Jump to content

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2022-2023)

వికీపీడియా నుండి
(తెలంగాణ బడ్జెట్ (2022) నుండి దారిమార్పు చెందింది)
 () తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2022-2023)
Submitted2022 మార్చి 7
Submitted byతన్నీరు హరీశ్ రావు
(తెలంగాణ ఆర్థిక శాఖామంత్రి)
Submitted toతెలంగాణ శాసనసభ
Presented2022 మార్చి 7
Parliament2వ శాసనసభ
Partyతెలంగాణ రాష్ట్ర సమితి
Finance ministerతన్నీరు హరీశ్ రావు
Tax cutsNone
‹ 2021
2023 ›

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ (2022-2023) అనేది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్.[1] తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా 2022 మార్చి 7న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమ్యాయి. బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాన్ని తనకు కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞత చెబుతూ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి తన్నీరు హరీశ్ రావు మూడవసారి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టాడు.[2][3] ఉద‌యం 11:30 గంట‌ల‌కు బ‌డ్జెట్ ప్ర‌సంగం ప్రారంభం కాగా, మ‌ధ్యాహ్నం 1:21 గంట‌ల‌ వరకు 1 గంట 51 నిముషాలపాటు హ‌రీశ్‌రావు బడ్జెట్ ను చ‌దివి వినిపించాడు.

2022-2023 సంవత్సరానికి తెలంగాణ బడ్జెట్ రూ. 2,56,958.51 కోట్లు కాగా రెవెన్యూ వ్య‌యం రూ. 1.89 ల‌క్ష‌ల కోట్లు, క్యాపిట‌ల్ వ్య‌యం రూ. 29,728 కోట్లుగా అంచనా వేయబడింది. మంత్రి హరీశ్‌రావుకు ఇది మూడో బడ్జెట్‌. రెండోసారి అధికారంలోకి వచ్చాక 2019-20లో బడ్జెట్‌ను సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టగా, ఆ తర్వాత ఆర్థికమంత్రిగా హరీశ్‌రావు 2020-21 నుంచి వార్షిక బడ్జెట్‌ను సభకు సమర్పిస్తున్నాడు.[4]

దస్త్రం:Harish Rao presents Telangana Budget (2022-2023).jpg
2022-2023 సంవత్సరానికి తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ముఖ్యమంత్రి కేసీఆర్తో హరీశ్ రావు

రాష్ట్ర బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడుతున్న సంద‌ర్భంగా జూబ్లీహిల్స్ లోని వెంక‌టేశ్వ‌రస్వామి దేవాల‌యంలో హ‌రీశ్ రావు ప్ర‌త్యేక పూజ‌లు చేశాడు. అనంతరం శాస‌న‌స‌భ వ్య‌వ‌హారాల శాఖామంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డితో కలిసి అసెంబ్లీకు చేరుకున్నాడు. అక్కడ ఇతర మంత్రులతో కలిసి స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి బడ్జెట్ ప్ర‌తుల‌ను అందించాడు. ఆ తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా బడ్జెట్ ప్ర‌తుల‌ను అందించాడు.[4]

ఆదాయం

[మార్చు]

2022-2023 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ వ్యయాల వివరాలు:[5][6]

  • రాష్ట్ర బ‌డ్జెట్ రూ. 2.56 ల‌క్షల కోట్లు
  • రెవెన్యూ వ్యయం రూ. 1.89 ల‌క్షల కోట్లు
  • క్యాపిట‌ల్ వ్యయం రూ. 29,728 కోట్లు
  • పన్నుల ద్వారా ఆదాయం రూ. 1,08,212 కోట్లు
  • కేంద్ర ప‌న్నుల్లో వాటా రూ. 18,394 కోట్లు
  • ప‌న్నేత‌ర ఆదాయం రూ. 25,421 కోట్లు
  • గ్రాంట్లు రూ. 41,001 కోట్లు
  • రుణాలు రూ. 53,970 కోట్లు
  • అమ్మకం ప‌న్ను అంచ‌నా రూ. 33 వేల కోట్లు
  • ఎక్సైజ్ శాఖ ఆదాయం రూ. 17,500 కోట్లు
  • స్టాంపులు, రిజిస్ట్రేష‌న్ల ద్వారా రూ. 15,600 కోట్లు

శాఖలవారిగా కేటాయింపులు

[మార్చు]
  • ఆర్టీసీ బ‌లోపేతానికి రూ. 1500 కోట్లు
  • పోలీసుశాఖ‌కు రూ. 9,315 కోట్లు
  • కాళేశ్వరం స‌ర్క్యూట్‌లో పర్యాటకం అభివృద్ధి కోసం రూ. 1500 కోట్లు
  • రోడ్ల నిర్మాణం, మ‌ర‌మ్మతులు, నిర్వహ‌ణకు రూ. 1542 కోట్లు
  • ప‌రిశ్రమ‌ల‌కు ప్రోత్సాహ‌కాలుగా రూ. 2,142 కోట్లు
  • ప‌రిశ్రమ‌ల‌కు విద్యుత్ రాయితీల కింద రూ. 190 కోట్లు
  • పావ‌లా వ‌డ్డీ ప‌థ‌కానికి రూ. 187 కోట్లు.
  • మ‌హిళా విశ్వవిద్యాల‌యానికి రూ. 100 కోట్లు
  • కొత్త వైద్య కాలేజీల‌కు రూ. 1000 కోట్లు
  • అట‌వీ విశ్వవిద్యాల‌యాల‌కు రూ. 100 కోట్లు
  • మ‌న ఊరు – మ‌న బ‌డి ప‌థ‌కానికి రూ. 3,497 కోట్లు
  • వ్యవ‌సాయ రంగానికి రూ. 24,254 కోట్లు
  • పామాయిల్ సాగుకు రూ. 1000 కోట్లు
  • వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 75 వేల లోపు సాగు రుణాలు మాఫీ
  • రూ. 50 వేల లోపు రైతు రుణాలు మార్చిలోపు మాఫీకి నిర్ణయం
  • పంట రుణాలు మొత్తం రూ. 16,144 కోట్లు మాఫీ, ఈ ద‌ఫాలో 5.12 ల‌క్షల మంది రైతుల‌కు రుణ మాఫీ
  • ఆస‌రా పెన్షన్ల‌కు రూ. 11,728 కోట్లు
  • ద‌ళిత‌ బంధుకు రూ. 17,700 కోట్లు
  • ఎస్టీల సంక్షేమం కోసం రూ. 12,565 కోట్లు
  • బీసీల సంక్షేమం కోసం రూ. 5,698 కోట్లు
  • క‌ల్యాణ‌లక్ష్మి, షాదీ ముబార‌క్ ప‌థ‌కాల‌కు రూ. 2,750 కోట్లు
  • బ్రాహ్మణుల సంక్షేమం కోసం రూ. 177 కోట్లు
  • దూప దీప నైవేద్య ప‌థ‌కానికి రూ. 12.50 కోట్లు
  • సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి రూ. 3 ల‌క్షల ఆర్థిక సాయం
  • నియోజ‌క‌వ‌ర్గానికి 3 వేల ఇళ్లు, ఎమ్మెల్యేల ప‌రిధిలో 3.57 ల‌క్షల ఇళ్లు
  • డ‌బుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి రూ. 12 వేల కోట్లు
  • ప‌ల్లె ప్రగ‌తికి రూ. 3330 కోట్లు
  • ప‌ట్టణ ప్రగ‌తికి రూ. 1394 కోట్లు
  • హ‌రిత‌హారానికి రూ. 932 కోట్లు
  • హైద‌రాబాద్ మెట్రో సిటీ ప‌రిధిలో రోజుకు 20 లీట‌ర్ల ఉచిత నీటి ప‌థ‌కానికి రూ. 300 కోట్లు
  • పాత‌బ‌స్తీలో మెట్రో రైలు కోసం రూ. 500 కోట్లు
  • అర్బన్ మిషన్ భగీరథకు రూ. 800 కోట్లు
  • ఎయిర్‌పోర్టు మెట్రో అనుసంధానానికి రూ. 500 కోట్లు
  • హైద‌రాబాద్ మెట్రో ప్రాజెక్ట్‌కు రూ. 1500 కోట్లు
  • వోఆర్ఆర్ చుట్టు ఉన్న గ్రామాలు, మున్సిపాలిటీల్లో నీటి సరఫరాకు రూ. 1200 కోట్లు.

కేటాయింపుల వివరాలు

[మార్చు]

కేటాయింపుల వివరాలు:[7][8]

  1. ద‌ళితబంధు ప‌థ‌కానికి రూ.17,700 కోట్లు కేటాయించారు. హుజురాబాద్‌ నియోజకవర్గంతోపాటు చింతకాని, తిరుమలగిరి, నిజాంసాగర్‌, చారగొండ మండలాల్లో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ద‌ళితబంధు ప‌థ‌కాన్ని అమలుచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గానికి వందమంది చొప్పున మొత్తం 118 నియోజకవర్గాల్లో 11 వేల 800 కుటుంబాలకు అందిస్తోంది. వచ్చే సంవత్సరాంతానికి రెండు లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని నిర్ణ‌యించింది.
  2. మనఊరు - మనబడి పథకానికి మొదటి దశలో మండలాన్ని యూనిట్‌గా తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా 9,123 పాఠశాలల్లో రూ. 3,497 కోట్లు కేటాయించింది.
  3. రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయ ఏర్పాటుకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 100 కోట్లు కేటాయించింది.
  4. అటవీ విశ్వవిద్యాలయ ఏర్పాటుకు రూ. 100 కోట్లు కేటాయించింది.
  5. నూతన మెడికల్‌ కాలేజీల స్థాపనకు రూ. 1000 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రాబోయే రెండేళ్ళలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఏర్పాటుచేయాలన్న లక్ష్యంతో ఈ సంవత్సరం ఆసిఫాబాద్‌, భూపాలపల్లి, వికారాబాద్‌, సిరిసిల్ల, జనగామ, కామారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం జిల్లాలలో కొత్తగా ఎనిమిది వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్న‌ది. 2023లో రాష్ట్రంలోని మిగతా ఎనిమిది జిల్లాలైన మెదక్‌, మేడ్చల్‌, రంగారెడ్డి, ములుగు, వరంగల్‌, నారాయణపేట, గద్వాల, యాదాద్రి జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేయ‌నుంది.
  6. ప్రభుత్వ హాస్పిటళ్ళలో రోగులకు పోషకాహారాన్ని అందించడానికి ప్రతి ఏటా రూ. 43.5 కోట్లు కేటాయింయింది. ఇందులకోసం టీబీ క్యాన్సర్‌ తదితర రోగులకు బలవర్ధకమైన ఆహారం అందించడం కోసం బెడ్‌ ఒక్కంటికి ఇచ్చే డైట్ ఛార్జీలను రూ. 56 నుంచి 112 కు పెంచాలని, సాధారణ రోగులకు ఇచ్చే డైట్ ఛార్జీలు బెడ్ ఒక్కంటికి రూ. 40 నుంచి 80కి పెంచాలని ఈ బడ్జెట్ లో ప్రభుత్వం నిర్ణయించింది.
  7. హైదరాబాద్‌లోని 18 మేజర్‌ ప్రభుత్వ హాస్పటళ్ళలో రోగి సహాయకులకు ఇచ్చే సబ్సిడీపై భోజన సదుపాయానికి కోసం సంవత్సరానికి రూ. 38.66 కోట్లు కేటాయించింది. దీనిద్వారా ప్రతిరోజు సుమారు 18,600 మందికి ఈ ప్రయోజనం కలుగుతుంది.
  8. పారిశుధ్య కార్మికులకు, ఇతర సిబ్బందికి వేతనాలు పెంచాడనికి సంవత్సరానికి రూ.338 కోట్లు కేటాయించింది. బెడ్ ఒక్కంటికి చేసే పారిశుద్ధ్య ఖర్చును రూ. 5000 నుంచి రూ. 7500కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
  9. రాష్ట్రవ్యాప్తంగా 61 మార్చురీల ఆధునీకరణకు రూ. 32.50 కోట్లు కేటాయించింది.
  10. పామాయిల్ సాగుకు రూ. 1000 కోట్ల‌ను కేటాయించింది. దీనిద్వారా 2.5 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేయనుంది.
  11. వ్యవసాయ రంగానికి మొత్తంగా రూ. 24,254 కేటాయించింది. గ‌తంలో ఇచ్చిన హామీ మేర‌కు ఈ ఏడాది రూ. 75 వేలలోపు రుణాల‌ను మాఫీ చేయనుంది.
  12. ఆసరా ఫించన్ల కోసం రూ. 11,728 కోట్లు కేటాయించింది.
  13. డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం రూ. 12000 కోట్లను కేటాయించింది. సొంత జాగ కలిగిన వారు తమ స్థలంలో డబుల్‌ బెడ్రూం ఇల్లు కట్టుకోవడం కోసం 3 లక్షల రూపాయల చొప్పున నియోజకవర్గానికి మూడువేల ఇళ్ళు అందించనున్నారు.
  14. ఎస్టీ నివాస ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం కోసం ఎస్‌టీఎస్‌డీఎఫ్‌ నిధుల నుంచి రూ. 1000 కోట్ల‌ను ప్రభుత్వం కేటాయించింది.
  15. గొల్ల కురుమల సంక్షేమం కోసం రూ. 1000 కోట్లు కేటాయించింది. రూ. 11,000 కోట్ల వ్యయంతో 7.3 లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది.
  16. చేనేత బీమా (ఐదు లక్షల రూపాయల) పథకాన్ని అమలుచేయనుంది.
  17. గీత కార్మికుల సంక్షేమం కోసం రూ. 100 కోట్లతో ప్రత్యేక పథకం ప్రవేశపెట్టనుంది.
  18. బాలింతలలో రక్తహీనత లోపాన్ని నివారించేందుకు ‘కేసీఆర్‌ నూట్రీషియన్ కిట్‌’ అనే పేరుతో పోషకాహారంతో కూడిన కిట్‌లను పంపిణీ చేయనుంది.
  19. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, జూనియర్‌ కాలేజీల్లో 7 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినులకు ఉచితంగా హెల్త్ అండ్ హైజనిక్ కిట్స్ ను ప్రభుత్వం పంపిణీ చేయనుంది.
  20. హైద‌రాబాద్ చుట్టూ, ఔట‌ర్ రింగ్ రోడ్డు చుట్టు ఉన్న గ్రామాలు, మున్సిపాలిటీల్లో నీటి కొర‌త‌ను శాశ్వ‌తంగా తీర్చేందుకు రూ. 1200 కోట్లు కేటాయించింది.
  21. దూపదీప నైవేద్య ప‌థ‌కానికి రూ. 12.50 కోట్లు కేటాయించింది. ఇందులో ఈ ఏడాది హైద‌రాబాద్‌లోని 1736 దేవాల‌యాల‌ను కొత్త‌గా చేర్చనున్నారు.
  22. రోడ్ల నిర్మాణం, మ‌ర‌మ్మ‌తులు, నిర్వ‌హ‌ణ కోసం రూ. 1542 కోట్లు కేటాయించింది.
  23. మెట్రో రైలును పాత‌బ‌స్తీలో 5.5 కిలోమీట‌ర్ల‌కు అనుసంధానించేందుకు రూ. 500 కోట్లు కేటాయించింది.
  24. భ‌వ‌ననిర్మాణ కార్మికుల సంక్షేమానికి కొత్త ప‌థ‌కం ప్ర‌వేశ‌పెట్టి, మొద‌టి విడుత‌లో ల‌క్షమంది కార్మికుల‌కు మోటార్ సైకిళ్ళను ఇవ్వనుంది.
  25. రైతుబందు ప‌థ‌కం త‌ర‌హాలో నేత కార్మికుల కోసం ప్ర‌త్యేక ప‌థ‌కాన్ని ప్రారంభించనుంది.
  26. గిరిజ‌న‌, ఆదివాసీ గ్రామ పంచాయ‌తీల‌కు సొంత భ‌వ‌నాల నిర్మాణాన్ని ఈ ఏడాదికి రూ. 600 కోట్లు కేటాయించింది.
  27. కాళేశ్వరం పర్యాటకం సర్య్యూట్ కు రూ. 750 కోట్లు కేటాయించింది.
  28. అర్బన్ మిషన్ భగీరథకు రూ. 800 కోట్లు కేటాయించింది.
  29. ఏయిర్‌పోర్టు మెట్రో కనెక్టవిటీకి రూ. 500 కోట్లు కేటాయించింది. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు మరో రూ. 1500 కోట్లు కేటాయించింది.
  30. పరిశ్రమలకు ప్రోత్సాహకాలుగా రూ. 2,142 కోట్లు, పరిశ్రమలకు విద్యుత్ రాయితీ కింద రూ. 190 కోట్లు కేటాయించింది.
  31. పావలా వడ్డీ స్కీమ్‌ను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు వ‌ర్తింప‌జేయ‌డానికి, మహిళలు చిన్నతరహా పరిశ్రమలను ఏర్పాటు చేసేలా ప్రోత్సహించడానికి రూ. 187 కోట్లు కేటాయించింది.
  32. హైదరాబాద్ మెట్రో పరిధిలో రోజుకు 20 లీటర్ల ఉచిత నీరు అందించేందుకు రూ. 300 కోట్లు కేటాయించింది.
  33. ఆర్టీసీని బలోపేతం చేసేందుకు రూ. 1500 కోట్లు కేటాయించింది.
  34. హైద‌రాబాద్‌లో ఏర్పాటుచేయనున్న 350 బ‌స్తీ ద‌వాఖానాల్లో 256 బ‌స్తీ ద‌వాఖాన‌లు ఏర్పాటయ్యాయి. వీటిలో వైద్య సేవ‌ల‌తోపాటు 57 ర‌కాల ప‌రీక్ష‌లు చేస్తున్నారు, ఉచితంగా మెడిసిన్ అందిస్తున్నారు. రాష్ట్ర‌వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పోరేష‌న్ల‌లో మ‌రో 60 బ‌స్తీ ద‌వాఖాన‌ల‌ను ప్రారంభించ‌నున్నారు.
  35. న్యాయవాదుల సంక్షేమానికి రూ. 100 కోట్లు కేటాయించి, నిధుల నిర్వహణ బ్యాధతను అడ్వకేట్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌కు అప్పగించింది. వెల్ఫేర్‌ ట్రస్ట్‌ ద్వారా 22వేల మంది న్యాయవాదులకు ఇన్సూరెన్స్‌ పాలసీలు అందించబడ్డాయి.
  36. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం రూ.100 కోట్ల నిధిని ఏర్పాటు చేసి, ఇప్పటివరకు రూ. 52 కోట్లు తెలంగాణ ప్రెస్‌ అకాడమీకి కేటాయించింది. జర్నలిస్ట్‌ మరణిస్తే ప్రెస్‌ అకాడమీ ద్వారా రూ. లక్ష, శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే రూ. 50 వేల ఆర్థిక సాయం అందిస్తున్నది.
  37. నీరా ఉత్ప‌త్తి, సేక‌ర‌ణ కోసం రూ. 20 కోట్లు కేటాయించింది.
  38. పల్లె ప్రగతికి రూ. 3,330 కోట్లు, పట్టణ ప్రగతికి రూ. 1394 కోట్లు (మొత్తంగా రూ. 4724 కోట్లు) కేటాయించింది.
  39. తెలంగాణ హ‌రిత‌హారానికి రూ. 932 కోట్లు కేటాయించింది.

బడ్జెట్ ఆమోదం

[మార్చు]

2022 మార్చి 6న ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై శాఖలవారీగా బడ్జెట్‌ ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఏకగ్రీంగా ఆమోదించింది.[4]

మూలాలు

[మార్చు]
  1. "Telangana Finance Portal". finance.telangana.gov.in. Archived from the original on 2021-05-16. Retrieved 2022-06-15.
  2. telugu, NT News (2022-03-07). "Telangana Budget: రాష్ట్ర బ‌డ్జెట్ హైలెట్స్‌.. ఏ రంగానికి ఎంత కేటాయించారంటే." Namasthe Telangana. Archived from the original on 2022-03-07. Retrieved 2022-03-07.
  3. Velugu, V6 (2022-03-08). "తెలంగాణ బడ్జెట్ 2022-23 లైవ్ అప్‎డేట్స్". V6 Velugu (in ఇంగ్లీష్). Archived from the original on 2022-03-07. Retrieved 2022-03-07.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  4. 4.0 4.1 4.2 telugu, NT News (2022-03-07). "తెలంగాణ బ‌డ్జెట్ 2022-23.. Live Updates". Namasthe Telangana. Archived from the original on 2022-03-07. Retrieved 2022-03-07.
  5. "Telangana Budget 2022-23: రాష్ట్ర బడ్జెట్‌ హైలైట్స్." NTV. 2022-03-07. Archived from the original on 2022-03-07. Retrieved 2022-03-07. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  6. "రూ.2.56 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌". andhrajyothy. 2022-03-07. Archived from the original on 2022-03-07. Retrieved 2022-03-07.
  7. "TS Budget 2022: తెలంగాణ బడ్జెట్ రూ.2.56 లక్షల కోట్లు-హైలైట్స్ ఇవే." Zee News Telugu. 2022-03-07. Archived from the original on 2022-03-07. Retrieved 2022-03-07.
  8. "Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌ 2022-23 ముఖ్యాంశాలివే". EENADU. 2022-03-07. Archived from the original on 2022-03-07. Retrieved 2022-03-07.

బయటి లింకులు

[మార్చు]