టి.ఎల్.వి.ప్రసాద్
తాతినేని లక్ష్మీ వరప్రసాద్ | |
---|---|
జననం | టి.ఎల్.వి.ప్రసాద్ మార్చి 21, 1952 కృష్ణా జిల్లా, విజయవాడ |
ఇతర పేర్లు | వర ప్రసాద్, తాతినేని ప్రసాద్ |
ప్రసిద్ధి | భారతీయ సినిమా దర్శకుడు |
మతం | హిందూ |
తండ్రి | తాతినేని ప్రకాశరావు |
తల్లి | అన్నపూర్ణ |
వెబ్‌సైటు | |
http://www.tlvprasad.net/ |
టి.ఎల్.వి.ప్రసాద్ భారతీయ సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత. ఇతడు సినిమా దర్శకుడు తాతినేని ప్రకాశరావు కుమారుడు. ఇతడు తెలుగు, హిందీ, బెంగాలీ, మరాఠి చిత్రాలకు దర్శకత్వం వహించాడు.
జీవిత విశేషాలు
[మార్చు]ఇతడు 1952, మార్చి 21వ తేదీన తాతినేని ప్రకాశరావు, అన్నపూర్ణ దంపతులకు విజయవాడలో జన్మించాడు. ఇతడు తన సినీజీవితాన్ని 1979లో కుడి ఎడమైతే చిత్రం ద్వారా ప్రారంభించాడు. తెలుగులో 30కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇతడు ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, మోహన్ బాబు వంటి నటులతో పనిచేశాడు. 1992లో మిథున్ చక్రవర్తి హీరోగా "జనతా కీ అదాలత్" అనే సినిమా తీసి బాలీవుడ్‌లో ప్రవేశించాడు. ఆ చిత్రం గొప్ప విజయవంతం కావడంతో మిథున్ చక్రవర్తితో 8 ఏళ్ళ వ్యవధిలో 35 సినిమాలు తీసి రికార్డు సృష్టించాడు. ఇంకా బెంగాలీలో 4, మరాఠీలో 1 చిత్రం ఇతని ఖాతాలో ఉన్నాయి.
తెలుగు సినిమాల జాబితా
[మార్చు]ఇతడు దర్శకత్వం వహించిన తెలుగు సినిమాలు ఈ విధంగా ఉన్నాయి: