Jagan case". The Times of India. 8 June 2012. Archived from the original on 23 July 2013.
  32. "YSR Cong cries foul over CBI's 'selective probe'". The Times of India (in ఇంగ్లీష్). 14 May 2012. Retrieved 27 March 2021.
  33. "Vijayamma and Bharathi lash out at CBI on Jagan probe". Times AP. Archived from the original on 13 August 2014. Retrieved 4 October 2013.
  34. "Jagan Shifted to OGH". Indistan News. 29 August 2013. Archived from the original on 10 March 2014. Retrieved 3 November 2013.
  35. "Jagan shifted to Osmania Hospital". The Hindu (in Indian English). 29 August 2013.
  36. "Jagan shifted to Osmania Hospital". www.thehansindia.com (in ఇంగ్లీష్). 30 August 2013. Retrieved 17 December 2022.
  37. "Jagan Mohan Reddy's mother Vijayamma continues hunger strike in hospital". NDTV. Indo-Asian News Service. 24 August 2013.
  38. "Telangana: Y S Jaganmohan Reddy blasts Centre, calls for 72 hour bandh". The Economic Times. Press Trust of India. 4 October 2013. Retrieved 4 October 2013.
  39. "Y S Jaganmohan Reddy resigns as MP over AP split; his mother quits Assembly". The Indian Express. 10 August 2013.
  40. 40.0 40.1 "Why Congress and YSRCP lost in Telangana and Andhra Pradesh". 20 May 2014.
  41. Kalavalapalli, Yogendra (20 May 2014). "Why Congress and YSRCP lost in Telangana and Andhra Pradesh". Mint.
  42. Pandey, Ashish (4 November 2017). "YS Jagan all set to embark on his 3000 KM long Padyatara in Andhra Pradesh". India Today. Retrieved 26 March 2021.
  43. "Jagan Mohan Reddy's Praja Sankalpa Yatra completes 199 days, all set to create a record". The New Indian Express. 27 June 2018. Retrieved 26 March 2021.
  44. PTI (28 October 2018). "Jaganmohan Reddy Discharged From Hospital After Knife Attack". NDTV. Retrieved 26 March 2021.
  45. "ఏపీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం.. మోదీ, రాహుల్ గాంధీ శుభాకాంక్షలు". 2019-05-30. Archived from the original on 2019-06-09.
  46. "Jagan-naut: Andhra's bahubali Jaganmohan Reddy takes oath as CM in grand ceremony at Vijayawada". India Today. 30 May 2019. Retrieved 26 March 2021.
  47. Srinivas, Rajulapudi (9 March 2021). "'Jagananna Amma Vodi' gives women a reason to cheer". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 20 June 2021.
  48. "Andhra Pradesh government spends Rs. 25,714 crore on education". Deccan Express. 22 May 2021. Retrieved 20 June 2021.
  49. "Navaratnalu, welfare get the lion's share of YSRCP's maiden budget". The Hindu (in Indian English). 13 July 2019. ISSN 0971-751X. Retrieved 20 June 2021.
  50. Apparasu, Srinivasa Rao (15 December 2020). "Jagan meets Shah, asks to begin process of shifting HC to Kurnool as per 3 capitals plan". Hindustan Times (in ఇంగ్లీష్). Retrieved 21 December 2020.
  51. Sudhir, Uma (13 January 2020). "Won't Celebrate Harvest Festival, Say Amaravati Farmers Amid Protests". NDTV. Retrieved 28 February 2021.
  52. Jonathan, P. Samuel (4 March 2022). "Andhra Pradesh Government can't change capital: High Court". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 7 April 2022.
  53. "Richest Chief Minister in India 2023 List: Who Is the Richest CM? Which CM Has the Lowest Total Assets According to ADR Survey Report? Check All The Names | Association for Democratic Reforms". adrindia.org. Retrieved 16 May 2023.
  54. "Jagan Mohan Reddy wealthiest CM, Mamata Banerjee least well-off: ADR report". The Indian Express (in ఇంగ్లీష్). 13 April 2023. Retrieved 16 May 2023.
  55. "Andhra Pradesh's Jagan is India's wealthiest CM, West Bengal's Mamata least well-off: ADR report". The Times of India. 13 April 2023. ISSN 0971-8257. Retrieved 16 May 2023.
  56. "Cm Jagan: వైకాపా జీవితకాల అధ్యక్షుడిగా వైఎస్‌ జగన్‌ ఎన్నిక". web.archive.org. 2022-07-09. Archived from the original on 2022-07-09. Retrieved 2022-07-09.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  57. "AP is creating history by decentralising the administration set up a village secretariat with all the department available at one place". www.thehansindia.com (in ఇంగ్లీష్). 2019-10-01. Retrieved 2021-10-27.{{cite web}}: CS1 maint: url-status (link)
  58. "Jagan-led government brought ward, village secretariat system which provided jobs to over 1.3 lakh youth: Andhra Minister". ANI News (in ఇంగ్లీష్). 2020-12-31. Retrieved 2021-10-27.{{cite web}}: CS1 maint: url-status (link)
  59. "Village volunteer system in AP from today". @businessline (in ఇంగ్లీష్). 2019-08-15. Retrieved 2021-10-27.{{cite web}}: CS1 maint: url-status (link)
  60. "Jagan launches Village Secretariat system in Andhra Pradesh". The Hindu (in ఇంగ్లీష్). 2019-10-02. ISSN 0971-751X. Retrieved 2021-10-27.
  61. "Gandhian dream of Gram Swaraj turning into reality in Andhra Pradesh | Amaravati News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 2019-09-28. Retrieved 2021-10-27.{{cite web}}: CS1 maint: url-status (link)
  62. "Village secretariat system helped combat Covid: Jagan". The New Indian Express. Retrieved 2023-08-06.
  63. "Village Volunteers".
  64. Maddela, Jagruthi (2019-05-23). "Elaborate Governance: Jagan Mohan's Navaratnalu". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2023-08-06.
  65. "నవరత్నాలు..!". www.sakshieducation.com. Retrieved 2020-02-19.
  66. "నవరత్నాలు | Welcome to East Godavari District Web Portal | India". Retrieved 2020-02-19.
  67. "Manabadi Nadu-Nedu program is a step towards changing the history: Jagan Mohan Reddy". www.thehansindia.com (in ఇంగ్లీష్). 2019-11-14. Retrieved 2021-09-21.{{cite web}}: CS1 maint: url-status (link)
  68. "Recognizing The Efforts Of The Honourable Chief Minister Of Andhra Pradesh - Shri Y. S. Jagan Mohan Reddy, The United Nations Appreciates The Impact Of His Efforts On Sustainable Development Goals".
  69. India, The Hans (2023-02-02). "Vujicic lauds CM YS Jagan Mohan Reddy for his initiatives in edu, agri sectors". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2023-08-06.
  70. "సీఎం జగన్ కు మాజీ జేడీ లక్ష్మీనారాయణ మద్దతు - మంత్రికి ఫోన్ చేసి మరీ..!!".
  71. "Jayaprakash Narayana Praises CM YS Jagan". Vaartha (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-09-05. Archived from the original on 2023-08-06. Retrieved 2023-08-06.

బయటి లింకులు

అంతకు ముందువారు
నారా చంద్రబాబునాయుడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
2019 మే 30 నుండి
Incumbent