భారతీయ క్రాంతి దళ్
Appearance
భారతీయ క్రాంతి దళ్ | |
---|---|
స్థాపకులు | చరణ్ సింగ్ |
స్థాపన తేదీ | 1967 అక్టోబరు |
రంగు(లు) | ఆకుపచ్చ |
Election symbol | |
భారతీయ క్రాంతి దళ్ అనేది ఒక రాజకీయ పార్టీ. దీనిని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి చరణ్ సింగ్ స్థాపించాడు. 1967 అక్టోబరులో లక్నోలో జరిగిన సమావేశంలో పార్టీ స్థాపించబడింది.[1] 1977 సాధారణ ఎన్నికల తరువాత, భారతీయ క్రాంతి దళ్ వారసుడు, భారతీయ లోక్ దళ్ జనతా పార్టీలో విలీనం చేయబడింది.[2]
హుమాయున్ కబీర్ ఢిల్లీలో కాంగ్రెసేతర ముఖ్యమంత్రులు, ఇతర ముఖ్య నేతలందరితో సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో 1967 ఏప్రిల్ 9న భారతీయ క్రాంతి దళ్ ఏర్పాటుకు బీజాలు పడ్డాయి.[3] 1967 నవంబరులో భారతీయ క్రాంతి దళ్ ఇండోర్ సమావేశంలో, మహామాయ ప్రసాద్ సిన్హా పార్టీ మొదటి ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు.[3]
కూటమి
[మార్చు]1967లో ఈ పార్టీ సంయుక్త సోషలిస్ట్ పార్టీ, ప్రజా సోషలిస్ట్ పార్టీ, జనసంఘ్‌లతో కలిసి సంయుక్త విధాయక్ దళ్ కూటమిని ఏర్పాటుచేసింది.
మూలాలు
[మార్చు]- ↑ Wallace, Paul. India: The Dispersion of Political Power Paul Wallace, in Asian Survey, Vol. 8, No. 2, A Survey of Asia in 1967: Part II. (Feb., 1968), pp. 87-96.
- ↑ E.M.S. Namboodiripad. The Communist Party in Kerala — Six Decades of Struggle and Advance. New Delhi: National Book Centre, 1994. p. 265-266
- ↑ 3.0 3.1 Brass, Paul R. (2014). An Indian Political Life: Charan Singh and Congress Politics, 1967 to 1987 - Vol.3 (The Politics of Northern India) (in ఇంగ్లీష్). Sage India. ISBN 978-9351500322.