పంజాబ్ జనతా పార్టీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పంజాబ్ జనతా పార్టీ అనేది భారతీయ రాజకీయ పార్టీ. 1967 నవంబరు 22న[1] లచ్మన్ సింగ్ గిల్ ఈ పార్టీని స్థాపించాడు.

గుర్నామ్ సింగ్ ప్రభుత్వంలో లచ్మన్ సింగ్ క్యాబినెట్ మంత్రిగా ఉన్నాడు. 1967 పంజాబ్ శాసనసభ ఎన్నికల తర్వాత గుర్నామ్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రి అయ్యాడు.[2] లచ్మన్ సింగ్ గిల్, గుర్నామ్ సింగ్‌తో విభేదాల కారణంగా, మరో 16 మంది సభ్యులతో[3] ఫిరాయించి పంజాబ్ జనతా పార్టీని స్థాపించారు.

అతను 1967 నవంబరు 25న భారత జాతీయ కాంగ్రెస్ మద్దతుతో మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు.[4] అయితే ఈ ప్రభుత్వం కేవలం 9 నెలలు మాత్రమే కొనసాగింది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్. నిజలింగప్ప 1968 ఆగస్టు 21న ప్రభుత్వం నుండి మద్దతు ఉపసంహరించుకోవాలని తన నిర్ణయాన్ని ప్రకటించాడు.[5] అదే రోజు, లచ్‌మన్ సింగ్ గిల్ తన పదవికి రాజీనామా చేసి 1968, ఆగస్టు 23న రాష్ట్రపతి పాలన విధించారు.

1969 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగలిగింది.

ముఖ్యమంత్రి

[మార్చు]
క్రమసంఖ్య పేరు చిత్తరువు పదవీకాలం[6]
(అసెంబ్లీ ఎన్నికలు)
పార్టీ
(కూటమి)
నియమించింది

(గవర్నర్)

7 లచ్మన్ సింగ్ గిల్
(ధరమ్‌కోట్)
1967 నవంబరు 25 1968 ఆగస్టు 23 272 రోజులు పంజాబ్ జనతా పార్టీ
(కాంగ్రెస్)
డిసి పావటే

మూలాలు

[మార్చు]