దేవేంద్ర ఫడ్నవిస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దేవేంద్ర గంగాధర్ ఫడ్నవిస్
దేవేంద్ర ఫడ్నవిస్


Assembly Member
for డిప్యూటీముఖ్యమంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
30 జూన్ 2022

Assembly Member
మహారాష్ట్ర
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2014 - ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జననం (1970-07-22) 1970 జూలై 22 (వయసు 54)
నాగ్‌పూర్
జాతీయత  India
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి అమృత ఫడ్నవిస్
సంతానం దివిజ ఫడ్నవిస్ (కుమార్తె)
మతం హిందూ

దేవేంద్ర ఫడ్నవిస్ మహారాష్ట్రకు చెందిన రాజకీయనాయకుడు. 1970లో నాగపూర్‌లో జన్మించాడు. ఫడ్నవిస్ అంచెలంచెలుగా ఎదుగుతూ 2014 మహారాష్ట్ర ఎన్నికలలో విజయం సాధించాడు. భారతీయ జనతా పార్టీ తరుపున ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా దేవేంద్ర ఫడ్నవిసును ప్రకటించారు. [1][2] కానీ ముఖ్యమంత్రిగా 2014 అక్టోబరు 31న బాధ్యతలు చేపట్టారు. అతను ఆ పదవిలో 2019, నవంబరు 12 వరకు, రెండవ సారి 2019 నవంబరు 23 నుండి 2029 నవంబరు 28 వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు

రాజకీయ నేపథ్యం

[మార్చు]

విద్యార్థి దశలో ఉన్నప్పుడే ఫడ్నవిస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో, భారతీయ జనతాపార్టీ విద్యార్థి విభాగమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో చురుకుగా పాల్గొన్నారు. 21 ఏళ్ల వయస్సులోనే నాగపూర్ నగరపాలక సంస్థ కార్పోరేటరుగా ఎన్నికై, 1997లో నాగపూర్ మేయర్ పదవి చేపట్టారు. దేశంలో చిన్న వయస్సులోనే మేయర్ అయిన వాళ్లలో ఫడ్నవిస్ ఒకరు.[3] ఆ తర్వాత 3 సార్లు శాసనసభకు ఎన్నిక కావడమే కాకుండా మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవిని కూడా నిర్వహించారు. 2014 అక్టోబరు 31న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి పొంది మహారాష్ట్ర తొలి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిగ అవతరించారు.

పురస్కారాలు

[మార్చు]
  • కామన్వెల్త్ పార్లమెంటు అసోసియేషన్ ద్వారా 2002-03 సంవత్సరానికి గానూ ఉత్తమ పార్లమెంటు సభ్యుని పురస్కారం.
  • జాతీయ అంతర్ విశ్వవిద్యాలయ పోటీలలో ఉత్తమ ఉపన్యాసకుడిగా పురస్కారం.
  • రోటరీ క్లబ్ మోస్ట్ ఛాలెంజింగ్ యూత్ ప్రాంతీయ పురస్కారం.
  • ముక్త్‌చంద్, పూనా, ద్వారా ప్రధానం చేయబడిన ప్రమోద్ మహాజన్ ఉత్తమ పార్లమెంటు సభ్యుని పురస్కారము.
  • నాసిక్ లోని పృణవద్ పరివార్ ద్వారా ప్రధానం చేయబడిన రాజ్‌యోగి నేతా పురస్కారం.
  • హిందూ న్యాయచట్టం లోని ప్రావీణ్యతకు గానూ ప్రధానం చేయబడిన బోస్ బహుమతి.

మూలాలు

[మార్చు]

బయటి లంకెలు

[మార్చు]